Small and medium industries
-
Bharat Jodo Yatra: చిన్న వ్యాపారాలపై బీజేపీ దెబ్బ: రాహుల్
సాక్షి, బళ్లారి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన విధానాలతో కొన్ని పెద్ద వ్యాపార సంస్థలకు లబ్ధి చేకూర్చుతూ చిన్న, మధ్య తరహా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర ఆదివారం బళ్లారి జిల్లాలో కొనసాగింది. మోకా గ్రామంలో ఆయన వ్యాపారులతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ స్థానం మరింతగా పడిపోవడంపై రాహుల్ ట్విట్టర్లో స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి భారత్‌ను ఇంకా ఎంతకాలం బలహీనం చేస్తాయని ప్రశ్నించారు. జోడో పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. మోకాకు వెళ్లే దారిలో ఒక అభిమాని పట్టుకున్న జెండా రాడ్‌కు విద్యుత్ తీగలు తాకి ఐదుగురికి గాయాలయ్యాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న రాహుల్‌గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. రాహుల్ రాత్రి బళ్లారి జిల్లాలో బస చేశారు. సోమవారం ఉదయం మోకా నుంచి ఏపీలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఛత్రగుడిలోకి యాత్ర ప్రవేశిస్తుంది. -
పరిశ్రమలకు పరిపుష్టి
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపశమన ప్యాకేజీ ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ)ని ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేస్తోంది. పరిశ్రమలకు ఏ తరహా ఉపశమనం ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి మరింత సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తర్వాత ఉపశమన ప్యాకేజీ ఉత్తర్వులు వెలువడే అవకాశముందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. (మే, జూన్‌లోనే 84 శాతం మరణాలు ) ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు రద్దు.. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నుంచి మే వరకు 3 నెలల పాటు విద్యుత్ బిల్లుల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో మారిటోరియం విధించింది. అయితే లాక్డౌన్ మూలంగా సుమారు రెండున్నర నెలల పాటు ఉత్పత్తి నిలిచిపోవడంతో ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు రద్దు చేయాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఫిక్స్డ్ విద్యుత్ చార్జీల ద్వారా ఎంఎస్ఎంఈ రంగానికి రూ.130 కోట్ల మేర ఉపశమనం కలిగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ తాజా ప్రతిపాదనల్లో అం చనా వేసింది. అయితే అన్ని రకాల పరిశ్రమలకు సంబంధించిన íఫిక్స్డ్ చార్జీల వివరాలివ్వాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. (24 గంటల్లో 279 మంది మృతి) విడతల వారీగా సబ్సిడీలు.. పారిశ్రామిక రంగానికి వివిధ సబ్సిడీలు, ప్రోత్సాహకాలకు సంబంధించి సుమారు రూ.2,500 కోట్ల మేర బకాయిలను రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేయాల్సి ఉంది. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.1,284 కోట్లు, ఇతర పరిశ్రమలకు రూ.600 కోట్లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.600 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో బకాయిల్లో కనీసం నాలుగో వంతును విడుదల చేయడంతోపాటు, మిగిలిన మొ త్తాన్ని దశల వారీగా విడుదల చేయాలని పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. తద్వారా సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమలకు కొంత ఉపశమనం కలగనుంది. (కడుపులో కాటన్ కుక్కి ఆపరేషన్) ఏడాది పాటు ఆస్తి పన్ను రద్దు... ఉపశమన ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలకు ఏడాది పాటు ఆస్తి పన్ను రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో దేశ వ్యాప్తంగా కనీసం రూ.2 లక్షల కోట్లు కూడా బ్యాంకర్ల నుంచి రుణాలు అందే పరిస్థితి లేదని పారిశ్రామిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఉపశమన ప్యాకేజీ ద్వారా కొంతైనా మేలు కలుగుతుందని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) అధ్యక్షుడు కొండవీటి సుధీర్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. ఉపశమన ప్యాకేజీకి సంబంధించి వివిధ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, వీలైనంత త్వరగా వివరాలు వెల్లడిస్తామని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. -
కరోనా పుట్టుకపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ పుట్టకకు సంబంధించి కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సహాజ సిద్దమైన వైరస్ కాదని.. అది ల్యాబ్ నుంచి పుట్టకొచ్చిందని వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభంతో చిన్న, మద్య తరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతినాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై స్పందించిన గడ్కరీ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అనుకూలతలు సృష్టించడం సవాలుతో కూడుకున్నదని అన్నారు. (చదవండి : భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్) అలాగే ప్రతి ఒక్కరు కరోనాతో కలిసి బతకడం అలవాటు చేసుకోవాలని గడ్కరీ అన్నారు. ఎందుకంటే కరోనా సహజ సిద్ధంగావ వచ్చిన వైరస్ కాదని.. ఇది ల్యాబొరేటరీ నుంచి వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తేనే కరోనా భయాన్ని అంతం చేసి, సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. మనం కరోనాతో పాటు, ఆర్థిక పరిస్థితులపై కూడా పోరాడాల్సి ఉంటుందన్నారు. మనది పేద దేశం అని.. నెల నెల లాక్డౌన్ పొడిగించలేమని తెలిపారు. కాగా, కరోనా లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించడానికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3లక్షల రుణాలు ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి : లాక్డౌన్ 4.0 : మోదీ కీలక భేటీ) అయితే చాలా కాలంగా కరోనా చైనాలోని ఓ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. అగ్రరాజ్యం అమెరికాతోపాటుగా చాలా దేశాలు ఈ విషయంలో చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. భారత్ మాత్రం ఈ అంశంపై సమన్వయం పాటిస్తూ వస్తోంది. అయితే తొలిసారిగా కరోనా ల్యాబ్ నుంచి వచ్చిందని కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. -
నష్టాలను బడ్జెట్ తీరుస్తుందా?
సాక్షి, అమరావతి : ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌పై చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారీ ఆశలను పెట్టుకున్నాయి. రెండేళ్ల నుంచి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ రంగాన్ని గాడిలో పెట్టే విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 3.60 కోట్ల యూనిట్లు ఉండగా వీటిపై ఆధారపడి 12 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. అంతేకాదు దేశీయ తయారీరంగంలో మూడోవంతు, ఎగుమతుల్లో 45 శాతం ఈ రంగం నుంచే ఉన్నాయి. ఇలాంటి అత్యంత కీలకమైన రంగం వరుసదెబ్బలతో కునారిల్లుతోంది. దీంతో ఈ రంగాన్ని ఆదుకునే విధంగా పలు ప్రోత్సాహకాలను అరుణ్ జైట్లీ ఈ బడ్జెట్లో ప్రకటిస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌తో పాటు వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని పెంచుతారని అంచనా వేస్తున్నట్లు ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ (విజయవాడ చాప్టర్) ప్రెసిడెంట్ ఎం.రాజయ్య 'సాక్షి' కి తెలిపారు. జీఎస్టీలో రిటర్నులు దాఖలు అనేది చిన్న వ్యాపారులకు చాలా ఇబ్బందిగా మారిందని, దీన్ని మరింత సులభతరం చేయాలని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వ్యాపారి శబరీనాథ్ కోరారు. సినిమా టికెట్ ధరతో సంబంధం లేకుండా 18 శాతం ఏక పన్ను రేటును అమలు చేయాలని ఏపీ థియేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముత్తవరవు శ్రీనివాసు తెలిపారు. టీవీలు, ఫ్రిజ్‌లు వంటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌పై 28 శాతం పన్ను విధించడంతో అమ్మకాలు తగ్గాయని సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ భాస్కరమూర్తి తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపించింది. చాలా మంది సీజన్ వ్యాపారులు వివిధ షాపుల్లో గుమస్తాలుగా చేరిపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకున్నాం. గుంటూరు ఆంజనేయులు, చిరు వ్యాపారి, ఏలూరు ఎగుమతుల ద్వారా ఆదాయం పెరగాలంటే 2005 ఎస్ఈజెడ్ పాలసీని అమలు చేయాలి. ఆ పాలసీ ప్రకారం ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిస్తున్నట్టు ప్రకటించారు. కానీ ప్రస్తుతం మినిమన్ ఆల్ట్రనేటివ్ ట్యాక్స్ పేరుతో 18.5శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. లాభాలను డివిడెండ్లుగా ప్రకటించడానికి కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్‌ని కంపెనీలు భరించాల్సి వస్తుండడంతో భారం పడుతుంది. వినయ్‌శర్మ, ఏడబ్ల్యూస్ ఇండియా చైర్మన్, వీఎస్ఈజెడ్ -
చిన్న పరిశ్రమలకు రుణం అందడంలేదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కనీసం రూ.కోటి రుణాన్ని కూడా బ్యాంకులు ఇవ్వడంలేదని కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రా అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రుణాలివ్వాలనే రిజర్వుబ్యాంకు నిబంధనలను సైతం బ్యాంకర్లు పక్కన పెడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కొత్తగా స్మూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఒరవడి లేదని చెప్పారు. ‘ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల కోసం ఆర్ధిక పునర్మాణం-విజయానికి జీవన రేఖ’ అంశంపై ఢిల్లీలో బుధవారం అసోచామ్ నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా మాట్లాడారు. దేశంలో స్మూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమస్యలను అధిగమించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన చర్యలతో ప్రపంచ దేశాల దృష్టికి ఇప్పుడు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలవైపు పడిందని చెప్పారు. గోదావరి పాలిమర్స్‌కు అవార్డు తక్కువ వ్యయంతో అధిక మేలు చేసే ఉత్పత్తుల తయారీ సంస్థల విభాగంలో గోదావరి పాలిమర్స్ సంస్థ డెరైక్టర్ సి.రాజేంద్ర కుమార్‌కు ఈ సందర్భంగా అవార్డు ప్రధానం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ గోదావరి పాలిమర్స్ సంస్థ ద్వారా సంప్రదాయకమైన వ్యసాయ ఉత్పత్తులు తయారు చేస్తూ రైతులకు చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డు లభించిందని, దీంతో తమ సంస్థ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు.