
ముంబై : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జీఎస్టీ, గతేడాది ప్రకటించిన నోట్ల రద్దు రియల్ ఎస్టేట్ రంగాన్ని బాగానే దెబ్బకొట్టాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కేవలం లిక్విడిటీ సమస్యలను సృష్టించడం మాత్రమే కాక, నగరాల రియాల్టీ ర్యాంకింగ్స్‌ను పడగొట్టాయి. రియల్ ఎస్టేట్ పరంగాల నగరాల్లో పెట్టుబడులు, అభివృద్ధి క్షీణించాయని రిపోర్టు వెల్లడించింది. అర్బన్ ల్యాండ్ ఇన్‌స్టిట్యూట్, కన్సల్టెన్సీ పీడబ్ల్యూసీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. 600 మంది రియాల్టీ నిపుణుల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ రియల్ ఎస్టేట్-ఆసియా పసిఫిక్ 2018 టైటిల్‌తో రిపోర్టును రూపొందించింది.
ఈ రిపోర్టులో 2018లో పెట్టుబడుల గమ్యస్థానంగా ఎక్కువ ఇష్టపడే జాబితాలో ముంబై నగరం 12వ స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది ఈ నగరం రెండో స్థానంలో ఉండేది. అభివృద్ధి అవకాశాల్లో ఇది 8వ స్థానాన్ని సంపాదించుకుంది. అదేవిధంగా పెట్టుబడుల గమ్యస్థానంగా ఎక్కువ ఇష్టపడే జాబితాలో బెంగళూరు, న్యూఢిల్లీ నగరాలు 15వ, 20వ స్థానాలను దక్కించుకున్నాయి. గతేడాది ఇవి 1, 13వ స్థానాల్లో ఉన్నాయి. అదేవిధంగా అభివృద్ధి అవకాశాల్లోనూ ఈ నగరాల స్థానాలు పడిపోయాయి. డిమానిటైజేషన్, జీఎస్టీ సంస్కరణలు నగరాల పెట్టుబడుల్లో, అభివృద్ది అంశాల్లో ప్రభావం చూపాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment