- జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన కరీం, మహేష్‌లు
పెద్దాపురం విద్యార్థులకు పతకాల పంట
Published Fri, Nov 18 2016 9:10 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
పెద్దాపురం :
క్రీడారంగంలో పెద్దాపురం పట్టణాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లి వన్నె తెచ్చిన పెద్దాపురం విద్యార్థులు బంగారుపతకాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ నెల 11న మీరట్‌లో జరిగిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ షటిల్ బ్యాడ్మింట¯ŒS పోటీల్లో పట్టణానికి చెందిన తీగిరెడ్డి జ్ఞాన మహేష్, షేక్ కరీంముల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. సుమారు 20 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న బ్యాడ్మింట¯ŒS పోటీల్లో ప్రథమ స్థానం సాధించి పట్టణానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన విద్యార్థులిద్దరికీ మన పెద్దాపురం ఫేస్‌బుక్ టీం ఘన స్వాగతం పలికి స్థానిక మెయి¯ŒSరోడ్డులో కేక్‌ను కట్ చేసి క్రీడాకారులను అభినందించారు.
నాన్న ప్రోత్సాహంతోనే..
వృత్తి రీత్యా నాన్న మెకానిక్. ఆయన ప్రోత్సాహంతోనే నేనింతగా ఆడగలుతున్నాను. క్రీడల పట్ల ఉన్న మక్కువ, ప్రజల్లో వచ్చిన స్పందన మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ఎప్పటికైనా క్రీడారంగం నుంచే ఉద్యోగం సాధించాలినే నా ఆకాంక్ష.
– జ్ఞాన మహేష్
అందరి సహకారంతో..
అమ్మ, నాన్న, గురువు, స్నేహితుడు అందరి సహకారంతోనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అవరోధించాలనేది నా ఆకాంక్ష. ఇప్పటి వరకు తల్లిదండ్రులు, గురువర్యుల ప్రోత్సాహంతోనే ఈ విజయాన్ని సాధించాను.
– కరీముల్లా
Advertisement
Advertisement