సాక్షి, న్యూఢిల్లీ : చిన్న వ్యాపారాలపై భారీ మొత్తంలో పన్ను భారమున్నట్టు ఓ వైపు నుంచి వాదనలు వినిపిస్తుండగా.. మరోవైపు గణాంకాలు మాత్రం భిన్నంగా చూపిస్తున్నాయి. జూలైలో జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసిన 54 లక్షల వ్యాపారాల్లో 40 శాతానికి పైగా వ్యాపార కంపెనీలు ఎలాంటి పన్ను చెల్లించలేదని తెలిసింది. అంటే దాదాపు 22 లక్షల వ్యాపార కంపెనీలు ఒక్క రూపాయి జీఎస్టీ కూడా కట్టలేదని వెల్లడైంది. మిగతా 60 శాతం అంటే 32 లక్షల వ్యాపారాలు రూ.1 నుంచి రూ.33వేల మధ్యలో పన్నులు చెల్లించాయి. దీనికి భిన్నంగా కేవలం 0.3 శాతం అంటే 10వేలకు పైగా కంపెనీలు మాత్రమే జీఎస్టీలో రెండింట మూడువంతులు కలిగి ఉన్నట్టు తెలిసింది.
ప్రస్తుతం కోటి వ్యాపారాలు, సర్వీసు ప్రొవైడర్లు జీఎస్టీఎన్ నెట్‌వర్క్‌పై రిజిస్ట్రర్ అయ్యారు. వారిలో 72 లక్షల మంది ఎక్సైజ్, వ్యాట్, సర్వీసు ట్యాక్స్ నుంచి జీఎస్టీఎన్ నెట్‌వర్క్‌లోకి వచ్చారు. కొత్తగా 25 నుంచి 26 లక్షల పన్ను చెల్లింపుదారులు జీఎస్టీఎన్ నెట్‌వర్క్‌లోకి వచ్చారని శుక్రవారం అరుణ్‌జైట్లీ చెప్పారు. పెద్ద పన్ను చెల్లింపుదారుల నుంచి అంటే రూ.1.05 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వారి నుంచి సుమారు 94 నుంచి 95 శాతం పన్ను వసూలయ్యాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment