entity
-
ఆడిట్ సంస్థల్లో లోపాలు
న్యూఢిల్లీ: బిగ్–4 ఆడిటింగ్ కంపెనీలకు చెందిన నెట్వర్క్ ఎంటెటీలలో ఆడిటింగ్ కార్యకలాపాల పరంగా లోపాలు ఉన్నట్టు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) గుర్తించింది. డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీ, బీఎస్ఆర్ అండ్ కో ఎల్ఎల్పీ, ఎస్ఆర్బీసీ అండ్ కో ఎల్ఎల్పీ, ప్రైస్ వాటర్ హౌస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎల్ఎల్పీ సంస్థల్లో ఆడిట్ నాణ్యత తనిఖీలను ఎన్ఎఫ్ఆర్ఏ నిర్వహించగా ఈ లోపాలు వెలుగు చూశాయి. ప్రైస్ వాటర్ హౌస్, డెలాయిట్, ఈవై, కేపీఎంజీలను బిగ్–4 ఆడిటింగ్ సంస్థలుగా చెబుతారు. సంస్థల నాణ్యత నియంత్రణలను ఎన్ఎఫ్ఆర్ఏ పరిశీలించింది. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సంబంధించి వార్షిక స్టాట్యూటరీ ఆడిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను అధ్యయనం చేసింది. డెలాయిట్ హస్కిన్స్ అండ్ ఎల్ఎల్పీకి సంబంధించి ఆరు లోపాలను గుర్తించింది. బీఎస్ఆర్ అండ్ కోకు సంబంధించి కూడా ఆరు లోపాలు బయటపడ్డాయి. -
ఇక ఆ రెండు వేరువేరు: స్పైస్‌జెట్
ముంబై: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తమ కార్గో, లాజిస్టిక్స్ వ్యాపార విభాగం స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక విభాగంగా విడదీసింది. ఏప్రిల్ 1 నుంచి దీన్ని స్పైస్‌ఎక్స్‌ప్రెస్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా వ్యవహరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లాజిస్టిక్స్ వ్యాపార విభాగం స్వతంత్రంగా నిధులను సమీకరించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. 2022–23 ఏప్రిల్–డిసెంబర్ మధ్య వ్యవధిలో స్పైస్‌ఎక్స్‌ప్రెస్ రూ. 51 కోట్ల నికర లాభం నమోదు చేసింది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) డీల్ ప్రకారం స్పైస్‌జెట్‌కు స్పైస్‌ఎక్స్‌ప్రెస్ రూ. 2,556 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లు, డిబెంచర్లు జారీ చేయనుంది. కార్లైల్ ఏవియేషన్ పార్ట్నర్ చెల్లించాల్సిన 100 మిలియన్ డాలర్ల రుణాన్ని గత నెల పునర్వ్యవస్థీకరించుకున్నామని అజయ్ సింగ్ పేర్కొన్నారు. తాజాగా లాజిస్టిక్స్ విభాగం విడదీతతో స్పైస్‌జెట్ బ్యాలెన్స్ షీటు మరింత పటిష్టంగా మారగలదని, కంపెనీ నెగటివ్ నికర విలువ భారం గణనీయంగా తగ్గగలదని ఆయన వివరించారు. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) -
జీడీఆర్: సెబీ భారీ జరిమానా
న్యూఢిల్లీ: ఆరు కంపెనీలకు చెందిన జీడీఆర్ ఇష్యూల కృత్రిమ లావాదేవీల(మ్యానిప్యులేషన్) కేసులో 14 సంస్థలు, వ్యక్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ భారీగా రూ. 31 కోట్లకుపైగా జరిమానాను విధించింది. సెబీ కన్నెర్ర చేసిన సంస్థలు, వ్యక్తులలో అరుణ్ పంచారియా, పాన్ ఆసియా అడ్వయిజర్స్ తదితరాలున్నాయి. వ్యక్తిగతంగా పంచారియాకు రూ. 25 కోట్ల జరిమానా విధించగా.. పాన్ ఆసియా అడ్వయిజర్స్, అల్టా విస్టా(వింటేజ్ ఎఫ్జెడ్ఈ)లపై రూ. 3 కోట్లు చొప్పున జరిమానా చెల్లించమని ఆదేశించింది. ఆరు కంపెనీలకు చెందిన జీడీఆర్ ఇష్యూలలో అక్రమ పథకం ద్వారా పంచారియా తదితర సంస్థలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణ. -
ఎన్‌పీసీఐకి షాక్ : ఎస్బీఐ కొత్త సంస్థ
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు భారీ షాక్ ఇవ్వనుంది. డిజిటల్ చెల్లింపుల విభాగంలో కొత్త సంస్థ ఏర్పాటుకు సిద్దమవుతోంది. తద్వారా ఎన్పీసీఐ గుత్తాధిపత్యానికి చెక్ చెప్పాలని భావిస్తోంది. అంతేకాదు ఇందులో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా భాగస్వామ్యం చేయనుందని తాజా సమాచారం. (ఎస్బీఐ కొత్త చైర్మన్‌గా దినేష్ కుమార్) దేశీయంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో ప్రాధమిక వాటాదారుగా ప్రవేశించే ప్రణాళికలను ఎస్బీఐ సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించి మొదటి దశ చర్చలు పూర్తి చేసిందని, ఆర్బీఐ న్యూ అంబరిల్లా ఎంటిటీ(ఎన్ఈయూ) ఫ్రేమ్‌వర్క్ కింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. తను ప్రధాన ప్రమోటర్ గా, ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులతో కన్సార్షియం ఏర్పాటుకు ఆహ్వానిస్తోంది. గత వారం ఆర్బీఐ విడుదల చేసిన నిబంధనల ప్రకారం, డిజిటల్ చెల్లింపులకు ఆమోదం పొందిన ఏ కొత్త గొడుగు సంస్థ అయినా ఎన్పీసీఐ తరహా అధికారాలను సొంతం చేసుకోవచ్చు. 500 కోట్ల రూపాయల నికర పెట్టుబడి అవసరం. ఇందుకు దరఖాస్తు సమర్పించడానికి జనవరి, 2021 గడువుగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ కొత్త వ్యూహాలు వెలుగులోకి వచ్చాయి. (ఎస్బీఐ లోన్ : అనిల్ అంబానీకి ఊరట) కాగా ఆర్బీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఎ) సంయక్త ఆధ్వర్యంలో 2008లో ఎన్పీసీఐ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా 60 శాతం చెల్లింపు లను వాల్యూమ్లను ఎన్పీసీఐ నియంత్రిస్తుంది. ఎస్బీఐ సహా, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపీఐ), తక్షణ చెల్లింపు సేవలు (ఐఎంపిఎస్), భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) వంటి సేవలను అందిస్తోంది. -
జీఎస్టీ రిటర్న్ ఇకపై మరింత సులువు
సాక్షి, న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జిఎస్టీ)లో కీలకమైన జీఎస్టీఎన్ను ఇకపై ప్రభుత్వ ఆధీన సంస్థగా మార్చేందుకు జిఎస్టీ కౌన్సిల్ అంగీకారం తెలిపింది. అంతేకాదు జీఎస్టీ రిటర్న్‌లను సరళీకృతం చేసే రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్టు 27వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కౌన్సిల్ వెల్లడించింది. అలాగే చక్కెరపై పన్ను విధించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసింది. డిజిటల్ చెల్లింపులపై 2శాతం ప్రోత్సాహమిచ్చే అంశాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం పరిశీలనకు అప్పగించినట్టు తెలిపింది. కొత్త 27 వ సమావేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ పై అధికార నిర్ణయం తీసుకునే సంస్థ ప్యానెల్,జీఎస్టీఎన్ ను మార్చడానికి ప్రతిపాదనకు అంగీకరించినట్టు తెలిపారు. ప్రైవేటు సంస్థల వాటాను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు కౌన్సిల్ అంగీకరించిందనీ, కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరుస్తుందన్నారు. మిగతా వాటా రాష్ట్రాలదని స్పష్టంచేశారు. జిఎస్టీ నెట్ వర్క్ లేదా జిఎస్‌టీఎన్లో ప్రస్తుతం 24.5 శాతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదని జైట్లీ పేర్కొన్నారు. మిగిలిన 51శాతం ఐదు (హెచ్ఎఫ్సీ లిమిటెడ్, హెచ్ఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకు లిమిటెడ్, ఎన్ఎస్ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కో, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్సిట్యూట్లదని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన సమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.జీఎస్టీ ఫైలింగ్‌ను మరింత సరళీకృతం చేయనున్నట్టు వెల్లడించారు. ఆరునెలల్లో ఒకే నెలవారీ రిటర్న్ ఫైలింగ్ వ్యవస్థ అమల్లోకి వస్తోందని ఆర్థికశాఖ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిత్రా మాట్లాడుతూ దాదాపు అయిదు రాష్ట్రాలు సుగర్‌పై లెవీకి అనుకూలంగా లేవని అన్నారు. ముఖ్యంగా ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా చక్కెరపై లెవీని వ్యతిరేకించారు. ఇది సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతుందన్నారు. -
5వేల ఉద్యోగాలకు ఎసరు
సాక్షి,ముంబై: వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ విలీనంతో దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమం కాబోతోంది. అయితే ఈ మెగా మెర్జర్ ఇరు సంస్థలకుచెందిన ఉద్యోగులపై వేటుకు దారి తీయనుంది. వోడాఫోన్-ఐడియా విలీనం ద్వారా ఏర్పడనున్న ఉమ్మడి సంస్థలో భారీ తొలగింపులు చోటు చేసుకోనున్నాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు, సామర్థ్యాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా రాబోయే నెలల్లో ఈ భారీ తొలగింపులు చోటుచేసుకోవచ్చని నివేదించింది. ఇరు సంస్థల్లో కలిపి 21వేల మందికి పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 5వేలమందిపై వేటుపడే అవకాశాలున్నాయని రిపోర్ట్ చేసింది. ఉమ్మడి సంస్థ కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభించే సందర్భంలో రుణాలు మార్జిన్ ఒత్తిళ్లతో అనవసర ఉద్యోగులను భరించాల్సిన అవసరం లేదని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించడం ఈ అంచనాలకు ఊతమిచ్చింది. ముకేష్ అంబానీ యాజమాన్యం రిలయన్స్ జియో ప్రవేశం టెలికాం రంగాన్ని భారీగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో వోడాఫోన్, ఐడియా కంపనీలు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే ఐడియా, వోడాఫోన్ విలీనానికి ముందుకు వచ్చాయి. జియో ఎఫ్టెక్ట్‌తో కుదేలైన టెలికాం రంగం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను తగ్గించుకుంది. తాజాగా మరో 5వేలమందికి ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి కాగా ఈ విలీన ప్రక్రియకు ఎఫ్‌డీఐ క్లియరెన్స్ మాత్రమే పెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ మెర్జర్‌కు ముందే ఇరు సంస్థలు (వోడాఫోన్, ఐడియా) తమ బకాయిలు క్లియర్ చేయవలసిందిగా టెలికాం శాఖ కోరినట్టు తెలుస్తోంది. అలాగే టెలికాం రంగంలో ఎఫ్‌డీల అనుమతి పై హోం మంత్రిత్వ శాఖ నుండి ఆమోదంకోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి)కు రెండు వారాల క్రితం పంపించామని , స్పందనకోసం వేచి ఉన్నామని టెలికాం విభాగం అధికారి తెలిపారు. కంపెనీలోఎఫ్‌డీఐఐ పరిమితిని 100 శాతం పెంచాలని ఐడియా కోరిన సంగతి తెలిసిందే. -
రెవెన్యూ పరిధిలోకి రిజిస్ట్రేషన్ల శాఖ
బీఆర్ మీనాకు బాధ్యతలు అప్పగింత సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికే రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలూ అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ రాజీవ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై రిజిస్ట్రేషన్ల శాఖకు కూడా ముఖ్య కార్యదర్శిగా రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్.మీనా వ్యవహరించనున్నారు. 2010 వరకు రెండు శాఖలు ఒకే ముఖ్య కార్యదర్శి పరిధిలో ఉండగా, దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి ఒకే ముఖ్య కార్యదర్శి పరిధిలోకి తేవడం గమనార్హం. ముఖ్య కార్యదర్శి, కమిషనర్ వంటి కీలక పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు ఉండకపోవడంతో గందరగోళంగా తయారైన రిజిస్ట్రేషన్ల శాఖను, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి పరిధిలోకి తేవడం పట్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.