
న్యూఢిల్లీ: ఆరు కంపెనీలకు చెందిన జీడీఆర్ ఇష్యూల కృత్రిమ లావాదేవీల(మ్యానిప్యులేషన్) కేసులో 14 సంస్థలు, వ్యక్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ భారీగా రూ. 31 కోట్లకుపైగా జరిమానాను విధించింది. సెబీ కన్నెర్ర చేసిన సంస్థలు, వ్యక్తులలో అరుణ్ పంచారియా, పాన్ ఆసియా అడ్వయిజర్స్ తదితరాలున్నాయి. వ్యక్తిగతంగా పంచారియాకు రూ. 25 కోట్ల జరిమానా విధించగా.. పాన్ ఆసియా అడ్వయిజర్స్, అల్టా విస్టా(వింటేజ్ ఎఫ్‌జెడ్‌ఈ)లపై రూ. 3 కోట్లు చొప్పున జరిమానా చెల్లించమని ఆదేశించింది. ఆరు కంపెనీలకు చెందిన జీడీఆర్ ఇష్యూలలో అక్రమ పథకం ద్వారా పంచారియా తదితర సంస్థలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణ.
Comments
Please login to add a commentAdd a comment