ముంబై: క్రిప్టో కరెన్సీల వేల్యుయేషన్‌పై స్పష్టత లేకపోవడం, మనీలాండరింగ్ అవకాశాలు ఉండటం వంటి అంశాలే వీటికి సంబంధించి సెంట్రల్ బ్యాంకుల్లో నెలకొన్న ప్రాథమిక అందోళనలని ఆర్‌బీఐ మాజీ డిప్యుటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రభుత్వం గానీ వీటిని అనుమతిస్తే బ్యాంకర్లు ఆచి తూచి వ్యవహరించాలని ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన సూచించారు.
విశ్వనాథన్ సూచనలు
క్రిప్టో ఆస్తులను బట్టి వ్యక్తుల సంపదను లెక్కగట్టొద్దని పేర్కొన్నారు. క్రిప్టో అసెట్స్‌ను తనఖా పెట్టకపోయినా.. వాటి విలువ ఆధారంగా రుణాలు ఇవ్వరాదని తెలిపారు. క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన బిల్లును నవంబర్ 29న ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్న నేపథ్యంలో విశ్వనాథన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే క్రిప్టో కరెన్సీల విషయంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఆందోళన చెందుతుంటే.. ప్రభుత్వాలు మాత్రం వీటివైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయో తెలియడం లేదని విశ్వనాథన్ వ్యాఖ్యానించారు.
చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..!
Comments
Please login to add a commentAdd a comment