న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో ఢిల్లీలోని ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేశారు. అందులో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో కార్యాలయాన్ని రెండు రోజులపాటు సీజ్ చేశారు. పాజిటివ్ వచ్చిన వారితో సంబంధం ఉన్న మరో పది మందిని కూడా క్వారంటైన్ చేశారు. శానిటైజేషన్ చేయడానికి ఈడీ కార్యాలయాన్ని రెండు రోజులపాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
అయితే కరోనా నేపథ్యంలో ఇప్పటిదాకా వారానికి రెండుసార్లు ఈడీ కార్యాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటివరకు 26,334 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. దేశంలో గడిచిన 24 గంటల్లో 9,887 కొత్త కేసులు నమోదవ్వగా.. 294 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,36,657గా ఉండగా.. మరణాల సంఖ్య 6,642కు పెరిగింది. చదవండి: 40 వేలు దాటిన కరోనా మరణాలు
Comments
Please login to add a commentAdd a comment