రోజుకు సగటున 10వేల కాల్స్
రోజుకు సగటున 10వేల కాల్స్
Published Thu, Jul 6 2017 2:12 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM
న్యూఢిల్లీ : విజయవంతంగా జీఎస్టీ పన్ను విధానాన్ని కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేసింది. కొత్తగా అమల్లోకి తెచ్చిన ఈ పన్ను విధానంపై ట్రేడర్లకు, పన్ను చెల్లింపుదారులకు వచ్చే సందేహాలను నివృతి చేయడం కోసం హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ నెంబర్లకు రోజుకు సగటున 10వేల కాల్స్ వస్తున్నట్టు జీఎస్టీ నెట్‌వర్క్ చైర్మన్ నవీన్ కుమార్ చెప్పారు. ట్రేడర్లు, పన్ను చెల్లింపుదారులు ఈ కాల్స్ చేస్తున్నట్టు తెలిపారు. జీఎస్టీ విధానంలోకి మారే క్రమంలో ఏర్పడ గందరగోళాలను తొలగించేందుకు తాము వారికి సహకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ''తమ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లు అన్ని సందేహాలను నివృత్తి చేస్తున్నారు. నోయిడా నుంచి ఈ కాల్ సెంటర్‌ను ఆపరేట్ చేస్తున్నాం. సుమారు 400 మంది ఎగ్జిక్యూటివ్‌లు వీటిని ఆపరేట్ చేస్తున్నారు'' అని నవీన్ కుమార్ తెలిపారు. రెండు కొత్త సర్వీసుల కోసం జీఎస్టీఎన్ రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించిందని చెప్పారు.
జీఎస్టీ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ డెస్క్ :
Email: cbecmitra.helpdesk@icegate.gov.in
Telephone: 1800 1200 232
జీఎస్టీఎన్ హెల్ప్ డెస్క్ :
Email: helpdesk@gst.gov.in
Telephone: 0120 4888999
Twitter handles: @askGST_GOI, @askGSTech
టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టెక్ మహింద్రాలతో కలిసి జీఎస్టీఎన్ నెట్‌వర్క్ రెండు కాల్ సెంటర్లను కూడా పన్ను చెల్లింపుదారులకు, పన్ను అధికారుల కోసం ఏర్పాటుచేసింది. పన్ను చెల్లింపుదారులకు హెల్ప్‌లైన్ నెంబర్: 0120-4888999 కాగ, పన్ను అధికారులకు 0124-4479900 నెంబర్‌ను అందుబాటులో ఉంచింది.
Advertisement