ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి హారతులు ఇస్తున్న మహిళలు, పక్కన మన్నెమాల సుకుమార్‌రెడ్డి
కావలి(నెల్లూరు జిల్లా): అది 2019 ఎన్నికల ప్రచార సమయం. వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరు మండలం ఆదినారాయణపురం గ్రామానికి వెళ్లడానికి బయలుదేరారు. అయితే గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని గ్రామంలోకి రానివ్వమని భీష్మించుకున్నారు. దీంతో ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు.
ఎన్నికలయ్యాయి.. ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు, సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలు గ్రామస్తులకు అందుతున్నాయి. ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి సొంత మండలంలోని ఆదినారాయణపురంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు అవసరమైన సేవలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చూపించారు.
మత్స్యకార గ్రామమైన ఆదినారాయణపురం గ్రామస్తులంతా ఒక కట్టుబాటుతో ఉంటారు. దశాబ్దాలుగా తరతరాలుగా ఎన్నికల సమయంలో తమకు మేలు చేకూర్చిన వారికే మద్దతుగా ఉండడం వారి కుల కట్టుబాటు. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని, ఆ పార్టీ నేతలను ఊరిలోకి రాన్వికపోయినా.. ఇప్పుడు ప్రభుత్వ పథకాలను అందించడం, తమకు అండగా నిలబడడంతో గ్రామస్తులు మంత్రముగ్ధులయ్యారు.
ఎమ్మెల్యే ఇవన్నీ వద్దని వారించినా గ్రామస్తులు తాము చేయాలనుకున్న సత్కారం చేసి తీరుతామని మొండికేసి.. పూలు చల్లి పసుపు నీళ్లతో కాళ్లు కడిగి, హారతులు ఇచ్చారు. ఆదివారం ఆ గ్రామంలో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి గ్రామంలో పురుషులు ఈలలు, కేరింతలతో స్వాగతం చెప్పి అక్కున చేర్చుకున్నారు. మహిళలు అయితే పసుపు నీళ్లతో ఎమ్మెల్యే కాళ్లు కడిగి, పూలు చల్లి హారతులు ఇచ్చారు. నాడు బహిష్కరించిన గ్రామస్తులే.. నేడు బ్రహ్మరథం పట్టడంతో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
చదవండి: టీడీపీ బాగోతం బయటపెట్టిన బీకే పార్థసారథి
Comments
Please login to add a commentAdd a comment