న్యూఢిల్లీ: రాష్ట్రాలకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు జీఎస్టీ వసూళ్లలో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు త్వరలోనే రూ.35వేల కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయనుంది. రాష్ట్రాల పన్ను ఆదాయం 14శాతం పెరగకుంటే ఆ నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రం చెల్లిస్తుందన్న విషయం తెలిసిందే. జీఎస్టీ నష్టాల చెల్లింపులకు 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని కేంద్రం ఆధారం చేసుకోనుంది.
ఇప్పటి వరకు కేంద్రం జీఎస్టీ నష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు రూ.2.11లక్షల కోట్లను చెల్లించాయి. జీఎస్టీ రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషన్ పాండే స్పందస్తూ..జీఎస్టీ వసూళ్లను పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోనుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నెలకు రూ.లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లను పెంచే విధంగా కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పాండే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment