RBI governer
-
బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు
పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు పటిష్ట, క్రియాశీలక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) కోరారు. అలాగే నష్టాలను తగ్గించడానికి థర్డ్–పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై పర్యవేక్షణను మెరుగుపరచాలని సూచించారు.ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం.రాజేశ్వర్ రావు, టి.రబి శంకర్, జె.స్వామినాథన్‌తో కలిసి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓలతో ఆయన సమావేశమయ్యారు. డిజిటల్ మోసాల పెరుగుదలపై మల్హోత్రా ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.డిసెంబరులో శక్తికాంత దాస్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా బ్యాంకులతో నిర్వహించిన మొదటి సమావేశం ఇది. ఆర్బీఐ తన పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ఉన్నతాధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తుంటుంది.సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ 26వ గవర్నర్‌గా గత డిసెంబర్ 11న బాధ్యతలు చేపట్టారు. గత గవర్నర్ శక్తికాంతదాస్ పదవీకాలం ముగియడం ఆయన స్థానంలోకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మూడేళ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. -
కొత్త సార్ ముందున్న సవాళ్లు!
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చాలా ఏళ్లుగా కీలకపాత్ర పోషిస్తోంది. ఏ దేశ సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌కైనా ఆర్థిక సవాళ్లు తప్పవు. ఇటీవల ఆర్బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధికమవుతున్న ఆహార ద్రవ్యోల్బణం, తగ్గుతున్న పారిశ్రామిక ఉత్పత్తి..వంటి చాలా సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. సంజయ్ మల్హోత్రా ముందున్న కొన్ని సవాళ్లను నిపుణులు విశ్లేష్తిస్తున్నారు.ద్రవ్యోల్బణంవార్షిక ద్రవ్యోల్బణం ఈ ఏడాది అక్టోబరులో గరిష్టంగా 6.21శాతానికి చేరింది. సెప్టెంబరులో ఇది 5.49శాతంగా నమోదైంది. మార్కెట్ అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం 2-4 ఉండాలి. కానీ దాన్ని మించిపోతుంది.ఆహార ద్రవ్యోల్బణంఈ ఏడాది సెప్టెంబరులో 9.2 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం అక్టోబరులో 10.8 శాతానికి ఎగబాకింది. కూరగాయలు, వంట నూనెలు, ఉల్లి, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా చాలాచోట్ల విభిన్న వాతావరణ మార్పుల వల్ల ఆశించినమేర వ్యవసాయ దిగుబడి రావడంలేదు. దాంతో ఆహార పదార్థాల సప్లై-చెయిన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. దానికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు ఎత్తివేసింది. దాంతో దళారులు కృత్రిమకొరతను సృష్టించి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నారు. వర్షాభావం కారణంగా మహారాష్ట్ర వంటి అధికంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో పంటసాగు వెనకబడుతుంది. వంట నూనెలకు సంబంధించి ముడిఆయిల్ దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల సుంకాన్ని పెంచింది. దాంతో నూనె ధరలు అమాంతం పెరిగాయి.పెట్టుబడులు ఆకర్షించేలా..ఇటీవల కాలంలో మార్కెట్లు భారీగా పడిపోయాయి. క్రమంగా రెండు నెలల కాలంలో దాదాపు లక్ష కోట్ల రూపాయాలకు పైగా ఎఫ్‌పీఐలు పెట్టుబడులు ఉపసంహరించారు. ఈరోజు (డిసెంబర్ 17) మధ్యాహ్నం 2 గంటల వరకు మార్కెట్ల నుంచి దాదాపు రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇలా మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఎఫ్‌పీఐలు గణనీయంగానే తమ పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. వారికి మరింత ధీమా కలిగేలా ఆర్బీఐ వ్యవహరించాల్సి ఉంటుంది. అగ్రరాజ్య విధానాల ప్రభావం ఈ పెట్టుబడులపై అధికంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.డిజిటల్ మోసాలుపెరుగుతున్న సాంకేతికతకు తోడుగా ఆర్థిక వ్యవస్థను పటిష్ట భద్రత కల్పించాలి. లేదంటే సైబర్ఫ్రాడ్ల రూపంలో ఆర్థిక మోసాలు అధికమవుతాయి. ప్రస్తుతం కాలంలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వినియోగదారుల సమాచారానికి భంగం వాటిల్లకుండా, లావాదేవీలు సజావుగా సాగేలా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి.ఇదీ చదవండి: ఇంటి ధర రూ.85! రెనొవేషన్కు రూ.3.8 కోట్లు!!డిపాజిట్లు.. ఎన్పీఏలుబ్యాంకింగ్ వ్యవస్థపై వినియోగదారులకు నమ్మకం సన్నగిల్లకుండా చూడాల్సిన బాధ్యత ఆర్బీఐపై ఉంది. సేవింగ్స్ ఖాతాతో పోలిస్తే బ్యాంకింగేతర రంగంలో డిపాజిట్లపై మరింత రాబడి వచ్చే ప్రత్నామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. దాంతో చాలా మంది కస్టమర్లు డిపాజిట్లపై మొగ్గు చూపడంలేదు. దాంతో బ్యాంకులు క్రిడిట్ ఇవ్వాలంటే ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఇచ్చిన అప్పులు వసూలుకాక నిరర్థక ఆస్తులు పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేసేలా ఆర్బీఐ మరింత సమర్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. -
సారొచ్చారు.. ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు
బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 26వ గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు గవర్నర్‌గా పనిచేసిన శక్తికాంతదాస్ మంగళవారం పదవీ విరమణ చేశారు. సంజయ్ మల్హోత్రా పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు.‘ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, విశ్వాసం, వృద్ధి మూడు మూల స్థంభాల్లాంటివి. వీటిని కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. అందుకు భారత సెంట్రల్ బ్యాంక్ నిరంతరం కృషి చేస్తోంది. కొన్నేళ్లుగా ఆర్బీఐ పనితీరు, అనుసరిస్తున్న విధానాలు ప్రశంసణీయం. ఇందుకోసం చాలామంది సిబ్బంది శ్రద్ధతో పని చేశారు. వారు కాపాడుతూ వచ్చిన ఆర్బీఐ ప్రతిష్టను నేను మరింత ముందుకు తీసుకెళ్తాను. 2047 వరకు ప్రభుత్వం ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. దాన్ని సాధించేందుకు సమర్థమంత నిర్ణయాలు అవసరం. ఈ సంస్థ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తుంది’ అని సంజయ్ మల్హోత్రా చెప్పారు.అపార అనుభవం..56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.ఇదీ చదవండి: కంటెంట్ ఖండాలు దాటేలా యూట్యూబ్ కొత్త ఫీచర్నిన్నటి వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషించారు. -
ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 26వ గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను ప్రభుత్వం నియమించింది. ఆయన పేరును కేబినెట్ నియామకాల కమిటీ ఖరారు చేసింది. బుధవారం మల్హోత్రా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీ కాలం మూడేళ్లు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంతదాస్ మంగళవారం పదవీ విరమణ చేస్తారు.అపార అనుభవం... 56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషిస్తున్నారు.సమన్వయానికి మారుపేరు... ఉర్జిత్ పటేల్ ఆకస్మిక ని్రష్కమణ తర్వాత 2018 డిసెంబర్ 12న దాస్ ఆర్బీఐ 25వ గవర్నర్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లు కేంద్రం పొడిగించింది. ఈ పొడిగించిన పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. సెంట్రల్ బ్యాంక్ వద్ద మిగులు నిధుల బదిలీ సమస్యపై ఆర్బీఐ– ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ నేపథ్యంలోనే పటేల్ ఆకస్మిక రాజీనామా చోటుచేసుకుందన్న వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. ఉర్జిత్ రాజీనామా నేపథ్యంలో అనిశి్చతిని ఎదుర్కొన్న మార్కెట్‌కు తిరిగి విశ్వాసాన్ని అందించిన వ్యక్తిగా శక్తికాంతదాస్ నిలిచారు. పలు క్లిష్ట సందర్భాల్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య చక్కటి సమన్వయం సాధించడంలో ఆయన విజయం సాధించారు. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పనిచేశారు. -
ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఛాతీ నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇది అత్యవసర పరిస్థితి కాదని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఈరోజు ఉదయం దాస్‌కు ఛాతీ నొప్పి రావడంతో పరిస్థితి విషమించి ఆసుప్రతిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వైద్యులు తన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి.‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అసిడిటీ ద్వారా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం దాస్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. మరో 2-3 గంటల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అని ఆర్బీఐ ప్రతినిధి తెలిపారు.The Reserve Bank Governor, Shaktikanta Das IAS, has been admitted to #Chennai Apollo Hospital due to chest pain. He is currently under the close supervision of medical professionals: sources #RBI pic.twitter.com/P0Z26uq8Dl— Mahalingam Ponnusamy (@mahajournalist) November 26, 2024ఇదీ చదవండి: అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 25వ గవర్నర్‌గా 2018లో నియమితులయ్యారు. ఆయన అంతకుముందు పదిహేనో ఆర్థిక సంఘం సభ్యుడిగా పని చేశారు. దాస్ తమిళనాడు కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన కేంద్ర ప్రభుత్వ, తమిళనాడు ప్రభుత్వాలకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పని చేశారు. రెవెన్యూ కార్యదర్శిగా, ఫెర్టిలైజర్స్ సెక్రటరీగా వివిధ కేంద్ర ప్రభుత్వ హోదాల్లో పనిచేశారు. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఎన్డీబీ, ఏఐఐబీలలో ప్రత్యామ్నాయ గవర్నర్‌గా కూడా పనిచేశారు. భారత్ తరఫున ఐఎంఎప్, జీ20, బ్రిక్స్, సార్క్ మొదలైన అనేక అంతర్జాతీయ ఫోరమ్‌ల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించారు. -
ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనా
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగనుందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేసింది. సెప్టెంబర్‌లో నమోదైన 5.5 శాతం ద్రవ్యోల్బణం కంటే అక్టోబర్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.‘అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల్లో అస్థిరత నెలకొంది. కానీ భారత ఎకానమీని స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ సమర్థంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రధానంగా రెండు అంశాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి యూఎస్ ఎన్నికల ఫలితాలు. మరొకటి ఆర్థిక విధాన మద్దతుకు సంబంధించి చైనా నుంచి ప్రకటనలు వెలువడడం. ఆర్థిక వృద్ధికి ప్రతికూల అంశాల కంటే సానుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు ఆర్బీఐ 70కి పైగా హైస్పీడ్ ఇండికేటర్లను ట్రాక్ చేస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్షరిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన పది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు–రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
ఏఐపై అతిగా ఆధారపడొద్దు: శక్తికాంత దాస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలతో ప్రయోజనాలు పొందాలే తప్ప వాటిపై అతిగా ఆధారపడరాదని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఈ సాంకేతికతలతో ఆర్థిక సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి వల్ల ఆర్థిక స్థిరత్వానికి రిస్కులు కూడా పొంచి ఉన్నాయని ఆర్బీఐ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.ఏఐ వినియోగం అతిగా పెరిగే కొద్దీ సైబర్‌దాడులు, డేటా ఉల్లంఘనలు వంటి రిస్కులు కూడా పెరిగే అవకాశం ఉందని వివరించారు. అంతే గాకుండా, ఏఐ పారదర్శకంగా ఉండకపోవడం వల్ల, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను ప్రభావితం చేసే అల్గారిథంలను ఆడిట్ చేయడం లేదా అన్వయించుకోవడం కూడా కష్టతరమవుతుందని దాస్ చెప్పారు. దీనితో మార్కెట్లలో అనూహ్య పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!డిజిటలీకరణతో మనీ ట్రాన్స్ఫర్ ఎంత వేగంగా క్షణాల వ్యవధిలో జరుగుతోందో అంతే వేగంగా సోషల్ మీడియా ద్వారా వదంతులు కూడా వ్యాప్తి చెందుతున్నాయని, ఇలాంటివి లిక్విడిటీపరమైన ఒత్తిళ్లకు దారి తీసే అవకాశం ఉందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో రిసు్కలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
తగ్గిద్దామా? వద్దా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ రెపోరేటు(ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.5 శాతం)ను తగ్గించాలా? వద్దా అనే నిర్ణయంపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. కమిటీ తీసుకునే నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ ఈ నెల 9వ తేదీన వివరిస్తారు.యథాతథ స్థితికే ఓటు..!కమిటీ కీలక వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవచ్చని నిపుణుల అంచనా. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుభేటీలో ముగ్గురు కొత్త సభ్యులుఆర్బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్రం ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు ఓటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులైన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్లు ఉన్నారు. -
ఇక లోన్స్ ఈజీ.. యూపీఐ తరహాలో యూఎల్ఐ
దేశ డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ) తరహాలో యూఎల్ఐ (యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్) పేరుతో మరో కొత్త సేవలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టబోతోంది. గత ఏడాది ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫాం ప్రస్తుతం పైలట్ దశలో ఉంది. త్వరలో దీన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. బెంగళూరులో డీపీఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో దాస్ ప్రసంగించారు.“పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా, యూఎల్ఐని దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభిస్తాం. యూపీఐ చెల్లింపుల వ్యవస్థను మార్చినట్లే, యూఎల్ఐ దేశంలో రుణ వితరణలో అదే విధమైన పాత్రను పోషిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇది దేశ డిజిటల్ ప్రయాణంలో ఒక విప్లవాత్మక ముందడుగు అవుతుంది” అన్నారు. -
ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకర్‌గా దాస్
ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకు గవర్నర్లలో భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ అత్యుత్తమ బ్యాంకర్‌గా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో దాస్ ఈ గుర్తింపు పొందడం ఇది వరుసగా రెండోసారి. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజీన్ తాజాగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ర్యాంకులు ప్రకటించింది.ఈ ర్యాంకుల్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024’లో దాస్‌కు ‘ఏ+’ రేటింగ్ లభించింది. గ్లోబర్ ర్యాంకుల్లో భాగంగా ద్రవ్యోల్బణ కట్టడి, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా ‘ఏ’ నుంచి ‘ఎఫ్’ వరకు గ్రేడ్లను కేటాయిస్తారు. అద్భుతమైన పనితీరు కనబరిస్తే ఏ+ ర్యాంకు ఇస్తారు. అధ్వాన పనితీరుకు ‘ఎఫ్’ రేటింగ్ కేటాయిస్తారు. శక్తికాంత దాస్‌తో పాటు డెన్మార్క్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ క్రిస్టియన్ కెట్టల్, థాసన్, స్విట్జర్లాండ్(స్విస్ సెంట్రల్ బ్యాంక్)గవర్నర్ థామస్ జె.జోర్డాన్లకు ఏ+ రేటింగ్ దక్కింది.ఇదీ చదవండి: వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్! -
RBI Monetary Policy 2024: ఆర్బీఐ ఏడోసారీ
ముంబై: ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా ఏడోసారీ కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. రెపో రేటును ప్రస్తుత 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ మేరకు పాలసీ నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన రుణాలపై ఈఎంఐలు మరికొన్నాళ్ల పాటు స్థిరంగా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. 2023 ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మార్చలేదు. అంటే ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో రేటు యథాతథంగా కొనసాగింది. తాజాగా రెపో రేటును యథాతథంగా ఉంచాలన్న ప్రతిపాదనను మానిటరీ పాలసీ కమిటీలోని (ఎంపీసీ) ఆరుగురు సభ్యుల్లో ఒకరు వ్యతిరేకించగా అయిదుగురు సభ్యులు సానుకూలత వ్యక్తపర్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం స్థాయిలోనూ (2023–24లో 7.6 శాతం), ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలోను (2023–24లో 5.4 శాతం) ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ కొనసాగించింది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా, ఆహార ధరల బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.66 శాతంగా నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం క్యూ1లో 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం చొప్పున మొత్తం మీద సగటున 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. కాగా విదేశాల నుంచి స్వదేశానికి పంపించే డబ్బుకు (రెమిటెన్స్) సంబంధించి భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ► యూపీఐని వినియోగించడం ద్వారా త్వరలో బ్యాంకుల్లో నగదు డిపాజిట్ సౌకర్యం ► ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం సులభతరానికి మొబైల్ యాప్ ప్రారంభం ► ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్ల ట్రేడింగ్‌కు అనుమతి ► డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిర శ్రేణిలో కదలాడుతోంది. ఆందోళక అక్కర్లేదు ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వ్యవస్థాగతంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు ► జూన్ 5 నుంచి 7 వరకూ 2024–25 ఆర్బీఐ రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ► సీబీడీసీ వాలెట్లను అందించడానికి నాన్–బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు అనుమతి ► బ్యాంకింగ్ ద్రవ్య సంబంధ ఇబ్బందులు పడకుండా లిక్విడిటీ కవరేజ్ రేషియో సమీక్ష ► 2023–24లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 41.6 బిలియన్ డాలర్లు. 2014–15 తర్వాత అత్యధికం పసిడి నిల్వల పెంపు విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టతలో భాగంగా పసిడి వాటాను భారత్ పెంచుకుంటుందని ఆర్బీఐ పేర్కొంది. మార్చి 29వ తేదీ నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ హై 645.6 బిలియన్ డాలర్లకు చేరితే, అందులో పసిడి వాటా 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది. సాగుపై చల్లని అంచనాలు తీవ్ర వేసవి, నీటి ఎద్దడి భయాందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఎకానమీపై చల్లని అంచనాలను వెలువరించింది. తగిన వర్షపాతం అంచనాల నేపథ్యంలో వ్యవసాయ, గ్రామీణ క్రియాశీలతలో సానుకూలతలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఆశించిన స్థాయిలో సాధారణ రుతుపవనాల అంచనాలు, మంచి రబీ గోధుమ పంట, ఖరీఫ్ పంటల మెరుగైన అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. బలమైన గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ– సేవల రంగంలో స్థిరమైన పురోగతి ప్రైవేట్ వినియోగాన్ని పెంచడానికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. అయితే దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య మార్గాలలో పెరుగుతున్న అంతరాయాలు దేశ ఎకానమీకి ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా పేర్కొంది. ఆహార ధరలపై అనిశ్చితి.. ఆహార ధరల్లో నెలకొన్ని అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది వేసవిలో కూరగాయల ధరల కదలికలపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వృద్ధికి ఊతమిస్తూనే మరోవైపు లకి‡్ష్యంచుకున్న స్థాయికి (4 శాతం) ద్రవ్యోల్బణం దిగి వస్తే కీలక రేట్లను తగ్గించడంపైనే ఎంపీసీ ప్రధానంగా దృష్టి పెడుతుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
బిజినెస్: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో.. గవర్నర్ చర్చ!
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో నార్త్‌బ్లాక్‌లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశమయ్యారు. ఎకానమీపై చర్చించారు. కాగా సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ కూడా ఆర్థిక మంత్రితో సమావేశమై మార్కెట్ పరిణామాలను వివరించారు. స్విగ్గీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ కపూర్ సీతారామన్‌తో సమావేశమయినట్లు మరో పోస్ట్‌లో ఆర్థికశాఖ పేర్కొంది. ఇవి చదవండి: బిజినెస్ - నష్టాల్లోంచి లాభాల్లోకి.. -
భారత్, ఇండొనేసియా మధ్య స్థానిక కరెన్సీలోనే వాణిజ్యం
ముంబై: ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలను స్థానిక కరెన్సీలోనే నిర్వహించుకోవడంపై భారత్, ఇండొనేíసియా దృష్టి పెట్టాయి. ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఇండోనేసియా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇండోనేసియా గవర్నర్ పెర్రీ వార్జియో దీనిపై సంతకాలు చేశారు. సీమాంతర లావాదేవీలను భారతీయ రూపాయి (ఐఎన్ఆర్), ఇండొనేషియా రూపియా (ఐడీఆర్) మారకంలో నిర్వహించడాన్ని ప్రోత్సహించే దిశగా ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడానికి ఇది ఉపయోగ పడనుంది. -
అధిక వడ్డీరేట్లు కొనసాగుతాయన్న ఆర్బీఐ గవర్నర్
ప్రస్తుత ఆర్థిక విధాన రూపకల్పన సంక్లిష్టంగా మారిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. 2023లో ఇప్పటివరకు పాలసీ రేట్లపై ఆర్బీఐ విరామం కొనసాగించిందన్నారు. ప్రస్తుతం వడ్డీరేట్లు అధికంగానే ఉన్నాయని, అవి ఇంకెంతకాలం కొనసాగుతాయో చెప్పలేమన్నారు. శుక్రవారం జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు తోడవ్వడంతో ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు పెంచాయి. ఈ క్రమంలో ఆర్బీఐ సైతం గతేడాది మేనెల నుంచి దాదాపు 250 బేసిస్ పాయింట్ల మేర రెపోరేటును పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మాత్రం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. ఇప్పటికే రెపో రేటు 6.50 శాతానికి చేరింది. అయితే, ఈ రేట్లు ఎంతకాలం స్థిరంగా ఉంటాయో అప్పుడే చెప్పలేమని, కాలమే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని శక్తికాంత దాస్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.(వడ్డీరేట్ల పెంపు తప్పదు: ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్) ప్రపంచ వృద్ధిలో మందగమనం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణంలో అనిశ్చితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్బీఐతో సహా సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో బాధ్యత వహించాలని సూచించారు. క్రూడాయిల్ ధర పెరుగుదల, బాండ్ల రాబడి పెరగడం వంటి తాజా సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయని చెప్పారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా బ్యాంకులు కనీస మూలధన అవసరాలను తీర్చగలవన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఇంకా రూ.10వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని చెప్పారు. -
మొండిబాకీల రికవరీపై మరింత దృష్టి పెట్టండి - ఆర్బీఐ గవర్నర్
ముంబై: వినూత్న అకౌంటింగ్ విధానాలతో మొండిపద్దుల వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చకుండా వాటిని రాబట్టడంపై మరింత తీవ్రంగా ప్రయత్నించాలని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు (యూసీబీ) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. రుణాల మంజూరు తర్వాత కూడా పద్దులను సమీక్షించడం, మొండిబాకీలు తలెత్తే అవకాశాలను సకాలంలో గుర్తించడం తదితర రుణ రిస్కుల నిర్వహణ విషయంలో బోర్డులు సైతం క్రియాశీలకంగా పని చేయాలని ఆయన పేర్కొన్నారు. ముంబై జోన్ యూసీబీ డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో దాస్ ఈ మేరకు సూచనలు చేసినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నివేదికలు పారదర్శకంగా, సమగ్రంగా ఉండేలా చూడటంలో డైరెక్టర్ల ప్రధాన పాత్ర పోషించాలని దాస్ చెప్పారు. అలాగే, బ్యాంకు స్థాయిలో ఐటీ, సైబర్‌సెక్యూరిటీ మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిపుణుల నియామకంలోనూ కీలకంగా వ్యవహరించాలని సూచించారు. -
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన - వరుసగా మూడో సారి..
Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు రేపో రేటు మీద కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) వడ్డీ రేటును యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత మూడు రోజులుగా జరుగుతున్న ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును 6.50 శాతం వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంచాలని తీర్మానించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతంలోనే ఉండేలా చూసేందుకు సెంట్రల్ బ్యాంక్ కమిటీ కూడా వసతి వైఖరుల ఉపసంహరణను కొనసాగించింది. రేపో రేటు గత మూడు సార్లుగా ఎటువంటి మార్పుకు లోనుకాకుండా నిలకడగా ఉంది. అంతకు ముందు సెంట్రల్ బ్యాంక్ పాలసీ కమిటీ రెపో రేటుని 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు 250 బేసిస్ పాయింట్లను పెంచింది. మే 2023లో ద్రవ్యోల్బణం కనిష్టంగా 4.3 శాతానికి చేరింది. అయితే జూన్‌లో పెరిగిన ధరల ద్రవ్యోల్బణం.. కూరగాయల ధరల కారణంగా జూలై అండ్ ఆగస్టులో పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు. ఇదీ చదవండి: 60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు! FY2023-24 CPI ద్రవ్యోల్బణం అంచనా కూరగాయల ధరల కారణంగా 5.1 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. అదే సమయంలో GDP అంచనా 6.5 శాతం వద్ద నిలిచింది. రెపో రేటులో ఎటువంటి మార్పు లేదు కావున కస్టమర్లు ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే లోన్ వడ్డీ రేట్లు ప్రస్తుతం పెరిగే అవకాశం లేదు. -
ధరల కట్టడే లక్ష్యం... కానీ సవాళ్లు ఉన్నాయ్!
ముంబై: కేంద్రం నిర్దేశిస్తున్నట్లు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి చేర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రయత్నిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. అయితే ఆర్బీ ఐ ప్రయత్నాలకు ఎల్ నినో సవాలుగా నిలుస్తో ందని వెల్లడించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన ఉద్ఘా టించారు. గత ఏడాది మే నుంచి 2.50 శాతం పెరిగిన రెపో రేటు (బ్యాంకులకు తాని చ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం), సరఫరాలవైపు సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.25 శాతానికి (2022 ఏప్రిల్‌లో 7.8 శాతం) దిగిరావడా నికి కారణమని ఆయన ఒక ఇంటర్వ్యూలో పే ర్కొన్నారు. గోధుమలు, బియ్యం నిల్వల వి డుదల వంటి ఫుడ్ కార్పొరేషన్ చర్యలు ధరలు దిగిరావడానికి కారణమయ్యాయి. కొన్ని ప్రొడక్టులపై సుంకాల తగ్గింపూ ఇక్కడ సానుకూలమయ్యింది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► 2023–24లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతం ఉంటుందని భావిస్తున్నాం. 4 శాతానికి దీనిని కట్టడి చేయడానికీ ప్రయతి్నస్తున్నాం. ఎల్ నినో సవాళ్లు నెలకొనే ఆందోళనలు ఉన్నాయి. (పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పులకు గురికావడమే ఎల్ నినో. ఇది భారత్, ఆ్రస్టేలియాలో భారీ వర్షపాతం, పంట ఉత్పాదకతకపై ప్రభావం, కరువు పరిస్థితులను సృష్టించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు.) ► ద్రవ్యోల్బణం అదుపులోనికి వస్తే, ప్రజలు తక్కువ వడ్డీరేటు వ్యవస్థను ఆశించవచ్చు. ► ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే. ఇది కమోడిటీ ధరలను పెంచే అంశం. అయితే ప్రస్తుతం బ్యారల్‌కు 76 డాలర్ల వద్ద ఉన్న క్రూడ్ ధర వల్ల ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు. ► ప్రాజెక్ట్ రుణాలుసహా కార్పొరేట్ల నుండి క్రెడిట్ కోసం చాలా డిమాండ్ ఉంది. మొత్తం రుణ వృద్ధి అన్ని రంగాల విస్తృత ప్రాతిపాతిపదికన నమోదవుతోంది. ► 2023 క్యాలెండర్ సంవత్సరంలో రూపాయి తక్కువ అస్థిరతను కలిగి ఉంది. డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ బలపడింది. అస్థిరతను తగ్గించడానికి ఆర్బీఐ తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ► అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రేట్లను పెంచినప్పటికీ రూపాయిపై ప్రభావం పడదని విశ్వసిస్తున్నాం. అమెరికాలో ఫెడ్ ఫండ్ రేటు 5 శాతం పెరిగినప్పటికీ దేశీయ కరెన్సీ స్థిరంగా ఉంది. ► దేశానికి వచీ్చ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వలకు మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) 2023–24 ఆర్థిక సంవత్సరంలో ‘‘పటిష్ట నిర్వహణ స్థాయిలో’’ ఉంటుందని భావిస్తున్నాం. సేవా రంగం నుంచి అధిక ఎగుమతులు, క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. ఈ ప్రయత్నాలకు ఎల్ నినో ప్రధాన విఘాతం – శక్తికాంత్‌దాస్, ఆర్బీఐ గవర్నర్ -
ఆర్బీఐ గవర్నర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీస్ - కారణం ఏంటంటే?
Telangana High Court Notice to RBI Governor: కోర్టు ధిక్కరణ కేసులో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ వాటాదారులు కోర్టుకు వెళ్లారు. దీనిపైన జస్టిస్ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి.. ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో 2023 జులై 07 లోపల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ షేర్‌హోల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి బ్యాంకు నిధులు దుర్వినియోగమయ్యాయని వెల్లడించింది. వినియోగదారుల రక్షణ కోసం బ్యాంకు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అధికారిని నియమించాలని ఆర్బీఐని కోర్టు అప్పట్లోనే ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు అధికారిని నియమించకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని, ఇది కోర్టు ధిక్కారంగా పరిగణించి అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరింది. ఈ కారణంగానే శక్తికాంతదాస్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. -
అంతర్జాతీయ అవార్డు అందుకున్న ఆర్బీఐ గవర్నర్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును లండన్‌లో అందుకున్నారు. సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2023 విజేతలను ఈ ఏడాది మార్చి చివరిలో ప్రకటించారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఉక్రెయిన్‌కు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వచ్చాయి. సెంట్రల్ బ్యాంకింగ్, లండన్ జూన్ 13న నిర్వహించిన వేసవి సమావేశాల ప్రారంభ ప్లీనరీ సమావేశంలో శక్తికాంత దాస్ పాల్గొని ప్రసంగించారు. గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్వీకరించారు. కోవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణ కట్టడికి చేసిన కృషికి గానూ ఆయనకు గుర్తింపు లభించింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండి, వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత దాస్ రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. 2018లో ఆర్బీఐ 25వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన 15వ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా G20 షెర్పా ఆఫ్ ఇండియాగా ఉన్నారు. Governor @DasShaktikanta received the ‘Governor of the Year’ award from @CentralBanking_ as part of the Central Banking Awards 2023 in London yesterday. #RBI #RBIGovernor #Governor #shaktikantadas #centralbanking pic.twitter.com/zh5E1VRGsi — ReserveBankOfIndia (@RBI) June 14, 2023 ఇదీ చదవండి: ఆస్తి పత్రాలు బ్యాంకుల్లో ఉన్నాయా..? ఆర్బీఐకి కీలక ప్రతిపాదనలు! -
రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. ఈ మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ(గురువారం) ప్రకటించారు. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా.. మునుపటి మాదిరిగానే అదే 6.5% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారాయన. ద్రవ్యోల్బణం తగ్గిన్నందువల్ల రెపో రేటుని పెంచలేదని, వడ్డీ రేట్లలో(గృహ, వాహన రుణగ్రహీతలకు ఊరటనిచ్చే అంశం) కూడా ఎలాంటి మార్పు లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆర్బీఐ రెపో రేటుని స్థిరంగా ఉంచడం ఇది వరుసగా రెండవ సారి కావడం గమనార్హం. ఎంఎస్ఎఫ్ రేటు 6.75 శాతం, ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం, సీఆర్ఆర్ రేటు 4.50 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. గత ఏప్రిల్ సమావేశంలో రెపో రేటు (Repo rate)ను ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. ద్రవ్యోల్బణాన్ని (Inflation) నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి దిగివచ్చిన విషయం తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం (Inflation) తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందనే భావనతోనే కీలక రేట్లలో ఆర్బీఐ మార్పులు చేయక పోవచ్చునని గతకొంత కాలంగా విశ్లేషణలు వెలువడుతున్న విషయం తెలిసిందే. Monetary Policy Statement by Shri Shaktikanta Das, RBI Governor - June 08, 2023 https://t.co/R9mQDcr70D — ReserveBankOfIndia (@RBI) June 8, 2023 -
సజావుగా రూ. 2వేల నోట్లు వెనక్కి..
న్యూఢిల్లీ: రూ. 2,000 నోటు ఉపసంహరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియంతా సజావుగా పూర్తి కాగలదని ధీమా వ్యక్తం చేశారు. మార్పిడి, డిపాజిట్లకు తగినంత సమయం ఇచ్చినందున ఎక్కడా రద్దీ కనిపించడం లేదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. రూ. 2వేల నోట్ల జీవితకాలం, వాటిని ప్రవేశపెట్టిన లక్ష్యం పూర్తయింది కాబట్టి ఉపసంహరిస్తున్నట్లు దాస్ వివరించారు. డెడ్‌లైన్ విధించడాన్ని సమర్థించుకుంటూ గడువంటూ లేకపోతే ఉపసంహరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించలేమని ఆయన పేర్కొన్నారు. 4.7 శాతం లోపునకు ద్రవ్యోల్బణం.. ద్రవ్యోల్బణం నెమ్మదించిందని, తదుపరి గణాంకాల్లో ఇది తాజాగా నమోదైన 4.7 శాతం కన్నా మరింత తక్కువగా ఉండవచ్చని దాస్ తెలిపారు. అలాగని, అలసత్వం ప్రదర్శించడానికి లేదని.. ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కొన్నాళ్ల క్రితం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపించిన సమయంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముంచుకొచ్చి అంతర్జాతీయంగా మొత్తం పరిస్థితి అంతా మారిపోయిందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుందని, ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు తగినట్లుగా ఆర్బీఐ స్పందిస్తుందని పేర్కొన్నారు. రేట్ల పెంపునకు విరామం ఇవ్వడమనేది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టే ఉంటుంది తప్ప తన చేతుల్లో ఏమీ లేదని దాస్ చెప్పారు. స్థూలఆర్థిక పరిస్థితులు స్థిరపడుతుండటంతో వృద్ధి పుంజుకోవడానికి తోడ్పా టు లభిస్తోందని దాస్ వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీల సమస్య గణనీయంగా తగ్గిందన్నారు. బ్యాంకుల రుణ వితరణ పెరుగుతోందని చెప్పారు. భారత ఆర్థిక సుస్థిరతను కొనసాగించేందుకు ఆర్బీఐ సదా క్రియాశీలకంగా, అప్రమత్తంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 7 శాతం పైనే వృద్ధి.. గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 7 శాతం కన్నా అధికంగానే ఉండవచ్చని దాస్ చెప్పారు. 2022–23కి సంబంధించిన ప్రొవిజనల్ అంచనాలు మే 31న వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసినట్లు దాస్ వివరించారు. అంతర్జాతీయ సవాళ్లను భారత ఎకానమీ దీటుగా ఎదురు నిల్చిందని.. భౌగోళికరాజకీయ, అంతర్గత సమస్యలను అధిగమించేందుకు అవసరమైనంతగా విదేశీ మారక నిల్వలను సమకూర్చుకుందని శక్తికాంత దాస్ చెప్పారు. నగదు కొరత.. రూ. 2 వేల కరెన్సీ నోట్ల మార్పిడి రెండో రోజున కొన్ని బ్యాంకుల్లో నగదు నిల్వలు ఖాళీ అయిపోవడంతో తాత్కాలికంగా ప్రక్రియను ఆపివేయాల్సి వచ్చింది. తిరిగి కరెన్సీ చెస్ట్ నుంచి భర్తీ చేసేంత వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, మార్పిడి కోసం కరెన్సీ కొరత ఉందంటూ పెద్దగా ఫిర్యాదులేమీ రాలేదని వివిధ బ్యాంకుల సీనియర్ అధికారులు తెలిపారు. తమ శాఖలన్నింటికీ నిరంతరాయంగా రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లను సరఫరా చేస్తూనే ఉన్నామని వివరించారు. -
ఆర్బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక మూడు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. 3, 5, 6 తేదీల్లో సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ మçహావీర్ జయంతి సందర్భంగా సెలవు. ఈ సమావేశాల్లో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. -
గాంబ్లింగ్ తప్ప మరోటి కాదు, క్రిప్టోపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ ఆస్తులు పెరగడానికి అనుమతినిస్తే మరో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని గతంలోనే హెచ్చరించిన ఆయన తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం( జనవరి 13న) భారత ఆర్థిక వ్యవస్థలు, క్రిప్టో కరెన్సీ, ఆస్తులపై మాట్లాడినా ఆయన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ జూదం తప్ప మరోటి కాదని అలాంటి వాటి విస్తరణను నిషేధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాటి అనియంత్రిత వృద్ధికి అనుమతించినట్లయితే కేంద్ర బ్యాంకు అధికారాన్ని కూడా బలహీనం చేస్తుందన్నారు. క్రిప్టోకరెన్సీల పెరుగుదల వల్ల భారత ఆర్థికవ్యవస్థపై ఆర్బీఐ 'నియంత్రణ' కోల్పోయే అవకాశం ఉన్నందున భారతదేశంలో క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నారు ఆర్బీఐ గవర్నర్. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా విధానాలు మార్చుకుంటూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి క్రిప్టో అప్లికేషన్ల కారణంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి విలువ లేదని కొంతమంది క్రిప్టోను ఆస్తిగా పిలుస్తారని, అలాంటప్పుడు ఆస్థికి అంతర్లీన విలువ ఉండాలని, కానీ క్రిప్టోకు అంతర్లీన విలువ లేదని శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలను అనుమతించడమంటే 'సెంట్రల్ బ్యాంక్' అధికారాన్ని అణగదొక్కడమేనని దాస్ తెలిపారు. దీని మూలంగా ఆర్థికవ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దేశంలో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ 'డాలరైజేషన్'కు దారితీయవచ్చని అన్నారు. ఆర్బిఐ నియంత్రణలో ఉన్న డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయిపై వ్యాఖ్యానిస్తూ, డిజిటల్ కరెన్సీకి లాభదాయకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు బ్యాంకుల ఐటీ వ్యవస్థలు పటిష్టంగా ఉండాలని, డేటా గోప్యతపై దృష్టి పెట్టాలని దాస్ సూచించారు క్రిప్టో లాంటి ప్రైవేట్ డిజిటల్ కరెన్సీకి పోటీగా ఆర్భీఐ "డిజిటల్ రూపాయి"ని రిలీజ్ చేసిందని శక్తికాంత దాస్ చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న డిజిటల్ రూపాయి, తొలుత హోల్ సెల్ వ్యాపారులకు అనంతరం రిటైల్ వ్యాపారులకు అందుబాటులోకి వస్తుందని గవర్నర్ గుర్తు చేశారు. -
RBI Monetary Policy: రుణాలు మరింత భారం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) మరో 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కేంద్రం నిర్దేశిస్తున్న 6% రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా 4 సార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4%గా ఉన్న రెపో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. మరింత పెరగవచ్చని సైతం తాజాగా ఆర్బీఐ సంకేతాలిచ్చింది. తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. జీడీపీ అంచనాలు కట్... వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నదే రెపోరేటు ఇన్స్ట్రుమెంట్ ఉద్దేశ్యం. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలు మరింత భారం కానున్నాయి. కాగా, పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో 6.7 శాతంగా ఉంటుందన్న తన అంచనాలను యథాథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలో మాత్రం అంచనాను కిత్రం 7.2 శాతం నుంచి 7 శాతానికి ఆర్బీఐ కుదించింది. పాలసీ ముఖ్యాంశాలు... ► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7% కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ► రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతం కాగా, క్యూ2, క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1%, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. ► డాలర్ మారకంలో రూపాయి విలువపై జాగ్రత్తగా పరిశీలన. సెప్టెంబర్ 28 వరకూ ఈ ఏడాది 7.4 శాతం పతనం. రూపాయిని నిర్దిష్ట మారకం ధర వద్ద ఉంచాలని ఆర్బీఐ భావించడం లేదు. తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి ఆర్బీఐ చర్యలు ఉంటాయి. వర్ధమాన దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బాగుంది. ► ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు, సెప్టెంబర్ 23 నాటికి 537.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి. డాలర్ బలోపేతం అమెరికన్ బాండ్ ఈల్డ్ పెరగడం వంటి మార్పులే కావడం గమనార్హం. ► రూపాయిలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి నాలుగైదు దేశాలు, అనేక బ్యాంకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ► 2022–23లో బ్యాంకింగ్ రుణ వృద్ధి 16.2 శాతంగా ఉంటుందని అంచనా. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 వరకు జరుగుతుంది. నేటి నుంచి టోకెనైజేషన్ దాదాపు 35 కోట్ల కార్డుల వివరాలు, లావాదేవీల గోప్యత లక్ష్యానికి సంబంధించిన టోకెనైజేషన్ వ్యవస్థ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, ఆగస్టు నాటికి వ్యవస్థలో 101 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సెప్టెంబర్‌లో దాదాపు 40% లావాదేవీల టోకెనైజేషన్ జరిగింది. వీటి విలువ దాదాపు రూ.63 కోట్లు. టోకెనైజేషన్ వ్యవస్థలో చేరడాన్ని తప్పనిసరి చేయకపోవడం వల్ల ఈ వ్యవస్థ వేగంగా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొందని డిప్యూటీ గవర్నర్ తెలిపారు. -
బ్యాలెన్స్ షీట్స్ పటిష్టతపై కార్పొరేట్లు దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: కార్పొరేట్లు తమ బ్యాలెన్స్ షీట్స్ పటిష్టతపై దృష్టి సారించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. వ్యాపార సంస్థలు తమ బ్యాలెన్స్ షీట్లలో అధిక నష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా, స్వల్పకాలిక రివార్డ్ కోరే సంస్కృతిని విడనాడాల్సిన అవసరం ఉందన్నారు. ‘రిస్క్ తీసుకోవడం’ అనేది వ్యాపారం చేయడంలో కీలకమైన అంశమని గవర్నర్ పేర్కొంటూనే.. అయితే కంపెనీలు ఆయా అంశాలు, పర్యావసానాలు అన్నింటిపై జాగ్రత్తగా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. స్వల్పకాలిక రివార్డ్ కోరుకోవడానికన్నా ముందు వ్యాపారంలో ఎదరవబోయే ప్రతికూల అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం, వాటి నివారణకు తగిన చర్యలకు సిద్ధమవడం అవసరమని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐసీ) ఆధ్వర్యంలో జరిగిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఐకానిక్ వీక్ వేడుకలో ‘ఇండియన్ బిజినెస్: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించి త్వరలో నియంత్రణా నిబంధనలను ఆర్బీఐ విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే... - ఆర్బీఐ దృష్టికి వచ్చిన కొన్ని అనుచితమైన వ్యాపార నమూనాలు లేదా వ్యూహాల సాధారణ లక్షణాలను పరిశీలిస్తే అవి ప్రధానంగా అనుచితమైన ఫండింగ్ స్ట్రక్చర్, రుణం– ఆస్తుల అసమతుల్యతను కలిగి ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైనవి. స్థిరమైనవి ఎంతమాత్రం కాదు. - వీటితోపాటు అవాస్తవిక వ్యూహాత్మక అంచనాలు, సామర్థ్యాలు– వృద్ధి అవకాశాలు–మార్కెట్ పోకడల గురించి మితిమీరిన ఆశావాదం వ్యాపార నమూనా సాధ్యతను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితి చివరకు పేలవమైన వ్యూహాత్మక నిర్ణయాలకు దారితీస్తుంది. - వ్యాపార దీర్ఘకాలిక విజయాన్ని నిర్ణయించే ఏకైక అతి ముఖ్యమైన అంశం– కార్పొరేట్ గవర్నెన్స్. వ్యాపార సంస్థలలో విశ్వసనీయత, పారదర్శకత, జవాబుదారీతనం ఇవన్నీ కార్పొరేట్ గవర్నెన్స్‌తో ముడివడి ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడి, వ్యాపార స్థిరత్వం, సమగ్రతను పెంపొందించడంలో కార్పొరేట్ గవర్నర్స్ కీలక పాత్ర పోషిస్తుంది. - యునికార్న్‌ల సంఖ్య (బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కొత్త వ్యాపారాలు) చాలా వేగంగా పెరుగుతోంది. ఈ స్టార్టప్‌లకు ఏంజెల్, వెంచర్ ఫండింగ్, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, సమాజంలో వినియోగానికి సంబంధించి కొత్త సంస్కృతి ద్వారా మద్దతు లభిస్తోంది. - భారతీయ వ్యాపారం ఇప్పుడు అవకాశాలు– సవాళ్లు రెండింటితో కీలకమైన దశలో ఉంది. - స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. చదవండి: భారత జీడీపీ వృద్ధి: వరల్డ్ బ్యాంకు షాకింగ్ అంచనాలు -
ఆర్థిక రంగంపై నిరంతరం నిఘా పెట్టండి
ముంబై: దేశీ, అంతర్జాతీయ పరిణామాలతో పలు సవాళ్లు తలెత్తుతున్న నేపథ్యంలో ఆర్థిక రంగంపై నిరంతరం నిఘా పెట్టాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే సమ్మిళిత వృద్ధి సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. మంగళవారం 25వ ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ఈ భేటీలో ఆర్థిక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. ‘ఎఫ్ఎస్డీసీ లక్ష్యాలు, దేశ విదేశ పరిణామాలతో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లపై కౌన్సిల్ చర్చించింది. అలాగే ఎకానమీలో పరిస్థితులు, కీలక ఆర్థిక సంస్థల పనితీరుపై అన్ని నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం నిరంతరం ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది‘ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ (సెబీ) చైర్మన్ అజయ్ త్యాగి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్, ఆర్థిక విభాగం కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేఠ్, రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2022–23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ అత్యున్నత స్థాయి మండలి సమావేశం కావడం ఇదే ప్రథమం. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 3న ఇది భేటీ అయ్యింది. ఆర్థిక స్థిరత్వ నిర్వహణకు, నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు, ఆర్థిక రంగ అభివృద్ధికి దోహదపడే చర్యలు తీసుకునేందుకు ఫైనాన్షియల్ మార్కెట్ నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఎస్డీసీని ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాం.. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో (ఎన్ఎస్ఈ) చోటు చేసుకున్న పాలనాపరమైన అవకతవకలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్.. విలేకరులకు తెలిపారు. దీని గురించి పూర్తిగా సమాచారం తనకు వచ్చే వరకూ, ఈ విషయంలో విధించిన జరిమానాలు, తీసుకున్న దిద్దుబాటు చర్యలు మొదలైనవి సరైన స్థాయిలోనే ఉన్నాయా అన్న అంశంపై తాను స్పందించలేనన్నారు. ఎల్ఐసీ ఇష్యూపై మార్కెట్లో ఆసక్తి.. ప్రతిపాదిత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూపై మార్కెట్ వర్గాల్లో భారీగా ఆసక్తి నెలకొందని మంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవో పూర్తి కాగలదని ఆమె సూత్రప్రాయంగా తెలిపారు. మార్చిలోనే లిస్ట్ చేయాలని భావిస్తున్నప్పటికీ.. భౌగోళిక, రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామంటూ ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ చెప్పిన నేపథ్యంలో సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
సామాన్యుడికి మళ్లీ షాక్ !.. కారణాలు ఇవే
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై ధరల పెరుగుదల భారం తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ భరోసా ఇచ్చారు. ద్రవ్యోల్బణం కట్టడి–ఎకానమీ పురోగతి లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతక్రితం ఆర్బీఐ బోర్డును ఉద్దేశించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. బడ్జెట్ లక్ష్యాలను వివరించారు. వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ బోరŠుడ్డను ఉద్దేశించి ఆర్థికమంత్రి ప్రసంగించడం సాంప్రదాయకంగా వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి నెలకు సంబంధించి సోమవారం వెలువడిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.01 శాతం కాగా టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండంకెలపైన 12.96 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి ధరల స్పీడ్) నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6–2 శ్రేణిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఈ స్థాయిని దాటి జనవరి గణాంకాలు నమోదుకావడం గమనార్హం. మా అంచనాలు బలమైనవే.. కానీ: శక్తికాంతదాస్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెంట్రల్ బ్యాంక్ బోర్డ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాతో మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం దిగువముఖంగా పయనిస్తోందని అన్నారు. తమ అంచనాలు ‘‘బలమైనవే’’, కానీ ప్రపంచ ముడిచమురు ధరల కదలికతో ముడిపడి ఉన్న ప్రతికూలతలు, సంబంధిత సమస్యలపై ఇవి ఆధారపడి ఉన్నాయని అన్నారు. ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రాతిపదికన, ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ ఒక నిర్దిష్ట శ్రేణిని ఇప్పటి వరకూ పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. అయితే ఈ అంచనాలు అన్నీ చివరకు క్రూడ్ ధరలు, సంబంధిత ప్రతికూల అంశాలపై ఆధారపడి ఉంటాయని వివరించారు. ‘‘మా ద్రవ్యోల్బణం అంచనాలు చాలా పటిష్టంగా ఉన్నాయని నేను ఇప్పటికీ చెబుతాను. మేము దానికి కట్టుబడి ఉన్నాము. పూర్తిగా ఊహించనిది ఏదైనా జరిగితే పరిస్థితి భిన్నంగా ఉంటుందని మీకూ తెలుసు. ఇది ఎవ్వరూ ముందుగా ఊహించిలేని ఆకస్మిక స్థితి. ప్రస్తుతం ప్రతికూలాంశం ముడిచమురు ధరలే అని మీకు తెలుసు’’ అని గవర్నర్ తెలిపారు. ధరల స్థిరత్వం అంటే ప్రాథమికంగా ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కొనసాగించడమేనని పేర్కొన్నారు. దీనికి కట్టుబడి ఉండాలన్నదే తమ సంకల్పని పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణం పట్ల తన నిబద్ధత ఎలా ఉండాలన్నది రిజర్వ్ బ్యాంక్‌కు పూర్తిగా తెలుసునని దాస్ ఉద్ఘాటించారు. లోబేస్ ఎఫెక్ట్ ‘‘ద్రవ్యోల్బణం ధోరణిని పరిశీలిస్తే, 2020 అక్టోబర్ నుంచి 2021 అక్టోబర్ వరకూ ఈ రేటు దిగువముఖంగానే పయనించింది. అయితే మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ఇది తీవ్రంగా కనబడుతోంది. దీనికి లోబేస్ ఎఫెక్ట్ కారణం. రానున్న నెలల్లో కూడా ఈ లోబేస్ ఎఫెక్ట్ గణాంకాలపై విభిన్న రీతుల్లో కనబడుతుంది‘‘ అని గవర్నర్ వివరించారు. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. కాగా, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది. వచ్చే నెలలో గ్రీన్ బాండ్లు సావరిన్ గ్రీన్ బాండ్స్ జారీపై వచ్చే నెల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రూ.11.6 లక్షల కోట్లు మార్కెట్ రుణ సమీకరణలో భాగంగా కేంద్రం మొట్టమొదటిసారి 2022–23 వార్షిక బడ్జెట్లో ‘సావరిన్ గ్రీన్ బాండ్ల’ జారీ ప్రతిపాదన చేసింది. ఈ బాండ్ల ద్వారా సమీకరించే నిధులను పర్యావరణ సానుకూల ప్రభుత్వ మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు వినియోగించుకోవాలన్నది కేంద్రం లక్ష్యంమని బడ్జెట్ పేర్కొంది. ఏడు నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆర్బీఐ రెపో రేటు నిర్ణయానికి (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం. దాదాపు 18 నెలల నుంచి ఇది ఇదే స్థాయిలో కొనసాగుతోంది) ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం జనవరిలో ఏకంగా 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయ్యింది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణి ఎగువ పరిమితికన్నా ఇది ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. గడచిన ఏడు నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం (2021 జూన్‌లో 6.26 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. 2021 జనవరిలో 4.06 శాతం. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ ఈ నెల మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది. ధరల స్పీడ్ ఇలా... - తాజా సమీక్షా నెల్లో ఒక్క ఫుడ్ బాస్కెట్ చూస్తే ద్రవ్యోల్బణం 5.43 శాతం. 2021 డిసెంబర్లో ఈ రేటు 4.05 శాతం. - కూరగాయల ధరలు 2021 డిసెంబర్లో అసలు పెరక్కపోగా 2.99 శాతం క్షీణించాయి. అయితే 2022 జనవరిలో ఏకంగా 5.19 శాతం పెరిగాయి. - ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ధరల పెరుగుదల తీవ్రంగా 18.7 శాతంగా ఉంది. - తృణ ధాన్యాలు, ఉత్పత్తుల ధరల పెరుగుదల డిసెంబర్లో 2.62 శాతం ఉంటే, జనవరిలో 3.39 శాతానికి ఎగశాయి. - మాంసం చేపలు ధరలు ఇదే కాలంలో 4.58 శాతం నుంచి 5.47 శాతానికి చేరాయి. - ఇంధనం–లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం డిసెంబర్లో 10.95 శాతం ఉంటే, జనవరిలో 9.32 శాతానికి తగ్గింది. - దుస్తులు, పాదరక్షలు, రవాణా, కమ్యూనికేషన్లసహా వివిధ ఇతర విభాగాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 9 శాతంపైన నమోదయ్యింది. - కాగా, డిసెంబర్ 2021 ద్రవ్యోల్బణాన్ని కూడా 5.59 శాతం నుంచి ఎగువముఖంగా 5.66 శాతంగా గణాంకాల కార్యాలయం సవరించింది. టోకు ధరలు.. రెండంకెలపైనే.. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 డిసెంబర్లో 13.56 శాతం ఉంటే, 2022 జనవరిలో 12.96 శాతానికి తగ్గింది (2021 జనవరి నెల టోకు ధరలతో పోల్చి). టోకు ద్రవ్యోల్బణం రెండంకెల పైన కొనసాగుతుండడం ఒక ఆందోళనకరమైన అంశంకాగా, ఆహార ఉత్పత్తుల ధరలు తీవ్ర స్థాయిలోనే కొనసాగుతుండడం గమనించదగిన మరో ప్రతికూల అంశం. గడచిన పది నెలల నుంచీ అంటే 2021 ఏప్రిల్ నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగుతోంది. 2021 జనవరిలో ఈ రేటు 2.51 శాతం. అప్పటిలో బేస్ తాజా ధరలు తీవ్ర స్థాయిలో కనబడ్డానికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. కొన్ని కీలక విభాగాలు చూస్తే.. - ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ధరలు 2021 డిసెంబర్లో 9.56 శాతం పెరిగితే, 2022 జనవరిలో (సమీక్షా నెల) 10.33 శాతానికి ఎగశాయి. ఇందులో ఒక్క కూరగాయలను ధరల స్పీడ్ భారగా 31.56 శాతం నుంచి 38.45 శాతానికి చేరింది. - ఫుడ్ ఆర్టికల్స్‌లో పప్పు దినుసులు, తృణ ధాన్యాలు, ధాన్యం నెలవారీగా పెరిగాయి. గుడ్లు, మాసం, చేపల ధరలు 9.85 శాతం ఎగశాయి. ఆలూ, ఉల్లి ధరలు మాత్రం 14.45 శాతం, 15.98 శాతం చొప్పున క్షీణించాయి. - మినరల్ ఆయిల్స్, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, బేసిక్ మెటల్స్, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు ధరలు పెరిగాయి. - మొత్తం టోకు ధరల సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన తయారీ రంగానికి సంబంధించి ధరల స్పీడ్ 10.62 శాతం (2021 డిసెంబర్) నుంచి 9.42 శాతానికి తగ్గింది. - ఇంధనం, విద్యుత్ బాస్కెట్లో ధరల స్పీడ్ డిసెంబర్లో 32.30 శాతం ఉంటే, సమీక్షా నెల జనవరిలో 32.27 శాతానికి స్వల్పంగా తగ్గింది. -
ఆ పుష్ఫం ముందు క్రిప్టో కరెన్సీ దిగదుడుపే
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా విధాన కీలక నిర్ణయాలు దాదాపు మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. 2020 ఆగస్టు నుంచి చూస్తే, వరుసగా పదవ ద్వైమాసిక సమావేశంలోనూ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును యథాతథంగా కనిష్ట స్థాయిల్లో 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయానికి ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఓటు చేశారు. ఇక వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణకు కీలకమైన రివర్స్ రెపో (బ్యాంకులు తమ వద్ద ఉండే అదనపు నిల్వలను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం)ను కూడా యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ కమిటీ విధాన నిర్ణయం తీసుకుంది. 2020 ఆగస్టు నుంచి యథాతథమే..: కరోనా సవాళ్లు ఎదుర్కొనడం, వృద్ధి లక్ష్యంగా 2020 మార్చి తర్వాత రెపో రేటును ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్లు (1.15 శాతం) తగ్గించింది. 2020 ఆగస్టు నాటికి ఈ రేటు 4 శాతానికి దిగివచ్చింది. ఇక అప్పటి నుంచి (2020 ఆగస్టు ద్వైమాసిక సమావేశం) రెపో రేటును యథాతథంగా కొనసాగించడానికే ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. 2019 ప్రారంభంతో పోల్చితే ఇప్పుడు రెపో రేటు 2.5 శాతం తక్కువగా ఉంది. వడ్డీ రేట్ల పెంపులో సుదీర్ఘ విరామం, నిరంతర సరళతర విధాన వైఖరిని మీడియా సమావేశంలో గవర్నర్ శక్తికాంతదాస్ సమర్థించుకుంటూ, ప్రస్తుత కాలంలో ‘ద్రవ్య– ఆర్థిక విధానాలు ఒకదానికొకటి లేదా ఒకదానితో ఒకటి కలిసి వెళ్లాలి’’ అని వ్యాఖ్యానించారు. రెండు విధానాల్లో ‘అదా–ఇదా’ అనే ప్రశ్నే ప్రస్తుతం తలెత్తబోదని గవర్నర్ అన్నారు. సరళతరానికి ఐదుగురు ఓటు కాగా, పాలసీకి సంబంధించి అనుసరిస్తూ వస్తున్న ‘సరళతర’ వైఖరిని ‘తటస్థం’కు మార్చాలన్న ప్రతిపాదనను ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు వ్యతిరేకించగా, ఒక్కరు మాత్రమే అనుకూలంగా ఓటు చేశారు. పాలసీ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా అంచనా వేయగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్ష్యంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఐదుగురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వేగవంతమైన వృద్ధి ఇక భారత్ ఎకానమీ వృద్ధి తీరు ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే విభిన్నంగా ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎకానమీ కొనసాగుతుందన్న భరోసాను వ్యక్తం చేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. మహమ్మారి పరిస్థితిపై అస్పష్టత, క్రూడ్‌సహా అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదల వంటి అంశాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 7.8 శాతానికి తగ్గించడానికి కారణం. 2021–22లో ఎకానమీ వృద్ధి 8 నుంచి 8.5 శాతం శ్రేణిలో ఉంటుందని ఎకనమిక్ సర్వే అంచనా. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు సంబంధించి ఈ అంచనా 9 శాతంగా ఉంది. ఈ అంచనాలకన్నా కొంత అధికంగానే ఆర్బీఐ అంచనాలు 9.2 శాతం వద్ద కొనసాగుతుండడం గమనార్హం. మరికొన్ని కీలక నిర్ణయాలు... ► కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో అత్యవసర ఆరోగ్య సేవల రంగానికి గత ఏడాది మేలో ప్రకటించిన రూ.50,000 కోట్ల ఆన్–ట్యాప్ లిక్విడిటీ రుణ సౌలభ్యతను మరో 3 నెలలు అంటే 2022 జూన్ 30 వరకు పొడిగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ► ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనడానికి బ్యాంకులు, బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీలు మూలధన పెంపు ప్రక్రియపై నిరంతరం దృష్టి సారించాలని సూచించింది. ► దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకపు ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని తెలియజేసే కరెంట్ అకౌంట్– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతం (జీడీపీ విలువలో) లోటును నమోదుచేస్తుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో తొలి ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. రూ. లక్ష వరకు ఈ–రూపీ పరిమితి ఈ–రూపీ (ప్రీ–పెయిడ్ డిజిటల్ ఓచర్) గరిష్ట పరిమితిని రూ. 10,000 నుండి రూ. 1 లక్షకు పెంచుతూ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు లబ్దిదారుడు బ్యాంక్ అకౌంట్, ఇంటర్నెట్ లేకుండా కేవలం ఫీచర్ ఫోన్ ద్వారా కూడా రూ. 1 లక్ష వరకు ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ ప్రభుత్వ పథకాలను మరింత సమర్ధవంతంగా అందించడానికి వీలుగా మొత్తం పూర్తిగా రీడీమ్ అయ్యే వరకు ఈ–రూపీ వోచర్‌ను లబ్దిదారులకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించవచడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాల సమర్థ పంపిణీకి ప్రస్తుతం ఈ–రూపీ కీలకంగా ఉంది. కేవైసీ, కార్డ్, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ వంటి వాటితో సంబంధం లేకుండా వోచర్‌ను రిడీమ్ చేయడంలో లబ్దిదారులకు సహాయపడే వన్–టైమ్ (ఇప్పటివరకూ... ఇకపై పూర్తిగా రీడీమ్ అయ్యే వరకూ) కాంటాక్ట్‌లెస్, నగదు రహిత వోచర్ ఆధారిత చెల్లింపు విధానమే– ఈ–రూపీ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) రూపొందించిన ఈ–రూపీ నగదు రహిత డిజిటల్ ఓచర్‌ను ‘వ్యక్తిగత వినియోగం, సింగిల్ టైమ్ రెడెమ్షన్ సౌలభ్యంతో’ 2021 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. డిజిటల్ లెండింగ్పై మార్గదర్శకాలు డిజిటల్ రుణ విధానాలపై త్వరలో ఆర్బీఐ మార్గదర్శకాలను జారీచేయనుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ తన సిఫారసులను ఇప్పటికే సమర్పించినట్లు డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం జరిగిందని, దీని అధారంగా మార్గదర్శకాలు రూపొందుతున్నాయని తెలిపారు. రిటైల్ పేమెంట్ వ్యవస్థకు కొత్త నేతృత్వ సంస్థ ఖరారుకు ఇంకా సమయం పడుతుందని సూచించారు. క్రిప్టో... తులిప్ కన్నా దిగదుడుపే బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల విషయంలో ఆర్బీఐ కమిటీ తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వాలకు ఈ కరెన్సీ ముప్పని స్పష్టం చేసింది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను గవర్నర్ హెచ్చరించారు. అటువంటి అసెట్స్‌కు ఎటువంటి అంతర్లీన విలువా ఉండదని గవర్నర్ అన్నారు. క్రిప్టో కరెన్సీ... తులిప్ పువ్వుకన్నా దిగదుడుపని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 17వ శతాబ్దంలో వచ్చిన ‘తులిప్ మ్యానియా’ను గుర్తుచేశారు. డిజిటల్ కరెన్సీపై తొందరలేదు.. ఆర్బీఐ 2022–23లో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతుందని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గవర్నర్ శక్తికాంతదాస్ ఆచితూచి స్పందించారు. హడావిడిగా దీనిపై ముందుకు వెళ్లాలని సెంట్రల్ బ్యాంక్ కోరుకోవడం లేదని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే ముందు అన్ని అంశాలనూ ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుందని తెలిపారు. సీబీడీసీ ఆవిష్కరణకు ఎటువంటి కాలపరమితిని ఆయన ప్రస్తావించలేదు. లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు... ఆచితూచి, లక్ష్యసాధనకు ఉద్దేశించి పరపతి విధాన నిర్ణయాలను ఆర్బీఐ విధాన పరపతి కమిటీ తీసుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగిన స్థాయిలో ఉంటుందన్న అంచనాల ప్రాతిపదికన, వృద్ధే లక్ష్యంగా సరళతర విధానం కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) ద్రవ్యోల్బణం ఆమోదనీయ బ్యాండ్‌లోనే పైకి వెళ్లొచ్చు. అయితే 2022–23 ద్వితీయ ఆరు నెలల కాలంలో 4.5% శ్రేణికి దిగొస్తుందని కమిటీ విశ్వసిస్తోంది. దీనికితోడు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి సవాళ్లు వంటి అంశాల నేపథ్యంలో విస్తృత ప్రాతిపదికన రికవరీ జరగడానికి ఎకానమీకి పాలసీ మద్దతు అవసరమని కమిటీ భావించింది. సరళతర విధానాన్ని కొనసాగించాలన్న నిర్ణయం వల్ల రివర్స్ రెపోను కూడా యథాతథంగా కొనసాగించాలని కమిటీ అభిప్రాయపడింది. వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయన్న విశ్వాసం ఉంది. ప్రభుత్వ మూలధన వ్యయ ప్రణాళికలు, ఎగుమతులు ఉత్పాదక సామర్థ్యం పెరుగుదల, డిమాండ్ పటిష్టతకు దారితీస్తాయని, ఈ వాతావరణం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని విశ్వసిస్తున్నాం. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ ఎకానమీకి భరోసా ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతున్న ఎకానమీ వృద్ధికి పాలసీ నిర్ణయాలు భరోసాను ఇస్తాయి. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ బలోపేతానికి పాలసీ తగిన మద్దతునిచ్చింది. ప్రభుత్వ బాండ్లలో తగిన సమతౌల్యతను కొనసాగించడానికి సంకేతాలను ఇచ్చింది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ అంచనాలకు అనుగుణంగా... పాలసీ నిర్ణయాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. వృద్ధిని మరింత పటిష్టం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎకానమీలోని పలు రంగాల బలహీనత నేపథ్యంలో ‘సరళతర’ విధానాన్నే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించడం హర్షణీయం. – అతుల్ కుమార్ గోయెల్, ఐబీఏ చైర్మన్ డిమాండ్‌కు దోహదం సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలన్న నిర్ణయం వ్యవస్థలో డిమాండ్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృద్ధి అన్ని రంగాల్లో విస్తృత ప్రాతిపదికన జరగాలని పరిశ్రమ కోరుతోంది. ఈ దిశలోనే ఆర్బీఐ నిర్ణయాలు ఉన్నాయి. ప్రభుత్వంతో సన్నిహిత సహకారంతో వృద్ధి పురోగతికి మరిన్ని చర్యలు ఉంటాయని విశ్వసిస్తున్నాం. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షణీయం సరళ విధానం కొనసాగించాన్న నిర్ణయం హర్షణీయం. పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించడం రియల్టీకి సానుకూలాంశం. బ్యాంకింగ్‌లో అందుబాటులో ఉన్న అదనపు లిక్విడిటీ అన్ని రంగాలకూ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఇది ఉపాధి కల్పన, ఎకానమీ పురోగతికి దారితీస్తుంది. – హర్షవర్థన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
ఆర్‌బీఐవైపు మార్కెట్ చూపు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ నిర్ణయాలు, కార్పోరేట్ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు మార్కెట్ పనితీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రూపాయి కదలిక, క్రూడాయిల్ ట్రేడింగ్, మూడో దశ కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే అంశాలుగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వృద్ధి ఆధారిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో గతవారంలో సెన్సెక్స్ 1445 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 17,450 వద్ద మద్దతు స్థాయి, ఎగువ స్థాయిలో 17,800 వద్ద నిరోధాన్ని కలిగి ఉంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నాగరాజ్ శెట్టి తెలిపారు. రేపటి నుంచి ‘పాలసీ’ సమావేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) చివరి, ఆరవ ద్వైమాసిక ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం ప్రారంభమై గురువారం ముగిస్తుంది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేందుకు మొగ్గుచూపుతున్న వేళ ఆర్బీఐ ద్రవ్యవిధాన వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లపైకి చేరడం ఆర్బీఐకి మరో సమస్యగా మారింది. కీలక దశలో కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం కీలక దశకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్, ఏసీసీ, భాష్, పవర్ గ్రిడ్, హీరో మోటోకార్ప్, హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీతో సహా బీఎస్ఈలో నమోదైన 1600కు పైగా కంపెలు ఇదే వారంలో తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇన్వెస్టర్లు ఈ గణాంకాలపై దృష్టి సారించవచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. భయపెడుతున్న బాండ్ ఈల్డ్స్ రాబడులు భారత ప్రభుత్వ పదేళ్ల బాండ్ల రాబడి గతవారం రెండేళ్ల గరిష్టం 6.9 స్థాయికి చేరింది. యూఎస్ పదేళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి 1.9 శాతంపైన ముగిసింది. క్రూడాయిల్ ధరల మంటలు రష్యా– ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు, యూఎస్ మంచు తుఫాన్లతో సప్లై అంతరాయాలు నెలకొని ముడిచమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గడిచిన ఏడు వారాల్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 26 శాతం పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్న వేళ క్రూడ్ ధరలు పెరగడం మంచిది కాదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు ఈ ఫిబ్రవరి తొలి నాలుగు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి రూ.6,834 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల నుంచి రూ.3,173 కోట్లను, డెట్ విభాగం నుంచి రూ.3,173 కోట్లను, హైబ్రిడ్ సెగ్మెంట్ నుంచి రూ.34 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. రేపు అదానీ విల్మర్ లిస్టింగ్ ఇటీవల ఐపీఓ పూర్తి చేసుకున్న అదానీ విల్మర్ షేర్లు మంగళవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో ఇష్యూ ధర (రూ.230) కంటే అధికంగా రూ.25–30 పలుకుతున్నాయి. ఇక ఫిబ్రవరి 4న ప్రారంభమైన మాన్యవర్ మేకర్ ‘వేదాంత ఫ్యాషన్స్’ ఐపీఓ మంగళవారం ముగియనుంది. పాలసీ సమావేశం వాయిదా ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘భారత రత్న లతా మంగేష్కర్ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి మూడు రోజుల జరగాల్సిన కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభమవుతుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను గురువారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడిస్తారు’’ అని ఆర్బీఐ ప్రకటన ఒకటి పేర్కొంది. -
డిపాజిట్ బీమాతో బ్యాంకులపై ధీమా
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిపాజిట్ బీమా సంస్కరణలు .. బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాంకు విఫలమైనా, డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసా ఈ సంస్కరణలతో లభించిందని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని ప్రభుత్వం ఇటీవల రూ. 5 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన పక్షంలో ఈ స్థాయి వరకూ డిపాజిట్లు ఉన్న వారు.. 90 రోజుల్లోగా తమ డబ్బు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. సంబంధిత చట్టాన్ని అమల్లోకి తెచ్చాక గత కొద్ది రోజుల్లో సుమారు 1 లక్ష మంది పైగా ఖాతాదారులకు రూ. 1,300 కోట్ల పైచిలుకు అందిందని ప్రధాని చెప్పారు. ఆర్బీఐ మారటోరియం ఆంక్షలు ఎదుర్కొంటున్న మిగతా బ్యాంకుల్లోని మరో 3 లక్షల మంది ఖాతాదారులకు కూడా త్వరలో వారి డిపాజిట్ మొత్తం లభించగలదని ఆయన తెలిపారు. 16 పట్టణ సహకార బ్యాంకుల డిపాజిట్‌దారుల నుంచి వచ్చిన క్లెయిమ్స్‌కు సంబంధించి తొలి విడత చెల్లింపులను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇటీవలే విడుదల చేసిందని మోదీ చెప్పారు. రెండో విడత డిసెంబర్ 31న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. డిపాజిటర్ల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి..: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని, బ్యాంకులు బాగుండాలంటే డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అటు మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని .. ఆర్థిక సమస్యలతో నిల్చిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. అధిక వడ్డీలకు ఆశపడితే రిస్కు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధిక వడ్డీ రాబడుల కోసం ఆశపడితే అసలుకే ఎసరు వచ్చే ముప్పు ఉంటుందని డిపాజిట్‌దారులను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. అధిక రాబడులు లేదా అధిక వడ్డీ రేట్లతో రిస్కులు కూడా ఎక్కువగానే ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. -
క్రిప్టోలతో మనీలాండరింగ్ భయాలు - ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆందోళన
ముంబై: క్రిప్టో కరెన్సీల వేల్యుయేషన్‌పై స్పష్టత లేకపోవడం, మనీలాండరింగ్ అవకాశాలు ఉండటం వంటి అంశాలే వీటికి సంబంధించి సెంట్రల్ బ్యాంకుల్లో నెలకొన్న ప్రాథమిక అందోళనలని ఆర్బీఐ మాజీ డిప్యుటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రభుత్వం గానీ వీటిని అనుమతిస్తే బ్యాంకర్లు ఆచి తూచి వ్యవహరించాలని ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన సూచించారు. విశ్వనాథన్ సూచనలు క్రిప్టో ఆస్తులను బట్టి వ్యక్తుల సంపదను లెక్కగట్టొద్దని పేర్కొన్నారు. క్రిప్టో అసెట్స్‌ను తనఖా పెట్టకపోయినా.. వాటి విలువ ఆధారంగా రుణాలు ఇవ్వరాదని తెలిపారు. క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన బిల్లును నవంబర్ 29న ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్న నేపథ్యంలో విశ్వనాథన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే క్రిప్టో కరెన్సీల విషయంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఆందోళన చెందుతుంటే.. ప్రభుత్వాలు మాత్రం వీటివైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయో తెలియడం లేదని విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..! -
Cryptocurrency: ఆర్బీఐ ఆందోళన.. నిర్ణయం కేంద్రం పరిధిలో
ముంబై: బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐకి తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నట్లు కూడా గవర్నర్ పేర్కొన్నారు. ఈ అంశాలను కేంద్రానికి తెలిపినట్లు వెల్లడించారు. ఫైనాన్షియల్ స్థిరత్వ కోణంలో ఈ అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోందని అన్నారు. ఇక దీనిపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశం కేంద్రం పరిధిలోనే ఉందని పేర్కొన్నారు. రెండు ఆంగ్ల పత్రికలు నిర్వహించిన ఒక కార్యక్రమంలో శక్తికాంత్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఎకానమీ వృద్ధిరేటు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2021–22 ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతంగా నమోదవుతుందన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ వ్యక్తం చేశారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాలకు అనుగుణంగా క్రమంగా 4 శాతానికి దిగివస్తుందన్న ధీమాను కూడా ఆయన వెలిబుచ్చారు. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక అని ఆయన అన్నారు. ►సెకండ్‌వేవ్ తర్వాత సడలించిన ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోందన్న సంకేతాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పలు ఇండికేటర్ల నుంచి సానుకూల గణాంకాలు వెలువడుతున్నాయి. ►ప్రతి త్రైమాసికం అంతక్రితం త్రైమాసికంతో పోల్చితే ఎకానమీ పురోగమిస్తోంది. జూన్ త్రైమాసికంకన్నా సెప్టెంబర్ త్రైమాసికంలో పరిస్థితులు మరింత ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నాం. ►ద్విచక్ర వాహనాలు, పాసిజర్ కార్ల అమ్మకాలు పెరిగాయి. జీఎస్టీ, ఈ–వే బిల్లుల తీరు బాగుంది. విద్యుత్ వినియోగం, ట్రాక్టర్ అమ్మకాల్లో మెరుగుదల కనిపిస్తోంది. ఇవన్నీ ఎకానమీకి శుభ సూచికలే. ►ఇప్పుడు ఆందోళనఅంతా మూడవ వేవ్ రావచ్చన్న విశ్లేషణల వల్లే. ఇటువంటి సంక్షోభాలను, అవాంతరాలను తట్టుకొని ఎలా నిలబడాలన్న అంశాన్ని ఇంకా వ్యాపార సంస్థలు నేర్చుకోలేదు. ►రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉండేలా చర్యలు తీసుకోవాలన్నది ఆర్బీఐకి కేంద్రం నుంచి నిర్దేశం. ఈ శ్రేణిలోనే ద్రవ్యోల్బణం ఉంటుందని భావిస్తున్నాం. ఈ అంశాన్ని అత్యంత జాగరూకతతో పరిశీలిస్తున్నాం. ►అధిక కమోడిటీ ధరలు, సరఫరాల్లో సమస్యలు ఇంకా ద్రవ్యోల్బణాన్ని ఎగువన ఉంచుతున్నాయి. ఈ అంశాల్లో సవాళ్లును ఎలా ఎదుర్కొనాలన్న అంశాలపై ప్రభుత్వంతో నిరంతరం ఆర్బీఐ చర్చిస్తుంది. వంట నూనెలు, పప్పు దినుసుల ధరలు తగ్గించడానికి కేంద్రం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది. ►సెకండ్‌వేవ్ సవాళ్లు వచ్చినప్పటికీ, జూన్ త్రైమాసికంలో మొండి బకాయిలు స్థిరంగా ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో 7.5 శాతం స్థూల ఎన్పీఏలు ఉంటే, నాన్– బ్యాంకింగ్ విషయంలో ఇది ఇంతకన్నా తక్కువగా ఉంది. ►దివాలా కోడ్ పనితీరు మరికొంత మెరుగుపడాలన్న వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. ఇందుకు కొన్ని చట్ట సవరణలు చేయాలి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదిస్తున్న ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎకానమీ, ద్రవ్యోల్బణం తీరిది... కరోనా ప్రేరిత సవాళ్లతో గడచిన ఆర్థిక సంవత్సరంలో 7.3 క్షీణతను నమోదుచేసుకున్న ఆర్థిక వ్యవస్థ, 2021–22 మొదటి జూన్ త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని సొంతం చేసుకుంది. నిజానికి లోబేస్‌కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో సెకండ్‌వేవ్ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి. 7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్ రేటింగ్స్ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. ఇక రెపోను వరుసగా ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ పరపతి విధాన కమిటీ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తోంది. కోవిడ్–19 నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం, ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి మేలో 6.3 శాతంకాగా, జూన్‌లో స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. చదవండి: Bitcoin: ఆ నిర్ణయం బిట్‌కాయిన్ కొంపముంచింది..! -
ఆర్బీఐ రుణ చికిత్స!
ముంబై: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలను ఆదుకునేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. వ్యక్తులు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు మరింత సమయం ఇచ్చింది. రుణాలను రెండేళ్ల కాలానికి పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది. టీకాల తయారీ సంస్థలు, ఆస్పత్రులు, ల్యాబొరేటరీలు, కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్య రంగం కింద రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతించింది. ఇందు కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.50,000 కోట్ల లిక్విడిటీని(నిధుల లభ్యత) అందించనుంది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు నిధు లు పొందేందుకు ఉద్దేశించిన నిబంధనలను వచ్చే సెప్టెంబర్ 30వరకు సడలించింది. ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు కార్యక్రమం(జీ–సాప్) కింద 2 వారాల్లో రూ.35,000 కోట్లకు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఆర్బీఐ మధ్యంతర నిర్ణయాలను ఆయన బుధవారం ప్రకటించారు. మారటోరియం కాదు.. రుణ పునరుద్ధరణే వాస్తవానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలు ఒక్క విడత రుణ మారటోరియంను మూడు నెలలకు కల్పించాలని ఆర్బీఐని ఇటీవలే కోరాయి. కానీ, ఒక్క విడత రుణ పునరుద్ధరణకు.. అది కూడా రూ.25 కోట్ల వరకు రుణాలకే అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ నిర్ణయించింది. గతేడాది రుణ మారటోరియం ముగిసిన తర్వాత రుణాల పునరుద్ధరణ అవకాశాన్ని వినియోగించుకోని వాటికే ప్రస్తుతం ఈ సదుపాయం రెండేళ్ల కాలానికి లభిస్తుంది. 2021 మార్చి వరకు స్టాండర్డ్ ఖాతాలుగా (సక్రమంగా చెల్లింపులు చేస్తున్న) ఉన్న వాటికి ఈ వెసులుబాటు పరిమితం. 90 శాతం రుణ గ్రహీతలు ఇందుకు అర్హత సాధిస్తారని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంచనా. రూ.50,000 కోట్ల సాయం.. ఆరోగ్య సేవలు, సదుపాయాల రంగంలో ఉన్న కంపెనీలకు రూ.50,000 కోట్లతో ఆన్‌ట్యాప్ లిక్విడిటీ విండోను ఆర్బీఐ ప్రకటించింది. కంపెనీలు దరఖాస్తు చేసుకుంటే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం దీనికింద లభిస్తుంది. రెపో రేటుపై, మూడేళ్ల కాల వ్యవధికి రుణాలు అందిస్తామని.. ఈ విండో 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని శక్తికాంతదాస్ చెప్పారు. బ్యాంకులు ఈ పథకం కింద టీకాల తయారీ కంపెనీలు, టీకాల దిగుమతి దారులు, సరఫరాదారులు, వైద్య పరికరాలు, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, పాథాలజీ ల్యాబ్‌లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల తయారీదారులు, సరఫరాదారులు, కరోనా సంబంధిత ఔషధ దిగుమతిదారులు, లాజిస్టిక్స్ సంస్థలకు తాజా రుణాలను మంజూరు చేయవచ్చు. వీటిని ప్రాధాన్య రంగ రుణాలుగా ఆర్బీఐ పరిగణిస్తుంది. ఈ పథకం కింద మంజూరు చేసే రుణాలతో ప్రత్యేక పుస్తకాన్ని బ్యాంకులు నిర్వహించొచ్చు. బ్యాంకులు తమ దగ్గర మిగులుగా ఉన్న నిధులను కరోనా రుణ పుస్తక పరిమాణం స్థాయిలో ఆర్బీఐ వద్ద ఉంచడం ద్వారా.. రెపో రేటు కంటే 0.25% తక్కువగా వడ్డీని పొందొచ్చు. రూ.35,000 కోట్లతో జీ–సెక్యూరిటీలు ఈ నెలలోనే రూ.35,000 కోట్లతో ప్రభుత్వ సెక్యూరిటీలను (జీ–సెక్‌లు) ఆర్బీఐ కొనుగోలు చేయనుంది. ఆర్బీఐ గత నెలలోనూ రూ.25,000 కోట్లకు జీ–సెక్లను కొనుగోలు చేయడం గమనార్హం. పదేళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్‌ను 6 శాతంలోపునకు తీసుకొచ్చే లక్ష్యంతో, ప్రభుత్వ వృద్ధి కార్యక్రమాలకు మద్దతునిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. జీ–సెక్ ఈల్డ్స్ తగ్గితే ప్రభుత్వానికి ఉపశమనం లభించినట్టే. కేవైసీ విషయంలో ఇబ్బంది పెట్టొద్దు బ్యాంకులు, నియంత్రిత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు 2020 డిసెంబర్ చివరికి కేవైసీ (కస్టమర్ గురించి తెలుసుకోవడం) వివరాలను అప్డేట్ చేయని కస్టమర్ల విషయంలో కఠిన చర్యలకు దిగొద్దని ఆర్బీఐ కోరింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు ఈ అవకాశం కల్పించింది. అలాగే, వీడియో కేవైసీకి అనుమతించింది. 250 మందితో క్వారంటైన్ కేంద్రం కరోనా సంక్షోభంలో కీలక కార్యకలాపాలకు విఘాతం కలగకుండా ఆర్బీఐ ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 250 మంది సిబ్బంది ఈ కేంద్రంలోనే ఉంటూ కీలక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు శక్తికాంతదాస్ తెలిపారు. ఎస్‌ఎఫ్‌బీలకు 10వేల కోట్లు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు (ఎస్ఎఫ్బీలు) ప్రత్యేక దీర్ఘకాలిక రెపో ఆపరేషన్స్ విండో (ఎస్‌ఎల్‌టీఆర్‌వో)ను సైతం దాస్ ప్రకటించారు. ‘‘ప్రస్తుత కరోనా తీవ్రతతో ఎక్కువగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మరింత మద్దతు అందించేందుకు ప్రత్యేకంగా మూడేళ్ల కాల వ్యవధిపై రూ.10,000 కోట్లకు ఎస్‌ఎల్‌టీఆర్‌వో నిర్వహించాలని నిర్ణయించాం. రెపో రేటుకే ఎస్‌ఎఫ్‌బీలకు ఈ నిధులు అందిస్తాం’’ అని దాస్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే, రూ.500 కోట్ల వరకు ఆస్తులు కలిగిన సూక్ష్మ రుణ సంస్థలకు ఎస్ఎఫ్బీలు అందించే రుణాలను ప్రాధాన్యరంగ రుణాలుగా పరిగణిస్తామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. భవిష్యత్తుపై ఎంతో అనిశ్చితి భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి నెలకొందన్నారు దాస్. తాజా సంక్షోభాన్ని ఎదుర్కోగల బలమైన మూలాలపై భారత్ ఉందని అభిప్రాయపడ్డారు. వృద్ధి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు అంగీకరించారు. ‘‘భారత్ బలంగా కోలుకునే క్రమంలో సానుకూల వృద్ధిలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ కర్వ్ వంగిన కొన్ని వారాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా కారణంగా ఏర్పడే పరిస్థితులను ఆర్బీఐ అనుక్షణం పరిశీలిస్తూ అవసరం ఏర్పడితే అన్ని రకాల వనరులను, అసాధారణ సాధనాలను ఆచరణలోకి తీసుకొస్తుంది’’ అని శక్తికాంతదాస్ చెప్పారు. సాధారణ నైరుతి రుతుపవనాలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉపశమిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డిమాండ్ తగ్గుదల కొంతే... డిమాండ్‌పై లాక్డౌన్ల ప్రభావం గతేడాదితో పోలిస్తే మోస్తరుగానే ఉంటుందని శక్తికాంతదాస్ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తాత్కాలికంగా తగ్గిపోవచ్చని, ముఖ్యంగా రిటైల్, ఆతిథ్య రంగాల్లో ఈ పరిస్థితులు ఉంటాయని చెప్పారు. మొత్తం మీద కీలక గణాంకాలు మిశ్రమ సంకేతాలను ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సకాలంలో సరైన నిర్ణయాలు ఆర్బీఐ ప్రకటించిన నిర్ణయాలను నిపుణులు, పరిశ్రమ వర్గాలు ఆహ్వానించాయి. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతున్న క్రమంలో సకాలంలో సరైన నిర్ణయాలను ప్రకటించినట్టు పేర్కొన్నాయి. ఆరోగ్యసంరక్షణ, అనుబంధ రంగాలు పెరిగిన డిమాండ్‌తో, సరఫరా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రూ.50వేల కోట్లతో ఆన్‌టాప్ లిక్విడిటీని ప్రకటించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చేదిగా సీఐఐ పేర్కొంది. ‘చిన్న వ్యాపార సంస్థలు, ఫైనాన్షియల్ సంస్థలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న భారాన్ని ఆర్బీఐ చాలా వరకు గుర్తించింది. వారికి మద్దతుగా చర్యలను ప్రకటించింది. లకి‡్ష్యత వర్గాలను ఉద్దేశించిన చర్యలు ప్రస్తుత తరుణంలో ఎంతో అనుకూలమైనవి’ అని అసోచామ్ వ్యాఖ్యానించింది. పలు రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను తగ్గించే లక్ష్యంతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అనూహ్యమైన నిర్ణయాలు ప్రకటించారు. ప్రకటించిన చర్యలు వినూత్నంగా ఉన్నాయి. కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు రూ.50,000 కోట్ల ప్రత్యేక నిధి ప్రకటించడం అన్నది ఆర్థిక ఆరోగ్యమే కాదు, ప్రజారోగ్యం ఎదుర్కొంటున్న సమస్యలపైనా దృష్టి పెట్టినట్టుంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ సరైన సమయంలో ప్రకటించిన లిక్విడిటీ చర్యలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గాలకు ఉపశమనం కల్పిస్తాయి. వ్యక్తులు, చిన్న పరిశ్రమలకు నిధులు లభించేలా చేస్తాయి. – శక్తి ఏకాంబరం, కోటక్ మహీంద్రా బ్యాంకు గ్రూపు ప్రెసిడెంట్ దిగజారుతున్న పరిస్థితులకు స్పందనగా ఆర్బీఐ.. వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రూ.25 కోట్ల వరకు రుణాలను ఒక్కసారి పునరుద్ధరించుకునే అవకాశాన్నిచ్చింది. గతేడాది ఇచ్చిన మారటోరియంతో పోలిస్తే ఈ చర్య చిన్నదే. పునరుద్ధరించుకునే రుణాల పరిమాణం తక్కువగానే ఉంటుంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత దిగజారే అవకాశం ఉందని ఈ చర్యలు తెలియజేస్తున్నాయి. – మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ -
కోత లేదు.. పెంచేదీ లేదు!
ముంబై: ఆర్థికవేత్తలు, నిపుణుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్కడి రేటు అక్కడే ఉంచడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రస్తుతం రెపో 4 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో) మూడు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలను వ్యక్తం చేస్తున్న ఆర్బీఐ, రేటు తగ్గింపునకు మొగ్గు చూపే సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ శుక్రవారమూ ఏకగ్రీవంగా ఇదే విధానాన్ని పునరుద్ఘాటించింది. తద్వారా వృద్ధికి తగిన మద్దతు ఆర్బీఐ నుంచి ఉంటుందని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ తరువాత, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్వహించిన మొట్టమొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఇది. ఏప్రిల్‌లో తదుపరి సమీక్ష ఏప్రిల్ 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య ఎంపీసీ 28వ తదుపరి సమావేశం జరుగుతుంది. మే నాటికి సీఆర్ఆర్ 4 శాతానికి ‘రివర్స్’ కాగా, రెపో రేటును తగ్గించని ఆర్బీఐ పాలసీ సమీక్ష, రివర్స్ రెపో రేటు (బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగులు నిధులను తన వద్ద డిపాజిట్ చేసినప్పుడు ఇందుకు ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) కూడా 3.35 శాతంగానే కొనసాగుతుందని తన తాజా పాలసీలో ఆర్బీఐ స్పష్టంచేసింది. ఫిబ్రవరి తర్వాత ఈ రేటు కూడా 155 పాయింట్లు తగ్గి, 4.9 శాతం నుంచి 3.35 శాతానికి దిగివచ్చింది. ఇక బ్యాంకులు తమ నిధుల్లో తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద నిర్వహించాల్సిన మొత్తం క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను మార్చి 27 నాటికి 3.5 శాతానికి, మే 22 నాటికి 4 శాతానికి పెంచుతున్నట్లు ఆర్బీఐ పాలసీ ప్రకటించింది. ప్రస్తుతం సీఆర్ఆర్ 3 శాతంగా ఉంది. అంటే బ్యాంకుల వద్ద ప్రస్తుతం ఉన్న నిధుల్లో మరికొంత మొత్తం ఆర్బీఐకి చేరుతుందన్నమాట. తద్వారా తన వద్దకు తిరిగి వచ్చే ‘మరిన్ని’ నిధులను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్‌కు అలాగే ఇతర లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) చర్యలకు సెంట్రల్ బ్యాంక్ వినియోగించనుంది. డిసెంబర్ నాటికి 4.3 శాతానికి ద్రవ్యోల్బణం ఆర్బీఐ తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతంగా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2021–22 ఏప్రిల్–సెప్టెంబర్) సగటున ఈ రేటు 5 శాతానికి తగ్గుతుంది. మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 4.3 శాతానికి దిగివస్తుంది. ఇదే కారణంగా కీలక రేటు విధానం సరళతరంగా ఉంచడానికే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. అంటే వడ్డీరేట్లు వ్యవస్థలో మరింత తగ్గడానికే అవకాశం ఉంది తప్ప, పెంచే యోచనలేదని భావించవచ్చు. ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్ దన్ను! భారత్ ఆర్థిక వ్యవస్థ ఒకేఒక్క దిశలో.. అదీ పురోగమన బాటలో ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. 2021–22లో ఎకానమీ 10.5% వృద్ధిని (ఎకనమిక్ సర్వే 11% కన్నా తక్కువ కావడం గమనార్హం) నమోదు చేసుకుంటుందన్న భరోసాను ఆయన ఇచ్చారు. మౌలిక రంగం, ఆరోగ్యం వంటి కీలక రంగాల పునరుత్తేజానికి ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తగిన చర్యలను ప్రకటించిందని తెలిపారు. ఆయా అంశాల దన్నుతో 2021–22 మొదటి ఆరు నెలల్లో వృద్ధి 26.2%–8.3% శ్రేణిలో ఉంటుందని, 3వ త్రైమాసికంలో 6% వృద్ధి నమోదవుతుందని తెలిపింది. బ్యాంకులకు నిధుల లభ్యత అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకింగ్ ఆర్బీఐ నుంచి నిధులు పొందడానికి సంబంధించిన మార్జినల్ స్టాండింగ్ సౌలభ్యత (ఎంఎస్ఎఫ్)ను ఆర్బీఐ మరో ఆరు నెలలు పొడిగించింది. దీనివల్ల రూ.1.53 లక్షల కోట్లు బ్యాంకింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది మార్చి నుంచీ ఈ పొడిగింపులను ఆర్బీఐ కొనసాగిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్‌కు అందుబాటులో బాండ్ మార్కెట్ ప్రభుత్వ బాండ్ మార్కెట్లోకి రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా పాల్గొనడానికి అనుమతినిస్తూ, ఇందుకు సంబంధించి కీలక సంస్కరణాత్మక చర్యకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. తద్వారా ఇలాంటి సౌలభ్యం కల్పిస్తున్న నిర్దిష్ట దేశాల జాబితాలో భారత్ కూడా చేరినట్లయ్యింది. ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్లు ప్రైమరీ ఆక్షన్లు, సాŠట్క్ ఎక్సే్చంజీల్లో నాన్–కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలుచేసే అవకాశం ఉంది. ఆర్బీఐ నిర్ణయం ప్రకారం ఇకపై ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా ఆర్బీఐ నుంచే ప్రభుత్వ బాండ్లను రిటైల్ ఇన్వెస్టర్ కొనుగోలు చేయగలుగుతాడు. దీనిని రిటైల్ డైరెక్ట్ అని వ్యవహరిస్తారు. ఆర్బీఐతో ప్రత్యక్షంగా నిర్వహించే గిల్ట్ అకౌంట్ల ప్రారంభం ద్వారా ఈ ఇన్స్ట్రమెంట్ లావాదేవీలు సాధ్యమవుతాయి. అసలు, వడ్డీ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ సెక్యూరిటీలు అత్యంత సురక్షితమైన సాధనాలు కావడం గమనార్హం. ఈ విధమైన చర్య తీసుకున్న మొదటి ఆసియా దేశం. అమెరికా, బ్రెజిల్‌ల్లో ఇప్పటికే పరోక్ష ఎంట్రీనే ఉంది. ఈ నిర్ణయం వల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతాయని తాము భావించడం లేదని కూడా ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేయడం గమనార్హం. కరోనా కష్టకాలాన్ని ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం మార్కెట్ రుణ సమీకరణలను బడ్జెట్ భారీగా పెంచిన నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. 2021–22లో ఈ మొత్తాలను స్థూలంగా రూ.12.05 లక్షల కోట్లుగా నిర్దేశించింది. అయితే 2020–21లో 64% పెంచి రూ.12.8 లక్షల కోట్లకు తాజా బడ్జెట్ సవరించిన సంగతి తెలిసిందే. డిజిటల్ పేమెంట్ల వివాదాల పరిష్కారానికి యంత్రాంగం ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల పెరిగేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, ఈ విభాగంలో వివాదాల సత్వర పరిష్కారంపైనా ఆర్బీఐ పాలసీ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి వివాదాల పరిష్కారానికి నిరంతరాయంగా పనిచేసే (24 గీ7) హెల్ప్‌లైన్ ఏర్పాటు ప్రతిపాదన చేసింది. దిగ్గజ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు ఇందుకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్బీఐ జారీచేసిన ‘డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీ’ ప్రకటన స్పష్టం చేసింది. ఒకే దేశం– ఒకే అంబుడ్స్‌మన్ బ్యాంకింగ్ వివాదాల పరిష్కారం విషయంలో ఒకే దేశం– ఒకే అంబుడ్స్‌మన్ విధానాన్ని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది. తద్వారా అంబుడ్స్‌మన్ పథకాలన్నింటినీ ఏకీకృతం చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు అనుగుణంగా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ వ్యవస్థను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ విషయంలో మూడు (బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీలు, డిజిటల్ లావాదేవీలు) అంబుడ్స్‌మన్ విధానాలు అమల్లో ఉన్నాయి. తాజా నిర్ణయం వల్ల మరింత సరళతర వ్యవస్థ రూపొందుతుందని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. జూన్ 2021 నుంచీ తాజా వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్‌బీఎఫ్‌సీలకు మరిన్ని నిధులు! బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లకు మరిన్ని నిధులను అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ (టీఎల్టీఆర్ఓ) ప్రయోజనాలను ఎన్బీఎఫ్సీలకూ విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలుసహా ద్రవ్య లభ్యత ఇబ్బందుల్లో ఉన్న రంగాలకు నిధులు సమకూర్చడానికి ఎన్బీఎఫ్సీలు బ్యాంకింగ్ నుంచి టీఎల్టీఆర్ఓ కింద నిధులను పొందగలుగుతాయి. కరోనా మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో వివిధ రంగాలకు ద్రవ్య లభ్యత కల్పించే ఉద్దేశంతో బ్యాంకులకు టీఎల్టీఆర్ఓ స్కీమ్ కింద 2020 అక్టోబర్‌లో ఆర్బీఐ రూ. లక్ష కోట్లకు ప్రకటించింది. ఈ స్కీమ్ కింద తమకూ నిధులను అందించాలని ఎన్బీఎఫ్సీలు కొంతకాలంగా సెంట్రల్ బ్యాంక్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎన్పీఏల వాస్తవికతపై మదింపు బ్యాంకింగ్‌లో ఉన్న మొండిబకాయిల (ఎన్పీఏ) విషయంలో వాస్తవికతను ఆర్బీఐ తనకుతానుగా మరింత లోతుగా మదింపు చేస్తున్నట్లు శక్తికాంతదాస్ ప్రకటించారు. తద్వారా రుణ నాణ్యత విషయంలో స్పష్టమైన అభిప్రాయానికి రావడం జరుగుతుందని చెప్పారు. పీఎంసీ బ్యాంక్.. మూడు ఆఫర్లు పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) సంక్షోభ పరిష్కారానికి ముగ్గురు ఇన్వెస్టర్ల నుంచి తుది ఆఫర్లు అందినట్లు తనకు సమాచారం ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. వీటిని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల పటిష్టతకు ‘మధ్యకాలికంగా అవసరపడే’ ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందించడానికి త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆలోచనాపూర్వక పాలసీ... వృద్ధికి మద్దతు, రుణ నిర్వహణ, ద్రవ్య లభ్యత వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఆలోచనాపూర్వక పాలసీ ఇదీ. వృద్ధే లక్ష్యంగా రూపొందించిన 2021–22 బడ్జెట్‌తో కలిసి తాజా విధాన నిర్ణయాలు కరోనా సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ రియల్టీకి ప్రయోజనం.. వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు తగిన నిర్ణయాలను ఆర్బీఐ తీసుకుంది. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీలకు టీఎల్టీఆర్ఓ ప్రయోజనాలను విస్తరించడం రియల్టీసహా ద్రవ్య లభ్యత సమస్యలను ఎదుర్కొంటున్న పలు రంగాలకు దోహదపడుతుంది. తక్కువ వడ్డీరేట్ల వల్ల హౌసింగ్ రంగంలో డిమాండ్ ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. –శశిధర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ రికవరీ పటిష్టతకు దోహదం ఇప్పటికే ఎకానమీ రికవరీ వేగవంతమైంది. సెంట్రల్ బ్యాంక్ తాజా పాలసీ నిర్ణయాలు ఈ రికవరీ బాటను మరింత పటిష్టం చేస్తాయని భావిస్తున్నాం.చిన్న పరిశ్రమలకు ద్రవ్య లభ్యతకు పాలసీ తగిన నిర్ణయాలను తీసుకోవడం హర్షణీయం. సరళ విధానాన్ని పునరుద్ఘాటించడం వృద్ధికి భరోసాను ఇచ్చే అంశం. –ఉదయ్ శంకర్, ఫిక్కీ ప్రెసిడెంట్ డిమాండ్ బలపడుతోంది... కరోనా మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో తొలుత వ్యవస్థలో కనబడిన డిమాండ్ విషయంలో కొంత సంశయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వ్యవస్థలో వాస్తవిక డిమాండ్ కనబడుతుంది. ఇదే ధోరణి కొనసాగి, పటిష్టమవుతుందని భావిస్తున్నాం. దీనితోపాటు వృద్ధి–ద్రవ్యోల్బణం సమతౌల్యత తత్సంబంధ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సరళతర ఆర్థిక, ద్రవ్య విధానాలవైపే మొగ్గుచూపాలని పరపతి విధాన కమిటీ నిర్ణయించింది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
ఆర్బీఐ మూడో‘సారీ’..
ముంబై: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (ఆర్బీఐ–ఎంపీసీ) ప్రధాన నిర్ణయం వెలువడింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 4 శాతంగానే కొనసాగించాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతను దీనికి కారణంగా చూపింది. ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 4% స్థాయిలో ఉండాలి. అయితే దీనికి మించి కొనసాగుతోంది. క్యూ4లో 5.8 శాతానికి ద్రవ్యోల్బణం! అక్టోబర్–డిసెంబర్ (క్యూ3), జనవరి–మార్చి (క్యూ4) కాలాల్లో ద్రవ్యోల్బణం వరుసగా 6.8 శాతం, 5.8 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ అంచనావేసింది. ఈ అంచనాల నేపథ్యంలో సరళతర వడ్డీరేట్ల విధానమే కొనసాగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. తద్వారా ద్రవ్యోల్బణం తగ్గితే వడ్డీరేట్లూ మరింత దిగివస్తాయని సూచించింది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. అకాల వర్షాలు, కార్మికుల కొరత, సేవల వ్యయాల తీవ్రత, అధిక కమోడిటీ ధరలు, పన్నులు, సరఫరాల్లో సమస్యల వంటి పలు సమస్యలు టోకు, రిటైల్ ధరల పెరుగుదలకు కారణాలని ఆర్బీఐ పాలసీ సమీక్ష విశ్లేషించింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు 1%) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటైల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న విశ్లేషణ చేస్తున్న ఆర్బీఐ, సరళతర పరపతి విధానాన్నే పాటించడానికి మొగ్గుచూపుతోంది. ఇక రెపో రేటు తగ్గించని నేపథ్యంలో.. రివర్ రెపో రేటు (బ్యాంకులు తన వద్ద డిపాజిట్‌చేసే అదనపు నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) కూడా యథాపూర్వం 3.35 శాతంగానే కొనసాగనుంది. డిపాజిటర్లకు ఊరట ఆర్బీఐ పాలసీ కమిటీ తాజా నిర్ణయం ప్రకారం, రుణ గ్రహీతలకు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల (ఈఎంఐ)ల భారం తగ్గే అవకాశాలు తక్కువ. అయితే ఇది డిపాజిట్లకు ఊరటనిచ్చే అంశం. బ్యాంకులు ఎఫ్డీలపై తదుపరి వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు లేవు. ఇప్పటికే ఏడాది ఆపైన కాలపరిమితుల స్థిర డిపాజిట్ రేటు 4.90–5.50% శ్రేణిలో ఉన్నాయని, ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది నెగెటివ్ రిటర్న్స్ అనీ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. వడ్డీరేట్లు మరింత తగ్గి, ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంటే అది పొదుపులు, డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లపై ప్రతికూల ప్రభావం చూపి సమీపకాలంలో వృద్ధికి విఘాతం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ఆర్బీఐ పాలసీ ప్రకటన స్పష్టం చేసింది. ద్రవ్య లభ్యతకు లోటుండదు ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత)కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చర్యలు ఉంటాయని ఆర్బీఐ భరోనాను ఇచ్చింది. ఇందుకు అవసరమైన సమయంలో అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. కార్పొరేట్ బ్యాండ్స్ మరింత విస్తరించడానికీ చర్యలు ఉంటాయని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పురోగతి 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత 9.5 శాతం ఉంటుందని ఆర్బీఐ తాజా సమీక్షలో అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో స్థూల జీడీపీ భారీగా 23.9 శాతం క్షీణత దీనికి నేపథ్యం. అయితే ఈ అంచనాలను తాజాగా 7.5 శాతానికి మెరుగుపరిచింది. అలాగే గత సమీక్ష సందర్భంగా నాల్గవ త్రైమాసికంలోనే స్వల్ప వృద్ధి రేటు (0.5%) నమోదవుతుందని పేర్కొంది. తాజాగా ఈ అంచానాలనూ మెరుగుపరిచింది. మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 0.1%, నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) 0.7% వృద్ధి రేట్లు నమోదవుతాయని పేర్కొంది. అక్టోబర్ పాలసీ సమీక్షలో డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 5.6% క్షీణత నమోదవుతుందని అంచనావేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ క్షీణత అంచనాలకన్నా మెరుగ్గా 7.5%గా నమోదుకావడం తెలిసిందే. నగదు వినియోగం తగ్గింపు చర్యలు కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీ పరిమితి పెంపు కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచుతూ పాలసీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 14వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. నిరంతరాయంగా ఆర్టీజీఎస్... భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (ఆర్టీజీఎస్) ఇక నిరంతరాయంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆర్టీజీఎస్ సేవలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి నెలా రెండు, నాలుగు శనివారాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉండడం లేదు. 2019 డిసెంబర్లో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ఈఎఫ్టీ) వ్యవస్థ నుంచి నిరంతరాయ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రూ.2 లక్షల వరకూ లావాదేవీలకు ఎన్ఈఎఫ్టీ సేవలను పొందవచ్చు. డిజిటల్ లావాదేవీల పెంపు లక్ష్యంగా 2019 జూలై నుంచి ఎన్ఈటీఎఫ్, ఆర్టీజీఎస్ ద్వారా లావేదేవీలపై చార్జీలను ఆర్బీఐ నిలుపుచేసింది. ప్రాఫిట్, డివిడెండ్లపై బ్యాంకులకు వరం... కోవిడ్–19 మహమ్మారి సవాళ్లను ఎదుర్కొనడానికి వీలుగా 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు లాభాలను తమవద్దే ఉంచుకోవాలని, డివిడెండ్లను చెల్లించవద్దని ఆర్బీఐ సూచించింది. కష్ట నష్టాలను ఎదుర్కోడానికి మద్దతుగా అలాగే రుణ మంజూరీలకు మూలధన నిర్వహణ కీలకమని ఈ సందర్భంగా పేర్కొంది. లాభాలు తమవద్దే ఉంచుకోవడం, అలాగే డివిడెండ్ చెల్లింపుల నిలిపివేతలకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కూడా తెలిపింది. బ్యాంకుల తరహాలో డివిడెండ్ పంపిణీకి సంబంధించి ఎన్‌బీఎఫ్‌సీలకు మార్గదర్శకాలు ఏమీ లేవని కూడా ఈ సందర్భంగా ఆర్బీఐ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో జనవరిలో సమగ్ర మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. వృద్ధికి ఊతం– ఆర్థిక స్థిరత్వం లక్ష్యం ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వడానికి, ఆర్థిక స్థిరత్వానికి తగిన చర్యల తీసుకుంటున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ‘ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాల నేపథ్యంలో సరళతర ద్రవ్య పరపతి విధానాన్నే ఆర్బీఐ కొనసాగించనుంది. మహమ్మారి ప్రభావాన్ని జాగ్రత్తగా అంచనావేస్తూ, ఆర్థిక వ్యవస్థ పురోగతికి తగిన నిర్ణయాలను తీసుకుంటాం. ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ చెందుతోందని కీలక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్‌లో పాసింజర్, మోటార్‌సైకిల్ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి కనబడుతోంది. రైల్వే రవాణా పెరిగింది. విద్యుత్ డిమాండ్ మెరుగుపడింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ), అర్బన్ సహకార బ్యాంకులపై నిర్వహణా పరంగా మరింత పర్యవేక్షణ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ మరింత పటిష్టం అవుతోంది. పట్టణ డిమాండ్ మరింత మెరుగుపడుతోంది. వ్యాక్సిన్ వస్తోందన్న వార్తలు ఆశావహ పరిస్థితులను మెరుగుపరుస్తోంది. రానున్న 2021–22 బడ్జెట్ వృద్ధికి దోహదపడేదిగా ఉంటుందని విశ్వసిస్తున్నాం’ అని చెప్పారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్... ఆర్బీఐ యోచనకాదు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949కు అవసరమైన సవరణలు చేస్తూ, స్వయంగా బ్యాంకులను తెరవడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ చేసిన సిఫారసు అంశాన్ని ఆర్బీఐ గవర్నర్ తన పాలసీ ప్రకటనలో ప్రస్తావించారు. ఈ ప్రతిపాదన ఆర్బీఐ అంతర్గత కమిటీ చేసిన సూచన తప్ప, ఆర్బీఐది కాదన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రేటింగ్ దిగ్జజం ఎస్అండ్పీ సహా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, ప్రపంచబ్యాంక్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు ఈ ప్రతిపాదనను బహిరంగంగానే తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. డిజిటల్ బ్యాంకింగ్‌పై విశ్వాసం పెంచాలన్నదే లక్ష్యం... కొత్త కార్డుల జారీ నిలిపివవేతసహా హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై తీసుకున్న పలు చర్యలను ఆర్బీఐ గవర్నర్ పాలసీ ప్రకటన సందర్భంగా ప్రస్తావించారు. డిజిటల్ బ్యాంకింగ్ పట్ల వినియోగదారుల విశ్వాసాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించాలన్నదే ఆర్బీఐ నిర్ణయం ఉద్దేశమని తెలిపారు. సాంకేతిక విభాగంపై బ్యాంకర్లు మరింత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ వ్యవస్థ పటిష్టతకు తగిన చర్యలన్నింటినీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాజమాన్యం తీసుకుంటుందన్న విశ్వాసాన్నీ దాస్ వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆన్లైన్ సేవల అంతరాయల అంశాన్ని కూడా ఆర్బీఐ పరిశీలిస్తోందని తెలిపారు. వృద్ధికి దోహదం యథాతథ వడ్డీరేట్ల విధానాన్ని సెంట్రల్ బ్యాంక్ కొనసాగిస్తుందన్నది ఊహించిందే. అయితే సరళతర ఆర్థిక విధానాన్ని కొనసాగిస్తున్నట్లు చేస్తున్న ప్రకటన వృద్ధికి, మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం. పటిష్ట డిమాండ్ కొనసాగడానికి దోహదపడుతుంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ అరశాతం వరకూ తగ్గే చాన్స్ వృద్ధి పునరుద్ధరణ లక్ష్యంగా రెపో రేటు మరింత తగ్గడానికి తగిన వెసులుబాటు ఉంది. 2020–21 తదుపరి ద్వైమాసిక సమీక్షల సందర్భంగా రేటు పావు శాతం నుంచి అరశాతం వరకూ తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడికి పటిష్ట చర్యలు అవసరం. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ప్రోత్సాహకరం.. ఆర్థిక వ్యవస్థ క్షీణ రేట్లు సవరిస్తూ పాలసీ నిర్ణయం ప్రోత్సాహకరమైనది. కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలతో దేశం ఆర్థిక పురోగతితో వచ్చే ఏడాదిలోకి ప్రవేశిస్తుందని మేము ఆశిస్తున్నాం. సరఫరాల వ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉంటుంది. –సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ గృహ డిమాండ్‌కు ఊతం సరళతర ద్రవ్య పరపతి విధానాన్నే కొనసాగిస్తున్నట్లు పాలసీ ప్రకటన గృహ డిమాండ్‌కు ఊతం ఇవ్వడానికి దోహదపడుతుంది. తగిన వడ్డీరేట్లు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. డిమాండ్ పునరుద్ధరణ దిశలో ప్రత్యేకించి మధ్య తరగతికి హర్షదాయకమైన పాలసీ నిర్ణయం ఇది. – నిరంజన్ హిరనందని, నరెడ్కో ప్రెసిడెంట్ వడ్డీరేట్ల తగ్గింపు కష్టమే రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో రేటు తగ్గింపు కష్టం. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి ఉంటుందని భావిస్తున్నాం. అయితే సరళతర విధానాన్నే కొనసాగించాలన్న నిర్ణయం దీర్ఘకాలంపాటు వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయనడానికి సంకేతంగా భావించవచ్చు. – అదితీ నయ్యర్, ప్రిన్సిపల్ ఎకనమిస్ట్, ఐసీఆర్ఏ -
ఆర్బీఐ గవర్నర్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. తనకు కరోనా సోకిన నేపథ్యంలో తనతో సన్నిహితంగా మెలిగినవారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఐసోలేషన్ లోనే విధులు నిర్వర్తించనున్నానని చెప్పారు. నలుగురు డిప్యూటీ గవర్నర్లు బీపీ కనుంగో, ఎంకే జైన్, ఎండి పత్రా, ఎం రాజేశ్వర్ రావు నేతృత్వంలో బలంగా ఉన్న ఆర్బీఐ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని గవర్నర్ ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభం, లాక్ డౌన్ కాలంలో కార్యకలాపాలను సమీక్షిస్తూ, ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాలతో గవర్నర్ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. కాగా దేశంలో కరోనా విస్తరణ కాస్త తగ్గుముఖంపట్టినట్టు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం నాటి గణాంకాల ప్రకారం 78 లక్షలకు పైగా కేసులు నమోదవగా, మరణాల సంఖ్య 1.18 లక్షలకు చేరుకుంది. I have tested COVID-19 positive. Asymptomatic.Feeling very much alright.Have alerted those who came in contact in recent days.Will continue to work from isolation. Work in RBI will go on normally. I am in touch with all Dy. Govs and other officers through VC and telephone. — Shaktikanta Das (@DasShaktikanta) October 25, 2020 -
ఆర్బీఐ ఎంపీసీ సమావేశం వాయిదా
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశ తేదీలను తరువాత ప్రకటించడం జరుగుతుందని ఆర్బీఐ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు (సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1) ఈ కీలక భేటీ జరగాల్సి ఉంది. కమిటీలో స్వతంత్ర సభ్యుల నియామకంలో జరిగిన ఆలస్యం, దీనితో సమావేశం నిర్వహణకు సంబంధించి పాల్గొనాల్సిన కనీస సభ్యుల సంఖ్య (కోరమ్) తగ్గే అవకాశాలు ఏర్పడ్డం వంటి అంశాలు ఎంపీసీ సమావేశం వాయిదాకు కారణమని తెలుస్తోంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)సహా ఆర్థిక రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం తీసుకునే కీలక సాంప్రదాయం 2016 అక్టోబర్ నుంచీ ప్రారంభమైంది. ఇందులో సగం మంది సభ్యులు బయటివారు(ఎక్స్టర్నల్). అలాగే కమిటీలో వీరు స్వతంత్ర సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల బాధ్యతల కాలం నాలుగేళ్లు. గత నెలతో వీరి పదవీకాలం ముగిసిపోయింది. అయితే కొత్తవారి నియామకం జరగలేదు. పాతవారి పునఃనియామకం అవకాశం ఉండదు. సమావేశంలో కనీసం నలుగురు సభ్యులు పాల్గొనాల్సి ఉంది. గవర్నర్ లేదా కమిటీలో సభ్యులుగా ఉన్న ఆయన డిప్యూటీ (పరపతి విధానం ఇన్చార్జ్) సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. కమిటీలో ఆర్బీఐ తరఫున సెంట్రల్ బోర్డ్ నియమించిన మరో సీనియర్ అధికా రి కూడా సభ్యులుగా ఉంటారు. బయటి నుంచి కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించేందుకు ఈ ఏడాది మొదట్లో ఒక కమిటీ ఏర్పాటైంది. క్యాబినెట్ కార్యదర్శి, ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ ఎంపీసీ చివరి 24వ సమావేశం జరిగింది. -
26 రంగాలకు రుణ పునర్వ్యవస్థీకరణ
ముంబై: కరోనా నేపథ్యంలో చెల్లింపులు ఆగిపోయిన రుణాలను పునర్వ్యవస్థీకరించే విషయమై కేవీ కామత్ ప్యానెల్ సమర్పించిన సిఫారసులకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. రుణాల పునర్వ్యవస్థీకరణ విషయంలో ఐదు రకాల ఫైనాన్షియల్ రేషియోలు, 26 రంగాలకు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిమితులను ప్యానెల్ సూచించింది. మాజీ బ్యాంకర్ కేవీ కామత్ అధ్యక్షతన రుణాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన సూచనల కోసం ఆగస్ట్ 7న ఆర్బీఐ ప్యానెల్‌ను నియమించగా, ఈ నెల 4న ప్యానెల్ ఆర్బీఐకి తన నివేదికను సమర్పించింది. ఈ సిఫారసులకు పూర్తిగా అంగీకారం తెలిపినట్టు సోమవారం ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. కరోనాకు ముందు రుణగ్రహీత ఆర్థిక పనితీరు, కరోనా కారణంగా కంపెనీ నిర్వహణ, ఆర్థిక పనితీరుపై పడిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని రుణ పరిష్కార ప్రణాళికను ఖరారు చేయాలని సెంట్రల్ బ్యాంకు ఆదేశించింది. కామత్ ప్యానెల్ ఎంపిక చేసిన 26 రంగాల్లో.. విద్యుత్, నిర్మాణం, ఐరన్ అండ్ స్టీల్ తయారీ, రోడ్లు, రియల్టీ, టెక్స్టైల్స్, కెమికల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్/ఎఫ్ఎంసీజీ, నాన్ ఫెర్రస్ మెటల్స్, ఫార్మా, లాజిస్టిక్స్, జెమ్స్ అండ్ జ్యుయలరీ, సిమెంట్, వాహన విడిభాగాలు, హోటళ్లు, మైనింగ్, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, వాహన తయారీ, ఆటో డీలర్‌షిప్‌లు, ఏవియేషన్, చక్కెర, పోర్ట్‌లు, షిప్పింగ్, బిల్డింగ్ మెటీరియల్స్, కార్పొరేట్ రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. ఐదు రంగాలకు సంబంధించి రేషియోలను సూచించకుండా.. బ్యాంకుల మదింపునకు విడిచిపెట్టింది. -
ఎకానమీకి ‘రుణ’ పునరుత్తేజం!
ముంబై: బ్యాంకింగ్ రుణ పునర్వ్యవస్థీకరణ ఆర్థికరంగం పునరుత్తేజానికి దోహదపడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ విశ్లేషించారు. రుణ పునఃచెల్లింపులకు తగిన సమయం కల్పించడం వల్ల ద్రవ్య లభ్యత విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంస్థలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆయన అన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణ వల్ల వ్యాపార పునరుద్ధరణ జరుగుతుందని, దీనితో ఉపాధి అవకాశాలకు విఘాతం కలగదని గవర్నర్ అన్నారు. అంతిమంగా ఇది ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందన్నారు. ఒక వార్తా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► భారత స్టాక్ మార్కెట్ సర్దుబాటు జరగాలి. వాస్తవ ఆర్థిక పరిస్థితిని మార్కెట్ ప్రతిబింబించడం లేదు. ► ఒకవైపు బ్యాంకుల ఆర్థిక పరిపుష్ఠి ఎంతో ముఖ్యమైన అంశం. మరోవైపు కోవిడ్–19 నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న చిన్న వ్యాపార సంస్థల ప్రయోజనాల పరిరక్షణా ముఖ్యం. ఈ రెండు అంశాల సమతౌల్యతకు తగిన ప్రయత్నం జరుగుతుంది. ► రుణ చెల్లింపులపై మారటోరియం గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతుంది. ‘‘మారటోరియం’’ అనేది తాత్కాలిక పరిష్కార మార్గమే. దీనిని దీర్ఘకాలికంగా కొనసాగించలేము. ► ఆరు నెలల మారటోరియం ముగిసిపోతే, మొండిబకాయిలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన ఉంది. అయితే ఒక కొత్త ప్రణాళిక కింద కొత్త మారటోరియం విధానం తీసుకురావడం, లేదా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత మారటోరియంనే కొనసాగించడం వంటి చర్యలు తీసుకోడానికి బ్యాంకులకు తగిన సౌలభ్యత ఉంటుంది. ► కరోనా వైరస్ నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతునివ్వడానికి పాలనా, అధికార యంత్రాంగం తగిన ప్రయత్నాలు అన్నీ చేస్తోంది. మొండిబకాయిలు 2 దశాబ్దాల గరిష్టానికి చేరిన నేపథ్యంలో ఫైనాన్షియల్ రంగం స్థిరత్వం అవసరం. ఆర్థిక వృద్ధికి దోహదపడే దిశలో రుణ వృద్ధి జరిగేందుకు బ్యాంకులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్బీఐ అవసరమైన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. ► కంపెనీల రుణ పునర్వ్యవస్థీకరణ విషయంలో నియమించిన నిపుణుల కమిటీ త్వరలో తన సిఫారసులను చేయనుంది. అనంతరం ఈ విషయంలో అనుసరించాల్సిన విధానాలను సెప్టెంబర్ 6 లోపు ప్రకటించడం జరుగుతుంది. ఏ అకౌంట్‌కు సంబంధించి రుణ పునర్వ్యవస్థీకరణ అవసరమో బ్యాంకులు అంతర్గతంగా ఒక నిర్ధారణకు రాగలుగుతాయి. ► రుణ పునర్వ్యవస్థీకరణ రియల్టీ రంగానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాం. ► కరోనాపై పోరులో మనం విజయం సాధిస్తాము. అయితే దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను. అయితే విజయం మాత్రం కచ్చితంగా మనదే. ► సరళతర ద్రవ్య పరపతి విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. వడ్డీరేట్లు తగ్గుదలకే అవకాశం ఉంది. అయితే అత్యంత జాగరూకత, పరిపక్వతతో ఈ విధానాన్ని రూపొందించాల్సి ఉంది. ద్రవ్యోల్బణం అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై నిర్ణయించాల్సింది కేంద్రమే. దీనిపై కేంద్రం అడిగితే, ఆర్బీఐ తన అభిప్రాయాలను తెలియజేస్తుంది. ► ప్రైవేటు బ్యాంకుల యాజమాన్య సమీక్షకు ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌లో ఇది తుది నివేదికను అందజేస్తుంది. మొండిబకాయిల ప్రస్తుత స్థితి... 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఇటీవల విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. రుణ నిబంధనలు తరచూ మార్చేయొద్దు బ్యాంకులకు ఆర్బీఐ సూచన ముంబై: వ్యాపార సంస్థలకిచ్చే రుణాలకు సంబంధించిన నిబంధనలను సహేతుక కారణాలు లేకుండా తరచూ మార్చేయొద్దని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు సూచించింది. రుణ సదుపాయాలను సమీక్షించేందుకు క్రమబద్ధంగా నిర్దిష్ట కాలవ్యవధిని నిర్దేశించాలని, మధ్యలో పదే పదే సమీక్షలు జరపడాన్ని నివారించాలని పేర్కొంది. సమీక్ష ఎప్పుడెప్పుడు జరపాలి, ఏ విధానాలను పాటించాలి తదితర అంశాలకు సంబంధించి బోర్డు ఆమోదిత విధానాన్ని రూపొందించుకోవాలని తెలిపింది. బ్యాంకులు ఒక్కో రకంగా భారీ స్థాయిలో వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వం ఉద్దీపనలు ఇస్తున్నా వ్యాపార సంస్థలకు తగు విధంగా ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఆర్బీఐ... బంగారం భరోసా!
ముంబై: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆర్థిక రంగానికి ఊతం అందించడానికి తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను పావుశాతం తగ్గిస్తుందన్న అంచనాలకు భిన్నంగా గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. కీలక రేట్లను యథాతథంగా కొనసాగించాలని మూడు రోజుల పాటు జరిగిన సమావేశం గురు వారం నిర్ణయించింది. అయితే వృద్ధికి ఊపును అందించే క్రమంలో సరళతర ఆర్థిక విధానాలకే మొగ్గుచూపుతున్నట్లూ ప్రకటించింది. తద్వారా భవిష్యత్తులో రేటు కోతలు ఉండవచ్చని సూచించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే, రిటైల్ ద్రవ్యోల్బణం 2020–21 ద్వితీయార్థంలో పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని పేర్కొంటూ, ధరల స్పీడ్‌ను కేంద్రం నిర్దేశిత 4 శాతం కట్టడే లక్ష్యంగా (2 ప్లస్ లేదా 2 మైనస్) ప్రస్తుతానికి కీలక రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4%) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇక కరోనా పరిస్థితుల నేపథ్యంలో డబ్బు అందక ఇబ్బందులు పడుతున్న చిన్న సంస్థలు, వ్యాపారులు, మధ్య, సామాన్యుని కి ఊరట కల్పించే నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుంది. దీనిప్రకారం... తన వద్ద ఉన్న పసిడిని బ్యాంకింగ్‌లో హామీగా పెట్టి రుణం తీసుకునే వ్యక్తులు ఇకపై ఆ విలువలో 90% రుణాన్ని పొందగలుగుతారు. తాజా నిర్ణయం 2021 మార్చి వరకూ అమల్లో ఉంటుంది. ఇప్పటి వరకూ (పసిడి రుణాలకు లో¯Œ టు వ్యాల్యూ నిష్పత్తి) ఇది 75 శాతంగా ఉంది. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ఏకగ్రీవ నిర్ణయం: ఫిబ్రవరి నుంచి 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపో రేటును ఆర్బీఐ తగ్గించింది. తాజాగా ఈ రేటు యథాతథ స్థితిలో కొనసాగించాలని పరపతి విధాన కమిటీలోని మొత్తం ఆరుగురు సభ్యులూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. జూ¯Œ లో ద్రవ్యోల్బణం 6.09 శాతం నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నా... అటు తర్వాత తగ్గవచ్చనే అభిప్రాయాన్ని పరపతి కమిటీ వ్యక్తం చేసింది. ► 20 యేళ్ల కనిష్ట స్థాయిలోనే రేట్లు: రేట్లను యథాతథంగా కొనసాగిస్తుండడంతో రెపో రేటు (4 శాతం) 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. ఇక రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే అదనపు నిధులపై లభించే వడ్డీరేటు) 3.35 శాతంగా కొనసాగుతుంది. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన కనీస మొత్తం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 3 శాతంగా కొనసాగనుంది. ► ధరల పెరుగుదలకు అవకాశం: కోవిడ్–19 నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ధరల పెరుగుదల అవకాశాలు, ఇందుకు సంబంధించి అనిశ్చితి ధోరణి నెలకొందని ఆర్బీఐ అభిప్రాయపడింది. సరఫరాల సమస్య ఇందుకు సంబంధించి ప్రధానంగా ఉందని పేర్కొంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న విషయాన్ని ఆర్బీఐ ప్రస్తావించింది. ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల తీవ్రంగా ఉందని వెల్లడించింది. 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్న పాలసీ, మధ్య కాలికంగా ద్రవ్యోల్బణం శ్రేణిపై అంచనాలను మాత్రం వెలువరించలేదు. ► నాబార్డ్, ఎన్‌హెచ్‌బీకి వెసులుబాటు: వ్యవసాయ రంగానికి సాయం అందించే క్రమంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)కు రూ.5,000 కోట్ల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ను ఆర్బీఐ కల్పించింది. అలాగే హౌసింగ్ సెక్టార్ విషయంలో ద్రవ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎ¯Œ హెచ్‌బీ)కి కూడా రూ.5,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌలభ్యత కల్పిస్తున్నట్లు పేర్కొంది. తద్వారా ఆయా రంగాలకు రుణాలను అందించే విషయంలో నా¯Œ –బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ద్రవ్య లభ్యత విషయంలో కొంత వెసులుబాటు కలుగుతుంది. ► డిజిటల్ లావాదేవీలకు దన్ను: కార్డుల ద్వారా జరిపే చెల్లింపుల పరిమాణాన్ని పెంచడానికి ఆర్బీఐ చర్యలు తీసుకోనుంది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, భద్రతా చర్యలే ధ్యేయంగా ఈ దిశలో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి ఒక పైలట్ స్కీమ్‌ను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో ఇందుకు సంబంధించి విధివిధానాలు వెలువడతాయని తెలిపింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్పీడ్ తక్కువగా ఉండడంసహా ఇప్పటివరకూ డిజిటల్ పేమెంట్లలో నెలకొంటున్న ఇబ్బందులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ విభాగంలో మరింత ముందుకు వెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆ¯Œ లై¯Œ డిస్ప్యూట్ రిజల్యూష¯Œ (ఓడీఆర్) ఏర్పాటు ప్రతిపాదన కూడా ఈ విభాగంలో తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒకటి. రుణ గ్రహీతకు వరం అటు కార్పొరేట్లకు, ఇతర వ్యక్తులకు వ¯Œ టైమ్ రుణ పునర్వ్యవస్థీకరణకు బ్యాంకింగ్‌కు ఆర్బీఐ అనుమతినిచ్చింది. 7 జూ¯Œ 2019లో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రుణ పునర్వ్యవస్థీకరణ జరపాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామ¯Œ కూడా ఈ మేరకు బహిరంగంగానే సూచనలు చేశారు. అకౌంట్లను ‘స్టాండర్డ్’గా వర్గీకరించిన లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకూ రుణ పునర్వ్యవస్థీకరణ వర్తిస్తుందని పేర్కొంది. లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరంగా ఆయా సంస్థలకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా చూడాలని సూచించింది. రుణాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రంగాల వారీగా అవసరాల పరిశీలన, ప్రణాళికలకు బ్రిక్స్ బ్యాంక్ మాజీ చైర్మన్, బ్యాంకింగ్ నిపుణులు కేవీ కామత్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు మరో ముఖ్యాంశం. ► ఇన్నోవేష¯Œ హబ్ ఏర్పాటు: అందరినీ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేయడం, బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం, బ్యాంకింగ్ సేవల పటిష్టత లక్ష్యంగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని (ఇన్నోవేష¯Œ హబ్) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఎప్పటికప్పు డు తీసుకోవాల్సిన తగిన చర్యలను నియంత్రణా వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడం ఈ హబ్ ప్రధాన బాధ్యతల్లో ఒకటి. ► స్టార్టప్స్‌కు ప్రాధాన్యత: ఇక స్టార్టప్స్ విషయానికి వస్తే, వీటికి ప్రాధాన్యతా రంగం హోదాను కల్పిస్తున్నట్లు పేర్కొంది. తద్వారా ఈ తరహా యూనిట్లు తగిన రుణ సౌలభ్యతను సకాలంలో అందుకోగలుగుతాయి. ► పునరుత్పాదకతకు ‘ఇంధనం’: ప్రాధాన్యతా రంగాలకు రుణం కింద (పీఎస్ఎల్) పునరుత్పాదకత ఇంధన రంగాలకు రుణ పరిమితులను పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. సోలార్ పవర్, కంప్రెస్డ్ బయోగ్యాస్ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ► చిన్న రైతులు, బలహీన వర్గాలకూ ఊరట: ప్రాధాన్యతా రంగాలకు రుణం కింద (పీఎస్ఎల్) పరిధిలో చిన్న, సన్నకారు రైతులకు, అలాగే బలహీన వర్గాలకు కూడా రుణ పరిమితులను పెంచాలని ఆర్బీఐ పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ► అకౌంట్ల విషయంలో భద్రతా ప్రమాణాలు: కస్టమర్లకు కరెంట్ అకౌంట్లు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్ల ప్రారంభంలో భద్రతా ప్రమాణాలు మరింత పెంపు. బహుళ బ్యాంకుల నుంచి ఆయా కస్టమర్లకు క్రెడిట్ సౌలభ్యం పొందేందుకు అవకాశాల కల్పన వంటి ప్రతిపాదనలు పాలసీ నిర్ణయాల్లో ఉన్నాయి. కరోనాతో కష్టాలే.. కరోనా వైరస్ విస్తరిస్తుండడం, దీనిపై నెలకొన్న అస్పష్టత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) దేశ ఆర్థిక వ్యవస్థను క్షీణబాటలోకి తీసుకువెళుతుందని భావిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థలో రికవరీ జాడలు కనిపిస్తున్నా... కోవిడ్–19 ప్రభావం దీనిని అనిశ్చితి వాతావరణంలోకి నెడుతోంది. వృద్ధి అవుట్‌లుక్ చూస్తే, ఖరీఫ్ సాగు పురోగతి బాగుంది. అందువల్ల స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం కొంత పురోగతి కనబరుస్తుందని భావిస్తున్నాం. ఇక తయారీ సంస్థల విషయానికి వస్తే, ఫార్మా మినహా అన్ని తయారీ సబ్–సెక్టార్లూ ప్రస్తుతానికి ప్రతికూలతలోనే ఉన్నాయి. 2021–22 మొదటి త్రైమాసికం నాటికి పరిస్థితిలో కొంత పురోగతి లభించవచ్చు. నిర్మాణ రంగం మెరుగుపడాల్సి ఉంది. సేవల రంగం విషయానికి వస్తే, మే, జూ¯Œ లలో కొంత రికవరీ ఉన్నా... గత ఏడాది స్థాయికన్నా ఎంతో దిగువనే ఆయా సూచీలు కదలాడుతున్నాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు క్షీణతలోనే కొనసాగుతున్నాయి. దేశీయ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్, రవాణా క్షీణతలోనే ఉన్నాయి. ఆర్బీఐ సర్వే ప్రకారం, వినియోగదారువైపు నుంచి చూస్తే, జూలైలో ఇంకా వినియోగ విశ్వాసం ప్రతికూలతలోనే ఉంది. అంతర్జాతీయ డిమాండ్ కూడా అంతంతమాత్రంగానే కనబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందగమన పరిస్థితులు, వాణిజ్య క్షీణత వంటి అంశాలు నెలకొని ఉన్నాయి. పరపతి విధాన కమిటీ అంచనా ప్రకారం, ప్రపంచ ఆర్థిక క్రియాశీలత ఇంకా బలహీనంగానే ఉంది. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఆర్థిక వ్యవస్థ మూల స్తంభాలు పటిష్టంగా ఉన్నాయి. తగిన ద్రవ్యపరమైన చర్యలతో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంక్ చర్యలు కొనసాగుతాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం లక్ష్యాలను మీరకుండా తగిన చర్యలు ఉంటాయి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వివేకవంతమైన నిర్ణయం ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బ ణం, డిమాండ్‌పై అనిశ్చితి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ వివేకవంతమైన నిర్ణయం తీసుకుంది. రుణ పునర్‌వ్యవస్థీకరణపరమైన ఊరట చర్యలను తగు రక్షణాత్మక విధానాలతో .. భారీ కార్పొరేట్లు, ఎస్ఎంఈలు, వ్యక్తిగత రుణగ్రహీతలకు కూడా వర్తింపచేయడం స్వాగతించతగ్గది. – రజనీష్ కుమార్, చైర్మన్, ఎస్బీఐ లిక్విడిటీ బాగున్న నేపథ్యం... ఇప్పటికే రెపో రేటును గణనీయంగా తగ్గించేయడం వల్ల లిక్విడిటీ పెరిగిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ తాజా సమీక్షలో పాలసీ రేటును యథాతథంగా ఉంచడాన్ని అర్థం చేసుకోవచ్చు. – ఉదయ్ కొటక్, ప్రెసిడెంట్, సీఐఐ రుణ పునర్వ్యవస్థీకరణ హర్షణీయం ఎంఎస్ఎంఈ రుణాల పునర్వ్యవస్థీకరణ, కేవీ కామత్ సారథ్యంలో కమిటీ ఏర్పాటు తదితర అంశాలు స్వాగతిస్తున్నాం. వీటి అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. – సంగీతా రెడ్డి, ప్రెసిడెంట్, ఫిక్కీ కుటుంబాలకు ఊరట రుణాల పునర్వ్యవస్థీకరణను ప్రకటించడంతో పాటు ఈ క్రమంలో బ్యాంకర్లకు కూడా తోడ్పాటునిచ్చేటటు వంటి చర్యలతో ఆర్బీఐ పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించింది. బంగారం రుణాలపై పరిమితి పెంచడం వల్ల ఆదాయాలు నష్టపోయి తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు గణనీయంగా ఊరట లభించగలదు. – దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం రేటు ప్రయోజనం బదలాయించాలి... గడిచిన నాలుగు నెలలుగా రెపో రేటును ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాలి. – డీకే అగర్వాల్, ప్రెసిడెంట్, పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. -
బ్యాంకులపై ‘మొండి’బండ!
ముంబై: భారత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్సీబీ) మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టమైపోయాయి. 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని శుక్రవారంనాడు విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఆర్థికాంశాలకు సంబంధించి ఆర్బీఐ తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► పలు క్షేత్ర స్థాయి ఆర్థిక అంశాల ప్రాతిపదికన బ్యాంకింగ్ తాజా పరిస్థితిని అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధిరేటు, జీడీపీలో ద్రవ్యలోటు నిష్పత్తి, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వంటివి ఉన్నాయి. ► మార్చి నుంచి ఆగస్టు వరకూ రుణాల చెల్లింపులపై మారటోరియం అమలవుతోంది. ఈ మారటోరియం ప్రభావం బ్యాంకింగ్‌పై ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం ఇంకా అస్పష్టంగా ఉంది. దీని గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. ► ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే– జీఎన్‌పీఏ నిష్పత్తి 2021 మార్చి నాటికి 15.2 శాతానికి చేరే వీలుంది. 2020 మార్చిలో ఈ రేటు 11.3 శాతం. ► ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఈ రేటు 4.2 శాతం నుంచి 7.3 శాతానికి చేరవచ్చు. ► విదేశీ బ్యాంకుల విషయంలో జీఎన్‌పీఏల నిష్పత్తి 2.3 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చు. ► ఇక కనీస పెట్టుబడుల నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో –సీఆర్ఏఆర్) 2020 మార్చిలో 14.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి 13.3 శాతానికి తగ్గే వీలుంది. పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు 11.8 శాతానికీ పడిపోయే వీలుంది. కనీస పెట్టుబడుల నిష్పత్తిని కొనసాగించడంలో ఐదు బ్యాంకులు పూర్తిగా విఫలం కావచ్చు. ► నిజానికి 2018–19 తో పోల్చితే 2019–20 లో బ్యాంకింగ్ లాభదాయక నిష్పత్తులు బాగున్నాయి. అయితే 2019–20 ఒక్క ద్వితీయార్ధాన్ని పరిశీలిస్తే ఈ నిష్పత్తులు తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభదాయక నిష్పత్తులు ఏ స్థాయిలో పడిపోయే అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు. ► ఒకపక్క తగ్గుతున్న డిపాజిట్లు, మరోపక్క మొండిబకాయిల భారం వెరసి బ్యాంకింగ్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలనూ ఎదుర్కొనే వీలుంది. ► ఇక ఆర్థిక అంశాల విషయానికి వస్తే, కరోనా మహమ్మారి సవాళ్లు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి. లాక్డౌన్ ఇంకా పూర్తిస్థాయిలో ఎత్తివేయని పరిస్థితీ ఉంది. ఈ నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమన ఇబ్బందులే ఉంటాయని భావిస్తున్నాం. భారత ఆర్థిక మూలాలు పటిష్టం: శక్తికాంత్ దాస్ కోవిడ్–19 నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ప్రభుత్వంతోపాటు ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్థిక రంగంపై కరోనా ప్రభావాన్ని తగ్గించగలిగాయి. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, వినియోగదారులు... ఇలా అందరికీ విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలంటే ఫైనాన్షియల్ రంగంలో స్థిరత్వం అవసరం. ఈ స్థిరత్వం చెక్కుచెదరకుండా చూడడంపై మేము అధిక దృష్టి సారిస్తున్నాం. బ్యాంకింగ్ విషయానికి వస్తే, ఇబ్బందులను తట్టుకోగలిగిన స్థాయికి ఎదగాల్సిఉంది. ఇందుకు తగిన యంత్రాంగం సమాయత్తం కావాలి. మూలధనాన్ని తగిన స్థాయిల్లో నిలుపుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రుణాల మంజూరీ విషయాల్లో మితిమీరిన అతి జాగ్రత్తలూ మంచిదికాదు. ఇలాంటి ధోరణీ ప్రతికూలతలకు దారితీస్తుంది. లాక్డౌన్ సమయాల్లోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి దేశీయ రంగాలు కొన్ని చక్కటి పనితీరునే ప్రదర్శించాయి. భారత్ ఆర్థిక వ్యవస్థలో మొత్తంగా రికవరీ జాడలు కనిపిస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉండడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దివాలా చట్టం నిర్వీర్య యత్నం వల్లే కేంద్రంతో విభేదించా: ఉర్జిత్ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి 2018 డిసెంబర్లో మధ్యంతరంగా వైదొలగిన ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు ఇందుకు కారణాన్ని వెల్లడించారు. దివాలా చట్టం నిర్వీర్యానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నాలే కేంద్రంతో విభేదాలకు కారణమని శుక్రవారం ఆవిష్కరించిన తన పుస్తకంలో పేర్కొన్నారు. రీపేమెంట్లను ఆలస్యం చేస్తున్న డిఫాల్టర్లను తక్షణం డిఫాల్టర్లుగా వర్గీకరించాలని, అలాంటి వ్యక్తులు దివాలా చర్యల సందర్భంగా తిరిగి తమ కంపెనీలను బైబ్యాక్ చేయకుండా నిరోధించాలని బ్యాంకింగ్‌కు సూచిస్తూ ఆర్బీఐ జారీ చేసిన 2018 ఫిబ్రవరి సర్క్యులర్ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైందని తెలిపారు. అయితే దీనిని చట్టరూపంలో తీసుకురావడానికి కేంద్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించిందని సూచించారు. -
వడ్డీ రేట్లలో ఆర్బీఐ కీలక మార్పులు
-
వినియోగదారులకు ఆర్బీఐ ఊరట
న్యూఢిల్లీ : కేంద్ర రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను చేసింది. వడ్డీరేట్లు 40 బేసిస్ పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా సమావేశంలో ప్రకటించారు. రెండు నెలల్లో 3 సార్లు వడ్డీరేట్లపై ఆర్బీఐ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంది. రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటు 3.35 శాతానికి తగ్గించింది. ‘భారత విదేశీ మారక నిల్వలు 487 బిలియన్ యూఎస్ డాలర్లు ఉన్నాయి. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గింది. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ముడి పదార్థాల ఇన్పుట్ ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోంది. తక్కువ ధరలో రుణాలు, వడ్డీరేట్లు తగ్గడంతో సామాన్యుడికి ఊరట లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పెట్టుబడులపై తీవ్ర పరిణామం చూపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా కట్టడి చేస్తాం. 13 నుంచి 32 శాతం మేర ప్రపంచ వాణిజ్యం తగ్గింది. 4 కేటగిరిలుగా ఎగుమతులు, దిగుమతులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వర్కింగ్ కేపిటల్ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సిడ్బీ రుణాలపై మారటోరియం మరో 90 రోజులు పెంపు ఉంటుంది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగింపు ఉంటుంది. టర్మ్‌లోన్లకు వర్తించేలా మారటోరియం పొడిగింపు ఉంటుంది’ అని శక్తికాంత్ దాస్ అన్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ విధింపు నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్‌కు ఇది మూడో ప్రతికా సమావేశం. ఇప్పటికే మార్చి 27న మొదటిసారి, ఏప్రిల్ 17న రెండోసారి కోవిడ్ -19 సంబంధిత సమావేశాలు నిర్వహించారు. మొదటి రెండు సమావేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటి ఒత్తిడిని తగ్గించడానికి, కోవిడ్-19 వ్యాధి నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలను ప్రకటించారు. అందులో భాగంగా మార్చిలో ఏకంగా 75బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు, రూ.5 లక్షల కోట్ల విలువైన ద్రవ్య చర్యలు ఉన్నాయి. వీటితో పాటు మార్చి 1 మరియు మే 31 మధ్య అన్ని కాల వ్యవధి రుణాల చెల్లింపులపై 3నెలల తాత్కలిక నిషేధాన్ని ప్రకటించారు. -
ఉదయం 10గంటలకు ఆర్బీఐ గవర్నర్ మీడియా సమావేశం
కేంద్ర రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ ఇవాళ ఉదయం 10:00గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం లాక్డౌన్ విధింపు మే 31వరకు వరకు పొడగించిన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ పత్రికా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని రకాల టర్మ్లోన్ల చెల్లింపులపై మారిటోరియంను మరికొన్ని నెలలపాటు పొడిగించే అవకాశం ఉంది. బ్యాంకింగ్ నాన్ ఫైనాన్స్ కంపెనీలకు, చిన్న పారిశ్రామిక కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ద్రవ్య మద్దతు చర్యల కొనసాగింపును గవర్నర్ ప్రకటించవచ్చు. లాక్డౌన్ కారణంగా ఇప్పటికే నష్టపోయినా పరిశ్రమలకు మరింత వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రాయితీలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్త లాక్డౌన్ విధింపు నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్‌కు ఇది మూడో ప్రతికా సమావేశం. ఇప్పటికే మార్చి 27న మొదటిసారి, ఏప్రిల్ 17న రెండోసారి కోవిద్1-9 సంబంధిత సమావేశాలు నిర్వహించారు. మొదటి రెండు సమావేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటి ఒత్తిడిని తగ్గించడానికి, కోవిద్-19 వ్యాధి నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలను ప్రకటించారు. అందులో భాగంగా మార్చిలో ఏకంగా 75బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు, రూ.5 లక్షల కోట్ల విలువైన ద్రవ్య చర్యలు ఉన్నాయి. వీటితో పాటు మార్చి 1 మరియు మే 31 మధ్య అన్ని కాల వ్యవధి రుణాల చెల్లింపులపై 3నెలల తాత్కలిక నిషేధాన్ని ప్రకటించారు. -
వృద్ధికి ఆర్బీఐ రెండో డోసు!
ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ఆర్బీఐ మరో సారి రంగంలోకి దిగింది. కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు తీసుకొన్న నెలరోజుల్లోపే శుక్రవారం మరో ప్యాకేజీని అందించింది. ముఖ్యంగా బ్యాంకులు మరింత ఉత్సాహంగా రుణాలు మంజూరు చేసేలా నిర్ణయాలు తీసుకుంది. రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ... లిక్విడిటీ కవరేజీ రేషియోను 80 శాతానికి సవరించింది. బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ రంగంలో లిక్విడిటీ పెరిగేలా చర్యలు చేపట్టింది. మొండి బకాయిల విషయంలో బ్యాంకులకు, రుణ గ్రహీతలకు మరింత వెసులుబాటు కల్పించింది. సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు వాటాదారులకు డివిడెండ్ చెల్లించకుండా నిలిపేసింది. శుక్రవారం ఉదయం వీడియో సందేశం ద్వారా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రెండో ప్యాకేజీ నిర్ణయాలను ప్రకటించారు. ఎన్పీఏల వర్గీకరణకు 180 రోజులు రుణ చెల్లింపుల్లో విఫలమైతే 90 రోజుల తర్వాత దాన్ని వసూలు కాని ఎన్పీఏ వర్గీకరించాలన్నది ప్రస్తుత నిబంధన. అయితే లాక్డౌన్ కారణంగా రుణ చెల్లింపులపై 3 నెలల మారటోరియంను ఆర్బీఐ గతంలోనే ప్రకటించింది. ఫలితంగా మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్న ఖాతాలకు ఇది 180 రోజులుగా అమలు కానుంది. పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ, రిటైల్ రుణ గ్రహీతలకు ఇది ఎంతో వెసులుబాటునిస్తుంది. కాకపోతే, ఈ ఏడాది మార్చి 1 నాటికి చెల్లింపుల్లో విఫలం కాకుండా ఉన్న రుణ ఖాతాలకే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. మిగిలిన వాటికి మూడు నెలల ఎన్పీఏ వర్గీకరణ నిబంధనే అమలవుతుంది. మారటోరియం వెసులుబాటు ఎన్పీఏలకు దారితీయకూడదని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాకపోతే మారటోరియం పరిధిలో ఉన్న రుణాలకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అదనంగా 10% నిధుల కేటాయింపు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే ఒక శాతంలోపు కేటాయింపులు చాలు. అదే విధంగా ఐబీసీ కింద ఎన్పీఏల పరిష్కారానికి 210 రోజుల గడువును మరో 90 రోజులు పెంచింది. రివర్స్ రెపో కట్ రివర్స్ రెపో రేటును పావు శాతం తగ్గించి ప్రస్తుతమున్న 4 శాతం నుంచి 3.75 శాతానికి సవరించింది. రివర్స్ రెపో అంటే... బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటు. ఈ రేటు తగ్గటం వల్ల బ్యాంకులు తమ నిధుల్ని ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయడానికి బదులు రుణాలివ్వటానికే మొగ్గు చూపిస్తాయి. బెంచ్‌మార్క్ రెపో రేటు 4.40 శాతంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎల్‌సీఆర్ కోత లిక్విడిటీ కవరేజీ రేషియోను (ఎల్‌సీఆర్) 100 శాతం నుంచి 80 శాతానికి తగ్గించింది. ఎల్‌సీఆర్ అంటే... ఏ క్షణంలోనైనా నగదుగా మార్చుకోగలిగే స్వల్పకాలిక ప్రభుత్వ బాండ్ల వంటి ఆస్తులు. వచ్చే 30 రోజుల్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ క్యాష్ ఫ్లో ఎంత ఉంటుందని అంచనా వేస్తే... అంతకు సమానంగా (100 శాతం) ఈ ఎల్‌సీఆర్‌ను కూడా ఉంచుకోవాలి. దీన్నిపుడు ఆర్బీఐ తగ్గించింది. ఆ రకంగా మిగిలిన నిధుల్ని బ్యాంకులు ఇతరత్రా మదుపు చేయొచ్చు. లేదా రుణాలివ్వవచ్చు. అక్టోబర్ నాటికి తిరిగి దీనిని 90 శాతానికి, వచ్చే ఏడాది ఏప్రిల్ 1కి 100 శాతానికి తీసుకొస్తామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ద్రవ్యోల్బణం అదుపులోనే వ్యవస్థలో లిక్విడిటీ పెంపు దిశగా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ... ద్రవ్యోల్బణం తమ లకి‡్ష్యత స్థాయి 4 శాతం లోపునకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధభాగంలో చేరుతుందని అర్బీఐ ప్రకటించింది. రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 5.91 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. రాష్ట్రాలకు మరిన్ని నిధులు.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ సదుపాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం మేర అదనంగా ఆర్బీఐ నుంచి రుణాలను పొందేందుకు రిజర్వు బ్యాంకు అనుమతించింది. ఈ సదుపాయం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాలను తాత్కాలికంగా సర్దుబాటు చేసుకునేందుకు ఏర్పాటు చేసిందే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఎన్బీఎఫ్సీ సంస్థలు ఇప్పటికే చాలా రుణాలిచ్చాయి. వాటిని తిరిగి చెల్లించే నిమిత్తం ఆయా డెవలపర్లు ఇప్పటికే తమ వాణిజ్య కార్యకలాపాలను ఆరంభించే తేదీలను (డీసీసీఓ) ప్రకటించారు. కాకపోతే తాజా పరిస్థితుల్లో ఆ తేదీల్లో ప్రారంభించే అవకాశాలు తక్కువ. దీంతో ఆరంభ గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సంబంధిత రుణాన్ని ఆ కాలానికి పునరుద్ధరించినట్టుగా పరిగణించరు. డెవలపర్లకు ఇది పెద్ద ఉపశమనమే. ఆర్థిక సంస్థలకు మరో రూ.50వేల కోట్లు జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలైన నాబార్డ్, సిడ్బి, ఎన్‌హెచ్‌బీలకు మరో రూ.50,000 కోట్ల మేర రీఫైనాన్సింగ్ సదుపాయాన్ని ఆర్బీఐ కల్పించింది. ఈ సంస్థలు ఆర్బీఐ అనుమతించిన నిర్దేశిత సాధనాల ద్వారా మార్కెట్ల నుంచి నిధులను సమీకరించుకోవచ్చు. ఒక్క నాబార్డ్‌కే రూ.25,000 కోట్లు అందించనుంది. వీటిని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు, సూక్ష్మ రుణ నంస్థలకు నాబార్డ్ అందించనుంది. ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల అండ ఎన్బీఎఫ్సీ, మైక్రో ఫైనాన్స్ రంగం నిధుల కొరత ఎదుర్కోవచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. దీంతో ఈ రంగం కోసం లకి‡్ష్యత దీర్ఘకాల రెపో ఆపరేషన్స్ (టీఎల్టీఆర్వో 2.0) రూపంలో రూ.50,000 కోట్ల మేర నిధుల్ని ఆర్బీఐ అందించనుంది. టీఎల్టీఆర్వో 2.0 ద్వారా బ్యాంకులు ఈ మేరకు ఆర్బీఐ నుంచి నిధులను తీసుకుని.. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కలిగిన ఎన్బీఎఫ్సీ సంస్థల బాండ్లు, కమర్షియల్ పేపర్లు, ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిజానికిలా చేస్తే నిధులన్నీ అగ్రశ్రేణి సంస్థల చేతుల్లోకే వెళతాయి. కానీ ఈ రూ.50,000 కోట్లలో సగం మొత్తాన్ని చిన్న, మధ్య స్థాయి ఎన్బీఎఫ్సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకే అందించాలని ఆర్బీఐ షరతు పెట్టింది. వ్యవస్థలోకి రూ.1.2 లక్షల కోట్ల నగదు మార్చి 1 – ఏప్రిల్ 14 మధ్య వ్యవస్థలోకి ఆర్బీఐ ఏకంగా రూ.1.2 లక్షల కోట్లను విడుదల చేసింది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా వ్యవస్థలో నగదుకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసి ఈ విధానాన్ని అనుసరించింది. డివిడెండ్ పంపిణీపై నిషేధం అన్ని వాణిజ్య, కో–ఆపరేటివ్ బ్యాంకులు తమ వాటాదారులకు, ప్రమోటర్లకు డివిడెండ్ చెల్లింపులు చేయకుండా ఆర్బీఐ నిషేధం విధించింది. ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలిచేందుకు బ్యాంకులు నిధులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని శక్తికాంత దాస్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నిషేధాన్ని 2020 సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా సమీక్షించనున్నట్టు తెలియజేశారు. 2021–22లో వృద్ధి రికవరీ వేగవంతం 2021–22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ‘వీ’ షేప్‌లో రికవరీ అవుతుందన్న ఐఎంఎఫ్ అంచనాలను ఆర్బీఐ గవర్నర్ ఉదహరించారు. వృద్ధికి అడ్డుపడే సమస్యల పరిష్కారానికి పాలసీ పరంగా ఆర్బీఐకి మరింత వెసులుబాటు ఉన్నట్టు చెప్పారు. అవసరమైతే మరోవిడత రేట్ల కోతకు అవకాశం ఉంటుందని సంకేతం ఇచ్చారు. వృద్ధి 2021–22లో చాలా వేగంగా పుంజుకుని 7.4 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సాధారణ వర్షపాత అంచనాలు గ్రామీణ డిమాండ్‌కు సానుకూలమన్నారు. రూపాయి 48 పైసలు బలోపేతం 76.39 వద్ద క్లోజింగ్ ముంబై: కరోనా వైరస్ బారిన పడిన ఎకానమీకి ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన చర్యలతో రూపాయి కోలుకుంది. గురువారం నాటి ఆల్‌టైం కనిష్ట స్థాయి నుంచి రికవర్ అయ్యింది. డాలర్‌తో పోలిస్తే శుక్రవారం 48 పైసలు పెరిగి 76.39 వద్ద క్లోజయ్యింది. దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడం కూడా ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చినట్లు ట్రేడర్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెంచేందుకు రివర్స్ రెపో రేటును తగ్గించడం, నాబార్డ్, సిడ్బి వంటి సంస్థలకు రీఫైనాన్సింగ్ సదుపాయం కల్పించడం మొదలైన ఆర్బీఐ నిర్ణయాలతో రూపాయికి గట్టి మద్దతు లభించిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. అత్యుత్తమ ప్యాకేజీ .. ఇటు ప్రభుత్వం, అటు నియంత్రణ సంస్థ సత్వరం స్పందించి .. ప్రకటించిన రెండో ప్యాకేజీ అత్యుత్తమంగా ఉంది. దీనితో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, సూక్ష్మ రుణ సంస్థలకు కూడా తోడ్పాటు లభిస్తుంది – రజనీష్ కుమార్, చైర్మన్, ఎస్బీఐ వ్యవస్థలోకి తగినంత లిక్విడిటీ.. కరోనా వైరస్‌పరమైన సమస్యలను అధిగమించే దిశగా వ్యవస్థలో తగినంత ద్రవ్యలభ్యత ఉండేలా చూసేందుకు, బ్యాంకులు రుణాలిచ్చేలా ప్రోత్సహించేందుకు, ఆర్థిక ఒత్తిళ్లు తగ్గించేందుకు, మార్కెట్లు మళ్లీ సాధారణంగా పనిచేసేందుకు ఆర్బీఐ తగు చర్యలు తీసుకుంది – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి -
బ్యాంకింగ్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ కీలకం
అహ్మదాబాద్: దేశంలోని బ్యాంకింగ్ రంగం మెరుగైన సేవలు అందివ్వాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ ముఖ్య పాత్ర పోషించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. అహ్మదాబాద్‌లో మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ పుంజుకోవాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ సమర్థవంతమైన పాత్ర పోషించాలని లేకుంటే గదిలోని ఏనుగులా ఏమి ఉపయోగముండదని వ్యాఖ్యానించారు. మరోవైపు నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) మూలధన కొరత, నిర్వహణ నైపుణ్యం కొరవడటం లాంటి సమస్యలు తలెత్తుతాయని అన్నారు. స్వతంత్ర బోర్డులను ఏర్పాటు చేసి వ్యాపార వృద్ధిని పెంచుకోవాలని అన్నారు. బ్యాంకింగ్ రంగంలో సరైన నియంత్రణ వ్యవస్థలు, సమర్థవంతమైన ఆడిట్ నిర్వహించాలని పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా ఎన్పీఏలు 60.5శాతం నుంచి 48.3శాతం తగ్గాయని దాస్ తెలిపారు. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో మూలధన నిష్పత్తి బాసిల్ అవసరాల కంటే ఎక్కువగానే నమోదయిందన్నారు. -
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూ¯Œ ) కేవలం 5 శాతం వృద్ధి నమోదుచేసుకోవడం ‘ఆశ్చర్యకరం’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ‘‘క్యూ1లో కనీసం 5.8 శాతం వృద్ధి ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. 5.5 శాతం ఎంతమాత్రం తగ్గదన్న విశ్లేషణలూ వచ్చాయి. అయితే అంతకన్నా తక్కువకు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని గవర్నర్ ఇక్కడ ఒక చానెల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు వృద్ధిని తిరిగి పుంజుకునేలా చేస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే గడచిన నాలుగు ద్వైమాసికాల్లో ఆర్బీఐ 1.1 శాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.4 శాతం) కోతకూడా ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాగత సంస్కరణల విషయాన్ని ఇప్పటికే తన వార్షిక నివేదికలో ఆర్బీఐ ప్రస్తావించిన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు. ‘‘ఇందులో ప్రధానమైనది వ్యవసాయ మార్కెటింగ్. ఈ విభాగంలో ప్రభుత్వం నుంచి కీలక చర్యలు ఉంటాయని భావిస్తున్నా’’ అని గవర్నర్ అన్నారు. ‘‘వృద్ధి మందగమనానికి కేవలంఅంతర్జాతీయ అంశాలే కారణమని నేను చెప్పను. ఇందుకు దేశీయ అంశాలూ కొన్ని కారణమే’’ అని కూడా గవర్నర్ వ్యాఖ్యానించడం విశేషం. సౌదీ ఆయిల్ సంక్షోభం పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం ఊహించలేమని గవర్నర్ అన్నారు. అలాగే వాణిజ్య యుద్ధ అనిశి్చతిపైనా ఏదీ చెప్పలేమన్నారు. ఆయా అంశాలన్నీ వృద్ధితీరుపై ప్రభావం చూపుతాయని తెలిపారు. రెపో రేటు కోతతో సరిపోదు: ఎస్బీఐ ఇదిలావుండగా, కేవలం రెపో రేటు కోత వృద్ధికి దోహదపడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. వ్యవస్థలో డిమాండ్ మెరుగుదల చర్యలు అవసరమని తెలిపింది. -
వడ్డీ రేటు తగ్గిస్తున్న బ్యాంకులు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు వేగంగా బదలాయించాలన్న గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) స్పందించాయి. రుణ రేటును స్వల్పంగా తగ్గించాయి. ఈ విషయంలో ఎస్బీఐ 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే, ఓబీసీ 10 బేసిస్ పాయింట్ల రేటును తగ్గించింది. 100 బేసిస్ పాయింట్లంటే ఒక శాతం. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటే రెపో. ప్రస్తుతం ఈ రేటు 5.75 శాతంగా ఉంది. ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం నాడు జరిగిన బడ్జెట్ అనంతర సంప్రదాయక సమావేశం సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మాట్లాడుతూ, ‘‘జూన్ 6వ తేదీకి ముందు పాలసీ నిర్ణయం వరకూ చూస్తే, రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గింది (నాటి నిర్ణయం కూడా కలుపుకుంటే 75 బేసిస్ పాయింట్లు). అయితే బ్యాంకర్లు మాత్రం ఇందులో కేవలం 21 బేసిస్ పాయింట్ల రేటును కస్టమర్లకు బదలాయించారు. ఈ విధానం మారాలి. వేగంగా రెపో ప్రయోజనం కస్టమర్‌కు అందాలి. వృద్ధికి ఇది అవసరం. ఏది ఏమైనా ఇప్పుడు ఒక సానుకూల అంశం ఉంది. రేటు బదలాయింపునకు ఇంతక్రితం ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు రెండు, మూడు నెలల సమయం మాత్రమే పడుతోంది’’ అని అన్నారు. ఎస్బీఐ.. ఆర్థిక సంవత్సరంలో మూడవసారి ► ఎస్బీఐ తగ్గించిన తాజా ఐదు బేసిస్ పాయింట్ల రుణ రేటు తగ్గింపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ మూడుసార్లు రుణ రేటును తగ్గించింది. ఇంతక్రితం ఏప్రిల్, మే నెలల్లో కూడా ఎస్బీఐ రుణ రేటు ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. మొత్తంగా ఈ కాలంలో గృహ రుణాలపై ఎస్బీఐ వడ్డీరేటు 20 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గింది. అయితే ఇది ఆర్బీఐ తగ్గించిన రెపో రేటుకన్నా తక్కువగా ఉండడం గమనార్హం. ► నిధుల సమీకరణ వ్యయభారం ప్రాతిపదికన ఉండే మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీ ఎల్ఆర్) ప్రస్తుతం 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గింది. ► జూలై 1 నుంచే బ్యాంక్ రెపో ఆధారిత గృహరుణ పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు.. జూన్ 6 పాలసీ సమీక్ష, పావుశాతం రేటు కోత అనంతరం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లు కూడా తమ ఎంసీఎల్ఆర్ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. మరో రేటు కోత! ఆగస్టు 5 నుంచి 9వ తేదీల మధ్య ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తాజా విధాన సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా వృద్ధే లక్ష్యంగా మరో పావుశాతం రెపో రేటు కోత ఉంటుందని అంచనా. ఇదే జరిగితే, రెపో రేటు 5.5 శాతానికి తగ్గుతుంది. ఇది ఆరు సంవత్సరాల గరిష్టస్థాయి. పారిశ్రామిక రంగం ఊపునకు సైతం రేటు తగ్గింపు తప్పనిసరన్న డిమాండ్ ఉంది. నేటి నుంచే తగ్గిన ఓబీసీ రేటు అమలు వివిధ కాలపరిమితుల రుణ రేట్లను ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) 10 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. తాజా రేట్లు గురువారం నుంచే అమల్లోకి వస్తాయి. బ్యాంక్ తాజా నిర్ణయం ప్రకారం– ఓవర్‌నైట్, నెల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గి 8.20 శాతం, 8.25 శాతానికి తగ్గాయి. అలాగే మూడు, ఆరు, ఏడాది రేట్లు ఐదు బేసిస్ పాయింట్లు తగ్గి 8.45 శాతం, 8.55 శాతం, 8.65 శాతాలకు దిగివచ్చాయి. -
వివాదాల ‘విరాళ్’... గుడ్‌బై!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా డాక్టర్ విరాళ్ ఆచార్య రాజీనామా చేశారు. తన మూడు సంవత్సరాల పదవీకాలం ఇంకో ఆరు నెలలు ఉండగానే ఆయన తన బాధ్యతలను విరమించారు. వ్యక్తిగత కారణాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఇదే కారణంగా చూపుతూ ఆర్బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన ఉర్జిత్పటేల్ తర్వాత, బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా ఆచార్య ఉండడం గమనార్హం. ప్రభుత్వంతో పొసగకే ఆయన రాజీనామా చేశారన్న పుకార్లు షికారు చేయడం మరో విశేషం. బాధ్యతలు పూర్తవడానికి దాదాపు 9 నెలల ముందే వ్యక్తిగత కారణాలతో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసినప్పుడూ, ఇదే విధమైన విశ్లేషణలు రావడం గమనార్హం. కాగా, ఉర్జిత్ పటేల్ రాజీనామా నాటినుంచే విరాళ్ ఆచార్య కూడా అదే బాటన పయనిస్తారన్న వార్తలు కొనసాగాయి. 45 సంవత్సరాల విరాళ్ ఆచార్య, ఆర్బీఐ గవర్నర్లలో అతి చిన్నవారు. మోదీ ప్రభుత్వం రెండవదఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యున్నత స్థాయిలో జరిగిన తొలి రాజీనామా ఇది కావడం మరో విశేషం. ఆర్బీఐ ప్రకటన ఏమి చెప్పిందంటే.. ఆర్బీఐ సోమవారంనాడు విడుదల చేసిన ప్రకటనను చూస్తే, ‘‘అనివార్యమైన వ్యక్తిగత పర్యవసానాల వల్ల తాను జూలై 23 తర్వాత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కొనసాగలేనని కొద్ది వారాల క్రితం డాక్టర్ విరాళ్ ఆచార్య ఒక లేఖను సమర్పించారు’’ అని ఒక క్లుప్తమైన ప్రకటన వెలువడింది. డాక్టర్ ఆచార్య రాజీనామాతో నూతన నియామకం జరిగేంతవరకూ డిప్యూటీ గవర్నర్లుగా ఇక ముగ్గురు – ఎన్ఎస్ విశ్వనాథన్, బీపీ కనుంగో, ఎంకే జైన్లు ఉంటారు. కేంద్రం ఏరికోరి... ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ విరాళ్ ఆచార్యను ఆర్బీఐ డిప్యూటీ గరవ్నర్‌గా 2016 డిసెంబర్లో నియమించింది. 2017 జనవరిలో ఆయన మూడేళ్ల తన బాధ్యతలను చేపట్టారు. అప్పట్లో ఆయన న్యూయార్క్ యూనివర్సిటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, డిపాజిట్లు, విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించి నిబంధనలనూ తరచూ మార్చుతూ ఆర్బీఐ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన డిప్యూటీ గవర్నర్ బాధ్యతలను చేపట్టారు. ద్రవ్యఅంశాల విభాగాన్ని ఆయన ఆర్బీఐలో పర్యవేక్షించారు. రాజీనామా అనంతరం విరాళ్ ఆచార్య ఏమిచేస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రానున్నప్పటికీ, ఆయన తిరిగి ప్రొఫెసర్‌గానే వెళ్తారన్న అంచనాలు వెలువడుతున్నాయి. పాలసీపై విభేదాలు? ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఆయన గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి సమీక్షా కమిటీ (ఎంపీసీ) సభ్యునిగా కూడా ఉన్నారు. జూన్‌లో ఆర్బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభిప్రాయాలతో విరాళ్ ఆచార్య కొంత విభేదించినట్లు సంబంధిత మినిట్స్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటుపై ఆయన తాజా పాలసీ సమీక్షలో ఆందోళన వెలిబుచ్చారు. గడచిన ఐదు బడ్జెట్లలో మూడుసార్లు ద్రవ్యలోటు కట్టుతప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 2013 నుంచీ ఇటు కేంద్రం, అటు రాష్ట్రాల ద్రవ్యలోటు పరిస్థితి దిగజారుతూ వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాకేష్ మోహన్ తరువాత... ‘ఫారిన్ ట్రైన్డ్’ ఎకనమిస్ట్‌గా రిజర్వ్ బ్యాంక్‌లో పనిచేసి బాధ్యత కాలం పూర్తికాకుండానే తప్పుకున్న రెండో డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య. ఇంతక్రితం 2009 మే నెలలో అప్పటి డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ తన బాధ్యతలకు ముందుగానే రాజీనామా చేశారు. అప్పట్లో జూలై 23తో ఆయన పదవీకాలం పూర్తికావాల్సి ఉంది. జలాన్ కమిటీ నివేదిక నేపథ్యం... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న రూ.9.6 లక్షల కోట్ల అదనపు నిధుల్లో కొంత మొత్తాన్ని కేంద్రానికి బదలాయించాలన్న విషయమై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటయిన ఆరుగురు సభ్యుల కమిటీ తన నివేదికను మరో నెల రోజుల్లో సమర్పించనున్న నేపథ్యంలో విరాళ్ రాజీనామా మరో విశేషం. నిజానికి జూన్ చివరికల్లా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉన్నా, అది అసాధ్యమని వార్తలు వస్తున్నాయి. పలు అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వివాదాల్లో... స్వతంత్ర నిర్ణయాలు, ఆలోచనలు కలిగిన ఆర్థికవేత్తగా విరాళ్ ఆచార్య పేరుంది. ఇది ఆయనను పలు దఫాలు వివాదాల్లోకీ నెట్టింది. పలు సందర్భాల్లో ఆయన ప్రత్యక్షంగా కేంద్రంపై, ఆర్థిక మంత్రిత్వశాఖపై తన నిరసన గళం వినిపించారు. ప్రత్యేకించి సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తి పరిరక్షణకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృషించాయి. అందులో కొన్ని అంశాలు చూస్తే... ► గత ఏడాది అక్టోబర్‌లో ఆయన ఏడీ షరోఫ్ స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయ రూపకల్పన దీర్ఘకాలం దృష్టితో కాకుండా, స్వల్పకాల ప్రయోజనాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడుకుని ఉంటోందని పేర్కొన్నారు. పలు అంశాలపై ప్రభుత్వం–ఆర్బీఐ మధ్య ఉన్న విభేదాలను కూడా ఆయన ఈ ప్రసంగంలో పేర్కొన్నారు. ► మరో సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని తక్కువచేస్తే, అది క్యాపిటల్ మార్కెట్లలో విశ్వాస సంక్షోభాన్ని తీసుకువస్తుందని అన్నారు. అలాగే సెంట్రల్‌బ్యాంక్ సమర్థతపైనా ఆయా అంశాల ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ► మొండిబకాయిలకు సంబంధించి కొన్ని బ్యాంకులపై ప్రయోగించిన ‘దిద్దుబాటు చర్యల ప్రక్రియ’ (పీసీఏ)ను కూడా ఆయన పలు సందర్భాల్లో గట్టిగా సమర్థించారు. -
ఆర్బీఐ వరమిచ్చినా..
ముంబై: అంచనాలు, విశ్లేషణలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6% నుంచి 5.75%కి తగ్గింది. రెపో రేటు తగ్గించడం జనవరి నుంచీ ఇది మూడవసారి. రెండు నెలలకోసారి జరిగే సమీక్షలో గడిచిన ఆరు నెలల్లో మూడు సార్లు 0.25% చొప్పున రేటును ఆర్బీఐ తగ్గిస్తూ వస్తోంది. తాజా రేటు తగ్గింపుతో రెపో తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లయింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రేటు కోత నిర్ణయం తీసుకుంది. ఇక ముందూ రేటు తగ్గిస్తామనే సంకేతాలను ఇస్తూ, పాలసీ విధానాన్ని ‘తటస్థం’ నుంచి ‘మార్పునకు వీలైన సరళ వైఖరికి’ మార్చింది. ఏంటీ రెపో... బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపోగా వ్యవహరిస్తారు. గడిచిన ఆరునెలల్లో ఇది ఏకంగా 0.75 శాతం తగ్గింది. ఇలా తగ్గటం వల్ల ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చౌక వడ్డీకే నిధులు లభ్యమవుతాయి. అప్పుడు బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. అలా చేసినా వాటి లాభాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ పడదు. కానీ ఇక్కడే జరగాల్సింది సరిగా జరగడం లేదు. స్వయంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఈ విషయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ 5 వరకూ ఆర్బీఐ 0.50% రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం తగ్గింపును మాత్రమే కస్టమర్లకు బదలాయించాయి. అది కూడా కొత్తగా రుణాలు తీసుకునే వారికి మాత్రమే ఈ ప్రయోజనాన్ని అందజేశాయి. పాత రుణ గ్రహీతలకు ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04%. ఈ విషయంపై తాను బ్యాంకర్లతో మాట్లాడతానని కూడా ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. రుణాల్లో వృద్ధే ప్రధాన లక్ష్యంగా తాజా పాలసీ సమీక్ష, నిర్ణయాలు జరిగినట్లు తెలిపారు. రేటు తగ్గింపు పరిస్థితులు చూస్తే... బ్యాంకులకు తగ్గించిన రేటు ప్రయోజనం... సాధారణ వినియోగదారు నుంచి పరిశ్రమల వరకూ అందినప్పుడు అది వ్యవస్థలో రుణ రేటు తగ్గుదలకు తోడ్పడుతుంది. రుణాలపై వడ్డీ తక్కువ కనక రుణాలు ఎక్కువ తీసుకుంటారు. ఇది వృద్ధి మెరుగుదలకు దోహదపడుతుందనేది క్లుప్తంగా ఆర్థిక విశ్లేషణ. ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిపోయింది. మందగమనం చోటు చేసుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో... రెపో రేటు తగ్గింపునకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. ఆ అంశాలను పరిశీలిస్తే... ► అటు వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్బీఐ నిర్దేశిత శ్రేణి 2%కి అటు ఇటుగా 4 శాతం వద్దే కొనసాగుతున్నాయి. ► మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణి పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే మార్చిలో క్షీణతలోకి పారిశ్రామిక రంగం జారింది. తయారీ, సేవల రంగాలు మందగమనంలోకి జారిపోయాయి. వాహన రంగం రివర్స్‌గేర్‌లో ప్రయాణిస్తోంది. ► గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (208–19, జనవరి–మార్చి) భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయి 5.8 శాతానికి పడిపోయింది. వాహన, ఆటో, గృహ రుణ రేట్లు తగ్గే చాన్స్... బ్యాంకులు రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని గనక వినియోగదారులకు బదలాయిస్తే... దీనికి అనుసంధానమయ్యే వాహన, ఆటో, గృహ రుణాలపై కస్టమర్ నెలవారీ చెల్లించే వాయిదా మొత్తం (ఈఎంఐ) తగ్గుతుంది. కొత్త రుణాలకు సైతం వడ్డీ రేట్లు తగ్గుతాయి. మరోవంక డిపాజిట్లపై చెల్లించే వడ్డీని కూడా బ్యాంకులు తగ్గించేస్తాయి. అసంఘటిత రంగమే అత్యధికంగా ఉండే మన దేశంలో చాలామంది రిటైరైన తరవాత సరైన ఆదాయం కోసం వడ్డీపైనే ఆధారపడుతుంటారు. అలాంటి వారికి ఈ వడ్డీ తగ్గింపులు అశనిపాతం లాంటివే. కొన్నాళ్లుగా బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే... ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే అవి డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించేస్తున్నాయి. అదే స్పీడులో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించటం లేదు. దీనివల్ల బ్యాంకుల లాభాలు పెరుగుతాయి తప్ప కస్టమర్లకు ఒరిగేదేమీ ఉండదు. బ్యాంకుల ఈ వైఖరి వల్ల వృద్ధి రేటు వచ్చే మూడేళ్లు కూడా పెద్దగా పెరిగేదేమీ ఉండకపోవచ్చనేది రేటింగ్ ఏజెన్సీల అంచనా. పాలసీ ప్రధానాంశాలు... ► రెపో రేటును పావుశాతం తగ్గించడం వరుసగా ఇది మూడవసారి. ఇంతక్రితం వరుసగా రెండు దఫాలుగా తగ్గిన అరశాతంసహా తాజా పావుశాతం తగ్గింపుతో ఈ రేటు 5.75 శాతానికి దిగివచ్చింది. ఇది తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయి. ► రివర్స్ రెపో రేటు 5.50 శాతంగా ఉంది. ► మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6%. ► పాలసీ వైఖరిని ‘తటస్థం’ నుంచి ‘తగిన విధం గా మార్చుకునే సరళ విధానం’ వైపు మార్పు. ► జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు. ► ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 3 నుంచి 3.1 శాతం శ్రేణిలో ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ రేటు 3.4–3.7 శ్రేణిలో ఉంటుంది. ► వర్షపాతం విషయంలో అనిశ్చితి, క్రూడ్ ఆయి ల్ ధరలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలు ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతాయి. ► డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ చార్జీల రద్దు. ► బ్యాంకులు విధించే ఏటీఎం చార్జీలు, ఫీజుల సమీక్షకు కమిటీ నియామకం. ► నిర్దిష్టకాల పరిమితితో సంబంధం లేకుండా, ఎప్పటికప్పుడు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల లైసెన్సుల జారీకి సంబంధించి ఆగస్టు నాటికి ముసాయిదా మార్గదర్శకాల జారీ. ► పెట్టుబడుల్లో తీవ్ర మందగమనం, ప్రైవేటు వినియోగ వృద్ధి నెమ్మదించడం వంటి అంశాలపై ఆందోళన. ► పావుశాతం రేటు తగ్గింపునకు సానుకూలంగా మొత్తం ఆరుగురు సభ్యుల ఏకగ్రీవ ఓటు. ► జూన్ ప్రారంభంనాటికి వ్యవస్థలో సగటు రోజువారీ ద్రవ్యలభ్యత రూ.66,000 కోట్లు. ► దేశంలో మే 31వ తేదీ నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 421.9 బిలియన్ డాలర్లు. ► మొండిబకాయిల పరిష్కారం దిశలో 3, 4 రోజుల్లో కొత్త నిబంధనలు ► ద్రవ్యలోటు కట్టుతప్పకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల సవాళ్లను ఎదుర్కొనడంలో సహకారం. ► తదుపరి విధాన సమీక్ష ఆగస్టు 7. బ్యాంకర్లూ... మీరెంతో చేయాలి! ఆర్బీఐ రేటు తగ్గించినా... ఆ ప్రయోజ నాన్ని బ్యాంకర్లు వ్యవస్థలోకి బదలాయించకపోవడంపట్ల గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు మరెంతో చేయాల్సి ఉందని ఆయన సూచిం చారు. పాలసీ అనంతరం శక్తికాంతదాస్ పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూస్తే... ‘‘గతంలో ఆర్బీఐ పాలసీ రేటు తగ్గింపు నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రభావం వ్యవస్థలో ప్రతిబింబించడానికి నాలుగు నుంచి ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. ఈ ఏడాది జూన్ 5 వరకూ ఆర్బీఐ 0.50 శాతం రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం కస్టమర్లకు బదలాయించాయి. కొత్త రుణ గ్రహీతలకే ఈ మొత్తం ప్రయోజనం దక్కింది. పాత రుణ గ్రహీతలకు ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04% మాత్రమే. రేటు తగ్గింపు ప్రయోజనం మరింతమేర, మరింత వేగంగా అందాలన్నది మా అభిప్రాయం. వినియోగదారులకు, ద్విచక్ర వాహన గ్రహీతలకు అందరికీ ఈ ప్రయోజనం అందాలి. రేటు ప్రయోజనం బదలాయింపు ఏ మేర జరుగుతోందన్న విషయాన్ని ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రేటు ప్రయోజనం ఎంతో కీలకం. బ్యాంకులతో ఈ విషయంపై చర్చిస్తాం. చేయాల్సినదంతా చేస్తాం. ఏప్రిల్‌లో పావుశాతం రేటు తగ్గించాం. అయితే కొన్ని బ్యాంకులు కేవలం 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల రేటు కోత నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే మరింత రేటు ప్రయోజన బదలాయింపు జరగాలి. రుణ డిమాండ్, ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు ఇది ఎంతో అవసరం’’ – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ -
దాస్.. ‘డబుల్’ ధమాకా!
ముంబై: మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటు పావుశాతం కోతకు నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో 2వ తేదీ నుంచీ ఎంపీసీ ద్రవ్య విధాన కమిటీ ద్వైమాసిక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం కీలక నిర్ణయాలు మూడవరోజు– గురువారం వెలువడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) ఇది తొలి ద్వైమాసిక సమావేశం. రెండు నెలల క్రితం జరిగిన ద్వైమాసిక సమావేశంలో (ఫిబ్రవరి 7) కూడా ఆర్బీఐ రెపో రేటు పావుశాతం కోత నిర్ణయం తీసుకుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి. గత ఏడాది ఆర్బీఐ రెండు సార్లు అరశాతం రేటు పెంచింది. తాజా నిర్ణయంతో పెరిగిన మేర రివర్స్ అయినట్లయ్యింది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ మరో వారంలో ఉండగా ఆర్బీఐ తాజా కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, రివర్స్ రెపో రేటును కూడా ఆర్బీఐ పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి సర్దుబాటు అయ్యింది. బ్యాంకులు తమ వద్ద మిగులు నిధులు ఉంటే, వాటిని ఆర్బీఐ వద్ద ఉంచి వడ్డీ పొందుతాయి. ఈ రేటునే రివర్స్ రెపోగా పేర్కొంటారు. ఈ రేటు ఎక్కువగా ఉంటే, తద్వారానే అధిక ప్రయోజనం పొందడానికి బ్యాంకులు మొగ్గుచూపుతాయి. వ్యవస్థలో రుణ లభ్యత, లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెరగాలంటున్న ఆర్బీఐ, రివర్స్రెపో రేటును కూడా తగ్గించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరంలో రెండవ ద్వైమాసిక సమావేశం జూన్ 3 నుంచి 6వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలు ఎలా ఉంటాయంటే? బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. దీనిని తగ్గిస్తే, బ్యాంకులకు నిధుల సమీకరణ భారం తగ్గుతుంది. ఇలా తమకు లభించే వడ్డీరేటు ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయిస్తే, గృహ, రుణ, వాహన రుణాలపై కస్టమర్ల నెలవారీ చెల్లింపులు (ఈఎంఐ) తగ్గుతాయి. అయితే తమకు లభించిన రేటు ప్రయోజనాన్ని యథాతథంగా బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించడం లేదన్న విమర్శ అన్ని వర్గాల నుంచీ వ్యక్తమవుతుంది. ఆర్బీఐ తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తగ్గించిన రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందేలా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఫిబ్రవరిలో పావుశాతం రేటు తగ్గిస్తే, కొన్ని బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్స్) కేవలం 5 నుంచి 10 బేసిస్ పాయింట్లే తగ్గించిన విషయాన్ని గుర్తుచేసింది. మరింత రేటు కోత అవసరాన్ని స్పష్టంచేసింది. కాగా రెపో రేటు, బాండ్ ఈల్డ్స్ వంటి బెంచ్‌మార్క్ రేట్లతో వ్యక్తిగత, గృహ, ఆటో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాల అనుసంధానంపై బ్యాంకులతో ఆర్బీఐ మరిన్ని చర్చలు జరుపుతుందని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. దీనితో ఇందుకు సంబంధించి తుది మార్గదర్శకాల జారీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. యథాతథమే బెటరన్న ఇరువురు కాగా రేటు కోత నిర్ణయం ఏకాభిప్రాయ ప్రాతిపదికన జరగలేదు. ఇరువురు సభ్యులు ఇందుకు ‘నో’ అన్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, ఎంసీసీ సభ్యుడు ఛేతన్ ఘాటే ఇందులో ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్‌తో పాటు పామీదువా, రవీంద్ర దోలాకియా, మైఖేల్పాత్రలు రేటుకోతకు సానుకూలంగా ఓటు వేశారు. ఇక ద్రవ్య వ్యవస్థకు సంబంధించి అనుసరించాల్సిన వైఖరిపై ఆరుగురిలో ఐదుగురు ప్రస్తుతం ఉన్న ‘న్యూట్రల్’ (తటస్థం)ను కొనసాగించాలని పేర్కొంటే, రవీంద్ర డోలాకియా మాత్రం ‘అకామిడేటివ్’ (సర్దుబాటుకు అనువైన) విధానాన్ని అనుసరించడానికి ఓటు చేశారు. దీనితో తటస్థం విధానాన్నే ఆర్బీఐ ఎంచుకున్నట్లయ్యింది. ధరా‘భయం’ ఉపశమనం... ద్రవ్యోల్బణం రేటు అంచనాలను మాత్రం ఆర్బీఐ తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 2.9–3 శాతం శ్రేణిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఫిబ్రవరిలో ఈ అంచనాలను 3.2–3.4 శ్రేణిగా ఆర్బీఐ పేర్కొంది. కాగా ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో 3.5–3.8% వరకూ ఉంటుందని అంచనావేసింది. అంటే ఆర్బీఐ లక్ష్యం 4% దిగువనే ద్రవ్యోల్బణం ఉంటుందన్నమాట. ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2.57 శాతం. కాగా ఆహార, ఇంధన ధరలు తీవ్రంగా పెరిగితే మాత్రం మొత్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది. వృద్ధి, ద్రవ్యోల్బణం ప్రాతిపదికగా... ‘తాజా నిర్ణయానికి ప్రధానంగా రెండు అంశాలు కారణం. ఒకటి వృద్ధిరేటు మందగమనంలో ఉండడం. రెండవది ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం. ధరల స్పీడ్ తక్కువగా ఉన్నందువల్ల వృద్ధి లక్ష్యంగా రేటు కోతకు తగిన సమయమని భావించడం జరిగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో ఎగుమతుల వృద్ధి బలహీనంగా ఉంది. దిగుమతులు విషయానికి వస్తే, చమురు యేతర దిగుమతులు తగ్గాయి. బంగారం దిగుమతులూ తగ్గాయి. దేశంలో వృద్ధి మందగమన పరిస్థితులను ఇది సూచిస్తోంది. ఇక ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) అవరోధాలు లేకుండా చూస్తాం’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ఎదురీత... దేశీయ ఆర్థిక వ్యవస్థ ఎదురీదుతోందని విధాన ప్రకటన తెలిపింది. ప్రత్యేకించి అంతర్జాతీయ రంగంలో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును 7.2 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరిలో ఈ రేటును 7.4 శాతంగా అంచనా వేసింది. అంటే 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత పెట్టిందన్నమాట. డిసెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)వృద్ధి రేటు 6.6 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రైవేటు పెట్టుబడుల్లో బలహీనత దీనికి కారణం. బలహీనంగా ఉన్న ప్రైవేటు పెట్టుబడులకు ఊతం ఇవ్వడం ద్వారా దేశీయ వృద్ధి రేటును పటిష్ట పరచుకోవాల్సి ఉందని ప్రకటన పేర్కొంది. ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.1 శాతం శ్రేణిలో ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేయగా, రెండవ అర్ధభాగంలో 7.3 శాతం నుంచి 7.4 శాతం మధ్య ఉంటుందని భావించింది. సుప్రీం తీర్పు వ్యతిరేకం కాదు... మొండిబకాయిలకు సంబంధించి 2018 ఫిబ్రవరి 12 ఆర్బీఐ సర్క్యులర్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిందంటే.. దానర్థం, ఆర్బీఐ అధికారాలను తీసుకుందని కాదు. ఇందుకు సంబంధించిన అధికారాలను ఎలా వినియోగించాలన్నది సుప్రీంకోర్టు సూచించింది. అందువల్ల ఎన్పీఏ పునర్వ్యవస్థీకరణ, పరిష్కార ప్రణాళికలకు సంబంధించి త్వరలో ఆర్బీఐ సవరిత మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఎన్పీఏల సత్వర పరిష్కారానికి ఆర్బీఐ కట్టుబడి ఉంది. బ్యాంకింగ్ స్థిరత్వానికి ఇది ఎంతో అవసరం. మొత్త ఫైనాన్షియల్ రంగంలో పరిస్థితులకు అనుసంధానమైన అంశం ఇది. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న ఒక సంస్థ సహా (కొటక్ మహీంద్రా బ్యాంక్) విద్యుత్ కంపెనీలు ఆర్బీఐని కోర్టుకు లాగడం ఆందోళనకరమన్న విశ్లేషణలు సరికాదు. ఏ సంస్థ నిర్ణయాన్నైనా చట్టం ముందు సవాలు చేయడం ఒక రాజ్యాంగ హక్కు. ఐఎల్ ఎఫ్ఎస్ రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించవద్దని ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన రూలింగ్ విషయానికి వస్తే, దీనిని సవరించవలసిందిగా ఆర్బీఐ ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇక గణాంకాల విషయానికి వస్తే, అధికారికంగా అందిన డేటాకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక వ్యవస్థపై అంచనాలు, తమ పాలసీలపై స్పందనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. కార్పొరేట్ రుణాలకు సెకండరీ మార్కెట్ అభివృద్ధిపై కార్యాచరణ బృందం ఏర్పాటు చేయడం జరుగుతుంది. – శక్తికాంత్ దాస్, ఆర్బీఐ గవర్నర్ రేట్ల తగ్గింపును బ్యాంకులు బదలాయిస్తే మంచిదే: పరిశ్రమలు పారిశ్రామిక వర్గాలు రేటు తగ్గింపును స్వాగతించాయి. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చే అంశంగా పేర్కొన్నాయి. వినియోగ వ్యయాలు పెరుగుతాయని విశ్లేషించాయి. అయితే తాజా రేటు కోత ప్రయోజనాలన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయిస్తేనే ఇది సాధ్యమని పేర్కొన్నాయి. ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం రేటు కోతకు దోహదపడిందన్నారు. రేటు మరికొంత తగ్గింపునకూ అవకాశం ఉందని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ తల్వార్ అభిప్రాయపడ్డారు. వృద్ధి పటిష్టతపై ఆర్బీఐ పాలసీ దృష్టి సారించిందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. అయితే రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి బ్యాంకింగ్ తగిన చర్యలు తీసుకోవాలని వీరు అభిప్రాయపడటం గమనార్హం. బ్యాంకుల నుంచి స్పందన నిల్... ఆర్బీఐ వరుసగా రెండవదఫా రేటుకోత నిర్ణయం తీసుకున్నా... ఈ ప్రయోజనాన్ని తక్షణం కస్టమర్లకు బదలాయించడంపై బ్యాంకుల నుంచి తగిన స్పందన రాలేదు. పాలసీ బాగుందని పేర్కొన్నా, తమ నుంచి రేటు కోతపై ఏ బ్యాంక్ నుంచీ తక్షణం ఎటువంటి స్పష్టమైన ప్రకటనలు వెలువడలేదు. సంక్లిష్టతలు ఉన్నాయ్ జీడీపీ రేటు అంచనా తగ్గింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందన్న అంచనాలు ఉన్నా, తగిన వర్షపాతం లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. లిక్విడిటీ లభ్యతలకు చర్యలు బాగున్నాయి. ముందుచూపుతో రూపొందించిన ద్రవ్య విధానమిది. మార్కెట్ భాగస్వాముల డిమాండ్‌ను నెరవేర్చుతుంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చీఫ్ బ్యాంకింగ్‌కు సానుకూలం రేటు తగ్గింపు, లిక్విడిటీ అందుబాటులో ఉంచడానికి తగిన చర్యలు బ్యాంకర్లకు సానుకూలం. అలాగే రేటు తగ్గింపు ప్రయోజనం సత్వర బదలాయింపునకూ ఈ నిర్ణయం దోహదపడుతుంది. రేటు కోత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ధరలు అదుపులో ఉంటాయన్న అంచనాలు సానుకూలం. – సునిల్ మెహతా, ఐబీఏ చైర్మన్ భయపడాల్సింది ఏదీలేదు ఆర్బీఐ తాజా పాలసీ సమీక్షలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను తగ్గించినంత మాత్రాన భయపడాల్సింది ఏమీలేదు. వృద్ధికి సంబంధించి రానున్న కాలంలో ఆశాజనకమైన పలు అంశాలు ఉన్నాయి. బడా కార్పొరేట్ కంపెనీలకు రుణ వృద్ధి అంతకంతకూ పెరుగుతుండడం ఇందులో ఒకటి. – కృష్ణమూర్తి సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు ఆర్బీఐ రిజర్వ్స్‌పై త్వరలో జలాన్ నివేదిక రిజర్వ్ బ్యాంక్ వద్ద నిల్వలు ఏ స్థాయిలో ఉండాలన్న అంశంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ త్వరలో తన నివేదికను సమర్పిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కమిటీ ప్రస్తుతం ముమ్మర చర్చల్లో ఉందన్నారు. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. భారీ ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ఆర్బీఐ నిధుల్లో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతున్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. -
కుదిరితే మరిన్ని కోతలు
ధరలు తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలకు రుణాల వృద్ధి కోసమే రేట్లను పావుశాతం మేర తగ్గించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఎంపీసీ విధాన ప్రకటన తర్వాత మీడియాతో పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అంచనాల పరిధిలోనే తక్కువగా ఉంటే భవిష్యత్తులో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ చట్ట నిబంధనల పరిధిని మించి ఎంపీసీ ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ‘‘వచ్చే 12 నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.9 శాతం పరిధిలో... గరిష్టంగా 4 శాతం లేదా అంతకులోపు ఉంటే రేట్ల తగ్గింపును పరిశీలించే అవకాశం ఉంటుంది’’అని దాస్ పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రతిపాదనల వల్ల ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొత్త ద్రవ్యోల్బణం అంచనాలకు వచ్చినట్టు చెప్పారు. లిక్విడిటీ సమస్య లేదు వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, కీలకమైన ఏ రంగానికీ నిధుల లభ్యత (లిక్విడిటీ) సమస్య లేదని శక్తికాంతదాస్ తెలిపారు. అవసరమైనప్పుడు తగినన్ని నిధులను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా వ్యవస్థలోకి రూ.2.36 లక్షల కోట్లను తీసుకొచ్చామని, ఫిబ్రవరి నెలలో రూ.37,500 కోట్లను తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని విరాళ్ ఆచార్య గుర్తు చేశారు. ఎన్పీఏ నిబంధనల్లో మార్పుల్లేవు రుణ చెల్లింపుల్లో ఒక్కరోజు విఫలమైనా ఎన్పీఏలుగా గుర్తించాలన్న 2018 ఫిబ్రవరి 12 నాటి ఉత్తర్వుల్లో ఎటువంటి మార్పులను చేయడం లేదని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనా లేదన్నారు. నాటి ఉత్తర్వుల మేరకు బ్యాంకులు నిర్ణీత గడువులోపు రుణ చెల్లింపులు చేయని ఖాతాల విషయంలో నిర్ణీత వ్యవధిలోపు పరిష్కారం చూడడం, విఫలమైతే ఐబీసీ చట్టం కింద ఎన్సీఎల్టీకి నివేదించడం చేయాల్సి ఉంటుంది. మధ్యంతర డివిడెండ్... న్యాయబద్ధమే ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌ను కోరడం చట్టబద్ధమేనని, ఈ నిధులను దేనికి వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమేనని దాస్ చెప్పారు. ఆర్బీఐ నుంచి మరిన్ని నిధులను బదిలీ చేయాలన్న ప్రభుత్వ డిమాండ్లతోనే ఉర్జిత్ పటేల్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘‘మిగులు నిధులు లేదా మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించడం అన్నది ఆర్బీఐ చట్టం పరిధిలోనిదే. ఈ చట్టపరమైన నిబంధనలను దాటి మేమేమీ చేయడం లేదు’’ అని దాస్ స్పష్టం చేశారు. చందాకొచర్‌పై నిర్ణయం దర్యాప్తు సంస్థలదే... ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్ వ్యవహారంలో దాస్ తొలిసారి స్పందించారు. ఈ కేసులో చర్యలు తీసుకోవడం దర్యాప్తు సంస్థల పరిధిలోనే ఉందన్నారు. నిబంధనలను వ్యక్తులు లేదా గ్రూపు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే విషయంలో ఆర్బీఐ పాత్ర పరిమితమేనన్నారు. ఒకవేళ ఏదైనా అంశాల్లో దర్యాప్తు అవసరం అయితే తదుపరి చర్యల అధికారం వారి పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. సాగు రంగానికి వెసులుబాటు హామీల్లేకుండా వ్యవసాయానికి ఇచ్చే రుణాల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగానికి రుణాల పరిస్థితిని సమీక్షించి ఆచరణాత్మక విధానాన్ని సూచించేందుకు ఓ అంతర్గత వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయనుంది. గత కొన్నేళ్లలో వ్యవసాయ రంగానికి రుణాల పంపిణీ వృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ... ఈ రుణాల పంపిణీ విషయంలో ప్రాంతాల మధ్య అంతరాలు, కవరేజీ విస్తృతి వంటి సమస్యలు ఉన్నట్టు ఆర్బీఐ పేర్కొంది. ఈ అంశాలను ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు పరిగణనలోకి తీసుకోనుంది. డిపాజిట్లకు నిర్వచనంలో మార్పు బ్యాంకులకు డిపాజిట్ల సమీకరణ విషయంలో ఆర్బీఐ కొంత స్వేచ్ఛ కల్పించింది. ప్రస్తుతం రూ.కోటి ఆపై మొత్తాలను బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తుంటే, దీన్ని రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువకు మార్చింది. బ్యాంకులు చిన్న డిపాజిట్ల కంటే బల్క్ డిపాజిట్లపై కొంత మేర అదనపు వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. బ్యాంకులు తమ అవసరాలు, ఆస్తులు, అప్పుల నిర్వహణ సమతుల్యత కోసం బల్క్ డిపాజిట్లపై భిన్నమైన రేటును ఆఫర్ చేసే స్వేచ్ఛ వాటికి ఉంటుంది. అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఏర్పాటుకు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. దివాలా ప్రక్రియలో పాల్గొనే బిడ్డర్లకు ఈసీబీ సదుపాయం దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) పరిధిలోని కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ)లో పాల్గొనే కంపెనీలు ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ) మార్గంలో నిధుల సమీకరణకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ కరెన్సీ లేదా రూపాయి మారకంలో ఈసీబీ ద్వారా సమీకరించే నిధులను తిరిగి చెల్లింపులు లేదా రూపాయి మారకంలోని రుణాలను తీర్చివేసేందుకు అనుమతి లేదు. మరో రేటు కోత అంచనా! తాజా రేటు తగ్గింపు వృద్ధికి దోహదపడే అంశమని పలు వర్గాలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనితోపాటు త్వరలో మరో దఫా రేటు కోత తథ్యమని మెజారిటీ విశ్వసిస్తోంది. తాజా పాలసీపై పలువురి అభిప్రాయాలు ఇలా... తటస్థ వైఖరి... సానుకూలం పాలసీపై ‘తటస్థం’ దిశగా ఆర్బీఐ అడుగులు వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి తగిన సానుకూలతను సృష్టిస్తోంది. ధరలు పెరక్కపోతే మరో కోతకు చాన్సుంది. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు కీలక నిర్ణయాలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో రైతులకు మరింత రుణం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల రైతుల రుణ సమస్యలు కొంత తీరుతాయి. ఇక వ్యవస్థలో మొత్తంగా రుణ డిమాండ్ పెరుగుతుంది. – దినేష్ ఖేరా, ఎస్బీఐ ఎండీ వేచి చూడాల్సి ఉంది వృద్ధికి తాజా పాలసీ కొంత అవకాశం కల్పించింది. అయితే పూర్తి ఫలితానికి వేచి చూడాల్సి ఉంటుంది. ద్రవ్యలోటుసహా పలు అంశాలపై వృద్ధి జోరు ఆధారపడి ఉంటుంది. – ప్రజుల్ భండారీ, హెచ్ఎస్బీసీ (ఇండియా) చీఫ్ ఎకనమిస్ట్ మరింత తగ్గింపు ఉండవచ్చు ఆర్బీఐ నిర్ణయం హర్షణీయం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న ప్రస్తుత తరుణంలో రేటు తగ్గింపు మరో విడత ఉండవచ్చని భావిస్తున్నాం. పెట్టుబడులు, వినియోగం పెరుగుదలకు ఇది అవసరం. – సందీప్ సోమానీ, ఫిక్కీ ప్రెసిడెంట్ ఏప్రిల్‌లో మరో కోత ఏప్రిల్‌లో మరో దఫా రేటు కోత ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, పారిశ్రామిక వృద్ధి మందగమనం దీనికి కారణం. ఆర్బీఐ నిర్ణయాలు వ్యవస్థలో లిక్విడిటీని పెంచుతున్నాయి. – రాధికారావు, డీబీఎస్ ఎకనమిస్ట్ బ్యాంకింగ్ రంగానికి సానుకూలం శక్తికాంతదాస్ మొదటి పాలసీ బ్యాంకింగ్‌పై పెద్ద స్థాయిలో సానుకూల ప్రభావం చూపుతుంది. వ్యవస్థలో రుణ వృద్ధికి అలాగే మొత్తంగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడే నిర్ణయం ఇది. – సునిల్ మెహతా, ఐబీఏ చైర్మన్ -
రుణాలిక..బిం‘దాస్’
ముంబై: ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ వృద్ధికే తన ప్రథమ ప్రాధాన్యం అని సంకేతమిచ్చారు. ధరలు తమ లక్ష్యానికి అనుగుణంగా స్థిరపడితే సమయానుకూలంగా వ్యవహరిస్తామంటూ అవసరానికి అనుగుణంగా భవిష్యత్తులోనూ రేట్ల కోతకు అవకాశాలు ఉంటాయని పరోక్షంగా సంకేతమిచ్చారు. ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయిలకు దిగి రావడం, మరోవైపు రుణాలు భారంగా మారాయని, వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పారిశ్రామిక రంగం, ప్రభుత్వం నుంచి వచ్చిన డిమాండ్లను మన్నించారు. బడ్జెట్లో తాయిలాలతో తిరిగి ద్రవ్యోల్బణానికి రెక్కలు వస్తాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ.. పరిమితంగా పావు శాతం రేట్లను తగ్గించి ఉపశమనం కల్పించారు. 18 నెలల తర్వాత మళ్లీ ఆర్బీఐ వడ్డీ రేటను తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంతదాస్ తన ఆధ్వర్యంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి భేటీలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరవ ద్వైమాసిక సమావేశం) అందరినీ ఆశ్చర్యపరుస్తూ కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో 6 శాతానికి దిగొచ్చాయి. క్రమానుగత కఠిన విధానాన్ని ఇప్పటి వరకు అనుసరిస్తుండగా, దీన్ని తటస్థానికి (న్యూట్రల్‌కు) సడలించారు. ఈ నిర్ణయాలతో ఇంటి రుణాలు, ఇతర రుణాలు చౌకగా మారనున్నాయి. ఈఎంఐల భారం తగ్గనుంది. కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు రుణాల వితరణకు, ఆర్థిక ఉద్దీపనానికి ఆర్బీఐ నిర్ణయాలు వీలు కల్పించనున్నాయి. గతానికి భిన్నంగా... ఆర్బీఐ గవర్నర్‌గా వచ్చిన తర్వాత శక్తికాంతదాస్ వివిధ రంగాల ప్రతినిధులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కోర్కెల గురించి తెలుసుకున్నారు. ద్రవ్యోల్బణం చాలా కనిష్ట స్థాయిల్లో ఉండడం, వృద్ధి రేటు ఆశించినంత లేకపోవడంతో వడ్డీ రేట్లలో కోత విధించొచ్చని ఎక్కువ మంది భావించారు. కానీ, మధ్యంతర బడ్జెట్లో రైతులకు ప్రకటించిన ప్యాకేజీ, ఆదాయపన్ను మినహాయింపుల వంటి ప్రోత్సాహకాలతో వినియోగం పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్బీఐ ఎంపీసీ రేట్లను తగ్గించకపోవచ్చని, తటస్థానికి తన విధానాన్ని మార్చొచ్చన్న అభిప్రాయాలూ వినిపించాయి. కానీ, బడ్జెట్‌కు ముందు వ్యక్తమైన అంచనాలను దాస్ నిజం చేశారు. రేట్ల కోత విధింపునకు ఆరుగురు సభ్యుల ఎంపీసీలో ఆర్బీఐ గవర్నర్ సహా నలుగురు అనుకూలంగా ఓటేశారు. తటస్థ విధానానికి మారేందుకు మాత్రం ఆరుగురు అంగీకారం తెలిపారు. 2014 జనవరి 28న కీలక రేట్ల పెంపు తర్వాత నుంచి... రేట్లు తగ్గుతూ వచ్చాయి. దీనికి విరామం పలుకుతూ 2018 జూన్, ఆగస్ట్ సమావేశాల్లో ఆర్బీఐ ఎంపీసీ కీలక రేట్లను పావు శాతం చొప్పున పెంచింది. ఈ మధ్య కాలంలో అంటే 2014 జవవరి నుంచి 2018 జూన్‌లోపు ఆరు సార్లు వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది. వృద్ధి కోసమే కోత... ‘‘పెట్టుబడుల ధోరణి పుంజుకుంటోంది. అయితే, ఇది ప్రధానంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వెచ్చిస్తున్న నిధుల వల్లే. ప్రైవేటు పెట్టుబడులను, ప్రైవేటు వినియోగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మధ్య కాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కొనసాగించాలన్న లక్ష్యానికి లోబడే వృద్ధికి మద్దతు ఇచ్చేందుకు రేట్ల కోత చేపట్టడం జరిగింది’’ అని ఆర్బీఐ పరపతి విధాన కమిటీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బోణీ రుణ రేటు తగ్గింపు.. ముంబై: ఆర్బీఐ రేట్లు తగ్గించిన కొన్ని గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేటును 0.05 శాతం తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, ఆరు నెలల కాల వ్యవధి కలిగిన రుణాలకే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఏడాది సహా మిగిలిన కాల వ్యవధి రుణాలకు ఇంతకుముందు రేట్లే అమలవుతాయి. ఆరు నెలల రుణాలకు ఇక 8.55 శాతం రేటును బ్యాంకు అమలు చేస్తుంది. చౌకగా రుణాలు... ఆర్బీఐ రెపో రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించడం, తన విధానాన్ని తటస్థానికి మార్చడం ఆర్థిక రంగానికి బలాన్నిస్తుంది. చిన్న వ్యాపారులకు, ఇళ్ల కొనుగోలుదారులకు చౌకగా రుణాలు లభించేందుకు తోడ్పడుతుంది. ఇది ఉద్యోగ అవకాశాలకూ మరింత ఊతమిస్తుంది. – పీయూష్ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి హౌసింగ్ డిమాండ్ జోరు.. ఈ నిర్ణయం గృహ కొనుగోలు డిమాండ్ పెరుగుదలకు దోహదపడుతుంది. ఆర్బీఐ కల్పించిన తాజా వెసులుబాటును బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు బదలాయిస్తాయని భావిస్తున్నాం. మరోపక్క, రియల్టీ రంగానికి ద్రవ్య లభ్యత పెరుగుదల దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. – జక్సాయ్ షా, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వ్యాపార వర్గాలకు శుభవార్త... తాజా పాలసీలో ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు, దీనితోపాటు ‘జాగరూకతతో కూడిన కఠిన వైఖరి’ నుంచి ‘తటస్థ’ దిశగా తన పాలసీ వైఖరిని మార్చుకోవడం పారిశ్రామిక రంగానికి శుభవార్తలు. వ్యవస్థలో వినియోగం, పెట్టుబడులు రెండూ పెరుగుతాయ్. దీనివల్ల వృద్ధి జోందుకుంటుంది. – రాకేశ్ భారతీ మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్ మరింత తగ్గే సంకేతాలు... దేశంలో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్ధేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. దీంతో రేట్ల కోతకు వెసులుబాటు లభించింది. రానున్న కొద్దికాలంపాటు ధరలు కట్టడిలో ఉండే అవకాశాల నేపథ్యంలో రేటు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ పరపతి విధానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. – రజ్నీష్ కుమార్, ఎస్బీఐ చీఫ్ పాలసీ ముఖ్యాంశాలు... ► రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింపు. రివర్స్ రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. బ్యాంకు రేటు 6.5 శాతం. ► ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు. ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు. ► నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)లో ఎలాంటి మార్పుల్లేవు. 4 శాతంగానే కొనసాగుతుంది. ► వడ్డీ రేట్ల తగ్గింపునకు శక్తికాంతదాస్ సహా నలుగురు ఎంపీసీ సభ్యులు అనుకూలంగా ఓటు. చేతన్‌ఘటే, విరాళ్ ఆచార్య యథాతథానికి ఓటు. ► రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2019 జనవరి–మార్చి త్రైమాసికానికి 2.8 శాతానికి తగ్గింపు. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు(ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి) 3.2–3.4 శాతంగా అంచనా. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి అంచనా 3.9 శాతం. ► జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగా ఉండొచ్చు. 2019–20లో ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 7.2–7.4 శాతంగాను, అక్టోబర్–డిసెంబర్ కాలానికి 7.5 శాతంగానూ ఉండొచ్చు. ► చమురు ధరల్లో అస్పష్టత ఉండొచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి. ► వ్యవసాయ రుణాలు, ప్రాంతీయ అసమానత, కవరేజీ విస్తృతికి ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు. ► రూపాయి విలువలో స్థిరత్వానికి ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్ల కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు. ► కార్పొరేట్ డెట్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో ఎఫ్‌పీఐలపై ఉన్న నియంత్రణలు ఎత్తివేత. ► పేమెంట్ గేట్‌వే సర్వీసు ప్రొవైడర్లు, పేమెంట్ అగ్రిగేటర్లకు సంబంధించి త్వరలో చర్చా పత్రం విడుదల. ► కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతమిస్తాయి. ► ఎన్‌బీఎఫ్‌సీల సమన్వయానికి త్వరలో మార్గదర్శకాలు. ► ఆర్బీఐ తదుపరి ఎంపీసీ భేటీ వచ్చే ఏప్రిల్ 2న జరగనుంది. -
బ్యాంకు సీఈవోలతో శక్తికాంత దాస్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశమయ్యారు. బ్యాంకింగ్ రంగం నుంచి ప్రభుత్వం ఏమి ఆశిస్తోందో తెలియజెప్పే ఉద్దేశంతో పలు బ్యాంకుల సీఈవోలతో భేటీ అయినట్టు ఆయన వివరించారు. దీంతోపాటు ప్రస్తుత, భవిష్యత్తు అంశాలపై చర్చంచామని సమావేశం అనంతరం శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 2018-19 సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక మానిటరీ పాలసి రివ్యూ ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత ఆధ్వర్యంలో ఇది మొదటి పరపతి విధాన సమీక్ష. మరోవైపు ఈ పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఐసీఐసీఐ -వీడియోకాన్ కుంభకోణంలో బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్‌పై కేసు నమోదు, దాదాపు సగానికిపైగా బ్యాంకులు ఆర్బీఐ సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) నిబంధనల కిందికి రావడం తదితర అంశాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
వడ్డీ రేట్లు తగ్గించాలి
న్యూఢిల్లీ: దేశ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు కీలకమైన వడ్డీ రేట్లను, నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించాలని దేశ పారిశ్రామిక సంఘాలు ఆర్బీఐని కోరాయి. కీలకమైన మానిటరీ పాలసీ సమీక్షకు ముందు దేశ పారిశ్రామిక ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం ముంబైలో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయ త్నం చేశారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగొచ్చినందున రుణాలపై అధిక వ్యయాలను తగ్గించాలని, కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టాలని పారిశ్రామికవేత్తలు ఈ సందర్భంగా కోరారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష ఫిబ్రవరి 7న జరగనుంది. ప్రస్తుతం సీఆర్ఆర్ 4 శాతం (బ్యాంకు డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిష్పత్తి), రెపో రేటు 6.5 శాతంగా (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై రేటు) ఉన్నాయి. సీఐఐ సూచనలు ఇవీ... ‘‘నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కనీసం అర శాతమయినా తగ్గించాలి. ద్రవ్యోల్బణం స్థిరంగా కనిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నందున రెపో రేటును సైతం అరశాతం తగ్గించడాన్ని పరిశీలించాలి. తద్వారా రుణాలపై అధిక వ్యయ భారాన్ని తగ్గించాలి. ఎంఎస్ఎంఈ, ఇన్ఫ్రా రంగానికి రుణ సదుపాయాన్ని పెంచాలి’’ అని సీఐఐ సూచించింది. ద్రవ్యలభ్యత పెంపునకు ఆర్బీఐ తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు, బ్యాంకులు కోరే అదనపు హామీలను పరిమితం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది. సరైన హామీలు ఇచ్చినప్పుడు వ్యక్తిగత హామీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చూడాలని కోరింది. సీఐఐ ప్రెసిడెంట్ డిసిగ్నేట్ ఉదయ్ కోటక్ ఆధ్వర్యంలో ఈ సూచనలు చేశారు. కొనుగోలు దారులకు క్రెడిట్ సదుపాయం కల్పించే లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌లను (ఎల్ఓయూ) ఎంఎస్ఎంఈలకు కూడా జారీ చేసేలా బ్యాంకులను ఆదేశించాలని కోరింది. బలహీన బ్యాంకుల విషయంలో కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణను పునఃసమీక్షించాలని, కనీసం ఆయా బ్యాంకులను నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు రుణాలిచ్చేందుకు అయినా అనుమతించాలని కోరింది. దీనివల్ల హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నిధుల లభ్యత పెరుగుతుందని అభిప్రాయపడింది. వృద్ధిని కూడా చూడాలి... రెపో రేటు, సీఆర్ఆర్ను తగ్గించాలని మరో పారిశ్రామిక సంఘం ఫిక్కీ కూడా ఆర్బీఐ గవర్నర్‌ను కోరింది. దీని వల్ల దేశంలో పెట్టుబడులు పుంజుకుంటాయని, వినియోగాన్ని పెంచి వృద్ధికి తోడ్పడతాయని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని పేర్కొన్నారు. ‘‘వృద్ధిపై దృష్టి సారించేలా సర్దుబాటుతో కూడిన మానిటరీ పాలసీ అవసరం. మానిటరీ పాలసీ ఉద్దేశ్యాలు కేవలం ధరల స్థిరత్వానికే పరిమితం కాకూడదు. వృద్ధి రేటు, కరెన్సీ మారకం స్థిరత్వానికి కూడా అవసరమే’’ అని సందీప్ సోమాని సూచించారు. దేశంలో నగదు లభ్యత పెంచే విధంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉండాలని, ద్రవ్య లభ్యత వృద్ధిని నిలబెట్టగలదని అసోచామ్ సూచించింది. ‘‘ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల నిధుల సమీకరణ సామర్థ్యాలు గణనీయంగా తగ్గాయి. నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను వాటికి కల్పించాల్సి ఉంది. కేవలం ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల ఆరోగ్యం కోసమే కాదు, జీడీపీ స్థిరమైన వృద్ధికి కూడా ఇది తప్పనిసరి అవసరం’’ అని అసోచామ్ తన సూచనల్లో పేర్కొంది. మరింత కరెన్సీ అవసరం: ఆర్బీఐ కోల్‌కతా: దేశ జీడీపీ పరిమాణం పెరుగుతున్న కొద్దీ వ్యవస్థలో మరింత నగదు అవసరం ఉంటుందని రిజర్వ్ బ్యాంకు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలో నగదుకు కొరత ఏర్పడిన విషయం విదితమే. -
రెండు మూడు అంశాల్లో ఆర్బీఐతో విభేదాలు
ముంబై: రెండు మూడు విషయాల్లో ఆర్బీఐతో ప్రభుత్వానికి అంతరాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. ఆర్బీఐ పనితీరుపై చర్చను దెబ్బతీయడంగా ఎలా అభివర్ణిస్తారని జైట్లీ ప్రశ్నించారు. రాజకీయ పరమైన ఒత్తిళ్ల కారణంగానే ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో... గతంలోనూ ప్రభుత్వాలు ఈ తరహా చర్యలు తీసుకున్న ఉదంతాలున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ ఆర్బీఐ గవర్నర్లను రాజీనామా చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ముంబైలో టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన భారత ఆర్థిక సదస్సుకు హాజరైన సందర్భంగా జైట్లీ మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో రుణాల లభ్యత, ద్రవ్యపరమైన మద్దతు విషయాల్లో ఆర్బీఐతో విభేదాలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. ప్రభుత్వం తన ఆందోళనలను తెలియజేసేందుకు చర్చలను ప్రారంభించినట్టు తెలిపారు. ఓ కీలకమైన సంస్థగా ఆర్బీఐతో చర్చలు జరపడం దెబ్బతీయడం అవుతుందా? అని ప్రశ్నించారు. ‘‘మాది సౌర్వభౌమ ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విషయంలో చాలా ముఖ్యమైన భాగస్వాములం’’ అని జైట్లీ అభివర్ణించారు. రుణాలు, లిక్విడిటీ విషయంలో ఆర్బీఐపై బాధ్యత ఉందన్నారు. -
కొంచెం కనికరించండి..!
ముంబై: ఆర్బీఐ నూతన గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ముంబైలో ప్రభుత్వరంగ బ్యాంకుల సారథులతో భేటీ అయ్యారు. అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఆర్బీఐ అనుసరిస్తున్న కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ), రుణ చెల్లింపుల్లో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా వర్గీకరించడమనే నిబంధనలను సడలించాలని ఈ సందర్భంగా ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులు కోరారు. అలాగే, బ్యాంకులు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై దాస్తోపాటు ఆర్బీఐకి చెందిన నలుగురు డిప్యూటీ గవర్నర్లు చర్చించారు. వీటిల్లో ద్రవ్య లభ్యత, ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం వంటి అంశాలున్నాయి. ఎస్బీఐ, పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, దేనా బ్యాంకు చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీసీఏ నిబంధనలను సరళించాలని గవర్నర్‌ను కోరినట్టు వీరు తెలిపారు. బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకోలేక, ఎన్పీఏలు భారీగా పెరిగిపోయిన ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్బీఐ పీసీఏ పరిధిలోకి తీసుకొచ్చి కఠినంగా వ్యవహరిస్తోంది. 21 ప్రభుత్వరంగ బ్యాంకులకు 11 బ్యాంకులు పీసీఏ పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వడంపై ఆంక్షలు అమలవుతున్నాయి. కాగా, నియంత్రణ సంస్థ, బ్యాంకుల మధ్య చర్చలకు వీలు కల్పించడమే ఈ సమావేశం ఉద్దేశమని పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా మీడియాకు తెలిపారు. దాస్‌కు నేడే తొలి పరీక్ష! గవర్నర్‌గా తొలి బోర్డు సమావేశం నేడు న్యూఢిల్లీ: నూతన గవర్నర్ శక్తికాంత్‌దాస్ ఆధ్వర్యంలో ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం సమావేశం కాబోతుంది. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియపై డైరెక్టర్ల నుంచి ప్రశ్నలు ఎదురుకానున్నాయి. నవంబరు 19న జరిగిన గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిపై సమీక్ష జరగనుంది. డీమోనిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాల కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)కు ఉపశమనం కల్పించే చర్యలు, ఆర్బీఐ విధాన నిర్ణయాల్లో సెంట్రల్ బోర్డు పాత్రపైనా చర్చ జరగనుంది. ప్రస్తుత నిర్మాణంలో, ఆర్బీఐ సెంట్రల్ బోర్డు కేవలం సలహా పాత్రకే పరిమితం అవుతోంది. ప్రభుత్వ ప్రాతినిధ్యం కూడా ఉన్న బోర్డును ఆర్బీఐ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ భాగస్వామిని చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఒక్కరోజు రుణ చెల్లింపుల్లో విఫలమైనా దాన్ని ఎన్పీఏగా వర్గీకరించడం వంటి ఎన్నో కీలక అంశాల్లో ప్రస్తుతం బోర్డు జోక్యం చేసుకునే అవకాశం లేదు. అయితే, ఆర్బీఐ బోర్డు కేవలం సలహా పాత్రకే పరిమితం కావాలని, ఆర్బీఐ స్వతంత్రత, స్వయంప్రతిపత్తిని కాపాడాలన్నది మాజీ గవర్నర్లు, నిపుణుల అభిప్రాయం. ఆర్బీఐ స్వతంత్రతను, విశ్వసనీయతను తాను కాపాడతానని గవర్నర్ బాధ్యతల తర్వాత దాస్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను సమయానుకూలంగా పరిష్కరిస్తామని కూడా ఆయన చెప్పారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డుకు గవర్నర్ అధిపతిగా వ్యవహరిస్తారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు, 11 ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టిన రెండోరోజే ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో దాస్ సమావేశం కాగా, మూడో రోజు ఆర్బీఐ బోర్డు కీలక సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వానికి ఆర్బీఐ మద్దతివ్వాలి ఏ సంస్థనూ నిర్వీర్యం చేయలేదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబై: ఆర్బీఐని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వీర్యం చేయబోదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆర్బీఐ ప్రభుత్వంలో ఒక భాగమని, అది ప్రభుత్వ ఆర్థిక విధానానికి మద్దతుగా నిలవాలని అభిప్రాయపడ్డారు. కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదాల వల్ల ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన నేపథ్యంలో మంత్రి గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉర్జిత్ పటేల్ స్థానంలో శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బ్యాంకు స్వతంత్ర సంస్థగానే పనిచేయాలని, అదే సమయంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలకు కూడా మద్దతు నివ్వాలన్న అభిప్రాయాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. ఏ విధంగానూ సెంట్రల్ బ్యాంకును తాము దెబ్బతీయలేదన్నారు. దేశం కోసం ఆర్థిక మంత్రి ఓ విధానాన్ని ప్రతిపాదిస్తే దానికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఆర్బీఐపై లేదా? అని గడ్కరీ ప్రశ్నించారు. ‘‘ఎక్కడైనా ఎగుడుదిగుళ్లు సహజమే. ఏ సంస్థనూ మేం నిర్వీర్యం చేయలేదు. ఆర్బీఐ నిర్వహణలో మేమేమీ రాజకీయంగా జోక్యం చేసుకోలేదు. పారదర్శకమైన, అవినీతి రహిత వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంది. వేగంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియకు తోడు, ప్రభుత్వ నిర్ణయాలకు ప్రతీ సంస్థ కట్టుబడాలి’’ అని గడ్కరీ చెప్పారు. ఒకవేళ ఆర్బీఐ పూర్తి సర్వస్వతంత్రంగా ఉండాలనుకుంటే, ఆర్థిక అనారోగ్యానికి అదే బాధ్యత వహించాలని, ఆర్థిక శాఖ కాదని చెప్పారాయన. ‘‘ఒకవైపు ఆర్థిక వ్యవస్థలో అనారోగ్యాలకు బాధ్యత మాదంటారు. దాంతో మేము నిర్ణయాలు తీసుకుంటే ఆర్బీఐ స్వతంత్రత ప్రమాదంలో పడిందంటారు’’ అని గడ్కరీ పేర్కొన్నారు. మాల్యాకు మద్దతు! వ్యాపారంలో ఎత్తు పల్లాలు ఉంటాయని, అది బ్యాంకింగ్ అయినా, బీమా అయినా తప్పిదాలు జరిగితే క్షమించి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ఓ కంపెనీ వ్యాపార పరంగా గడ్డు పరిస్థితుల్లోకి వెళితే ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చాలా కాలం క్రితం మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ సికామ్ విజయ్ మాల్యాకు రుణం ఇచ్చిందని, మాల్యా దానికి 40 ఏళ్ల పాటు వడ్డీ కట్టారని చెప్పారు. ‘‘ఒక వ్యక్తి రుణానికి 40 ఏళ్లు చెల్లింపులు చేసి, ఆ తర్వాత ఏవో కారణాల వల్ల రుణ చెల్లింపులు చేయలేకపోతే అతన్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారు అని నిర్ధారించడం సరికాదన్నారు. ‘‘నీరవ్‌మోదీ లేదా విజయ్ మాల్యా మోసానికి పాల్పడితే వారిని జైలుకు పంపించాలి. కానీ, ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రతీ ఒక్కరినీ మోసగాళ్లుగా చిత్రీకరిస్తే ఆ ఆర్థిక వ్యవస్థ పురోగతి చెందలేదు’’ అని గడ్కరీ అభిప్రాయపడ్డారు. -
ఆర్బీఐకి కొత్త సారథ్యం
సంఘ్ పరివార్ ఆశీస్సులున్నవారికే కీలక పదవులు ఖాయమవుతున్నాయని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఎంపిక కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చునని వెలువడిన అంచనాలు తారుమారయ్యాయి. వచ్చే నెలలో పదవినుంచి నిష్క్రమించబోతున్న ప్రస్తుత గవర్నర్ రఘురాం రాజన్ స్థానంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎంపికయ్యారు. ఆర్బీఐ గవర్నర్‌పై ఈసారి జరిగినంత చర్చ, హడావుడి ఇంతకుముందెన్నడూ లేదు. ఆ పదవిలో ఉన్నవారు ప్రభుత్వంతో విభేదించడం కొత్తేమీ కాదు. కానీ రాజన్ తీరుతెన్నులే వేరు. వడ్డీ రేట్ల కోత మొదలుకొని పలు అంశాల్లో ఆయన పాలకుల ఆశలకు అనుగుణంగా వ్యవహ రించలేకపోవడమే కాదు... అన్వయానికొచ్చేసరికి అంతరార్ధమే మారిపోవచ్చునన్న భయం కూడా లేకుండా మాట్లాడారు. ఒక్కోసారి అసలు కంటే ఈ విసురులే అధికార పక్షాన్ని బాధించాయి. దేన్నయినా ఒక ఎజెండాగా మార్చి వెంటపడటంలో సిద్ధహస్తుడైన బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తన బాణాలు రాజన్‌పై ఎక్కు పెట్టినప్పుడు దాని వెనక ప్రభుత్వంలోనివారే ఉండొచ్చునని చాలామంది భావించ డానికి కారణం అదే. ప్రధాని నరేంద్ర మోదీ ఆలస్యంగానైనా జోక్యం చేసుకుని ఆయనను అదుపు చేయడం, ఈలోగా రెండో దఫా ఈ పదవిని చేపట్టబోనని రాజన్ ప్రకటించడంతో ఆ అంకం సద్దుమణిగింది. అయితే రాజన్ ప్రకటన వాణిజ్య, పారిశ్రామిక వర్గాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ఎవరూ మరిచిపోలేదు. ఆయన విధానాలను విమర్శించినవారు సైతం రాజన్నే కొనసాగించడం దేశ ఆర్థిక వ్యవస్థకు అన్నివిధాలా శ్రేయస్కరమని అప్పటినుంచీ సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూ వస్తున్నారు. ఈ విషయంలో నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించని కేంద్రం చివరకు ఉర్జిత్‌ను ఎంపిక చేయడం ద్వారా విధానపరమైన అంశాల్లో యధా తథ స్థితి కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చినట్టు కనబడుతోంది. రిజర్వ్ బ్యాంకు అన్నది మౌలికంగా ప్రభుత్వానికి చెందిన కీలక అంగం. దానికి సారధ్యంవహించేవారు ద్రవ్యపరమైన అంశాల్లో, ఇతర నియంత్రణల్లో ప్రభు త్వంతో కలిసి పనిచేయక తప్పదు. వారు సర్వ స్వతంత్రంగా వ్యవహరించలేరు. అలాగని ప్రభుత్వానికి డూడూ బసవన్నల్లా మెలిగి చెప్పిందల్లా చేయడమే తమ విధి అన్నట్టు ప్రవర్తిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమవుతుంది. ఈ విషయంలో ఆర్బీఐ గవర్నర్లుగా గతంలో పనిచేసినవారు తగినంత అప్రమత్తతతోనే ఉన్నారు. వడ్డీ రేట్ల కోత విషయంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఆ సమయంలో ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న దువ్వూరి సుబ్బారావు లొంగలేదు. బహిరంగంగా చిదంబరం విరుచుకుపడినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అంతగాకపోయినా అలాంటి స్థితే రాజన్‌కూ ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తున్నా...ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించని కారణంగా బండి ముందుకు కదలడం లేదని సుబ్రహ్మణ్యస్వామి నేరుగా అని ఉండొచ్చుగానీ అలాంటి అభిప్రాయమే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీలో కూడా ఉంది. వృద్ధి రేటు బాగున్నది గనుక ఆర్బీఐ చేయాల్సింది చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన చాలాసార్లు వ్యక్తం చేశారు. ఆ ‘చేయాల్సింది’ వడ్డీ రేట్ల కోతేనని వేరే చెప్పనవసరం లేదు. కానీ రాజన్ మాత్రం దృఢంగా ఉన్నారు. జీడీపీ గణాంకాలు ఎంతగా మెరిసి పోతున్నా ఆయన నిగ్రహం చెక్కుచెదరలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పగా ఉన్నదని ఐఎంఎఫ్ లాంటి సంస్థ సర్టిఫికెట్ ఇచ్చినా మనం ఇంకా సంతృప్తికర స్థాయికి చేరుకోలేదని నిర్మొహమాటంగా చెప్పారు. దేశ పురోగతికి ఆర్థిక వృద్ధి కొలమానం కావొచ్చుగానీ అదే పూర్తిస్థాయిలో వాస్తవ స్థితిని ప్రతిబిం బించలేదని అన్నారు. ఇలా అనడం, అందుకు తగినట్టుగా విధానాలు నిర్ణయించి అమలు చేయడం ఏటికి ఎదురీదడం. మొదటినుంచీ ఆయన దృష్టంతా వృద్ధి రేటుపై కాక ద్రవ్యోల్బణంపై ఉంది. దానికి కళ్లెం వేసి ధరల స్థిరత్వాన్ని సాధిం చాలని ఆయన భావించారు. అటు కేంద్రం సైతం వచ్చే అయిదేళ్లలో ద్రవ్యో ల్బణాన్ని 4 శాతం దాటనివ్వరాదన్న లక్ష్యంతో ఉంది. మరి వైరుధ్యం ఎక్కడొ చ్చింది? వడ్డీ రేట్ల కోతతో మార్కెట్లోకి భారీగా పెట్టుబడులొస్తాయని, పర్యవసా నంగా కార్యకలాపాలు పుంజుకొని ఉపాధి, వినిమయం వంటివి పెరిగి జీడీపీ పరుగులు పెడుతుందని ప్రభుత్వ అంచనా. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయకపోతే వడ్డీ రేట్ల కోతతో మార్కెట్లోకి ప్రవేశించే పెట్టుబడులన్నీ ధరల ఉప్పెనలో కొట్టుకుపోతాయని రాజన్ ఆందోళన. ఇప్పుడు రాజన్ స్థానంలో రాబోతున్న ఉర్జిత్ పటేల్ ఇలా స్వతంత్రంగా వ్యవ హరించగలరా? ఆయన ముందు చాలా సవాళ్లున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాన్ని పీడిస్తున్న మొండి బకాయిల విషయంలో రాజన్ ప్రారంభించిన పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంది. ఎగవేతదార్లనుంచి ముక్కుపిండి వసూలు చేయాల్సి ఉంది. రూపాయి విలువను కంటికి రెప్పలా కాపాడటం మరో ముఖ్యౖ మెన బాధ్యత. ఉర్జిత్ అప్పటి యూపీఏ పాలకులకైనా, ఇప్పటి ఎన్డీఏ పాల కులకైనా ఇష్టుడే. 2013లో ఆయన్ను రిజర్వ్‌బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా తీసుకు రాదల్చుకున్నప్పుడు అప్పటికి అమెరికా గ్రీన్‌కార్డు ఉన్న ఉర్జిత్‌కు భారతీయ పౌరసత్వమివ్వాలంటూ సిఫార్సు లేఖ రాసింది నాటి ప్రధాని మన్మోహన్ సింగే. గుజరాత్ మూలాలున్నాయి గనుకా, ఆయన పనితీరు తెలుసు గనుకా నరేంద్ర మోదీకి సైతం ఆయన నచ్చినట్టున్నారు. వచ్చే అయిదేళ్లలో ద్రవ్యోల్బణం 4 శాతం మించకూడదన్న నిర్ణయం వెనక సూత్రధారి ఉర్జిత్ పటేలే. వడ్డీ రేట్లతోపాటు అన్ని కీలకాంశాలనూ నిర్ణయించడానికి ఇకపై ఆర్బీఐకి ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలన్న కేంద్ర నిర్ణయం ఆయన ఇచ్చిన నివేదిక పర్యవసానంగా రూపొందిందే. అయితే అలాంటి కమిటీ ఏర్పాటైతే కొత్త పదవిలో ఉర్జిత్ ఏమేరకు స్వతంత్రంగా వ్యవహరించగలరో, ఎంతవరకూ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలరో చెప్పడం కష్టమే. -
కరెన్సీ ఊయల్లో కవలలు
రెండో మాట రాజన్ తొలగినా, ఉర్జిత్ వచ్చినా; రేపు మరొకరు వచ్చినా ఒక్కటే. అందుకే కూరగాయలు, పప్పులు, ఉప్పులు సామాన్య ప్రజలు వినియోగించే ఇతర సాధారణ వస్తువుల చిల్లర ధరలు పెరిగినా, రిటైల్ ఇన్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) 4 శాతానికి మించకుండా చూడమని రిజర్వు బ్యాంకుకు మోదీ ఆదేశాలు జారీ చేసినా సామాన్య వినిమయ ధరల సూచీ 6.07 శాతానికి పెరిగిపోయింది. మోదీ ఉర్జిత్ పటేల్‌ను రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవికి తీసుకు రావడం గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే. ‘ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్రలో మున్నెన్నడూ లేనంతగా వడ్డీ రేట్లకు భారీ సింహాసనం లభించింది. ఈ వడ్డీరేట్లు వృద్ధి క్షయాలను ఏ ఇతర గణాంకాలకన్నా శ్రద్ధగా పరిశీలించడం జరుగుతోంది. ఈ రేట్ల ఆధారంగానే ట్రిలియన్, బిలియన్ డాలర్ల కొద్దీ ప్రపంచ మార్కెట్లలో దేశాలను వాటి ఆర్థిక వ్యవస్థలను పణంగాపెట్టి జూదం ఆడుకుంటున్నారు. సామ్రాజ్య పెట్టుబడి వ్యవస్థ నెలకొల్పి కొనసాగిస్తున్న ఈ పరాన్నభుక్కుల వ్యవస్థే నేడు రంగంలో ఉందని మరచిపోరాదు. ఈ దోపిడీకాండ ఎలా అమలు జరుగుతోంది? ప్రపం చంలో జూదగొండి, స్పెక్యులేటివ్ మార్కెట్లపై ఆధారపడి భారీ గుత్త పెట్టుబడి కంపెనీలు, బహుళ జాతి సంస్థలూ ఎలా లాభాలు తీస్తున్నాయి? నిజానికి వీటికి దేశాల ఉత్పత్తి క్రమంలో, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో, ప్రజా ప్రయోజనా లతో, నూతన ఆవిష్కరణలతో ఉత్పత్తి శక్తుల అభివృద్ధితో ప్రజా బాహుళ్యం జీవన ప్రమాణాలను పెంచడంలోనూ ప్రత్యక్ష సంబంధం లేకుండా వడ్డీరేట్ల జూదం ద్వారా లాభాల వేటలో భాగస్వాములవుతున్నాయి. స్టాక్ మార్కెట్లను జూదగొండుల కేంద్రాలుగా మార్చారు. సాధారణ సంతలలో జరగవలసిన క్రయవిక్రయాలను స్టాక్‌మార్కెట్ – షేర్ మార్కెట్లోనికి నెట్టేశారు.’ ఆర్థికవేత్త, ఆర్థిక వ్యవహారాల పరిశోధకుడు డాక్టర్ రాహుల్ బర్మన్, ప్రశాం త్‌కుమార్, విపిన్ నెగీ ఆధ్వర్యంలోని అధ్యయన బృందం ఇరవయ్యేళ్ల క్రితం ఇచ్చిన నివేదికలోని వ్యాఖ్యలు ఇవి. ఇది రెండు దశాబ్దాల నాటి నివేదిక కావచ్చు. కానీ అందులోని వాస్తవాలకు అధికార స్థాయి ప్రతిరూపాలుగానే ఇద్దరు ప్రముఖులు ఇప్పుడు కూడా కనిపిస్తారు. వారే – రిజర్వు బ్యాంక్ గవ ర్నర్గా పదవీ విరమణ చేయబోతున్న రఘురామ్ రాజన్, ఆయన వారసునిగా నియమితులైన ఉర్జిత్ పటేల్. ఆ తానులో ముక్క 1996–97 కాలంలో కొన్ని తూర్పు ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలను చుట్ట బెట్టిన ఆర్థిక సంక్షోభం క్రమంగా (2007–08)అమెరికాకు కూడా వ్యాపిం చింది. ఆ సంక్షోభం ఆంగ్లో–అమెరికన్ పెట్టుబడిదారీ వ్యవస్థ పుణ్యమే. నిజానికి ఆ ఆర్థిక మాంద్యం నుంచి ఇంతవరకు అమెరికా బయటపడలేదు. కానీ ‘రాచపీనుగ తోడు లేకుండా వెళ్లద’న్న సామెత వలె తనపై ఆధారపడిన భారత్ వంటి వర్ధమాన దేశాలను కూడా అమెరికా ఆ ఊబిలోకి గుంజింది. ఆర్థిక సంక్షోభ దశను ప్రపంచీకరించడం – దీని ఫలితమే. ఆ సంక్షోభాన్ని తిలాపాపం తలా పిడికెడు పంచింది. ఆ క్రమంలోనే ఈ పాపాన్ని వర్ధమాన దేశాల పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలకు సారథ్యం వహిస్తున్న పాలకులూ, బ్యాంకుల గవర్నర్లూ పంచుకోక తప్పలేదు. ఈ పరిణామానికి మూలం 1947లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన బ్రెటెన్‌వుడ్స్ గోష్టి చేసిన నిర్ణయా లలో దాగి ఉందన్న వాస్తవం విస్మరించరాదు. ఈ గోష్టి సంతానమే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్). అమెరికా పెత్తనం కింద పని చేసే ఈ రెండు సంస్థలలో తర్ఫీదు పొంది, వాటిలో కీలక పదవులు అనుభవించినవారిలో రఘురామ్‌రాజన్, ఉర్జిత్ పటేల్ కూడా ఉన్నారు. బిమల్ జలాన్, రాకేశ్ మోహన్, రంగరాజన్ కూడా ఆ కోవలోనే వస్తారు. ఈ తీరులో ఎదిగి వచ్చిన ఆర్థికవేత్తలు, సలహాదారులు ఆ రెండు సంస్థలకు అప్పగించిన బాధ్యతలను జవదాటి స్వతంత్రంగా వ్యవహరించిన దాఖ లాలు దాదాపు లేవు. ఆ సంస్థలకు అధికార స్థాయిలో వ్యవహరించి భారీ వడ్డీ రేట్ల మీద వర్ధమాన దేశాలను ఊబిలోకి దించి అధికాధిక లాభాలు గుంజి, వాటిని వడ్డీలకు చక్రవడ్డీలకు తిప్పడాన్ని జీర్ణించుకోలేక పదవుల నుంచి తప్పుకున్న డేవిసన్ ఎల్ బుధు (గ్రెనెడా), జోసెఫ్ స్టిగ్లిజ్ (అమెరికా) వంటి వారు ఆ కోవలో తప్పపుట్టిన వారు. అమెరికా ఆధ్వర్యంలోని రెండు ప్రపంచ ‘ఫండింగ్’ సంస్థలు పనిచేస్తున్న తీరుతెన్నులను మొదటిసారి ప్రపంచానికి వెల్లడించారు ఈ ఇద్దరూ. ఇందులో బుధూ ప్రపంచ బ్యాంక్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. బ్యాంక్ సంస్కరణల ఫలితంగా తన చేతులు రక్తసిక్తమై, మలిన మైనాయని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కొన్ని దేశాల రాజ్యాంగాల నుంచి హక్కులకు ఏ విధంగా బ్యాంకు ఉద్వాసన చెప్పించినదీ మరొకరు వెల్ల డించారు. అయినా మన పాలకులు (యూపీఏ, ఎన్డీఏ) గుణపాఠం నేర్వ లేదు. నేర్చుకోరు కూడా. రాజన్ పోయి ఉర్జిత్ వచ్చే ఢాం ఢాం రఘురామ్‌రాజన్‌కు అప్పగించిన బాధ్యత – సంక్షోభకాలంలో బ్యాంకు వడ్డీ రేట్లు పెరగకుండా అదుపులో ఉంచి, ద్రవ్యోల్బణానికీ, ధరల పెరుగుదలకూ ఆస్కారం లేకుండా చూడడం. కానీ ఆ రేట్ల తగ్గుదల, పెరుగుదల మోదీ అభిప్రాయంపైనా, రిజర్వుబ్యాంక్ గవర్నర్ల తాఖీదులపైన ఆధారపడి ఉండదు. ఎందుకని? అదంతా కంట్రోలు వస్తువుల ధరల నియంత్రణ, వడ్డీరేట్ల అదుపు బడుగు, వర్ధమాన దేశాల మార్కెట్లను అమెరికా, యూరప్ దేశాల ఎగుమతులతో గుప్పించి మన దేశీయ సంతలను దెబ్బతీసే వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యూహాన్ని దెబ్బతీయగల సత్తా స్వతంత్ర ఆర్థిక విధానాల రూపకల్పన మీద, ప్రతి వ్యూహంపైన ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. అమెరికాలోని ‘వాషింగ్టన్ (కాన్సెన్సెస్) వ్యవస్థ, ‘చికాగో స్కూలు’ వ్యూహాలకు బద్ధమై మాత్రమే మన నిర్ణయాలు గానీ, పోకడలు గానీ ఉంటాయి. అంతవరకు రాజన్ తొలగినా, ఉర్జిత్ వచ్చినా; రేపు మరొకరు వచ్చినా ఒక్కటే – ఎడం చేయి తీసి పురచేయి పెట్టడం. ఫలితం ఒక్కటే. అందుకే కూరగాయలు, పప్పులు, ఉప్పులు సామాన్య ప్రజలు వినియోగించే ఇతర సాధారణ వస్తువుల చిల్లర ధరలు పెరిగినా, రిటైల్ ఇన్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) 4 శాతానికి మించకుండా చూడమని రిజర్వు బ్యాంకుకు మోదీ ఆదేశాలు జారీ చేసినా సామాన్య వినిమయ ధరల సూచీ 6.07 శాతానికి పెరిగిపోయింది. బ్యాంకు గవర్నర్లను దేశ పాలకుడు తన ఇష్టానిష్టాల మీద తొలగించినా, వారి స్థానంలో వేరొకరిని నియ మించినా దేశ, విదేశీ బహుళ జాతి సంస్థలకు విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టు బడులకు దేశ ఆర్థిక వ్యవస్థ తలుపులు బార్లా తెరిచి పెడుతున్నప్పుడు ఫలితాలు అనుభవించేవారు సంపన్నవర్గాలే గానీ, అసంఖ్యాకంగా ఉండే బడుగు, బలహీన వర్గాలు మాత్రం కాదు. గుజరాత్లో కొన్ని మాసాలలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి మోతుబరి వర్గం పటేళ్లు ఇటీవల పెద్ద స్థాయిలో రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేశారు. మోదీ ఉర్జిత్ పటేల్‌ను రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవికి తీసుకురావడం కూడా అదే ఎన్నికల ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే. అందుకే ఇవాళ రూపాయి పెడితే, కష్టపడకుండా రేపు ఉదయానికల్లా అది నాలుగు రూపాయలకు పెరుగుతుందని భ్రమలు సృష్టించే జూదగొండి స్టాక్ మార్కెట్టు విశ్లేషకులు... నిన్నటి దాకా రాజన్ చర్యలనూ మెచ్చినవారు... ఇవాళ పటేల్ నియామకాన్నీ ఆహ్వానిస్తున్నారు. అంటే, ప్రపంచబ్యాంకు ప్రజా వ్యతిరేక ‘సంస్కరణల’ పరిధిలో పాలకులూ, బ్యాంకు ఉప్పు తిన్నందుకు నిరంకుశాధికార వర్గమూ (బ్యూరోక్రాట్లు) ఇమిడి పోయినందున ఎవరు గవర్నర్‌గా వచ్చినా ఒరిగేది లేదు, తరిగేదీ లేదు. ప్రజా ప్రయోజన వ్యతిరేక, జాతీయార్థిక వ్యవస్థ స్వతంత్ర మౌలిక విధానాలకు చేటుతెచ్చే పద్ధతులూ, కుట్రలకూ ఇప్పటికైనా స్వస్తి పలకాలి. బహుశా అందుకేనేమో స్వతంత్ర ఆర్థిక వ్యవస్థపై ‘కలలు’కంటూ ‘‘భారత దేశమా ఎటు నీ ప్రయాణం’ (విధర్ ఇండియా) అని ప్రశ్నించుకుని ‘దేశ స్వాతంత్య్రం అనంతరం కూడా విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచే పక్షంలో అది నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాజాలద’ని ప్రకటించిన తొలి ప్రధాని నెహ్రూ శకం అంతరించింది. కొత్తగా భగత్‌సింగ్‌ను భుజా నకెత్తుకున్న బీజేపీ–ఆరెస్సెస్ పరివారం, దేశానికి ‘స్వాతంత్య్రం వచ్చిన తరు వాత కూడా దేశీయ పెట్టుబడివర్గాలూ, విదేశీ పెట్టుబడులూ కలగలిసిపోయే జమిలిగానే ప్రజల్ని పీల్చుకుతింటార’ని హెచ్చరికగా ఆయన వినిపించిన భవిష్య వాణిని మాత్రం నామమాత్రంగా అయినా ప్రస్తావించ లేక పోతు న్నది. ఆ బీజేపీ – ఆరెస్సెస్ పరివార్ నాయకులలోనే ఒకరైన ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి, పదవీ విరమణలో ఉన్న రాజన్‌ను ‘మానసికంగా పూర్తిస్థాయి భారతీయుడు కాడ’నీ, అమెరికా దేశపు గ్రీన్‌కార్డు సాధించుకున్న నకిలీ భారతీయుడనీ దూషించాడు. అలాగే, ప్రధాని మోదీ ప్రధాన ఆర్థిక సలహాదారైన అరవింద సుబ్రహ్మణ్యాన్ని కూడా ఆ పదవికి తగనివాడని కూడా స్వామి విమర్శించారు. అలాగే అమెరికా మందుల కంపెనీలు ఇండియా మార్కెట్లో ప్రవేశించనివ్వకుండా అడ్డుపడుతూ, ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇండియాను గుచ్చి గుచ్చి ప్రశ్నించమని అమెరికా ‘చెవులు కొరికాడ’ని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు కనుసన్నలలోనే వడ్డీరేట్లు ఇండియా ఆర్థిక వ్యవస్థను నిలువుదోపిడీ చేసుకునేందుకు వీలుగా పూర్తి స్థాయిలో విదేశీ గుత్త కంపెనీలను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను విస్తృతంగా అనుమతిస్తే ఇండియా రేటింగ్‌ను పెంచేస్తామని ప్రముఖ రేటింగ్ నిర్ణయ సంస్థ ‘మూడీస్’ బాహాటంగా ప్రకటించింది. మన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎప్పుడు పెంచాలో, ఎప్పుడు తుంచాలో అమెరికన్ రిజర్వు బ్యాంకు ‘ఫెడ్’ అధ్యక్షురాలు ఎలెన్‌ను అర్థించి తెలుసుకోవలసిందే. ఈ షరతుకు తగినట్టుగానే మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ను విదేశీ పెట్టు బడులతో వస్తువులను ఇండియాలో తయారుచేసిపెట్టమని, అదే ‘మేడ్ ఇన్ ఇండియా’గా చెప్పుకోవచ్చునన్న భ్రమలో ఉంది. ఎందుకంటే విదేశీ సైన్యం గానీ, విదేశీ గుత్త కంపెనీగానీ ఒకసారి ప్రవేశించిన తరువాత తిరిగి స్వచ్ఛం దంగా వెనక్కి వెళ్లిపోవడమంటూ జరగదు. ఇది దేశాల, వర్ధమాన దేశాల ప్రజల అనుభవం. -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -abkprasad2006@yahoo.co.in