అనధికార వసూళ్లు | Mahajatara effect ap | Sakshi
Sakshi News home page

అనధికార వసూళ్లు

Published Thu, Feb 6 2014 1:32 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

Mahajatara effect ap

  • పన్నుల పేరిట మామూళ్లు
  • మేడారం మహాజాతరపై ప్రభావం
  • ఆకాశాన్నంటిన ధరలు.. భక్తుల జేబులకు చిల్లు
  • రచ్చకెక్కిన శాఖల పోరు
  • కలెక్టరేట్, న్యూస్‌లైన్ :జాతరలో చుక్కల నంటిన ధరలు.. ఏ వస్తువు కొనాలన్నా మండిపోతున్న రేట్లు.. తక్కువ రోజు ల్లో ఎక్కువ సంపాదించాలనే తపన.. దీనికితోడు శాఖల మధ్య సమన్యయం లేకపోవడంతో వ్యాపారుల నుంచి పన్నుల పేరుతో ఎవరికి వారు వసూళ్ల కు పాల్పడుతున్నారు. ఇవన్నీ భక్తులపై రుద్దుతున్నారు వ్యాపారులు.. వందల కిలో మీట ర్లు ప్రయాణం చేసిన భక్తులు మాత్రం మండిపోతున్న ధరలను చూసి వణికిపోతున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. దీం తో వ్యాపారాలు ఊపందుకున్నాయి.

    ముందస్తుగా ప్రారంభించిన వ్యాపారాలు బాగానే సాగుతున్నా.. ధరలు పెంచి భక్తులను ఇబ్బం దులకు గురిచేస్తున్నారు. అయితే ప్రభుత్వ శా ఖల నుంచి ఎవరికి వారు వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడడం.. ఇందులో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా చేసేవేనని తెలుస్తోంది. దీనికితోడు వ్యాపారం సాగే సమయంలో అదనుచూసి ఓ 10 మంది బ్యాడ్జీలు ధరించి గుం పుగా రావడం.. రశీదు చింపిచేతిలో పెట్టి అం దులో రాసిన కాడికి ఇవ్వాలని వ్యాపారులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది జాతరలో నిత్యకృత్యంగా మారింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వ్యాపారులు తమగోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతవుతున్నారు.

    గొడవకు దిగితే ఉన్న వ్యాపా రం దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇదంతా ఆలోచించి ఎందుకొచ్చిన తంటా అని అడిగిన కాడికి చేతికిచ్చి పంపుతున్నారు. ఈ వసూళ్ల వ్యవహారం వల్ల వ్యాపారులకు జరిగే లోటు ను అధిక ధరలకు అమ్మకాలు చేసి భక్తులపైనే రుద్దుతున్నారు. వ్యాపారం చేసుకునేందుకు స్థలం కిరాయి విషయంలో ముందు రెవెన్యూ వారు ధరలు నిర్ణయించి ప్లాట్లు ఇస్తారు. కొన్నిచోట్ల ఐటీడీఏ వారు ఇస్తారు.

    షాపులు ఏర్పాటు చేసుకున్న వారి వద్ద సంఘాల పేరు తో కొందరు, ఐటీడీఏ పేరుతో కొందరు, అట వీ, విద్యుత్, అగ్నిమాపక  శాఖ పేరుతో కొంద రు వ్యాపారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. గుడారాలు వేసుకునేందుకు కలప వాడుకున్నందుకు అటవీ శాఖ, స్థలం ఇచ్చినందుకు రెవెన్యూ శాఖ డబ్బులు తీసుకుందంటే సరే.. మిగతావారి వసూళ్లకు లెక్కాపత్రం లేకుండాపోయింది. దీంతో వ్యాపారులు లాబోదిబోమంటూ ఆ భారం భక్తుల నెత్తిన వేస్తున్నారు.
     
    ఐటీడీఏ వర్సెస్ పంచాయతీ
     
    ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లో సం త, అంగళ్లు, జాతర జరి గినప్పుడు అక్కడ వ్యాపారాలు చేసుకునేవారి నుంచి సంబంధిత గ్రామ పంచాయతీ వారు వ్యాపార లెసై న్స్ కోసం కొంతమొత్తం డబ్బులు వసూలు చేస్తారు. ఇందుకు పంచాయతీకి పూర్తి అధికారాలు ఉంటాయి. అయితే మేడారం పెద్దజాతర.. చిన్నపంచాయతీ కావడంతో లెసైన్స్ ఫీజుల వసూళ్లపై కొంతకాలంగా అధికారులు దృష్టి పెట్టలేదు. గత ఏడా ది డీపీఓ పద్మజారాణి ఈ విషయంలో ప్రత్యేక సారించారు. సుమారు రూ.4లక్షల వరకు లెసైన్స్ ఫీజుల ద్వారా వసూలు చేశారు.

    ఆ డబ్బుతో ఊరట్టం పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో పైపులైన్ ఏర్పాటు చేశారు. అదేసమయంలో ఐటీడీఏ, పంచాయతీ శాఖల మధ్య వసూళ్ల వ్యవహారంలో చిచ్చురేగింది. పంచాయతీ వసూలు చేయని సమయంలో ఆ వ్యవహారం ఐటీడీఏ ఆధ్వర్యంలో అనధికారికంగా చేసి వచ్చిన డబ్బులు ‘క్యాంపు కార్యాలయం తిండి ఖర్చుల’ కింద చూపేవారు. దీనిపై పలు ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోలేదు.

    ఇప్పుడు ఏకంగా రెండు శాఖల పంచాయితీ జాతరకు ముందే వీధికెక్కింది. కొద్ది రోజుల క్రితం మేడారంలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాలని, దీనికోసం జాతర ప్రాంగణాన్ని కొన్ని భాగాలు చేసి పంచాయతీ అధికారులు టెండర్లు పిలిచారు. అదేరోజు ఐటీడీఏ వారు జాతరలో తమకు డబ్బులు చెల్లించి దుకాణాలు పెట్టుకోవాలని ప్రకటన జారీ చేసింది. దీంతో వ్యవహారం రచ్చకెక్కింది. మొత్తంగా ఈ వ్యవహారం అంతా ప్రస్తుతం కలెక్టర్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
     
     లెసైన్స్ ఫీజు పంచాయతీయే వసూలు చేయాలి
     గ్రామ పంచాయతీ పరిధిలోని దుకాణాలకు లెసైన్స్ ఫీజు వసూలు చేసే అధికార పంచాయతీలకే ఉంటుంది. ఐటీడీఏ వారు ఎందుకు వసూలు చేస్తున్నారో తెలియడంలేదు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతామన్నారు. తాము పంచాయతీ ఆదాయం వదులుకోలేం. మా పని మేం చేయాల్సిందే. ఒక్క ఊరట్టం మాత్రమే కాదు.. చుట్టు పక్కల వ్యాపారాలు సాగే అన్ని పంచాయతీల పరిధిలో లెసైన్స్ పొంది వ్యాపారం చేయాలని కోరుతున్నాం.
     - ఈఎస్.నాయక్, డీపీఓ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement