తబ్లిగీ నేతపై ఈడీ కేసు | ED files case against Tablighi Jamaat leader Maulana Saad Kandhalvi | Sakshi
Sakshi News home page

తబ్లిగీ నేతపై ఈడీ కేసు

Published Fri, Apr 17 2020 2:47 AM | Last Updated on Fri, Apr 17 2020 2:47 AM

ED files case against Tablighi Jamaat leader Maulana Saad Kandhalvi  - Sakshi

న్యూఢిల్లీ: తబ్లిగీ జమాత్‌ నేత మౌలానా సాద్‌ కంధాల్వీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ మేరకు కంధాల్వీతోపాటు అతనితో సంబంధమున్న ట్రస్టులు, మరికొందరు వ్యక్తులపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు (ఈసీఐఆర్‌) నమోదు చేసినట్లు గురువారం అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా తబ్లిగీ జమాత్, ఆ సంస్థ ఆఫీస్‌ బేరర్లు నిర్వహించిన లావాదేవీలు, వారి ఆర్థిక వ్యవహారాలపై బ్యాంకులు, నిఘా విభాగాలు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కంధాల్వీకి సమన్లు జారీ చేసి, విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సాద్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement