mla ramireddy pratap reddy
-
నాడు బహిష్కరణ.. నేడు కాళ్లు కడిగి.. పూలు చల్లి.. బ్రహ్మరథం
కావలి(నెల్లూరు జిల్లా): అది 2019 ఎన్నికల ప్రచార సమయం. వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరు మండలం ఆదినారాయణపురం గ్రామానికి వెళ్లడానికి బయలుదేరారు. అయితే గ్రామస్తులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని గ్రామంలోకి రానివ్వమని భీష్మించుకున్నారు. దీంతో ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. ఎన్నికలయ్యాయి.. ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు, సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలు గ్రామస్తులకు అందుతున్నాయి. ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి సొంత మండలంలోని ఆదినారాయణపురంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు అవసరమైన సేవలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చూపించారు. మత్స్యకార గ్రామమైన ఆదినారాయణపురం గ్రామస్తులంతా ఒక కట్టుబాటుతో ఉంటారు. దశాబ్దాలుగా తరతరాలుగా ఎన్నికల సమయంలో తమకు మేలు చేకూర్చిన వారికే మద్దతుగా ఉండడం వారి కుల కట్టుబాటు. ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని, ఆ పార్టీ నేతలను ఊరిలోకి రాన్వికపోయినా.. ఇప్పుడు ప్రభుత్వ పథకాలను అందించడం, తమకు అండగా నిలబడడంతో గ్రామస్తులు మంత్రముగ్ధులయ్యారు. ఎమ్మెల్యే ఇవన్నీ వద్దని వారించినా గ్రామస్తులు తాము చేయాలనుకున్న సత్కారం చేసి తీరుతామని మొండికేసి.. పూలు చల్లి పసుపు నీళ్లతో కాళ్లు కడిగి, హారతులు ఇచ్చారు. ఆదివారం ఆ గ్రామంలో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి గ్రామంలో పురుషులు ఈలలు, కేరింతలతో స్వాగతం చెప్పి అక్కున చేర్చుకున్నారు. మహిళలు అయితే పసుపు నీళ్లతో ఎమ్మెల్యే కాళ్లు కడిగి, పూలు చల్లి హారతులు ఇచ్చారు. నాడు బహిష్కరించిన గ్రామస్తులే.. నేడు బ్రహ్మరథం పట్టడంతో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీ బాగోతం బయటపెట్టిన బీకే పార్థసారథి -
టెన్నిస్ క్రీడాకారుడికి ఎమ్మెల్యే అభినందన
కావలి : అఖిల భారత సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ తరుఫున అఖిల భారత స్థాయిలో వెటరన్స్ విభాగంలో రాష్ట్రం నుంచి టెన్నిస్ పోటీలకు ఎంపికైన స్థానిక క్రీడాకారుడు కె.వి.క్రిష్ణారెడ్డిని ఎమ్మెల్యే రామిరెడ్డిప్రతాప్కుమార్రెడ్డి అభినందించారు. ముంబాయిలో ఈ నెల 14 నుంచి 17 వరకు జరిగే ఈ పోటీలకు క్రిష్ణారెడ్డి ఎంపికయ్యారనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శుక్రవారం ఆయనను అభినందించారు. కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ కనుమర్లపూడి వెంకటనారాయణ, రూరల్ మండల అధ్యక్షుడు జంపాని రాఘవులు, డీఆర్‌యూసీసీ సభ్యుడు కుందుర్తి కామయ్య, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, కౌన్సిలర్ కనుపర్తి రాజశేఖర్, నాయకులు జె.మహేంద్ర, నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, షాహుల్ హమీద్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రామాయపట్నం పోర్టు నిర్మించాలి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కోరిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కావలి: రామాయపట్నంలో పోర్టు, షిప్‌యార్డు నిర్మించాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడును కోరారు. బుధవారం వెంకయ్యనాయుడు కార్యాలయంలో కలిసి కావలి నియోజకవర్గం అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యే చర్చించే సమయంలో మొన్నటి వరకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఉండి ప్రస్తుతం వెంకయ్యనాయుడు పీఎస్‌గా విధులు నిర్వహిస్తున్న జానకి అక్కడే ఉండి ఎమ్మెల్యే చెబుతున్న విషయాలకు మద్దతుగా మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం పథకమైన అమృత్‌కు సంబంధించి కావలి మున్సిపాల్టీకి నిధులు మంజూరు, అవి సద్వినియోగం పట్టణ ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పించే విషయమై ఎమ్మెల్యే మంత్రితో చర్చించారు. పోర్టు నిర్మిస్తే కావలి తోపాటు నెల్లూరు,ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, దగదర్తి వద్ద వున్న కిసాన్ సెజ్‌లో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సెజ్‌లో స్థానికులకు కాకుండా ఇతర రాష్ట్రాల ఉపాధి కల్పిస్తుండటంతో స్థానికులు అసంతృప్తిగా ఉన్నారని వివరించారు. జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు, కావలి మున్సిపాల్టీలో నిధులు దుర్వినియోగంపై విచారణ జరపాలని కోరారు. ఈ విషయాలపై పీఎస్ జానకి ని పరిశీలించాలని మంత్రి ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. -
రామాయపట్నం పోర్ట్ సాధనే లక్ష్యం
కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం) : కావలి నియోజకవర్గంలో రామయ్యపట్నం పోర్ట్ సాధించడమే తమ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంటలేవుట్‌లోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పారని, అయితే ఆచరణలో మాత్రం ముందుకు సాగడంలేదన్నారు. కావలి చెన్నాయపాళెం వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం విచారకరమన్నారు. బోగోలు వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురావాలన్నారు. త్వరలో నెల్లూరు, ఒంగోలు ఎంపీలైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలలో చర్చించి పోర్టు సాధనకు కమిటీ వేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 24న పాదయాత్ర కావలి మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకులు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పోర్టు సాధన కోసం సెప్టెంబర్ 24న కావలి నుంచి రామయ్యపట్నం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పోర్టు మంజూరుకాకుండా అప్పటి తిరుపతి ఎంపీ చింతామోహన్ 60 మంది ఎంపీలతో సంతకాలు చేయించి దుగ్గరాజుపట్నం పోర్టు మంజూరుకు తోడ్పడ్డారని తెలిపారు. దుగ్గరాజుపట్నం కంటే రామయ్యపట్నం పోర్టు ఏర్పాటుకు అన్నివిధాలా అనుకూలమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, జిల్లా అధికారప్రతినిధి పందిటి కామరాజు, రైల్వే కమిటీ సభ్యుడు కామయ్య, కావలి ఎస్సీ సెల్ అధ్యక్షుడు పరసు మాల్యాద్రి, కౌన్సిలర్లు సూరె మోహన్‌రెడ్డి, మందా శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
అణు విద్యుత్ కేంద్రాన్ని అడ్డుకునేందుకు యత్నాలు
కావలిరూరల్: కావలిలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనివ్వకూడదని సంకల్పించిన ఎమ్మెల్యే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పోరాటానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్న ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డిలను కలిశారు. అణువిద్యుత్ వల్ల జనజీవనానికి ఏవిధంగా ముప్పు వాటిల్లుతుందో పార్లమెంటు దృష్టికి తీసుకుకెళ్లేందుకు వారి సహాయాన్ని కోరారు. లోక్‌సభలోనే అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై పూర్తి వివరాలు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలుసుకునేందుకు లోక్‌సభ సెక్రటేరియట్లో అడిగేందుకు ఇరువురు ఎంపీలను లిఖితపూర్వకంగా అడిగారు. కావలి పట్టణానికి సమీపంలో ఉన్న రామాయపట్నంలో పోర్టు కమ్ షిప్‌యార్డును ఏర్పాటు చేస్తే కావలి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, పోర్టు ఏర్పాటుకు కృషిచేయాలని ఈ సందర్భంగా ఎంపీలను ఎమ్మెల్యే కోరారు. పోర్ట్ కమ్ షిప్‌యార్డు నిర్మాణం గురించి కేంద్రమంత్రి నితిన్‌గడ్కారి అపాయింట్మెంట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. -
అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు తగదు
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విరమించుకోకపోతే ఆమరణ దీక్ష కావలి: జన జీవనాన్ని సర్వనాశనం చేసే అణు విద్యుత్ కేంద్రాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించకోకపోతే ఆమరణ దీక్ష చేపడతానని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కావలిలోని ఆయన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అణు విద్యుత్ కేంద్రాలను గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు వ్యతిరేకిస్తే మన రాష్ట్రం కావలిలో ఏర్పాటు చేస్తాననడం దారుణమన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించడం చూస్తుంటే కావలిపై ఆయనకు ఎంత కక్ష ఉందో తెలుస్తుందన్నారు. కావలిలోని టీడీపీ నేతలు ఈ విషయంపై ఎందుకు స్పందించ లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న అణు విద్యుత్ కేంద్రం ద్వారా 6,660 మెగావాట్ల విద్యుదుత్పతి చేయాలని సీఎం చూస్తున్నారని తెలిపారు. ఈ కేంద్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే 100 కిలో మీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. రేడియేషన్ వ్యాపించి జీవరాసులు అంతమవుతామన్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్స్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రాణాలు అడ్డుపెట్టి అయినా ప్రజల కోసం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పార్టీ తరపున పోరాడుతానని ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రికి కావలి ప్రజల తరుపున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. సమావేశంలో కావలి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, డీఆర్‌యూసీసీ సభ్యుడు కుందుర్తి కామయ్య, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జంపాని రాఘవులు, కౌన్సిలర్ ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
రామాయపట్నంలో పోర్టు నిర్మాణం జరిగేనా?
పోర్టు కోసం ఐదు వేల ఎకరాలను గుర్తించిన అధికారులు కావలి : బ్రిటీషుకాలంలో వెలుగు వెలిగిన ప్రకాశం జిల్లా రామాయపట్నం తీరంలో పోర్టు నిర్మాణం జరుగుతుందా అనేదానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం చేపడితే ప్రకాశం జిల్లాకన్నా ఎక్కువ భాగం లబ్ధి నెల్లూరు జిల్లాలోని కావలి, ఉదయగిరి నియోజకవర్గాలకు కలుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.7500 కోట్లతో పోర్టు నిర్మిస్తామని సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. పది వేల ఎకరాలు అవసరం అవుతుందని కేంద్రం ప్రకటించగా రామాయపట్నం సముద్రతీరానికి పరిసర ప్రాంతాల్లోని సుమారు 5వేల ఎకరాల ప్రభుత్వ, వక్ఫ్‌భూములను ప్రకాశం జిల్లా అధికారులు గుర్తించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కావలికి వచ్చిన ప్రతిసారీ రామాయపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పుడు జిల్లాలోని దుగ్గరాజుపట్నంలో పోర్టు నిర్మాణం పూర్తయితే రామాయపట్నం పోర్టును మంజూరు చేస్తామని రెండు రోజుల క్రితం ఆయన స్పష్టం చేశారు. దుగ్గరాజుపట్నం పోర్టుకు కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటంతో దాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తేలకుండా ఉంది. దీంతో రామాయపట్నం పోర్టు మంజూరుపై నీలి నీడలు అలముకున్నాయి. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం చేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలుమార్లు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీకి వినతి పత్రాలు అందించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగితే కావలి ప్రాంతం అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కేంద్రమంత్రులకు రామిరెడ్డి వివరించారు. కావలి నుంచి 15 కిలో మీటర్లు... నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉన్న రామాయపట్నం కావలి పట్టణం నుంచి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. కందుకూరు నుంచి 34 కిలో మీటర్లు వరకు ఉంటుంది. రామాయపట్నం సమీపంలో ఉన్న ఉలవపాడు మండలం, గుడ్లూరుతోపాటు పలు మండలాలకు చెందిన వారు నిత్యం కావలికి వస్తుంటారు. పోర్టు నిర్మాణంతో ఉపాధి... రామాయపట్నంలో నిర్మించే పోర్టులో ఓడల మరమ్మతుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని సుమారు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని యూపీఏ ప్రభుత్వం తెలిపింది. రామాయపట్నంపోర్టు నిర్మాణం జరిగితే కొన్ని సంవత్సరాలుగా నిస్తేజంగా ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారానికి కూడా ఊపు వస్తుందని స్థానికులు అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా కృషి రాజకీయాలకు అతీతంగా రామయపట్నంలో పోర్టు నిర్మాణంకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. పోర్టు నిర్మిస్తే కావలి ప్రాంతం అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి కలుగుతుంది. పోర్టు మంజూరు చేసే విషయంపై కేంద్రమంత్రులను కలిసి పలుమార్లు విన్నవించాం. - రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే షిప్‌యార్డు మంజూరు చేయాలి రామాయపట్నంలో పోర్టుతోపాటు షిప్‌యార్డు కేంద్రం మంజూరు చేయాలి. ఈ విషయంపై కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశాం. రామయపట్నంలో పోర్టు నిర్మాణం జరిగితే కావలి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. - కందుకూరి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
రామిరెడ్డి దీక్షతో దిగొచ్చారు
కావలి: కావలి కాలువను ఆధునికీకరిస్తామని రాష్ట్రప్రభుత్వ ప్రకటన నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేసిన నిరాహార దీక్ష ఫలితమేనని స్థానిక రైతులు చెబుతున్నారు. కావలి కాలువ ఆయకట్టు రైతులు పడుతున్న సాగునీటి ఇబ్బందులకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతారని ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే ప్రశ్నించడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో వీటన్నింటిని చూస్తే అర్థమవుతుందని వారు చెబుతున్నారు. కావలి కాలువ రైతులు గత నాలుగేళ్లుగా సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. పెరిగిన ఆయకట్టుకు అనుగుణంగా కాలువ ఆధునికీకరణ జరగకపోవడంతో ఈసమస్య నెలకొంది. కావలి కాలువ నిర్మాణ సమయంలో 28 వేల ఎకరాలు సాగునీటిని ఇవ్వాలనే లక్ష్యంతో నిర్మించగా ఇప్పుడు సాగువిస్తీర్ణం లక్ష ఎకరాలకు పైగా చేరుకుంది. నియోజకవర్గంలోని కావలి పట్టణం, రూరల్, బోగోలు, దగదర్తి, ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం, కలిగిరి మండలంలో కొంతభాగానికి సాగునీటిని అందిస్తుంది. కావలి ఎస్ఎస్ ట్యాంక్‌కు తాగునీటిని అందిస్తుంది. గత కొన్నేళ్లుగా కావలి కాలువ సమస్యను పరిష్కరించేందుకు ఎవరు ముందుకు రాలేదు. రైతుల సాగునీటి సమస్యలపై చలించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులను, రాష్ట్రమంత్రులను కలిశారు. అసెంబ్లీలో కూడా నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరాహార దీక్షను చేపట్టి కావలి చరిత్రలో నిలిచిపోయారు. ఆ దీక్షను ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. నిర్మాణంపై ఎన్నో అనుమానాలు.. కావలి కాలువను వెడల్పు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ చేసిన ప్రకటనలో ఎన్నో అనుమానాలు ఉన్నాయని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. తాగు, సాగు నీటి సమస్య కు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం ఇలా.. సంగం బ్యారేజి నిర్మాణాన్ని పూర్తిచేసి ఇసుక బస్తాలు వేసే శ్రమను తగ్గించాలి. కావలి కాలువ సామర్థ్యాన్ని 1,200 క్యూసెక్కులకు పెంచాలి. కాలువనూ పూర్తిగా లైనింగ్ చేయాలి.. రుద్రకోట వరకు అన్నీ అటవీ అనుమతులు తీసుకుని కాలువ విస్తీర్ణం పెంచాలి. నియోజకవర్గంలోని అన్నీ చెరువులకు కావలి కాలువ నీటిని నింపేందుకు మార్గం ఉండేలా కాలువలు నిర్మించాలి. దీని ద్వారా సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పుతాయి. చిన్నక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కాక కావలి పట్టణం, రూరల్ మండలంలోని గ్రామాలకు కావలి కాలువ నుంచి నీరు వెళ్లేలా బైపాస్ కెనాల్‌ను నిర్మించాలి. సంగం బ్యారేజి నుంచి కావలి కాలువకు ప్రత్యేక హెడ్ రెగ్యులేటరి నిర్మించాలి. ఇప్పుడు ప్రకటించిన అధునీకరణను ఎలా చేస్తారు, ఎప్పుటి నుంచి చేస్తారో ప్రకటించాలి.