శ్రీనివాసరావుకు స్వర్ణం | Opening day of 35th National Games Sanjita, Mirabai open Manipur's medal account in Weightlifting | Sakshi
Sakshi News home page

శ్రీనివాసరావుకు స్వర్ణం

Published Mon, Feb 2 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

శ్రీనివాసరావుకు స్వర్ణం

శ్రీనివాసరావుకు స్వర్ణం

ఉష, వెంకట లక్ష్మిలకు కాంస్యాలు
* జాతీయ క్రీడలు

త్రిసూర్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ తొలి రోజే స్వర్ణ పతకంతో మెరిసింది. ఆదివారం సోమవారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఏపీ ఆటగాళ్లు మూడు పతకాలు సాధించారు. పురుషుల 56 కేజీల విభాగంలో వల్లూరి శ్రీనివాస రావు (243 కేజీలు) స్వర్ణం సాధించగా... మహిళల 48 కేజీల విభాగంలో బంగారు ఉష (161 కేజీలు), 53 కేజీల విభాగంలో వెంకట లక్ష్మి (168 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు.

ఈ ముగ్గురూ విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్‌లిఫ్టర్లు కావడం విశేషం. 2011 జార్ఖండ్ జాతీయ క్రీడల్లో ఇదే విభాగంలో పోటీ పడి స్వర్ణం దక్కించుకున్న 34 ఏళ్ల శ్రీనివాస రావు ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. మహిళల 53 కేజీల విభాగంలో పోటీపడాల్సిన ఆంధ్రప్రదేశ్ స్టార్ వెయిట్‌లిఫ్టర్ మత్స సంతోషి బరిలోకి దిగలేదు. తొలిరోజు జరిగిన పోటీల్లో హరియాణా ఆరు స్వర్ణాలు, ఓ రజతంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement