చమురు రంగ పీఎస్‌యూ దిగ్గజాలకు వరుసగా ఐదో త్రైమాసికంలోనూ జరిమానాలు తప్పలేదు. నిబంధనల ప్రకారం సంస్థల్లో స్వతంత్ర, మహిళా డైరెక్టర్ల నియామకం చేపట్టకపోవడంతో ఈ చర్యకు పూనుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జరిమానా విధించిన కంపెనీల జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్), ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ ఉన్నాయి. లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఆయా కంపెనీల బోర్డుల్లో అవసరమైనమేర స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను ఎంపిక చేసుకోకపోవడంతో జరిమానాల వడ్డింపు కొనసాగింది.
ఇదీ చదవండి: ఫెడ్‌వైపు ఇన్వెస్టర్ల చూపు
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్–జూన్)లోనూ స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను తగిన సంఖ్యలో నిమమించుకోవడం వల్ల జరిమానాలు తప్పలేదు. గత కొద్దికాలంగా ఈ తంతు కొనసాగుతోంది. ఆయా కంపెనీలు పెనాల్టీ చెల్లిస్తున్నా తీరుమార్చుకోకపోవడం కొంత ఆందోళన కలిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ గరిష్టంగా రూ.5,36,900, కనిష్టంగా రూ.2,41,900 మధ్య జరిమానాలు విధించాయి.
Comments
Please login to add a commentAdd a comment