నష్టాలను బడ్జెట్‌ తీరుస్తుందా? | Small and medium scale industries hopes on Union Budget | Sakshi
Sakshi News home page

నష్టాలను బడ్జెట్‌ తీరుస్తుందా?

Published Wed, Jan 31 2018 9:06 AM | Last Updated on Wed, Jan 31 2018 12:39 PM

Small and medium scale industries hopes on Union Budget - Sakshi

బడ్జెట్‌పై చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఆశలు

సాక్షి, అమరావతి : ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌పై చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారీ ఆశలను పెట్టుకున్నాయి. రెండేళ్ల నుంచి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ రంగాన్ని గాడిలో పెట్టే విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 3.60 కోట్ల యూనిట్లు ఉండగా వీటిపై ఆధారపడి 12 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. అంతేకాదు దేశీయ తయారీరంగంలో మూడోవంతు, ఎగుమతుల్లో 45 శాతం ఈ రంగం నుంచే ఉన్నాయి. ఇలాంటి అత్యంత కీలకమైన రంగం వరుసదెబ్బలతో కునారిల్లుతోంది. దీంతో ఈ రంగాన్ని ఆదుకునే విధంగా పలు ప్రోత్సాహకాలను అరుణ్‌ జైట్లీ ఈ బడ్జెట్‌లో ప్రకటిస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

కార్పొరేట్‌ ట్యాక్స్, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌తో పాటు వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని పెంచుతారని అంచనా వేస్తున్నట్లు ఆంధ్రా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (విజయవాడ చాప్టర్‌) ప్రెసిడెంట్‌ ఎం.రాజయ్య 'సాక్షి' కి తెలిపారు. జీఎస్టీలో రిటర్నులు దాఖలు అనేది చిన్న వ్యాపారులకు చాలా ఇబ్బందిగా మారిందని, దీన్ని మరింత సులభతరం చేయాలని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వ్యాపారి శబరీనాథ్‌ కోరారు. సినిమా టికెట్‌ ధరతో సంబంధం లేకుండా 18 శాతం ఏక పన్ను రేటును అమలు చేయాలని ఏపీ థియేటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ముత్తవరవు శ్రీనివాసు తెలిపారు. టీవీలు, ఫ్రిజ్‌లు వంటి కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌పై 28 శాతం పన్ను విధించడంతో అమ్మకాలు తగ్గాయని సోనోవిజన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ భాస్కరమూర్తి తెలిపారు.

నోట్ల రద్దు, జీఎస్టీ చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపించింది. చాలా మంది సీజన్‌ వ్యాపారులు వివిధ షాపుల్లో గుమస్తాలుగా చేరిపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకున్నాం.
గుంటూరు ఆంజనేయులు, చిరు వ్యాపారి, ఏలూరు


ఎగుమతుల ద్వారా ఆదాయం పెరగాలంటే 2005 ఎస్‌ఈజెడ్‌ పాలసీని అమలు చేయాలి. ఆ పాలసీ ప్రకారం ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిస్తున్నట్టు ప్రకటించారు. కానీ ప్రస్తుతం మినిమన్‌ ఆల్ట్రనేటివ్‌ ట్యాక్స్‌ పేరుతో 18.5శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. లాభాలను డివిడెండ్లుగా ప్రకటించడానికి కంపెనీ డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌ని కంపెనీలు భరించాల్సి వస్తుండడంతో భారం పడుతుంది.
వినయ్‌శర్మ, ఏడబ్ల్యూస్‌ ఇండియా చైర్మన్, వీఎస్‌ఈజెడ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement