కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, కంపెనీ సీఎండీ సి.పార్థసారథికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నోటీసు జారీ చేసింది. పవర్ ఆఫ్ అటార్నీను దుర్వినియోగం చేయడం ద్వారా ఖాతాదారుల నిధులను పక్కదారి పట్టించిన కేసులో రూ.24.57 కోట్లను చెల్లించాలని ఆదేశించింది.
గతంలో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో కార్వీ సంస్థ విఫలమైంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి ఈ నోటీసు వచ్చింది. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించని పక్షంలో బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసి, కంపెనీల స్థిర, చర ఆస్తులను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని రికవరీ చేస్తామని సెబీ హెచ్చరించింది. అంతేకాకుండా మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల ప్రకారం పార్థసారథిని అరెస్ట్ చేసి జైలులో నిర్బంధిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ప్రముఖ సంస్థపై సీబీఐ కేసు నమోదు
బ్రోకింగ్ సంస్థకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీను దుర్వినియోగం చేసినట్లు సెబీ గతంలోనే తెలిపింది. క్లయింట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారని పేర్కొంది. దాంతో ఏప్రిల్ 2023లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, సీఎండీ పార్థసారథిలను సెక్యూరిటీ మార్కెట్ నుంచి ఏడేళ్లపాటు సెబీ నిషేధించింది. అలాగే రూ.21 కోట్ల పెనాల్టీని కూడా విధించింది. అయితే ఈ పెనాల్టీను చెల్లించడంలో కార్వీ జాప్యం చేస్తోంది. దాంతో జరిమానాతో కలిపి మొత్తం రూ.24.57 కోట్లు చెల్లించాలని సెబీ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment