Tax Revenue
-
Telangana: ఖజానా కటకట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో రూ.100 ఆదాయం కింద ప్రతిపాదిస్తే, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు ముగిసే సమయానికి రూ.39.41 మాత్రమే వచ్చాయి. కానీ బడ్జెట్లో రూ.100 ఖర్చు కింద ప్రతిపాదించగా, ఇదే ఆరు నెలల్లో ఖర్చు పెట్టింది మాత్రం రూ.39.75. అంటే బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే ఆదాయం కంటే ప్రభుత్వ ఖర్చే ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పన్ను రాబడుల్లో మందగమనం, కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం రాకపోవడం, పన్నేతర ఆదాయం భారీగా తగ్గడం లాంటి పరిణామాలతో ఆరు నెలల తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డోలాయమానంలో పడిందని ఈ గణాంకాల ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే అమ్మకపు పన్ను మినహా మిగిలిన పన్ను రాబడుల్లోనూ తగ్గుదల నమోదు కావడం గమనార్హం. వచ్చింది రూ.లక్ష కోట్లే 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.74 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 నాటికి ఆరు నెలలు ముగిసే సమయానికి ఈ ప్రతిపాదనల్లో కేవలం 39.41 శాతం అంటే రూ.1.08 లక్షల కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది. ఇందులో పన్ను రాబడులు కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే కావడం గమనార్హం. బడ్జెట్ ప్రతిపాదనలను బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.64 లక్షల కోట్లు పన్ను రాబడుల రూపంలో సమకూరాలి. అంటే ఆరు నెలలకు అందులో సగం లెక్కన కనీసం రూ.82 వేల కోట్లు రావాల్సి ఉంది. కానీ ఏకంగా రూ.13 వేల కోట్లు తక్కువగా కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే పన్నుల రూపంలో సమకూరాయి. జీఎస్టీ కింద రూ. 24,732 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.7,251 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.16,081 కోట్లు, ఎక్సైజ్ పద్దు కింద రూ.9,492 కోట్లు వచ్చాయి. ఇందులో అమ్మకపు పన్ను మినహా అన్ని శాఖల్లోనూ గత ఏడాది కంటే తగ్గుదల కనిపించింది. ఇక పన్నేతర ఆదాయం అయితే గత ఏడాదితో పోలిస్తే చాలా దూరంలో ఉంది. గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో సెప్టెంబర్ నాటికి 74 శాతం పన్నేతర ఆదాయం రాగా, ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇప్పటివరకు కేవలం 11.65 శాతం అంటే రూ.4,101 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు రూ.లక్ష కోట్లు రాగా, మరో రూ.1.70 లక్షల కోట్లు రావాల్సి ఉందని, కానీ పరిస్థితి ఇలా కొనసాగితే మరో రూ.లక్ష కోట్లు రావడం కూడా గగనమేనని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. 30 శాతానికి పైగా అప్పులే రెవెన్యూ రాబడులు పోను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అప్పుల మీదనే ఆధారపడి నడుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన రూ.1.08 లక్షల కోట్ల ఆదాయంలో అప్పులు రూ.32,536 కోట్లు ఉండటం గమనార్హం. అంటే మొత్తం వచ్చిన దాంట్లో 30 శాతానికి పైగా అప్పుల ద్వారానే సమకూరిందన్నమాట. ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం అప్పుల్లో ఇప్పటికే 66 శాతం సమీకరించిన నేపథ్యంలో రానున్న ఆరు నెలల్లో అప్పుల సమీకరణకు కూడా అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు అనుగుణంగా రుణాల సమీకరణ జరగాల్సిన నేపథ్యంలో రానున్న ఆరునెలల పాటు సొంత ఆదాయం పెంచుకోవడం పైనే ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుందని, లేదంటే ఖజానాకు తిప్పలు తప్పవని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇక కేంద్రం నుంచి సాయం కూడా ఆశించిన మేర అందడం లేదని ఆరునెలల లెక్కలు చెపుతున్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్రం రూ.21 వేల కోట్లకు పైగా ఇస్తుందని బడ్జెట్లో ప్రతిపాదించగా, ఆరు నెలల్లో కేవలం రూ.2,447 కోట్లు (11 శాతం) మాత్రమే వచ్చాయి. ఖర్చులు పైపైకి.. ఓ వైపు ఆదాయం తగ్గుతుండగా, మరోవైపు ఖర్చుల అనివార్యత రాష్ట్ర ఖజానాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ ఏడాది రూ.2.54 లక్షల కోట్లు ఖర్చవుతుందని బడ్జెట్లో ప్రతిపాదించగా, ఇప్పటివరకు రూ.1.01 లక్షల కోట్లు (39.75 శాతం) ఖర్చయినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో రెవెన్యూ పద్దు కింద రూ.41,802 కోట్లు, అప్పులకు వడ్డీల కింద రూ.13,187 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం రూ.21,279 కోట్లు, పింఛన్ల కోసం రూ. 8,560 కోట్లు, సబ్సిడీల రూపంలో రూ.6,376 కోట్లు వ్యయం జరిగింది. ఇక మూలధన వ్యయం కింద మరో రూ.9,924 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అనివార్య ఖర్చులు పెరిగాయని అర్థమవుతోందని, ఈ ఏడాదిలో కొత్త పథకాల అమలుకు ఎలాంటి అవకాశం లేదని, ఉన్న పథకాలనే కనాకష్టంగా కొనసాగించాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. రాబడి తగ్గి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత పొదుపుగా వ్యవహరించడంతో పాటు వీలున్నంత త్వరగా రాబడి మార్గాలను పెంచుకునే ప్రయత్నాలను ప్రారంభించకపోతే ఆర్థిక ఒడిదుడుకులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అదనపు రాబడులొచ్చే ప్రణాళికలు చూడండి – సీఎస్‌తో సీఎం, డిప్యూటీ సీఎం ప్రత్యేక భేటీ రాష్ట్ర ఆదాయ వనరులపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాల జేఏసీలతో సమావేశం అనంతరం ఈ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పరిస్థితులను బేరీజు వేసుకుని అదనంగా ఖజానాకు రాబడులు వచ్చేందుకు ఎలాంటి ప్రణాళికలు చేపడతారో వివరిస్తూ వీలున్నంత త్వరగా నివేదికలు ఇవ్వాలని సీఎస్‌ను సీఎం, డిప్యూటీ సీఎంలు ఆదేశించినట్టు సమాచారం. -
సెస్‌లు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా కుదరదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పన్నుల వాటా పంపిణీలో పనితీరు బాగా ఉన్న రాష్ట్రాలకు అన్యా యం జరుగుతోందనే ఆరోపణలను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా తోసిపుచ్చా రు. పంపిణీ చేయదగిన కేంద్ర నిధుల నుంచి రాష్ట్రాలకు 41 శాతాన్ని పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని, చట్టరీత్యా తప్పనిసరిగా కేంద్రం పంపిణీ చేయాల్సిందేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నికర పన్నుల ఆదా యంలో సెస్‌లు, సర్‌చార్జీలు సైతం కలిసి ఉంటాయని, వీటిని రాష్ట్రాలకు పంపిణీ చేయడం కుదరదన్నారు. సెస్‌లు, సర్‌చార్జీలను సైతం లెక్కించి కేంద్రం రాష్ట్రాలకు 31 లేదా 32 శాతం నిధులు మాత్రమే ఇస్తోందని రాష్ట్రాలు అంటున్నాయని తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడా రు. కేంద్రం వసూలు చేసే సెస్‌లు, సర్‌చార్జీల్లో సైతం రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని సిఫారసు చేస్తారా? అని జర్నలిస్టులు ప్రశ్నించగా, ఈ అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదంటూనే.. సెస్‌లు, సర్‌చార్జీలను వసూలు చేసి 100 శాతం తీసుకునే అధికారం కేంద్రానికి రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. ఆ విధంగా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ పట్టణాభివృద్ధి ప్రణాళికలు భేష్దేశంలో గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యతని స్తుండడంతో పట్టణాభివృద్ధి నిర్లక్ష్యానికి గురవు తోందని, తెలంగాణ ఈ విషయంలో చాలా ముందుచూపుతో వెళ్తోందని అరవింద్ పనగరి యా ప్రశంసించారు. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం వేసిన ప్రణాళికలు ఒక ఆర్థికవేత్తగా తనను ఆకట్టుకున్నాయన్నారు. ఆర్థిక ప్రణాళికల విష యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని, ప్రభుత్వం వివరించిన రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు తమను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. రాష్ట్రానికి భారంగా మారిన రుణాల రీస్ట్రక్చరింగ్ అంశం తమ పరిధిలోకి రాదని వివరించారు.జీఎస్డీపీ ఆధారంగా నిధుల పంపిణీని రాష్ట్రం కోరిందిఏ ప్రాతిపదికన కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల పంపకాలు జరగాలి? ఏ ప్రాతిపదికన రాష్ట్రాల మధ్య నిధుల పంపకాలు జరగాలి? అనే అంశంపై రాష్ట్రం సూచనలు చేసిందని పనగరియా చె ప్పారు. జీడీపీకి ఒక్కో రాష్ట్రం అందిస్తున్న చేయూ త, ఆయా రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీ పీ)ని ప్రామాణికంగా తీసుకుని 28 రాష్ట్రాల మధ్య సమానంగా (హారిజాంటల్గా) నిధుల పంపిణీ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు. ఇప్పటివరకు తాము 6 రాష్ట్రాల్లో పర్యటించగా, కర్ణాటక, తెలంగాణ ఈ తరహా డిమాండ్ చేశాయని తెలిపారు. రాష్ట్రం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని చెప్పారు. తాము ఇంకా 20కి పైగా రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని తెలిపారు.ఏం సిఫారసులు చేస్తామో ఇప్పుడే చెప్పలేం2026–27 నుంచి 2030–31 మధ్య ఐదేళ్ల కా లంలో కేంద్ర పన్నుల ఆదాయం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ, రాష్ట్రాల వాటా నిధు లు మళ్లీ రాష్ట్రాల మధ్య పంపిణీ, కేంద్ర సంఘటిత నిధి నుంచి పంచాయతీలు, మున్సిపా లిటీలకు నిధుల పంపిణీ, విపత్తుల నిర్వహణ కు నిధుల పంపిణీ విషయంలో కేంద్రానికి 16వ ఆర్థిక సంఘం సిఫారసులు చేయనుందని పనగరియా వివరించారు. అయితే ఎ లాంటి సిఫారసులు చేస్తామో ఇప్పుడే వెల్ల డించలేమన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫా రసులనే కేంద్రం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శలున్న నేపథ్యంలో, 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు ఏం విలువ ఉంటుందని జర్నలిస్టులు ప్రశ్నించగా.. కేంద్రం, రా ష్ట్రాల మధ్య నిధుల పంపిణీ, స్థానిక సంస్థ లు, విపత్తుల నివారణకు నిధుల పంపిణీ విషయంలో తమ సిఫారసులను కేంద్రం తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇతర సిఫారసుల అమలు కేంద్రంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, జార్జి మాథివ్, మనోజ్ పాండ, సౌమ్య కంటి ఘోష్ సమావేశంలో పాల్గొన్నారు. -
అంచనాలకు మించి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పన్ను ఆదాయం ఏటేటా పెరుగుతోంది. వరుసగా మూడో ఏడాది పన్ను రాబడుల్లో వృద్ధి నమోదు అయ్యింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కల ప్రకారం మార్చి 2024 నాటికి రూ.1.35 లక్షల కోట్లు పన్ను ఆదాయం కింద సమకూరాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర పన్నుల రూపేణా ఈ మొత్తం సమకూరిందని కాగ్ తెలిపింది.బడ్జెట్ ప్రతిపాదనల కంటే రూ.4 వేల కోట్లు ఎక్కువగా, సవరించిన అంచనాల కంటే రూ.17 వేల కోట్లు ఎక్కువగా ఈ ఏడాది పన్ను రాబడులు రావడం గమనార్హం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పన్ను రాబడుల వ్యవస్థ సజావుగానే ముందుకెళుతోందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రంలో రూ.48 వేల కోట్ల పన్ను ఆదాయం వచ్చింది. గత మూడేళ్లుగా.. పన్ను రాబడులు తొలిసారిగా 2021–22లో బడ్జెట్ ప్రతిపాదనలకు మించి వచ్చాయి. ఆ ఏడాదిలో రూ.1.06 లక్షల కోట్లు పన్ను రాబడుల కింద వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, రూ.1.09 లక్షల కోట్ల వాస్తవిక రాబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆ ఏడాది పన్ను వసూళ్లలో ఏకంగా రూ.30 వేల కోట్ల పెరుగుదల చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి పూర్తిగా కోలుకుని, సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆదాయంలో మంచి వృద్ధి కనిపించింది.ఆ తర్వాతి ఏడాది కూడా బడ్జెట్ ప్రతిపాదనలతో పోల్చితే స్వల్ప పెరుగుదలే నమోదయ్యింది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో రూ.1.31 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపెట్టారు. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ పన్ను రాబడులు రూ.1.18 లక్షల కోట్లు వచ్చే అవకాశముందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల కంటే రూ.4 వేల కోట్లు అదనంగా రూ.1.35 లక్షల కోట్ల పన్ను ఆదాయం సమకూరింది. శాఖల వారీగా ఇలా...! శాఖల వారీగా పరిశీలిస్తే.. 2022–23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జీఎస్టీ రాబడులు రూ.5 వేల కోట్ల వరకు పెరిగాయి. 2022–23లో రూ.41,888 కోట్లు జీఎస్టీ కింద రాగా, 2023–24లో రూ.46,500 కోట్లు వచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో అంతకుముందు ఏడాది రూ.14,228 కోట్లు రాగా, గత ఏడాదిలో రూ.14,295 కోట్లు వచ్చాయి. ఇక అమ్మకపు పన్ను ద్వారా 2022–23లో రూ.29,604 కోట్లు రాగా, గత ఏడాది కొంచెం ఎక్కువగా రూ.29,989 కోట్లు సమకూరాయి.