Businesses
-
‘‘లంచం.. సత్యం.. నిత్యం.. అనంతం’’!
ప్రజల సంక్షేమం కోసం, పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతీ రూపాయిలో.. చివరకు వాళ్ల దగ్గరకు చేరేది కేవలం 15 పైసలే!. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట.. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన మాట ఇది. ఈ మాట ఇవాళ్టికీ ఎన్నికల టైంలలో కొందరు నేతల నోటి వెంట వినాల్సి వస్తోంది. అంటే.. అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదా?.సమాజాన్ని పట్టి పీడించే సమస్యలంటూ అవినీతి, లంచగొండితనం మీద సినిమాలు తీసే దర్శకులు కూడా.. క్లైమాక్స్‌లో వాటికి ఓ సరైన ముగింపు చూపలేకపోతున్నారు. అందుకు కారణం.. జనం అవసరాలు అంతలా ఉండడం. వాటిని ఆసరాగా చేసుకుని కొంతమంది అత్యాశకు పోతున్నారు. వేలు, లక్షల్లో వేతనాలు వస్తున్నా.. చాలదన్నట్లుగా పక్కచూపులు చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే.. ఇలాంటి వాటికి తావులేకుండా.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ(డీబీటీ)లాంటి ఆలోచనలు చాలావరకు ఊరట ఇస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే..👉దేశంలోని మెజార్టీ కంపెనీలు ప్రభుత్వ అధికారులకు ఏదో ఒక దశలో లంచాలు ఇచ్చామని ఒప్పుకున్నాయి. ఇందుకు సంబంధించిన విస్తుపోయే వివరాలు.. ఓ సర్వే ద్వారా వెల్లడయ్యాయి.👉సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ సర్వే ప్రకారం.. గత ఏడాది కాలంలో ఒక్కసారైనా లంచం ఇచ్చామని మనదేశంలో సుమారు 66 శాతం కంపెనీలు తెలిపాయి. బలవంతంగా లంచం ఇవ్వాల్సి వచ్చిందని 54 శాతం బిజినెస్‌లు, పనులు వేగంగా పూర్తి చేసేందుకు లంచం ఇవ్వడానికి వాలంటరీగా ముందుకొచ్చామని 46 శాతం బిజినెస్‌లు ఒప్పుకున్నాయి.👉తూనికలు-కొలతలు, ఔషధాలు, ఆరోగ్యం.. ఈ విభాగాలు అత్యంత అవినీతిమయంగా మారాయి. ఈ విభాగాలకు సంబంధించిన ప్రతీ నాలుగింటిలో ముగ్గురు తప్పనిసరిగా లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఇక.. 👉మొత్తం 159 జిల్లాల్లోని కంపెనీల అభిప్రాయాలను సేకరించి ఈ వివరాలను బయటపెట్టింది. ఈ సర్వే కోసం 18 వేల రెస్పాన్స్‌లను సేకరించింది. ఇంకా ఈ సర్వే రిపోర్ట్‌లో.. ప్రభుత్వ డిపార్ట్మెంట్లతో డీల్ చేస్తున్నప్పుడు పర్మిట్స్ పొందడానికి, సప్లయర్ క్వాలిఫికేషన్, ఫైల్స్, ఆర్డర్స్, పేమెంట్స్ పొందడానికి లంచం ఇచ్చుకోవల్సి వచ్చిందని బిజినెస్‌లు తెలిపాయి. ‘ప్రభుత్వ అనుమతులను వేగంగా పొందాలంటే లంచం ఇవ్వడం తప్పదని చాలా బిజినెస్‌లు పేర్కొన్నాయి. ప్రాసెస్‌లో ఇదొక పార్ట్‌గా మారిందని చెప్పాయి. అథారిటీ లైసెన్స్ డూప్లికేట్ కాపీ కోసం కూడా లంచం ఇచ్చుకోవాల్సి వచ్చిందని, ప్రాపర్టీ సంబంధిత అంశాల్లో లంచం తప్పదని బిజినెస్‌లు పేర్కొన్నాయి. గత ఏడాది కాలంలో వివిధ రూపాల్లో లంచం ఇచ్చుకున్నామని 66 శాతం బిజినెస్‌లు ఒప్పుకున్నాయి. అయితే..159 జిల్లాల్లో వివిధ రంగాలకు చెందిన 9 వేల వ్యాపారాలను ఈ సర్వేలో భాగం చేసింది లోకల్‌సర్కిల్స్. మెట్రో(టైర్1) జిల్లాల నుంచి 42 శాతం, టైర్ 2 జిల్లాల నుంచి 33 శాతం, టైర్-3, టైర్-4 జిల్లాల నుంచి(రూరల్) 25 శాతం పాల్గొన్నారు.ఇందుగలడందులేడనిసందేహము వలదుఎందెందు వెదకి చూచినఅందందు అమ్యామ్యా మూలము గలదు!.. అవినీతిలో భారత్ స్థానం ప్రపంచంలో ఎంతో తెలుసా?లంచం ఇచ్చినవాళ్లలో 47 శాతం.. తాము ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అమ్యామా ముట్టజెప్పామని చెప్పారు. 62 శాతం మంది జీఎస్టీ అధికారులకు లంచాలిచ్చి పనులు చేయించుకున్నామని తెలిపారు. ప్రతీ ఇద్దరిలో ఒక వ్యాపారవేత్త.. కాలుష్యనివారణ, మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ రంగాల్లో అధికారులకు అమ్యామ్యా ఇచ్చామన్నారు. అయితే ఇదే సర్వేలో ఇంకో ఆసక్తికరమై విషయం గమనిస్తే..లంచం ఇవ్వకుండానే పనులు పూర్తి చేసుకోగలిగామని 16 శాతం బిజినెస్‌లు చెప్పాయి. అలాగే లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదని 19 శాతం బిజినెస్‌లు పేర్కొన్నాయి. అవినీతి నిరోధక చట్టం(2018-సవరణ) ప్రకారం.. లంచం తీసుకోవడం మాత్రమే కాదు.. ఇవ్వడమూ నేరమే. అయినా ఇలాంటి సర్వేలు అప్పుడప్పుడు మన దేశంలో లంచగొండితనం ఎంత లోతుల్లో వేళ్లు పాతుకుపోయిందో అనే విషయాన్ని మనకు చెబుతుంటాయి. అవినీతి అవగాహన సూచిక 2023 ప్రకారం.. 180 దేశాల్లో భారత్ 93వ స్థానంలో ఉంది. -
RBI: బ్యాంకింగ్‌లో కార్పొరేట్లకు నో ఎంట్రీ
ముంబై: బ్యాంకులను ప్రమోట్ చేయడానికి వ్యాపార సంస్థలను అనుమతించే ఆలోచన ఏదీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ చేయడం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బ్యాంకుల ప్రమోట్‌కు కార్పొరేట్ సంస్థలను అనుమతించడం వల్ల వడ్డీ రిస్‌్కలు, సంబంధిత లావాదేవీల్లో పారదర్శకత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందన్నారు. భారతదేశానికి ఇప్పుడు కావలసింది బ్యాంకుల సంఖ్య పెరగడం కాదని పేర్కొంటూ. మంచి, పటిష్ట, సుపరిపాలన ఉన్న బ్యాంకులు ఇప్పు డు కీలకమైన అంశమని వివరించారు. సాంకేతికత ద్వారా దేశవ్యాప్తంగా పొదుపులను సమీకరిస్తుందన్నారు.రుణాలకన్నా... డిపాజిట్ల వెనుకడుగు సరికాదు... డిపాజిట్ల పురోగతికన్నా.. రుణ వృద్ధి పెరగడం సరైంది కాదని పేర్కొంటూ ఇది లిక్విడిటీ సమస్యలకు దారితీస్తుందన్నారు. గృహ పొదుపులు గతం తరహాలోకి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్‌స్ట్రమెంట్ల వైపు మళ్లడం బ్యాంకింగ్ డిపాజిట్లపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారు. డిపాజిట్లు–రుణాల మధ్య సమతౌల్యత ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇక దేశంలో ఆర్థికాభివృద్ధి ఊపందుకుందని పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం ఆందోళనలు ఇంకా పొంచి ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారిస్తుందని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం సుస్థిర ప్రాతిపదికన 4 శాతం వైపునకు దిగివస్తేనే రుణ రేటు వ్యవస్థ మార్పు గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.స్పెక్యులేషన్‌లోకి గృహ పొదుపులుఎఫ్అండ్వో ట్రేడ్ చాలా పెద్ద అంశం సెబీ చైర్పర్సన్ మాధవిపురిఇంటి పొదుపులు స్పెక్యులేషన్ వ్యాపారంలోకి వెళుతున్నాయని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతున్నందున ఎఫ్‌అండ్‌వోలో స్పెక్యులేటివ్ ట్రేడ్లకు వ్యతిరేకంగా ఇన్వెస్టర్లకు గట్టి హెచ్చరిక పంపుతున్నట్టు చెప్పారు. మూలధన ఆస్తి కల్పనకు ఉపయోగపడుతుందన్న అంచనాలను తుంగలో తొక్కుతున్నారని.. యువత పెద్ద మొత్తంలో ఈ ట్రేడ్లపై నష్టపోతున్నట్టు తెలిపారు. ‘‘ఓ చిన్న అంశం కాస్తా.. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే ఈ దిశగా ఇన్వెస్టర్లను ఒత్తిడి చేయాల్సి వస్తోంది’’అని సెబీ చైర్పర్సన్ చెప్పారు. ప్రతి 10 మంది ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) విభాగంలో నష్టపోతున్నట్టు సెబీ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. ట్రేడింగ్ పరిమాణం పెద్ద ఎత్తున పెరగడంతో, ప్రతి ఒక్కరినీ ఈ దిశగా అప్రమ్తతం చేయడం నియంత్రణ సంస్థ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఫిన్ఫ్లూయెన్సర్లు (ఆర్థిక అంశాలు, పెట్టుబడులను ప్రభావితం చేసేవారు) పెట్టుబడుల సలహాదారులుగా సెబీ వద్ద నమోదు చేసుకుని, నియంత్రణల లోపాలను వినియోగించుకుంటున్నారని, దీనిపై త్వరలోనే చర్చా పత్రాన్ని విడుదుల చేస్తామన్నారు. -
అమెరికా వదిలి ఇండియాకు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి..
ఇటీవల ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 100 మంది ప్రపంచ కుబేరుల జాబితాలో ఆఖరి (100వ) స్థానంలో నిలిచిన కేపీఆర్ మిల్ ఛైర్మన్ 'రామసామి' (Ramasamy) ధనవంతుల లిస్ట్‌లో చేరిన మొదటి రైతు బిడ్డగా చరిత్ర సృష్టించాడు. అప్పు చేసి వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన 'రామసామి' వ్యాపారాన్ని చూసుకోవడానికి అతని కొడుకు 'ఆనందకృష్ణన్' విదేశాలను వదిలి ఇండియా వచ్చేసాడు. సంస్థ అభివృద్ధి కోసం తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్న ఆనందకృష్ణన్.. కోయంబత్తూరులోని జీఆర్డీ కాలేజీలో బిజినెస్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ, అమెరికాలోని ఫిలడెల్ఫియా యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసాడు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిని ఆనందకృష్ణన్.. తన తండ్రి స్థాపించిన కుటుంబ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇండియా తిరిగి వచ్చాడు. కుటుంబ వ్యాపారాలను చూసుకోవడానికి విదేశాలను వదిలి వచ్చిన వారు ఇప్పటికే చాలామంది ఉన్నారు. ఈ జాబితాలో ఆనందకృష్ణన్ ఒకరుగా నిలిచాడు. 2001లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత, అతను 2002లో కేపీఆర్ గ్రూప్‌లో మేనేజ్మెంట్ టీమ్‌లో చేరాడు. అప్పటి నుంచి అతను గ్రూప్ అభివృద్ధికి కృషి చేసాడు. ఆ తరువాత 2008 నుంచి కంపెనీ 'ప్రెసిడెంట్' (ప్రాసెసింగ్ డివిజన్)గా పనిచేశాడు, 2011లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఇదీ చదవండి: జాబ్ రిజైన్ చేస్తే రూ.4 లక్షలు - అమెజాన్ ఫౌండర్ అదిరిపోయే ఆఫర్! కేపీఆర్ గ్రూప్ అభివృద్ధికి ఎన్నెన్నో కొత్త ఆలోచలను ప్రవేశపెట్టిన ఆనందకృష్ణన్ ప్రస్తుతం కర్ణాటకలోని ప్రాసెసింగ్ డివిజన్, గార్మెంట్ యూనిట్, కొన్ని స్పిన్నింగ్ యూనిట్లు, కో-జెన్ కమ్ షుగర్ ప్లాంట్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. అంతే కాకుండా ఇతడు కోయంబత్తూరులో ఆడి, హార్లే డేవిడ్సన్ డీలర్‌షిప్‌లను కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. -
జీఎస్టీ పరిధిలోకి అన్ని వ్యాపార సంస్థలు
వాపి (గుజరాత్): వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయాన్ని పెంచడమే కాకుండా, అన్ని వ్యాపార సంస్థలను ఈ పరోక్ష పన్ను వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆర్థికశాఖ పనిచేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గుజరాత్‌లోని 12 జీఎస్టీ సువిధ కేంద్రాలను ఇక్కడ నుంచి ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లో వ్యాపార సంస్థలకు లోపరహిత వ్యవస్థను అందించడం, ఆయా సంస్థల సవాళ్ల పరిష్కారానికి ఈ కేంద్రాలు దోహదపడతాయన్నారు. జీఎస్టీ వసూళ్లు ఏడాదికాయేడాది పెరుగుతుండడం హర్షణీయ పరిణామమన్నారు. జీఎస్టీ వ్యవస్థలో మునుపటి కాలంతో పోలిస్తే అనేక వస్తువులపై పన్ను రేట్లు తగ్గించడం జరిగిందన్నారు. చాలా సంస్థలు ఇప్పటికీ జీఎస్టీ పరిధికి దూరంగా ఉండటానికి ఇష్టపడుతున్నాయని పేర్కొన్న ఆమె, దీనివల్ల అధికారిక ఆర్థిక వ్యవస్థలో అవి భాగం కాబోవని వివరించారు. కేవలం పన్ను చెల్లింపులకు మాత్రమే కాకుండా, ఎకానమీ పటిష్టతలో భాగం కావడానికి ఆయా సంస్థలు జీఎస్టీ పరిధిలోకి రావడం అవసరమన్నారు. ఈ కారణంగా ఇకపై కేవలం పన్ను వసూళ్ల పెరుగుదలపైనే కాకుండా, ఈ పరిధిలోకి వస్తున్న సంస్థల పెరుగుదల రేటును కూడా పరిశీలించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పోర్టల్‌లో చెల్లించిన జీఎస్టీ బిల్లులను అప్లోడ్ చేసిన ఐదుగురికి డ్రా ఆధారంగా ఒక్కొక్కరికి రూ.10 లక్షలు బహుకరించారు. తమ బిల్లును అప్లోడ్ చేసి లాటరీలో గెలవని వారిని కూడా తాను అభినందిస్తున్నట్లు పేర్కొన్న ఆమె ప్రతి వినియోగదారుడు వారి బిల్లులను అప్లోడ్ చేసేలా ప్రోత్సహించాలని ఆమె అన్నారు. దేశ ఎకానమీకి ఇది కీలకమని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్, రాజ్‌కోట్, పంచమహల్స్‌తో సహా గుజరాత్‌లోని 12 వేర్వేరు నగరాల్లో జీఎస్టీ సువిధ కేంద్రాలను ప్రారంభించిన ఈ కార్యక్రమంలో గుజరాత్ ఆర్థిక మంత్రి కను దేశాయ్, రాష్ట్ర జీఎస్టీ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
కేశమహిమ
జీవితంలో అప్రధానంగా కనిపించే విషయాలకు కూడా వాటి ప్రాధాన్యం వాటికి ఉంటుంది. ఇందుకు తిరుగులేని ఉదాహరణ జుట్టు. మన భాషా సాహిత్యాలను కొంచెం తరచి చూస్తే, జుట్టుకు ఉన్న ప్రాశస్త్యం అర్థమవుతుంది. జుట్టు చుట్టూ జరిగే వ్యాపారాలను కాస్త నిశితంగా గమనిస్తే,ఎంతటి వారైనా ‘జుట్టే కదా’ అని కేశపాశాలను వెంట్రుక ముక్కలా తీసి పారేయలేరు. అదీ కేశ మహిమ! అందమైన కేశాలు నిండుగా తలమీద ఉండటం వల్లనే శ్రీమహావిష్ణువుకు కేశవుడనే పేరు వచ్చింది. ఆదిభిక్షువే అయినా, పరమశివుడు కేశసంపదలో తక్కువ వాడేమీ కాదు, ఆయన జటాజూటధారి! ఆయన తన జటాజూటంలో గంగను బంధించాడు కాబట్టి గంగను శిరోజతీర్థం అని అంటారు. తలవెంట్రుకలకు గల పురాణ ప్రశస్తికి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే! జుట్టును అల్లుకున్న జాతీయాలు, సామెతలు దాదాపు అన్ని భాషల్లోనూ ఉన్నాయి. ‘ఫలిత కేశాలు ముదిమికి సంకేతాలే గాని, జ్ఞానానికి కాదు’ అని ఇంగ్లిష్ సామెత. ఇది తలపండితులకు చక్కగా వర్తిస్తుంది. ‘తలలు బోడులైన తలపులు బోడులా’ అనే సామెత మనకు ఉండనే ఉంది. ‘అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం’ కూడా మన నుడికారంలో భాగమే! కొందరు బతకనేర్పరులు ఈ విద్యలో బాగా ఆరితేరి ఉంటారు. ‘జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే’ అని నానుడి. ఇటీవల ఏపుగా జుట్టు పెంచుకోవడానికి హైదరాబాద్‌లో ఒక మహిళ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. బ్యూటీపార్లర్ చికిత్సతో ఆమెకు ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది. ఇలా ఉంటాయి కేశక్లేశాలు! ‘కాళ్లు్ల వంకరగా ఉన్నప్పుడు నెత్తి మీద వెంట్రుకలు తిన్నగా ఉండి లాభమేంటి?’ అని రష్యన్ సామెత. ‘ప్రతి మనిషి పొద్దున్నే తలదువ్వుకున్నట్లు మనసు దువ్వుకోరెందుకో?’ అని చైనీస్ సామెత. మనుషులకు శిరోజాలంకరణ మీద ఉన్న శ్రద్ధ మనోలంకరణ మీద ఉన్నట్లయితే, ఈ ప్రపంచం ఎప్పుడో బాగుపడిపోయేది! మన పూర్వకవులు మరాళకుంతలలైన నీలవేణుల సౌందర్యాన్ని ఇతోధికంగా వర్ణించారు. ‘ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై...’ పద్యంలో పోతనామాత్యుడు శ్రీమహా విష్ణువు కరవైభవాన్ని వర్ణించడానికి లక్ష్మీదేవి కొప్పునే ఆశ్రయించాల్సి వచ్చింది. ‘అంభోజతాక్షి వేణిన్ హరువు గనిన రోమాతి సౌభాగ్యమెంతే... చమిరి యొనరుపన్ చక్కనౌ తీవెయోనాన్’ అంటూ కొప్పరపు కవులు ఒక అవధానంలో వేణీసౌందర్యాన్ని వర్ణించారు. ‘కలుగక యిచ్చెడు మనుజులు/ తలవెండ్రుకలంత మంది తర్కింపంగా/ కలిగియు నీయని యధములు/ మొల వెండ్రుకలంత మంది మోహన రంగా’ అని ఒక పూర్వకవి సంపన్న లోభుల మీద కసిదీరా తన అక్కసును వెళ్లగక్కాడు. తల మీది వెంట్రుకలకే కాదు, పురుషుల మీసాలకు, గడ్డాలకు కూడా మన భాషా సాహిత్యాల్లో తగిన ప్రశస్తి ఉంది. మీసాలను పౌరుష చిహ్నాలుగా గుర్తిస్తారు. అందుకే ‘మీసము పస మగ మూతికి’ అన్నాడు చౌడప్ప. వైదికులకు మీసాలు పెంచే ఆచారం లేకపోయినా, తిరుపతి వేంకట కవులు మీసాలను పెంచారు. ఈ జంటకవులు మీసాలను పెంచడాన్ని కొందరు ఆక్షేపిస్తే, ‘దోసమ టంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమే/ మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు దెల్పగా/ రోసము గల్గినన్ కవి వరుల్ మము గెల్వుడు గెల్చిరేని ఈ/ మీసము దీసి మీ పాద సమీపములన్ తలలుంచి మ్రొక్కమే!’ అని సవాలు విసిరారు. అదీ వారి కవన పౌరుషం! కేశ సంరక్షణ కోసం స్త్రీ పురుష భేదం లేకుండా మనుషులు నానా తంటాలు పడటం శతాబ్దాల నుంచే ఉంది. తలకట్టు నిండుగా కనిపించడానికి వివిధ సుగంధ తైలాలను వాడేవారు. గాంభీర్యా నికి గురుతైన మీసకట్టు ఏపుగా పెరగడానికి కూడా రకరకాల పద్ధతులు పాటించేవారు. ‘అంబలి తాగేవాడొకడైతే మీసాలెత్తేవాడు ఇంకొకడు’, ‘మింగ మెతుకు లేదు గాని, మీసాలకు సంపెంగ నూనె’ వంటి సామెతలు సమాజంలోని డాంబిక ఆడంబరాలను బయటపెడతాయి. బ్రిటిష్ హయాంలో ఆధునిక పోకడలు మొదలయ్యాక మన దేశంలో అలంకరణల పద్ధతుల్లో చాలా మార్పులే వచ్చాయి. తల వెంట్రుకలను, మీసకట్టును చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో తీర్చిదిద్దుకోవడం మొదలైంది. ఈ మార్పులు మొదలైన కొత్తలో కొంత విచిత్రంగా చూసేవారు. అప్పటికింకా సంప్ర దాయాలను వదులుకోని ఛాందసులు ఈ విచిత్ర కేశాలంకరణలను ఆక్షేపించేవారు. ‘గొంగడి పురుగు కట్టింగు మీసాల వాడు/ గంపశ్రాద్ధపు తలకట్టువాడు’ అని మాధవపెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి ‘కన్యాశుల్కం’లోని గిరీశం పాత్రను వర్ణిస్తూ ఒక పద్యం రాశారు. తలకు చక్కగా నూనె పట్టించి, నున్నగా దువ్వుకోవడం పెద్దమనుషుల లక్షణంగా ఉండేది. ఆ రోజుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అలా నున్నగా దువ్విన తలకట్టుతో ఉండేవారు. ఆయన తలకట్టు సొగసును– ‘ఈగ వ్రాలిన గాని వేగ జారెడునట్లు మువ్వంపు కురులను దువ్వినాడు/... చెవుల సందున గిర జాలు చిందులాడ మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త/ టంగుటూరి ప్రకాశము రంగు మెరయ ధవళగిరి తీర్థమునకు తరలివచ్చె’ అంటూ చిలకమర్తివారు వర్ణించారు. ఆ రోజులే వేరు. సామాజిక, రాజకీయ జీవితాల్లో సరసత ఉండేది. ఇప్పుడు రాజకీయాలు బొత్తిగా మొరటుదేరిపోయాయి. అయితే, ఇప్పటికీ రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తరచుగా కేశ ప్రస్తావన వస్తూనే ఉంటుంది గాని, వారి ప్రసంగాల్లో కేశాలకు సంబంధించి దొర్లే ముతక పదాలు జనాల చెవులను చిల్లులు పొడుస్తుంటాయి. అయినా, గొంగట్లో భోంచేసేటప్పుడు వెంట్రుకలను ఏరుకోక తప్పదు కదా! -
‘పల్లె’విస్తున్న పట్టణం
గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్యా సౌకర్యాలు అందుబాటులోకి రావడం...అదే క్రమంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం...వ్యాపార అవకాశాలు విస్తృతంగా మారడంతో పల్లె జనం పట్టణాలకు చేరుతున్నారు. రెండు దశాబ్దాల్లో జిల్లాలోని పలు పట్టణాల్లో జనాభా పెరుగుదలే ఇందుకు నిదర్శనం. కొందరు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంకొందరు ఉపాధి అవకాశాల కోసం సిటీ బాట పడుతున్నారు. దీంతో చిన్నచిన్న పట్టణాలు అనతి కాలంలోనే వేగంగా విస్తరిస్తున్నాయి. కడప కార్పొరేషన్: పట్టణ జనాభా రోజురోజుకూ పెరిగిపోతోంది...పల్లెలు విడిచి జనం పట్టణాలకు వలస వస్తున్నారు. పిల్లల చదువుల కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం సిటీబాట పడుతున్నారు. దీంతో గత 20 ఏళ్లలో పట్టణ జనాభా మూడింతలు పెరిగింది. ఇదే క్రమంలో పట్టణ సమీపాల్లో ఉన్న పల్లెలు పట్టణాల్లో విలీనమవుతున్నాయి. క్రమేణా పల్లె వాతావరణం మాయమై పట్టణీకరణ ఛాయలు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రం కడపతోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో జనాభా రోజు రోజుకూ పెరిగిపోతోంది. దాదాపు 22 ఏళ్లక్రితం ఈ పట్టణాల మొత్తం జనాభా 5,66,000 ఉండగా, 2011 సంవత్సరానికి 7,17,259కి చేరింది. 2021 సంవత్సరంలో జనాభా లెక్కల సేకరణ చేయాల్సి ఉండగా, కరోనా వల్ల సాధ్యం కాలేదు. అయితే 2001 జనాభాతో పోల్చితే 2021 సంవత్సరానికి దాదాపు రెట్టింపు అయినట్లు గణాంక అధికారులు చెబుతున్నారు. పదో తరగతి తర్వాత కళాశాలల్లో పిల్లలను చదివించేందుకు పలువురు పట్టణాలకు వస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులు కనుమరుగు కావడంతో ఉపాధి కోసం పల్లెలను వీడుతున్న వారి సంఖ్య కూడా చాలానే ఉంది. ఇదే కోవలో పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు రోజూ గ్రామాల నుంచి రాకపోకలు సాగించలేక పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. దీనివల్ల పట్టణాల జనాభా పెరిగిపోతోంది. జనాభా పెరుగుదల వల్ల పట్టణ శివారు ప్రాంతాల్లో కాలనీలు వెలుస్తున్నాయి. పట్టణాలను అనుకొని ఉన్న పల్లెలు వాటిలో కలిసిపోతున్నాయి. దీంతో మేజర్ గ్రామ పంచాయితీలు సైతం చిన్న పట్టణాలుగా, చిన్న పట్టణాలు పెద్ద పట్టణాలుగా మార్పు చెందుతున్నాయి. చెన్నూరు, సీకేదిన్నె, వల్లూరు మండలాలు, పెండ్లిమర్రి మండలంలోని వైవీయూ ఇప్పటికే కడపలో దాదాపు కలిసిపోయాయి. ప్రొద్దుటూరులో పోట్లదుర్తి, రాజుపాళెంలు కలిసిపోయినట్లు ఉంటాయి. మైదుకూరులో చాపాడు, దువ్వూరు, ఖాజీపేట చాలా దగ్గరగా ఉంటాయి. బద్వేల్‌కు సమీపంలో ఉన్న గోపవరం మండలం దాదాపు బద్వేల్లో కలిసిపోయింది. ఇలా చిన్న చిన్న గ్రామాలు మేజర్ పంచాయితీలలో, మేజర్ పంచాయితీలు నగర పంచాయితీల్లో కలిసిపోయి పట్టణాలుగా రూపొందుతున్నాయి. అర్బన్ మండలం ఏర్పడినా.... పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని పాలనా సౌలభ్యం కోసం కడప అర్బన్ మండలాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు సిబ్బందిని కూడా నియమించారు. అయితే అర్బన్ మండలంలోని అధికారులతో భూసేకరణ పనులు అప్పగించి, పరిపాలన పరమైన వ్యవహారాలన్నీ కడప మండలం నుంచే జరుపుతున్నారు. దీంతో కడప అర్బన్మండలం ఏర్పడినా ఫలితం లేకుండా పోయింది. మౌళిక సదుపాయాలపై దృష్టి పట్టణాల్లో జనాభా పెరుగుదల నేపథ్యంలో ప్రధానంగా విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు,పెద్ద షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటువుతున్నాయి. వ్యాపార సంస్థలు అందుబాటులోకి రావడంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుపడుతున్నాయి. పట్టణాలకు చేరుతున్న జనాభాకు అనుగుణంగా సమీప గ్రామాలు పట్టణాల్లో కలుస్తుండటంతో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. కొత్త కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, విద్యుత్, త్రాగునీటి సదుపాయాల కోసం చర్యలు తీసుకుంటున్నారు. పిల్లల చదువుల కోసం రావాల్సి వచ్చింది మా స్వగ్రామం సిద్దవటం మండలంలోని వెంకటాయపల్లె. నాకు పట్టణ,జనాభా ,చదువులు,ఉద్యోగాలు,వ్యాపారాలు,గ్రామంలో కొంత పొలం ఉంది. పిల్లలను చదివించుకోవడానికి ఎనిమిదేళ్లక్రితం కడపకు వచ్చాను. మా గ్రామం నుంచి కడపకు వచ్చి పోవడానికి కొంత ఇబ్బందిగా ఉండటంతో కడపలోనే ఇల్లు బాడుగకు తీసుకొని, క్లినిక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నా. పల్లెలో ఉన్న పొలాన్ని కౌలుకు ఇచ్చా. – జె. ఉమామహేశ్వరరావు, ఫిజియోథెరపిస్ట్. ఉపాధి అవకాశాల కోసం... కమలాపురం మండలంలోని అప్పాయపల్లె మా స్వగ్రామం. నేను ఫోర్ వీలర్స్‌ను బాడుగకు ఇస్తుండేవాణ్ణి. ఈక్రమంలో ఉపాధి అవకాశాల కోసం మెల్లగా కడపకు వచ్చాం. పిల్లలను కూడా ఇక్కడే చదివిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడే ఇల్లు బాడుగకు తీసుకొని, స్థిర వ్యాపారం ఏర్పాటు చేసుకున్నాను. ఆ వ్యాపారం వల్ల జీవనం సాగిస్తున్నాను. పండుగలు, పబ్బాలకు మాత్రమే ఊరు వెళుతుంటాను. – మోషె, కో ఆపరేటివ్ కాలనీ. -
New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!
వ్యాపార సంస్థలకు సంబంధించి జీఎస్టీ కొత్త రూల్ మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. రూ. 100 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను జారీ చేసిన 7 రోజులలోపు ఐఆర్పీ (ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని జీఎస్టీ నెట్వర్క్ తెలిపింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను జారీ చేసిన తేదీతో సంబంధం లేకుండా ఐఆర్‌పీలో అప్లోడ్ చేస్తున్నాయి. ఇకపై అలా కుదరదు. రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు ఈ-ఇన్వాయిస్ ఐఆర్పీ పోర్టల్లలో పాత ఇన్వాయిస్లను అప్లోడ్ చేయడానికి కాల పరిమితిని విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జీఎస్టీ నెట్వర్క్ పేర్కొంది. ఈ కొత్త ఫార్మాట్ 2023 మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పరిమితి ఇన్వాయిస్లకు మాత్రమే వర్తిస్తుంది. డెబిట్ లేదా క్రెడిట్ నోట్లను నివేదించడంలో ఎలాంటి కాల పరిమితి లేదు. జీఎస్టీ చట్టం ప్రకారం.. ఐఆర్‌పీలో ఇన్వాయిస్లు అప్లోడ్ చేయకపోతే వ్యాపార సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందలేవు. ప్రస్తుతం రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు అన్ని బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ను రూపొందించడం తప్పనిసరి. జీఎస్టీ చట్టం ప్రకారం.. 2020 అక్టోబర్ 1 నుంచి రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు బిజినెస్-టు-బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఈ-ఇన్వాయిస్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత 2021 జనవరి 1 నుంచి రూ. 100 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వారికి కూడా దీన్ని వర్తింపజేసింది. 2021 ఏప్రిల్ 1 నుంచి రూ. 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B ఈ-ఇన్వాయిస్లను సమర్పిస్తున్నాయి. అయితే 2022 ఏప్రిల్ 1 నుంచి ఆ పరిమితి రూ. 20 కోట్లకు, 2022 అక్టోబర్ 1 నుంచి రూ.10 కోట్లకు తగ్గించారు. -
Bharat Jodo Yatra: చిన్న వ్యాపారాలపై బీజేపీ దెబ్బ: రాహుల్
సాక్షి, బళ్లారి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన విధానాలతో కొన్ని పెద్ద వ్యాపార సంస్థలకు లబ్ధి చేకూర్చుతూ చిన్న, మధ్య తరహా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర ఆదివారం బళ్లారి జిల్లాలో కొనసాగింది. మోకా గ్రామంలో ఆయన వ్యాపారులతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ స్థానం మరింతగా పడిపోవడంపై రాహుల్ ట్విట్టర్లో స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి భారత్‌ను ఇంకా ఎంతకాలం బలహీనం చేస్తాయని ప్రశ్నించారు. జోడో పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. మోకాకు వెళ్లే దారిలో ఒక అభిమాని పట్టుకున్న జెండా రాడ్‌కు విద్యుత్ తీగలు తాకి ఐదుగురికి గాయాలయ్యాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న రాహుల్‌గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. రాహుల్ రాత్రి బళ్లారి జిల్లాలో బస చేశారు. సోమవారం ఉదయం మోకా నుంచి ఏపీలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఛత్రగుడిలోకి యాత్ర ప్రవేశిస్తుంది. -
ప్రపంచంలోకెల్లా తొలి స్మార్ట్ కాలిక్యులేటర్.. హైదరాబాద్‌లో అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: చిన్న, మధ్యతరహా వ్యాపారులకు రోజువారీ లావాదేవీలు, ఆదాయ, వ్యయాల లెక్కింపులో దోహదపడేందుకు ప్రపంచంలోకెల్లా తొలి స్మార్ట్, మేడ్ ఇన్ ఇండియా కాలిక్యులేటర్ పరికరం హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. కాలిక్యులేటర్‌కు అనుసంధానంగా ఉండే టుహ్యాండ్స్ మొబైల్ యాప్ ద్వారా ఇది పనిచేయనుంది. ఒక్కో లావాదేవీని యాప్‌లోకి వ్యాపారులు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా రియల్‌టైమ్‌లోనే లావాదేవీల వివరాలన్నీ ఈ పరికరంలో నిక్షిప్తం కావడం దీని ప్రత్యేకత. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, టీ–హబ్ సహకారంతో టుహ్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ రూ. 50 లక్షల నిధులను సమీకరించి స్మార్ట్ కాలిక్యులేటర్‌ను అభివృద్ధి చేసింది. సోమవారం నగరంలోని ‘టీ–హబ్’లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలను తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. ఇలాంటి ఆవిష్కరణల కోసమే టీ హబ్‌ను ప్రభుత్వం అన్ని హంగులతో ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇది జపాన్, చైనాలు తయారు చేసి విక్రయిస్తున్న సాధారణ కాలిక్యులేటర్ల గుత్తాధిపత్యానికి కచ్చితంగా గండికొడుతుందని జయేశ్ రంజన్ అభిప్రాయపడ్డారు. టుహ్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవిష్కర్త ప్రవీణ్మిశ్రా మాట్లాడుతూ ఈ కాలిక్యులేటర్ చిన్న, మధ్యతరహా వ్యాపారుల బుక్ కీపింగ్‌లో పారదర్శకతను తీసుకొస్తుందన్నారు. ఆల్ఫా న్యూమరిక్ కీబోర్డ్‌తో కూడిన ఈ స్మార్ట్ కాలిక్యులేటర్ పవర్ రీచార్జ్ చేశాక 3 రోజులపాటు నడుస్తుందని వివరించారు. దీని ధరను రూ. 2,999గా నిర్ణయించినట్లు చెప్పారు. ఏడాది వారంటీతో పనిచేసే ఈ పరికరంలో 90 రోజుల డేటాను సులభంగా పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీహబ్ సీఈఓ శ్రీనివాసరావు, టీఎస్ఐసీ సీఐఓ శాంతతౌతం, టుహ్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవిష్కర్తలు సత్యం సాహు, షణ్ముగ వడివేల్, అరవింద్ సుబ్రమణియన్ పాల్గొన్నారు. చదవండి: సీఎం ఫాంహౌస్ కోసమే ‘రీజినల్’ అలైన్మెంట్ మార్పు -
ఆఫీస్ టాయ్‌లెట్స్‌కు సున్నం వేయకున్నా జైలే..
న్యూఢిల్లీ: దేశ ద్రోహం కింద పరిగణించే నేరాలకు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. అయితే, వ్యాపార సంస్థలు మరుగుదొడ్లకు (లెట్రిన్లు, యూరినల్స్) నాలుగు నెలలకోసారి సున్నాలు వేయకపోయినా కూడా అదే స్థాయిలో ఏడాది నుంచి మూడేళ్ల వరకూ శిక్షలు వేయొచ్చని చట్టాలు చెబుతున్నాయి. ఇలా జైలు శిక్షకు ఆస్కారం ఉన్న అనేకానేక నిబంధనలను తూచా తప్పకుండా పాటించలేక దేశీయంగా వ్యాపారాలు నానా తంటాలు పడుతున్నాయని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) ఒక అధ్యయనంలో వెల్లడించింది. ’వ్యాపారం చేస్తే జైలుశిక్ష: భారత వ్యాపార చట్టాల్లో 26,134 జైలు శిక్ష క్లాజులు’ పేరిట టీమ్‌లీజ్ సంస్థతో కలిసి ఓఆర్ఎఫ్ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం భారత్‌లో వ్యాపార సంస్థల నియంత్రణకు నిర్దేశించిన నిబంధనలు 69,233 పైచిలుకు ఉన్నాయి. వీటిని పాటించకపోతే జరిమానాగా జైలు శిక్ష విధించేలా 26,134 క్లాజులు ఉన్నాయి. ‘ప్రతి అయిదు నిబంధనలకు కనీసం రెండు క్లాజులు .. వ్యాపారవేత్తలను జైలుకు పంపే విధంగా (నిబంధనలను పాటించనందుకుగాను) ఉంటున్నాయి‘ అని ఓఆర్ఎఫ్ పేర్కొంది. పారిశ్రామిక రంగంలో ముందున్న అయిదు రాష్ట్రాల (గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు) వ్యాపార చట్టాల్లో కనీసం 1,000కి పైగా జైలు శిక్ష క్లాజులు ఉన్నాయని వివరించింది. ఏటా రూ. 18 లక్షల భారం.. అధ్యయనం ప్రకారం.. 150 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్న సగటు చిన్న తరహా తయారీ సంస్థ (ఎంఎస్ఎంఈ) ఏటా 500–900 పైచిలుకు నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఈ భారం ఏటా రూ. 12–18 లక్షల స్థాయిలో ఉంటోంది. స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ చేసిన అనేకానేక వ్యాపార చట్టాల్లో జైలు శిక్ష నిబంధనల వల్ల భారత్‌లో వ్యాపారాలు చేయడం సవాళ్లతో కూడుకున్నదిగా మారిందని ఓఆర్ఎఫ్ తెలిపింది. అతి నియంత్రణ వల్ల లాభాల కోసం పని చేసే సంస్థలతో పాటు లాభాపేక్ష లేని సంస్థలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది. టాయ్లెట్లను శుభ్రం చేయకపోవడాన్ని కూడా దేశద్రోహ నేరానికి సమానంగా పరిగణించి శిక్ష వేసేలా నిబంధనలు ఉండటం ఇందుకు ఉదాహరణగా ఓఆర్ఎఫ్ వివరించింది. అసంఖ్యాక నిబంధనలను పాటించేలా వ్యాపారవేత్తలను క్రిమినల్ శిక్షలతో అతిగా భయపెట్టడం వల్ల అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. అనవసర నిబంధనలను తొలగించే విషయంలో ప్రభుత్వం శుభారంభం చేసిందని.. దాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిలో 26,134 జైలు క్లాజులకు కూడా విస్తరించాలని టీమ్‌లీజ్ వైస్ చైర్మన్ మనీష్ సబర్వాల్ తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించి గత ఏడేళ్లుగా సేకరించిన వివరాల ఆధారంగా డేటాను లేబర్, ఫైనాన్స్, ఆరోగ్యం తదితర ఏడు విభాగాల కింద ఓఆర్ఎఫ్ వర్గీకరించింది. దీని ప్రకారం అయిదు రాష్ట్రాల వ్యాపార చట్టాల్లో 1,000కి పైగా జైలు శిక్ష క్లాజులు ఉన్నాయి. గుజరాత్ (1,469), పంజాబ్ (1,273), మహారాష్ట్ర (1,210), కర్ణాటక (1,175), తమిళనాడు (1,043) ఈ జాబితాలో ఉన్నాయి. క్రమబద్ధీకరించేందుకు పది సూత్రాలు.. మితిమీరిన నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా వ్యాపార చట్టాలు, నియంత్రణలను క్రమబద్ధీకరించేందుకు నివేదికలో పది సూత్రాలను ప్రతిపాదించారు. క్రిమినల్ పెనాల్టీలను విధించడంలో సంయమనం పాటించడం, నియంత్రణల ప్రభావాలను మదింపు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడం, జైలు శిక్ష విధించే క్లాజులను క్రమబద్ధీకరించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఉద్దేశ్యపూర్వకమైన ఉల్లంఘనలకు (పన్నుల ఎగవేత, పర్యావరణ విధ్వంసం మొదలైనవి) జైలు శిక్ష నిబంధనను కొనసాగిస్తూనే.. ప్రక్రియపరమైన లోపాలు, ఉద్దేశ్యపూర్వకం కాని తప్పిదాలను క్రిమినల్ పరిధి నుంచి తప్పించవచ్చని నివేదిక సూచించింది. పౌరులు, రాజకీయవేత్తలు, అధికారులు కూడా ఈ సంస్కరణల విషయంలో తగు చొరవ చూపాలని పేర్కొంది. -
అలీబాబాకు మరో ఎదురుదెబ్బ
బీజింగ్ : ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికసాంకేతిక సంస్థ యాంట్ గ్రూప్, చైనాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని ఇంటర్నెట్ రంగంలో గుత్తాధిపత్య వ్యతిరేక పద్ధతులపై పెరిగిన పరిశీలనల మధ్య తన వ్యాపారాలను సరిదిద్దుకోవాలని, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని రెగ్యులేటరీ సంస్థలు ఆదేశించాయి. ఈ మేరకు విచారణకు ఆదేశించాయి.ఐపీఓ నిలిపివేత ద్వారా ఇబ్బందులు పడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త అలీబాబా, యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీని స్థాపించి, తగినంత మూలధనాన్ని కలిగి ఉండాలని రెగ్యులేటర్లు యాంట్ గ్రూప్‌ను ఆదేశించారు. కార్పొరేట్ పాలనను మెరుగుపరిచేటప్పుడు, దాని వ్యాపారాల నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ, యాంట్ గ్రూప్ దాని చెల్లింపుల మూలానికి తిరిగి రావాలని, లావాదేవీల చుట్టూ పారదర్శకతను పెంచుకోవాలని, అన్యాయమైన పోటీని నిషేధించాలని వారు చెప్పారు. రెగ్యులేటరీ అవసరాలకు అనుగుణంగా ఉంటామని, రిస్క్ మేనేజ్మెంట్, నియంత్రణను మెరుగుపరుస్తామని, అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తామని యాంట్ గ్రూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో (37 బిలియన్ డాలర్ల) ప్లాన్ చేసింది కంపెనీ. షాంఘైతో పాటు, హాంకాంగ్ స్టాక్‌మార్కెట్లలో డెబ్యూ లిస్టింగ్‌కు ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు దీన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి కోలుకోకముందే యాంట్ గ్రూపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో విచారణకు ఆదేశించారు. తాజా నిర్ణయంతో కంపెనీ షేరు 6శాతం పడిపోయింది. మార్కెట్ నిబంధనలకు విరుద్దంగా మోనోపలిగా కంపెనీ వ్యవహరిస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. పోటీతత్వం లేకుండా కస్టమర్లకు ఆప్షన్ లేకుండా చేస్తోందనేది ప్రధాన ఆరోపణ. దీనిపై చైనా ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు అలీబాబా మాతృ సంస్థ యాంట్ మనదేశంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టింది. బిగ్ బాస్కెట్, స్విగ్గీ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆఫ్‌లైన్ కస్టమర్లకూ పేటీఎం ఆఫర్లు
హైదరాబాద్/న్యూఢిల్లీ: భారతదేశపు ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం ఈ పండుగ సీజన్లో బంపర్ ఆఫర్లను ప్రకటించింది. తన ఆల్ ఇన్ వన్ పీఓఎస్ పరికరాల ద్వారా చిన్న దుకాణదారులకు ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈఫెస్టివ్ సీజన్లో వ్యాపారులు అమ్మకాలను పెంచడానికి, ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందుకోసం వివిధ బ్యాంకులు, వివిధ బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకుంది. ఈమేరకు పేటీఎం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా చిల్లర వ్యాపారులు నో కాస్ట్ ఆఫర్లు, అగ్ర బ్యాంకుల నుంచి వందకు పైగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నామని ఇందులకు,చిన్న వ్యాపారాలకు అధికారం ఇస్తున్నట్లు ప్రకటించింది. పీవోఎస్ పరికరాలతో 2 లక్షలకు పైగా ఆఫ్‌లైన్ వ్యాపారాలు ఇందులో పాల్గొంటాయని పేటీఎం ప్రకటించింది. తద్వారా ఇ-కామర్స్ సంస్థలు, పెద్ద రిటైలర్ల మాదిరిగానే ఆఫ్‌లైన్ వ్యాపారులు కూడా తమ కస్టమర్లకు కూడా నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం యాక్సిస్, సిటీబ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా టాప్ 15 బ్యాంకులతో కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది. అలాగే ఎల్జీ, ఒప్పో, వివో, రియల్‌మి, ఆసుస్, హైయర్,వోల్టాస్, వోల్టాస్ బెకో,డైకిన్,బాష్, సిమెన్స్ వంటి ప్రధాన బ్రాండ్లతోడీల్ కుదర్చుకుంది. నిబంధనల ప్రకారం వినియోగదారులకు రూ .20,000 వరకు తగ్గింపును అందించనున్నాయి. స్మార్ట్ పీఓఎస్ డివైస్ల ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డ్ స్వైపింగ్, క్యూఆర్ కోడ్ లాంటి అన్ని చెల్లింపులను అంగీకరించి, వారి కార్యకలాపాలను సమర్ధవంతంగా నడిపించి వారిని శక్తివంతం చేయనున్నాని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రేణు సత్తి వెల్లడించారు. ముఖ్యంగా టైర్ -2, టైర్ -3, మిగిలిన భారత నగరాలలో ఆఫ్‌లైన్ వ్యాపారులు, చిన్న దుకాణదారులతో విస్తృతంగా పనిచేస్తున్నట్లు పేటీఎం తెలిపింది. అలాగే మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.అలాగే డిజిటల్ ఇండియా మిషన్కి అవసరమైన డిజిటలైజేషన్ మద్దతును అందిస్తున్నామని ఆయన చెప్పారు. -
బ్రాండ్లూ–వ్యాపారాలూ
ఏ చిన్న అవకాశం వచ్చినా సంప్రదా యాల్ని అడ్డం పెట్టుకోవడం, నమ్మకంగా వ్యాపారం చేసుకోవడం మనకి అలవాటు. కరోనా తెరమీదకు వచ్చినపుడు భారతీ యత, వాడి వదిలేసిన దినుసులు మళ్లీ మొలకలెత్తాయి. ‘కోవిడ్ ఏమీ చెయ్య దండీ, ధనియాల చారు ఓ గుక్కెడు తాగండి. అడ్రస్ లేకుండా పోతుంది’ అంటూ హామీలు ఇచ్చినవాళ్లు ఎందరో?! ఇది చైనాలో పుట్టింది. వాళ్లే చెబుతున్నారు. చిటికెడు పసుపుపొడి వేసుకుని ముప్పూటా ఆవిరి పట్టండి. సమస్త మలినాలు వదిలిపోతాయ్ అంటూ ఎవరి పద్ధతిలో వాళ్లు దొరికిన చోటల్లా చెప్పుకుంటూ రాసుకుంటూ వెళ్లడం మొదలు పెట్టారు. ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్న జనం ఎవరేం చెబితే అది నెత్తిన పెట్టుకుని అమలు చేశారు. చేసిన వాళ్లంతా బావుందంటూ ప్రచారం చేశారు. పైగా దానికితోడు మన భారతీయత, దేశవాళీ దినుసులు చేరే సరికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఒకప్పుడు ఆవఠేవలు, ఇంగువ హింగులు మన రోజు వారీ వంటల్లో బొట్టూ కాటుకల్లా అలరించేవి. చూశారా, ఇప్పుడవే దిక్కు అయినాయి. మడి, ఆచారాల పేరు చెప్పి వ్యక్తిగత శుభ్రత, సమాజ శుభ్రత పాటిస్తే తప్పులు అంటగట్టారు. ఇప్పుడవన్నీ ఈ మహా జాఢ్యానికి మందుగా తయారయ్యాయి. సందట్లో సడే మియా అన్నట్టు పాత దినుసులన్నిటికీ గుణాలు అంటగట్టి ప్రచా రంలోకి తెచ్చారు. ‘ఉసిరి’ బంగారం అన్నారు. దాంట్లో ఉన్న రోగ నిరోధక లక్షణాలు అమృతంలో కూడా లేవన్నారు. ఉసిరిగింజ, ఉసిరి పప్పు అన్నీ సిరులేనని ప్రచారం సాగింది. ఇట్లా లాభం లేదని లాభసాటి పథకం తయారు చేశారు. సింగినాదానికి, జీల కర్రకి, పసుపుకి, ఇంగువకి బ్రాండ్ తగిలించి, దానికో పేరు చిరు నామా ఉన్న ముఖాన్ని అడ్డంపెట్టి అమ్మకాలు సాగించారు. అశ్వగంథ, కస్తూరి లాంటి అలనాటి దినుసులకి ఒక్కసారి లెక్కలు వచ్చాయి. ధనియాల నించే కొత్తిమీర మొలకెత్తుతుందని కొన్ని తరాలు కొత్తగా తెలుసుకున్నాయ్. ‘మన వేదాల్లో అన్నీ ఉన్నా యిష!’ అన్నారు పెద్దలు. ఏ మాత్రం విస్తుపోకుండా ‘సబ్బులు మీ చేతి కోమలత్వాన్ని పిండేస్తాయ్ జాగ్రత్త! అందుకని సంప్రదాయ మరియు ప్రకృతిసిద్ధమైన కుంకుడుకాయని మాత్రమే వాడండి’ అంటూ మూడంటే మూడు భద్రాచలం కుంకుళ్లని సాచెలో కొట్టి పడేసి, దానికి రాములవారి బ్రాండ్ వేసి, వెల రూపాయి పావలా, పన్నులు అదనం అంటూ అచ్చేసి అమ్ముతున్నారు. దాన్ని మిం చింది ‘సీకాయ్’ అంటూ పై సంగతులతో మరో బ్రాండు. ఇందులో ఉసిరి గుణాలున్నాయ్, ఇంగువ పలుకులున్నాయ్ అంటూ ట్యాగ్ లైన్లు తగిలించి మార్కెట్లోకి వదులుతున్నారు. మృత్యుభయం ఆవరించి ఉన్నవాళ్లు దేన్ని సేవించడానికైనా రెడీ అవుతున్నారు. దాదాపు ఏడాదిగా ఈ చిల్లర వ్యాపారాలు టోకున సాగుతున్నా, ఏ సాధికార సంస్థా వీటి గురించి మాట్లాడిన పాపాన పోలేదు. మన దేశంలో దేనికీ జవాబుదారీతనం లేదు. వ్యాపారంలో ఒకే ఒక్క ఐడియా కోట్లు కురిపిస్తుందని వాడుక. రకరకాల బ్రాండ్ పేర్లతో శొంఠి, అల్లం, లవంగాలు, వెల్లుల్లి లాంటి ఘాటు ఘాటు దినుసులు ఔషధ గుణాలు సంతరించుకుని ఇళ్లలోకి వస్తున్నాయ్. పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదని సామెత. ఇప్పుడు అన్ని రకాల తులసీదళాలు గొంతుకి మేలు చేస్తాయని నమ్ముతున్నారు. ఆ తులసి ఫలానా నేలలో పుట్టి పెరిగితే, అది మరింత సర్వ లక్షణ సంపన్నగా బ్రాండ్ వేస్తే– ఇక దాని గిరాకీ చెప్పనే వద్దు. ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు’. ఔను, మర్చేపోయాం గురూ అంటూ అంతా నాలికలు కరుచుకున్నారు. అయితే ఓ చిన్న మెలిక ఉంది. ఆ ఉల్లి ఫలానా గుట్టమీద పండాలి. అప్పుడే దానికి గుణం అని షరతు విధించారు. ఇహ ఆ ఉల్లిని బంగారంలో సరితూచాల్సిందే! పొద్దున్నే పేపర్ తిరగేస్తే, టీవీ ఆన్ చేస్తే రకరకాల వ్యాపార ప్రకటనలు. అన్నీ పోపులపెట్టె సరంజామాలోంచే. మన అమ్మలు, అమ్మమ్మలు చిన్నప్పుడు పోసినవే. ఎవరికీ లేని వైద్య వేదం ఆయు ర్వేదం మనకుంది. అది వ్యాధిని రూట్స్ నించి తవ్వి అవతల పారేస్తుందంటారు. ప్రస్తుతం కూరలు, పళ్లు వాటి ప్రత్యేక ఔషధ గుణాల పేర్లు చెప్పి అమ్ముతున్నారు. పైగా, వాటి శుభ్రత దానికి బ్రాండ్ యంత్రాలు మార్కెట్లోకి వచ్చాయి. కొనగలిగినవాళ్లు ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. ఉన్నట్టుండి ఒకరోజు ఒంటెపాల ప్రకటన వచ్చింది. అన్నీ ఇమ్యూన్ శక్తి పెంచేవే. చిన్నప్పుడు చందమామ కథలో రాజుగారి వైద్యానికి పులిపాలు అవసరపడటం దాన్ని ఓ సాహసి సాధించడం గుర్తుకొచ్చాయి. చివరకు ఆ సాహసికి అర్ధ రాజ్యం కూడా దక్కుతుంది. స్వచ్ఛభారత్‌ని దేశం మీదకు తెచ్చినపుడు గాంధీగారి ఫేమస్ కళ్లజోడుని సింబల్‌గా వాడుకున్నారు. కరెన్సీ మీద కూడా ఆ కళ్లజోడే! ఎవరో అన్నారు గాంధీజీ వేరుశనగ పప్పులు, మేకపాలు సేవించేవారని చెప్పుకుంటారు. ఈ విపత్కర పరిస్థితిలో మేక పాలను మార్కెట్లోకి తెచ్చి మహాత్ముణ్ణి బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుకుంటే.. పరమాద్భుతంగా ఉంటుంది అనే ఆలోచన ఓ కార్పొ రేట్ కంపెనీకి వచ్చింది. మరిహనేం అయితే.. మేకపాలతో పాటు, మేక నెయ్యి కూడా వదుల్దాం, అన్నీ కలిపి ఓ యాడ్‌తో సరి పోతుంది. అనుకున్నారు. పనిలోపనిగా మేక మాంసం కూడా కలి పారు! సేమ్ బ్రాండ్! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ప్రత్యక్ష తనిఖీ తర్వాతే జీఎస్టీ రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నమోదు చేసుకునే వ్యాపార సంస్థలు ఆధార్ గుర్తింపు ధ్రువీకరణను ఇవ్వలేకపోతే.. ఆయా సంస్థల వ్యాపార స్థలాలను పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ మంజూరు అవుతుందని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర మండలి(సీబీఐసీ) స్పష్టం చేసింది. ఈ నెల 21 నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుదారులు ఆధార్ ఆథెంటికేషన్‌ను ఎంచుకోవచ్చని సీబీఐసీ తన నోటిఫికేషన్లో తెలిపింది. ఆథార్ గుర్తింపు ధ్రువీకరణలో విఫలమైనా లేక ఆధార్ అథెంటికేషన్‌ను ఎంచుకోకపోయినా.. అటువంటి దరఖాస్తులకు సంబంధించి వ్యాపార కేంద్రాలను పరిశీలించిన తర్వాతే జీఎస్టీ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని పేర్కొంది. దీనిపై పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ నేషనల్ లీడర్ ప్రతీక్ జైన్ స్పందిస్తూ.. ‘పన్ను చెల్లింపుదారు జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోరుకుంటే ఆధార్ అథెంటికేషన్‌ను ఎంచుకోవచ్చు. దీనికి ప్రత్యక్ష పరిశీలన అవసరం లేకుండా 3 రోజుల్లో రిజిస్ట్రేషన్ మంజూరు అవుతుంది. లేదంటే 21 రోజులు పడుతుంది. అధికారులు ప్రత్యక్షంగా ఆయా వ్యాపార కేంద్రాలను తనిఖీ చేసి, పత్రాల పరిశీలన తర్వాతే రిజిస్ట్రేషన్ మంజూరు చేస్తారు’’ అని వివరించారు. -
స్టాక్స్ వ్యూ
ప్రస్తుత ధర: రూ.756 టార్గెట్ ధర: రూ.1,057 ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం నాలుగు విభాగాల్లో–వీఎస్ఎఫ్, సిమెంట్, రసాయనాలు, టెక్స్‌టైల్స్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటిల్లో వీఎస్ఎఫ్, సిమెంట్ కీలక విభాగాలు. ఈ కంపెనీ మొత్తం ఆదాయం, నిర్వహణ లాభాల్లో ఈ రెండు విభాగాల వాటా దాదాపు 90 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వీఎస్ఎఫ్, కాస్టిక్ సోడా ధరలు అంతర్జాతీయంగా బలహీనంగా ఉండటంతో నిర్వహణ లాభం(స్టాండ్అలోన్) అంచనాల మేరకు పెరగలేదు. వీఎస్ఎఫ్(విస్కోస్ స్టేపుల్ ఫైబర్–నూలు లాగానే ఉండే బయోడిగ్రేడబుల్ ఫైబర్. దుస్తులు, హోమ్ టెక్స్టైల్స్, డ్రెస్ మెటీరియల్, లో దుస్తుల తయారీలో దీనిని వినియోగిస్తారు) కు సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం వంద శాతాన్ని వినియోగించుకున్నా, అమ్మకాలు 3 శాతమే పెరిగాయి. డిమాండ్ బలహీనంగా ఉండటం, దిగుమతులు పెరగడంతో కెమికల్స్ విభాగం పనితీరు అంచనాలను అందుకోలేకపోయింది. అమ్మకాలు 7 శాతం తగ్గగా, మార్జిన్లు 8 శాతం తగ్గి 20 శాతానికే పరిమితమైంది. దేశంలోనే అతి పెద్ద సిమెంట్ కంపెనీ అయిన అ్రల్టాటెక్ సిమెంట్‌లో 57.3 శాతం వాటా ఉండటం, స్టాండ్అలోన్ వ్యాపారాలు నిలకడైన వృద్ధిని సాధిస్తుండటం, వీఎస్ఎఫ్ వ్యాపారంలో దాదాపు గుత్తాధిపత్యం ఉండటం, వీఎస్ఎఫ్, రసాయనాల విభాగాల ఉత్పత్తి సామర్థ్యాలు పెరుగుతుండటం, ఏబీ క్యాపిటల్, ఇతర కంపెనీల్లో వాటాలుండటం... సానుకూలాంశాలు. మరో గ్రూప్ కంపెనీ వొడాఫోన్ ఐడియా రుణ భారం భారీగా ఉండటం, (ఈ రుణానికి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఎలాంటి కార్పొరేట్ గ్యారంటీని ఇవ్వకపోవడంతో ఇది పెద్ద ప్రతికూలాంశం కాబోదు), సిమెంట్, వీఎస్ఎఫ్ ధరలు తగ్గే అవకాశాలు, వీఎస్‌ఎఫ్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు పెరిగే అవకాశాలు.... ప్రతికూలాంశాలు. బాటా ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,736 టార్గెట్ ధర: రూ.1,955 ఎందుకంటే: బాటా ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థికఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. మందగమన నేపథ్యంలో కూడా ఈ కంపెనీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.722 కోట్లకు పెరిగింది. ప్రీమియమ్(ఖరీదైన) ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా స్థూల మార్జిన్లు 60 బేసిస్ పాయింట్లు పెరిగి 54.4 శాతానికి, నిర్వహణ లాభ మార్జిన్ అర శాతం పెరిగి 13.5 శాతానికి పెరిగాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా నికర లాభం 27 శాతం ఎగసి రూ.71 కోట్లకు పెరిగింది. కొత్త ట్రెండీ కలెక్షన్లను అందుబాటులోకి తెస్తుండటం, మార్కెటింగ్ వ్యయాలు పెంచుతుండటం, ప్రస్తుత స్టోర్ మోడళ్లను రీ డిజైనింగ్ చేయడం తదితర చర్యల కారణంగా ఈ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ‘మాస్’ నుంచి ‘ప్రీమియమ్’కు మారుతోంది. ఫ్రాంచైజీ స్టోర్స్‌తో కలుపుకొని దేశవ్యాప్తంగా 1,420 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. ఐదేళ్లలో 500 ఫ్రాంచైజీ స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు, యువత కేటగిరీలో కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుండటం, ప్రీమియమ్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరిస్తుండటం, ప్రకటనల కోసం అధికంగానే ఖర్చు చేస్తుండటం, స్థూల లాభం మెరుగుపడే అవకాశాలుండటం, ఎలాంటి రుణ భారం లేకపోవడం, రూ.800 కోట్ల మేర నగదు నిల్వలు ఉండటం....సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 11 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. -
బ్లాక్ మనీ
తమ మేడ టెర్రస్ పైనుంచి బైనాక్యులర్స్‌తో చుట్టుపక్కల దృశ్యాలు చూస్తున్నాడు కిరణ్. ఇంటర్ చదువుతున్న వాడికి దుబాయ్ నుంచి మేనమామ గిఫ్ట్‌గా తెచ్చిచ్చాడు. ఈసారి హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు వెళ్లి బైనాక్యులర్స్‌లో నుంచి గేమ్ చూడాలని వాడి కోరిక. అందుకే రోజూ పేపరు చూస్తున్నాడు క్రికెట్ మ్యాచ్ ఎప్పుడా అని. ఆ రోజు సాయంకాలం చీకటి పడుతూ ఉండగా కనిపించిన దృశ్యం ఆసక్తిగా గమనించాడు. రత్నయ్య రైస్ మిల్లు వెనుకభాగంలో దాదాపు ఎకరం స్థలం ఖాళీగా ఉంది. అదంతా పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా ఉంటుంది. రత్నయ్య, అతని కొడుకు వెంకట్ పలుగు పారలు తీసుకుని గొయ్యి తవ్వుతున్నారు. అక్కడొక చెక్కపెట్టె ఉంది. గొయ్యి తీసిన తర్వాత చెక్కెపెట్టెను అందులో పెట్టి పూడ్చారు. రోజూ న్యూస్‌పేపర్ చదువుతున్న కిరణ్‌కి ఏదో అర్థమైంది. వాళ్లుంటున్న హిందూపురంలో రత్నయ్య పెద్ద షావుకారు. రైసు మిల్లు, సినిమా హాలు, మెయిన్ రోడ్డులో హోటల్, గ్యాస్ ఏజెన్సీ వగైరా వ్యాపారాలు ఉన్నాయి. ఈసారి ఎలక్షన్స్‌లో ఎమ్మెల్యేగా నిలబడతాడని చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి చాలా డబ్బు కావాలి. అయితే, ఎలక్షన్లప్పుడు ఐటీ వాళ్లు, ఈడీ వాళ్లు రైడింగులు చేసి, లెక్కలు చూపని డబ్బును సీజ్ చేస్తున్నారు. కాబట్టి రత్నయ్య బ్లాక్ మనీ పెట్టెలో పెట్టి పాతిపెట్టాడన్నమాట. కిరణ్‌కి గొప్ప రహస్యం కనిపెట్టానన్న ఉత్సాహంతో ఛాతీ ఉబ్బింది. ఈ సంగతి ఎవరికైనా చెబితే గాని మనశ్శాంతి కలగదు. అందుకని వాడి క్లోజ్ ఫ్రెండ్ బ్రహ్మానందం దగ్గరకు పరుగెత్తాడు. ‘‘ఒరేయ్ బ్రహ్మం! నేనొక సీక్రెట్ కనిపెట్టాను.’’ ఎగై్జట్ అవుతూ చెప్పాడు. ‘‘సీక్రెటా? ఎవరిది?’’ ‘‘రత్నయ్యది..’’ అని తను బైనాక్యులర్స్‌తో చూసిన దృశ్యం గురించి చెప్పాడు. ‘‘ఔన్రోయ్! నువ్వు చెప్పింది నిజమే. ఈసారి రత్నయ్య నిలబడతాడనీ, ఎన్ని కోట్లయినా ఖర్చు పెడతాడనీ మా నాన్న చెబుతుంటే విన్నాను’’ అన్నాడు బ్రహ్మం. ‘‘ఈ సంగతి పోలీసులకి ఫోన్ చేసి చెప్తే సరి. రత్నయ్య తిక్క కుదురుతుంది. గోతిలో దాచిన డబ్బంతా పోలీసులు పట్టుకుపోతారు’’ అన్నాడు కిరణ్. ‘‘ఆ పని చేద్దాం. ఇంట్లో మీ అమ్మ దగ్గరున్న సెల్‌ఫోన్ పట్టుకురా. పోలీసులకు ఫోన్ చేద్దాం..’’ అన్నాడు బ్రహ్మం. ‘‘అమ్మో! వద్దురా.. ఆ నంబర్ పోలీసులకు తెలిసిపోతుంది. ఇంటికి వచ్చి ఏమైనా అడుగుతారేమో! అమ్మ గొడవ పెడుతుంది. లేనిపోని గొడవ ఎందుకు?’’ ‘‘సరే! పోలీసులకు ఎలా తెలియజేద్దాం?’’ ‘‘ఐడియా’’ ‘‘ఏంట్రా?’’ ‘‘యాదగిరి బడ్డీ కొట్టు దగ్గర కాయిన్ బాక్స్ ఉంటుంది. అందులోంచి చేద్దాం. ఏ గొడవా ఉండదు.’’ కిరణ్ ఐడియా బ్రహ్మానికి నచ్చింది. యాదగిరి బడ్డీకొట్టు దగ్గరకు వెళ్లారు. యాదగిరి వచ్చిన వాళ్లకు సిగరెట్లు, చాక్లెట్లు వగైరా అమ్ముతూ బిజీగా ఉన్నాడు. బ్రహ్మం ఒక పక్కగా ఉన్న కాయిన్ బాక్సు నుంచి పోలీస్ స్టేషన్ నంంబర్కి రింగ్ ఇచ్చి, రూపాయి కాయిన్ వేశాడు. రింగైన కాసేపటికి పోలీస్ స్టేషన్లో ఫోన్ ఎత్తారు. ‘‘హిందూపురం టౌన్ పోలీస్ స్టేషన్..’’ ‘‘రత్నయ్య మిల్లు వెనుక బ్లాక్ మనీ పూడ్చి పెట్టాడు’’ వణుకుతున్న గొంతుతో చెప్పాడు బ్రహ్మం. బ్రహ్మానికి ఎందుకో ఆ సమయంలో భయం కలిగింది. తను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వింటారేమో అని వణుకు వచ్చింది. తనే పోలీసులకు బ్లాక్ మనీ సంగతి చేరవేసినట్లు తెలిస్తే రత్నయ్య తనని పట్టుకుని చంపుతాడు. అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తూ గొంతు తగ్గించి నెమ్మదిగా చెప్పాడు. ‘‘రత్నయ్యా! ఏ రత్నయ్య?’’‘‘రైసు మిల్లు ఓనర్ రత్నయ్య బ్లాక్ మనీ ఏంది?’‘‘ఔను. చెక్కపెట్టెలో బ్లాక్ మనీ పెట్టి, రైసు మిల్లు వెనుక ఖాళీ స్థలంలో గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. నేను చూశాను.’’‘‘నువ్వు చూశావా? ఎవరు నువ్వు?’’బ్రహ్మం రిసీవర్ ఠక్కున పెట్టేశాడు. కిరణ్ చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కెళ్లాడు. ‘‘నువ్వెవరు? అని పోలీసులు అడుగుతున్నర్రా. నేను మాట్లాడకుండా పెట్టేశాను.’’ అన్నాడు ‘‘మంచి పని చేశావు. మన పేరు ఎలా చెప్తాం. మనల్ని పట్టుకుంటారు.’’ అన్నాడు కిరణ్.ఇప్పుడు కిరణ్‌కి సంతృప్తి కలిగింది. ఏదో ఘనకార్యం సాధించినంత ఆనందంగా ఉంది. రేపు పోలీసులు గొయ్యి తవ్వి బ్లాక్ మనీ అంతా పట్టుకుపోతారు. రత్నయ్య లబోదిబోమని మొత్తుకుంటాడు. అదంతా టీవీల్లో చూపిస్తారు. భలే..! పోలీస్ స్టేషన్లో కిరణ్, బ్రహ్మంల కాల్ రిసీవ్ చేసుకున్నది హెడ్ కానిస్టేబుల్ గోపీకృష్ణ. ఎస్సై రహీం దగ్గరకు వెళ్లి చెప్పాడు. ‘‘సార్! రత్నయ్య తన మిల్లు వెనుక ఖాళీ స్థలంలో బ్లాక్ మనీ చెక్కెపెట్టెలో పెట్టి, గొయ్యి తీసి పూడ్చిపెట్టాడట. ఎవడో కాల్ చేశాడు.’’‘‘వాట్! ఏ రత్నయ్య?’’‘‘హిందూపురంలో రత్నయ్య తెలియని వాళ్లెవరు సార్? సౌండ్ పార్టీ. రైసు మిల్లు, హోటల్స్, గ్యాస్ ఏజెన్సీలు.. చాలా బిజినెస్‌లు ఉన్నాయి.’’‘‘ఓ.. ఆ రత్నయ్యా!’’‘‘ఔను సార్!’’‘‘సరే! బ్లాక్ మనీ గొడవేంటి? రత్నయ్య గొయ్యి తీసి పాతిపెట్టడం ఏంటి? అదంతా ఎవడో కాల్ చేసి చెప్పడం ఏంటి? నాన్సెన్స్. మనకేం సంబంధం?’’‘‘ఔను సార్! అదంతా ఇన్కమ్ టాక్స్ వాళ్లు చూసుకుంటారు. వీడెవడో మూర్ఖుడిలా ఉన్నాడు. మనకు కాల్ చేశాడు.. ఎందుకైనా మంచిది సీఐగారికి చెప్పండి.’’ అన్నాడు హెడ్.‘‘అదే మంచిది’’ అని ఎస్సై రహీం ఇన్స్పెక్టర్ రూమ్‌కి వెళ్లి చెప్పాడు.‘‘పెద్దవాళ్లతో గొడవ. డీఎస్పీ సాబ్తో చెబుదాం. ఐటీ వాళ్లతో చెప్పాలనుకుంటే ఆయనే చెప్తాడు’’ అన్నాడు ఇన్స్పెక్టర్.డీఎస్పీ విని ‘‘ఇదేదో ఆకతాయి చేసిన కాల్. రత్నయ్య పెద్దమనిషి. గొయ్యితీసి బ్లాక్‌మనీ పాతిపెట్టడం ఏంటి? సిల్లీగా లేదూ! ఆ కాల్ చేసిన వాడు తవ్వి తీసుకోవచ్చుగా? మనకెందుకు చెప్పడం?’’ అన్నాడు.‘‘ఎందుకైనా మంచిది. నేను ఐటీ జాయింట్ కమిషనర్‌తో మాట్లాడతాను. రత్నయ్య ఐటీ గొడవలు ఏవైనా ఉంటే వాళ్లు చూసుకుంటారు’’ అన్నాడు డీఎస్పీ.‘‘సార్! నిప్పులేనిదే పొగ రాదు. ఇందులో ఏదో ఉంది. రత్నయ్య అంతటి పెద్దమనిషి స్వయంగా గొయ్యి తీసి పాతిపెట్టాడంటే బ్లాక్మనీనే సార్’’ అన్నాడు ఇన్స్పెక్టర్ కాన్ఫిడెంట్‌గా. ఆ రోజు ఉదయం పోలీసులు రత్నయ్య మిల్లులోకి వచ్చారు. పోలీసు కుక్క మిల్లు వెనుకభాగంలోని గొయ్యి దగ్గర ఆగింది. కాలితో మట్టిని పెళ్లగించసాగింది.ఇన్స్పెక్టర్ సైగ చేయడంతో పనివాళ్లు పారలతో గొయ్యి తవ్వారు. చెక్కపెట్టె బయట పడింది. ఒక్కసారిగా దుర్వాసన ఎగజిమ్మింది. అంతా కర్చీఫ్లతో ముక్కులు మూసుకున్నారు.చెక్కపెట్టె బద్దలు కొట్టారు. చంద్రమోహన్ శవం బయటపడింది. రెండు రోజుల కిందట చంద్రమోహన్ కనిపించడం లేదని అతని తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. చంద్రమోహన్, రాజకుమారి ప్రేమించుకున్నారు. చంద్రమోహన్ ఒక డ్రైవర్ కొడుకు. రాజకుమారి కోటీశ్వరుడైన రత్నయ్య ఏకైక కుమార్తె. కూతురు తమ కులం కాని ఒక అనామకుడిని ప్రేమించడం జీర్ణించుకోలేకపోయాడు రత్నయ్య. అతన్ని మాట్లాడదామని రైసుమిల్లుకి పిలిపించాడు. కొడుకు, తను కలిసి చంద్రమోహన్‌ని హత్య చేశారు. ఎవరికీ తెలియదులే అనుకుని మిల్లు వెనుక ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టారు.కాని రత్నయ్యకు తెలియదు నేరం దాగదని. ఎవరూ చూడటం లేదని అనుకోవడం అజ్ఞానం. పైన ఎవరో ఒకరు చూస్తుంటారు. నేరం బయట పడుతుంది.కోటీశ్వరుడు రత్నయ్య తన కూతురిని ప్రేమించిన చంద్రమోహన్‌ని హత్య చేసి, తన మిల్లు ఆవరణలోనే పాతి పెట్టాడనే వార్త హిందూపురం అంతటా శరవేగంగా వ్యాపించింది. తర్వాత టీవీ చానల్స్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. రత్నయ్య, అతని కొడుకు హత్యా నేరంపై జైలుకెళ్లారు. -వాణిశ్రీ -
బిట్‌కాయిన్స్ : గుట్టు రట్టు చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి వ్యాపారాల పేరిట ప్రజల్ని నిలువునా దోచుకుని ఆపై వారికి టోపీ పేట్టేయడం ఆ ఘరానా కేటుగాడి నైజం. నాడు గ్లోబల్ ఆగ్రోఫామ్స్ పేరుతో టేకు చెట్ల ప్లాంటేషన్, గోల్డెన్ ఫారెస్ట్ కంపెనీ పేరుతో పెట్టుబడికి రెట్టింపు నగదు, నేడు బిట్‌కాయిన్స్..ఇలా పేర్లు ఏవైనా పథకం మాత్రం మోసగించడమే. వంచననే వృత్తి, ప్రవృత్తిగా మార్చుకుని అమాయకుల్ని తన బుట్టలో వేసుకుంటున్న ఈ మాయగాడి ఆటల్ని నగర టాస్క్‌ఫోర్స్ కట్టిపెట్టింది. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పూర్తి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా దొనకొండకు చెందిన జి.రమేశ్ 25 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. అప్పట్నుంచీ పలు మోసాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాజాగా ‘బిట్ కాయిన్’ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు (ఎంఎల్ఎం) ప్రజల్ని మోసగించేందుకు పథకం వేశాడు. ఇందుకోసం ముంబైకి చెందిన సీబీ ఆన్లైన్ సంస్థ నిర్వాహకులు మోహన్, సునీల్ చౌహాన్‌కు తన పథకం వివరించి రూ.లక్ష చెల్లించాడు. వీరు కాయినెక్స్‌ట్రేడింగ్.కామ్ పేరుతో ఓ వెబ్సైట్ సృష్టించి ఇచ్చారు. దేశంలో ఎంఎల్ఎం నిర్వహణపై నిషేధం ఉన్నందున అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కేంద్రంగా, అమెరికన్ల నేతృత్వంలో ఈ సంస్థ వ్యాపారం సాగిస్తున్నట్లు చూపించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎస్.సత్తయ్య, ఎన్.వెంకటేష్, కె.హరిగోపాల్, సి.శ్రీనివాస్‌లను దళారులుగా పెట్టుకున్నాడు. నమ్మకం కలిగించేందుకు బోయిన్‌పల్లిలో జీఆర్ఎం ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయం తెరిచాడు. వీరితో తమ స్కీముల్లో పెట్టుబడి పెడితే కనిష్టంగా 134 రోజుల నుంచి 500 రోజుల్లో ఆ మొత్తం రెట్టింపు అవుతుందని ప్రచారం చేయించాడు. తమ ద్వారా బిట్‌కాయిన్స్‌లో 100 అమెరికన్ డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చని, 4 నుంచి 10 శాతం వరకు బోనస్ కూడా వస్తుందని ఆశ చూపాడు. అలాగే ఓ వ్యక్తి మరికొందరిని చేరిస్తే 60% వరకు కమీషన్‌గా ఇస్తానంటూ ఎంఎల్ఎం దందాకు తెరలేపాడు. రూ.10 కోట్లకుపైగా పెట్టుబడులు రమేశ్ మాయమాటలను నమ్మి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు కరీంనగర్, రామగుండం, సిద్దిపేట, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన 1200 మంది నుంచి రూ.10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గడువు తీరినా తమ నగదు ఊసెత్తక పోవటంతో అనుమానమొచ్చిన బాధితులు ఇతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇతడి తాజా దందా బయటకొచ్చింది. ఈ ముఠా కార్యకలాపాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి రూ.1.8 కోట్ల విలువైన నగదు, స్థలాల పత్రాలు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వారు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులను సంప్రదించాలని కమిషనర్ అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధాన సూత్రధారి రమేశ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించాలని పోలీసులు నిర్ణయించారు. సీబీ ఆన్లైన్ సంస్థకు చెందిన సునీల్ చౌహాన్, మోహన్‌ను సైతం పోలీసులు నిందితులుగా చేర్చారు. రూ. 100 కోట్లకు చేరే అవకాశం! ఇప్పటి వరకు నమోదైన 10 కేసుల్లోనే బాధితులు నష్టపోయింది రూ. కోట్లలో ఉంది. దీంతో రమేశ్ చేతిలో మోసపోయిన వారంతా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే మొత్తం రూ. 100 కోట్లకు చేరే అవకాశమున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదీ రమేశ్ నేరాల చిట్టా 1999లో గ్లోబల్ ఆగ్రో ఫామ్స్ ముసుగులో టేకుచెట్ల ప్లాంటేషన్ పేరుతో రూ.5 కోట్లను ప్రజలనుంచి రమేశ్ వసూలు చేసి మోసగించాడు. 2013లో గోల్డెన్ ఫారెస్ట్ కంపెనీ పేరుతో తన వద్ద రూ.5 వేలు పెట్టుబడి పెడితే ఎనిమిదేళ్ల తర్వాత రూ.50 వేలు ఇస్తానంటూ వసూలు చేసి మోసం చేశాడు. అదే ఏడాదిలో కొందరితో దురుసుగా ప్రవర్తించి పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మూడు కేసుల్లోనూ రమేశ్ అరెస్టయినా, ఇతగాడి బుద్ధి మాత్రం మారలేదు. -
వాట్సాప్‌లో భారీగా ఛార్జీల బాదుడు
న్యూఢిల్లీ : ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్.. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జ్‌లు వసూలు చేయకుండా ఉచితంగా తన సర్వీసులను అందిస్తోంది. మొబైల్ ఫోన్లో నెట్ ఉంటే చాలు. వాట్సాప్ ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. దీని కోసం ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించనవసరం లేదు. అయితే తాజాగా వాట్సాప్ కూడా ఛార్జీల బాదుడు షురూ చేయాలని నిర్ణయించింది. అయితే అది యూజర్లందరకూ కాదట. కేవలం బిజినెస్ యూజర్లకు మాత్రమే. మార్కెటింగ్, కస్టమర్ సర్వీసు మెసేజ్‌లు పంపే వారి నుంచి ఇక ఛార్జీలు వసూలు చేయాలని ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ నిర్ణయించిందని తెలిసింది. యూసేజ్ తగ్గిపోవడం, రెవెన్యూ వృద్ధి లేకపోవడంతో, ఈ ఛార్జీలను విధిస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. పంపించిన మెసేజ్ డెలివరీ అయినట్టు తెలిసిన తర్వాత వెంటనే ఒక్కో మెసేజ్‌కు 0.5 సెంట్ల నుంచి 9 సెంట్ల వరకు ఛార్జీలు వసూలు చేస్తామని వాట్సాప్ తెలిపింది. అంటే మన దేశంలో ఈ ఛార్జీలు 34.16 పైసల నుంచి రూ.6.15 వరకు ఉంటాయి. అయితే వాట్సాప్ ప్రస్తుతం విధించబోతున్న ఈ ఛార్జీలు ఎస్ఎంఎస్ రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాట్సాప్ బిజినెస్ యూజర్లలో ఆందోళన నెలకొంది. వాట్సాప్‌కు మొత్తం 1 .5 బిలియన్ యూజర్లున్నారు. బిజినెస్‌లు చేసే వారు నోటిఫికేషన్లను పంపడానికి వాట్సాప్ బిజినెస్ ఏపీఐను వాడుతున్నారు. వాట్సాప్ ఈ జనవరిలోనే చిన్న వ్యాపార అకౌంట్ల కోసం ఈ వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్‌ను తీసుకొచ్చింది. దీనిలో 30 లక్షల మందికి పైగా యాక్టివ్ యూజర్లున్నారు. ఆ సమయంలోనే వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ నుంచి ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశ్యం ఉందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మ్యాట్ ఐడెమా తెలిపారు. -
ఫుట్‌పాత్ ఆక్రమణల గుర్తింపునకు అధికారి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మహబూబ్‌గంజ్, సిద్ధిఅంబర్ బజార్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేయడంపై వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఒక అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఆ అధికారి నెలపాటు ప్రతిరోజూ ఫుట్‌పాత్ ఆక్రమణ ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన అనంతరం తమకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. సదరు అధికారిని నియమించాలని హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. విచారణ ఆగస్టు 14కి వాయిదా వేసింది. సిద్ధిఅంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించాలని కోరుతూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి ‘పిల్’ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఫుట్‌పాత్ ఆక్రమణలకు గురికావడానికి వీల్లేదని, ఇలాంటి చర్యల్ని సహించేది లేదని తేల్చి చెప్పింది. కాలి నడకన వెళ్లే వారి కోసం ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే వారు ఎక్కడ నడవాలని ప్రశ్నించింది. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకోవడం వల్ల బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ముంచుకొస్తోంది.. ముహూర్తాల వేళ..
వీరఘట్టం: శుభముహూర్తాల సందడి ప్రారంభానికి వేళైంది. ఈ నెల 15తో అధిక జ్యేష్ఠమాసం ముగియడంతో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మరో 20 రోజుల పాటు భాజా భజంత్రీలు మారుమోగనున్నాయి. ఈ నెల 18తో పాటు 22, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో దివ్యమైన శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. అలాగే జూలై 1, 2, 3, 5, 6,7 తేదీల్లో కూడా ముహూర్తాలు ఉండడంతో ఆయా రోజుల్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు, గృహ æప్రవేశాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించేందుకు చాలామంది సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 18 నుంచి జూలై ఏడో తేదీ వరకు అన్నీ మంచి రోజులేనని వేద పండితులంటున్నారు. జూలై 15 నుంచి నెల రోజుల పాటు ఆషాఢం రానుండడంతో ఆగస్టు 15వ తేదీ వరకు ముహూర్తాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. పురోహితులకు డిమాండ్ ఈ నెల 18వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో పురోహితులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా రెండు వేల వరకూ వివాహాలకు ముహూర్తాలు ఖరారైనట్టు పురోహితులు చెబుతున్నారు. అలాగే కొద్దిరోజులుగా ఖాళీగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు, పురోహితులకు డిమాండ్ పెరిగింది. ముందుగానే తేదీలను ఖరారు చేసుకోవడంతో చాలామంది ప్రశాంతంగా ఉండగా... మరికొందరు కల్యాణ మండపాలు ఖాళీలేక, బ్యాండు పార్టీలు... పురోహితులు దొరక్క ఆందోళన చెందుతున్నారు. వివాహాలతోపాటు రానున్న 20 రోజుల్లో 14 ముహూర్తాలు ఉండడంతో గృహప్రవేశాలు, నూతన భవానల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసేందుకు సైతం చాలామంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జోరందుకున్న వ్యాపారాలు వివాహాలు, గృహప్రవేశాలు ముంచుకొస్తోంది.. ముహూర్తాల వేళ..చేయాలనుకునేవారు తమకు కావల్సిన సామగ్రి కొనుగోలులో బిజీగా ఉన్నారు. వస్త్రాలు, బంగారు అభరణాలు, డెకరేషన్ ఇతర సామగ్రి కొనుగోలుకు జిల్లా కేంద్రానికి ప్రజలు పోటెత్తుతుడడంతో దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి. కల్యాణ మండపం అద్దె ధరలు పైపైకి... ప్రస్తుత రోజుల్లో చాలా మంది వివాహాల కోసం కల్యాణ మండపాలను ఆశ్రయిస్తున్నారు. అన్ని సౌకర్యాలు అక్కడే లభిస్తుండడంతో ఎక్కువ మంది అటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఎవరి ఆర్థిక స్థితిగతులను బట్టి ఆయా వేదికలను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో కనీస సౌకర్యాలతో ఉన్న కల్యాణ మండపం అద్దె రూ.5 వేలు నుంచి రూ.10 వేల మధ్య ఉంటే ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోంది. ఏసీ సౌకర్యం ఉన్న కల్యాణ మండపాల ధరలైతే లక్షల రూపాయలకు పైనే పలుకుతున్నాయి. 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ ఈ నెల 18 నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు 20 రోజుల పాటు మంచి ముహూర్తాలున్నాయి. ఎక్కువగా ఈనెల 22, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో పెళ్లిళ్లు ఉన్నాయి. జూలై 15 నుంచి ఆషాఢం ప్రారంభం అవుతుంది. – ఎస్.వి.ఎల్.ఎన్.శర్మయాజీ, వేద పండితుడు, వీరఘట్టం -
ఆ కంపెనీలు జీఎస్టీ కట్టలేదు
సాక్షి, న్యూఢిల్లీ : చిన్న వ్యాపారాలపై భారీ మొత్తంలో పన్ను భారమున్నట్టు ఓ వైపు నుంచి వాదనలు వినిపిస్తుండగా.. మరోవైపు గణాంకాలు మాత్రం భిన్నంగా చూపిస్తున్నాయి. జూలైలో జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసిన 54 లక్షల వ్యాపారాల్లో 40 శాతానికి పైగా వ్యాపార కంపెనీలు ఎలాంటి పన్ను చెల్లించలేదని తెలిసింది. అంటే దాదాపు 22 లక్షల వ్యాపార కంపెనీలు ఒక్క రూపాయి జీఎస్టీ కూడా కట్టలేదని వెల్లడైంది. మిగతా 60 శాతం అంటే 32 లక్షల వ్యాపారాలు రూ.1 నుంచి రూ.33వేల మధ్యలో పన్నులు చెల్లించాయి. దీనికి భిన్నంగా కేవలం 0.3 శాతం అంటే 10వేలకు పైగా కంపెనీలు మాత్రమే జీఎస్టీలో రెండింట మూడువంతులు కలిగి ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం కోటి వ్యాపారాలు, సర్వీసు ప్రొవైడర్లు జీఎస్టీఎన్ నెట్‌వర్క్‌పై రిజిస్ట్రర్ అయ్యారు. వారిలో 72 లక్షల మంది ఎక్సైజ్, వ్యాట్, సర్వీసు ట్యాక్స్ నుంచి జీఎస్టీఎన్ నెట్‌వర్క్‌లోకి వచ్చారు. కొత్తగా 25 నుంచి 26 లక్షల పన్ను చెల్లింపుదారులు జీఎస్టీఎన్ నెట్‌వర్క్‌లోకి వచ్చారని శుక్రవారం అరుణ్‌జైట్లీ చెప్పారు. పెద్ద పన్ను చెల్లింపుదారుల నుంచి అంటే రూ.1.05 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వారి నుంచి సుమారు 94 నుంచి 95 శాతం పన్ను వసూలయ్యాయని తెలిపారు. -
ప్రధాని మోదీ ఎందుకు అలా చేశారు?
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా హెచ్-1బీ వీసాల కొత్త నిబంధనలపై శుభవార్త వస్తుందని ఐటీ కంపెనీలు, ఐటీ నిపుణులు ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. శ్వేతాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇద్దరూ తొలిసారి ముఖాముఖిగా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకుని సంయుక్త సమావేశం కూడా నిర్వహించారు. కానీ ఈ సమావేశం భారతీయ వ్యాపారస్తులను, కంపెనీలకు, హెచ్-1బీ యూజర్లకు మాత్రం పెద్దగా ఆకర్షణీయంగా అనిపించలేదు. ముఖ్యంగా ప్రధాని వ్యవహరించిన తీరు నిరాశ కూడా కలిగించిందని విశ్లేషకులంటున్నారు. అమెరికా కంపెనీలకు వాణిజ్యమైన ఆటంకాలు తొలగించాలంటూ ట్రంప్ డైరెక్ట్ గా వారి డిమాండ్లను ప్రస్తావించినప్పటికీ, మన ప్రధాని మాత్రం భారతీయ ఐటీ నిపుణులు, కంపెనీలు హెచ్-1బీ వీసాతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇసుమంతైనా ఎత్తలేదని చెప్పారు. అంతేకాక వారి నుంచి డైరెక్ట్ డిమాండ్ వచ్చినప్పుడు, మనవాళ్లు మాత్రం మన సమస్యలను ఎత్తకపోవడం గోల్డెన్ ఛాన్స్ మిస్సైనట్టేనని విశ్లేషకులు చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన వనరుగా ఉన్న ఐటీ రంగానికి ఇది బాధకరమేనని పేర్కొంటున్నారు.. మోదీ-ట్రంప్ భేటీలో హెచ్-1బీ వీసా విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశం లేదని, ఒకవేళ వచ్చినా తమ దగ్గర సరియైన సమాధానమున్నాయంటూ మోదీ పర్యటనకు వెళ్లకముందే వైట్ హౌజ్ ఓ ప్రకటన చేసింది. కానీ మోదీ కచ్చితంగా ఈ విషయంపై ప్రస్తావించి, ఐటీ కంపెనీలకు కాస్త ఊరట కలిగించే వార్తను తెస్తారని తెగ ఆశలు పెట్టుకున్నారు. ఈ భేటీలో హెచ్-1బీ వీసాల సమస్యపై ఓ క్లారిటీ రావచ్చని కూడా అంచనావేశారు. కానీ ఇప్పట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వర్క్ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తీసుకొస్తున్న ఆక్షలు ఎన్ఆర్ఐలకు కంటిమీదు కునుకు లేకుండా పోతుంది. విదేశీ వర్కర్లకు ట్రంప్ వ్యవహరించే విధానాలు కొత్తవేమీ కాదు. కానీ అత్యున్నత స్థాయి నేతల సమావేశంలో ఇలాంటి సమస్యను ప్రస్తావించడం వల్ల కాస్త ఊరట కలిగించే ప్రకటన వచ్చే అవకాశముంటుంది. కానీ ఇది మోదీ సరిగా సద్వినియోగం చేసుకోలేదని పలువురంటున్నారు. -
అవినీతి భారతం
-
కరెన్సీ కష్టాలు.. కంటిన్యూ!
ఇంకా తెరుచుకోని ఏటీఎంలు.. పనిచేస్తున్న వాటిలో పెద్ద నోట్లే.. చిల్లరతో చిరు వ్యాపారుల విలవిల నిజామాబాద్ : కరెన్సీ కష్టాలు కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు చేసి సుమారు రెండు నెలలు దగ్గర పడుతున్నప్పటికీ.. ప్రజలకు నోట్ల ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లా అవసరాల మేరకు రూ.500, రూ.100 నోట్లు అందుబాటులోకి రాలేదు. దీంతో జిల్లాలో చిల్లర సమస్య తీవ్రమైంది. ఇది చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రోజువారి వ్యాపారాలు సాగక, గిరాకీలు పడిపోవడంతో రెక్కాడితే గానీ డొక్కాడని చిరువ్యాపారులు విలవిలలాడుతున్నారు. తెరుచుకోని ఏటీఎంలు.. ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకులు కలిపి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 371 బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ బ్యాంకులకు సంబంధించి 345 ఏటీఎంలు ఉన్నాయి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏటీఎంలు తెరుచుకోలేదు. ఆయా బ్యాంకుల మెయిన్ బ్రాంచుల వద్ద ఉన్న కొన్ని ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని ఏటీఎంలు పనిచేయడం ప్రారంభించాయి. పనిచేస్తున్న ఈ ఏటీఎంలలో కూడా రూ.100 నోట్లు, రూ.500 నోట్లు వస్తున్న ఏటీఎంలు నామమాత్రమే. ఎక్కువ ఏటీఎంలలో రూ.2 వేల నోట్లే వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొనసాగుతున్న ఆంక్షలు.. బ్యాంకుల్లో నగదు విత్‌డ్రాకు ఆంక్షలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. వారానికి రూ.24 వేల పరిమితి ఇంకా ఎత్తివేయలేదు. రోజుకు ఇచ్చే రూ.4 వేల పరిమితిని కొంత సడలించారు. రూ.10 వేల వరకు ఇస్తున్నారు. దీంతో ఆయా బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా కోసం బారులు కొంత మేరకు తగ్గాయి. కానీ.. రద్దీ మాత్రం అలాగే కొనసాగుతోంది. సుమారు రూ.6 వేల కోట్ల డిపాజిట్లు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.6వేల కోట్ల నగదు డిపాజిట్ అయినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ఖాతాదారులు రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను తమ ఖాతాల్లో వేస్తున్నారు. అయితే డిపాజిట్ల మేరకు కొత్త కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. సుమారు రూ.6వేల కోట్లు డిపాజిట్లు అయితే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే జిల్లాకు కొత్త కరెన్సీ వచ్చినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల అంచనా. అంటే డిపాజిట్లు అయిన మొత్తంలో కనీసం 20 శాతం కూడా కొత్త నోట్లు జిల్లాకు రాలేదు. ఇలా జిల్లా అవసరాల మేరకు కరెన్సీ జిల్లాకు చేరకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం కరెన్సీ కోసం పలుమార్లు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. యథేచ్ఛగా అక్రమాలు.. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే నల్ల కుబేరులు తమ బ్లాక్ మనీని పెద్ద మొత్తంలో వైట్ మనీగా మార్చుకున్నారు. ఇందుకు కొన్ని బ్యాంకు అధికారులు, సిబ్బంది సహకారంతో భారీ మొత్తంలో నగదు అక్రమ మార్పిడి జరిగింది. ముఖ్యంగా బడా వ్యాపారులకు బ్యాంకు అధికారులు సహకరించారనేది బహిరంగ రహస్యంగా మారింది. నల్లదనం ఉన్న వారు తమ కరెన్సీని రూ.100 నోట్లుగా మార్చుకుని తమ వద్ద ఉంచుకోవడంతో కూడా చిల్లర సమస్యకు పరోక్ష కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సంత.. నోట్ల చింత
• దేవరకద్ర మార్కెట్లో తగ్గిన వ్యాపారాలు • చిల్లర ఉంటేనే సరుకులంటున్న వ్యాపారులు దేవరకద్ర : దేవరకద్రలో బుధవారం జరిగిన సంతలో నోట్ల చింతతో వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగారుు. వారాంతపు సంత కావడం వల్ల చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయలు వారానికి సరిపడా కొనుగోలు చేస్తుంటారు. అరుుతే రూ.వేరుు, రూ. 500 నోట్లు చెల్లవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పాత నోట్లను వ్యాపారుల తీసుకోక పోవడంతో ఇబ్బందుల పాలయ్యారు. బ్యాంకుల వద్ద గంటల తరబడి నిలబడి కొత్త నోట్లను తీసుకున్న ఫలితం లేకుండాపోరుుంది. ఎక్కడికి వెళ్లిన రూ. 2వేల నోటుకు చిల్లర లేదని చెప్పడంతో ఏమి కొనలేని పరిస్థితిని ప్రజలు ఎదుర్కొన్నారు. సగానికి తగ్గిన వ్యాపారాలు నిత్యావసర సరుకుల దుకాణాలలో సగానికి సగం వ్యాపారాలు తగ్గిపోయారుు. కూరగాయల వ్యాపారం మందకొడిగా సాగింది. గతంలో సంతరోజు ఒక్కో దుకాణం రూ.5వేల వ్యా పారం నడవగా.. ప్రస్తుతం రూ.2వేలకు కూడా మించడం లేదు. ఇక కిరాణా షాపుల్లో సరుకులు కొనే వారు తక్కువగా వచ్చారు. చాలామంది బ్యాంకుల వద్దనే పడిగాపులు పడడం వల్ల సంత అంతా ఖాళీగా కనిపిం చింది. ఎక్కడ చూసిన పాత నోట్లు చెల్లవని చెప్పడంతో డబ్బులు ఉన్నా ఏమి తినలేము, ఏమి కొనలేమని పలువురు నిరాశకు గురయ్యారు. చాలాచోట్ల ఏమైనా సరుకులు అడిగితే ముందుగా చిల్లర ఉందా అని అడుగుతున్నారు. లేదని వినియోగదారులు చెప్పడంతో సరుకులుకూడా లేవని చెబుతున్నారు. -
ఎనీటైం మూతే!
-
ఎనీటైం మూతే!
పని చేయని ఏటీఎంలు.. బ్యాంకుల వద్ద భారీ క్యూలు కొనసాగిన కరెన్సీ కష్టాలు ఎక్కడ చూసినా చిల్లర సమస్యలు భారీగా పడిపోరుున వ్యాపారాలు సిటీబ్యూరో: కరెన్సీ రద్దు/మార్పిడి అమలులోకి వచ్చి వారం రోజులైనా సామాన్యుడికి తిప్పలు తప్పట్లేదు. ఇప్పటికీ ఏటీఎంలు పూర్తిస్థారుులో పని చేయట్లేదు. మంగళవారమూ నగరంలోని అనేక ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనిపించారుు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘అతి పెద్దనోటు’తో సాధారణ ప్రజలకు చిల్లర తిప్పలు ఎక్కువయ్యారుు. గత మంగళవారం రాత్రి ప్రకటించినట్లు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచే ఏటీఎంలు పని చేయాల్సి ఉండగా అది అమలులోకి రాలేదు. ప్రతి పది ఏటీఎంలకు ఒకటి మాత్రమే పనిచేస్తోంది. దీంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా మారారుు. నిర్ణీత సమయాని కంటే ఐదు రోజుల ఆలస్యమైనా మంగళవారం సైతం ఏటీఎం కేంద్రాలు పూర్తి స్థారుులో పని చేయకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం అవస్థలు పట్టించుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని పలుచోట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ రంగం బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలే ఎక్కువగా పని చేశారుు. ఏటీఎం కేంద్రాలు పూర్తిస్థారుులో చేయకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ఏటీఎం మిషన్లలో నింపే స్థారుులో కొత్త కరెన్సీ రాకపోవడం, రూ.2000 నోటును గుర్తించేలా బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో పాటు ట్రే సమస్య కూడా ఉందని తెలుస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోటు ‘పాత కరెన్సీ’ కంటే పొగుడు, వెడల్పుల్లో వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలోనే వీటిని ఏటీఎం మిషన్లలో పెట్టేందుకు అవసరమైన ట్రేలు సైతం అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఒకటి కంటే ఎక్కువ కార్డులతో... సోమవారం నుంచి ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే పరిమితిని కేంద్రం రూ.2,500కు పెంచింది. అరుుతే అనేక మందికి ఈ మొత్తం కూడా సరిపోయే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో కొందరు వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ కార్డులు తీసుకువస్తున్నారు. తనది, తన కుంటుంబంలోని వారి డెబిట్ కార్డులతో పాటు క్రెడిట్ కార్డులు సైతం తీసుకువచ్చి క్యాష్ డ్రా చేసుకుంటున్నారు. దీంతో కొందరు వినియోగదారులు ఒక దఫాలో వివిధ కార్డుల్ని వినియోగించి రూ.10 వేల వరకు డ్రా చేసుకుని వెళ్తున్నారు. ఈ కారణంగానే ఏటీఎంల్లో నగదు నింపిన కొన్ని గంటలకే అవి ఖాళీ అవుతున్నారు. ఈ ‘బహుడ్రా’ విధానాలను క్యూలో ఉన్న అనేక మంది వినియోగదారులు వ్యతిరేకిస్తూ అభ్యంతరం తెలుపుతున్నారు. రూ.2500 ఇస్తున్న బ్యాంకులు... ‘కరెన్సీ ఓపెన్’ అరుున తర్వాత వరుసగా ఆరో రోజైన మంగళవారం సైతం బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనిపించారుు. కేంద్రం సవరించిన ప్రకటించిన దాని ప్రకారం సోమవారం నుంచి విత్‌డ్రా, ఎక్స్ఛేంజ్లకు సంబంధించి ఒక్కోక్కరికీ రూ.4.5 వేలు ఇవ్వాల్సి ఉంది. సోమవారం బ్యాంకులకు సెలవు కావడంతో మంగళవారం వాటివద్ద రద్దీ మరింత పెరిగింది. ఈ రద్దీతో పాటు కరెన్సీ కొరత నేపథ్యంలో అనేక బ్యాంకులకు చెందిన అధికారులు కేవలం రూ.2.5 వేలు ఇస్తున్నారు. కొన్ని బ్యాంకులు రూ.100 నోట్లు ఇస్తుండగా, మరికొన్ని కొత్త రూ.2 వేల నోటు ఇస్తున్నారుు. దీంతో ఈ ‘అతి పెద్ద నోటు’ తీసుకున్న వారికి చిల్లర సమస్య తప్పట్లేదు. ఎక్స్ఛేంజ్ చేసే వారి కంటే డిపాజిట్, విత్‌డ్రా వారికే బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నారుు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద చిరువ్యాపారాలు... కరెన్సీ మార్పిడి, విత్‌డ్రాల కోసం బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలతో పాటు పోస్టాఫీసుల వద్దా భారీ క్యూలు ఉంటున్నారుు. కొంతమంది ఏకంగా గంటకు పైగా నిల్చుకోవాల్సి వస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ‘కొత్త చిరువ్యాపారాలు’ వెలుస్తున్నారుు. చాయ్‌తో పాటు పల్లీలు తదితర చిరుతిళ్ళు విక్రరుుంచే ‘మెబైల్ దుకాణాలు’ కనిపిస్తున్నారుు. వీరికి నగదు చెల్లించడానికి చిల్లర సమస్య వచ్చిపడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గుర్తింపు కార్డుల ప్రతులు, ఇతర పత్రాల జిరాక్సుల నేపథ్యంలో కొన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద ఉన్న జిరాక్సు సెంటర్లకూ రద్దీ పెరిగింది. మరికొన్ని రోజులు ఈ ఇబ్బందులు తప్పేలాలేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారం ఢమాల్ నగరవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నారుు. నోట్ల మార్పిడికే రోజంతా సరిపోతుండడంతో జనాలు కనీస కొనుగోళ్లకు కూడా సమయం ఉండడం లేదు. ఇక డబ్బుల సంగతి సరేసరి. దీంతో చిరువ్యాపారాల నుంచి షాపింగ్ మాల్స్ వరకు దివాళా తీస్తున్నారుు. హోటళ్లు, సినిమా హాళ్లు, టిఫిన్‌సెంటర్లు జనం లేక బోసిపోతున్నారుు. వస్త్రదుకాణాల్లో సిబ్బంది తప్ప ఎవరూ కన్పించడం లేదు. ఇక పెట్రోల్ బంకుల్లోనూ చిల్లర కొరత కారణంగా వివాదాలు తలెత్తుతున్నారుు. పూలు, పండ్లు, కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్యాబ్‌లు, ఆటోల డ్రైవర్లు పూట గడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. -
కళ తప్పిన కార్తీకం
మార్కెట్లు వెలవెల సామాన్యులకు ‘చిల్లర’ సమస్యలు గిరాకీ లేక వ్యాపారులూ సతమతం ఏటీఎంలలో నో క్యాష్..దిక్కుతోచని జనం సిటీబ్యూరో: కార్తీక పౌర్ణమి..అదీ సోమవారం రావడంతో వ్యాపారాలు బాగా జరుగుతాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. పెద్దనోట్ల రద్దు..చిల్లర సమస్యతో ‘కార్తీక మార్కెట్’ కళతప్పింది. సోమవారం నగరంలోని గుడిమల్కాపూర్, సుల్తాన్‌బజార్, బడిచౌడీ మార్కెట్, అబిడ్స, బేగంబజార్, సిద్దంబర్‌బజార్, మోండా మార్కెట్, జుమ్మెరాత్బజార్లలో పూలు, పూజా సామాగ్రి అమ్మకాలు సగం పడిపోయాయని తెలుస్తోంది. మరోవైపు చిల్లర సమస్య కారణంగా వ్యాపారులు కూడా చేసేదేమీ లేక ధరలను అమాంతం పెంచేశారు. ఓ పక్క నోట్ల రద్దు, మరో పక్క పూల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పూలను రూ. 400 కిలో చొప్పున వ్యాపారులు విక్రరుుంచారు. పలువురు వినియోగదారులు రూ.వెరుు్య(పాతవి),రూ. 2000 కొత్త నోట్లు తీసుకురావడంతో వారికి చిల్లర ఇవ్వలేక వ్యాపారస్తులు తిప్పి పంపారు. మరికొందరు చిల్లర కోసం రూ.వెరుు్యకి రూ.100 కమీషన్‌గా వసూలు చేశారు. కూరగాయల మార్కెట్లకు వచ్చేవారు రూ. 500 నోట్లు తెస్తుండడం.. వారు కొనుగోలు చేసేది రూ.20, రూ.50 మాత్రమే కావడంతో మిగతా మొత్తానికి చిల్లర ఇవ్వలేక సతమతమౌతున్నట్లు పలువురు వ్యాపారులు వాపోయారు. గత నాలుగు రోజుల నుండి వ్యాపారం సగం పడిపోరుుందని పలువురు చిల్లర వ్యాపారులు వెల్లడించారు. నోట్ల యాతన! పెద్ద నోట్ల రద్దు మహానగరంలో సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చివేసింది. బ్యాంకులకు సోమవారం సెలవుకావడం, ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వలు లేకపోవడంతో జనం నరకయాతన అనుభవించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పూలు, పండ్లు ఇతర నిత్యావసరాలకు మార్కెట్లకు పోటెత్తిన జనానికి చిల్లర కష్టాలు చుక్కలు చూపారుు. ప్రతి ఒక్కరూ రూ.500, రూ.వెరుు్య నోట్లతో తరలిరావడంతో వ్యాపారులు సైతం చేసేదిలేక చేతులెత్తేశారు. చిల్లర కష్టాలతో పలు మార్కెట్లలో కొనుగోళ్లు అమాంతం పడిపోయారుు. మరికొన్ని చోట్ల ఇదే అదనుగా వ్యాపారులు నిత్యావసరాల ధరలను పెంచేసి వినియోగదారులను నిలువుదోపిడీ చేశారు. మరికొందరు రూ.వెరుు్య నోటు మార్చితే రూ.900 మాత్రమే ముట్టజెప్పారు. రూ.100 కమీషన్‌గా నొక్కేయడంతో వినియోగదారులు చేసేది లేక వారు అడిగినంతా చెల్లించారు. గ్రేటర్‌పరిధిలో ఏడు వేల ఏటీఎం కేంద్రాలుండగా..సోమవారం రెండువేలు కూడా పనిచేయకపోవడం గమనార్హం. వాటిల్లోనూ నగదు నిల్వచేసిన గంట లోపే నిండుకోవడంతో భారీ క్యూలైన్లలో నిల్చున్న వారు సొమ్మసిల్లారు. మహిళలు, వృద్ధులు, చంటిపిల్లలతో ఏటీఎం కేంద్రాలకు వచ్చిన వారికి నిరాశ తప్పలేదు. పలు ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు, ఔట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిచ్చారుు. పలు ఏటీఎంలలో మధ్యాహ్నం వేళకే నగదు అరుుపోరుుంది. దీంతో చాలా మంది ప్రజలు డబ్బులు తీసుకోకుండానే వెనుదిరిగారు. కేంద్ర ప్రభుత్వం ఏటీఎంల నుంచి తీసుకునే డబ్బు పరిమితి పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ‘కొత్త’ చిక్కులు... గత నాలుగురోజులుగా బ్యాంకుల నుంచి రూ.2 వేల నోట్లు పొందిన వినియోగదారులకు..ఆ సంబురం సోమవారం ఆవిరైంది. ఈ నోట్లతో కూరగాయలు, పాలు, పండ్లు, పూలు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బహిరంగ మార్కెట్లో అడుగుపెట్టిన వారికి తిప్పలు తప్పలేదు. రూ.500కే చిల్లర ఇవ్వలేమని..అదీ రూ.2 వేల నోట్లకు ఎలా చిల్లర ఇవ్వగలమంటూ పలువురు వ్యాపారులు చేతులెత్తేయడంతో ఈ నోట్లుకూడా అలంకార ప్రాయంగా మారాయని పలువురు వినియోగదారులు వాపోయారు. రైతుబజార్లు, మార్కెట్లలో ప్రత్యేకంగా చిల్లరకు కౌంటర్లు ఎర్పాటు చేయాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
దేవుడు ఒక్కడే అనండి...సాఫల్యం పొందుతారు!
రోజులు గడిచి పోతున్నాయి. ప్రియ ప్రవక్త(స) సందేశప్రచారం వల్ల విశ్వాసుల సంఖ్య క్రమక్రమంగా పెరగసాగింది. అవిశ్వాసులకు ఈవిషయం మింగుడుపడడం లేదు. ముహమ్మద్‌ను ఇలాగే వదిలేస్తే, అతని ధర్మం విస్తరిస్తుంది. అతను విజయం సాధిస్తాడు. మన పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతాయి. మన నగరం అభాసు పాలవుతుంది. మన వ్యాపారాలు మందగించి పోతాయి. ఇంకా ఉపేక్షించడం ఎంతమాత్రం సరికాదు. ఏదో ఒకటి తేల్చేయాల్సిందే’ అని అంతా కలిసి మరోసారి అబూతాలిబ్ వద్దకు వెళ్ళారు. ‘అయ్యా! మీరు మాపెద్దలు. మాకు అత్యంత గౌరవనీయులు. ఇదివరకు కూడా ఒకసారి తమర్ని కలిశాం. అబ్బాయి విషయంలో కాస్త మాకు న్యాయం చేయండి. మా తాత ముత్తాతల ధర్మాన్ని గురించి, మా దేవతా విగ్రహాల గురించి, మా బుద్ధీజ్ఞానాల గురించి మాట్లాడ వద్దని ముహమ్మద్‌కు నచ్చజెప్పండి. లేదంటారా, మీరు పక్కకు తప్పుకోండి అతని సంగతి మేముచూసుకుంటాం. ఎలాగూ మీరు కూడా అతని మాటలు వినీ వినీ విసుగెత్తే ఉంటారు. మీకు కూడా కాస్త ప్రశాంతత లభిస్తుంది.’ అని మొరపెట్టుకున్నారు. అబూతాలిబ్ సంకట స్థితిలో పడి పొయ్యారు. వీళ్ళను ఎలా శాంతపరచాలో అర్థం కావడం లేదు. ఇక లాభం లేదనుకొని ముహమ్మద్ ప్రవక్తను పిలవనంపారు. ‘బాబూ ! వీళ్ళంతా మనజాతి అగ్ర నాయకులు. గొప్ప ధనసంపన్నులు. నువ్వేదో కొత్తమతాన్ని ప్రచారం చేస్తున్నావని ఫిర్యాదు చేస్తున్నారు. బాబూ ! ఎందుకొచ్చినగొడవ. నువ్వువాళ్ళజోలికి పోకు, వాళ్ళూనీజోలికి రారు’. అన్నారు అనునయంగా ‘బాబాయ్..! వాళ్ళ శ్రేయోసాఫల్యాలు ఎందులో ఎక్కువ ఉన్నాయో, ఆవైపుకు వాళ్ళను పిలవ వద్దని అంటున్నారా ?’. ‘శ్రేయో సాఫల్యాలా ..! ఏమిటది..?’ ‘ఒక్కమాట .. ఒకే ఒక్క సద్వచనం. దాన్ని వాళ్ళు ఉచ్చరిస్తేచాలు. అరేబియా అంతా వారికి దాసోహమంటుంది.ప్రపంచమంతా వారి పాదాక్రాంతమవుతుంది’. అన్నారుముహమ్మద్ . ఇది విని అబూజహల్ ఉత్సాహంగా ముందుకొచ్చాడు. ‘దైవసాక్షి! ఒక్కసారి కాదు, పదిసార్లు వల్లిస్తాం. ఏమిటో చెప్పు.’ అన్నాడు అబూజహెల్ .. అప్పుడు ప్రవక్త మహనీయులు, ’దేవుడు ఒక్కడే’ అని పలకండి. గౌరవప్రతిష్టలు మీ పాదాక్రాంతమవుతాయి. దైవకారుణ్యం మీపై వర్షిస్తుంది’. అన్నారు ప్రవక్తమహనీయులు. దీంతో ఒక్కసారిగా వారిముఖ కవళికలు మారిపొయ్యాయి. ఆగ్రహంతో వారికళ్ళుఎరుపెక్కాయి. పళ్ళు పదునెక్కాయి. ‘ఇదేనా నువ్వు చెప్పదలచుకున్నమాట. సరే చూడు నీగతి ఏమవుతుందో..!’అంటూ, పళ్ళునూరుతూ విసవిసా వెళ్ళిపోయారు. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతా వచ్చేవారం) -
తప్పనిసరైతేనే వ్యాపారాలకు గుడ్‌బై: సైరస్ మిస్త్రీ
న్యూయార్క్: టాటా గ్రూపు కొన్ని వ్యాపారాల నుంచి వైదొలగడం పట్ల తానేమీ కలత చెందడం లేదని గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ అన్నారు. గత 20 ఏళ్ల కాలంలో టాటా గ్రూపు 40కు పైగా వ్యాపారాల నుంచి తప్పుకోవడంపై మాట్లాడుతూ.... చిట్టచివరికి తప్పనిస్థితిలో వ్యాపారం నుంచి వైదొలుగుతాం గానీ, స్వల్ప కాల దృష్టితో నిర్ణయాలు తీసుకోబోమని చెప్పారు. టాటా జ్యుయెలరీ బ్రాండ్ తనిష్క్, ఐటీ విభాగం టీసీఎస్ టర్న్ ఎరౌండ్ అయ్యి, వృద్ధి చెందడానికి పట్టిన కాలాన్ని మిస్త్రీ ఉదాహరణలుగా పేర్కొన్నారు. వీటి విషయాల్లో పట్టుదల, దీర్ఘకాల దృష్టి ఫలితాన్నిచ్చాయన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన సందర్భంగా మిస్త్రీ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. టాటా గ్రూపు 20 ఏళ్లలో 40కు పైగా వ్యాపారాల నుంచి తప్పుకుంది. -
నేతల చుట్టూ ‘సేవల’ ఉచ్చు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా వాణిజ్య వ్యవహారాలు సాగిస్తున్న నేతలపై కేంద్రం ఆధీనంలోని సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం కన్నేసింది. వీరి ఎన్నికల అఫిడవిట్లు అధ్యయనం చేసిన అధికారులు భారీ స్థాయిలో లావాదేవీల్ని గుర్తించారు. దీంతో లెక్కలు చెప్పాల్సిందిగా కోరుతూ. దాదాపు 40 మంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు లేఖలు రాశారు. ఈ నేతల్లో మంత్రులు, మాజీ మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఉండటం గమనార్హం. వారి నుంచి వచ్చే సమాధానాల ఆధారంగా అవసరమైనచర్యలు తీసుకోవడానికి సర్వీస్ ట్యాక్స్ విభాగం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇవన్నీ సేవలపన్ను పరిధిలోకి... వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవల పన్ను పరిధిలోకి వస్తారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంస్థలు, హోటళ్ళు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సర్వీసు ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్‌్స దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. ఆర్థిక చట్ట ప్రకారం ఇలాంటి వాణిజ్య, వ్యాపార వ్యవహారాలు సాగించే వారు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆధీనంలోని సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. వీరు సర్వీస్ ట్యాక్స్ విభాగం దగ్గర రిజిస్టర్ చేయించుకోవడంతో పాటు వార్షిక రిటర్న్‌్స దాఖలు చేస్తూ, సర్వీసు ట్యాక్స్ మొత్తాన్ని సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి చెల్లించాలి. ప్రస్తుతం ఈ సర్వీసు ట్యాక్స్ సెస్‌లతో కలిసి 15 శాతంగా ఉంది. వారి గుట్లు విప్పిన అఫిడవిట్లు... నగరం కేంద్రంగా ఇలాంటి వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు సాగిస్తున్న అనేక మంది రాజకీయ నాయకులు తమకు సక్రమంగా పన్ను చెల్లించట్లేదని, కొందరైతే కనీసం రిజిస్ట్రేషన్ సైతం చేయించుకోలేదని సర్వీస్ ట్యాక్స్ విభాగం ఎప్పటి నుంచో అనుమానిస్తోంది. ఆ అధికారులకు 2014 సాధారణ ఎన్నికల అఫిడవిట్లు కీలక ఆధారాలను అందించాయి. అప్పటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో అఫిడవిట్లనూ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో కుటుంబం, పిల్లలు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు తమకు ఉన్న ఆస్తులు, తమపై ఉన్న కేసుల వివరాలనూ సమగ్రంగా పొందుపరుస్తారు. ఈ అఫిడవిట్లన్నీ మైనేత.ఇన్ఫో వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని సేకరించిన సర్వీస్ ట్యాక్స్ అధికారులు సమగ్రంగా అధ్యయనం చేశారు. లేఖలు రాసిన సేవలపన్ను అధికారులు... హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు సాగిస్తున్న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 40 మంది నేతల గుట్టు ఎన్నికల అఫిడవిట్లు ద్వారా అధికారులు సేకరించారు. వీరిలో మంత్రులు, మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్నికల్లో పోటీ పడిన వారు సైతం ఉన్నారు. కొందరు తమ పేర్లతోనే వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు సాగిస్తుండగా... మరికొందరు కుటుంబీకుల పేర్లతో చేస్తున్నారని వెల్లడైంది. ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థల చిరునామాలు, విలువలతో సహా వీటిలో దొరికాయి. దీంతో వీరందరి నుంచి లెక్కలు కోరుతూ సర్వీస్‌ట్యాక్స్ విభాగం లేఖలు రాసింది. ఇప్పటికే కొందరు స్పందించి అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఆయా చిట్టాలు, వాటి పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత సర్వీస్ ట్యాక్స్ కట్టాలా? ఎంత కట్టాలి? అనేవి నిర్థారించనున్నారు. ఆపై నోటీసుల జారీ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయా నేతలకు, వారి కుటుంబీకులకు నోటీసులు ఇచ్చిన తర్వాత గడువులోపు సర్వీసు ట్యాక్స్ చెల్లించకపోతే బకాయిపడ్డ మొత్తానికి 100 శాతం జరిమానా, ఏడాదికి 30 శాతం వడ్డీతో వసూలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆర్థిక చట్ట ప్రకారం రూ.2 కోట్లకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్–బెయిలబుల్ వారెంట్ తీసుకుని నేరుగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అవకాశం సైతం ఉందని అధికారులు చెబుతున్నారు. -
భవిష్యం(28-08-2016)
టారో 28 ఆగస్టు నుంచి 3సెప్టెంబర్, 2016 వరకు మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) చిన్న చిన్న అవరోధాలు ఉన్నా, వ్యాపారాలు పుంజుకుంటాయి. కష్టాన్ని నమ్ముకుని ఫలితాలను సాధిస్తారు. చిరకాలంగా సన్నిహితంగా ఉంటున్న వ్యక్తితో ప్రేమలో పడతారు. కొత్తగా వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరచుకుంటారు. భవిష్యత్ అవసరాల కోసం, ఆర్థిక భద్రత కోసం మరింత సంపదను కూడబెట్టాలనే ఉద్దేశంతో పెట్టుబడులు పెడతారు. లక్కీ కలర్: గులాబి వృషభం (ఏప్రిల్ 20 - మే 20) కొత్తగా ఇల్లు కొనడం లేదా ఉన్న ఇంటిలోనే మార్పులు చేపట్టడం వంటి పనులకు శ్రీకారం చుడతారు. త్వరగా పనులు పూర్తి కావాలనే ఆతృతతో ఇతరులపై కోపతాపాలకు గురవుతారు. సురక్షితంగా ఆశించిన గమ్యానికి చేరాలంటే నిదానమే ప్రధానమనే మాటను గుర్తుంచుకోవడం మేలు. లక్ష్య సాధన కోసం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తారు. లక్కీ కలర్: నీలం మిథునం (మే 21 - జూన్ 20) ఇంటా బయటా అనూహ్యమైన మార్పులు జరుగుతాయి. ఊహించని కొన్ని సంఘటనలు ఆశ్చర్యంలో పడేస్తాయి. బాధ్యతలను గుర్తించి పనిచేస్తే జీవితం సుఖమయంగా మారుతుందని గ్రహిస్తారు. భావసారూప్యత గల వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు ఏర్పడతాయి. మరింత స్పష్టత కోసం, ఆశించిన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం కోసం అవసరమైన సమాచార సేకరణ దిశగా కృషి చేస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) దివ్యమైన స్ఫూర్తితో, వివేకంతో తలచిన పనులను పూర్తి చేస్తారు. సంధి దశలో ఉన్న మీరు వాస్తవిక దృక్పథాన్ని అలవరచుకుంటారు. పని ఒత్తిడిని తగ్గించుకుని కాస్త విశ్రాంతి తీసుకోవడం మేలు. భవిష్యత్తును నిర్మించుకునే కీలక దశ ఇది. పాత గాయాలను మరచి, ప్రేమ సంబంధాలలో శాంతి సామరస్యాలకు చొరవ తీసుకుంటారు. లక్కీ కలర్: ఇటుక రంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సవాలుగా స్వీకరిస్తారు. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. ‘అతి సర్వత్ర వర్జయేత్’ సూత్రాన్ని పాటించండి. మీ ప్రవర్తనలో ఏదీ అతి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పరిస్థితులన్నీ వాటంతట అవే చక్కబడతాయి. లక్కీ కలర్: మట్టి రంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) కోరుకున్నవి అడగడానికి ఏమాత్రం సంకోచించవద్దు. అడిగినవి తప్పకుండా పొందగలరు. అనవసరపు ఆందోళనలను, మానసిక అలజడిని అదుపు చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. శక్తులన్నీ కోల్పోయినట్లు నిస్తేజంగా మారుతారు. ఈ పరిస్థితుల్లో మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ద్వారా ఊరట పొందగలరు. లక్కీ కలర్: వెండి రంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మార్పు కోసం ఎదురు చూస్తున్న మీకు కెరీర్లో అద్భుతమైన అవకాశం అందివస్తుంది. భవిష్యత్తుపై ఊహా లోకాల్లో తేలిపోతూ కాలం గడిపేయడం మంచిది కాదని గుర్తిస్తారు. వర్తమానమే భవిష్యత్తుకు పునాది అని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన పరిస్థితులు అనివార్యమవుతాయి. కాస్త ఉత్సాహం, ఉత్తేజం కోరుకుని విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ప్రేమ వ్యవహారాల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అవివాహితులకు పెళ్లిళ్లు కుదిరే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను చాటుకుంటారు. మీ ఆకర్షణ శక్తి కారణంగా బంధు మిత్రులందరూ మీ చుట్టూ చేరతారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అందివచ్చిన అవకాశాలను గరిష్టస్థాయిలో ఉపయోగించుకుంటారు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఇంటా బయటా ఆనందంగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వచ్చిన లాభాల కంటే చేసే పని మీదనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అనాయాసంగానే పెద్దపెద్ద పనులను అవలీలగా పూర్తిచేస్తారు. సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితం సుఖమయంగా సాగుతుంది. లక్కీ కలర్: లేత నారింజ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) పరిస్థితులు అనివార్యంగా అదుపు తప్పుతాయి. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవడం క్షేమం. ఆత్మనియంత్రణ ఆత్మ గౌరవానికి భంగకరం కాదని తెలుసుకుంటారు. ఒంటరిగా గడుపుతారు. అపార్థాలకు గురవు తారు. అందరూ మిమ్మల్ని తిరస్కరిస్తున్న ట్లుగా భావించి బాధపడతారు. ఒక పరిచిత వ్యక్తి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురవుతారు. లక్కీ కలర్: బూడిద రంగు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) జీవితంలో పెద్దగా ప్రత్యామ్నాయాలు ఉండవని గ్రహిస్తారు. ఏకాంతాన్ని, నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. తీరిక సమయాన్ని ఆత్మావలోకనం కోసం వినియోగించుకుంటారు. కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొనడం కొంత ఊరటనిస్తుంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి భావసారూప్యం గల భాగస్వామి తారసపడతారు. నూతనోత్తేజం పొందడానికి ఒంటరిగా దూరప్రయాణాలకు వెళతారు. లక్కీ కలర్: ఊదా మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) వృత్తి వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీల్లో వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ స్వీకరించి అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. మనసుకు నచ్చిన తోడు దొరుకుతుంది. ఒక కీలక నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో డోలాయమాన పరిస్థితుల్లో ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడతారు. లక్కీ కలర్: ముదురు పసుపు ఇన్సియా టారో అనలిస్ట్ -
ఒక వర్షపు రాత్రి
పట్టుకోండి చూద్దాం అజాతశత్రువు అనే మాట వినడమేగానీ చూడని వాళ్లు ఆనంద్ కుమార్‌ను ఒక్కసారి చూస్తే సరిపోతుంది. అరవై అయిదు సంవత్సరాల ఆనంద్‌కుమార్ బ్రహ్మచారి. ‘‘ఎందుకు పెళ్లి చేసుకోలేదు?’’ అని అడిగితే- ‘‘బాగా డబ్బు గడించాలనే ఆశతో ఏవోవో వ్యాపారాలు చేశాను. కోట్లు గడించాను. డబ్బు గురించి తప్ప వేరే ఆలోచనేదీ లేకుండా జీవించాను. పెళ్లి చేసుకోవాలనే విషయమే మరిచిపోయాను. ఇప్పుడు నా దగ్గర డబ్బుంది. కానీ మనశ్శాంతి లేదు’’ అంటాడు సిగెరెట్ వెలిగిస్తూ ఆనంద్ కుమార్. ఆనంద్‌కు తన అక్కయ్య కొడుకు, చెల్లి కొడుకు, తమ్ముడి కొడుకు అంటే చాలా ఇష్టం. జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగ్లాలో ఒంటరిగా నివసించే ఆనంద్ ప్రతి వేసవిలో పిల్లల్ని తన ఇంటికి పిలిపించుకొని నెలరోజులు సరదాగా గడుపుతాడు. ఈసారి కూడా అదే జరిగింది. కాకినాడ నుంచి తన అక్కయ్య అన్నపూర్ణ కొడుకు అంకిత్ వచ్చాడు. పెద్దగా ఎవరితోనూ కలిసిపోడు. ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. అయితే సన్నిహితులతో మాత్రం బాగా కలిసిపోతాడు. అనంతపురం నుంచి తమ్ముడు అనంత్ కుమారుడు హరీశ్ వచ్చాడు. హరీశ్ ఎక్కడ ఉంటే అక్కడ సందడే. కబుర్ల పుట్ట! వైజాగ్ నుంచి చెల్లి రజని కుమారుడు తరుణ్ వచ్చాడు. తరుణ్ విపరీతంగా నవలలు చదువుతాడు. తాను చదివిన వాటిని ఇతరులతో చెప్పుకొని తెగ ఆనందిస్తుంటాడు. ‘‘మామయ్యా... ఈ రూమ్‌కు నో స్మోకింగ్ రూమ్ అని బోర్డ్ తగిలించావేమిటి?’’ అని అంకిత్ అడిగాడు. ‘‘నా వరకు ఇది పవిత్రమైన రూమ్. ఇక్కడ నేను రోజూ ధ్యానం చేస్తాను. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతాను. కొన్నిసార్లు మౌనంగా కూర్చుంటాను’’ అన్నాడు ఆనంద్ కుమార్. ఆరాత్రి... ఉన్నట్టుండి వర్షం మొదలైంది. వాతావరణం చల్లగా ఉంది. ఆ చల్లని రాత్రి అంకిత్, తరుణ్, హరీశ్‌లతో కబుర్లు చెబుతున్నాడు ఆనంద్ కుమార్. ఆ కబుర్ల మధ్యలోనే ఒకసారి ఆనంద్ స్వరం కాస్త గరంగా మారింది. ‘‘జీవితాన్ని ఎంజాయ్ చేయడం ముఖ్యమే కానీ అదే జీవితం కాకూడదు. మీలో ఎవరూ చదువులపై, కెరీర్‌పై శ్రద్ధ పెట్టడం లేదని అర్థమవుతుంది. ఇది మంచిది కాదు...’’ ఇలా చాలాసేపే మాట్లాడాడు ఆనంద్ కుమార్. ఆయన మాటలకు కోపం తెచ్చుకున్న వాళ్లు ఉన్నారు. ‘‘పెద్దాయన చెప్పింది నిజమే కదా’’ అనుకున్నవాళ్లు ఉన్నారు. మరుసటి రోజు పని మనిషి సుందరం ఆనంద్‌కుమార్ ఇంట్లోకి వచ్చాడు. కాఫీ చేసి ఆయనకు అందించడానికి బెడ్రూమ్లోకి వెళ్లాడు. అంతే... ఆనంద్ కుమార్ శవం కనిపించింది. ‘హత్య...’ గట్టిగా అరిచాడు సుందరం. ఇంతకీ ఆనంద్‌కుమార్‌ని ఎవరు హత్య చేశారు? ఆ ముగ్గురా?(అంకిత్, తరుణ్, హరీశ్), ఆ ముగ్గురిలో ఒకరా? దొంగలా? సుందరమా? ఎన్నో జటిలమైన కేసులను చేధించిన నరసింహ ఈ కేసులో కూడా హంతకుడెవరో సులభంగానే కనిపెట్టాడు. క్లూ: టాయిలెట్రూమ్, ఆర్ట్రూమ్, రెస్ట్రూమ్, అండర్ వాటర్ రూమ్, నో స్మోకింగ్ రూమ్‌లో హంతకుడు ఒక్కొక్క వస్తువును వదిలివెళ్లాడు. జవాబు: హంతకుడి పేరు తరుణ్. తరుణ్‌కు క్రైమ్ నవలలు చదవడం అంటే విపరీతమైన ఇష్టం. ఆ కథల్లోనే జీవిస్తుంటాడు. తరుణ్ ముక్కోపి. ఆ రాత్రి తనను ఆనంద్‌కుమార్ మందలించడం నచ్చలేదు. ఆ కోపంతో ఆనంద్‌కుమార్‌ని హత్య చేశాడు. క్రెమ్నవలలు చదివిన ప్రభావంతో తన పేరులోని అక్షరాలు వచ్చేలా ఒక్కో గదిలో ఆనంద్కుమార్కి సంబంధించిన వస్తువును పెట్టాడు. ఈ విపరీత బుద్దే అతడిని పట్టించింది. టాయిలెట్ రూమ్(T), ఆర్ట్ రూమ్ (A), రెస్ట్ రూమ్(R), అండర్ వాటర్ రూమ్(U), నో స్మోకింగ్ రూమ్(N) -
‘టైమ్’ దాటితే జైలుకే..
సాక్షి, సిటీబ్యూరో: పోలీసు విభాగం నిర్దేశించిన సమయానికి మించి...అర్థరాత్రి దాటిన తర్వాత వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులపై సిటీ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. పదేపదే ఈ తరహాలో చేస్తూ రికార్డుల్లోకి ఎక్కిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సదరు వ్యాపారులపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. పశ్చిమ మండల పరిధికి చెందిన ఇద్దరు వ్యాపారులకు న్యాయస్థానం బుధవారం మూడు రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరు వ్యాపారుల్నీ బైండోవర్ చేసింది. భవిష్యత్తులోనూ చార్జ్షీట్ల దాఖలు కొనసాగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు సమయపాలన పాటించాలని డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మొదట పెట్టీ కేసులతో సరి... శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో నగరంలో వ్యాపారాలు నిర్వహించుకోవడానికి పోలీసు విభాగం సమయాన్ని నిర్దేశించింది. దీనికి సంబంధించి కొత్వాల్ నిత్యం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు లెసైన్స్ నిబంధనల్లోనూ ఆ అంశాన్ని పొం దుపరుస్తున్నారు. అయినప్పటికీ అనేక మంది వ్యాపారులు వీటిని బేఖాతరు చేస్తూ వేళాపాళా లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు. ప్రధానంగా హోటళ్లు, పబ్బు లు, రెస్టారెంట్ల నిర్వాహకుల్లో ఈ వ్యవహార శైలి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వ్యాపారాలను గుర్తించే క్షేత్రస్థాయి పోలీసులు ప్రాథమికంగా సిటీ పోలీసు యాక్ట్ ప్రకారం పెట్టీ కేసులు పెట్టి, జరిమానా విధిస్తున్నారు. ‘హద్దులు’ దాటికే అభియోగాలు... కొందరు వ్యాపారులపై ఈ పెట్టీ కేసులు, జరిమానాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ఫలితంగా వారి ధోరణిలో ఎలాంటి మార్పు రావట్లేదు. వేళాపాళా లేకుండా వ్యాపారాలు చేస్తూ పదేపదే పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. ఇలాంటి వ్యాపారులకు చెక్ చెప్పడానికి పశ్చిమ మండల పోలీసులు కేసుల నమోదు ప్రారంభించారు. గస్తీ నిర్వహించే బ్లూకోల్ట్స్ సిబ్బంది నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్నారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసి, గత చరిత్రతో సహా న్యాయస్థానంలో చార్జ్‌షీట్స్ దాఖలు చేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న కోర్టులు ప్రభుత్వ అధికారి ఆదేశాలను బేఖాతరు చేసిన ఆరోపణపై (ఐపీసీ 188) సదరు వ్యాపారులకు జైలు విధిస్తున్నాయి. ఇద్దరికి మూడు రోజుల జైలు... బోరబండకు చెందిన మహ్మద్ ఆరిఫ్ సోమాజిగూడలో ఏ-1 రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి నిర్దేశిత సమయం దాటిన తర్వాతా వ్యాపారం చేస్తూ పంజగుట్ట పోలీసుల దృష్టిలో పడ్డాడు. గత ఏడాది ఐదుసార్లు, ఈ ఏడాది ఇప్పటికే 16 సార్లు ఇలా చేస్తూ చిక్కి రూ.50 జరిమానా చెల్లించాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఆరిఫ్పై కేసు నమోదు చేసి పదో ప్రత్యేక న్యాయమూర్తి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం ఆరిఫ్‌కు మూడు రోజుల సాధారణ జైలు, రూ.200 జరిమానా విధించింది. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద బిస్మిల్లా ఎస్టాబ్లిష్మెంట్ నిర్వాహకుడు నజీర్ సైతం ఇప్పటికే ఆరుసార్లు సమయం పాటించకుండా జరిమానా కట్టాడు. మంగళవారం సైతం పునరావృతం కావడంతో కోర్టు మూడు రోజుల సాధారణ జైలు, రూ.50 జరిమానా విధించింది. పక్కాగా కేసులు ‘నిర్దేశిత సమయం దాటి వ్యాపారాలు చేస్తున్న ఇద్దరికి జైలు శిక్ష పడింది. జూబ్లీహిల్స్ పరిధిలోని రోడ్ నెం.36లో క్లబ్ ట్రినిటీ పబ్ నిర్వహిస్తున్న ఆర్.విజయ్, పియూష్ జైన్ల పైనా చార్జ్షీట్లు దాఖలు చేశాం. వీరిని బైండోవర్ చేసిన న్యాయస్థానం పునరావృతమైతే జైలుకు పంపిస్తానని స్పష్టం చేసింది. కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు తదితరాలు అర్థరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉండాలి. ఆ సమయం దాటి జరుగుతున్న వ్యాపారాలపై నిఘా ఉంచాం. అలాంటి వ్యాపార సంస్థల కార్యకలాపాలను ట్యాబ్స్ సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఫొటోలు తీస్తున్నాం. వీటి ద్వారా ఆ వ్యాపార సంస్థ ఉన్న ప్రాంతం, పని చేస్తున్న సమయాలను ఆధారాలతో సహా కోర్టుకు సమర్పిస్తున్నాం. యజమానులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నాం’ - ఎ.వెంకటేశ్వరరావు, వెస్ట్‌జోన్ డీసీపీ -
ఇల్లే ఓ బ్యూటీ క్లినిక్
ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. ఎంత ఎండలు ఉన్నా, బయటకి వెళ్లనిదే ఉద్యోగాలు, వ్యాపారాలు వంటి వాటితో సహా ఇతర పనులు జరగవు కదా! ఎండలోకి వెళ్లేముందు ముఖానికి, చేతులకు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం వంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడం కష్టం. అయితే బోలెడంత ఖరీదు పెట్టి సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. బయటి నుంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకుంటే సరి. అందుకు దోస లేదా కీరదోస గుజ్జులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమంతో ఫేస్‌ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ఎండకు కమిలిపోయినట్లున్న మీ ముఖం నిగనిగలాడుతూ మీకే ముద్దొచ్చేస్తుంది. కొబ్బరి నూనె కేవలం జుట్టుకే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ అది ముఖానికి చేసే మేలు చాలామందికి తెలీదు. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరినూనెతో మర్దన చేసుకోండి. తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. అలాగే కొబ్బరిపాలలో పసుపు కలిపి ముఖానికి రాసుకుని, ఆరాక కడుక్కున్నా మంచి ఫలితం ఉంటుంది. కేవలం ముఖానికి రాసుకోవడమే కాదు; కొబ్బరినీళ్లు తాగడం వల్ల కూడా చర్మసౌందర్యం ఇనుమడిస్తుంది. అదేవిధంగా ఒక్క ఎండాకాలంలోనే కాదు; చాలామందికి కళ్ల కింద నల్లటి వలయాలతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. దానికి ఫ్రిజ్‌లోంచి అప్పుడే తీసిన చల్లటి బంగాళదుంప లేదా కీరదోస ముక్కలను కళ్లపై పెట్టుకొని 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అందులోని బ్లీచింగ్ ఏజెంట్ ఆ మచ్చలను మటుమాయం చేస్తుంది. -
ఏల్నాటి శని..ప్రభావం..
ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో శని ప్రభావానికి లోనవుతాడు. మందగమనం కలిగినవాడైనందున ఈయననుశ నైశ్చరుడు అంటారు. ఈయన నవగ్రహాల్లో అతి శక్తిమంతుడు. ఈయనకు కాకి వాహనం. మకరం, కుంభ రాశులకు అధిపతి శని. శనైశ్వరుని భార్య జ్యేష్ఠాదేవి. శనివారం ,త్రయోదశి తిథి కలిసివస్తే శనిత్రయోదశి అంటారు. ఈరోజు శనికి అత్యంత ప్రీతికరమైనది. ఈయనకు తిల తైలాభిషేకం శ్రేష్టం. గోచారరీత్యా శని మేషాది రాశుల్లో సంచ రిస్తాడు. ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు. అంటే 12రాశుల్లో సంచారం పూర్తి చేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్లకు ఒకసారి ప్రతిఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది. ఏల్నాటి శని వల్ల కలిగే కష్టనష్టాలు ఇలా ఉంటాయి.. జాతకునికి గోచారరీత్యా తన జన్మరాశి (జన్మనక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి) నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని ఏల్నాటి శని అంటారు. 12వ రాశిలో సంచరిస్తున్నప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం. తరచూ ప్రయాణాలు. జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, అపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం. ధనవ్యయం. రుణబాధలు. వృత్తి, వ్యాపారాల్లో చికాకులు. స్థానచలన సూచనలు. రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆశలు కల్పించి నిరాశ క ల్పిస్తాడు. రుణబాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి. జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని అంటారు. ఈ కాలంలో జాతకునికి చిక్కులు, కష్టనష్టాలు ఎక్కువగా ఉంటాయి. రెండవ పర్యాయం (30 సంవత్సరాల అనంతరం) వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అంటారు. ఈ కాలంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక, ఆస్తిలాభాలు, గృహయోగాలు, ఉద్యోగయోగం వంటి ఫలితాలు కలుగుతాయి.మూడవ పర్యాయం వచ్చిన శనిని మృత్యుశని అంటారు. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు, అపమృత్యుభయం వంటి చికాకులు ఎదుర్కొంటారు.అలాగే, జన్మరాశికి 4,8, 10 స్థానాల్లో శని సంచరిస్తున్నప్పుడు అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషకారకమే. అర్ధాష్టమ శని.. జన్మరాశి నుంచి నాలుగో రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి. అష్టమశని... జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి. అనారోగ్య సూచనలు వంటి ఫలితాలు ఉంటాయి. దశమ శని..జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి.అయితే జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు, గోచారంలో గురు బలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాధించడు. ఈదోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకాలు, జపాదులు చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. -
వ్యాపారాలకు గుజరాత్ టాప్..
రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ - 13వ స్థానంలో తెలంగాణ - వ్యాపారాలకు అనువైన రాష్ట్రాలపై ప్రపంచ బ్యాంక్ నివేదిక న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాలకు అనువైన రాష్ట్రాల్లో గుజరాత్ అగ్రస్థానంలో నిల్చింది. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం, జార్ఖండ్ మూడో స్థానం దక్కించుకున్నాయి. తెలంగాణ 13వ స్థానంలో ఉంది. రాష్ట్రాలు అమలు చేస్తున్న వ్యాపార సంస్కరణలను మదింపు చేస్తూ పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ), పరిశ్రమల సమాఖ్యలు సీఐఐ, ఫిక్కీ.. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీతో కలిసి ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వ్యాపారాలకు అనువైన రాష్ట్రాల జాబితాలో మిజోరం, జమ్మూ కశ్మీర్, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ అట్టడుగున ఉన్నాయి. టాప్ 5 రాష్ట్రాల్లోని నాలుగింటిలో బీజేపీ ప్రభుత్వాలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మిత్రపక్షం టీడీపీ అధికారంలో ఉండటం గమనార్హం. దేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం కల్పించడం ఈ కసరత్తు వెనుక ప్రధానోద్దేశం. స్థల కేటాయింపులు, కార్మిక సంస్కరణలు, పర్యావరణ అనుమతులు, వ్యాపారాల ఏర్పాటుకు పరిస్థితులు, ఇన్ఫ్రా తదితర ఎనిమిది అంశాల ప్రాతిపదికన 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్‌లు ఇచ్చింది. డీఐపీపీ, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు రూపొందించుకున్న 98 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక జనవరి 1 నుంచి జూన్ 30 మధ్య దాకా అమలైన తీరును కూడా ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు.. ప్రణాళికలోని అంశాలను సగ భాగం పైగా అమలు చేశాయి. అయితే, చాలామటుకు రాష్ట్రాలు ఇంకా చాలా ప్రణాళికలు అమలు చేయాల్సి ఉందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. టాప్ టెన్ జాబితాలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ చోటు దక్కించుకున్నాయి. తమిళనాడు 12వ స్థానంలో, కేరళ 18వ స్థానంలో నిల్చాయి. రాష్ట్రాలు సంస్కరణల అమలు దిశగా ముందుకెడుతున్నాయన్నది నివేదిక ద్వారా వెల్లడైందని డీఐపీపీ అదనపు కార్యదర్శి శత్రుఘ్న సిన్హా తెలిపారు. భారత్‌లో వ్యాపారం కష్టమే.. వ్యాపారాల నిర్వహణ భారత్‌లో కష్టమేనని, అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని నివేదికలో వరల్డ్ బ్యాంక్ కంట్రీ డెరైక్టర్ ఒనో రుహల్ నివేదిక ముందు మాటలో తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసికట్టుగా సంస్కరణలు అమలు చేయాలని పేర్కొన్నారు. నియంత్రణలు ఎక్కువగా ఉండటం భారత్‌లో వ్యాపారాలపై భారంగా మారుతోందని దీనివల్లే వ్యాపారాలకు అనువైన 182 దేశాల జాబితాలో భారత్ దాదాపు అట్టడుగున 142వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. నిర్మాణ అనుమతులు వంటి అంశాల్లోనైతే ఏకంగా అట్టడుగు పది దేశాల్లో ఉందన్నారు. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు పరిస్థితులు మెరుగుపడేందుకు తోడ్పడగలవని ఆయన అభిప్రాయపడ్డారు. -
వ్యాపారంలోనూ మన క్రికెటర్ల జోరు
కాదేదీ వ్యాపారానికి అనర్హం... భారత క్రికెటర్లకు ఈ విషయం బాగా తెలుసు. తమకు తెలిసిన విద్యతో పాటు తెలియని విద్యలోనూ వ్యాపారాలు చేయడంలో మనోళ్లు పండిపోయారు. క్రికెట్ అకాడమీలు, రెస్టారెంట్లు, సెలూన్లు, దుస్తులు, స్కూళ్లు... ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల వ్యాపారాల్లో ఎవరో ఒకరు ఓ చేయి వేస్తున్నారు. రిటైరైన వాళ్లే కాదు. ఇంకా ఆటలో కొనసాగుతున్న వాళ్లు కూడా ఇందులో ఉన్నారు. తమకున్న క్రేజ్ ఆ వ్యాపారానికి జతకావడంతో దాదాపుగా అందరూ సక్సెస్ అయ్యారు.... అవుతున్నారు కూడా..! మన దేశంలో సినిమా స్టార్స్‌కు దీటుగా సంపాదించేది క్రికెటర్లు. ధోని, కోహ్లి లాంటి వాళ్లయితే సినిమా స్టార్స్‌ను మించి సంపాదిస్తారు. భారత జట్టు తరఫున ఒక్కసారి ఆడితే చాలు కావలసినంత డబ్బు. రంజీ క్రికెటర్లే బోలెడు సంపాదిస్తుంటే... ఏడేళ్లుగా ఐపీఎల్ నుంచి వస్తున్న డబ్బు గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. చాలామంది క్రికెటర్లు తమకు వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే, కొంతమంది షేర్ మార్కెట్‌నూ ఓ పట్టుపడుతున్నారు. వందలాది మంది భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లలో నేరుగా వ్యాపారం చేసే వాళ్లు తక్కువే. రిస్క్ తీసుకోకుండా ఎక్కడో భవనాలు, స్థలాలు కొనేవాళ్ల సంఖ్యే ఎక్కువ. మైదానంలో సక్సెస్ఫుల్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకుని, ఎండార్స్‌మెంట్స్‌తో ఎడాపెడా సంపాదిస్తూ, వ్యాపారంలోనూ రాణిస్తున్న కొందరిపై ఓ లుక్కేద్దాం. -సాక్షి క్రీడావిభాగం ఎం.ఎస్.ధోని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్ తనది. క్రీడాకారుల ఎండార్స్‌మెంట్స్‌ను పర్యవేక్షించే రితీ స్పోర్ట్స్ అనే సంస్థలో ధోని భాగస్వామి. స్పోర్ట్స్‌ఫిట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జిమ్‌లు ఏర్పాటు చేశాడు. కేవలం భారత్‌కే పరిమితం కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో కూడా ఈ వ్యాపారాన్ని విస్తరించబోతున్నారు. ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ లీగ్‌లో చెన్నయిన్ జట్టులో భాగస్వామి. ఇండియన్ హాకీ లీగ్‌లో రాంచీ రేస్ జట్టులో వాటా ఉంది. బైక్ రేసింగ్ సూపర్ స్పోర్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మహీ రేసింగ్ టీమ్‌లోనూ వాటా ఉంది. క్రికెట్ అకాడమీ త్వరలో ప్రారంభించబోతున్నాడు. కపిల్‌దేవ్ దశాబ్దన్నర క్రితమే కపిల్‌దేవ్ చండీగఢ్‌లో రెస్టారెంట్స్ ప్రారంభించారు. జికామ్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీలో వాటా ఉంది. దేవ్ మస్కో లైటింగ్ పేరుతో స్టేడియాలలో ఏర్పాటు చేసే ఫ్లడ్‌లైట్లు తయారు చేస్తున్నారు. జహీర్ ఖాన్ రెస్టారెంట్స్, అనిల్ కుంబ్లే టెక్నాలజీ కంపెనీ, రైనాకు హాకీ జట్టులో వాటా, సెహ్వాగ్ స్కూల్స్, రెస్టారెంట్స్... ఇలా దాదాపు ప్రముఖ క్రికెటర్లంతా ఏదో ఒక చిన్నా చితకా వ్యాపారం చేస్తూనే ఉన్నారు. క్రికెటర్లగా వీళ్లకు ఉండే ఇమేజే తొలి పెట్టుబడి. చాలా వ్యాపారాల్లో క్రికెటర్లు డబ్బు పెట్టరు. వేరే ఎవరో పెట్టుబడి పెడితే, వీళ్లు ఆ వ్యాపారం అభివృద్ధి కోసం తమ బ్రాండ్ ఇమేజ్ను ఇవ్వడం ద్వారా వాటా తీసుకుంటారు. మొత్తం మీద క్రికెటర్‌గా మైదానంలో పరుగుల వరద పారిస్తే... వ్యాపారంలోనూ కాసుల వర్షమే..! విరాట్ కోహ్లి ధోని బాటలోనే జిమ్‌ల వ్యాపారంలోకి వచ్చాడు. చిసెల్ పేరుతో దేశవ్యాప్తంగా జిమ్‌ల చెయిన్ ఏర్పాటు చేశారు. ఫుట్‌బాల్‌లో ఐఎస్ఎల్ లీగ్‌లో గోవా జట్టులో వాటా ఉంది. అలాగే ఆన్లైన్ బట్టల వ్యాపారం చేస్తున్నాడు. రాగన్ పేరుతో కోహ్లి కంపెనీ దుస్తులు మార్కెట్లో ఉన్నాయి. సునీల్ గవాస్కర్ దేశంలో క్రీడలతో సంబంధం ఉన్నవాళ్లందరికీ సుపరిచితం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ (పీఎంజీ). క్రీడాకారుల మార్కెటింగ్ వ్యవహారాలు చూడొచ్చని తొలుత నేర్పింది గవాస్కర్. 1985 నుంచి ఈ కంపెనీ ఉంది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో ముంబై జట్టులో వాటా ఉంది. సచిన్ టెండూల్కర్ రెస్టారెంట్స్, క్రీడాపరికరాలు, దుస్తులు ఇలా అనేక వ్యాపారాల్లో సచిన్‌కు వాటాలు ఉన్నాయి. ముసాఫిర్ ట్రావెల్ పోర్టల్, స్మాష్ ఎంటర్టైన్మెంట్, ఎస్డ్రైవ్ సచ్ హెల్త్‌కేర్ ఉత్పత్తులు, యూనివర్సల్ కలెక్టబిలియా పేరుతో సెలబ్రిటీస్ మర్కండైజ్ ఇలా రకరకాల వ్యాపారాల్లో తన చేయి ఉంది. ఐఎస్ఎల్లో కొచ్చి జట్టులో వాటా, అంతర్జాతీయ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ జట్టులో వాటా ఉన్నాయి. యువరాజ్ సింగ్ యువీకెన్ వెంచర్స్ పేరుతో రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. తాజాగా వ్యోమో అనే యాప్‌లో డబ్బులు పెట్టాడు. స్మార్ట్‌ఫోన్ ద్వారా తమ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో బ్యూటీ ప్రొఫెషనల్స్‌కు ఈ యాప్ ద్వారా నేర్పిస్తారు. పలు నగరాల్లో క్రికెట్ అకాడమీలు కూడా ప్రారంభించాడు. రాబిన్ ఉతప్ప రెండేళ్ల క్రితమే ఐటిఫిన్ అనే సంస్థను బెంగళూరులో స్థాపించాడు. బ్రౌన్ రైస్, రోటీస్‌తో కూడిన లంచ్ బాక్స్‌ను సాఫ్ట్వేర్ నిపుణులకు ఈ సంస్థ ఇస్తుంది. నెలకు రూ. 2000 తీసుకుని లంచ్ అందిస్తారు. ఈ సంస్థకు బెంగళూరులో మంచి ఇమేజ్ వచ్చింది. సౌరవ్ గంగూలీ గంగూలీకి కుటుంబ వ్యాపారాలు ఉన్నాయి. అయినా తను సొంతంగా విద్యకు సంబంధించిన వ్యాపారం భారీ ఎత్తున చేసే ప్రణాళికలో ఉన్నాడు. ఇందుకోసం ఐఐఎమ్ గ్రాడ్యుయేట్‌ను ఇప్పటికే తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఐఎస్ఎల్ ఫుట్‌బాల్‌లో కోల్‌కతా జట్టుకు సహ యజమాని. 3డి ప్రింటింగ్లోనూ గంగూలీ వ్యాపారం చేస్తున్నాడు. -
కోటీ పడగలరా?
కోట్లకు పడగలెత్తిన ఈ మహిళలతో మగవాళ్లు పోటీపడగలరా? మహిళల్ని ‘ఆకాశంలో సగం’ అంటారు. మరి అవకాశాల్లో? సగంలో సగం, ఆ సగంలో సగమైనా మహిళలకు అందుబాటులో లేవు. అయినప్పటికీ అందివచ్చిన అవకాశాలతోనే తమ సత్తాను చాటుకుంటున్నారు మహిళలు. భర్త సంపాదనను కుటుంబఅవసరాలకు అనుగుణంగా సర్దడమే కాదు... అవసరమైన చోట ఆ సంపాదనా బాధ్యతనూ తీసుకుంటున్నారు. ఇంటి నిర్వహణలో తమ సాటి లేదని ఎలా నిరూపించుకుంటున్నారో... పెద్ద పెద్ద వ్యాపారాల్లోనూ తమకు పోటీ లేని సమర్థులుగా నిలుస్తున్నారు. ఆ నైపుణ్యం ఇవాళ ఎంతోమంది మహిళామణులను భారీ శాలరీ అందుకుంటున్న వారి జాబితాలో చేర్చింది. సాధారణంగా.. పెద్ద హోదాలో ఉన్న వారి జీతాలను ఏడాదికి లెక్కేస్తారు. పురుషులతో పోలిస్తే సాధారణ హోదాలలో స్త్రీల జీతభత్యాలు కొంత తక్కువగానే ఉన్నప్పటికీ, అత్యున్నత స్థాయిలో... పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలుగా, సీఎండీలుగా, చైర్పర్సన్లుగా భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారు. వివిధ బిజినెస్ జర్నల్స్, మ్యాగజీన్స్ జరిపిన సర్వేలను బట్టి అత్యధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తున్న తొలి పది మంది భారతీయ మహిళల జీతాలు ఏ రేంజ్లో ఉన్నాయో మీరే చూడండి. (గత ఆర్థిక సంవత్సరాన్ని అనుసరించి). కావేరీ కళానిధి మీడియా టైకూన్ కళానిధి మారన్ భార్య. జీతం రు.59 కోట్ల 89 లక్షలు. నిజానికి ఇది తగ్గిన జీతం. అంతకుముందు ఏడాది కావేరి పే ప్యాకెట్ 72 కోట్ల రూపాయలు. సన్ గ్రూపులోనే కాకుండా స్పైస్ జెట్ లిమిటెడ్ చైర్మన్‌గా, ఆ సంస్థకే నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా కావేరి పని చేస్తున్నారు. రేణు సూద్ కర్నాడ్ హెచ్.డి.ఎఫ్.సి. మేనేజింగ్ డెరైక్టర్. ప్రాడక్ట్ డెవలప్మెంట్, స్ట్రాటెజీ, బడ్జెడ్ అంశాలలో ఆమె కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య రంగ వ్యవహారాలలో నిపుణురాలిగా ప్రఖ్యాతిగాంచారు. జీతం రూ.7,16,19,159 ఉర్వి ఎ పిరమల్ అశోక్ పిరమల్ గ్రూపు చైర్పర్సన్. 32 ఏళ్ల వయసులో 1948 లో ఊర్వి తమ కుటుంబ వ్యాపారంలోకి వచ్చారు. వ్యాపార విభజన తర్వాత తనకు, తన కొడుకులకు వాటాగా వచ్చిన డయింగ్ టెక్స్టైల్ మిల్లును, రెండు ఇంజినీరింగ్ కంపెనీల బాధ్యతలను స్వీకరించారు. ఆమె జీతం రూ.7,03,00,000. చందా కొచ్చర్ ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు ఎండీ, సీఈవో. పదేళ్లుగా ఫోర్బ్స్ ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్’ లిస్టులో ఉంటున్నారు. ఇండియాలోని రిటైల్ బ్యాంకింగ్ సెక్టారును చక్కగా మలచడంలో చందా విశేషమైన పాత్ర పోషించారు. ఐ.సి.ఐ.సి.ఐ. అభివృద్ధిలో కూడా ఆమెదైన ముద్ర కనిపిస్తుంది. కొచ్చర్ జీతం రూ.5,22,82,644. సునీతారెడ్డి అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్. ఆర్థిక వ్యవహారాలలో దిట్ట. ప్రపంచబ్యాంకు ప్రశంసించే విధంగా ‘అపోలో రీచ్ హాస్పిటల్స్ మోడల్’కు నేతృత్వం వహించారు. ఆమె జీతం రూ. 5,18,40,000 ప్రీతారెడ్డి అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజస్ మేనేజింగ్ డెరైక్టర్. హెల్త్ కేర్ రంగంలో సారథ్య సంస్థగా అపోలోను నడిపిస్తున్నారు. అపోలో, భారత ప్రభుత్వం కలిసి సంయుక్తంగా ఆరోగ్య సేవలను అందించేందుకు గాను ‘నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్’ (ఎన్.ఎ.బి.హెచ్) ను ఏర్పాటు చేశాయి. ప్రీతారెడ్డి జీతం రూ. 5,11,10,000. వినీతా సింఘానియా జె.కె.లక్ష్మి సిమెంట్ మేనేజింగ్ డెరైక్టర్. సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. భర్త శ్రీపతి సింఘానియా హఠాన్మరణంతో ఆమె 1998లో బిజినెస్‌లోకి వచ్చారు. వినీత నేతృత్వంలో కంపెనీ లాభాల బాటలో నడిచింది. బాధ్యతలు స్వీకరించిన ఐదేళ్లలోనే కంపెనీ టర్నోవర్‌ను ఆమె 100 నుంచి 450 కోట్లకు పెంచగలిగారు! వినీత జీతం రూ.4,39,73,000. వినీతా బాలి బ్రిటానియా ఇండస్ట్రీస్ సీఈవో. టాప్ 50 బిజినెస్ ఉమెన్‌లో ఒకరిగా నిలిచారు. ఫోర్బ్స్ లీడర్షిప్ అవార్డును పొందారు. ఆమె జీతం రూ. 4,10,83,742 శోభనా భార్తియా రాజ్యసభ మాజీ సభ్యురాలు. ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ గ్రూపు చైర్ పర్సన్, ఎడిటోరియల్ డెరైక్టర్. తండ్రి కె.కె.బిర్లా నుండి ఆమె ఈ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించారు. ఆ సమయంలో పెద్దగా లాభాల్లో లేని ఆ సంస్థను శోభన తన సామర్థ్యంతో లాభాల్లోకి తెచ్చారు. ఆమె జీతం రూ. 2,68,80,000. కిరణ్ మజుందార్ షా బయోకాన్ లిమిటెడ్ సీఎండీ. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులైన తొలి వంద మంది మహిళల్లో షా ఒకరు. విజ్ఞాన, రసాయన శాస్త్ర రంగాలలో విశిష్టమైన సేవలు అందించినందుకు షా ‘ఓత్మర్ గోల్డ్ మెడల్’ ను కూడా పొందారు. ఫోర్బ్స్ మ్యాగజీన్ అయితే తనకు తానుగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళ అని షాను కీర్తించింది. ఈమె జీతం రూ. 1,63,47,463. -
ఎండల్లో హాయ్‌హాయ్
⇒ మండే వేసవిలో రక్షణ కవచాలు రోజురోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. బయటికి రావాలంటే భయపడుతున్నారు. వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు కొందరు శీతల పానీయాలతో సేద తీరుతున్నారు. మరికొందరు ఆరోగ్యాన్నిచ్చే పుచ్చకాయలు, కొబ్బరినీళ్లను తీసుకుంటున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారాలు వడదెబ్బ తగలకుండా ముఖానికి స్కార్ఫ్‌లు, కల్లజోళ్లు, టోపీలను వినియోగిస్తున్నారు. కళ్లజోళ్లు రూ.100 నుంచి రూ.150 వరకూ దొరుకుతున్నాయి. టోపీలు, స్కార్ఫ్‌లు కూడా ఇంచుమించు ఇదే ధరకు లభ్యమవుతున్నాయి. టోపీలు, కళ్లజోళ్లమ్మే స్టాళ్లు, పుచ్చకాయలు, కొబ్బరి బొండాలమ్మే దుకాణాలు వెలుస్తున్నాయి. సామాన్యుడి ఫ్రిజ్ కుండకు కూడా డిమాండ్ పెరిగింది. నీళ్లు ముంచుకోడానికి ఇబ్బంది లేకుండా కుండకు టాప్‌ను అమర్చి విక్రయిస్తున్నారు. ఒక్కో కుండ ధర రూ.150 నుంచి రూ.250 వరకూ ఉంటుంది. వీటిని ఎక్కువగా ఇసుక మట్టి, గట్టి మట్టితో తయారు చేస్తారు. వీటిలో ఇసుక మట్టి (ఎర్ర కుండ)తో చేసే కుండకే గిరాకీ ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువగా కృష్ణాజిల్లా వీరవల్లి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి పట్టణాల్లో విక్రయిస్తున్నారు - ఏలూరు(వన్ టౌన్) -
సేవా పన్నుల మోత
14 శాతానికి సర్వీస్ ట్యాక్స్ పెంపు న్యూఢిల్లీ: వేతన జీవులకు ఆదాయ పన్ను పరంగా పెద్ద ఊరటనివ్వని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. సేవా పన్నుల పెంపు ద్వారా అందరిపైనా మరింత భారం మోపారు. ప్రస్తుతం 12.36 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్, విద్యా సెస్సును కలిపి మొత్తం రౌండ్ ఫిగరు 14 శాతం చేశారు. దీంతో ఇకపై రెస్టారెంట్లలో తిన్నా, హోటళ్లలో ఉన్నా, విమాన ప్రయాణాలు చేసినా, బ్యూటీ పార్లర్లకెళ్లినా మరింత అధికంగా చెల్లించాల్సి రానుంది. ఇక కేబుల్.. డీటీహెచ్ సేవలు, కొరియర్ సర్వీసులు, క్రెడిట్..డెబిట్ కార్డు సంబంధిత సేవలు, దుస్తుల డ్రై క్లీనింగ్ మొదలైనవి కూడా భారం కానున్నాయి. మరోవైపు, స్టాక్ బ్రోకింగ్, అసెట్ మేనేజ్మెంట్, బీమా సేవలతో పాటు ఇతరుల నుంచి పొందే చాలా మటుకు సర్వీసులు ప్రియం కానున్నాయి. అయితే, కొన్ని ఉత్పత్తుల ప్రీ కూలింగ్, రిటైల్ ప్యాకింగ్, లేబులింగ్ మొదలైన వాటిని సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయించడంతో ప్యాకేజ్డ్ ఫ్రూట్స్, కూరగాయల రేట్లు కొంత తగ్గనున్నాయి. పేషెంట్లకు అందించే అంబులెన్స్ సర్వీసులను సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఇక, మ్యూజియాలు, జూ, వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు మొదలైన వాటి సందర్శకులకు కూడా సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, అమ్యూజ్మెంట్ పార్కులు.. థీమ్ పార్కులు లాంటి వాటిని సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి తేవడంతో వీటిని సందర్శించడం మరికాస్త ఖరీదైన వ్యవహారం కానుంది. లాటరీ టికెట్లను సేవా పన్ను పరిధిలోకి చేర్చడంతో ఇకపై వీటి ధరలు పెరగనున్నాయి. ధూమపాన ప్రియులకు వాత..: ఎప్పటిలాగానే ఈ బడ్జెట్లో కూడా పొగాకు ఉత్పత్తుల వినియోగదారులకు వాత తప్పలేదు. ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు ఆర్థిక మంత్రి. 65 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పొడవుండే సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 25 శాతం మేర, మిగతా వాటిపై 15 శాతం మేర పెంచారు. ఇక ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ. 1,000కి పెంచడంతో సిమెంటు రేట్లు మరింత పెరగనున్నాయి. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్‌లు మొదలైన వాటిపైనా సుంకాన్ని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. అలాగే ఫ్లేవర్డ్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ వాటర్ సైతం మరింత ప్రియం అవుతాయి. ఫోన్ బిల్లులూ భారం..: సర్వీస్ ట్యాక్స్ పెంపు భారాన్ని టెలికం కంపెనీలు వినియోగదారులకు బదలాయించనుండటంతో ఇకపై ఫోన్ బిల్లులూ భారం కానున్నాయి. దీనివల్ల బిల్లులు అరశాతం మేర పెరగవచ్చని జీఎస్ఎం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ తెలిపారు. కొంత ఊరట..: దేశీయంగా తయారు చేసే మొబైల్ ఫోన్లు, ఎల్ఈడీ/ఎల్సీడీ ప్యానెల్స్, ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ ల్యాంప్స్‌పైనా ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ధరలు తగ్గనున్నాయి. వివిధ పరికరాలపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో రిఫ్రిజిరేటర్లు, సోలార్ వాటర్ హీటర్ల ధరలు తగ్గనున్నాయి. అగర్‌బత్తీలపై సుంకాన్ని ఎత్తేయడంతో చవకగా లభించనున్నాయి. 20 వేల కోట్లతో ముద్ర బ్యాంక్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణసౌకర్యం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను ప్రోత్సహించడానికి ప్రాథమికంగా రూ. 20 వేలకోట్ల కార్పస్ నిధితో ముద్ర బ్యాంక్ (మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ఈ బడ్జెట్లో ప్రకటించింది. ఇందులో రూ.3వేల కోట్ల మేర కార్పస్ నిధిని క్రెడిట్ గ్యారంటీకింద కేటాయిస్తారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఈ ఆర్థిక సంస్థద్వారా మైక్రోఫైనాన్స్ సంస్థలకు రీఫైనాన్స్ చేస్తారు. వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకు రుణసౌకర్యం కల్పిస్తారు. రుణాల మంజూరులో చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు నడిపే ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో 5.77 కోట్ల చిన్నతరహా వ్యాపార యూనిట్లు ఉన్నట్లు గుర్తించామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వీటిలో సుమారు 62 శాతం మేర ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల చేతిలోనే ఉన్నాయని, అందులోనూ వ్యక్తిగతంగా నడిపేవే ఎక్కువని తెలిపారు. అయితే వీరు తమ వ్యాపార అవసరాలకోసం డబ్బు కొరత ఎదుర్కొంటున్నారని, ఇతర మార్గాలను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీరిని ఆదుకునేందుకే ముద్ర బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. -
చిరు వ్యాపారులకు చుక్కలు
ప్రొద్దుటూరు టౌన్: రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారికి (స్ట్రీట్ వెండర్స్‌కు) మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూపులు తప్పడం లేదు. రోడ్లపై పండ్లు, పూలు, బట్టలతోపాటు వివిధ రకాల సరుకులు, వస్తువులు తోపుడు బండ్లపై, గంపల్లో పెట్టుకుని విక్రయించే వ్యాపారులను స్థానిక మున్సిపాలిటీలు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశాలు కేటాయించాలన్నది ఉద్దేశం. తద్వారా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నది లక్ష్యం. అయితే ఈ నిర్ణయంపై 2009 నుంచి సర్వేల పేరుతో కాలయూపన సాగుతోంది. సర్వేలో మెప్మా సీఓలు, ఆర్పీలు పాల్గొని నివేదికలు కూడా తయారు చేసి అధికారులకు ఇచ్చారు. వీరికి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కూడా సూచనలు ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది వారి పేర్లను మున్సిపాలిటీల్లోని మెప్మా సెంటర్లలో నమోదు చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి సర్వేలు చేసి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అయితే స్థలాలు గుర్తించి వారికి కేటాయించడం ఎప్పటికి పూర్తి అవుతందనేది అంతుచిక్కని విషయంగా మారింది. కడప జిల్లాలో సర్వే ఇలా... జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల పరిస్థితి చూస్తే కడపలో 2708 మందిని గుర్తించి వారిలో 502 మందికి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అలాగే బద్వేలులో 519కి 100 మందకి ఐడీ కార్డులు, జమ్మలమడుగులో 835కు 107 మందికి, మైదుకూరులో 235కి 108 మందికి, ప్రొద్దుటూరులో 1416లో 182కు, పులివెందులలో 710లో 132కి, రాజంపేటలో 401లో 70కి, రాయచోటిలో 805లో 385కి, ఎర్రగుంట్లలో 133లో 127కి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో శనివారం వరకు 1,42,202 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నట్లు ఆన్లైన్లో పొందు పరిచారు. కాగా అందులో 1,06,679 మంది పూర్తి వివరాలు లేవు. కంప్యూటర్లో మాత్రమే చూపుతున్నారు. పేరుకే లక్షకు పైగా స్ట్రీట్ వెండర్స్‌ని గుర్తించామని ఉన్నా అవన్నీ కాకి లెక్కలేనని స్పష్టంగా తెలుస్తోంది. ఐడీ కార్డులు సిద్ధం చేసిన వారందరూ 2013-14లో సర్వే చేసిన వారే... ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తరువాత ప్రొద్దుటూరు టౌన్: రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారికి (స్ట్రీట్ వెండర్స్‌కు) మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూపులు తప్పడం లేదు. రోడ్లపై పండ్లు, పూలు, బట్టలతోపాటు వివిధ రకాల సరుకులు, వస్తువులు తోపుడు బండ్లపై, గంపల్లో పెట్టుకుని విక్రయించే వ్యాపారులను స్థానిక మున్సిపాలిటీలు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశాలు కేటాయించాలన్నది ఉద్దేశం. తద్వారా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నది లక్ష్యం. అయితే ఈ నిర్ణయంపై 2009 నుంచి సర్వేల పేరుతో కాలయూపన సాగుతోంది. సర్వేలో మెప్మా సీఓలు, ఆర్పీలు పాల్గొని నివేదికలు కూడా తయారు చేసి అధికారులకు ఇచ్చారు. వీరికి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కూడా సూచనలు ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది వారి పేర్లను మున్సిపాలిటీల్లోని మెప్మా సెంటర్లలో నమోదు చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి సర్వేలు చేసి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అయితే స్థలాలు గుర్తించి వారికి కేటాయించడం ఎప్పటికి పూర్తి అవుతందనేది అంతుచిక్కని విషయంగా మారింది. కడప జిల్లాలో సర్వే ఇలా... జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల పరిస్థితి చూస్తే కడపలో 2708 మందిని గుర్తించి వారిలో 502 మందికి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అలాగే బద్వేలులో 519కి 100 మందకి ఐడీ కార్డులు, జమ్మలమడుగులో 835కు 107 మందికి, మైదుకూరులో 235కి 108 మందికి, ప్రొద్దుటూరులో 1416లో 182కు, పులివెందులలో 710లో 132కి, రాజంపేటలో 401లో 70కి, రాయచోటిలో 805లో 385కి, ఎర్రగుంట్లలో 133లో 127కి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో శనివారం వరకు 1,42,202 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నట్లు ఆన్లైన్లో పొందు పరిచారు. కాగా అందులో 1,06,679 మంది పూర్తి వివరాలు లేవు. కంప్యూటర్లో మాత్రమే చూపుతున్నారు. పేరుకే లక్షకు పైగా స్ట్రీట్ వెండర్స్‌ని గుర్తించామని ఉన్నా అవన్నీ కాకి లెక్కలేనని స్పష్టంగా తెలుస్తోంది. ఐడీ కార్డులు సిద్ధం చేసిన వారందరూ 2013-14లో సర్వే చేసిన వారే... ఇటీవల సుప్రీం కోర్డు ఆదేశాలు జారీ చేసిన తరువాత సర్వే నిర్వహించిన వారికే ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అధికారుల వద్ద, ప్రభుత్వం వద్ద కేవలం 35,523 మంది వివరాలే ఉన్నాయి. గతంలో కేవలం గుర్తింపు పేరుతో నామమాత్రపు సర్వేలు చేశారే తప్ప వారి నుంచి పూర్తి వివరాలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఏళ్లు గడుస్తుండటంతో నమోదు చేసుకున్న వారు ఎక్కడ ఉన్నారన్న సమాచారం కూడా లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో స్థలాలు ఎక్కడా... ప్రస్తుతం గుర్తించిన వారికన్నా స్థలాలు ఇచ్చేందుకు మున్సిపాలిటీల్లో కసరత్తు జరగడం లేదు. కనీసం స్థలాలు ఉన్నాయా అంటే అవీలేవు. ఉన్న స్థలాలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. అయినా మున్సిపల్ కమిషనర్లు కానీ, టౌన్‌ప్లానింగ్ అధికారులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా అన్న అనుమానం వ్యాపారులను పీడిస్తోంది. కేవలం ఎదురు చూపులు, పోలీసు వేధింపులు తప్ప తమకు ఎలాంటి న్యాయం జరగదన్నది వ్యాపారుల వాదన. -
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించాల్సిందే
జీహెచ్ఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణల తొలగింపు, నిరోధానికి ఇప్పటికే పలు ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, ఈసారి గట్టిగా స్పందించింది. వివిధ రకాల వస్తువులతో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న వారిని ఖాళీ చేయాలంటూ హెచ్చరిక చేయాలని, ఒకవేళ వినకుంటే, వారి వస్తువులను స్వాధీనం పరచుకొని వాటిని బహిరంగ వేలంలో విక్రయించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు అవసరమైతే పోలీసుల సాయం కూడా తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గతవారం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సిద్ధి అంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలు ఇచ్చినా అవి కొనసాగుతుండడాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తించింది. దీనిపై జీహెచ్ఎంసీ వివరణ కోరింది. ఈ కేసును సంక్రాంతి సెలవుల తరువాత తిరిగి విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. -
తడవాల్సిందే..!
అధ్వానంగా రైతుబజారులు వర్షం వస్తే నీటిలోనే వ్యాపారాలు అల్లాడుతున్న రైతులు, వినియోగదారులు విజయవాడ : జిల్లాలోని అన్ని రైతుబజార్లలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. నిధులు మంజూరైనా అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అధ్వానంగా మారాయి. రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు, వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఎండకు అల్లాడిన రైతులు ఇప్పుడు వర్షాలకు నానుతున్నారు. చిన్నపాటి వర్షాలకే జిల్లాలోని పలు రైతుబజార్లు తటాకాలను తలపిస్తున్నాయి. జిల్లాలో 17 రైతుబజార్లు.. జిల్లాలో 17 రైతుబజార్లు ఉన్నాయి. విజయవాడలోనే ఐదు ఉన్నాయి. స్వరాజ్యమైదానం రైతుబజారులో స్టాల్స్ సరిపోవడం లేదు. రైతులు ప్లాట్‌ఫారాలపై వ్యాపారాలు చేసుకుంటున్నారు. అస్తవ్యస్తంగా మారిన డ్రెయినేజీ వ్యవస్థ వల్ల వర్షం కురిసినప్పుడు రైతులు, ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. పటమటలోని రైతుబజారులోనూ సరిపడా స్టాల్స్ లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మచిలీపట్నంలోని రైతుబజారులో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్టాల్స్ కూడా సరిపోవడం లేదు. గుడివాడ, ఉయ్యూరు, జగ్గయ్యపేట రైతుబజార్లలో వర్షం వ స్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కలగా మారిన కొత్త రైతుబజార్లు విజయవాడలోని రాణిగారితోట, సత్యనారాయణపురంతోపాటు గన్నవరం, కైకలూరు, పెడన, తిరువూరు, అవనిగడ్డలలో రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఐదేళ్ల నుంచి భావిస్తున్నారు. స్థల సమస్య వల్ల కార్యరూపం దాల్చడంలేదు. తిరువూరుకు ఐదేళ్ల క్రితమే రైతుబజారు మంజూరైంది. రూ.10 లక్షల నిధులు కూడా కేటాయించగా ఖర్చు చేయకపోవడంతో మురిగిపోయాయి. తిరువూరులో మూడుచోట్ల స్థలాలను పరిశీలించినా ఫలితం లేకపోయింది. కంకిపాడులోనూ రూ.8లక్షలు మంజూరైనా ఇప్పటి వరకు స్టాల్స్ నిర్మించలేదు. స్థల సమస్యవల్లే కైకలూరు, గన్నవరం, పెడన, అవనిగడ్డలలో రైతుబజారుల ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. రెవెన్యూ, మార్కెటింగ్, మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయలోపం వల్లే రైతుబజారులకు స్థలాలు లభించడం లేదని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో కలెక్టర్ దృష్టిసారించి జిల్లాలోని రైతుబజారుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొత్త రైతుబజారుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మీకొక బడ్జెట్ కావాలి
