ధరల కట్టడే లక్ష్యం... కానీ సవాళ్లు ఉన్నాయ్‌! | Sakshi
Sakshi News home page

ధరల కట్టడే లక్ష్యం... కానీ సవాళ్లు ఉన్నాయ్‌!

Published Mon, Jun 26 2023 4:13 AM

RBI will strive to get CPI down to 4percent, but El Nino a challenge for food inflation - Sakshi

ముంబై: కేంద్రం నిర్దేశిస్తున్నట్లు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి చేర్చడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రయత్నిస్తుందని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. అయితే ఆర్‌బీ ఐ ప్రయత్నాలకు ఎల్‌ నినో  సవాలుగా నిలుస్తో ందని వెల్లడించారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన ఉద్ఘా టించారు.

గత ఏడాది మే నుంచి 2.50 శాతం పెరిగిన రెపో రేటు (బ్యాంకులకు తాని చ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం), సరఫరాలవైపు సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు  మేలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.25 శాతానికి (2022 ఏప్రిల్‌లో 7.8 శాతం) దిగిరావడా నికి కారణమని ఆయన ఒక ఇంటర్వ్యూలో పే ర్కొన్నారు. గోధుమలు, బియ్యం నిల్వల వి డుదల వంటి ఫుడ్‌ కార్పొరేషన్‌ చర్యలు ధరలు దిగిరావడానికి కారణమయ్యాయి. కొన్ని ప్రొడక్టులపై సుంకాల తగ్గింపూ ఇక్కడ సానుకూలమయ్యింది. ఇంకా ఆయన ఏమన్నారంటే...

► 2023–24లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతం ఉంటుందని భావిస్తున్నాం. 4 శాతానికి దీనిని కట్టడి చేయడానికీ ప్రయతి్నస్తున్నాం. ఎల్‌ నినో సవాళ్లు నెలకొనే ఆందోళనలు ఉన్నాయి. (పసిఫిక్‌ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పులకు గురికావడమే ఎల్‌ నినో. ఇది భారత్, ఆ్రస్టేలియాలో భారీ వర్షపాతం, పంట ఉత్పాదకతకపై ప్రభావం, కరువు పరిస్థితులను సృష్టించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు.)
► ద్రవ్యోల్బణం అదుపులోనికి వస్తే, ప్రజలు తక్కువ వడ్డీరేటు వ్యవస్థను ఆశించవచ్చు.
► ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధమే. ఇది కమోడిటీ ధరలను పెంచే అంశం. అయితే ప్రస్తుతం బ్యారల్‌కు 76 డాలర్ల వద్ద ఉన్న క్రూడ్‌ ధర వల్ల ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు.  
► ప్రాజెక్ట్‌ రుణాలుసహా కార్పొరేట్ల నుండి క్రెడిట్‌ కోసం చాలా డిమాండ్‌ ఉంది.  మొత్తం రుణ వృద్ధి అన్ని రంగాల విస్తృత ప్రాతిపాతిపదికన నమోదవుతోంది.  
► 2023 క్యాలెండర్‌ సంవత్సరంలో రూపాయి తక్కువ అస్థిరతను కలిగి ఉంది. డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ బలపడింది. అస్థిరతను తగ్గించడానికి ఆర్‌బీఐ తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది.
► అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడ్‌ రేట్లను పెంచినప్పటికీ రూపాయిపై ప్రభావం పడదని విశ్వసిస్తున్నాం. అమెరికాలో ఫెడ్‌ ఫండ్‌ రేటు 5 శాతం పెరిగినప్పటికీ దేశీయ కరెన్సీ స్థిరంగా ఉంది.
► దేశానికి వచీ్చ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వలకు మధ్య నికర వ్యత్యాసం– కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) 2023–24 ఆర్థిక సంవత్సరంలో ‘‘పటిష్ట నిర్వహణ స్థాయిలో’’ ఉంటుందని భావిస్తున్నాం. సేవా రంగం నుంచి అధిక ఎగుమతులు, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం.  
ఈ ప్రయత్నాలకు ఎల్‌ నినో ప్రధాన విఘాతం

– శక్తికాంత్‌దాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement