![NFRA to carry out conduct audit quality inspections of Big 4 - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/23/nfra.jpg.webp?itok=0MXfzshj)
న్యూఢిల్లీ: బిగ్–4 ఆడిటింగ్ కంపెనీలకు చెందిన నెట్‌వర్క్ ఎంటెటీలలో ఆడిటింగ్ కార్యకలాపాల పరంగా లోపాలు ఉన్నట్టు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) గుర్తించింది. డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్‌ఎల్‌పీ, బీఎస్‌ఆర్ అండ్ కో ఎల్‌ఎల్‌పీ, ఎస్‌ఆర్‌బీసీ అండ్ కో ఎల్‌ఎల్‌పీ, ప్రైస్ వాటర్ హౌస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థల్లో ఆడిట్ నాణ్యత తనిఖీలను ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ నిర్వహించగా ఈ లోపాలు వెలుగు చూశాయి.
ప్రైస్ వాటర్ హౌస్, డెలాయిట్, ఈవై, కేపీఎంజీలను బిగ్–4 ఆడిటింగ్ సంస్థలుగా చెబుతారు. సంస్థల నాణ్యత నియంత్రణలను ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ పరిశీలించింది. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సంబంధించి వార్షిక స్టాట్యూటరీ ఆడిట్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను అధ్యయనం చేసింది. డెలాయిట్ హస్కిన్స్ అండ్ ఎల్‌ఎల్‌పీకి సంబంధించి ఆరు లోపాలను గుర్తించింది. బీఎస్‌ఆర్ అండ్ కోకు సంబంధించి కూడా ఆరు లోపాలు బయటపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment