Retail inflation rate
-
రిటైల్ ధరల ఉపశమనం
న్యూఢిల్లీ: రెండు నెలల నుంచి దిగివస్తున్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా మూడవనెల అక్టోబర్‌లోనూ మరింత తగ్గింది. తాజా సమీక్షా నెల్లో 4.87 శాతంగా (2022 అక్టోబర్ నెలతో పోల్చి) నమోదయ్యింది. అంతక్రితం నాలుగు నెలల్లో (జూన్‌లో 4.81 శాతం) ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద (మినహాయింపులకు లోబడి ఎగవముఖంగా 6 శాతం) ఉండాలన్నది సెంట్రల్ బ్యాంక్‌కు కేంద్రం నిర్దేశం. సెపె్టంబర్, అక్టోబర్లలో ఆర్బీఐకి నిర్దేశిత పరిధిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంకాగా, 2023–24లో రేటు 5.4 శాతానికి తగ్గుతుందన్నది ఆర్బీఐ అంచనా. -
ధరల కట్టడే లక్ష్యం... కానీ సవాళ్లు ఉన్నాయ్!
ముంబై: కేంద్రం నిర్దేశిస్తున్నట్లు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి చేర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రయత్నిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. అయితే ఆర్బీ ఐ ప్రయత్నాలకు ఎల్ నినో సవాలుగా నిలుస్తో ందని వెల్లడించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన ఉద్ఘా టించారు. గత ఏడాది మే నుంచి 2.50 శాతం పెరిగిన రెపో రేటు (బ్యాంకులకు తాని చ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం), సరఫరాలవైపు సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.25 శాతానికి (2022 ఏప్రిల్‌లో 7.8 శాతం) దిగిరావడా నికి కారణమని ఆయన ఒక ఇంటర్వ్యూలో పే ర్కొన్నారు. గోధుమలు, బియ్యం నిల్వల వి డుదల వంటి ఫుడ్ కార్పొరేషన్ చర్యలు ధరలు దిగిరావడానికి కారణమయ్యాయి. కొన్ని ప్రొడక్టులపై సుంకాల తగ్గింపూ ఇక్కడ సానుకూలమయ్యింది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► 2023–24లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతం ఉంటుందని భావిస్తున్నాం. 4 శాతానికి దీనిని కట్టడి చేయడానికీ ప్రయతి్నస్తున్నాం. ఎల్ నినో సవాళ్లు నెలకొనే ఆందోళనలు ఉన్నాయి. (పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పులకు గురికావడమే ఎల్ నినో. ఇది భారత్, ఆ్రస్టేలియాలో భారీ వర్షపాతం, పంట ఉత్పాదకతకపై ప్రభావం, కరువు పరిస్థితులను సృష్టించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు.) ► ద్రవ్యోల్బణం అదుపులోనికి వస్తే, ప్రజలు తక్కువ వడ్డీరేటు వ్యవస్థను ఆశించవచ్చు. ► ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే. ఇది కమోడిటీ ధరలను పెంచే అంశం. అయితే ప్రస్తుతం బ్యారల్‌కు 76 డాలర్ల వద్ద ఉన్న క్రూడ్ ధర వల్ల ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు. ► ప్రాజెక్ట్ రుణాలుసహా కార్పొరేట్ల నుండి క్రెడిట్ కోసం చాలా డిమాండ్ ఉంది. మొత్తం రుణ వృద్ధి అన్ని రంగాల విస్తృత ప్రాతిపాతిపదికన నమోదవుతోంది. ► 2023 క్యాలెండర్ సంవత్సరంలో రూపాయి తక్కువ అస్థిరతను కలిగి ఉంది. డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ బలపడింది. అస్థిరతను తగ్గించడానికి ఆర్బీఐ తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ► అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రేట్లను పెంచినప్పటికీ రూపాయిపై ప్రభావం పడదని విశ్వసిస్తున్నాం. అమెరికాలో ఫెడ్ ఫండ్ రేటు 5 శాతం పెరిగినప్పటికీ దేశీయ కరెన్సీ స్థిరంగా ఉంది. ► దేశానికి వచీ్చ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వలకు మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) 2023–24 ఆర్థిక సంవత్సరంలో ‘‘పటిష్ట నిర్వహణ స్థాయిలో’’ ఉంటుందని భావిస్తున్నాం. సేవా రంగం నుంచి అధిక ఎగుమతులు, క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. ఈ ప్రయత్నాలకు ఎల్ నినో ప్రధాన విఘాతం – శక్తికాంత్‌దాస్, ఆర్బీఐ గవర్నర్ -
ఆర్థిక వ్యవస్థ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో తాజా గణాంకాలు ఉత్సాహాన్ని నింపాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 4.25 శాతంగా నమోదయ్యింది. అంటే 2022 మేతో పోల్చితే 2023 మేలో రిటైల్ ధరల బాస్కెట్ 4.25 శాతమే పెరిగిందన్నమాట. గడచిన రెండేళ్ల కాలంలో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడ్డం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 ప్లస్ లేదా 2 మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే 6 శాతం పైబడకూడదు. అయితే 2022 నవంబర్, డిసెంబర్, 2023 మార్చి, ఏప్రిల్, మే మినహా మిగిలిన అన్ని నెలలూ 6 శాతం ఎగువనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగింది. తాజా సమీక్షా నెల్లో 2021 ఏప్రిల్ కనిష్టాన్ని (4.23 శాతం) చూసింది. గడచిన నాలుగు నెలల నుంచీ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండగా, వరుసగా మూడవనెల నిర్దేశిత 6 శాతం దిగువన నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో గత మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్బీఐ 6.5 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం అదుపు నేపథ్యంలో గడచిన రెండు త్రైమాసికాల్లో యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల ధోరణి కొనసాగితే, ఆర్బీఐ 2023లో రెపో రేటును పెంచే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.7 శాతం కాగా, గత ఏడాది మే నెల్లో 7.04 శాతంగా ఉంది. కీలకాంశాలు ఇవీ... ఒక్క ఆహార విభాగాన్ని పరిశీలిస్తే, మే నెల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.91 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 3.84 శాతం. మొత్తం సూచీలో దీని వెయిటేజ్ దాదాపు 50 శాతం. ఆయిల్, ఫ్యాట్స్ ధరల స్పీడ్ తాజా సమీక్షా నెల్లో 16 శాతం తగ్గింది. కూరగాయల ధరలు 8.18 శాతం దిగివచ్చాయి. అయితే తృణధాన్యాలు, పప్పుదినుసుల ధరలు వరుసగా 12.65 శాతం, 6.56 శాతంగా ఉన్నాయి. ► ఫ్యూయెల్ లైట్ విభాగంలో ధరల స్పీడ్ ఏప్రిల్ లో 5.52% ఉంటే, మేలో 4.64 శాతం. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా. జూన్ త్రైమాసికంలో 4.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్‌లో తయారీ, మైనింగ్ చక్కని పనితీరు ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి నెల ఏప్రిల్‌లో పారిశ్రామిక రంగం మంచి ఫలితాన్ని నమోదుచేసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (సీపీఐ) వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. తయారీ, మైనింగ్ రంగాలు మంచి వృద్ధిరేటును నమోదుచేసుకున్నట్లు అధికా రిక గణాంకాలు తెలిపాయి. 2023 మార్చితో పోల్చితే (1.7 శాతం వృద్ధి) గణాంకాల తీరు బాగున్నప్పటికీ, 2022 ఏప్రిల్‌తో పోల్చితే (6.7 శాతం) వృద్ధి రేటు తక్కువగా ఉండడం గమనార్హం. అయితే అప్పటి గణాంకాల్లో బేస్ తక్కువగా ఉండడం మరోఅంశం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన తాజా అంకెలను పరిశీలిస్తే... -
కట్టడిలోకి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో అదుపులోనికి వచ్చింది. 5.59 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 జూలైలో పోల్చితే 2021 జూలైలో రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.59 శాతం పెరిగిందన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రేటు–రెపోకు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం నిర్దేశాల (ఆర్బీఐకి) ప్రకారం 2 నుంచి 6శాతం శ్రేణిలో ఉండాలి. అయితే మే, జూన్ నెలల్లో వరుసగా 6.3 శాతం, 6.26 శాతాలుగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో 5.15 శాతం ఉంటే, జూలైలో 3.96 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల చూస్తే జూన్‌లో 0.7 శాతం తగ్గితే, జూలైలో ఈ తగ్గుదల ఏకంగా 7.75 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరలు ఇదే కాలంలో 10.01% నుంచి 9.04%కి దిగివచ్చాయి. అయితే మాంసం, చేపలు, గుడ్లు, పాలు వంటి ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆయిల్ ఫ్యాట్స్ ధరలు 32.53% పెరిగాయి. అయితే జూలైలో ఈ పెరుగుదల రేటు 35%గా ఉంది. -
వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయా?
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు అటు కేంద్రం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తూ, శుక్రవారం తాజా ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ద్వారా పరిశీలించే ఈ రంగం వృద్ధి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం 0.1 శాతం. 2018 ఫిబ్రవరిలో ఇది 6.9 శాతం. ఇది 20 నెలల కనిష్టస్థాయి. 2017 జూన్ (0.3 శాతం) తర్వాత ఇంత పేలవ వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక మార్చి నెలలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కొంచెం పెరిగి 2.57 శాతంగా నమోదయ్యింది. అయితే ఇది ఆర్బీఐ నిర్దేశిస్తున్న 4 శాతం దిగువనే ఉండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇవ్వడానికి ఆర్బీఐ మరోదఫా రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతంగా ఉంది) రేటు కోతకు వీలుకల్పిస్తున్న గణాంకాలు ఇవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసిన గణాంకాలను చూస్తే... తయారీ రంగం పేలవం... ► తయారీ: మొత్తం సూచీలో 78 శాతం వాటా కలిగిన తయారీ విభాగం 2019 ఫిబ్రవరిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఈ రంగంలో వృద్ధి లేకపోగా 0.3 శాతం క్షీణత నమోదయింది. 2018 ఫిబ్రవరిలో ఈ విభాగం భారీగా 8.4 శాతం వృద్ధిని నమోదుచేసింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 10 మాత్రమే సానుకూల ఫలితాన్ని నమోదు చేయటం గమనార్హం. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులకు సంకేతమైన భారీ యంత్రపరికరాల ఉత్పత్తి సంబంధ క్యాపిటల్ గూడ్స్... ఉత్పత్తి 2018లో 16.6 శాతమయితే ఇప్పుడు ఈ రేటు 8.8 శాతానికి తగ్గింది. ► విద్యుత్: ఈ రంగంలో ఈ రేటు 4.5 శాతం నుంచి 1.2 శాతానికి పడింది. ► మైనింగ్: ఈ విభాగంలో ఉత్పత్తి రేటు మాత్రం కొంత మెరుగుపడి, 2 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.4 శాతం క్షీణత నమోదయ్యింది. ► కన్జూమర్ ప్రొడక్ట్స్: కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం 1.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే, నాన్–డ్యూరబుల్స్ విభాగం 4.3 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ► నవంబర్ గణాంకాలు దిగువముఖం: 2018 నవంబర్ ఐఐపీ వృద్ధి రేటును సైతం దిగువముఖంగా 0.3 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గడం గమనార్హం. 11 నెలల కాలంలో.. 2018 ఏప్రిల్ నుంచి 2019 ఫిబ్రవరి నెలలను చూస్తే, పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు స్వల్పంగా తగ్గి 4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో (2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి మధ్య) ఈ రేటు 4.3 శాతంగా ఉంది. స్వల్పంగా పెరిగిన రిటైల్ ధరల స్పీడ్ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 2.86 శాతంగా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ రేటు 2.57 శాతంకాగా, 2018లో మార్చిలో 4.28 శాతం. మార్చిలో ఆహార ఉత్పత్తులు, ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయని గణాంకాలు పేర్కొన్నాయి. 4 శాతం లోపు రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐ, విధాన నిర్ణేతల నిర్ణయం. ఈ దిగువనే తాజా గణాంకాలు ఉండడం గమనార్హం. ఆర్బీఐ నిర్దేశ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగడం ఇది వరుసగా ఎనిమిదవ నెల. 2018 జూలై (4.17 శాతం) తర్వాత 4 శాతంపైకి రిటైల్ ద్రవ్యోల్బణం ఎప్పుడూ పెరగలేదు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ నియంత్రణలోని కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం తాజా రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలను విడుదల చేసింది. 0.3 శాతం పెరిగిన ఫుడ్ బాస్కెట్ ధర ఫుడ్ బాస్కెట్ ధర మార్చిలో 0.3 శాతం పెరిగింది (2018 ఇదే నెల ధరలతో పోల్చి). ఫిబ్రవరిలో ఈ ధర అసలు పెరక్కపోగా –0.66 శాతం తగ్గింది. పండ్లు, కూరగాయల ధరల్లో పెరుగుదల లేకపోగా –5.88 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలోనూ ఈ తగ్గుదల –4.90 శాతంగా ఉంది. తృణ ధాన్యాలు, ఉత్పత్తుల ధరలు 1.32 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గాయి. -
రిటైల్ ధరలు కూల్..
⇒ ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.87 శాతం ⇒ నాలుగు నెలల కనిష్ట స్థాయికి తగ్గుదల.. న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్‌లో 4.87 శాతంగా ఉంది. అంటే 2014 ఏప్రిల్ ధరలతో పోల్చితే ఆయా వినియోగ వస్తువుల బాస్కెట్ రిటైల్ ధరలు 2015 ఏప్రిల్‌లో 4.87 శాతం పెరిగాయన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో ధరల వృద్ధిరేటు నమోదుకావడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి. మార్చిలో పోల్చితే ఏప్రిల్‌లో పళ్లు, కూరగాయలు, పాలు, సంబంధిత ఉత్పత్తుల ధరల పెరుగుదల స్పీడ్ తగ్గడం దీనికి కారణం. కాగా మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.25 శాతం. ముఖ్యాంశాలు... ఆహారం, పానీయాల ధరల పెరుగుదల రేటు ఏప్రిల్‌లో 5.36 శాతంగా ఉంది. ఒక్క ఆహార ఉత్పత్తులనే తీసుకుంటే ఈ రేటు మార్చిలో 6.14 శాతం ఉండగా, ఏప్రిల్‌లో 5.11 శాతానికి తగ్గింది. ఈ విభాగాన్ని వేర్వేరుగా చూస్తే- వార్షికంగా చక్కెర (-5.99 శాతం), గుడ్లు (-1.46 శాతం) ధరలు తగ్గాయి. పప్పు దినుసుల ధరలు రెండంకెల స్థాయి (12.52 శాతం)లోనే పెరిగింది. అయితే తృణధాన్యాలు (2.15 శాతం), మాంసం, చేపలు (5.50 శాతం), పాలు-పాల ఉత్పత్తులు (8.21 శాతం), చమురు, వెన్న (1.77 శాతం), పండ్లు (5.08 శాతం), కూరగాయలు (6.63 శాతం), సుగంధ ద్రవ్యాలు (8.70 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (4.68 శాతం) ప్రెపేర్డ్ మీల్స్ (7.68 శాతం) రెండంకెల కన్నా తక్కువ ధరల స్పీడ్‌ను నమోదుచేసుకున్నాయి. ⇒ పాన్, పొగాకు తదితర మత్తుప్రేరిత ఉత్పత్తుల ధరలు 9.22% ఎగశాయి. ⇒ దుస్తులు, పాదరక్షల ధరలు 6.15 శాతం పెరిగాయి. ⇒ హౌసింగ్‌కు సంబంధించి రేటు 4.65 శాతంగా ఉంది. ⇒ ఇంధనం, లైట్ ధరలు 5.60 శాతం ఎగశాయి.