GST Rate Hike On Milk, Rice, Curd, Other Items From July18th - Sakshi
Sakshi News home page

GST Rate Hike: జీఎస్‌టీ బాడుదు షురూ.. రేపటి నుంచే సామాన్యుడిపై ధరల దరువు!

Jul 17 2022 9:39 AM | Updated on Jul 17 2022 1:44 PM

Gst Rate Hike On Milk, Rice, Curd, Other Items From July18th - Sakshi

ఉప్పు నుంచి పప్పు దాకా.. కూరగాయల నుంచి పాల పాకెట్‌ దాకా పెరిగిపోతున్న వస్తువుల ధరల దరువుకు సామాన్యులు అల్లాడిపోతున్నారు. అది చాలదన్నట్లు రేపటి నుంచి నిత్యావసర సరుకులపై గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ విధింపు అనివార్యంమైంది. దీంతో నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్ల ఖర్చు పెట్టాల్సి పరిస్థితి నెలకొనడంతో కొనుగోలు దారులు లబోదిబోమంటున్నారు. 

గత నెలలో జరిగిన జీఎస్టీ 47వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు రకాల నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు విధింపు నిర్ణయం తీసుకుంది. దీంతో పెరిగిన కొత్త జీఎస్టే రేట్లు రేపటి నుంచి (జులై18) అమల్లోకి రానున్నాయి.  

ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్‌ అధ్యక్షతన జూన్‌లో రెండు రోజుల పాటు  వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశంలో కొత్త జీఎస్టీని పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. లీగల్‌ మెట్రాలజీ యాక్ట్‌ ప్రకారం..జులై 18 నుంచి ప్రీ ప్యాక్‌డ్‌ అండ్‌ ప్రీ లేబుల్డ్‌ రీటైల్‌ ప్యాకెట్‌ ఉత్పత్తులపై ఉదాహరణకు పెరుగు,లస్సీ, బటర్‌ మిల్క్‌ ప్యాకెట్లపై 5శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.  
 
దీంతో పాటు చెక్కులు (లూజ్ లేదా బుక్ రూపంలో) జారీ చేయడానికి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై 18 శాతం జీఎస్టీ, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌లో 12 శాతం నుంచి 18 శాతానికి సవరించాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫారసుతో ఎల్ఈడీ లైట్లు, మ్యానిఫ్యాక్చరింగ్‌ ఇండస్ట్రీలో ఉపయోగించే ఫిక్సర్లు(టూల్స్‌), ఎల్ఈడీ ల్యాంప్స్ ధరలు పెంపునకు సిద్ధంగా ఉన్నాయి.

కాస్ట్లీగా ఆసుపత్రి గదులు, హోటల్స్ రూమ్స్‌ 
ప్రతి రోగికి రోజుకు రూ.5000 కంటే ఎక్కువ ఉన్న ఆసుపత్రి గది అద్దె (ఐసీయూ మినహాయించి) ఐటిసి లేకుండా గదికి 5 శాతం వసూలు చేయనున్నారు. గతంలో దీనికి గూడ్స్ యాడ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) నుంచి మినహాయింపు ఉండేది. కాగా, ప్రస్తుతం పన్ను మినహాయింపు కేటగిరీకి భిన్నంగా హోటల్ గదులను రోజుకు రూ.1,000 లోపు 12 శాతం జీఎస్టి శ్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టి కౌన్సిల్ నిర్ణయించింది.

చదవండి: జీఎస్టీ బాదుడు, మరింత ఖరీదుగా నిత్యావసర వస్తువులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement