![RBI Governor Shaktikanta Das to hold a press conference at 10 AM today - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/22/media-handler.jpg.webp?itok=o19tkyyF)
కేంద్ర రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ ఇవాళ ఉదయం 10:00గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం లాక్‌డౌన్ విధింపు మే 31వరకు వరకు పొడగించిన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ పత్రికా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని రకాల టర్మ్‌లోన్ల చెల్లింపులపై మారిటోరియంను మరికొన్ని నెలలపాటు పొడిగించే అవకాశం ఉంది. బ్యాంకింగ్ నాన్ ఫైనాన్స్ కంపెనీలకు, చిన్న పారిశ్రామిక కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ద్రవ్య మద్దతు చర్యల కొనసాగింపును గవర్నర్ ప్రకటించవచ్చు. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే నష్టపోయినా పరిశ్రమలకు మరింత వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రాయితీలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
దేశవ్యాప్త లాక్‌డౌన్ విధింపు నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌కు ఇది మూడో ప్రతికా సమావేశం. ఇప్పటికే మార్చి 27న మొదటిసారి, ఏప్రిల్ 17న రెండోసారి కోవిద్1-9 సంబంధిత సమావేశాలు నిర్వహించారు. మొదటి రెండు సమావేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటి ఒత్తిడిని తగ్గించడానికి, కోవిద్-19 వ్యాధి నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలను ప్రకటించారు. అందులో భాగంగా మార్చిలో ఏకంగా 75బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు, రూ.5 లక్షల కోట్ల విలువైన ద్రవ్య చర్యలు ఉన్నాయి. వీటితో పాటు మార్చి 1 మరియు మే 31 మధ్య అన్ని కాల వ్యవధి రుణాల చెల్లింపులపై 3నెలల తాత్కలిక నిషేధాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment