టెన్నిస్ క్రీడాకారుడికి ఎమ్మెల్యే అభినందన
టెన్నిస్ క్రీడాకారుడికి ఎమ్మెల్యే అభినందన
Published Sat, Oct 8 2016 2:22 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
కావలి : అఖిల భారత సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ తరుఫున అఖిల భారత స్థాయిలో వెటరన్స్ విభాగంలో రాష్ట్రం నుంచి టెన్నిస్ పోటీలకు ఎంపికైన స్థానిక క్రీడాకారుడు కె.వి.క్రిష్ణారెడ్డిని ఎమ్మెల్యే రామిరెడ్డిప్రతాప్‌కుమార్‌రెడ్డి అభినందించారు. ముంబాయిలో ఈ నెల 14 నుంచి 17 వరకు జరిగే ఈ పోటీలకు క్రిష్ణారెడ్డి ఎంపికయ్యారనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శుక్రవారం ఆయనను అభినందించారు. కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ కనుమర్లపూడి వెంకటనారాయణ, రూరల్ మండల అధ్యక్షుడు జంపాని రాఘవులు, డీఆర్‌యూసీసీ సభ్యుడు కుందుర్తి కామయ్య, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, కౌన్సిలర్ కనుపర్తి రాజశేఖర్, నాయకులు జె.మహేంద్ర, నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, షాహుల్ హమీద్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement