GSTN
-
జీఎస్టీ రిటర్న్‌లో మార్పులు.. వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్స్
వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ రిటర్న్‌లకు సంబంధించి నిబంధనలలో మార్పులు రానున్నాయి. ఇందులో భాగంగా 2025 ప్రారంభం నుండి జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేసిన గడువు తేదీ నుండి మూడు సంవత్సరాల తర్వాత నెలవారీ, వార్షిక జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయలేరు.గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ (జీఎస్టీఎన్) తాజాగా జరిగిన సంప్రదింపులలో ఈ విషయాన్ని తెలిపింది. జీఎస్టీ అమ్మకాల రిటర్న్‌లతో పాటు, బకాయిల చెల్లింపు, వార్షిక రిటర్న్‌లు, టీసీఎస్ వసూలుకు సంబంధించిన రిటర్న్‌లకు కొత్త నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. అంటే రిటర్న్‌ల సమర్పణ గడువు తేదీ నుండి మూడేళ్ల వ్యవధి ముగిసిన తర్వాత రిటర్న్ దాఖలు చేయడంపై నిషేధం ఉంటుంది.“ఈ మార్పు వచ్చే ఏడాది (2025) ప్రారంభం నుండి జీఎస్టీ పోర్టల్‌లో అమలులోకి రాబోతోంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిచూసుకోవాలి. ఇంకా ఎవరైనా జీఎస్టీ రిటర్న్‌లను దాఖలు చేయకపోతే వీలైనంత త్వరగా దాఖలు చేయాలి" అని జీఎస్టీఎన్ సూచించింది.సకాలంలో జీఎస్టీ దాఖలును పూర్తి చేయడం, డేటా విశ్వసనీయతను పెంచడం, ఫైల్ చేయని రిటర్న్‌ల 'బ్యాక్లాగ్'ను సమర్థవంతంగా తగ్గించడం లక్ష్యంగా జీఎస్టీఎన్ కొత్త మార్పులు ప్రవేశపెడుతోంది. రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేసే వ్యవధిని పరిమితం చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిపోల్చుకుని, సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. -
ముగియనున్న ఇన్ఫోసిస్ కాంట్రాక్టు.. కొత్త సర్వీస్ ప్రొవైడర్‌పై జీఎస్టీఎన్ కసరత్తు
న్యూఢిల్లీ: సాంకేతిక సహకారం అందించేందుకు ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు ఇచ్చిన కాంట్రాక్టు 2024 సెప్టెంబర్‌తో ముగియనున్న నేపథ్యంలో కొత్త సర్వీస్ ప్రొవైడర్ ఎంపికపై వస్తు, సేవల పన్నుల నెట్వర్క్ (జీఎస్టీఎన్) దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్ డాక్యుమెంట్లను తయారు చేసే కన్సల్టెన్సీ కోసం అన్వేషణ ప్రారంభించింది. బిడ్డింగ్ ప్రక్రియ, జీఎస్టీఎన్ ఐటీ వ్యవస్థను మరో సర్వీస్ ప్రొవైడర్‌కు బదలాయించడం తదితర పనులను సదరు కన్సల్టెన్సీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుత వ్యవస్థను మదింపు చేసి తదుపరి కాంట్రాక్టు వ్యవధిలో దాన్ని మరింత మెరుగుపర్చేందుకు తగు మార్గదర్శకాలు రూపొందించాలి. దేశీయంగా ప్రత్యక్ష లేదా పరోక్ష పన్నులు లేక ఇతరత్రా ఆర్థిక సంస్థకు ఐటీ కన్సల్టింగ్ సర్వీసులు అందించడం ద్వారా గత మూడేళ్లలో సగటున రూ. 30 కోట్ల వార్షిక టర్నోవరు ఉన్న కన్సల్టెన్సీలు ఇందుకు పోటీపడొచ్చని జీఎస్టీఎన్ తెలిపింది. బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 5. కొత్త కాంట్రాక్టు 2024 అక్టోబర్ 1 నుంచి ఏడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దానికి అవసరమైన సాంకేతిక సేవలు అందించేందుకు 2015లో రూ. 1,320 కోట్ల కాంట్రాక్టును ఇన్ఫోసిస్ దక్కించుకుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్, రిటర్నుల ఫైలింగ్, ఆడిట్ మొదలైన వాటికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఇన్ఫోసిస్ అందిస్తోంది. -
కేంద్రం సంచలన నిర్ణయం.. మనీలాండరింగ్ పరిధిలోకి జీఎస్టీ
కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జీఎస్టీ సంబంధిత విషయాల్లో జోక్యం చేసుకునేలా వీలు కల్పించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పరిధిలోకి గూడ్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ (gstn)ను తెస్తున్నట్లు తెలిపింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. తాజా నిర్ణయంతో జీఎస్టీ చెల్లింపుల్లోని అక్రమాలు, ఇతర అనుమానాస్పద ఆర్ధిక లావాదేవీల్ని అరికట్టవచ్చు. అండర్ సెక్షన్ 66 (pmla) కింద పన్ను చెల్లింపుదారుల వివరాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌తో తప్పని సరిగా షేర్ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. Government-issued a notification to bring the Goods & Services Tax Network (GSTN) under the Prevention of Money Laundering Act (PMLA). Information stored on GSTN can be now shared under PMLA Act. pic.twitter.com/VrhUq3vuCY — ANI (@ANI) July 8, 2023 కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్లో.. జీఎస్టీ చెల్లింపు దారులు అనుమానాస్పదంగా ఫారెక్స్ ట్రాన్సాక్షన్ జరిపారని నిర్ధారిస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్,ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అధికారులు సంబంధిత సమాచారాన్ని జీఎస్టీఎన్కు చేరవేస్తారు. వీటితో పాటు నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లు, నకిలీ ఇన్వాయిస్లు వంటి జీఎస్టీ మోసాలు మనీలాండరింగ్ నిరోధక చట్టం కిందకు వస్తాయి. చదవండి : జాక్ మాకు మరో భారీ షాక్..మంచులా కరిగిపోతున్న ఆస్తులు! -
జీఎస్టీ లాటరీ : ఇలా చేస్తే కోటి రూపాయలు మీవే!
సాక్షి, న్యూఢిల్లీ: ఒక దేశం, ఒకే పన్ను అంటూ బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై మరోసారి వినియోగదారులకు, వ్యాపారులకు బంపర్ ఆఫర్ గెల్చుకునే అవకాశాన్ని కేంద్రం పరిశీలీస్తోంది. జీఎస్టీ వినియోగదారుల లావాదేవీలు (బీ టూ సీ) , వ్యాపారాల ఇన్వాయిస్లపై ప్రతి నెలా లక్కీ డ్రాలు నిర్వహించనుంది. ఏప్రిల్ 1 నుంచి రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య లాటరీ ఆఫర్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వస్తువుల కొనుగోళ్లు సందర్భంగా తప్పనిసరిగా బిల్లులు తీసుకునేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. వస్తువులు కొన్న తర్వాత వినియోగదారులు తీసుకునే బిల్లు ద్వారా లాటరీని గెల్చుకోవడానికి అర్హత పొందుతారు. ఈ పథకం కింద, రెవెన్యూ విభాగం నెలవారీ లక్కీ డ్రాలను నిర్వహిస్తుంది. ఇందులో ఒక బంపర్ బహుమతితోపాటు, రెండవ, మూడవ బహుమతులు రాష్ట్రాల వారీగా ఉంటాయని ఒక అధికారి తెలిపారు. లాటరీ ఆఫర్లు రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) సభ్యుడు జాన్ జోసెఫ్ గత నెలలోనే ప్రకటించడం గమనార్హం. దీని ప్రకారం కస్టమర్ మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు బిల్లును స్కాన్ చేసి జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ యాప్ ఈ నెల చివరి నాటికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. లక్కీ డ్రాకు అర్హత పొందడానికి ఇన్వాయిస్ విలువపై ఎటువంటి పరిమితి లేదు. -
జీఎస్టీ తొలి బర్త్‌డే : పన్ను చెల్లింపుదారులు జంప్
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పన్ను విధానం జీఎస్టీ అమలు అయి రేపటికి(జూలై 1) ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా తొలి వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. జీఎస్టీని ఎంతో విజయవంతంగా అమలు చేస్తున్నామని.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇది పలు ప్రయోజనాలను చేకూర్చుతుందని కేంద్ర చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన మేరకే జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను చెల్లింపుదారులు కూడా భారీగా పెరిగారు. జీఎస్టీ అమల్లోకి వచ్చే నాటికి 63.76 లక్షలుగా ఉన్న పన్ను చెల్లింపుదారులు, ఇప్పటికి 1.12 కోట్లకు చేరుకున్నారని తెలిసింది. యాక్టివ్ పన్ను చెల్లింపుదారులు విపరీతంగా పెరగడం, అధికారిక రంగంలో మరిన్ని వ్యాపారాలు చేరాయని, ఆర్థిక వ్యవస్థలో అధికారీకరణ పెరుగుతుందనే దానికి సంకేతమని ఆర్థిక వేత్తలంటున్నారు. కొత్త పన్ను విధానంలో ఐటీ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ చాలా బాగుందని, యూజర్ అనుభవాన్ని, ఇంటర్ఫేస్ను మరింత మెరుగుపరచడానికి మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ‘ప్రతి నెలా కోట్ల రూపాయల రిటర్నులు దాఖలవుతూ.. జీఎస్టీ విధానం ఎంతో విజయవంతంగా అమలవుతుండటం ఎంతో ఆనందదాయకం. తొలి ఏడాదిలోనే నెలకు సుమారు రూ.90 వేల కోట్ల సగటు రెవెన్యూలను ఇది ఆర్జించింది. ఏప్రిల్‌లో లక్ష కోట్లను ఇది అధిగమించింది. ఇప్పటి వరకు 12 కోట్ల రిటర్నులు దాఖలు అయ్యాయి. 380 కోట్ల ఇన్వాయిస్లు ప్రాసెస్ అయ్యాయి. 1,12,15,693 మంది పన్నుచెల్లింపుదారులు జీఎస్టీ సిస్టమ్‌లో నమోదయ్యారు. వీరిలో 63,76.967 మంది ముందస్తు పన్ను విధానం నుంచి ఈ కొత్త విధానంలోకి రాగ, మిగతా 48,38,726 మంది కొత్తగా పన్ను విధానంలోకి ప్రవేశించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను అంతకంతకు ఇది పెంచుతుంది‘ అని జీఎస్టీఎన్ చైర్మన్ ఏబీ పాండే తెలిపారు. యూజర్ ఇంటర్ఫేస్ను మెరుగుపరచడం, ఫైలింగ్‌ను సులభతరం చేయడం, తప్పుడు మెసేజ్‌లను అదుపులో ఉంచడం వంటి జీఎస్టీ విధానాన్ని మరింత విజయవంతంగా అమలయ్యేలా చేస్తున్నాయని చెప్పారు. -
జీఎస్టీ రిటర్న్ ఇకపై మరింత సులువు
సాక్షి, న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జిఎస్టీ)లో కీలకమైన జీఎస్టీఎన్ను ఇకపై ప్రభుత్వ ఆధీన సంస్థగా మార్చేందుకు జిఎస్టీ కౌన్సిల్ అంగీకారం తెలిపింది. అంతేకాదు జీఎస్టీ రిటర్న్‌లను సరళీకృతం చేసే రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్టు 27వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కౌన్సిల్ వెల్లడించింది. అలాగే చక్కెరపై పన్ను విధించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసింది. డిజిటల్ చెల్లింపులపై 2శాతం ప్రోత్సాహమిచ్చే అంశాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం పరిశీలనకు అప్పగించినట్టు తెలిపింది. కొత్త 27 వ సమావేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ పై అధికార నిర్ణయం తీసుకునే సంస్థ ప్యానెల్,జీఎస్టీఎన్ ను మార్చడానికి ప్రతిపాదనకు అంగీకరించినట్టు తెలిపారు. ప్రైవేటు సంస్థల వాటాను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు కౌన్సిల్ అంగీకరించిందనీ, కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరుస్తుందన్నారు. మిగతా వాటా రాష్ట్రాలదని స్పష్టంచేశారు. జిఎస్టీ నెట్ వర్క్ లేదా జిఎస్‌టీఎన్లో ప్రస్తుతం 24.5 శాతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదని జైట్లీ పేర్కొన్నారు. మిగిలిన 51శాతం ఐదు (హెచ్ఎఫ్సీ లిమిటెడ్, హెచ్ఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకు లిమిటెడ్, ఎన్ఎస్ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కో, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్సిట్యూట్లదని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన సమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.జీఎస్టీ ఫైలింగ్‌ను మరింత సరళీకృతం చేయనున్నట్టు వెల్లడించారు. ఆరునెలల్లో ఒకే నెలవారీ రిటర్న్ ఫైలింగ్ వ్యవస్థ అమల్లోకి వస్తోందని ఆర్థికశాఖ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిత్రా మాట్లాడుతూ దాదాపు అయిదు రాష్ట్రాలు సుగర్‌పై లెవీకి అనుకూలంగా లేవని అన్నారు. ముఖ్యంగా ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా చక్కెరపై లెవీని వ్యతిరేకించారు. ఇది సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతుందన్నారు. -
ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా కోర్టుకి..
జీఎస్టీ చట్టం అమలుకు అవసరమైన సాంకేతిక వనరులను సమకూర్చేందుకు ఏర్పాటుచేసిన జీఎస్టీఎన్ నెట్వర్క్ మొరాయిస్తోంది. వర్తకులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో విసుగెత్తి పోయిన ట్రేడర్ల బాడీ సీఏఐటీ, ఇన్ఫోసిస్‌కి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోతే, ఇక తమ దగ్గర ఎలాంటి ఆప్షన్ ఉండదని, కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించింది. కంపెనీ అందించిన జీఎస్టీ పోర్టల్ వర్తకులను బాగా వేధిస్తుందని, ఇది విజయవంతం అవడానికి అవాంతరాలు సృష్టిస్తుందని తెలిపింది. రూ.1400 కోట్లలో కాంట్రాక్ట్ దక్కించుకున్న ఇన్ఫోసిస్, ఇతర కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదని తెలిపింది. జీఎస్టీఎన్ నెట్‌వర్క్‌లో అవాంతరాలు ఎదురవుతున్నాయనే ఆరోపణలను ఇన్ఫోసిస్ ఖండిస్తోంది. పూర్తిగా ఇవి అవాస్తమని తెలుపుతోంది. దీనిపై ట్రేడర్ల బాడీ సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా వెంటనే చర్యలు తీసుకోకపోతే, తమ దగ్గర ఇక ఎలాంటి ఆప్షన్ లేదని, దీనిలో కోర్టులో జోక్యం చేసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. ప్రజా సంపదను దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదని తెలిపింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన జీఎస్టీ ప్రాజెక్టులో తాము భాగస్వామ్యం కావడం ఎంతో గర్వకారణమని ఐటీ దిగ్గజం ఈ నెల మొదట్లో ఓ ప్రకటన చేసింది. కానీ ఇటీవల జీఎస్టీఎన్ నెట్‌వర్క్‌లో సమస్యలు ఎదురవుతున్నాయని ట్రేడర్లు వాపోతున్నారు. ఈ నెట్వర్క్ మొరాయిస్తున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. -
ఇన్ఫోసిస్‌పై సీబీఐ విచారణ జరిపించండి!
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ పోర్టల్ రూపకల్పనలో దారుణంగా వైఫ్యలం చెందిదంటూ దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌పై ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ మండిపడుతోంది. జీఎస్టీ పోర్టల్ వైఫ్యలం కారణంగా మంచి పన్నుల వ్యవస్థ అయిన జీఎస్టీకి చెడ్డ పేరు వస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్, సంబంధిత సంస్థలపై సీబీఐతో దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ వైఫల్యంపై ఇన్ఫీ వివరణ ఇవ్వాలని కోరింది. జిఎస్టి పోర్టల్‌కు సంబంధించిన సాంకేతిక, ఇతర అంశాలపై థర్డ్ పార్టీ ఆడిట్‌ను డిమాండ్ చేయడంతోపాటు జిఎస్టి పోర్టల్ హోదాలో వైట్ పేపర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. భారీ పెట్టుబడి, సమయం కేటాయించినప్పటీ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) పోర్టల్‌ను ఇన్ఫోసిస్ , ఇతర సంస్థలు సక్రమంగా రూపొందించలేదంటూ సియాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరింది. అస్తవ్యస్తంగా ఉన్నఎస్టీ పోర్టల్‌తొ ట్రేడర్లు విసుగు పోతున్నారని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండెల్వాల్ ఆరోపించారు. దీంతో జీఎస్టీ లాంటి పన్ను విధానంపై అటు వ్యాపార వర్గాల్లో, ఇటు వాటాదారుల్లో బ్యాడ్ ఇమేజ్ వస్తోందన్నారు. ఇన్ఫోసిస్ వైఫల్యం కారణంగా రిటర్న్ దాఖలు చేయడంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. పోర్టల్ నిర్వహణ ఇన్ఫోసిస్ పరిధిలో ఉంది, బాధ్యతను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఖండెల్వాల్ చెప్పారు. మరోవైపు జీఎస్టీ పోర్టల్ వైఫ్యలం ఆరోపణలపై జీఎస్టీఎన్ సీఈవో ప్రకాష్ కుమార్ స్పందించారు. జీఎస్టీ నెట్ వర్క్ పటిష్టంగా లేకపోతే.. మూడు నెలల కాలంలో 2.26 కోట్ల రిటర్న్స్ దాఖలయ్యాయనీ, 64.41 లక్షలవపన్ను చెల్లింపుదారులు జీఎస్టీఎన్ లోకి మారడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అటు ట్రేడర్స్ బాడీ ఆగ్రహం వార్తలను ఇన్ఫోసిస్ తీవ్రంగా ఖండించింది. -
జరిమానాలు రద్దు, అకౌంట్లలోకి డబ్బులు
సాక్షి, న్యూఢిల్లీ : ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేసినందుకు విధించిన జరిమానాలను ప్రభుత్వం మాఫీ చేసింది. పెనాల్టీని రద్దు చేస్తున్న విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి జీఎస్టీఆర్-3బీ ఫైలింగ్ ఆలస్యంపై విధించిన ఫీజులను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే బిజినెస్‌లపై విధించిన ఆలస్య ఛార్జీలను, తిరిగి పన్ను చెల్లింపుదారుల అకౌంట్లలోకి వేయనున్నట్టు పేర్కొన్నారు. జీఎస్టీ పాలన కింద జూలై నెల రిటర్నులపై విధించిన ఆలస్య ఫీజులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. 3బీ రిటర్నుల ఆలస్యానికి విధిస్తున్న పెనాల్టీను రద్దు చేయాలని వ్యాపార వర్గాలు డిమాండ్ చేసిన క్రమంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డేటా ప్రకారం జూలై నెలలో 55.87 లక్షల జీఎస్టీఆర్-3బీ రిటర్నులు దాఖలు కాగ, ఆగస్టు నెలలో 51.37 లక్షల రిటర్నులు, సెప్టెంబర్‌లో 42 లక్షలకు పైగా రిటర్నులు దాఖలయ్యాయి. తుది గడువు పూర్తి అయిన తర్వాత పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు తమ రిటర్నులు ఫైల్ చేస్తున్నట్టు జీఎస్టీఎన్ నెట్వర్క్ డేటాలో తెలిసింది. జూలై నెలకు సంబంధించి తుది గడువుకి కేవలం 33.98 లక్షల రిటర్నులు మాత్రమే దాఖలయ్యాయని, తర్వాత ఈ సంఖ్య 55.87 లక్షలకు పెరిగినట్టు వెల్లడైంది. అదేవిధంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కూడా ఉంది. రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేస్తున్న వారిపై కేంద్ర జీఎస్టీ కింద రోజుకు రూ.100, అంతేమొత్తంలో రాష్ట్ర జీఎస్టీ ఫీజును విధిస్తున్నారు. -
ఆ కంపెనీలు జీఎస్టీ కట్టలేదు
సాక్షి, న్యూఢిల్లీ : చిన్న వ్యాపారాలపై భారీ మొత్తంలో పన్ను భారమున్నట్టు ఓ వైపు నుంచి వాదనలు వినిపిస్తుండగా.. మరోవైపు గణాంకాలు మాత్రం భిన్నంగా చూపిస్తున్నాయి. జూలైలో జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసిన 54 లక్షల వ్యాపారాల్లో 40 శాతానికి పైగా వ్యాపార కంపెనీలు ఎలాంటి పన్ను చెల్లించలేదని తెలిసింది. అంటే దాదాపు 22 లక్షల వ్యాపార కంపెనీలు ఒక్క రూపాయి జీఎస్టీ కూడా కట్టలేదని వెల్లడైంది. మిగతా 60 శాతం అంటే 32 లక్షల వ్యాపారాలు రూ.1 నుంచి రూ.33వేల మధ్యలో పన్నులు చెల్లించాయి. దీనికి భిన్నంగా కేవలం 0.3 శాతం అంటే 10వేలకు పైగా కంపెనీలు మాత్రమే జీఎస్టీలో రెండింట మూడువంతులు కలిగి ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం కోటి వ్యాపారాలు, సర్వీసు ప్రొవైడర్లు జీఎస్టీఎన్ నెట్‌వర్క్‌పై రిజిస్ట్రర్ అయ్యారు. వారిలో 72 లక్షల మంది ఎక్సైజ్, వ్యాట్, సర్వీసు ట్యాక్స్ నుంచి జీఎస్టీఎన్ నెట్‌వర్క్‌లోకి వచ్చారు. కొత్తగా 25 నుంచి 26 లక్షల పన్ను చెల్లింపుదారులు జీఎస్టీఎన్ నెట్‌వర్క్‌లోకి వచ్చారని శుక్రవారం అరుణ్‌జైట్లీ చెప్పారు. పెద్ద పన్ను చెల్లింపుదారుల నుంచి అంటే రూ.1.05 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వారి నుంచి సుమారు 94 నుంచి 95 శాతం పన్ను వసూలయ్యాయని తెలిపారు. -
రోజుకు సగటున 10వేల కాల్స్
న్యూఢిల్లీ : విజయవంతంగా జీఎస్టీ పన్ను విధానాన్ని కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేసింది. కొత్తగా అమల్లోకి తెచ్చిన ఈ పన్ను విధానంపై ట్రేడర్లకు, పన్ను చెల్లింపుదారులకు వచ్చే సందేహాలను నివృతి చేయడం కోసం హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ నెంబర్లకు రోజుకు సగటున 10వేల కాల్స్ వస్తున్నట్టు జీఎస్టీ నెట్వర్క్ చైర్మన్ నవీన్ కుమార్ చెప్పారు. ట్రేడర్లు, పన్ను చెల్లింపుదారులు ఈ కాల్స్ చేస్తున్నట్టు తెలిపారు. జీఎస్టీ విధానంలోకి మారే క్రమంలో ఏర్పడ గందరగోళాలను తొలగించేందుకు తాము వారికి సహకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ''తమ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లు అన్ని సందేహాలను నివృత్తి చేస్తున్నారు. నోయిడా నుంచి ఈ కాల్ సెంటర్‌ను ఆపరేట్ చేస్తున్నాం. సుమారు 400 మంది ఎగ్జిక్యూటివ్‌లు వీటిని ఆపరేట్ చేస్తున్నారు'' అని నవీన్ కుమార్ తెలిపారు. రెండు కొత్త సర్వీసుల కోసం జీఎస్టీఎన్ రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించిందని చెప్పారు. జీఎస్టీ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ డెస్క్ : Email: cbecmitra.helpdesk@icegate.gov.in Telephone: 1800 1200 232 జీఎస్టీఎన్ హెల్ప్ డెస్క్ : Email: helpdesk@gst.gov.in Telephone: 0120 4888999 Twitter handles: @askGST_GOI, @askGSTech టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టెక్ మహింద్రాలతో కలిసి జీఎస్టీఎన్ నెట్వర్క్ రెండు కాల్ సెంటర్లను కూడా పన్ను చెల్లింపుదారులకు, పన్ను అధికారుల కోసం ఏర్పాటుచేసింది. పన్ను చెల్లింపుదారులకు హెల్ప్‌లైన్ నెంబర్: 0120-4888999 కాగ, పన్ను అధికారులకు 0124-4479900 నెంబర్‌ను అందుబాటులో ఉంచింది. -
జీఎస్టీ పోర్టల్ రడీ
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అమలు కోసం సాఫ్ట్వేర్ దాదాపు సిద్ధంగా ఉందని జీఎస్టీఎన్ ఛైర్మన్ నవీన్ కుమార్ వెల్లడించారు. క్రెడిట్ / డెబిట్ కార్డులు ద్వారా సులభంగా పన్ను చెల్లింపులు, రిటర్న్స్ కోసం ఉద్దేశించిన జీఎస్టీ పోర్టల్ ను మంగళవారం ప్రారంభించినట్టు తెలిపారు. www.gst.gov.in పేరుతో దీన్ని లాంచ్ చేసినట్టు చెప్పారు. ఈ పోర్టల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పని దాదాపు 60 శాతం పూర్తయిందని డిసెంబర్ నాటికి హార్డ్‌వేర్ పని పూర్తి కానుందని వివరించారు. అనంతరం ఈ సాఫ్ట్వేర్ ను డాటా సెంటర్లకు అందించి టెస్టింగ్ కోసం ఉంచుతామన్నారు. కేంద్ర రాష్త్ర ప్రభుత్వాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఒకే దేశం ఒకే పన్ను విధానం అమల్లోకి రానున్న విధానానికిగాను సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రారంభమైనట్టు వెల్లడించారు. 2015 నవంబరులో పని ప్రారంభించిన తాము ఈ మేరకు పని పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. డాటా భద్రత కోసం న్యూఢిల్లీ, బెంగళూరులలో డాటా సెంటర్లను నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. 65 లక్షల వ్యాట్ చెల్లింపుదారుల, సుమారు 20 లక్షల సేవా పన్ను చెల్లింపుదారులు, 3-4 లక్షల సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపుదారులను ఈ కొత్త పోర్టల్‌కు బదిలీచేసే ప్రక్రియ ప్రారంభమైందని నవీన కుమార్ పీటీఐకి తెలిపారు. జీఎస్టీఎన్ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నెట్వర్క్) పిలిచే తాత్కాలిక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ కింద కింద కొత్త రిజిస్ట్రేషన్ల ఏప్రిల్ 2017 నుంచి ప్రారంభంకానున్నాయి. -
స్వామి మళ్లీ పేల్చారు..!
ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన బిల్లు జీఎస్టీపై అసలు నోరు మెదపనని, దానిపై తాను మాట్లాడితే ఘర్షణలు జరుగుతాయన్న సుబ్రహ్మణ్యస్వామి మాట మార్చారు. తనదైన వివాదాస్పద శైలిలో వస్తే గూడ్స్ అండ్ సర్వీసు టాక్స్ నెట్ వర్క్(జీఎస్టీఎన్)పై ట్విట్టర్లో బాంబు పేల్చారు. జీఎస్జీ బిల్లును ఆమోదిస్తున్న రాష్ట్రాలు జీఎస్టీఎన్ వ్యతిరేకించాలంటూ అమిత్ షాకు, బీజేపీ సీఎంలకు లేఖలు రాస్తానని ట్వీట్ చేశారు. ఓ వైపు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ సమావేశమైన నేపథ్యంలో స్వామి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన ఈ బిల్లును బీజేపీ పాలిత ఎనిమిది రాష్ట్రాలు ఆమోదించిన సంగతి తెలిసిందే. దేశమంతటినీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఏకీకృత పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పన్ను విధానాన్ని సమర్థవంతంగా అమలుచేయడానికి జీఎస్టీఎన్ పేరుతో ఒక స్వచ్చంద, లాభపేక లేని సంస్థలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. జీఎస్టీఎన్ నిర్మాణం జాతి వ్యతిరేకకు సంబంధించిందని స్వామి వ్యాఖ్యానించారు. జీఎస్టీఎన్లో 24.5 శాతం స్టేక్ ప్రభుత్వం చేతిలో, మరో 24.5 శాతం రాష్ట్రాల చేతిలో ఉంటుంది. మిగిలిన 51 శాతం స్టేక్ ప్రభుత్వేతర ఆర్థిక సంస్థల స్వాధీనంలోకి వెళ్లిపోతుందని స్వామి ఆరోపిస్తున్నారు. జీఎస్టీఎన్లో మెజార్టీ స్టేక్ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లడాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎల్ ఐసీ హౌసింగ్ లిమిటెడ్, హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్, హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్ఎస్ఈ స్ట్రాటజిగ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిడెట్ వంటి ప్రైవేట్ వ్యక్తుల చేతులోకి జీఎస్జీఎన్ వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఎస్టీఎన్ ను వ్యతిరేకించాలంటూ అమిత్ షాకు, బీజేపీ రాష్ట్ర సీఎంలకు లేఖ రాస్తా అనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీడీపీ వృద్ధికి జీఎస్టీ సమాధానం కాదని, కార్మిక ఉత్పాదకత, అధిక పెట్టుబడులు అవసరమని ముందు నుంచి స్వామి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యనే రఘురామ్ రాజన్‌పై కామెంట్లుచేసి తీవ్ర వివాదాస్పదంగా మారారు. హైకమాండ్ ఆదేశాలతో ఈ మధ్యన కొంచెం సైలెన్సు అయిన స్వామి, ఈసారి డైరెక్ట్‌గా హైకమాండ్‌పైనే విమర్శలకు దిగారు. I am writing to Amit Shahji and all BJP CMs that while ratifying the Constitutional Amendments for GST Bill they should oppose GSTN. — Subramanian Swamy (@Swamy39) August 27, 2016