స్వామి మళ్లీ పేల్చారు..! | Swamy targets GSTN again, to write to Amit Shah, BJP CMs | Sakshi
Sakshi News home page

స్వామి మళ్లీ పేల్చారు..!

Published Sat, Aug 27 2016 8:09 PM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

స్వామి మళ్లీ పేల్చారు..! - Sakshi

స్వామి మళ్లీ పేల్చారు..!

ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన బిల్లు జీఎస్టీపై అసలు నోరు మెదపనని, దానిపై తాను మాట్లాడితే ఘర్షణలు జరుగుతాయన్న సుబ్రహ్మణ్యస్వామి మాట మార్చారు. తనదైన వివాదాస్పద శైలిలో వస్తే గూడ్స్ అండ్ సర్వీసు టాక్స్ నెట్ వర్క్(జీఎస్టీఎన్)పై ట్విట్టర్లో బాంబు పేల్చారు. జీఎస్జీ బిల్లును ఆమోదిస్తున్న రాష్ట్రాలు జీఎస్టీఎన్ వ్యతిరేకించాలంటూ అమిత్ షాకు, బీజేపీ సీఎంలకు లేఖలు రాస్తానని ట్వీట్ చేశారు. ఓ వైపు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ సమావేశమైన నేపథ్యంలో స్వామి ఈ ట్వీట్ చేయడం గమనార్హం.  ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన ఈ బిల్లును బీజేపీ పాలిత ఎనిమిది రాష్ట్రాలు ఆమోదించిన సంగతి తెలిసిందే.  దేశమంతటినీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఏకీకృత పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పన్ను విధానాన్ని సమర్థవంతంగా అమలుచేయడానికి జీఎస్టీఎన్ పేరుతో ఒక స్వచ్చంద, లాభపేక లేని సంస్థలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది.  జీఎస్టీఎన్ నిర్మాణం జాతి వ్యతిరేకకు సంబంధించిందని స్వామి వ్యాఖ్యానించారు.
 
జీఎస్టీఎన్లో 24.5 శాతం స్టేక్ ప్రభుత్వం చేతిలో, మరో 24.5 శాతం రాష్ట్రాల చేతిలో ఉంటుంది. మిగిలిన 51 శాతం స్టేక్ ప్రభుత్వేతర ఆర్థిక సంస్థల స్వాధీనంలోకి వెళ్లిపోతుందని స్వామి ఆరోపిస్తున్నారు. జీఎస్టీఎన్లో మెజార్టీ స్టేక్ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లడాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎల్ ఐసీ హౌసింగ్ లిమిటెడ్, హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్, హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్ఎస్ఈ స్ట్రాటజిగ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిడెట్ వంటి ప్రైవేట్ వ్యక్తుల చేతులోకి జీఎస్జీఎన్ వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఎస్టీఎన్ ను వ్యతిరేకించాలంటూ అమిత్ షాకు, బీజేపీ రాష్ట్ర సీఎంలకు లేఖ రాస్తా అనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీడీపీ వృద్ధికి జీఎస్టీ సమాధానం కాదని,  కార్మిక ఉత్పాదకత, అధిక పెట్టుబడులు అవసరమని ముందు నుంచి స్వామి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యనే రఘురామ్ రాజన్పై కామెంట్లుచేసి తీవ్ర వివాదాస్పదంగా మారారు. హైకమాండ్ ఆదేశాలతో ఈ మధ్యన కొంచెం సైలెన్సు అయిన స్వామి, ఈసారి డైరెక్ట్గా హైకమాండ్పైనే విమర్శలకు దిగారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement