జీఎస్‌టీ కౌన్సిల్ 27వ సమావేశం (ట్విటర్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జిఎస్‌టీ)లో కీలకమైన జీఎస్‌టీఎన్‌ను ఇకపై ప్రభుత్వ ఆధీన సంస్థగా మార్చేందుకు జిఎస్‌టీ కౌన్సిల్ అంగీకారం తెలిపింది. అంతేకాదు జీఎస్‌టీ రిటర్న్‌లను సరళీకృతం చేసే రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్టు 27వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కౌన్సిల్ వెల్లడించింది. అలాగే చక్కెరపై పన్ను విధించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసింది. డిజిటల్ చెల్లింపులపై 2శాతం ప్రోత్సాహమిచ్చే అంశాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం పరిశీలనకు అప్పగించినట్టు తెలిపింది.
కొత్త 27 వ సమావేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ పై అధికార నిర్ణయం తీసుకునే సంస్థ ప్యానెల్,జీఎస్‌టీఎన్ ను మార్చడానికి ప్రతిపాదనకు అంగీకరించినట్టు తెలిపారు. ప్రైవేటు సంస్థల వాటాను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు కౌన్సిల్ అంగీకరించిందనీ, కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరుస్తుందన్నారు. మిగతా వాటా రాష్ట్రాలదని స్పష్టంచేశారు. జిఎస్‌టీ నెట్ వర్క్ లేదా జిఎస్‌టీఎన్లో ప్రస్తుతం 24.5 శాతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదని జైట్లీ పేర్కొన్నారు. మిగిలిన 51శాతం ఐదు (హెచ్‌ఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌ఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకు లిమిటెడ్, ఎన్ఎస్ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కో, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్సిట్యూట్లదని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన సమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.జీఎస్‌టీ ఫైలింగ్‌ను మరింత సరళీకృతం చేయనున్నట్టు వెల్లడించారు. ఆరునెలల్లో ఒకే నెలవారీ రిటర్న్ ఫైలింగ్ వ్యవస్థ అమల్లోకి వస్తోందని ఆర్థికశాఖ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిత్రా మాట్లాడుతూ దాదాపు అయిదు రాష్ట్రాలు సుగర్‌పై లెవీకి అనుకూలంగా లేవని అన్నారు. ముఖ్యంగా ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా చక్కెరపై లెవీని వ్యతిరేకించారు. ఇది సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment