
సాక్షి, బళ్లారి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన విధానాలతో కొన్ని పెద్ద వ్యాపార సంస్థలకు లబ్ధి చేకూర్చుతూ చిన్న, మధ్య తరహా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర ఆదివారం బళ్లారి జిల్లాలో కొనసాగింది. మోకా గ్రామంలో ఆయన వ్యాపారులతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ స్థానం మరింతగా పడిపోవడంపై రాహుల్ ట్విట్టర్‌లో స్పందించారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కలిసి భారత్‌ను ఇంకా ఎంతకాలం బలహీనం చేస్తాయని ప్రశ్నించారు. జోడో పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. మోకాకు వెళ్లే దారిలో ఒక అభిమాని పట్టుకున్న జెండా రాడ్‌కు విద్యుత్ తీగలు తాకి ఐదుగురికి గాయాలయ్యాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న రాహుల్‌గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. రాహుల్ రాత్రి బళ్లారి జిల్లాలో బస చేశారు. సోమవారం ఉదయం మోకా నుంచి ఏపీలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఛత్రగుడిలోకి యాత్ర ప్రవేశిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment