
నృసింహుని సన్నిధిలో సత్యాత్మ తీర్ధానందస్వామి
మంగళగిరి: మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని కర్నాటక ఉత్తరపీఠాధిపతి సత్యాత్మ తీర్ధానందస్వామి శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో మండెపూడి పానకాలరావు ఆలయమర్యాదలతో స్వామివారికి స్వాగతం పలకగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నృసింహుని చిత్రపటాన్ని బహుకరించారు. రాష్ట్ర ప్రిన్స్‌పల్ సెక్రటరీ ఏకె ఫరీదా అశ్వినికుమార్ శనివారం నృసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు పాలకవర్గసభ్యులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.