ఇక ఎక్సైజ్ ద్వారా అంతకు ముందు సంవత్సరం రూ.18740 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 20,298.89 కోట్లు వచ్చింది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 2022–23లో రూ.13,394 కోట్లు రాగా, 2023–24లో రూ.16,536.65 కోట్లు వచ్చాయి. ఇతర పన్నుల రూపంలో అంతకుముందు ఏడాది రూ. 8,430 కోట్లు రాగా, ఈసారి రూ.7,918.74 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఐదు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పన్ను ఆదాయ రాబడులు పెరిగాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెల నాటికి రూ. 80,853 కోట్ల పన్ను ఆదాయం వచ్చింది. ఆ తర్వాతి నాలుగు నెలల్లో మరో రూ.46 వేల కోట్లు రాగా, మొత్తం ఆ ఏడాది పన్ను ఆదాయం రూ. 1.26 లక్షల కోట్లకు చేరింది. 2023–24లో నవంబర్ నెల నాటికి రూ.87,083 కోట్లుగా నమోదైన పన్ను ఆదాయం ఏడాది చివరి నాటికి (మార్చి 2024 ) రూ. 1.35 లక్షల కోట్లకు చేరింది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతి 4 నెలల్లో వచ్చిన పన్ను ఆదాయం రూ. 48 వేల కోట్లన్నమాట. గత ఏడాది చివరి నాలుగు నెలలతో పోలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో పన్ను ఆదాయం రూ.2వేల కోట్లు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. -
6 నెలలు... రూ.1.18 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1.18 లక్షల కోట్ల మేర నిధులు సమకూరాయి. వివిధ వనరుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 87,207.22 కోట్లుకాగా బహిరంగ మార్కెట్లో రూ. 31,333.72 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం సేకరించింది. 2023–24 బడ్జెట్ అంచనాల్లో మొత్తం రాబడులు రూ. 2.59 లక్షల కోట్లుకాగా అందులో 46 శాతం మేర అర్ధ వార్షిక కాలంలో వచ్చాయి. ఇందులో పన్ను ఆదాయం రూ. 66,691.49 కోట్లు ఉండగా పన్నేతర ఆదాయం రూ. 16,896.29 కోట్లు వచ్చినట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల నివేదికలో వెల్లడించింది. ఖర్చు రూ. 1.14 లక్షల కోట్లు తొలి ఆరు నెలల కాలంలో రూ. 1,18,558.96 కోట్ల మేర రాబడులురాగా అందులో రూ. 1,14,151.39 కోట్లు ఖర్చయిందని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం రూ. 91,315.21 కోట్లుగా నమోదవగా ప్రణాళికా వ్యయం కింద రూ. 22,836.18 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం వ్యయ అంచనాల్లో ఆరు నెలల కాలంలో జరిగిన ఖర్చు 61 శాతం కావడం గమనార్హం. ఇక సమకూరిన పన్ను ఆదాయాన్ని శాతాలవారీగా పరిశీలిస్తే ఎక్సైజ్ ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్ ఆదాయ అంచనా రూ. 19,884 కోట్లుకాగా అందులో 62 శాతం అంటే రూ. 12,255.95 కోట్లు మొదటి ఆరునెలల్లోనే వచ్చింది. రానున్న ఆరు నెలల కాలంలో కలిపి అంచనాలను మించి ఎక్సైజ్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని వర్గాలంటున్నాయి. -
సొంత పన్నులు పైపైకి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం పన్నుల రాబడిలో స్వయం సమృద్ధి సాధిస్తోంది. ఏటేటా పెరుగుతున్న సొంత ఆదాయ వనరులే ధీమాగా ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌కు రూపకల్పన చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే 2022–23 (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం)లో రాష్ట్ర పన్నుల కింద రూ.1.10 లక్షల కోట్లకు పైగా సమకూరగా, 2023–24కు ఇవి రూ.1.31 లక్షల కోట్లకు పెరగనున్నాయి. ఇందులో ముఖ్యంగా ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల పద్దు కిందనే రూ.40వేల కోట్ల వరకు సమకూరనుండగా, ఎక్సైజ్ పద్దు కింద రూ.19,884 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.18,500 కోట్ల ఆదాయం రానున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. దీనికితోడు రాష్ట్రంలో జరిగే వ్యాపారం, అమ్మకాల ద్వారా రూ.39,500 కోట్లు, వాహనాలపై పన్నుల ద్వారా రూ.7,512 కోట్లు సమకూరనున్నాయి. ఇతర ఆదాయాలతో కలిపితే మొత్తం రూ.1.31 లక్షల కోట్లు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అప్పుల రూపంలో రూ. 46 వేల కోట్లు రెవెన్యూ రాబడుల కింద పరిగణించే అప్పుల రూపంలో రూ.46వేల కోట్లకు పైగా ప్రతిపాదించింది. ఇందులో బహిరంగ మార్కెట్లో తీసుకునే రుణాలు రూ.40,615 కోట్లు కాగా, కేంద్రం, ఇతర సంస్థల నుంచి మరో రూ.6 వేల కోట్లు తీసుకోనున్నట్టు ప్రతిపాదించింది. కాగా, అంతర్రాష్ట్ర సెటిల్మెంట్ల కింద ఈసారి బడ్జెట్ రాబడులను రూ. 17,828 కోట్ల కింద చూపెట్టారు. ఈ నిధులు ఏపీ నుంచి రావాల్సి ఉందని, డిస్కంల కింద తమకు ఏపీ చెల్లించాల్సింది ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తాన్ని మంజూరు చేస్తే ఏపీ ఇచ్చినప్పుడు తిరిగి చెల్లిస్తామని ఇటీవల కేంద్రానికి రాసిన లేఖ మేరకు నిధులు వస్తాయనే అంచనాతో ఈ మొత్తాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొంటున్నాయి. ఇదే పద్దు కింద 2022–23లో నిధులు చూపకపోయినా సవరించిన అంచనాల్లో అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారం కింద రూ.7,500 కోట్లు సమకూరినట్టు చూపడం గమనార్హం. మూడేళ్ల క్రితం లక్ష కోట్లు సంవత్సరాలవారీగా లెక్కిస్తే రెవెన్యూ రాబడుల్లో గణనీయ వృద్ధి కనిపిస్తోందని బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం అంటే 2020–21లో అన్ని రకాల పన్నులు, ఆదాయాలు కలిపి రెవెన్యూ రాబడుల కింద ఖజానాకు రూ.లక్ష కోట్లు సమకూరితే 2023–24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అవి రూ.2.16 లక్షల కోట్లకు చేరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. 2021–22లో రూ.1.27 లక్షల కోట్లు రాగా, 2022–23 సవరించిన అంచనాల ప్రకారం రూ.1.75 లక్షల కోట్లు రానుండటం గమనార్హం. -
Telangana: పన్నుల ఆదాయం రెండేళ్లలో డబుల్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సొంత పన్నుల ఆదాయం వేగంగా పెరుగుతోంది. ఖజానాకు గణనీయంగా రాబడి సమకూరుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి తొలి ఏడు నెలల్లో వచ్చిన పన్ను ఆదాయం దాదాపు రెండింతలు కావడం గమనార్హం. రెండేళ్ల క్రితం తొలి ఏడు నెలల్లో (ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) అన్నిపన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.22,846 కోట్ల ఆదాయంరాగా.. ఈ ఏడాది అదే సమయానికి రూ.40,788 కోట్లు సమకూరింది. నిజానికి గత ఏడాది (2021–22) నుంచే ఆదాయం పెరగడం మొదలైందని.. అదే ఒరవడి కొనసాగుతోందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెప్తున్నారు. గత ఏడాది కన్నా ఈసారి అన్ని పన్నుల ఆదాయం సగటున 10 శాతం పెరిగిందని వివరిస్తున్నారు. వ్యాట్ నుంచి అధికంగా.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రెండు రూపాల్లో సమకూరుతుంది. పెట్రో ఉత్పత్తులు, లిక్కర్లపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో, ఇతర అన్నిరకాల వ్యాపార లావాదేవీలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో రాబడి వస్తుంది. ప్రస్తుతం వ్యాట్ కింద పెట్రోల్, లిక్కర్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలతో పోలిస్తే ఈసారి రెండింతలకుపైగా ఖజానాకు సమకూరింది. 2020–21లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ద్వారా రూ.3,970 కోట్లురాగా.. ఈసారి ఏకంగా రూ.8,770 కోట్లకు చేరింది. లిక్కర్‌పై వ్యాట్ రాబడి కూడా 40 శాతం వరకు పెరిగింది. 2020–21 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రూ.6వేల కోట్లు సమకూరగా.. 2021–22లో రూ.7,529 కోట్లు, ఈసారి రూ.8,384 కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే 10 శాతం పెరిగింది. ఇక ఇతర వ్యాపార లావాదేవీలపై విధించే వ్యాట్ కలిపి ఈ ఏడాది మొత్తంగా రూ.17,560 కోట్లు ఖజానాకు చేరింది. ఇది 2020–21లో రూ.10,367 కోట్లు, 2021–22లో రూ.15,340 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. జీఎస్టీ పరిహారం రాకపోయినా.. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తికావడంతో ఈ ఏడాది జూలై నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పరిహారాన్ని కేంద్రం నిలిపివేసింది. ఆ పరిహారం రాకపోయినా జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూసుకెళుతోంది. అక్టోబర్ చివరినాటికి వచ్చిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జీఎస్టీ రూపంలో రూ.21,322 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరింది. ఇందులో ఎస్జీఎస్టీ రూ.9,537.63 కోట్లుకాగా, ఐజీఎస్టీలో వాటా రూ.10,801 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పన్ను రాబడి 31 శాతం వృద్ధి చెందడం విశేషం. ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ కలిపి 2020–21లో రూ.10,917 కోట్లు, 2021–22లో రూ.16,222 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే రెండేళ్లలో జీఎస్టీ వసూళ్లు రెండింతలు పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా వ్యాట్, జీఎస్టీ రెండూ కలిపి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వస్తుండటం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరం తొలి ఏడునెలలతో పోలిస్తే.. ఈసారి జూలై, అక్టోబర్ నెలల్లో పన్ను వసూళ్లు కాస్త తగ్గాయని తెలిపారు. కానీ మిగతా ఐదు నెలల్లో అధిక వృద్ధితో మొత్తంగా పన్ను వసూళ్లు పెరిగాయని వివరించారు. -
ఆదాయం పెంచేందుకు... ‘మందు’కు రండి
టోక్యో: ‘యువతీ యువకుల్లారా! బాబ్బాబూ, దయచేసి మద్యం అలవాటు చేసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ ఎంపిక చేసుకుని తాగండి. ప్లీజ్’ అంటోంది జపాన్ సర్కారు! దేశంలో లిక్కర్ ఆదాయం ఏటేటా భారీగా పడిపోతుండటమే ఇందుకు కారణం. 1995లో సగటున ఒక్కో జపనీయుడు ఏటా 100 లీటర్ల మందు తాగితే 2020 కల్లా అది ఏకంగా 75 లీటర్లకు పడిపోయిందట. దాంతో 1980ల్లో మొత్తం పన్ను ఆదాయంలో 5 శాతంగా ఉన్న మద్యం వాటా కాస్తా 2011కు 3 శాతానికి, 2020కల్లా ఏకంగా 1.7 శాతానికి తగ్గిందని జపనీస్ టైమ్స్ పేర్కొంది. 2019తో పోలిస్తే 2020లో మద్యం ఆదాయం ఏకంగా 110 బిలియన్ యెన్ల మేరకు పడిపోయిందట! గత 31 ఏళ్లలో ఇదే అతి పెద్ద తగ్గుదల! ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ ఇప్పటికే నిధుల లేమితో సతమతమవుతోంది. మద్యం అమ్మకాలు కుచించుకుపోవడం మూలి గే నక్కపై తాటిపండు చందంగా మారింది. దాంతో ప్రభుత్వం ఆందోళనలో పడింది. వాటిని ఎలాగైనా పెంచాలని కంకణం కట్టుకుంది. ఇంతకీ సమ స్య ఎక్కడుందా అని కుస్తీ పడితే తేలిందేమిటంటే, పెద్దలు పర్లేదు గానీ జపాన్ యువతే అస్సలు మందు జోలికే పోవడం లేదట. జీవన శైలిలో వచ్చిన మార్పులు, కరోనా మహమ్మారి వంటి వాటివల్ల యూత్ మందు ముట్టడం మానేశారట. ఆరోగ్యం విలువ తెలిసొచ్చింది గనుక కరోనా సమస్య తగ్గుముఖం పట్టినా బాటిళ్లకేసి కన్నెత్తి కూడా చూడటం లేదట! లిక్కర్ అమ్మకాలు తగ్గుముఖం పట్టడానికి ఇదే ప్రధాన కారణమని తేలింది. సేక్ వివా... ఈ నేపథ్యంలో మందు తాగేలా యువతను ప్రోత్సహించేందుకు భారీ ప్రచారానికి జపాన్ ప్రభుత్వం తెర తీసింది. ఇందులో భాగంగా ‘‘సేక్ వివా’’ పేరుతో నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ దేశవ్యాప్త పోటీ నిర్వహిస్తోంది. 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్కులు ఇందులో పాల్గొనవచ్చు. యూత్‌లో మందు కొట్టే అలవాటును పెంచేందుకు ఏం చేయాలో వారు సలహాలు సూచనలివ్వాలి. అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్స్ తదితరాల సాయంతో వినూత్నం, ఆకర్షణీయం అయిన సేల్స్ టెక్నిక్స్ పద్ధతులను రూపొందించవచ్చు. ఈ పోటీ సెప్టెంబర్ 9 దాకా నడుస్తుంది. ఫైనలిస్టులను అక్టోబర్‌లో నిపుణుల కన్సల్టేషన్ కోసం ఆహ్వానిస్తారు. నవంబర్‌లో టోక్యోలో తుది రౌండ్ పోటీ ఉంటుంది. విజేత తన మద్యం అమ్మకాల పెంపు బ్లూప్రింట్‌ను అమలు చేసేందుకు ఏజెన్సీ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందట! ‘‘మద్యం మార్కెట్ నానాటికీ కుంచించుకుపోతోంది. అందుకే యువత మందు అలవాటు చేసుకుని ఈ పరిశ్రమకు జీవం పోసేలా చేయడమే ఈ కాంపిటీషన్ లక్ష్యం’’ అని ఏజెన్సీ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదేం దిక్కుమాలిన పోటీ! ఈ కాంపిటీషన్‌పై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వమే పనిగట్టుకుని మద్యం అమ్మకాలు పెంచేందుకు ప్రయత్నించడం ఏమిటంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ‘‘అది కూడా దేశ సంపద అయిన యువతను మందు తాగి ఆరోగ్యం చెడగొట్టుకొమ్మని ప్రభుత్వమే పిలుపునివ్వడం ఎంతవరకు సబబు? మద్యానికి దూరంగా ఉండటం నిజానికి మంచిదే కదా!’’ అని జనం ప్రశ్నిస్తున్నారు. ఆదాయమే తప్ప జనారోగ్యం పట్టదా అంటూ దుయ్యబడుతున్నారు. ‘మితిమీరిన తాగుడు మంచిది కాదు. అదో పెద్ద సామాజిక సమస్య’ అంటూ జపాన్ ఆరోగ్య శాఖ గతేడాది కార్యక్రమాలు జరిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. -
చదివింపుల్లేవ్.. విదిలింపులే!
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా పన్నుల ఆదాయం పొందుతున్న కేంద్ర ప్రభుత్వం... కేంద్రీయ విద్యాసంస్థల మంజూరులో మాత్రం దక్షిణాదికి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. గత 8 ఏళ్లలో మంజూరు చేసిన 220 కేంద్రీయ విద్యాసంస్థల్లో (157 కేంద్రీయ విద్యాలయాలు, 63 జవహర్ నవోదయ విద్యాలయాలు) దక్షిణాదికి కేవలం 40 (37 కేవీలు, 3 జేవీవీలు) మాత్రమే లభించడం ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఈ అంశంపై ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలను కేంద్రం తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,311 కేంద్రీయ విద్యాసంస్థలు (661 జవహర్ నవోదయ విద్యాలయాలు, 1,650 కేంద్రీయ విద్యాలయాలు) ఉన్నాయని తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యత... కొత్తగా విద్యాలయాల మంజూరులో బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యత ఇచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవీల్లో అత్యధికంగా మధ్యప్రదేశ్‌కు 20 మంజూరు చేసిన కేంద్రం... ఆ తర్వాత యూపీకి 16, కర్ణాటకకు 13, ఛత్తీస్‌గఢ్‌కు 10 చొప్పున మంజూరు చేసింది. ఇక జవహర్ నవోదయ విద్యాలయాల విషయానికి వస్తే అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌కు 11, గుజరాత్‌కు 8, యూపీకి 6 చొప్పున ఇచ్చింది. దాదాపు 17 రాష్ట్రాలకు కొత్తగా జేఎన్వీలు మంజూరు చేయకపోవడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం కర్ణాటకకు మాత్రమే 3 జేఎన్వీలు మంజూరవగా మిగతా రాష్ట్రాలకు ఒక్కటీ లభించలేదు. జిల్లాకో జేఎన్వీ ఏమైంది..? ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఉండాలని కేంద్ర ప్రభుత్వ నిబంధన ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటవగా కొత్త జిల్లాలకు జేఎన్వీలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటై ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క జేఎన్వీ కూడా కేంద్రం మంజూరు చేయలేదు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో జేఎన్వీల ఏర్పాటును సైతం ప్రస్తావించారు. కానీ కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో కొత్తగా ఒక్క పాఠశాల కూడా ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 జేఎన్వీలు మాత్రమే ఉన్నాయి. -
సొంత ఆదాయంపై ధీమా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో పన్ను ఆదాయ ప్రతిపాదనలు తొలిసారి రూ. లక్ష కోట్లను మించాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 1,08,212 కోట్ల మేర సొంత పన్ను ఆదాయం వస్తుందనే అంచనాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను బట్టి చూస్తే రాష్ట్ర సొంత ఆదాయ వనరులపై సర్కారుకు పూర్తి ధీమా ఉన్నట్లు అర్థమవుతోంది. గతేడాది ప్రతిపాదించిన రూ. 92 వేల కోట్ల పన్ను రాబడుల్లో 100 శాతం రావడంతో ఈసారి అదనంగా రూ. 17 వేల కోట్లను అంచనా వేస్తూ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించింది. వాహనాలపై పన్ను పద్దు మినహా... ఈసారి బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే పన్ను ఆదాయ పద్దులన్నింటిలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఒక్క వాహనాలపై పన్ను పద్దులో మాత్రమే కొంత తగ్గుదలను ప్రతిపాదించారు. ముఖ్యంగా అమ్మకపు పన్ను అంచనాలు గతేడాది రూ. 26,500 కోట్లు చూపగా ఈసారి దాన్ని రూ.33,000 కోట్లకు పెంచారు. అలాగే జీఎస్టీ కింద రూ. 31 వేల కోట్లు వస్తాయని గతేడాది అంచనా వేయగా ఈసారి రూ. 36,203 కోట్లు ప్రతిపాదించారు. ఎక్సైజ్ శాఖ పద్దు కూడా రూ. 500 కోట్లు పెరిగింది. గతేడాది రూ. 17,000 కోట్ల అంచనాలు ఈసారి రూ. 17,500 కోట్లకు చేరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల పద్దు కింద గతేడాది రూ. 12,500 కోట్లు వస్తాయని అంచనా వేయగా ఈసారి రూ. 15,600 వస్తాయని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. భూముల అమ్మకాలకు అదే స్థాయిలో... అయితే ఈసారి పన్నేతర ప్రతిపాదనలను తగ్గించి చూపారు. గతేడాది పన్నేతర ఆదాయం రూపంలో రూ. 30,557 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా కేవలం రూ. 20,557 కోట్లే వచ్చాయి. అయినా ఈసారి మరో రూ. 5 వేల కోట్లు కలిపి రూ. 25,422 కోట్లకు పెంచారు. అందులో మైనింగ్ శాఖ ద్వారా రూ. 6,399 కోట్లు, భూముల అమ్మకాల ద్వారా రూ. 15,500 కోట్లు చూపారు. ఇతర పన్నేతర ఆదాయ రూపంలో రూ. 3,500 కోట్లు అంచనాలను ప్రతిపాదించడం గమనార్హం. -
కేంద్రం నుంచి తగ్గుతున్న పన్ను ఆదాయం
సాక్షి, అమరావతి: గత చంద్రబాబు పాలనలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయడమే కాకుండా పలు విభాగాలకు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తొలి ఏడాది నుంచి ఆర్థిక కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి తోడు 2019–20లో ఆర్థిక మందగమనంతో రాష్ట్రానికి రావాల్సిన సొంత పన్ను ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఆ తరువాత రెండేళ్ల నుంచి కోవిడ్ మహమ్మారి కారణంగా ఇటు రాష్ట్ర పన్ను ఆదాయం.. అటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ఇటీవల రాజ్యసభలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఈ విషయాన్ని రుజువు చేస్తున్నది. గత మూడేళ్లగా కేంద్ర పన్నుల వాటా నుంచి ఏపీకి రావాల్సిన పన్నులు ఎలా తగ్గిపోయాయో పంకజ్ చౌదరి వివరించారు. 2018–19తో పోల్చి చూస్తే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రూ.4,545 కోట్లు తగ్గిపోయింది. 2019–20 ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే 2020–21 ఆర్థిక ఏడాదిలో రూ.3,781 కోట్లు తగ్గిపోయింది. ఇక ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో జనవరి వరకు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రాష్ట్రానికి కేవలం రూ.22,072 కోట్లే వచ్చాయి. అలాగే విదేశీ సహాయ ప్రాజెక్టుల కింద కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం కూడా గత రెండు ఆర్థిక ఏడాదుల నుంచి తగ్గిపోయినట్లు పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానంలో స్పష్టమైంది. అలాగే గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి రాష్ట్రం నుంచి ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి వసూలైన రాబడి కూడా తగ్గిపోయినట్లు మంత్రి పంకజ్ చౌదరి వివరించారు. -
ఆదాయం ‘పది’లం!
సాక్షి, హైదరాబాద్: గతేడాది నవంబర్ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారి ఆ నెలలో పన్నుల ఆదాయం రూ. 10 వేల కోట్లు దాటింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను నవంబర్‌లో మొత్తం పన్నుల ఆదాయం రూ. 10,659 కోట్లు వచ్చింది. సాధారణంగా పన్ను ఆదాయం ఆర్థిక సంవత్సరం చివరి మాసమైన మార్చిలో పన్నుల ఆదాయం రూ. 10 వేల కోట్లు దాటుతుంది. ఆర్థిక వనరులున్న అన్ని శాఖల అధికారుల నుంచి సిబ్బంది వరకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఆ మేరకు పన్ను రాబడి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఏడాది మధ్యలోనే (8వ నెలలో) పన్నుల ఆదాయం రూ. 10 వేల కోట్లు దాటడం గమనార్హం. ఇందులో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో రూ. 3 వేల కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 1,130 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ. 2,100 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ. 2,500 కోట్లు వచ్చాయి. థర్డ్ క్వార్టర్... థండర్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో పన్ను రాబడులు భారీగానే వస్తున్నాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో వచ్చిన రూ. 8,338.93 కోట్లు కలిపి మూడో త్రైమాసికం రెండు నెలల్లోనే పన్ను ఆదాయం రూ. 19 వేల కోట్లకు చేరింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ఆదాయం కింద రూ. రూ. 1,06,900 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా అందులో నవంబర్ నాటికి రూ. 64,857.95 కోట్లు (60.67 శాతం) పన్ను వసూలైంది. అదే 2020–21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల్లో ఇదే సమయానికి కేవలం 44 శాతమే పన్ను ఆదాయం వచ్చింది. తొలి ఎనిమిది నెలల్లో వచ్చిన రూ. 64 వేల కోట్ల ఆదాయంలో కేవలం అమ్మకపు పన్ను, ఎక్సైజ్ శాఖల ద్వారానే రూ. 28 వేల కోట్ల వరకు సమకూరడం గమనార్హం. -
త్వరలోనే రాష్ట్రాలకు రూ.35వేల కోట్లు..
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు జీఎస్టీ వసూళ్లలో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు త్వరలోనే రూ.35వేల కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయనుంది. రాష్ట్రాల పన్ను ఆదాయం 14శాతం పెరగకుంటే ఆ నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రం చెల్లిస్తుందన్న విషయం తెలిసిందే. జీఎస్టీ నష్టాల చెల్లింపులకు 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని కేంద్రం ఆధారం చేసుకోనుంది. ఇప్పటి వరకు కేంద్రం జీఎస్టీ నష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు రూ.2.11లక్షల కోట్లను చెల్లించాయి. జీఎస్టీ రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషన్ పాండే స్పందస్తూ..జీఎస్టీ వసూళ్లను పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోనుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నెలకు రూ.లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లను పెంచే విధంగా కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పాండే తెలిపారు. చదవండి: ఇలా చేస్తే రూ. 1 కోటి దాకా నజరానా -
ఉత్తర–దక్షిణాది ఘర్షణ తప్పదా ?
రాబోయే రోజుల్లో ఉత్తరాది–దక్షిణాది రాష్ట్రాల మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు ఏర్పడవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర నిధుల కేటాయింపు విషయంలో తమ రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన వాటా రావడం లేదనే భావనలో దక్షిణాది నాయకులున్నారు. రాష్ట్రాలకు 1971 జనాభా లెక్కలకు బదులు 2011 జనాభా గణన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర పన్నుల రాబడిని ( సెంట్రల్ టాక్స్ రెవెన్యూ) పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం సిఫార్సు చేయడం మళ్లీ మాటల యుద్ధానికి తెర లేపింది. కేంద్రం సిఫార్సు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని, దీనిని తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి నేతలు అడ్డుకోవాలంటూ శుక్రవారం కర్నాటక సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు చేసిన ట్వీట్‌ను ఆయా రాష్ట్రాల సీఎంఓలతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు కూడా ఆయన ట్యాగ్ చేశారు. ఇదే సెంటిమెంట్‌ను వ్యక్తం చేస్తూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పది బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. పదహేనో∙ఆర్థిక సంఘం పరిశీలనలోని కొన్ని పరిశీలనాంశాలు (టీఓఆర్) లోపభూయిష్టంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వీటి వల్ల రాష్ట్రాలకు కేంద్ర పన్నుల రాబడి సమాన ంగా∙పంపిణీ చేయడం పై ప్రభావం పడుతుందని, ఈ రాష్ట్రాలకు మున్సిపాలిటీల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందని స్టాలిన్ పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కలతో నష్టం ? కేంద్ర పన్నుల రాబడి (టాక్స్ రెవెన్యూ)ని ప్రతీ అయిదేళ్లకు వివిధ రాష్ట్రాలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలనే అంశాన్ని రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన కేంద్ర పన్నుల్లో 42 శాతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయిస్తారు. మిగతా 58 శాతాన్ని జాతీయ అవసరాల కోసం కేంద్రం వినియోగిస్తుంది. వివిధ రాష్ట్రాలకు కేటాయించే 42 శాతం నిధులపై ఆర్థికసంఘం నిర్ణయిస్తుంది. గతేడాది నవంబర్ 27న ఎన్కే సింగ్ అధ్యక్షతన 15వ ఆర్థికసంఘాన్ని కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. ఫైనాన్స్ కమిషన్ 2020–25 కాలానికి సంబంధించిన పన్నుల కేటాయింపుపై వచ్చే ఏడాది అక్టోబర్ 30 లోగా నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా కమిషన్ సిఫార్సు చేస్తుందని టీఓఆర్‌లో పేర్కొన్నారు. గతంలో ఇందుకు 1971 సెన్సస్ వివరాలను ( ఈ జనాభా లెక్కల తర్వాతే దేశంలో కుటుంబనియంత్రణ విధానాలు వేగవంతం చేయడంతో) ప్రామాణికంగా తీసుకునేవారు. ఈ డేటా ప్రకారమే 1976లో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచారు. నియోజకవర్గాల సంఖ్య మార్చకుండా 2008లో పునర్విభజన జరిగింది. 2026 తర్వాత(2031) జరిగే జనాభా లెక్కల ఆధారంగానే మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. 2011 జన గణన ప్రకారం సమకాలీన భారత్‌లో ఉత్తర,దక్షిణ రాష్ట్రాల మధ్య తేడాలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. ఆర్థికాభివృద్ధి రేటు, నాణ్యమైన జీవనం, ప్రభుత్వపాలన, జనాభా, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు కనిపించాయి. 1991లో సరళీకర ఆర్థిక విధానాల అమలు మొదలయ్యాక ఆ తర్వాతి ఇరవై ఏళ్లలో ఉత్తరప్రదేశ్,బీహార్లలో కలిపి 25 శాతం జనాభా పెరుగుదల రికార్డయింది. అదే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కేరళల్లో కలిపి 12 శాతమే జనాభా పెరిగింది. ఈ రెండు దశాబ్దాల్లో కేరళలో 5 శాతం జనాభా వృద్ధి కాగా బిహార్‌లో ఎన్నోరెట్లు పెరిగింది. జాతీయ సగటు, దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదల సగటు కంటే కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధికశాతం పెరుగుదల ఉన్నట్టు స్పష్టమైంది. దక్షిణాదిపై చిన్నచూపా ? 1971–91 సంవత్సరాల మధ్య ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు పెరిగిందని, తమ రాష్ట్రాల్లో క్రమేణా తగ్గుతూ వస్తోందనేది దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా వాదిస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం లెక్కిస్తే రాష్ట్రాలకు కేంద్రనిధులు గణనీయంగా తగ్గిపోతాయన్నది సిద్ధరామయ్య, స్టాలిన్ వంటి నేతల «నిశ్చితాభిప్రాయం. సంతానోత్పత్తి శాతాన్ని తగ్గించేందుకు, అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు దక్షిణాది రాష్ట్రాలు విద్య, ఆరోగ్య పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నందుకు కేంద్రం శిక్షిస్తున్నట్టుగా ఇది ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. 1971–2011 మధ్య ఉత్తరప్రదేశ్‌లో 138. 02 శాతం, జమ్మూ,కశ్మీర్లో 171.82 శాతం జనాభా వృద్ధితో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగిందని,అదే తమిళనాడులో 56 శాతం, కేరళలో 75 శాతమే వృద్ధి చెందిందని గణాంకాలు ఉటంకిస్తున్నారు. యూపీ, బిహార్‌లతో పోల్చితే కేరళ, తమిళనాడు మహిళా అక్షరాస్యత గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల యూపీలో రూ. 36 వేల కోట్లతో రైతు రుణమాఫీని ప్రకటించడంతో (ఆ రాష్ట్రం రూ.50 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నా) దీనిని అమలు చేసేందుకు అవసరమైన రుణాలకు కేంద్రమే పూచీ ఉండాల్సి రావడాన్ని ఎత్తిచూపుతున్నారు. అయితే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం వల్ల రాష్ట్రాలకు వచ్చే కేంద్ర పన్నుల వాటాలో పెద్దగా ప్రభావం పడదని ఆర్థికసంఘం అధ్యక్షుడు ఎన్కే సింగ్ చెబుతున్నారు. పదిహేనో ఆర్థికసంఘం పరిశీలనాంశాల (టీఓఆర్)ను సమర్థిస్తూ జనాభా వృద్ధిని అదుపు చేసే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నందున ఈ రాష్ట్రాల లెక్క సరిచేసినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మున్సిపాలిటీలకు కోట్లే.. కోట్లు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో పౌర సేవా సంస్థలకు బాగా కలిసొచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తంలో పన్నులు వసూళ్లయ్యాయి. ఆయా నగరాలకు చెందిన దాదాపు 47 మున్సిపాలిటీలకు ఈ ఒక్క నెల(నవంబర్)లోనే గత ఏడాదితో పోలిస్తే రెండున్నర రెట్లు పన్నులు వసూళ్లయ్యాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అంచనా ప్రకారం మంగళవారంనాటికి మొత్తం 47 మున్సిపల్ శాఖలకు పన్నుల రూపంలో దాదాపు రూ.13,192కోట్లు వచ్చాయి. గత ఏడాది (2015)లో ఇది కేవలం రూ.3,607కోట్లు మాత్రమే ఉంది. ఈ భారీ మొత్తంలో అత్యధికంగా పన్నులు రాబట్టిన నగరాల్లో ముంబయి తొలి స్థానంలో నిలిచింది. మొత్తం రూ.11,913కోట్లు(90శాతం) వసూలు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది 2015తో పోలిస్తే మూడు రెట్టు అధికం. ఇక తదుపరి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఇదే నెలలో గత ఏడాది రూ.8కోట్ల పన్నులు రాగా ఈ ఏడాది మాత్రం దాదాపు రూ.208 కోట్లు వసూళ్లు అయ్యాయి. అలాగే, సూరత్ మున్సిపాలిటీకి 100 కోట్లు (2015లో ఇక్కడ రూ.7కోట్లు మాత్రమే), అహ్మదాబాద్ కు 170 కోట్లు(గతంలో 78 కోట్లు), కల్యాణ్ కు 170 కోట్లు(గతంలో 120 కోట్లు) పన్నులు వసూళ్లయ్యాయి. ఇలా మొత్తం 47 మున్సిపాలిటీలకు 2015తో పోల్చినప్పుడు పెద్ద మొత్తంలోనే పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని పన్నుల రూపంలో డబ్బులు వచ్చి పడ్డాయి. -
దూసుకుపోతున్న వాణిజ్యపన్నుల శాఖ
- 3 నెలల్లో రూ. 8,484 కోట్ల రెవెన్యూ - గత ఏడాది కన్నా 14.6 శాతం వృద్ధి - మద్యం అమ్మకాలపై పన్నులో 24 శాతం వృద్ధి - ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.43,115 కోట్ల లక్ష్యం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చిపెట్టే వాణిజ్యపన్నుల శాఖ 2016-17 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాల దిశగా పరుగెడుతోంది. ఈ సంవత్సరం తొలి త్రైమాసిక ం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) లో 2015-16 కన్నా 14.6 శాతం వృద్ధిరేటుతో రూ. 8,484 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇది గత సంవత్సరం మూడు నెలల్లో సాధించిన రెవెన్యూ కన్నా రూ. 1,077 కోట్లు అధికం. మద్యం అమ్మకాల పై వచ్చే పన్ను ఆదాయంలో గణనీయమైన వృద్ధి సాధించింది. ఇక డివిజన్లలో కూడా మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. ప్రతి నెలా రూ. 2,800 కోట్ల సగటుతో వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం సమకూర్చుకుంటోంది. 83 శాతం వసూలు.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 43,115 కోట్ల రెవెన్యూ సాధించాలని వాణిజ్యపన్నుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది గత ఏడాది (2015-16) కన్నా రూ. 11,997 కోట్లు అధికం. కాగా తొలి మూడు నెలల్లో రూ. 10,266 కోట్లు లక్ష్యం కాగా, 3 నెలల్లో రూ. 8,484 కోట్లతో 83 శాతం లక్ష్యా న్ని సాధించింది. ఇందులో మద్యం అమ్మకాలపై 24 శాతం వృద్ధిరేటుతో మూడు నెలల్లో రూ. 2,290 కోట్లు, పెట్రోలియం ఉత్పత్తులపై రూ.1,810 కోట్లు (వృద్ధిరేటు 7.68 శాతం) రాగా, 12 డివిజన్ల నుంచి 4,383 కోట్లు (వృద్ధి రేటు 13 శాతం) వచ్చింది. వ్యాట్, సీఎస్టీ ద్వారా 97 శాతం రెవెన్యూ.. వాణిజ్యపన్నుల శాఖ వసూలు చేసే పన్నులు ఏడు రకాలుగా ఉండగా, కేవలం విలువ ఆధారిత పన్ను (వ్యాట్), కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్టీ) ద్వారానే 97 శాతానికి పైగా రెవెన్యూ రావడం విశేషం. మూడు నెలల్లో మొత్తం వసూలైన రూ. 8,484 కోట్లలో 8,261 కోట్ల రూపాయలు కేవలం వ్యాట్, సీఎస్‌టీల ద్వారానే రాగా, మరో రూ. 222 కోట్లు మాత్రమే ఇతర పన్నుల ద్వారా సమకూరాయి. వృత్తిపన్ను ద్వారా రూ. 85.97 కోట్లు, వినోదపు పన్ను ద్వారా రూ. 33.11 కోట్లు, లగ్జరీ పన్ను ద్వారా రూ. 25.68 కోట్లు, ఆర్డీ సెస్ ద్వారా రూ.64 కోట్లు, ప్రవేశపన్ను కింద రూ. 1.41 కోట్లు, గుర్రపు పందాలు, బెట్టింగుల ద్వారా రూ. 12.15 కోట్లు సమకూరాయి. -
వ్యాట్‌కు మరిన్ని కోరలు!
అదనంగా రూ. 300 కోట్ల ఆదాయమే లక్ష్యం వ్యాట్ చట్టానికి నాలుగు సవరణలు చేసిన ప్రభుత్వం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం రద్దు {Mయ విక్రయాల లావాదేవీల బిల్లులూ సమర్పించాల్సిందే లెవీ బియ్యం కొనే ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖకే పన్ను చెల్లింపు బాధ్యత మద్యం ఖాళీ సీసాలు కొనే డిస్టిలరీలు, బ్రూవరీస్లే పన్ను చెల్లించాలి పన్నుల ఆదాయాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం... వ్యాట్‌కు మరిన్ని కోరలు తగిలించింది. పన్నులను మరింత సమర్థవంతంగా వసూలు చేయడం, ఎగవేతలను అరికట్టడంతో పాటు నిబంధనలను సరళతరం చేసేందుకు ఈ చట్టానికి నాలుగు సవరణలను తీసుకువచ్చింది. ముఖ్యంగా వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరమైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను రద్దు చేసింది. పన్ను చెల్లించాల్సిన క్రయవిక్రయాల బిల్లులను రిటర్న్‌తో పాటు జత చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మార్పులతో మొత్తంగా దాదాపు రూ. 300 కోట్లు అదనంగా ఖజానాకు చేరతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. - సాక్షి, హైదరాబాద్ రాష్ట్రానికి సమకూరుతున్న రెవెన్యూలో 60 శాతం వరకు వాణిజ్య పన్నుల శాఖ నుంచే రాబడుతున్న ప్రభుత్వం.. ఏటా మరో రూ. 300 కోట్లకు పైగా అదనపు ఆదాయం పొందేందుకు... వ్యాట్ చట్టానికి నాలుగు సవరణలు చేసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం రద్దు చేయడంతో పాటు క్రయ, విక్రయ లావాదేవీల బిల్లులను జత చేస్తూ వ్యాట్ రిటర్న్స్ దాఖలు చేసేలా చట్ట సవరణ చేసింది. లెవీ బియ్యం కొనుగోళ్లలో మిల్లర్లు పన్ను ఎగవేసేందుకు ఉపయోగపడుతున్న 50 రోజుల్లో పన్ను చెల్లించే వెసులుబాటును రద్దు చేసింది. మద్యం ఖాళీ బాటిళ్లను కొనుగోలు చేసే డిస్టిలరీలు, బ్రూవరీస్ కంపెనీలే ఖాళీ బాటిళ్లకు సంబంధించి పన్ను చెల్లించేలా సవరణ చేసింది. ఈ సవరణల వల్ల సామాన్యులపై ఎలాంటి భారం పడదని, పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్న వ్యాపారులను దారికి తెచ్చుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వ్యాట్ చట్టంలోని లొసుగులను గుర్తించి తగిన సవరణలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం రద్దు.. వ్యాట్ చట్టం 13వ సెక్షన్లో వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉన్న ‘ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్’ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇనుము వంటి ఏదైనా ముడి పదార్థాన్ని కొనుగోలు చేసినప్పుడు 5 శాతం పన్ను చెల్లించే డీలర్.. ఆ ముడి పదార్థాన్ని వినియోగ వస్తువుగా మార్చి విక్రయించినప్పుడు ఒక శాతం పన్ను చెల్లిస్తాడు. ఈ ప్రక్రియలో ముడి పదార్థం పనికిరాకుండా పోయి లేదా మరేదైనా నష్టం జరిగి.. విక్రయించిన వస్తువు ధరకన్నా కొనుగోలు చేసిన ముడి పదార్థం ధర ఎక్కువగా ఉంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద 5 శాతం పన్ను మినహాయింపు పొందే వీలుంది. ఈ క్రమంలో ముందుగా చెల్లించిన 5 శాతం పన్నును డీలర్‌కు వాణిజ్య పన్నుల శాఖ తిరిగి చెల్లిస్తుంది. ఇలాంటి లావాదేవీల్లో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం... ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చే స్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు విక్రయాలతో సంబంధం లేకుండా డీలర్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సవరణ వల్ల ఖజానాకు రూ. వంద కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని అంచనా. లావాదేవీల ఆధారాలతోనే పన్ను.. వ్యాపారులు చూపిన ‘వ్యాట్ రిటర్న్స్’ ఆధారంగానే ఇప్పటివరకు పన్ను విధించడం, చెల్లించడం జరుగుతోంది. అయితే ఒక డీలర్ ఒక నెలలో రూ. కోటి వ్యాపారం చేసినా రిటర్న్స్‌లో మాత్రం రూ. 50 లక్షల విక్రయాలను చూపి, ఆ మేరకే పన్ను కడుతున్నారు. ఇందులోనూ అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇక నుంచి రిటర్న్స్ దాఖలు సమయాల్లో ఆయా కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన బిల్లులను కూడా జత చేసేలా చట్టంలో సవరణ చేసింది. దీనివల్ల ఏటా మరో రూ. 100 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని సర్కారు అంచనా. లెవీ కొనుగోళ్లలో ఎగవేతకు చెక్! రూపాయికి కిలో బియ్యం, సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌సీఐ, రాష్ట్ర పౌర సరఫరాల శాఖల ద్వారా మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేస్తాయి. రూ. వందల కోట్లలో జరిగే ఈ లావాదేవీలకు సంబంధించి మిల్లర్లు విక్రయించిన బియ్యంపై 5 శాతం వ్యాట్ చెల్లించాలి. దీనిని 50 రోజుల్లో చెల్లించే వెసులుబాటు సెక్షన్ 22 (3సీ) కింద ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న మిల్లర్లు పన్ను సొమ్మును 50 రోజుల పాటు ఇతర లావాదేవీలకు వినియోగించడం లేదా అదే మొత్తంతో ధాన్యం సేకరించి, బియ్యంగా మార్చి మళ్లీ ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖలకే విక్రయించడం వంటివి చేస్తున్నారు. అంతేగాకుండా ఈలోపు నష్టాలను చూపి పన్ను ఎగ్గొడుతున్నారు. దీంతో ఇక ‘సోర్స్ ఆన్ ది సేల్ ఆఫ్ ది రైస్’ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా లెవీ బియ్యం కొనుగోలు చేసిన ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖలే 5 శాతం వ్యాట్‌ను మినహాయించుకొని మిల్లర్లకు బియ్యం ధరను చెల్లిస్తాయి. ఈ వ్యాట్ సొమ్మును వాణిజ్య పన్నుల శాఖ ఖాతాలో జమచేస్తాయి. ఖాళీ సీసాలపై వ్యాట్‌లోనూ మార్పు.. వ్యాట్ సెక్షన్ 22 (3డీ) ప్రకారం పాత సీసాలను డిస్టిలరీలకు విక్రయించే డీలర్లే.. సీసాల లెక్కను బట్టి వ్యాట్ చెల్లించేవారు. ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దీంతో ఇకపై డిస్టిలరీస్, బ్రూవరీస్ కంపెనీలే 5 శాతం పన్ను చెల్లించేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దీని ప్రకారం.. పాత బాటిళ్లకు సంబంధించిన 5 శాతం పన్ను సొమ్మును డిస్టిలరీస్, బ్రూవరీస్ కంపెనీలు డీలర్లకు చేసే చెల్లింపుల నుంచి మినహాయించుకొని ప్రభుత్వానికి చెల్లిస్తాయి. -
స్మార్ట్ సిటీ టార్గెట్ రూ.600 కోట్లు
ఇదీ నగరపాలక సంస్థ ఆదాయ లక్ష్యం ఆస్తి పన్ను ఒక్కటే రూ.200 కోట్లు వసూలు చేయాలని నిర్ణయం నేటి నుంచి నగరంలో సర్వే పన్ను వసూళ్లలో తేడాలు గుర్తించేందుకే అంటున్న అధికారులు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ అధికారులు ఆదాయ అన్వేషణలో నిమగ్నమయ్యారు. ఆర్థిక లోటుకు పూడ్చుకునేందుకు భారీ లక్ష్యాన్నే నిర్ణయించుకున్నారు. ‘స్మార్ట్ నగరం’ పేరుతో ప్రజల నుంచి అన్ని రకాల పన్నులను ముక్కుపిండి వసూలు చేసి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ప్రస్తుతం ఏడాదికి వస్తున్న రూ.206 కోట్ల ఆదాయాన్ని రూ.600 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. అమాంతం రూ.394 కోట్ల ఆదాయం రాబట్టేందుకు ఆస్తి, వృత్తి, అండర్ గ్రౌండ్, పైప్‌లైన్ పన్నుల దగ్గర నుంచి అనధికారిక కట్టడాల వరకు దేనినీ వదలకుండా వసూలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సర్వే పేరుతో నగర ప్రజలపై పన్ను పోటుకు సిద్ధమవుతున్నారు. సర్వే కోసం మూడు సర్కిళ్ల పరిధిలో 59 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. గురువారం రాత్రి కౌన్సిల్ హాల్లో కమిషనర్ జి.వీరపాండ్యన్ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్వే విధివిధానాలు వివరించారు. శుక్రవారం నుంచి 15 రోజుల్లోపు సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. ‘సరి’ చేయడమేనా..! ప్రస్తుతం ఏడాదికి రూ.74 కోట్లు ఆస్తిపన్ను వసూలవుతోంది. దీన్ని రూ.200 కోట్ల మేర వసూలు చేయాలని టార్గెట్‌గా నిర్ణయించారు. తాము ఆస్తిపన్ను పెంచడం లేదని, తేడాలను మాత్రమే సరిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 11 వేల ఖాళీ స్థలాల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే నగరంలో 35 వేల ఖాళీ స్థలాలు ఉన్నాయన్నది అధికారుల అంచనా. అన్ని స్థలాల నుంచి పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. వృత్తి పన్ను రూ.14 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు పెంచాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు రికార్డుల్లో లేని అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ కనెక్షన్ల నుంచి భారీగా ఆదాయం వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు. నగరంలో 27 వేల డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్‌వో) ట్రేడ్ లెసైన్స్‌లు వసూలవుతుండగా, ఈ సంఖ్యను 54వేలకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. హరికిరణ్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో రెండు వార్డుల్లో సర్వే చేయిస్తే 74 లక్షల రూపాయల తేడాను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం టార్గెట్‌ను చేరుకోవాలంటే ఇటువంటి అవకతవకలకు చెక్ చెప్పాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సర్వే అస్త్రం పన్నులు వసూలు చేస్తేనే పనులు... అంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నుంచి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ వరకు గత నాలుగు నెలలుగా పన్ను పెంపు జపం చేస్తున్నారు. పన్నులు పెంచితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనే ఉద్దేశంతో సర్వే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి నగరంలో సర్వేకు ఆదేశాలివ్వడంతో కార్పొరేషన్ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. సర్వే చేస్తే కానీ తేడాలు వెలుగుచూసే అవకాశం లేదు. రూ.600 కోట్ల లక్ష్యాన్ని ముందుగానే అధికారులు నిర్ణయించడంపై విపక్షాలు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. భారం కాదు నగర పాలక సంస్థ వసూలు చేస్తున్న పన్నుల్లో తేడాలను సర్వే ద్వారా సరి చేయాలని నిర్ణయించామని, దీని వల్ల ప్రజలపై భారం పడదని కమిషనర్ జి.వీరపాండ్యన్ ‘సాక్షి’తో అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అండర్ అసెస్మెంట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. పన్నులు చెల్లించని వారిని గుర్తించేందుకు ఈ సర్వే దోహదపడుతోందని ఆయన చెప్పారు.