జీఎస్టీ రిటర్న్‌లో మార్పులు.. వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్స్‌ | GST Returns Rules are changing from the next year | Sakshi
Sakshi News home page

జీఎస్టీ రిటర్న్‌లో మార్పులు.. వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్స్‌

Published Wed, Oct 30 2024 5:12 PM | Last Updated on Wed, Oct 30 2024 5:25 PM

GST Returns Rules are changing from the next year

వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ రిటర్న్‌లకు సంబంధించి నిబంధనలలో మార్పులు రానున్నాయి. ఇందులో భాగంగా 2025 ప్రారంభం నుండి జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేసిన గడువు తేదీ నుండి మూడు సంవత్సరాల తర్వాత నెలవారీ, వార్షిక జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయలేరు.

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్) తాజాగా జరిగిన సంప్రదింపులలో ఈ విషయాన్ని తెలిపింది. జీఎస్టీ అమ్మకాల రిటర్న్‌లతో పాటు, బకాయిల చెల్లింపు, వార్షిక రిటర్న్‌లు, టీసీఎస్‌ వసూలుకు సంబంధించిన రిటర్న్‌లకు కొత్త నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. అంటే రిటర్న్‌ల సమర్పణ గడువు తేదీ నుండి మూడేళ్ల వ్యవధి ముగిసిన తర్వాత రిటర్న్‌ దాఖలు చేయడంపై నిషేధం ఉంటుంది.

“ఈ మార్పు వచ్చే ఏడాది (2025) ప్రారంభం నుండి జీఎస్టీ పోర్టల్‌లో అమలులోకి రాబోతోంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిచూసుకోవాలి. ఇంకా ఎవరైనా జీఎస్టీ రిటర్న్‌లను దాఖలు చేయకపోతే వీలైనంత త్వరగా దాఖలు చేయాలి" అని జీఎస్టీఎన్‌ సూచించింది.

సకాలంలో జీఎస్టీ దాఖలును పూర్తి చేయడం, డేటా విశ్వసనీయతను పెంచడం, ఫైల్ చేయని రిటర్న్‌ల 'బ్యాక్‌లాగ్'ను సమర్థవంతంగా తగ్గించడం లక్ష్యంగా జీఎస్టీఎన్‌ కొత్త మార్పులు ప్రవేశపెడుతోంది. రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేసే వ్యవధిని పరిమితం చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిపోల్చుకుని, సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement