భవిష్యం(28-08-2016)
టారో
28 ఆగస్టు నుంచి 3సెప్టెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
చిన్న చిన్న అవరోధాలు ఉన్నా, వ్యాపారాలు పుంజుకుంటాయి. కష్టాన్ని నమ్ముకుని ఫలితాలను సాధిస్తారు. చిరకాలంగా సన్నిహితంగా ఉంటున్న వ్యక్తితో ప్రేమలో పడతారు. కొత్తగా వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరచుకుంటారు. భవిష్యత్ అవసరాల కోసం, ఆర్థిక భద్రత కోసం మరింత సంపదను కూడబెట్టాలనే ఉద్దేశంతో పెట్టుబడులు పెడతారు. లక్కీ కలర్: గులాబి
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
కొత్తగా ఇల్లు కొనడం లేదా ఉన్న ఇంటిలోనే మార్పులు చేపట్టడం వంటి పనులకు శ్రీకారం చుడతారు. త్వరగా పనులు పూర్తి కావాలనే ఆతృతతో ఇతరులపై కోపతాపాలకు గురవుతారు. సురక్షితంగా ఆశించిన గమ్యానికి చేరాలంటే నిదానమే ప్రధానమనే మాటను గుర్తుంచుకోవడం మేలు. లక్ష్య సాధన కోసం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తారు. లక్కీ కలర్: నీలం
మిథునం (మే 21 - జూన్ 20)
ఇంటా బయటా అనూహ్యమైన మార్పులు జరుగుతాయి. ఊహించని కొన్ని సంఘటనలు ఆశ్చర్యంలో పడేస్తాయి. బాధ్యతలను గుర్తించి పనిచేస్తే జీవితం సుఖమయంగా మారుతుందని గ్రహిస్తారు. భావసారూప్యత గల వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు ఏర్పడతాయి. మరింత స్పష్టత కోసం, ఆశించిన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం కోసం అవసరమైన సమాచార సేకరణ దిశగా కృషి చేస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
దివ్యమైన స్ఫూర్తితో, వివేకంతో తలచిన పనులను పూర్తి చేస్తారు. సంధి దశలో ఉన్న మీరు వాస్తవిక దృక్పథాన్ని అలవరచుకుంటారు. పని ఒత్తిడిని తగ్గించుకుని కాస్త విశ్రాంతి తీసుకోవడం మేలు. భవిష్యత్తును నిర్మించుకునే కీలక దశ ఇది. పాత గాయాలను మరచి, ప్రేమ సంబంధాలలో శాంతి సామరస్యాలకు చొరవ తీసుకుంటారు. లక్కీ కలర్: ఇటుక రంగు
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సవాలుగా స్వీకరిస్తారు. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. ‘అతి సర్వత్ర వర్జయేత్’ సూత్రాన్ని పాటించండి. మీ ప్రవర్తనలో ఏదీ అతి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పరిస్థితులన్నీ వాటంతట అవే చక్కబడతాయి. లక్కీ కలర్: మట్టి రంగు
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
కోరుకున్నవి అడగడానికి ఏమాత్రం సంకోచించవద్దు. అడిగినవి తప్పకుండా పొందగలరు. అనవసరపు ఆందోళనలను, మానసిక అలజడిని అదుపు చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. శక్తులన్నీ కోల్పోయినట్లు నిస్తేజంగా మారుతారు. ఈ పరిస్థితుల్లో మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ద్వారా ఊరట పొందగలరు. లక్కీ కలర్: వెండి రంగు
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
మార్పు కోసం ఎదురు చూస్తున్న మీకు కెరీర్‌లో అద్భుతమైన అవకాశం అందివస్తుంది. భవిష్యత్తుపై ఊహా లోకాల్లో తేలిపోతూ కాలం గడిపేయడం మంచిది కాదని గుర్తిస్తారు. వర్తమానమే భవిష్యత్తుకు పునాది అని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన పరిస్థితులు అనివార్యమవుతాయి. కాస్త ఉత్సాహం, ఉత్తేజం కోరుకుని విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: పసుపు
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ప్రేమ వ్యవహారాల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అవివాహితులకు పెళ్లిళ్లు కుదిరే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను చాటుకుంటారు. మీ ఆకర్షణ శక్తి కారణంగా బంధు మిత్రులందరూ మీ చుట్టూ చేరతారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అందివచ్చిన అవకాశాలను గరిష్టస్థాయిలో ఉపయోగించుకుంటారు. లక్కీ కలర్: నారింజ
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఇంటా బయటా ఆనందంగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వచ్చిన లాభాల కంటే చేసే పని మీదనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అనాయాసంగానే పెద్దపెద్ద పనులను అవలీలగా పూర్తిచేస్తారు. సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితం సుఖమయంగా సాగుతుంది. లక్కీ కలర్: లేత నారింజ
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
పరిస్థితులు అనివార్యంగా అదుపు తప్పుతాయి. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవడం క్షేమం. ఆత్మనియంత్రణ ఆత్మ గౌరవానికి భంగకరం కాదని తెలుసుకుంటారు. ఒంటరిగా గడుపుతారు. అపార్థాలకు గురవు తారు. అందరూ మిమ్మల్ని తిరస్కరిస్తున్న ట్లుగా భావించి బాధపడతారు. ఒక పరిచిత వ్యక్తి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురవుతారు. లక్కీ కలర్: బూడిద రంగు
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
జీవితంలో పెద్దగా ప్రత్యామ్నాయాలు ఉండవని గ్రహిస్తారు. ఏకాంతాన్ని, నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. తీరిక సమయాన్ని ఆత్మావలోకనం కోసం వినియోగించుకుంటారు. కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొనడం కొంత ఊరటనిస్తుంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి భావసారూప్యం గల భాగస్వామి తారసపడతారు. నూతనోత్తేజం పొందడానికి ఒంటరిగా దూరప్రయాణాలకు వెళతారు. లక్కీ కలర్: ఊదా
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
వృత్తి వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీల్లో వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ స్వీకరించి అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. మనసుకు నచ్చిన తోడు దొరుకుతుంది. ఒక కీలక నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో డోలాయమాన పరిస్థితుల్లో ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడతారు. లక్కీ కలర్: ముదురు పసుపు
ఇన్సియా టారో అనలిస్ట్