మోడీ కోసం.. 7 రేస్ కోర్స్ రోడ్డు సిద్ధం | 7 Race Course Road all set to welcome Narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీ కోసం.. 7 రేస్ కోర్స్ రోడ్డు సిద్ధం

Published Fri, May 23 2014 4:40 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడీ కోసం.. 7 రేస్ కోర్స్ రోడ్డు సిద్ధం - Sakshi

మోడీ కోసం.. 7 రేస్ కోర్స్ రోడ్డు సిద్ధం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసం  7 రేస్ కోర్స్ రోడ్డు కొత్త హంగులు సంతరించుకుంది. ఈ భవనానికి రంగు వేసి, పూలతో అలంకరించారు. భారత 15వ ప్రధాన మంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ ఈ ఇంట్లోకి రానున్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మోడీ ఇంట్లోకి రావాలని భావిస్తే ఆయన కోసం 3 నెంబర్ బంగ్లాను సిద్ధంగా ఉంచారు. మోడీ బస చేయడానికి వీలుగా ఈ అతిథి గృహంలో ఏర్పాట్లు చేశారు. రేసు కోర్సు రోడ్డుకు రాష్ట్రపతి భవన్కు కేవలం మూడు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో పాటు అధికార నివాసాన్ని ఖాలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement