అణు విద్యుత్ కేంద్రాన్ని అడ్డుకునేందుకు యత్నాలు
అణు విద్యుత్ కేంద్రాన్ని అడ్డుకునేందుకు యత్నాలు
Published Wed, Aug 10 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
కావలిరూరల్:
కావలిలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనివ్వకూడదని సంకల్పించిన ఎమ్మెల్యే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పోరాటానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్న ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డిలను కలిశారు. అణువిద్యుత్ వల్ల జనజీవనానికి ఏవిధంగా ముప్పు వాటిల్లుతుందో పార్లమెంటు దృష్టికి తీసుకుకెళ్లేందుకు వారి సహాయాన్ని కోరారు. లోక్‌సభలోనే అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై పూర్తి వివరాలు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలుసుకునేందుకు లోక్‌సభ సెక్రటేరియట్‌లో అడిగేందుకు ఇరువురు ఎంపీలను లిఖితపూర్వకంగా అడిగారు. కావలి పట్టణానికి సమీపంలో ఉన్న రామాయపట్నంలో పోర్టు కమ్ షిప్‌యార్డును ఏర్పాటు చేస్తే కావలి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, పోర్టు ఏర్పాటుకు కృషిచేయాలని ఈ సందర్భంగా ఎంపీలను ఎమ్మెల్యే కోరారు. పోర్ట్ కమ్ షిప్‌యార్డు నిర్మాణం గురించి కేంద్రమంత్రి నితిన్‌గడ్కారి అపాయింట్‌మెంట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Advertisement