వేతన జీవులైనా..వ్యాపారస్థులు అయినా..ఆర్థికంగా ఎదగాలంటే.. అందుకు తగిన ప్రణాళిక ఉండాల్సిందే. దేశానికి, రాష్ట్రానికే కాదు.. సొంతంగా కూడా ఒక బడ్జెట్ ఉండాల్సిందే. లేకపోతే ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకుండా సతమతం కావాల్సి వస్తుంది. నిలకడగా ఆదాయం వచ్చే వేతనజీవులు కావొచ్చు.. రెగ్యులర్‌గా ఒకే మొత్తం ఆదాయం ఉండని ఫ్రీలాన్సర్లు కావొచ్చు.. బడ్జెట్‌ని రూపొందించుకోవాలి. ఇందుకోసం మూడు దశల ప్రణాళిక ఒకటుంది. అదే ఇది.. మొదటి దశ .. సాధారణంగా ప్రతి నెలా నిలకడగా ఆదాయం ఉన్నప్పుడు మనం వేసుకునే నెలవారీ బడ్జెట్ స్వరూపం ఒక రకంగా ఉంటుంది. అంటే.. మనకి వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చులను సర్దుతాం. కానీ, నిలకడైన ఆదాయం లేనప్పుడు ముందు మనకి ఖర్చులు ఎంత ఉంటాయన్నది లెక్క వేసుకుని, వచ్చే ఆదాయాన్ని వాటికి సర్దుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా మన ఖర్చులను మూడు కేటగిరీలుగా .. అంటే నిత్యావసరాలు, ప్రాధాన్యం ఇవ్వాల్సినవి, లైఫ్ స్టయిల్ ఖర్చులనీ విడగొట్టుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రాథమిక ఖర్చులు కింద పరిగణించాలి. ఇవి ప్రతి నెలా తప్పనిసరిగా చెల్లించాల్సినవి. వీటిలో ఈ కింది అంశాలు వస్తాయి. 1- ఆహారావసరాలు' హోటళ్లు, బైటి చిరుతిళ్లు మొదలైనవి కాకుండా రోజువారీ ఆహార ఖర్చులు ఎంత అవుతాయన్నది ఈ హెడ్డింగ్ కింద రాసుకోండి. మరీ కత్తెర వేసేయకుండా వాస్తవికంగా రాయండి. ఒక రెండు వారాల పాటు ఖర్చులను పరిశీలించుకుంటే.. ఎంత కేటాయించాలన్నది తెలుస్తుంది. 2- ఇంటి అద్దెలు వగైరా... కిరాయి ఇంట్లో ఉంటే నెలవారీ అద్దె, అదే గృహ రుణం తీసుకున్న పక్షంలో నెలవారీ ఈఎంఐలు మొదలైనవి ఈ లెక్కలోకి వస్తాయి. కరెంటు బిల్లులు, పన్నులు, ఇంటర్నెట్, ఫోన్ ఖర్చులు తదితరాలు ఇందులో చేర్చవచ్చు. 3- వైద్యం ఖర్చులు.. చికిత్స ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. ఏదో ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ బీమా ప్రీమియాలు, ఇతర మెడికల్ ఖర్చులను ఉజ్జాయింపుగా లెక్క వేసుకోవాలి. 4- ప్రయాణ ఖర్చులు బస్సులో ప్రయాణించేట్లయితే ఆ వ్యయాలు.. బైకు, కారు మొదలైన వాటికి సంబంధించి ఇంధనం, మెయింటెనెన్స్, ఈఎంఐలాంటివి ఏమైనా ఉంటే అవి.. ఇందులోకి చేర్చవచ్చు. ఇప్పుడు ఈ ఖర్చులన్నింటినీ కూడితే ప్రతి నెలా ఎంత ఆదాయం అవసరం అవుతుందన్నది తెలుస్తుంది. రెండో దశ.. ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఇది కాస్త సులువైనదే. ఎందుకంటే ఖర్చులు ఎంత అవుతాయన్నది ఈపాటికి అవగాహన వచ్చేస్తుంది కాబట్టి ఎంత ఆదాయం అవసరం అవుతుందన్నది అంచనా వేసుకోవచ్చు. అలాగే ఆ ఆదాయంపై పన్నులు గట్రా కట్టాల్సి వచ్చేట్లుంటే ఎంత కట్టాల్సి రావచ్చన్నది అంచనా వేసుకునేందుకు ఆన్లైన్లో సాధనాలు కూడా ఉన్నాయి. ఇదంతా ప్రతి నెలా కచ్చితంగా అవసరమయ్యే మొత్తం. దీనికి మించి అదనంగా ఆదాయం వచ్చిన పక్షంలో ముందు పొదుపు చేసేందుకు ప్రాధాన్యమివ్వాలి. అటు పైన అత్యవసర అవసరాల కోసం కొంత పక్కన ఉంచాలి. ఆ తర్వాత కూడా ఇంకా కొంత మిగిలితే అప్పుడు.. బోనస్‌గా అనుకుని లైఫ్‌స్టయిల్ అవసరాలపై ఖర్చు చేసుకోవచ్చు. మూడో దశ.. వేర్వేరు బ్యాంకు ఖాతాలు.. ఈ ప్రణాళిక అంతా సజావుగా సాగాలంటే ఒక్కో అవసరానికి ఒక్కోటిగా వేర్వేరు ఖాతాలు ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యాపార అవసరాలకు.. ఆదాయం కింద వచ్చే చెక్కులు, చెల్లింపులు మొదలైనవి డిపాజిట్ చేసుకునేందుకు ఈ ఖాతా ఉపయోగపడుతుంది. ఇందులో నుంచి ప్రతి నెలా కీలకమైన మూడు ఖాతాల్లోకి నగదు బదలాయించవచ్చు. ఆ మూడు ఖాతాలు.. వ్యక్తిగత అవసరాలు.. బిల్లులు, నిత్యావసరాలు మొదలైన ఖర్చులకు సంబంధించిన చెల్లింపుల కోసం ఈ ఖాతాలో డబ్బును ఉపయోగించవచ్చు. బోనస్‌గా అనుకునే డబ్బును కూడా ఈ ఖాతాలోకి మళ్లించి.. ఇతరత్రా లైఫ్‌స్టయిల్ ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. ప్రాధాన్యత అవసరాల కోసం పొదుపు.. నెల వారీగా గాకుండా.. మూణ్నెల్లకో, ఆర్నెల్లకో, ఏడాదికో ఒకసారి చెల్లించాల్సినవి కొన్ని ఉంటాయి. ఆదాయ పన్ను, ఆస్తి పన్నులు, బీమా మొదలైన వాటి చెల్లింపుల కోసం.. అలాగే పిల్లల విద్యావసరాల కోసమో కొత్తగా కొనాలనుకుంటున్న ఇంటి డౌన్‌పేమెంట్ కోసమో డబ్బు దాచాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ ఖాతాను ఉపయోగించుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల కోసం.. ప్రతి నెలా ప్రాథమిక ఖర్చులు, పొదుపు డబ్బు తీసేయగా.. మిగిలిన దాన్ని ఈ ఎమర్జెన్సీ ఖాతాలోకి మళ్లించవచ్చు. ఇందులో ఎప్పుడూ కనీసం ఆరు నెలల ఆదాయ పరిమాణం ఉండేట్లు చూసుకుంటే మంచిది. ఈ ఖాతాలో డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకు.. అకస్మాత్తుగా ఉద్యోగం పోయినా ఇంటి అద్దెలు, బిల్లులు కట్టక తప్పదు. అనారోగ్యం పాలైతే చికిత్స కోసం ఖర్చు పెట్టాల్సిందే. ఇంటి రిపేర్లు రావొచ్చు, అనుకోని వ్యయాలు ఎదురు కావొచ్చు. ఇలాంటివాటి కోసం మాత్రమే ఈ ఖాతాని ఉపయోగించాలి. ఎవరికి వారు తమ తమ అవసరాలు, పరిస్థితులను బట్టి ఇందులో మార్పులు చేర్పులు చేసుకుని బడ్జెట్‌ని రూపొందించుకోవచ్చు. తద్వారా ఆదాయమార్గం ఏదైనా ఇంటి బడ్జెట్ అదుపు తప్పకుండా జాగ్రత్తపడొచ్చు. -
అనధికార వసూళ్లు
పన్నుల పేరిట మామూళ్లు మేడారం మహాజాతరపై ప్రభావం ఆకాశాన్నంటిన ధరలు.. భక్తుల జేబులకు చిల్లు రచ్చకెక్కిన శాఖల పోరు కలెక్టరేట్, న్యూస్‌లైన్ :జాతరలో చుక్కల నంటిన ధరలు.. ఏ వస్తువు కొనాలన్నా మండిపోతున్న రేట్లు.. తక్కువ రోజు ల్లో ఎక్కువ సంపాదించాలనే తపన.. దీనికితోడు శాఖల మధ్య సమన్యయం లేకపోవడంతో వ్యాపారుల నుంచి పన్నుల పేరుతో ఎవరికి వారు వసూళ్ల కు పాల్పడుతున్నారు. ఇవన్నీ భక్తులపై రుద్దుతున్నారు వ్యాపారులు.. వందల కిలో మీట ర్లు ప్రయాణం చేసిన భక్తులు మాత్రం మండిపోతున్న ధరలను చూసి వణికిపోతున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. దీం తో వ్యాపారాలు ఊపందుకున్నాయి. ముందస్తుగా ప్రారంభించిన వ్యాపారాలు బాగానే సాగుతున్నా.. ధరలు పెంచి భక్తులను ఇబ్బం దులకు గురిచేస్తున్నారు. అయితే ప్రభుత్వ శా ఖల నుంచి ఎవరికి వారు వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడడం.. ఇందులో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా చేసేవేనని తెలుస్తోంది. దీనికితోడు వ్యాపారం సాగే సమయంలో అదనుచూసి ఓ 10 మంది బ్యాడ్జీలు ధరించి గుం పుగా రావడం.. రశీదు చింపిచేతిలో పెట్టి అం దులో రాసిన కాడికి ఇవ్వాలని వ్యాపారులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది జాతరలో నిత్యకృత్యంగా మారింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వ్యాపారులు తమగోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతవుతున్నారు. గొడవకు దిగితే ఉన్న వ్యాపా రం దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇదంతా ఆలోచించి ఎందుకొచ్చిన తంటా అని అడిగిన కాడికి చేతికిచ్చి పంపుతున్నారు. ఈ వసూళ్ల వ్యవహారం వల్ల వ్యాపారులకు జరిగే లోటు ను అధిక ధరలకు అమ్మకాలు చేసి భక్తులపైనే రుద్దుతున్నారు. వ్యాపారం చేసుకునేందుకు స్థలం కిరాయి విషయంలో ముందు రెవెన్యూ వారు ధరలు నిర్ణయించి ప్లాట్లు ఇస్తారు. కొన్నిచోట్ల ఐటీడీఏ వారు ఇస్తారు. షాపులు ఏర్పాటు చేసుకున్న వారి వద్ద సంఘాల పేరు తో కొందరు, ఐటీడీఏ పేరుతో కొందరు, అట వీ, విద్యుత్, అగ్నిమాపక శాఖ పేరుతో కొంద రు వ్యాపారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. గుడారాలు వేసుకునేందుకు కలప వాడుకున్నందుకు అటవీ శాఖ, స్థలం ఇచ్చినందుకు రెవెన్యూ శాఖ డబ్బులు తీసుకుందంటే సరే.. మిగతావారి వసూళ్లకు లెక్కాపత్రం లేకుండాపోయింది. దీంతో వ్యాపారులు లాబోదిబోమంటూ ఆ భారం భక్తుల నెత్తిన వేస్తున్నారు. ఐటీడీఏ వర్సెస్ పంచాయతీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లో సం త, అంగళ్లు, జాతర జరి గినప్పుడు అక్కడ వ్యాపారాలు చేసుకునేవారి నుంచి సంబంధిత గ్రామ పంచాయతీ వారు వ్యాపార లెసై న్స్ కోసం కొంతమొత్తం డబ్బులు వసూలు చేస్తారు. ఇందుకు పంచాయతీకి పూర్తి అధికారాలు ఉంటాయి. అయితే మేడారం పెద్దజాతర.. చిన్నపంచాయతీ కావడంతో లెసైన్స్ ఫీజుల వసూళ్లపై కొంతకాలంగా అధికారులు దృష్టి పెట్టలేదు. గత ఏడా ది డీపీఓ పద్మజారాణి ఈ విషయంలో ప్రత్యేక సారించారు. సుమారు రూ.4లక్షల వరకు లెసైన్స్ ఫీజుల ద్వారా వసూలు చేశారు. ఆ డబ్బుతో ఊరట్టం పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో పైపులైన్ ఏర్పాటు చేశారు. అదేసమయంలో ఐటీడీఏ, పంచాయతీ శాఖల మధ్య వసూళ్ల వ్యవహారంలో చిచ్చురేగింది. పంచాయతీ వసూలు చేయని సమయంలో ఆ వ్యవహారం ఐటీడీఏ ఆధ్వర్యంలో అనధికారికంగా చేసి వచ్చిన డబ్బులు ‘క్యాంపు కార్యాలయం తిండి ఖర్చుల’ కింద చూపేవారు. దీనిపై పలు ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా రెండు శాఖల పంచాయితీ జాతరకు ముందే వీధికెక్కింది. కొద్ది రోజుల క్రితం మేడారంలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాలని, దీనికోసం జాతర ప్రాంగణాన్ని కొన్ని భాగాలు చేసి పంచాయతీ అధికారులు టెండర్లు పిలిచారు. అదేరోజు ఐటీడీఏ వారు జాతరలో తమకు డబ్బులు చెల్లించి దుకాణాలు పెట్టుకోవాలని ప్రకటన జారీ చేసింది. దీంతో వ్యవహారం రచ్చకెక్కింది. మొత్తంగా ఈ వ్యవహారం అంతా ప్రస్తుతం కలెక్టర్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. లెసైన్స్ ఫీజు పంచాయతీయే వసూలు చేయాలి గ్రామ పంచాయతీ పరిధిలోని దుకాణాలకు లెసైన్స్ ఫీజు వసూలు చేసే అధికార పంచాయతీలకే ఉంటుంది. ఐటీడీఏ వారు ఎందుకు వసూలు చేస్తున్నారో తెలియడంలేదు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతామన్నారు. తాము పంచాయతీ ఆదాయం వదులుకోలేం. మా పని మేం చేయాల్సిందే. ఒక్క ఊరట్టం మాత్రమే కాదు.. చుట్టు పక్కల వ్యాపారాలు సాగే అన్ని పంచాయతీల పరిధిలో లెసైన్స్ పొంది వ్యాపారం చేయాలని కోరుతున్నాం. - ఈఎస్.నాయక్, డీపీఓ -
మళ్లీ విద్యుత్ కోతలు
వరంగల్, న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా గృహావసరాలకు అధికారికంగా... వ్యవసాయ విద్యుత్‌కు అనధికారికంగా కరెంట్ కోతలు అమలు చేస్తున్నారు. గ్రామాల్లోనైతే పగలంతా విద్యుత్‌ను మరిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రిళ్లు సైతం సరఫరా నిలిపివేస్తుండడం గమనార్హం. బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్ పవర్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందనే సాకుతో విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోడ్ రిలీఫ్ కోసం కరెంట్ అధికారులు ప్రధానంగా గ్రామాలపైనే దృష్టి పెట్టి కోతల సమయూన్ని పెంచడం గమనార్హం. ఇక వరంగల్ కార్పొరేషన్లో విద్యుత్ మరమ్మతుల నెపంతో ఏరియాలను బట్టి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నారు. మునిసిపాలిటీ, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ కేంద్రాల్లో కూడా కోతలను ఒక్కసారిగా పెంచారు. అంతేకాదు... ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న వ్యవసాయ విద్యుత్‌కు సైతం కోత పెడుతున్నారు. ఈ మేరకు సర్కారు లోపాయికారిక ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఉచిత విద్యుత్‌ను 5 గంటలకే పరిమితం చేయాలని డిస్కంలకు ఆదేశాలిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ సిబ్బంది గంటలో పదిసార్లు ట్రిప్ చేస్తూ విద్యుత్‌ను ఆదా చేసే పనిలో పడ్డారు. దీంతో పొట్టకు వచ్చిన వరికి నీళ్లు పెట్టేందుకు విద్యుత్ సరఫరా సరిపోక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం కరెంట్ లేకపోగా... రాత్రిపూట వచ్చే విద్యుత్ గంటలో పదిసార్లు ట్రిప్ అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిళ్లు వ్యవసాయ బావుల వద్దే జాగారం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. గ్రామాల్లో 12 గంటలు... గ్రామాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండడం లేదు. వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ ఇచ్చినప్పుడు మూడు గంటలు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా... పొద్దంతా కరెంట్ ఉండడం లేదని గ్రామాల ప్రజలు చెబుతున్నారు. దీంతో విద్యుత్‌తో సాగే యంత్రాలు, వ్యాపారాలు మూతపడుతున్నాయి. గ్రామాల్లో రాత్రిపూట కూడా విద్యుత్ సరఫరాకు బ్రేక్ వేస్తున్నారు. లోడ్ రిలీఫ్ పేరిట అర్ధరాత్రి గంటపాటు సరఫరా నిలిపివేస్తున్నారు. మండల కేంద్రాల్లో 6 గంటలు... మండల, సబ్‌స్టేషన్ కేంద్రాల్లో ఆరు గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. మండల కేంద్రాల్లో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు... లేదా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు అనధికారికంగా విద్యుత్ సరఫరా తీసేస్తున్నారు. మునిసిపాలిటీల్లో 4 గంటలు మునిసిపాలిటీ, ముఖ్య పట్టణాల్లో 4 గంటల అధికారిక కోతలు విధిస్తున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అధికారికంగా కోతల్లేకున్నా... లైన్ల మరమ్మతులంటూ రోజుల తరబడి ఏరియాల వారీగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా అపేస్తున్నారు. త్వరలోనే అధిగమిస్తాం రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కోతలు విధించాల్సి వస్తోంది. త్వరలోనే కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తాం. - మోహన్‌రావు, ఎస్ఈ -
దసరా ఢమాల్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం జిల్లాపై తీవ్రంగా చూపుతోంది. చిన్న దుకాణాల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నింటికి పెద్ద దెబ్బ తగిలింది. వ్యాపారులకు రౌ. కోట్లలో నష్టం వాటిల్లుతోంది. రెండు నెలలుగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పండగల నెలల్లో కూడా వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. ఉద్యోగులకు జీతాలు లేకపోవడంతో వారి కుటుంబ పోషణ కష్టంగా మారింది. రోజూ నిరసనలు, ఆందోళనలు, బంద్‌లు ప్రభావం ప్రైవేటు ఉద్యోగులపై కూడా పడింది. దీంతో జిల్లాలో దసరా పండగ సందడి కనిపించడం లేదు. సాధారణంగా ఏటా దసరాకు రెండు వారాల ముందు నుంచే పండగ వాతావరణం కనిపిస్తుంటుంది. విశాఖతోపాటు జిల్లాలోని ప్రధాన జంక్షన్లు, షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కళకళలాడుతుండేవి. కానీ ఈ ఏడాది మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. పండగకు పది రోజులే ఉన్నప్పటికీ షాపింగ్ సందడి లేకుండా పోయింది. వెయ్యి కోట్లు లావాదేవీలకు దెబ్బ ఉద్యమాల కారణంగా జిల్లాలో రూ.వెయ్యి కోట్లు లావాదేవీలకు దెబ్బ తగిలినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఏటా దసరా పండగ సమయంలో ప్రధానంగా బంగారం, వస్త్ర, గృహోపకరణాల వ్యాపారం రూ.కోట్లలో జరుగుతుంది. రెండు వారాల్లో రూ.వెయ్యి కోట్లు మేర వ్యాపారం జరుగుతుందన్నది వ్యాపారుల అంచనా. కానీ ఈ ఏడాది మాత్రం 50 శాతం కూడా వ్యాపారాలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలో సుమారుగా 35 వేల మంది ఉద్యోగులకు జీతాలు లేకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏటా మాదిరిగా ఈసారి మాత్రం ఆర్భాటంగా పండగను చేసుకొనే పరిస్థితులు లేవని చెబుతున్నారు. ప్రయివేట్ ఉద్యోగులు కూడా ఈ ఏడాది ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో వ్యాపారాలు పూర్తిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. రూ.కోట్లలో నష్టాలు వాటిల్లుతున్నా సమైక్యాంధ్ర ఉద్యమంలో వ్యాపారులు కూడా పాల్గొంటున్నారు. అసోసియేషన్ల వారీగా వస్త్ర, బంగారం, చిల్లర వర్తకులు, ఇలా అన్ని రకాల వ్యాపారులు బంద్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో పెద్దగా వ్యాపారాలు జరగడం లేదు. జిల్లాలో ప్రతి చోటా ఉద్యమాలు జరుగుతుండడంతో ప్రజలు కూడా షాపింగ్‌లపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పడిపోయిన పసిడి అమ్మకాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న బంగారు, వెండి దుకాణాల్లో రోజుకు రూ.50 కోట్లకుపైగా అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ ఉద్యమాల కారణంగా వ్యాపారాలు బాగా పడిపోయిన్నట్లు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమయంలో బంగారం వ్యాపారులు సమ్మె చేయడం, ప్రస్తుతం సీజన్ లేకపోవడంతో రూ.100 కోట్లు వరకు అమ్మకాలు నిలిచిపోయాయని వర్తకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బ్రాండెడ్ బంగారు దుకాణాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రోజుకు ఆరేడు కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లుతోందని ఈ రంగంపై ఆధారపడిన వారు అంచనా వేస్తున్నారు. వెలవెలబోతున్న వస్త్ర వ్యాపారం జిల్లాలో వస్త్ర వ్యాపారం కూడా డీలాపడింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేలకుపైగా వస్త్ర వ్యాపార దుకాణాలున్నాయి. భారీ షాపింగ్ మాల్స్ సైతం ఉన్నాయి. రోజుకు రూ.5 కోట్లు వరకు అమ్మకాలు జరుగుతుంటాయి. దసరా సమయంలో రెట్టింపు వ్యాపారాలు జరుగుతాయి. ప్రస్తుతం కనీస వ్యాపారం కూడా జరగడం లేదు. దసరా దగ్గర పడుతున్నా ఇప్పటికీ వ్యాపారాలు పుంజుకోవడం లేదు. సాధారణంగా దసరా పండగకు రెండు వారాల ముందు నుంచే అన్ని షాపులు ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు భారీ స్థాయిలో ఆఫర్లు గానీ, సందడి గాని లేదు. అమ్మకాలు అంతంత మాత్రంగానే జరుగుతుండడంతో వ్యాపారులు కూడా ఆర్భాటాల ఖర్చును తగ్గించుకోవాలన్న భావనలో ఉన్నారు. దసరాకు ఇంకా పది రోజులు సమయం ఉండడంతో వ్యాపారాలు పుంజుకోవచ్చని వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. -
దళారీకి జీ హుజూర్
సాక్షి, సిటీబ్యూరో/న్యూస్‌లైన్ నెట్వర్క్: రైతుబజార్లలో దళారుల దందా కొనసాగుతోంది. నిట్టనిలువునా దోపిడీ జరుగుతోంది. రైతులకు, వినియోగదారులకు అనుసంధాన భూమిక పోషించాల్సిన రైతుబజార్లు అక్రమాలకు అడ్డాలయ్యాయి. అధికారుల అలక్ష్యం, దళారుల దందాగిరి వెరసి దళారీ బజార్లుగా మారాయి. గ్రేటర్‌లోని వీటి పనితీరుపై ‘సాక్షి’ జరిపిన పరిశీలన లో లోపాల గుట్టు రట్టయింది. నగరంలోని అన్ని రైతుబ జార్లలో దళారులే రాజ్యమేలుతున్నారు. ఇక్కడ వారి మాటే వేదం. ఇదేమని ప్రశ్నిస్తే.. కొనుగోలుదారులపై చిందులు. రైతుబ జార్ సిబ్బంది అండతో రెచ్చిపోతున్నారు. రైతుబజార్‌లోని స్టాళ్లను 75% రైతులకు, 25% స్వయం సహాయ సంఘాలు, ప్రభుత్వ ఏజెన్సీలు, వికలాంగులకు కేటాయించాలి. అయితే, ఏ రైతుబజార్లో చూసినా 75% స్టాళ్లు దళారులకు, 25% స్టాళ్లు రైతులకు కేటాయిస్తుండటం విశేషం. దీంతో ప్రత్యక్ష అమ్మకాలు సాగించాల్సిన రైతుబజార్లు బ్రోకరేజీ మార్కెట్లుగా మారాయి. ఎర్రగడ్డ మోడల్ రైతుబజార్లో మొత్తం 259 స్టాళ్లకు గాను, 150 స్టాళ్లలో దళారులే పాగా వేశారు. ఇక్కడ కిరాణా, బియ్యం, పండ్ల దుకాణాలతో పాటు అల్లం, వెల్లుల్లి, నిమ్మ, ఉల్లి, ఆలు, ములక్కాయ, క్యారెట్, చామగడ్డ, క్యాప్సికమ్ వంటివన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయి. కూకట్పల్లి, మెహిదీపట్నం, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఫలక్‌నుమా రైతుబజార్లలో కూడా బయటి వ్యక్తలే తిష్ట వేశారు. కటిక నేలపై కర్షకులు దళారులు దుకాణాల ప్లాట్‌ఫారాలు చేజిక్కించుకొని దర్జాగా వ్యాపారాలు చేస్తుండగా, నిజమైన రైతులు మాత్రం బిక్కుబిక్కుమంటూ గేటు వద్ద కటిక నేలపై కూర్చొని కూరగాయలు అమ్ముకొంటున్నారు. బినామీ రైతులు హోల్‌సేల్ మార్కెట్లో సరుకు కొనుగోలు చేసి, రైతుబజార్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. రాబడి బాగుండటంతో రోజువారీ కూలీపై యువకులను పెట్టిమరీ వ్యాపారాలు చేస్తుండటం గమనార్హం. రైతుబజార్ సిబ్బందికి నెలవారీగా మామూళ్లు ఇస్తూ దర్జాగా దందా చేస్తున్నారు. ఇష్టారీతిన రేట్లు వాస్తవానికి ఎస్టేట్ ఆఫీసర్ నిర్ణయించిన ధర కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోవద్దు. అయితే బినామీలు అధిక రేట్లకు విక్రయిస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. బోర్డుపై ధరను చూసి ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘ఇష్టమైతే కొనండి.. లేదంటే వెళ్లండి’ అంటూ దురుసుగా సమాధాన మిస్తున్నారు. కొన్ని రైతుబజార్లలో ఏకంగా సూపర్వైజర్లపైనే ఒత్తిడి తెచ్చి బోర్డుపై అధిక ధరలు రాయిస్తుండటం విశేషం. నిజానికి హోల్‌సేల్ ధరకు ఒక రూపాయి అదనంగా రేటు నిర్ణయించి ఇక్కడ విక్రయించాలి. కానీ, అందుకు విరుద్ధంగా జరుగుతోందిక్కడ. స్టాల్స్ అద్దెకు మెహిదీపట్నం రైతుబజారులో ఒక షెడ్డులో నాలుగు దుకాణాలు ఉండాల్సి ఉండగా, ఆరుగురు షాపులు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యా పారులు తమ దుకాణాలను ఇతరులకు అద్దెకిచ్చి ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇక్కడ 70 స్టాళ్లు ఉంటే 150కి పైగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరిలో సగానికి పైగా బినామీలే. ఎర్రగడ్డ, మెహిదీపట్నం రైతుబజార్లలో బియ్యం వ్యాపారులకు ఎదురే లేకుండా పోయింది. వీరిపై చర్యలకు ఉపక్రమిస్తే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నేరుగా రంగంలోకి దిగుతుండడం విశేషం. ఇవి ఏ మూలకూ.. గ్రేటర్ జనాభా సుమారు కోటి.. ఉన్న రైతుబజార్లు తొమ్మిదే. కూకట్పల్లి, ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్, వనస్థలిపురం, అల్వాల్, ఆర్కేపురం, ఫలక్‌నుమా, మీర్‌పేటల్లో ఉన్న ఈ బజార్లు ఏమాత్రం ప్రజల అవసరాలను తీర్చగలవు. కుత్బుల్లాపూర్ రైతుబజార్ ఎప్పుడో మూతపడింది. నిజానికి అత్తాపూర్, కొండాపూర్, మియాపూర్, సైనిక్‌పురి, బంజారాహిల్స్, తార్నాక , మేడిపల్లి (ఉప్పల్)లలో రైతుబజార్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. ఇంతవరకూ అతీగతీ లేదు. అడ్రస్ లేని ఔట్లెట్లు కూరగాయల ఔట్లెట్ల ఏర్పాటు అటకెక్కింది. తార్నాక, కాచిగూడ, ఐడీపీఎల్ కాలనీ, మలేషియా టౌన్షిప్, గచ్చిబౌలి-టెలికం కాలనీ, ఓయూ కాలనీ, కవాడీగూడ, వెస్టు మారె డ్పల్లి, ఈసీఐఎల్, మౌలాలి తదితర ప్రాంతాల్లో షెల్టర్లు ఇచ్చేందుకు స్థానికులు ముందుకొచ్చారు. తార్నాకలో రైల్వే సిబ్బంది షెడ్ కూడా నిర్మించి ఇచ్చారు. కానీ, మార్కెటింగ్ శాఖ వెనుకడుగు వేసింది. ఫిల్మ్‌నగర్‌లోని 24 బస్తీల కోసం ఔట్లెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, తగిన స్థలం దొరకలేదన్న సాకుతో దాన్ని పక్కకు పెట్టేశారు. నిజానికి అక్కడ ప్రభుత్వ భూమి చాలా ఉంది. సమస్య స్థలం లేక కాదు.. శాఖల మధ్య సమన్వయం లేకే. సిబ్బంది పట్టించుకోరు బోర్డుపై ఉన్న ధరల ప్రకారం విక్రయించడం లేదు. ఇదేమని అడిగితే గొడవ పెడుతున్నారు. రైతుబజారు సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అసలు వాళ్లు పట్టించుకోవట్లేదు. - నిర్మల, వనస్థలిపురం వ్యాపారులదే రాజ్యం రైతుబజార్లలో వ్యాపారులదే హవా. వ్యాపారులు నిర్ణయించిందే ధర. తూకాల్లోనూ మోసం చేస్తున్నారు. ధరలపై ప్రశ్నిస్తే దురుసుగా సమాధానమిస్తున్నారు. రైతుబజారు సిబ్బంది మాట వినే పరిస్థితి లేదు. - శ్రీనివాస్, సరూర్‌నగర్ సరఫరా పెంచాలి మార్కెటింగ్ శాఖ సరఫరా చేస్తున్న సబ్సిడీ ఉల్లి ఏ మూల కూ సరిపోవట్లేదు. సరఫరా మరింత పెంచాలి. అధికారుల పర్యవేక్షణ లేక సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. - సంతోష్, ఉప్పుగూడ ఉల్లిపై నిఘా ఏది? ఉల్లి ధర చూస్తే కళ్లు తిరుగుతున్నాయి. సబ్సిడీ ఉల్లి వినియోగదారులకు దక్కట్లేదు. ఆ ఉల్లి ఏమవుతోందన్నది అర్థం కావట్లేదు. నిఘా లేకపోవడం వల్ల సరుకు దారి మళ్లే అవకాశం ఉంది. - ఎంఏ ఖాదర్ సిద్ధిఖీ, షంషీర్గంజ్ బినామీలను ఏరేస్తాం రైతుబజార్లలో బినామీలను ఏరిపారేస్తాం. వీరిని గుర్తించేందుకు డీడీ స్థాయి అధికారితో తనిఖీలు నిర్వహించనున్నాం. మూడేళ్లు దాటిన స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ ఏజెన్సీలను బయటకు పంపిస్తాం. మార్కెటింగ్ శాఖ సరఫరా చేస్తున్న ఉల్లి పక్కదారి పట్టకుండా నిఘా ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల ద్వారా విక్రయాల తీరును గమనిస్తున్నాం. సంచార రైతుబజార్ల స్థానే కాలనీలకు, అపార్టుమెంట్లకు కూరగాయలు సరఫరా చేసేందుకు ‘మన కూరగాయలు’ స్కీంను త్వరలో ప్రారంభించబోతున్నాం. ఉప్పల్ వద్ద మేడిపల్లిలో కొత్త రైతుబజార్ అందుబాటులోకి రానుంది. - ఎంకే సింగ్, సీఈఓ