చిరు వ్యాపారులకు చుక్కలు | Supreme Court orders to be Street vendors | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారులకు చుక్కలు

Published Sun, Dec 28 2014 4:56 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

చిరు వ్యాపారులకు చుక్కలు - Sakshi

చిరు వ్యాపారులకు చుక్కలు

ప్రొద్దుటూరు టౌన్: రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారికి (స్ట్రీట్ వెండర్స్‌కు) మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూపులు తప్పడం లేదు. రోడ్లపై పండ్లు, పూలు, బట్టలతోపాటు వివిధ రకాల సరుకులు, వస్తువులు తోపుడు బండ్లపై, గంపల్లో పెట్టుకుని విక్రయించే వ్యాపారులను స్థానిక మున్సిపాలిటీలు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశాలు కేటాయించాలన్నది ఉద్దేశం. తద్వారా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నది లక్ష్యం. అయితే ఈ నిర్ణయంపై 2009 నుంచి సర్వేల పేరుతో కాలయూపన సాగుతోంది.

సర్వేలో మెప్మా సీఓలు, ఆర్‌పీలు పాల్గొని నివేదికలు కూడా తయారు చేసి అధికారులకు ఇచ్చారు. వీరికి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కూడా సూచనలు ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది వారి పేర్లను మున్సిపాలిటీల్లోని మెప్మా సెంటర్లలో నమోదు చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి సర్వేలు చేసి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అయితే స్థలాలు గుర్తించి వారికి కేటాయించడం ఎప్పటికి పూర్తి అవుతందనేది అంతుచిక్కని విషయంగా మారింది.
 
కడప జిల్లాలో సర్వే ఇలా...

జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల పరిస్థితి చూస్తే కడపలో 2708 మందిని గుర్తించి వారిలో 502 మందికి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అలాగే బద్వేలులో 519కి 100 మందకి ఐడీ కార్డులు, జమ్మలమడుగులో 835కు 107 మందికి, మైదుకూరులో 235కి 108 మందికి, ప్రొద్దుటూరులో 1416లో 182కు, పులివెందులలో 710లో 132కి, రాజంపేటలో 401లో 70కి, రాయచోటిలో 805లో 385కి, ఎర్రగుంట్లలో 133లో 127కి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో శనివారం వరకు 1,42,202 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నట్లు ఆన్‌లైన్‌లో పొందు పరిచారు. కాగా అందులో 1,06,679 మంది పూర్తి వివరాలు లేవు. కంప్యూటర్‌లో మాత్రమే చూపుతున్నారు. పేరుకే లక్షకు పైగా స్ట్రీట్ వెండర్స్‌ని గుర్తించామని ఉన్నా అవన్నీ కాకి లెక్కలేనని స్పష్టంగా తెలుస్తోంది. ఐడీ కార్డులు సిద్ధం చేసిన వారందరూ 2013-14లో సర్వే చేసిన వారే...

ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తరువాత ప్రొద్దుటూరు టౌన్:
రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారికి (స్ట్రీట్ వెండర్స్‌కు) మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూపులు తప్పడం లేదు. రోడ్లపై పండ్లు, పూలు, బట్టలతోపాటు వివిధ రకాల సరుకులు, వస్తువులు తోపుడు బండ్లపై, గంపల్లో పెట్టుకుని విక్రయించే వ్యాపారులను స్థానిక మున్సిపాలిటీలు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశాలు కేటాయించాలన్నది ఉద్దేశం.

తద్వారా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నది లక్ష్యం. అయితే ఈ నిర్ణయంపై 2009 నుంచి సర్వేల పేరుతో కాలయూపన సాగుతోంది. సర్వేలో మెప్మా సీఓలు, ఆర్‌పీలు పాల్గొని నివేదికలు కూడా తయారు చేసి అధికారులకు ఇచ్చారు. వీరికి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కూడా సూచనలు ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది వారి పేర్లను మున్సిపాలిటీల్లోని మెప్మా సెంటర్లలో నమోదు చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి సర్వేలు చేసి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అయితే స్థలాలు గుర్తించి వారికి కేటాయించడం ఎప్పటికి పూర్తి అవుతందనేది అంతుచిక్కని విషయంగా మారింది.
 
కడప జిల్లాలో సర్వే ఇలా...
జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల పరిస్థితి చూస్తే కడపలో 2708 మందిని గుర్తించి వారిలో 502 మందికి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అలాగే బద్వేలులో 519కి 100 మందకి ఐడీ కార్డులు, జమ్మలమడుగులో 835కు 107 మందికి, మైదుకూరులో 235కి 108 మందికి, ప్రొద్దుటూరులో 1416లో 182కు, పులివెందులలో 710లో 132కి, రాజంపేటలో 401లో 70కి, రాయచోటిలో 805లో 385కి, ఎర్రగుంట్లలో 133లో 127కి ఐడీ కార్డులు సిద్ధం చేశారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో శనివారం వరకు 1,42,202 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నట్లు ఆన్‌లైన్‌లో పొందు పరిచారు. కాగా అందులో 1,06,679 మంది పూర్తి వివరాలు లేవు. కంప్యూటర్‌లో మాత్రమే చూపుతున్నారు. పేరుకే లక్షకు పైగా స్ట్రీట్ వెండర్స్‌ని గుర్తించామని ఉన్నా అవన్నీ కాకి లెక్కలేనని స్పష్టంగా తెలుస్తోంది.
 
ఐడీ కార్డులు సిద్ధం చేసిన వారందరూ 2013-14లో సర్వే చేసిన వారే...
ఇటీవల సుప్రీం కోర్డు ఆదేశాలు జారీ చేసిన తరువాత సర్వే నిర్వహించిన వారికే ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అధికారుల వద్ద, ప్రభుత్వం వద్ద కేవలం 35,523 మంది వివరాలే ఉన్నాయి. గతంలో కేవలం గుర్తింపు పేరుతో నామమాత్రపు సర్వేలు చేశారే తప్ప వారి నుంచి పూర్తి వివరాలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఏళ్లు గడుస్తుండటంతో నమోదు చేసుకున్న వారు ఎక్కడ ఉన్నారన్న సమాచారం కూడా లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  
 
మున్సిపాలిటీల్లో స్థలాలు ఎక్కడా...
 ప్రస్తుతం గుర్తించిన వారికన్నా స్థలాలు ఇచ్చేందుకు మున్సిపాలిటీల్లో కసరత్తు జరగడం లేదు. కనీసం స్థలాలు ఉన్నాయా అంటే అవీలేవు. ఉన్న స్థలాలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. అయినా మున్సిపల్ కమిషనర్లు కానీ, టౌన్‌ప్లానింగ్ అధికారులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా అన్న అనుమానం వ్యాపారులను పీడిస్తోంది. కేవలం ఎదురు చూపులు, పోలీసు వేధింపులు తప్ప తమకు ఎలాంటి న్యాయం జరగదన్నది వ్యాపారుల వాదన.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement