National sports
-
National Sports Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం (ఫొటోలు)
-
ఆట కాదు.. వేట
సాక్షి, అమరావతి: జాతీయ క్రీడా పోటీల్లో ఏపీ క్రీడాకారుల బృందం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే పతకాల వేటలో అద్భుతంగా రాణించింది. 7 స్వర్ణాలు, 5 రజతాలు, 15 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలతో ఆంధ్రప్రదేశ్ 37వ జాతీయ క్రీడల్లో సత్తా చాటింది. మహిళా అథ్లెట్లు నాలుగు స్వర్ణాలు, రజతం, మూడు కాంస్యాలతో అదరగొట్టారు. గత ఏడాది అథ్లెటిక్స్‌లో ఆరు పతకాలు రాగా.. ఈ ఏడాది 8కి పెరిగాయి. వెయిట్ లిఫ్టింగ్‌లో 3 నుంచి 5కు పెరిగాయి. వాటర్ స్పోర్ట్స్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి పోటీలోనే పతకం రావడం విశేషం. 20 క్రీడాంశాల్లో 183 క్రీడాకారులు ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తే... ఇందులో 31 మంది పురుషులు,33 మంది మహిళా క్రీడాకారులు వ్యక్తిగత, బృంద విభాగాల్లో పతకాలు సాధించారు. శిక్షణ అదిరింది జాతీయ క్రీడల్లో పతకాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ‘టార్గెట్ గోవా’ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. క్రీడా సంఘాల సమన్వయంతో దాదాపు 17 క్రీడాంశాల్లో షెడ్యూల్ ప్రకారం శాప్ కోచ్‌లతో స్పెషల్ కోచింగ్ క్యాంపు నిర్వహించింది. ఫలితంగా క్రీడాకారుల నైపుణ్యాలు మెరుగుపడటంతో పతకాల సంఖ్య కూడా పెరిగింది. 17 క్రీడాంశాల్లో శిక్షణ క ల్పిస్తే.. వీటిల్లో ఏకంగా 10 విభాగాల్లో పతకాలు రావడం విశేషం. ఈ స్పెషల్ క్యాంపు కోసం ఏకంగా రూ.80 లక్షలకు పైగా ఖర్చు చేయడంతో పాటు మరో రూ.14.16 లక్షల విలువైన క్రీడా పరికరాలు, దుస్తులను సమకూర్చింది. వీటితో పాటు పోటీలకు వెళ్లే ముందు టీఏ, డీఏల కింద మరో రూ.12 లక్షలు విడుదల చేసింది. గతేడాది 8 విభాగాల్లో 16 పతకాలు సాధిస్తే.. ఇప్పుడు 11 విభాగాల్లో ఏకంగా 27 పతకాలు గెలుపొందడం విశేషం. క్రీడాకారులకు రెట్టింపు ప్రోత్సాహం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పెద్దపీట వేసింది. గతంలో ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను రెట్టింపు చేసింది. జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలిస్తే రూ.5 లక్షలు, రజతానికి రూ.4 లక్షలు, కాంస్యానికి రూ.3 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఫలితంగా క్రీడాకారులు ఆరి్థక ఇబ్బందులను దాటి పతకాలను ఒడిసి పడుతున్నారు. పతకాల ఒరవడిని కొనసాగిస్తాం ఏపీలోని యువతను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాప్ ప్రత్యేక కోచింగ్ క్యాంపుల ద్వారా మెరుగైన శిక్షణ అందిస్తోంది. వచ్చే జాతీయ పోటీల్లోనూ ఇప్పటి కంటే మెరుగైన ప్రదర్శన, ఎక్కువ పతకాలు సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతాం. అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాం. ఈ పతకాల ఒరవడి ఇలానే కొనసాగేలా చూస్తాం. – ధ్యాన్ చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సాధించిన పతకాలు ఇలా.. ♦ బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం (డి.పూజా, ఎస్కే గౌస్), మహిళా బ్యాడ్మింటన్ జట్టుకు కాంస్యం (కె.నవ్య, టి.సూర్య చరిష్మా, ఎల్.మమైఖ్య, డి.రష్మీత, ఎం.ఆకాంక్ష, సీహెచ్.సాయి ఉత్తేజ్రావు, డి.పూజ, పి.సోనికసాయి, డి.దీపిక, డి.స్రవంతి) లభించాయి. ♦ మహిళల వెయిట్ లిఫ్టింగ్ 85 కేజీల విభాగంలో ఎన్.లలిత (స్వర్ణం), 59 కేజీల విభాగంలో ఎం.దీపనయోమి (కాంస్యం), పురుషుల్లో 109 కేజీల విభాగంలో బీఎస్ విష్ణువర్ధన్ (రజతం), 55 కేజీల విభాగంలో ఎస్.గురునాయుడు (కాంస్యం), 73 కేజీల విభాగంలో జె.కోటేశ్వరరావు (కాంస్యం) పతకాలు సాధించారు. ♦ పెన్కాక్ సిలాట్ 80–85 కేజీల విభాగంలో డీఎన్వీ రత్నబాబు (కాంస్యం), మోడ్రన్ పెంటాథ్లాన్‌లో మిక్స్డ్ డబుల్స్ డి.వెంకటేశ్, ఎన్.సనుతి యశోహర (కాంస్యం) పొందారు. ♦ అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్ల్లో జ్యోతి యర్రాజీ (స్వర్ణం), 200 మీటర్ల పరుగులో (కాంస్యం) సాధించింది. 4్ఠ100 మీటర్ల రిలేలో ప్రత్యూష, మధు కావ్యారెడ్డి, భవానీ యాదవ్, జ్యోతి యార్రాజీ బృందం (స్వర్ణం), 4్ఠ400 మీటర్ల రిలేలో ప్రత్యూష, జ్యోతికశ్రీ, ఎం.శిరీష, కె.రజిత బృందం (స్వర్ణం) కైవసం చేసుకుంది. ♦ 400 మీటర్ల పరుగులో జ్యోతికశ్రీ (రజతం), జావెలిన్ త్రోలో రేష్మి శెట్టి (కాంస్యం), త్రిపుల్ జంప్‌లో ఎం.అనూష (కాంస్యం), 200 మీటర్ల పరుగులో జ్యోతి యర్రాజీ కాంస్యం సాధించారు. మహిళల హెప్టాథ్లాన్‌లో సౌమ్య మురుగన్ స్వర్ణంతో అదరగొట్టింది. ♦ తైక్వాండోలో మహిళల 67 కేజీల విభాగంలో కనక మహాలక్ష్మి, పురుషుల 68 కేజీల విభాగంలో టి.వరుణ్ కాంస్య పతకాలు గెలుపొందారు. ♦ సెపక్ తక్రాలో మహిళల డబుల్ ఈవెంట్లో ఎం.మధులత, టి.నాగహారిక, జి.రోషిత బృందం (రజతం), పురుషుల రెగు విభాగంలో ఎం.అర్జున్, సి.అశోక్‌కుమార్, జి,శివ కుమార్, ఎస్.మాలిక్ బాషా, టి,షణ్ముక్ శ్రీవంశీ బృందం (కాంస్యం) సాధించాయి. ♦ ఆర్చరీలో జి.బైరాగినాయుడు స్వర్ణం, మహిళల కయాకింగ్‌లో నాగిడి గాయత్రి రజతం సాధించింది. ఖోఖోలో ఏపీ పురుషుల జట్టు కాంస్యం గెలుపొందింది. ♦ స్కే మార్షల్ ఆర్ట్స్‌లో పురుషుల 50 కేజీల విభాగంలో పి.ప్రవీణ్ (రజతం), 58 కేజీల విభాగంలో ఎం.నీలాంజలి ప్రసాద్ (కాంస్యం), 75 కేజీల విభాగంలో బి.శ్రీనివాసులు (కాంస్యం) సాధించారు. -
గుంటూరు: జిమ్నాస్టిక్స్తో ఆకట్టుకున్నారు ( ఫొటోలు )
-
గుంటూరు జిల్లా : కళ్లు చెదిరే విన్యాసాలతో...ఔరా అనిపించారు (ఫొటోలు)
-
అబ్బురపరిచిన విద్యార్థులు.. కళ్లు చెదిరే విన్యాసాలతో..
-
సాయిప్రణీత్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో గురువారం మూడు స్వర్ణాలు చేరాయి. బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన జట్టుకు బాస్కెట్‌బాల్‌లో కూడా మరో బంగారు పతకం దక్కింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో తెలంగాణ షట్లర్ సాయిప్రణీత్ 21–11, 12–21, 21–16తో మిథున్ మంజునాథ్ (కర్నాటక)ను ఓడించి విజేతగా నిలిచాడు. మహిళల డబుల్స్‌లో ఫైనల్లో ఎన్.సిక్కిరెడ్డి–పుల్లెల గాయత్రి గోపీచంద్ ద్వయం పసిడి పతకాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో సిక్కి–గాయత్రి 21–14, 21–11తో శిఖా గౌతమ్–అశ్విని భట్ (కర్నాటక)ను చిత్తు చేశారు. మహిళల బాస్కెట్‌బాల్ 5–5 ఈవెంట్లో కూడా తెలంగాణకు స్వర్ణం లభించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో తెలంగాణ 67–62 పాయింట్ల తేడాతో తమిళనాడుపై విజయం సాధించింది. మూడు క్వార్టర్లు ముగిసే సరికి 5 పాయింట్లతో వెనుకబడి ఉన్న తెలంగాణ నాలుగో క్వార్టర్లో 10 పాయింట్ల ఆధిక్యం సాధించి విజయాన్నందుకోవడం విశేషం. తెలంగాణ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో రెండో స్థానంలో నిలిచిన విృత్తి రజత పతకాన్ని అందుకుంది. -
తెలంగాణ ‘డబుల్’ ధమాకా
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతోపాటు ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ 3–0తో కేరళను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ 21–15, 14–21, 21–14తో ట్రెసా జాలీ–ఎం.ఆర్.అర్జున్ ద్వయంపై గెలిచి తెలంగాణకు 1–0 ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 18–21, 21–16, 22–20 తో ప్రణయ్‌ను ఓడించి తెలంగాణ ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో సామియా ఇమాద్ ఫారూఖి 21–5, 21–12తో గౌరీకృష్ణపై గెలవడంతో తెలంగాణ విజయం ఖరారైంది. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు. మహిళల బాస్కెట్‌బాల్ 3గీ3 ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ జట్టు 17–13తో కేరళను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. మహిళల స్విమ్మింగ్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో తెలంగాణ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్ రజత పతకం దక్కించుకుంది. ఆమె 9ని:23.91 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల రోయింగ్ కాక్స్డ్–8లో బాలకృష్ణ, నితిన్ కృష్ణ, సాయిరాజ్, చరణ్ సింగ్ కెతావత్, మహేశ్వర్ రెడ్డి, గజేంద్ర యాదవ్, నవదీప్, హర్దీప్ సింగ్, వెల్ది శ్రీకాంత్‌లతో కూడిన తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. -
National Games 2022: నేటి నుంచి జాతీయ క్రీడలు
అహ్మదాబాద్: ఆయా క్రీడాంశాల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు లేకుండానే నేటి నుంచి జాతీయ క్రీడలు అధికారికంగా మొదలుకానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ క్రీడలను ప్రారంభిస్తారు. అక్టోబర్ 10 వరకు జరిగే ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు భారత త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్ జట్టు నుంచి మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. మొత్తం 36 ఈవెంట్స్‌లో పతకాల కోసం పోటీలుంటాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్ నగరాల్లో మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. సైక్లింగ్ ఈవెంట్‌ను మాత్రం న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ఎల్లుండి నుంచి చైనాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో... టీటీ పోటీలను ఈనెల 20 నుంచి 24 వరకు నిర్వహించారు. కబడ్డీ, లాన్ బౌల్స్, రగ్బీ క్రీడాంశాల్లోనూ పోటీలు మొదలయ్యాయి. ఏడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. చివరిసారి 2015లో జరిగిన జాతీయ క్రీడలకు కేరళ ఆతిథ్యమిచ్చింది. ఆ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 33 పతకాలతో 12వ ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. -
జాతీయ క్రీడలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన జాతీయ క్రీడలు ఈసారి నిరవధికంగా వాయిదా వేశారు. క్రీడలకు ఆతిథ్యమివ్వాల్సిన గోవాలో కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4 వరకు జాతీయ క్రీడలు జరగాల్సి ఉంది. అయితే కరోనా దెబ్బకు జాతీయ క్రీడల నిర్వాహక కమిటీ ఈ వాయిదా నిర్ణయం తీసుకుందని గోవా క్రీడల మంత్రి మనోహర్ అగోంకర్ ఐఓఏకు తెలిపారు. సెప్టెంబర్ చివర్లో జరిగే కమిటీ సమావేశంలో క్రీడల షెడ్యూల్‌ను నిర్ణయిస్తామన్నారు. నిజానికి 2018 నవంబర్లోనే జరగాల్సిన ఈ క్రీడలు గోవా ప్రభుత్వ అలసత్వం కారణంగా ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది గేమ్స్ నిర్వహించేందుకు గోవా సిద్ధమైనప్పటికీ కరోనాతో మరోసారి ఆటంకం ఏర్పడింది. చివరిసారిగా 2015లో కేరళ వేదికగా జాతీయ క్రీడలు జరిగాయి. -
అవీ... ఇవీ... అన్నీ కరోనా వల్లే!
న్యూఢిల్లీ: కరోనా వలయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు విలవిలలాడుతున్నాయి. ఆటలన్నీ వాయిదా లేదంటే రద్దవుతున్నాయి. అథ్లెటిక్స్ ►భోపాల్‌లో ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరగాల్సి న ఫెడరేషన్ కప్ జాతీయ జూ. టోర్నీ వాయిదా. ►ఏప్రిల్ 20న జరగాల్సిన బోస్టన్ మారథాన్ సెప్టెంబర్ 14కు... ఏప్రిల్ 26న జరగాల్సిన లండన్ మారథాన్ అక్టోబర్ 4కు వాయిదా. బ్యాడ్మింటన్ ►మార్చి 16 నుంచి ఏప్రిల్ 12 మధ్యకాలంలో వేర్వేరు వేదికలపై జరగాల్సిన స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్, ఓర్లీన్స్ మాస్టర్స్ ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. బాస్కెట్‌బాల్ ►ఈ నెల 18 నుంచి 22 వరకు బెంగళూరులో జరగాల్సిన ఎఫ్‌ఐబీఏ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ వాయిదా. చెస్ ►మే 31 వరకు జాతీయ చెస్ టోర్నీలు వాయిదా టెన్నిస్ ►ఆరు వారాలపాటు దేశవాళీ టోర్నమెంట్లు రద్దు క్రికెట్ ►ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకు నిలిపివేత. ►భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు ►శ్రీలంకలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తమ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకతో ఇంగ్లండ్ ఈ సిరీస్‌లో రెండు టెస్టులు ఆడాల్సింది. ►పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) టి20 టోర్నీ లో ఆడుతున్న పలువురు విదేశీ క్రికెటర్లు అలెక్స్ హేల్స్, జేసన్ రాయ్, టైమల్ మిల్స్, లియామ్ డాసన్, లియామ్ లివింగ్‌స్టోన్, లూయిస్ గ్రెగెరీ, జేమ్స్ విన్సీ (ఇంగ్లండ్), కార్లోస్ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్), రిలీ రోసూ (దక్షిణాఫ్రికా), జేమ్స్ ఫాస్టర్ (కోచ్) పీఎస్ఎల్ను వీడి వారి సొంత దేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ►మార్చి 22 నుంచి ఏప్రిల్ 4 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సిన ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఈ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడాల్సింది. ఫుట్‌బాల్ ►అట్లెటికో కోల్‌కతా, చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్ల మధ్య గోవాలో నేడు జరగాల్సిన ఫైనల్ ప్రేక్షకులు లేకుండా గప్‌చుప్‌గా నిర్వహణ. ►ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఏప్రిల్ 4 వరకు వాయిదా. ఈపీఎల్‌లో పాల్గొనే అర్సెనల్ జట్టు మేనేజర్ మికెల్ అర్టెటా, చెల్సీ జట్టు సభ్యుడు కాలమ్ హడ్సన్‌లు కోవిడ్–19 బారిన పడ్డారు. ►భారత్, ఖతర్ ఫుట్‌బాల్ మధ్య భువనేశ్వర్‌లో ఈ నెల 26న... భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య కోల్‌కతాలో జూన్ 9న జరగాల్సిన ‘ఫిఫా’ ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు వాయిదా. ►ఐజ్వాల్‌లో వచ్చే నెల 14 నుంచి 27 వరకు జరగాల్సిన సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ ఫైనల్ రౌండ్ పోటీలు వాయిదా గోల్ఫ్ ►ఇండియా ఓపెన్ (న్యూఢిల్లీలో 19–22 వరకు) వాయిదా ►ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) టోర్నీలన్నీ నిరవధికంగా వాయిదా షూటింగ్ ►ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ (న్యూఢిల్లీలో ఈ నెల 15–25) వాయిదా ఫార్ములావన్ ►మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి, మార్చి 22న బహ్రెయిన్, ఏప్రిల్ 5న జరగాల్సిన వియత్నాం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులు రద్దు. టేబుల్ టెన్నిస్ ►ఏప్రిల్ చివరి వారం వరకు అన్ని అంతర్జాతీయ టోర్నీలు రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రకటించింది. -
గోవా ప్రభుత్వానికి ఐఓఏ హెచ్చరిక
న్యూఢిల్లీ : మూడేళ్లుగా జాతీయ క్రీడల నిర్వహణను వాయిదా వేస్తోన్న గోవా ప్రభుత్వాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కార్యదర్శి రాజీవ్ మెహతా హెచ్చరించారు. ముందే చెప్పినట్లుగా ఈ నవంబర్‌లో క్రీడల్ని నిర్వహించలేకపోతే వాటిని మరో వేదికకు తరలించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు త్వరలోనే ఐఓఏ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే క్రీడల నిర్వహణను నాలుగు సార్లు వాయిదా వేసిన గోవా ప్రభుత్వం తాజాగా మరోసారి ఇదే పోకడను అనుసరిస్తూ వచ్చే ఏడాది నిర్వహిస్తామంటూ కొత్త వాదనను వినిపించింది. దీంతో గోవా ప్రభుత్వ తీరుపై రాజీవ్ మెహతా అసహనం వ్యక్తం చేశారు. ‘మా ఓపిక నశించిపోతోంది. గోవా ప్రభుత్వానికి నిబద్దత లేదనే విషయం మాకిప్పుడే అర్థమవుతోంది. ప్రతీసారి క్రీడల్ని వాయిదా వేయలేం. వేరే వేదికకు మార్చడం అనివార్యమనిపిస్తుంది’ అని అన్నారు. చివరిసారిగా 2015లో కేరళ జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. -
జాతీయ క్రీడలు మళ్లీ వాయిదా!
న్యూఢిల్లీ: ఇప్పటికే మూడేళ్లుగా నిర్వహణకు నోచుకోని 36వ జాతీయ క్రీడలకు మరోసారి వాయిదా గండం తప్పడం లేదు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 14 వరకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న గోవా... సాధారణ ఎన్నికలు, భద్రత, పాఠశాలలకు సెలవులతో వాలంటీర్లు అందుబాటులో ఉండరంటూ నిర్వహణపై అశక్తత వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు లేఖ రాసింది. వాస్తవానికి గతేడాది నవంబరులోనే గోవా ఈ క్రీడలకు వేదిక కావాల్సింది. తాజాగా మరోసారి చేతులెత్తేసింది. దీనిపై రూ.10 కోట్లు జరిమానా వేస్తామంటూ ఐఓఏ మండిపడుతోంది. -
ఆటలకు ప్రభుత్వం టాటా!
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్ర్రంలో క్రీడాకారులనూ చంద్రబాబు సర్కార్ మాటలతో నాలుగేళ్లు మభ్యపెట్టింది. మరోవైపు క్రీడా సంఘాలతోనూ ఆటలాడుతూ పబ్బం గడుపుతోంది. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసినట్లే.. బాబు వస్తే క్రీడా రంగానికి స్వర్ణయుగమే అని ప్రచారం చేశారు. వాస్తవానికి నవ్యాంధ్రలో ఒక్క అంతర్జాతీయ స్థాయి స్టేడియం కూడా లేదు. ఈ నాలుగేళ్లలో ఒక్క స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. స్థానిక క్రీడాకారులకు సాయమే లేదు. సీఎం చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రీడాకారులకు చివరకు నిరాశే మిగిలింది. క్రీడా సంఘాల మధ్య చిచ్చు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో క్రీడాకారులకు ఇచ్చిన హామీల గురించి చర్చ జరగకుండా క్రీడా సంఘాల్లో చిచ్చు పెట్టారని క్రీడా నిపుణులు ఆరోపిస్తున్నారు. జాతీయ క్రీడలు నిర్వహించే అవకాశం వస్తే రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఈ మేరకు జాతీయ క్రీడల నిర్వహణలో కీలకపాత్ర పోషించే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్‌లో పదవులు దక్కించుకోవడం కోసం ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు రంగంలోకి దిగి పోటీపడ్డారు. జాతీయ క్రీడల నిర్వహణను సాధించలేకపోయినా ఒలింపిక్ అసోసియేషన్‌ను మాత్రం రెండు ముక్కలు చేశారు. ఈలోగా రియో ఒలింపిక్స్ వచ్చాయి. అంతే.. ఏకంగా రాజధాని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే నోబెల్ బహుమతి ఇస్తానని చెప్పి తనకు క్రీడలపై ఉన్న అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. రాజధానిలో క్రీడా రంగం కోసం 1,200 ఎకరాలు కేటాయించామని చెప్పిన ప్రభుత్వం మరోవైపు ఉన్న స్టేడియాలను నిర్వీర్యం చేసింది. విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియాన్ని ప్రభుత్వ, అధికార పార్టీ కార్యకలాపాలకు వేదికగా మార్చేసింది. హెలిప్యాడ్ కోసం వినియోగిస్తూ దాన్ని ధ్వంసం చేసింది. రూ.కోట్లాది నిధులు గోల్మాల్ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది క్రీడలకు రూ.200 కోట్లు బడ్జెట్ కేటాయించింది. అయితే 13 జిల్లాల్లో జిల్లాకు కనీసం రూ.2 కోట్ల నిధులు కేటాయింపు కూడా జరగలేదని సమాచారం. రూ.కోట్ల పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది అధికారుల సహకారంతో రూ.వందల కోట్లు గోల్మాల్ చేసినట్లు క్రీడా సంఘాలే విమర్శిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి కూడా క్రీడలను ప్రభుత్వం అసరాగా చేసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా వికాస్ కేంద్రాల పేరుతో ఆ మైదానాల చుట్టూ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజధాని విషయంలో సింగపూర్, మలేషియా తదితర దేశాల పేర్లు చెప్పే చంద్రబాబు ప్రభుత్వం.. క్రీడల విషయంలో కెనడాను ఎంచుకుంది. రాష్ట్రంలో దాదాపు 50 మందికి పైగా వ్యాయామ విద్యలో పీహెచ్‌డీలు చేసినవారు ఉంటే వాళ్లు పనికిరారని వ్యాయామ విద్యలో ఫిజికల్ లిటరసీ పేరుతో కెనడా నుంచి కొంత మందిని తీసుకొచ్చారు. దీనికోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చుపెట్టారని, భారీగా నగదు చేతులు మారిందని క్రీడా సంఘాలు ఆరోపిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, హరియాణా రాష్ట్రాల్లో తిరిగి అక్కడి కంటే మెరుగైన క్రీడా పాలసీ తీసుకొచ్చామని అధికారులు ప్రకటించారు. అయితే, ఆ పాలసీ ద్వారా ఎవరికి మేలు జరిగిందో చెప్పాలని క్రీడా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్పోర్ట్స్ అకాడమీల స్థాపన పేరుతో కర్ణాటకలోని ఓ సంస్థకు అజమాయిషీ అప్పజెప్పడం, నిధులు దుబారా చేస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగాలు ఇక్కడ.. ఇంటర్య్వ్లు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కోచ్‌ల నియామకం అంతా తెలంగాణలో నిర్వహించారు. అవి కూడా అవుట్సోర్సింగ్ నియామకాలు. క్రీడా సంఘాలను సంప్రదించకుండా.. కనీసం క్రీడలపై అవగాహన లేనివారిని, సర్టిఫికెట్లు కొనుక్కున్నవారికి కోచ్‌ల పోçస్టులు కట్టబెట్టారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కోచ్‌ల నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని పత్రికల్లో ఆధారాలతో సహా వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. కర్ణాటకలో కోచ్‌కు నెలకు రూ.39,960 ఇస్తుంటే.. మన రాష్ట్రంలో అది కేవలం రూ.17,500 మాత్రమే. ఈ మొత్తాన్ని మూడు నెలలకొకసారి ఇస్తున్నారంటే çక్రీడా రంగంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. శ్వేతపత్రం విడుదల చేయాలి సీఎం చంద్రబాబు పొరుగు రాష్ట్రాల క్రీడాకారులకు అందిస్తున్న నజరానాలు, ప్రోత్సాహకాలు రాష్ట్ర క్రీడాకారులకు అందించకపోవడం శోచనీయం. రాష్ట్రానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ప్రపంచ కప్‌లో పతకం సాధిస్తే పట్టించుకోకపోవడం బాధాకరం. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పడం హాస్యాస్పదం. క్రీడలపై అవగాహన లేని వ్యక్తులు క్రీడా మంత్రులుగా ఉండడం మన దౌర్భాగ్యం. గతేడాది రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు కేటాయించిన రూ.200 కోట్ల నిధులు ఖర్చులకు శ్వేతపత్రం విడుదల చేయాలి. –పున్నయ్య చౌదరి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపా«ధ్యక్షుడు, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొనుగోళ్లపై సీబీఐతో విచారణ చేయించాలి రాష్ట్రంలో రూ.కోట్లతో కొనుగోలు చేసిన క్రీడా సామాగ్రి ఎక్కడ డంప్ చేశారు? ఎక్కడెక్కడికి పంపించారు? ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్ల కొనుగోలు లావాదేవీలపై, జల క్రీడల కోసం కొన్న బోట్ల కొనుగోళ్లపై సీబీఐతో విచారణ జరిపించాలి. –రంభా ప్రసాద్, ఆట్యపాట్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
పరిశీలకుడి పదవికి సుశీల్ రాజీనామా
న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ జాతీయ క్రీడా పరిశీలకుడి (నేషనల్ స్పోర్ట్స్ అబ్జర్వర్) పదవికి రాజీనామా చేశాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) దృష్ట్యా ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న అథ్లెట్లు ఈ పదవిలో ఉండరాదని కేంద్ర క్రీడాశాఖ పేర్కొన్న నేపథ్యంలో సుశీల్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మాజీ క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ ఈ ఏడాది మార్చిలో 12 మందితో కూడిన జాతీయ పరిశీలకుల బృందాన్ని నియమించారు. అందులో భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ కూడా ఉంది. ఆమె కొద్ది రోజుల క్రితమే ఈ పదవికి రాజీనామా చేసింది. వీరిద్దరి రాజీనామాలను బుధవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. -
జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
-
పెద్దాపురం విద్యార్థులకు పతకాల పంట
జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన కరీం, మహేష్‌లు పెద్దాపురం : క్రీడారంగంలో పెద్దాపురం పట్టణాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లి వన్నె తెచ్చిన పెద్దాపురం విద్యార్థులు బంగారుపతకాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ నెల 11న మీరట్‌లో జరిగిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ షటిల్ బ్యాడ్మింట¯ŒS పోటీల్లో పట్టణానికి చెందిన తీగిరెడ్డి జ్ఞాన మహేష్, షేక్ కరీంముల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. సుమారు 20 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న బ్యాడ్మింట¯ŒS పోటీల్లో ప్రథమ స్థానం సాధించి పట్టణానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన విద్యార్థులిద్దరికీ మన పెద్దాపురం ఫేస్బుక్ టీం ఘన స్వాగతం పలికి స్థానిక మెయి¯ŒSరోడ్డులో కేక్‌ను కట్ చేసి క్రీడాకారులను అభినందించారు. నాన్న ప్రోత్సాహంతోనే.. వృత్తి రీత్యా నాన్న మెకానిక్. ఆయన ప్రోత్సాహంతోనే నేనింతగా ఆడగలుతున్నాను. క్రీడల పట్ల ఉన్న మక్కువ, ప్రజల్లో వచ్చిన స్పందన మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ఎప్పటికైనా క్రీడారంగం నుంచే ఉద్యోగం సాధించాలినే నా ఆకాంక్ష. – జ్ఞాన మహేష్ అందరి సహకారంతో.. అమ్మ, నాన్న, గురువు, స్నేహితుడు అందరి సహకారంతోనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అవరోధించాలనేది నా ఆకాంక్ష. ఇప్పటి వరకు తల్లిదండ్రులు, గురువర్యుల ప్రోత్సాహంతోనే ఈ విజయాన్ని సాధించాను. – కరీముల్లా -
బ్యాడ్మింటన్‌లో తెలంగాణకు స్వర్ణం
జాతీయ క్రీడలు తిరువనంతపురం: వరుసగా మూడో రోజు జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు ‘పసిడి’తో మెరిపించారు. ఆదివారం టెన్నిస్‌లో, సోమవారం కయాకింగ్‌లో తెలంగాణకు స్వర్ణ పతకాలు రాగా... ఇదే స్ఫూర్తితో మంగళవారం మహిళల టీమ్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో తెలంగాణ జట్టు బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఆతిథ్య కేరళతో జరిగిన ఫైనల్లో రుత్విక శివాని, సిక్కి రెడ్డి, మేఘన, రితూపర్ణ దాస్, మనీషాలతో కూడిన తెలంగాణ జట్టు 2-0 తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్‌లో రితూపర్ణ దాస్ 21-14, 21-18తో పి.సి.తులసీపై నెగ్గి తెలంగాణకు 1-0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో రుత్విక శివాని-సిక్కి రెడ్డి జంట 21-18, 18-21, 21-13తో అపర్ణ బాలన్-ఆరతి సునీల్ జోడీని ఓడించడంతో తెలంగాణ విజయం ఖాయమైంది. మరోవైపు కయాకింగ్‌లో తెలంగాణకు మరో పతకం వచ్చింది. పురుషుల కయాక్ సింగిల్స్ 500 మీటర్ల ఈవెంట్లో పదమ్‌కర్ ప్రసాద్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 500 మీటర్ల దూరాన్ని ప్రసాద్ ఒక నిమిషం 54 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా క్రీడల పదో రోజు తెలంగాణకు రెండు పతకాలు రాగా... ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఒక్క పతకమూ చేరలేదు. అథ్లెటిక్స్‌లో వివాదాస్పద మహిళా స్ప్రింటర్ దుతీ చంద్ హీట్స్‌లోనే మీట్ రికార్డు నెలకొల్పింది. ఒడిశాకు చెందిన దుతీ 100 మీటర్ల హీట్స్‌ను 11.83 సెకన్లలో పూర్తి చేసి ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో దుతీ 11.84 సెకన్లతో జ్యోతి పేరిట ఉన్న జాతీయ క్రీడల రికార్డును తిరగరాసింది. ప్రస్తుతం తెలంగాణ 18 పతకాలతో (6 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) పదో స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (5 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలు) 14వ స్థానంలో ఉన్నాయి. సర్వీసెస్ 90 పతకాలతో (55 స్వర్ణాలు, 16 రజతాలు, 19 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
తెలంగాణకు మరో రెండు రజతాలు
టెన్నిస్‌లో రన్నరప్‌తో సరి ఏపీకి మరో రెండు కాంస్యాలు జాతీయ క్రీడలు తిరువనంతపురం: జాతీయ క్రీడల్లో తెలంగాణ టెన్ని స్ క్రీడాకారులు రెండు రజతాలతో సరిపెట్టుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల టీమ్ ఫైనల్లో తెలంగాణ 1-2తో తమిళనాడు చేతిలో ఓడింది. తొలి సింగిల్స్‌లో విష్ణువర్ధన్ 6-7, 4-6తో శ్రీరామ్ బాలాజీ చేతిలో పరాజయం చవిచూశాడు. రెండో సింగిల్స్‌లో సాకేత్ మైనేని 7-5, 4-6, 7-6తో రామ్‌కుమార్ రామనాథన్‌పై నెగ్గాడు. అయితే పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ-జీవన్ నెడుంచెలియాన్ 6-1, 6-4తో విష్ణు వర్ధన్-సాకేత్‌లపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మహిళల టీమ్ ఫైనల్లో తెలంగాణ 0-2తో గుజరాత్ చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో సౌజన్య భవిశెట్టి 7-5, 4-6, 4-6తో ఇతి మెహతా చేతిలో; రెండో సింగి ల్స్‌లో నిధి చిలుముల 3-6, 1-6తో అంకితా రైనా చేతిలో ఓడారు. ప్రస్తుతం తెలంగాణ ఖాతాలో ఐదు రజతాలు, ఓ కాంస్యం ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రెండు కాంస్యాలు దక్కాయి. వెయిట్ లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో గారా అరుణ రాణి 190 (క్లీన్ 85+జర్క్ 105) కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. రిథమిక్ జిమ్నాస్టిక్స్ ఆల్‌రౌండ్ వ్యక్తిగత విభాగంలో మేఘన గుండాల్‌పలి కాంస్యం సాధించింది. ప్రస్తుతం ఏపీ ఖాతాలో ఓ స్వర్ణం, ఓ రజతం, 4 కాంస్యాలున్నాయి. విజయ్‌కు మరో రెండు పతకాలు సర్వీసెస్ షూటర్ విజయ్ కుమార్‌కు మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో విజయ్, గురుప్రీత్, ఓంకార్ సింగ్‌ల బృందానికి స్వర్ణం లభించింది. అయితే వ్యక్తిగత విభాగంలో విజయ్ (565) కాంస్యంతో సంతృప్తిపడ్డాడు. స్క్వాష్‌లో తమిళనాడుకు రెండు పసిడి పతకాలు దక్కాయి. మహిళల ఫైనల్లో జోత్స్న చినప్ప 11-5, 11-8, 11-4తో లక్ష్యపై; పురుషుల టైటిల్ పోరులో సౌరవ్ ఘోషాల్ 4-11, 11-4, 11-8, 11-6తో హరీందర్ పాల్ సింగ్ సంధుపై నెగ్గారు. రెజ్లింగ్‌లో హరియాణాకు 18 స్వర్ణాలు జాతీయ క్రీడల రెజ్లింగ్‌లో హరియాణా నాలుగో రోజు ఐదు స్వర్ణాలు గెలిచి... ఈ విభాగంలో మొత్తం 18 పసిడి పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా పతకాల పట్టికలో హరియాణా 21 స్వర్ణాలు, 8 రజతాలు, 4 కాంస్యాలతో 33 పతకాలు సాధించి అగ్రస్థానంలో ఉంది. మోహన్‌లాల్ ప్రతిపాదనను తిరస్కరించిన కేరళ ప్రభుత్వం తిరువనంతపురం: జాతీయ క్రీడల ప్రారంభ వేడుకలకు సంబంధించి తాను తీసుకున్న డబ్బులను వెనక్కి ఇచ్చేస్తానని మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ చేసిన ప్రతిపాదనను కేరళ ప్రభుత్వం తిరస్కరించింది. ఆయన ప్రతిపాదనను తాము ఆమోదించలేమని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అన్నారు. ఈవెంట్‌పై క్యాబినెట్ సమావేశంలో సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. -
షూటింగ్లో తెలంగాణకు కాంస్యం
టెన్నిస్‌లో ఫైనల్‌కు జాతీయ క్రీడలు తిరువనంతపురం: జాతీయ క్రీడల్లో మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒక్క పతకమే దక్కింది. షూటింగ్ విభాగంలో తెలంగాణ కాంస్యంతో సంతృప్తిపడింది. మంగళవారం జరిగిన ట్రాప్ ఈవెంట్లో కైనన్ చినాయ్, డారిస్ చినాయ్, గౌతమ్‌లతో కూడిన పురుషుల జట్టు 314 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా తెలంగాణ ఖాతాలో మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలు ఉన్నాయి. ఏపీ ఖాతాలో ఓ స్వర్ణం, ఓ రజతం, రెండు కాంస్యాలున్నాయి. టెన్నిస్‌లో టైటిల్ పోరుకు పురుషుల టెన్నిస్‌లో తెలంగాణ జట్టు 2-0తో మహారాష్ట్రపై గెలిచింది. తొలి సింగిల్స్‌లో విష్ణు వర్ధన్ 6-4, 7-6 (6)తో షాహబాజ్‌పై; రెండో సింగిల్స్‌లో సాకేత్ మైనేని 7-6 (9), 6-3తో ఆకాశ్ వాఘ్‌పై నెగ్గారు. ఫైనల్లో తెలంగాణ జట్టు... తమిళనాడుతో తలపడుతుంది. మహిళల కేటగిరీలో తెలంగాణ 2-1తో తమిళనాడును ఓడించింది. తొలి సింగిల్స్‌లో సౌజన్య భవిశెట్టి 6-4, 6-1తో రష్మీ చక్రవర్తిపై గెలవగా; రెండో సింగిల్స్‌లో నిధి చిలుమల 2-6, 3-6తో స్నేహదేవి రెడ్డి చేతిలో ఓడింది. అయితే డబుల్స్‌లో సౌజన్య-రష్మీ 6-2, 6-4తో రష్మీ-స్నేహలపై గెలిచారు. ఫైనల్లో తెలంగాణ... గుజరాత్‌ను ఎదుర్కొంటుంది. విజయ్‌కు ‘డబుల్’ పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో సర్వీసెస్ షూటర్ విజయ్ కుమార్ రెండు స్వర్ణాలు సాధించాడు. వ్యక్తిగత విభాగంలో విజయ్ 583 పాయింట్లు నెగ్గాడు. సమరేశ్ జంగ్ (576), పెంబా తమాంగ్ (575)లు వరుసగా రజతం, కాంస్యం సాధించారు. టీమ్ ఈవెంట్లో విజయ్, తమాంగ్, గురుప్రీత్ సింగ్‌ల బృందం 1733 పాయింట్లతో పసిడిని సొంతం చేసుకుంది. స్విమ్మింగ్‌లో ఆరు మీట్ రికార్డులు బద్దలయ్యాయి. -
శ్రీనివాసరావుకు స్వర్ణం
ఉష, వెంకట లక్ష్మిలకు కాంస్యాలు * జాతీయ క్రీడలు త్రిసూర్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ తొలి రోజే స్వర్ణ పతకంతో మెరిసింది. ఆదివారం సోమవారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఏపీ ఆటగాళ్లు మూడు పతకాలు సాధించారు. పురుషుల 56 కేజీల విభాగంలో వల్లూరి శ్రీనివాస రావు (243 కేజీలు) స్వర్ణం సాధించగా... మహిళల 48 కేజీల విభాగంలో బంగారు ఉష (161 కేజీలు), 53 కేజీల విభాగంలో వెంకట లక్ష్మి (168 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు. ఈ ముగ్గురూ విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్‌లిఫ్టర్లు కావడం విశేషం. 2011 జార్ఖండ్ జాతీయ క్రీడల్లో ఇదే విభాగంలో పోటీ పడి స్వర్ణం దక్కించుకున్న 34 ఏళ్ల శ్రీనివాస రావు ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. మహిళల 53 కేజీల విభాగంలో పోటీపడాల్సిన ఆంధ్రప్రదేశ్ స్టార్ వెయిట్‌లిఫ్టర్ మత్స సంతోషి బరిలోకి దిగలేదు. తొలిరోజు జరిగిన పోటీల్లో హరియాణా ఆరు స్వర్ణాలు, ఓ రజతంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. -
గెలిస్తే భారీ ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగబోతున్న తెలంగాణ రాష్ట్ర జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే ఆటగాళ్లకు భారీ ప్రోత్సాహకాలు అందజేస్తామని క్రీడా శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ ప్రకటించారు. తొలిసారి తెలంగాణ జట్టు బరిలోకి దిగుతున్న ఈ క్రీడల కోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. కేరళలో ఈ నెల 31నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులకు మంగళవారం కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ క్రీడల్లో పాల్గొనే ఆటగాళ్ల కోసం మొదటి సారి ప్రత్యేకంగా వైద్యులతో పాటు సైకాలజిస్ట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడల తెలంగాణ కమిటీ చైర్మన్ జితేందర్ రెడ్డి, క్రీడా శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు, గగన్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. 14 క్రీడాంశాల్లో బరిలోకి జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రంనుంచి మొత్తం 150 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 19 మంది కోచ్‌లు, 17 మంది మేనేజర్లు కూడా ఈ బృందంలో ఉన్నారు. మొత్తం 14 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పోటీ పడనున్నారు. అక్వాటిక్స్, ఆర్చరీ, బీచ్ వాలీబాల్, షూటింగ్, రెజ్లింగ్, స్క్వాష్ రాకెట్స్, లాన్ టెన్నిస్, రోయింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, వుషు, ట్రయాథ్లాన్‌లలో జట్లు పాల్గొనడం అధికారికంగా ఖరారైంది. కనోయింగ్ అండ్ కయాకింగ్, ఫెన్సింగ్‌లలో జట్టు పాల్గొనడంపై ఆయా సమాఖ్యలనుంచి లేఖ రావాల్సి ఉంది. నేడు ఆంధ్రప్రదేశ్ కూడా... మరో వైపు జాతీయ క్రీడల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్లకు సంబంధించి కిట్ల పంపిణీ కార్యక్రమం నేడు విజయవాడలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం 15 క్రీడాంశాల్లో బరిలోకి దిగుతోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, స్విమ్మింగ్, బీచ్ వాలీబాల్, ట్రయాథ్లాన్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, బాక్సింగ్‌లలో ఏపీ పోటీ పడుతోంది. రాష్ట్రం తరఫున మొత్తం 142 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. ఇందులో 67 మంది పురుషులు, 75 మంది మహిళలు ఉన్నారు. 23 మంది కోచ్‌లు, 16 మంది మేనేజర్లతో కలిపి మొత్తం 181 మంది సభ్యుల బృందం కేరళ వెళుతుంది. పరస్పర రాజీ! దాదాపు పక్షం రోజుల క్రితం వరకు కూడా జాతీయ క్రీడల్లో తెలంగాణ జట్టు పాల్గొనడం సందేహంగానే ఉంది. దాంతో సమైక్య ఆంధ్రప్రదేశ్‌గానే చాలా క్రీడాంశాల్లో పాల్గొనేందుకు జట్లు సిద్ధమైపోయాయి. అయితే వారం క్రితం భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) రెండు వేర్వేరు జట్లను గుర్తిస్తూ జట్ల ఎంపిక కోసం అడ్‌హక్ కమిటీలు కూడా హడావిడిగా ఏర్పాటు చేయడంతో పరిస్థితి మారిపోయింది. క్వాలిఫై అయిన కొన్ని క్రీడాంశాల్లో ఒక రాష్ట్రం ఆటగాళ్లు ఎక్కువ మంది ఉంటే, మరో ఆటలో ఒక రాష్ట్రంనుంచి బలమైన క్రీడాకారులు ఉన్నారు. దాంతో కొంత గందరగోళం, ఆ తర్వాత చర్చల అనంతరం ఇరు రాష్ట్రాల సంఘాల ప్రతినిధులు రాజీ మార్గానికి వచ్చారు. జాతీయ క్రీడలకు ఎనిమిది టీమ్ ఈవెంట్లలో సమైక్య ఆంధ్రప్రదేశ్ అర్హత సాధించింది. ఇప్పుడు మూడు క్రీడాంశాల్లో ఏపీ, ఐదు క్రీడాంశాల్లో తెలంగాణ జట్లు బరిలోకి దిగుతున్నాయి (వ్యక్తిగత అంశంలో ఈ సమస్య లేదు. ఆటగాడు ఏ రాష్ట్రం తరఫున అర్హత టోర్నీలు ఆడితే అతను అదే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తాడు). ఏపీలో పుట్టి, పెరిగినవారే తమ రాష్ట్రం తరఫున ఆడాలంటూ ఆ రాష్ట్రం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తమ జట్టు బలహీనంగా మారినా తెలంగాణ ఆటగాళ్లను తీసుకునేందుకు వారు ఇష్ట పడలేదు. దీనికి ఉదాహరణగా కబడ్డీ జట్టును చెప్పవచ్చు. అదే తరహాలో ఇటు తెలంగాణ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ ఏపీ గొడుగు కింద ఆడేందుకు ఇష్టపడటం లేదు. అందు కోసం అవసరమైతే కొన్ని అంశాలనుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధమైంది. చివరకు బుధవారంనాటికి అన్నింటిపై స్పష్టత రావడంతో ఇరు రాష్ట్రాలు క్రీడల కోసం సిద్ధమయ్యాయి. అయితే బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ అంశాలు మాత్రం దీనికి భిన్నం. ఈ రెండింటిలో ఆంధ్రప్రదేశ్ జట్టు మాత్రమే బరిలోకి దిగుతోంది. అయితే అందులో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులకు కూడా చోటు కల్పిస్తూ ఆయా జట్లను ఎంపిక చేయడం విశేషం. -
జాతీయ క్రీడలు ఎలా సాధ్యం?
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: ‘2018లో జరిగే జాతీయ క్రీడలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్రానికి ఇప్పటికే తెలియజేశాం’...ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన ఇది. బుధవారం జాతీయ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ మాట చెప్పారు. అసలు సీఎం జాతీయ క్రీడల గురించి సమాచారం, అవగాహన లేకుండా ఈ మాట చెప్పారా... లేదంటే అన్నీ తెలిసి అలవాటుగా వ్యాఖ్య చేశారా అనేది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ క్రీడలను ఇప్పటికే ఉత్తరాఖండ్‌కు కేటాయించారు. ఏపీ ప్రభుత్వం ఆరంభ శూరత్వం ప్రదర్శించింది గానీ నిజంగా క్రీడల హక్కులు దక్కించుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కోరిక ఈనాటిది కాదు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిననాటినుంచి చంద్రబాబు జాతీయ క్రీడల నిర్వహణ గురించి చెబుతూనే వచ్చారు. దీనికి సంబంధించి గత ఏడాది జులై 31న క్రీడా మంత్రి అచ్చెన్నాయుడు ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. అయితే జులై 31న సమావేశానంతరం దాదాపు మూడు నెలల పాటు ప్రభుత్వం స్తబ్దుగా ఉండిపోయింది. చివరకు నవంబర్ 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు లేఖ రాశారు. 2018లో లేదా మరో సంవత్సరంలో విజయవాడలో జాతీయ క్రీడలు నిర్వహించే అవకాశం ఇవ్వాలని ఐఓఏ అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే నిజంగా హక్కులు కేటాయించాలంటే ఏమేం చేయాలో తెలియజేస్తూ ఏపీ ఒలింపిక్ సంఘం, ప్రభుత్వానికి వివరాలు ఇచ్చింది. రూ. 50 లక్షలు డిపాజిట్ చేసి బిడ్ వేయాలని సూచిం చింది. అధికారుల అలసత్వానికి తోడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పాటు ఒలింపిక్ సంఘం చేసిన ఏ సూచననూ పరిగణనలోకి తీసుకోలేదు. ఏం జరిగిందంటే... 38వ జాతీయ క్రీడల కేటాయింపు గురించి డిసెంబర్ 19న చెన్నైలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సమావేశం జరిగింది. ఆ రోజు నాటికి బిడ్ వేసినా అవకాశం దక్కేదేమో. కానీ ఏపీ తరఫున మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదు. ఈ సమావేశంలో ఏపీనుంచి ఎలాంటి ప్రతిపాదన రాకపోవడం తో క్రీడలను ఉత్తరాఖండ్‌కు కేటాయించారు. ఆ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆకట్టుకున్నారు. అలా ఆ అవకాశం ఇప్పటికే చేజారిపోయింది. అవకాశం ఉందా! ప్రస్తుతం కేరళలో జరుగబోతున్నవి 35వ జాతీయ క్రీడలు. ఇవి షెడ్యూల్ ప్రకారం 2012లోనే జరగాలి. కానీ ఇవి 2015లో జరుగుతున్నాయి. 36వ క్రీడలను (2014-గోవా), 37వ క్రీడలను (2016-ఛత్తీస్‌గఢ్)కు ఇప్పటికే కేటాయించారు. 2018 ఉత్తరాఖండ్‌కు వెళ్లిపోయింది. ఇవన్నీ ఏ ఏడాదిలో జరుగుతాయో తెలీదు. అన్నీ సవ్యంగా ఉంటే ఉత్తరాఖండ్‌లో 2018 క్రీడలు 2020లో జరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు మేమూ సిద్ధమంటూ, కేంద్రానికి చెప్పేశామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. తెలంగాణ జట్ల శుభారంభం విజయవాడ స్పోర్ట్స్ : చుక్కపల్లి పిచ్చయ్య స్మారక 60వ జాతీయ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు శుభారంభం చేశా యి. బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీలో పురుషుల విభాగంలో తెలంగాణ జట్టు 29-4, 29-1 తేడాతో మణిపూర్‌పై, మహిళల విభాగంలో తెలంగాణ జట్టు 29-6, 29-18 తేడాతో పంజాబ్ జట్టుపై గెలుపొందాయి. ఈ టోర్నీలో 29 రాష్ట్రాల జట్లతో పాటు నాలుగు ఇన్స్టిట్యూషన్ జట్లు పాల్గొంటున్నాయి. 11 వరకు టోర్నీ జరుగుతుం ది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోటీలను ప్రారంభించారు. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రాజశేఖర్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. -
ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచిన రాణీ రాంపాల్
చాలా ఏళ్ల క్రితం... కూతురికి హాకీ క్రీడపై ఉన్న ఆసక్తిని గమనించిన ఓ తండ్రి ప్రోత్సహించాలని భావించాడు. అలాగే చేశాడు కూడా. అయితే అతడు అంతకు మించి ఏమీ చేయలేకపోయాడు. కారణం.. అతడు ఓ తోపుడు బండి లాగుతూ కుటుంబాన్ని పోషించుకునే నిరుపేద వ్యక్తి. ఇలాంటి దుర్భర నేపథ్యం నుంచి వచ్చిన ఓ అమ్మాయి మహిళల హాకీకి మహా‘రాణి’ కావాలని కన్న కల నెరవేరే అవకాశం ఉంటుందా..? అంకిత భావంతో ముందుకెళితే సాధ్యం కానిది ఉండదని నిరూపించింది... హర్యానాలోని షాబాద్‌కు చెందిన 18 ఏళ్ల రాణీ రాంపాల్. సాక్షి క్రీడావిభాగం అవటానికి జాతీయ క్రీడే అయినా... దేశంలో హాకీకి ఉన్న ఆదరణ అంతంత మాత్రమే. క్రికెట్‌తో పోలిస్తే హాకీని అభిమానించే వారు చాలా తక్కువ. దీనికి తగ్గట్టుగానే హాకీలో భారత్‌కు చెప్పుకోదగ్గ విజయాలు రావడం లేదు. ఇక మహిళల విభాగంలో అయితే ఓ టైటిల్ గెలిచామని చెప్పుకుని చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ జట్టు కాంస్యం సాధించడం పెద్ద సంచలనమైంది. ఈ టోర్నీలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన క్రీడాకారిణి రాణీ రాంపాల్. ఈ హర్యానా అమ్మాయి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని... జీవితంలో అష్టకష్టాలు పడి కూడా ఆటపై మమకారాన్ని పెంచుకుంది. పట్టుదలతో రాణించి ఇవాళ మొత్తం దేశం చూపు తనవైపు తిప్పుకుంది. ప్రపంచకప్‌లో ఆరు గోల్స్ సాధించి ‘ఉత్తమ క్రీడాకారిణి’ అవార్డు గెలుచుకోవడంతో రాణీ పేరు దేశమంతా మార్మోగిపోతోంది. దేశంలో హాకీ చచ్చిపోతుందనే వ్యాఖ్యలను ఆమె సగర్వంగా తిప్పికొడుతోంది. తమ ఈ విజయంతో అలాంటి అభిప్రాయం మార్చుకోవాలని సూచిస్తోంది. కష్టాలు.. కన్నీళ్లే రాణీ చిన్నప్పటి జీవితం సుఖవంతంగా గడిచింది లేదు. ఆటపై ఇష్టం పెంచుకున్నా నేర్చుకోవడానికి అది సరిపోదు.. బరిలోకి దిగాలంటే హాకీ స్టిక్స్, బూట్లు కావాలి. వాటిని కొనేందుకు తన తండ్రి దగ్గర డబ్బు లేదు. ఇలాంటి పరిస్థితి వేరొకరికి ఎదురైతే పరిస్థితులతో రాజీపడేవారేమో.. కానీ రాణి అదృష్టం మరోలా ఉంది. ఆమెకు కోచ్, ద్రోణాచార్య అవార్డీ బల్దేవ్ సింగ్ అండగా నిలబడ్డారు. అవసరమైన క్రీడా పరికరాలు కొనిచ్చి ఆటలో రాటుదేలేలా చేశారు. కోచ్‌కు చెందిన షాబాద్ హాకీ అకాడమీలో ప్రాక్టీస్ చేసేందుకు తను రోజూ రెండు కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లేది. కొన్నిరోజుల తర్వాత తండ్రి ఓ సైకిల్ కొనిచ్చారు. చిన్నప్పుడు చాలా మంది హేళనగా మాట్లాడినా ఇప్పుడు తన విజయం ఎంతోమంది వర్థమాన ఆటగాళ్లకు ఆదర్శం కానుంది. 13 ఏళ్లకే జట్టులో స్థానం టాలెంట్ ఎక్కడున్నా దాచిపెట్టడం కష్టమనే అభిప్రాయానికి తగ్గట్టుగానే రాణీ రాంపాల్ నైపుణ్యం త్వరగానే హాకీ పెద్దల దృష్టిని ఆకర్షించింది. 2008లో కజాన్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు 13 ఏళ్ల వయస్సులో రాణీ భారత సీనియర్ మహిళల జట్టులో స్థానం దక్కించుకుని రికార్డులకెక్కింది. అయితే ఆమె ప్రతిభ లోకానికి తెలిసింది మాత్రం ఆ తర్వాత ఏడాది జరిగిన చాంపియన్స్ చాలెంజ్-2 టోర్నీలోనే. అందులో అందరికన్నా ఎక్కువగా 8 గోల్స్ సాధించి ‘ఉత్తమ యువ క్రీడాకారిణి’గా నిలిచింది. ఇక గత ఆదివారం ప్రపంచ జూనియర్ మహిళల హాకీ టోర్నీ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ చేసిన మూడు గోల్స్‌లో రెండు రాణీనే సాధించింది. తద్వారా ఈ టోర్నీలో భారత్ తొలిసారిగా పతకం సాధించిన చరిత్రకు కారణమైంది. ఈ జట్టులో ఉన్న 16 మందిలో ఆరుగురు హర్యానాలోని షాబాద్‌కు చెందిన వారే కావడం విశేషం.