Venkata Lakshmi
-
వెంకట లక్ష్మి పిటిషన్ పై తీర్పు రిజర్వ్
-
ఏపీ హైకోర్టుకు మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల లక్ష్మీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్స్‌గా తన నియామకాన్ని రద్దు చేయటాన్ని హైకోర్టులో ఆమె సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు నేడు(గురువారం) విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్నప్పటికి, రాజకీయ ప్రయోజనాలతో తొలగించారని కోర్టుకు తెలిపారు.2023లో సడలించిన చట్టం ప్రకారం అయిదు సంవత్సరాల కాల పరిమితి నుంచి రెండు సంవత్సరాల కాల పరిమితికి పరిమితం చేయటంతో పిటిషనర్ కాల పరిమితి ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే గజ్జల లక్ష్మీని చైర్ పర్సన్గాతొలగించారని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులను ఇలా తొలగించటం నిబంధనలకు వ్యతిరేకమని చెప్పారు.మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. గత చైర్పర్సన్ పదవి కాలం ఆగస్టుతో ముగిసిపోయినందున పిటిషనర్ నియామకం కూడా రద్దయినట్టుగా భావించాలని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమించబడ్డార,ని రెండు సంవత్సరాల కొనసాగింపు కోరే హక్కు ఆమెకు లేదని చెప్పారు. ఇరువురి వాదనల అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. -
టీడీపీ నేతలపై మహిళా కమిషన్ ఫైర్
-
పెళ్ళికి ఒప్పుకోలేదని కొబ్బరి బోండాల కత్తితో దాడి
-
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే ఇలా..!
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దళిత మహిళ అయిన హోంమంత్రి తానేటి వని తపై దాడులకు దిగటం సిగ్గుచేటని అన్నారు.విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు పా ల్పడ్డారని, మాచర్ల నియోజకవర్గంలోని శిరి గిరిపాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమపై దాడి చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. హోంమంత్రి తానేటి వనితపై దాడిని మహిళా లో కం సీరియస్‌గా తీసుకుందని, మహిళలంతా ఏకమై ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చె ప్పేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించటం ఖాయమని పోతుల సునీత చెప్పారు.మహిళలపై టీడీపీ దాడులు దుర్మార్గం..ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మహిళలపై టీడీపీ కూటమి నేతలు దుర్మార్గంగా దాడులకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల మహిళలపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలమీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆమె గురువారం లేఖ రా శారు.ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించడంతో దళితులు, మహిళలు భ యాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. విజయవాడలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమా కుమారుడు మహిళలపై దాడి చేయడం దారుణమన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలిపై, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ నేతలు దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. -
మద్యం మత్తులో.. తలుపు వేసి, కొడవలితో అతి కిరాతకంగా..
భద్రాద్రి: మద్యానికి బానిసైన వ్యక్తి.. భార్యతో గొడవ పడుతూ ఆవేశంతో ఆమైపె కొడవలితో దాడి చేసి హతమార్చాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామపంచాయతీ పరిధి తాటి నాగులగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మొడియం పాపారావు – వెంకటలక్ష్మి(45)కి ఇద్దరు కుమార్తెలుండగా వివాహాలు జరిగాయి. కొన్నాళ్లుగా మద్యానికి బానిసైన పాపారావు గురువారం అర్ధరాత్రి దాటాక భార్యతో మత్తులో గొడవపడ్డాడు. మద్యం తాగుతూ కుటుంబాన్ని పట్టించుకోని విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరగగా ఆయన వెంకటలక్ష్మిని కర్రతో కొట్టాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయగా ఇరుగుపొరుగు వచ్చి పాపారావును అడ్డుకునేందుకు యత్నించారు. అయినా సరే పాపారావు ఆగకపోగా, ‘నా భార్యను కొడతా, తిడతా.. మీకెందుకు’అనడంతో రోజూ జరిగే గొడవే కదా అని వారు వెళ్లిపోయారు. తలుపు వేసి, కొడవలితో దాడి చేసి.. ఇరుగుపొరుగు వెళ్లాక ఇంటి తలుపులు వేసిన పాపారావు మరోసారి భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న కొడవలితో తలపై మోది, తల, ముఖంపై దాడి చేయగా తీవ్ర రక్తస్రావమై మృతి చెందింది. శుక్రవారం ఉదయం కూలీ పనులకు పిలిచేందుకు స్థానిక మహిళలు వెళ్లగా ఆమె రక్తపు మడుగులో కనిపించడంతో పోలీసులకు తెలిపారు. సీఐ కరుణాకర్, ఎస్ఐ పి.శ్రీకాంత్ చేరుకుని కొడవలితో విచక్షణారహితంగా దాడి చేయడంతోనే రక్తస్రావమై ఆమె మృతి చెంది ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు. కాగా, పరారీలో ఉన్న పాపారావు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మూడో వార్డు రవీంద్రనగర్ ప్రాంతం ఎస్.ఐ.జి.నగర్లో మల్లేటి వెంకటలక్ష్మి అలియాస్ సంతోషి(27), రాజు కుటుంబం నివాసముంటోంది. సూమారు ఐదేళ్ల కిందట ఎస్.ఐ.జి.నగరానికి చెందిన రాజుకు, సింహాచలం ప్రాంతం ప్రహ్లాదపురానికి చెందిన వెంకటలక్ష్మికి వివాహం జరిగింది. వీరికి 4 ఏళ్ల కుమారుడు, ఏడాది పాప ఉన్నారు. రాజు కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహం రాజు పనికి వెళ్లిన సమయంలో వెంకటలక్ష్మి ఇంటి లోపల నుంచి తలుపు గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఆమెతో పాటు పక్కనే ఉన్న ఏడాది కుమార్తె కొంతసేపటికి ఏడవడంతో ఏం జరిగిందో తెలియని చుట్టుపక్కల వారు తలుపులు పగలుగొట్టి లోపలకు ప్రవేశించారు. అప్పటికే ఆమె చీరతో ఉరి వేసుకొని కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆరిలోవ సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐలు పాపారావు, శ్యామలరావు, సిబ్బంది అక్కడకు చేరుకొన్నారు. వెంకటలక్ష్మి ఉరి వేసుకొన్న తీరు పరిశీలించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా తన కుమార్తెను భర్త రాజు, అత్త సీతమ్మ, బావ శ్రీనివాస్, తోటికోడలు కాశీ ఉరివేసి చంపేశారంటూ మృతురాలి తల్లి సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్: యూసుఫ్‌గూడలో దారుణం
-
పట్టపగలు యువతి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే ఓ ప్రేమోన్మాది యువతిని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. బంగారు నగలు కట్ చేసే కట్టర్‌తో దాడికి తెగబడి ప్రాణాలు తీశాడు. సోమవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతడు ఓ పోలీసు అధికారి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. అగ్గిరాముడు మధురానగర్‌లో ఇస్త్రీ షాపు నిర్వహించడంతోపాటు ఓ ఇంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ జవహర్ నగర్లో కుటుంబంతో సహా అద్దెకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె వెంకటలక్ష్మి (19) ఏడో తరగతి వరకు చదివింది. కొన్నాళ్లు ఇళ్లల్లో పని చేసింది. రెండు నెలల నుంచి జవహర్ నగర్‌లోని జోడి ఫ్యాషన్ జ్యువెలరీస్ వన్ గ్రామ్ గోల్డ్ స్టోర్స్‌లో పని చేస్తోంది. ఈ షాపు యజమాని జ్యోత్స్న నాలుగు రోజుల క్రితం వేరే ఊరికి వెళ్లడంతో వెంకటలక్ష్మి దుకాణం నిర్వహిస్తోంది. సోమవారం కూడా స్టోర్స్ తెరిచిన వెంకటలక్ష్మి మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో యజమానురాలికి ఫోన్ చేసింది. షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, తనను వేధిస్తున్నారని చెప్పింది. తర్వాత 3.30 గంటల సమయంలో ఓ యువకుడు షాప్‌లోకి వచ్చాడు. అక్కడే ఉన్న బంగారు నగలు కట్ చేసే కట్టర్‌తో వెంకటలక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడున్న వెంకటలక్ష్మిని స్థానికులు కొద్దిసేపటి తర్వాత గమనించారు. వీరి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల నుంచి వేధింపులు ఆరు నెలలుగా సాగర్ అనే యువకుడు తనను వేధిస్తున్నట్లు వెంకటలక్ష్మి తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఓసారి సాగర్ ఇలానే చేసినట్లు ఆమె పలువురి వద్ద వాపోయినట్లు తెలిసింది. ప్రేమను నిరాకరించిన కారణంగానే అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగానే కుట్ర పన్ని సాగర్ గత నాలుగైదు రోజులుగా ఆమెను వెంటాడుతూ, ప్రతి కదలికను గుర్తించినట్లు తెలిసింది. దుకాణంలో ఒంటరిగా ఉందని, మధ్యాహ్నం వేళల్లో వినియోగదారుల రద్దీ కూడా ఉండదన్న ఉద్దేశంతో ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ హత్యలో సాగర్‌కు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. వారు బయట కాపు కాయగా.. దుకాణంలోకి వెళ్లిన సాగర్ ఘాతుకానికి తెగబడినట్లు సమాచారం. గొంతు కోసిన తర్వాత సాగర్ ఆమె మెడలో ఉన్న చున్నీతో ఉరి వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు మధురానగర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. గతంలోనూ అతడు తమ కూతురిని బెదిరించాడని వెంకటలక్ష్మి కుటుంబీకులు తెలిపారు. రోదిస్తున్న వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నాం. స్థానికుల సమాచారంతోపాటు ఘటనా స్థలంలో ఉన్న సీసీఫుటేజీలు, వీధిలోని ఫుటేజీలను సేకరించి విశ్లేషిస్తున్నాం. బాధితురాలి సెల్‌ఫోన్ కాల్‌డేటా సైతం పరిశీలిస్తున్నాం. – ఏఆర్ శ్రీనివాస్, వెస్ట్‌జోన్ డీసీపీ -
యూసఫ్‌గూడలో హత్య కలకలం
-
యూసఫ్‌గూడలో దారుణం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని యూసఫ్‌గూడలో దారుణం చోటు చేసుకుంది. బంగారం కొనేందుకు జ్యువెల్లరీ షాప్‌కు వచ్చిన యువతిని గొంతుకోసిన దుండగుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో ఒక్కసారిగా యూసఫ్‌గూడలో కలకలం రేగింది. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. షాపులో నుంచి పెద్దగా అరుపులు వినిపించడంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి వెళ్లేసరికి యువతి రక్తపు మడుగులో పడివుంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతురాలు వెంకటలక్ష్మి(19)గా గుర్తించారు. పదేళ్ల కిందట రావులపాలెం నుంచి వెంకటలక్ష్మి హైదరాబాద్‌కు వలస వచ్చినట్లు చెప్పారు. జ్యువెల్లరీ షాపులో ఎలాంటి చోరీ జరగలేదని చెప్పారు. తెలిసిన వ్యక్తే వెంకటలక్ష్మిని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నామని చెప్పారు. నిందితుడి కోసం పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. -
అప్పుల బాధతో రియల్టర్ ఆత్మహత్య
► రూ.కోటికిపైగా అప్పులున్నట్లు సూసైడ్ నోట్ ► భార్యాపిల్లల్ని వేధించవద్దని నోట్లో కోరిన మృతుడు మదనపల్లె క్రైం : అప్పుల బాధ తాళలేక బెంగళూరుకు చెందిన ఓ రియల్టర్ మదనపల్లెలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చిం ది. తనకు రూ.కోటికి పైగా అప్పులు ఉన్నట్లు మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తాను చనిపోయిన తరువాత సహచర భాగస్వాములు తన భార్యా పిల్లల్ని డబ్బుల కోసం వేధించవద్దని అందులో కోరాడు. మదనపల్లె టూ టౌన్ ఎస్ఐ గంగిరెడ్డి కథనం మేరకు.. వైఎస్ఆర్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం గంగమ్మ జాతర ఈడిగపల్లెకు చెందిన తుమ్మల నాగప్ప కుమారుడు వెంకటరమణ(55) గత 30 ఏళ్ల క్రితం బెంగళూరు నగరానికి చేరుకుని లగేరిలో స్థిర పడ్డాడు. అతనికి భార్య వెంకటలక్ష్మి, కుమారుడు నటరాజ ఉన్నారు. బెంగళూరులో పెద్ద పెద్ద కాం ట్రాక్టు పనులు చేసుకుంటూ రియల్టర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం మదనపల్లె సమీపంలోని వలసపల్లె పంచాయతీ ముంబయి–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ‘రియల్’ వ్యాపారం దెబ్బతినడంతో.. ఇటీవల కొంత కలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో అప్పులు పెరిగాయి. రూ.కోటికి పైగా అప్పులు ఉన్నాయి. అందులో రూ.10 వడ్టీతో సగం తీర్చాడు. ఇంకా రూ.కోటి ఉండడంతో భాగస్వాములు, నలుగురు వడ్డీ వ్యాపారులు తరచూ వేధింపులకు దిగడంతో మదనపల్లెలో ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. భూమికి ధర రాక గత నెల 29న మదనపల్లెలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. వెంట తెచు్చకున్న భూముల పత్రాలను స్థాని క వ్యాపారులకు చూపించి విక్రయించాలని చెప్పాడు. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో వెంకటరమణ ఆశించిన ధర రాలేదు. అప్పు లు ఇచ్చిన వారి వేధింపులు అ«ధిక మవడంతో తీవ్ర మనస్తాపానికి గురయా్య డు. వారం రోజుల క్రితం మదనపల్లె ఆర్టీసీ బస్టాండుకు ఆనుకుని ఉన్న ఓ లాడ్జిలో గది తీసుకున్నాడు. గురువారం రాత్రి నీరుగట్టుపల్లె చౌడేశ్వరిదేవి ఆలయం దగ్గరున్న వ్యవసాయ పొలంలో మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం బహిరూ్భమికి వెళ్లిన స్థానికు లు అక్కడ వెంకటరమణ చనిపోయి ఉండడాన్ని గమనించి టూటౌన్ పోలీ సులకు సమాచారం అందించారు. ఎస్ఐ గంగిరెడ్డి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఉన్న సూసైడ్ నోట్, సెల్‌ఫోన్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కన్నతల్లి కర్కశత్వం..!
డబ్బు కోసం పిల్లలను హతమార్చిన తల్లి తల్లితో సహా ఐదుగురి అరెస్ట్ సిప్కాట్ : డబ్బు కోసం వికలాగులైన ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన కేసులో తల్లితోపాటు ఐదుగురిని మత్తిగిరి పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. డెంకణీకోట సమీపంలోని ఎల్లైయూర్ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి తన మేనమామ శ్రీనివాసన్‌తో 20 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి వికలాంగులైన ఇద్దరు పిల్లలు పుట్టారు. కొన్ని రోజుల తర్వాత భర్తతో మనసస్పర్తల కారణంగా వెంకటలక్ష్మి అతనితో విడిపోరుు తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి చేరింది. వికలాంగులైన ఇద్దరు పిల్లలను తన తల్లితండ్రుల వద్ద వదలి బెంగళూరులోని గార్మెంట్స్ కంపెనీలో పనికి చేరింది. ఈ క్రమంలో సురేష్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదిలా ఉండగా ఇటీవల ఎల్లైయూర్లోని తన తండ్రి నాగప్ప కొంత వ్యవసాయ భూమిని అమ్మి డబ్బులు తన మనుమడు, మనురాలి పేరులో బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఆ డబ్బులను కాజేయాలని వెంకటలక్ష్మి తన ప్రియుడు సురేష్‌తో కలసి పథకం పన్నిన వెంకటలక్ష్మి పుట్టింటికి చేరుకొని గత నెల మొదటి వారంలో కూతురు మంజు, కొడుకు ముత్తప్పను బెంగళూరులోని హాస్టల్లో చేర్పిస్తామని చెప్పి ఇద్దరు పిల్లలను బెంగళూరుకు తీసుకెళ్లింది. గత నెల 7 వ తేది పిల్లలను దారుణంగా హత్య చేసి హొసూరు సమీపంలోని పెద్దమేనాగరం వద్ద మంజు శవాన్ని, ముత్తప్ప శవాన్ని తళి సమీపంలోని బల్లపల్లి వద్ద పడేసి వెళ్లారు. దీనిపై మత్తిగిరి, తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశారుు. వికలాంగులైన పిల్లల పేరుతో బ్యాంకులో డెపాజిట్ చేసిన డబ్బును కాజేసేందుకు తన ప్రియుడు సురేష్, అతని తమ్ముడు గోపాల్, అతని భార్య శాంతి, కారు డ్రైవర్ నవీన్‌లతో కలసి పిల్లలను హత్య చేసినట్లు నిందితులు అంగీరించారు. దీంతో మత్తిగిరి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి ఆదివారం రాత్రి రిమాండుకు తరలించారు. -
మహిళ అనుమానాస్పద మృతి
దేవరపల్లి : దేవరపల్లి మండలం యాదవోలులో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఎస్ఐ సి.హెచ్.ఆంజనేయులు కథనం ప్రకారం.. ద్వారకా తిరుమల మండలం గొడుగుపేటకు చెందిన వెంకటలక్ష్మి(25) యాదవోలుకు చెందిన గుంపుల శ్రీనును ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మి శనివారం ఇంటిలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై భిన్నవాదనలు వినబడుతున్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు వెల్లడించారు. -
బంగారం మెరుగుపెడతామని..
బంగారం మెరుగుపెడతామని ఇద్దరు వ్యక్తులు మోసం చేసిన సంఘటన గాజువాక మండలం అక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మదీన చిన్నతల్లి, మదీన వెంకటలక్ష్మి అత్తా కోడళ్లు. బంగారం మెరుగుపెడతామని ఓ వ్యక్తి వాళ్ల ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న పాత రాగి వస్తువులు ఇవ్వగా వాటిని తళాతళా మెరిసేవిధంగా చేశాడు. దీంతో వారు బంగారు ఆభర ణాలు కూడా ఇచ్చారు. ఇంటి వెనకాలకు వెళ్లి వచ్చేసరికి సదరు వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పరారయ్యారు. వారి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
కాకినాడ రూరల్ : అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ వివాహిత మరణించింది. ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు అత్తింటివారు చెబుతుండగా, తమ కుమార్తెను హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పుట్టింటివారు ఆరోపించారు. మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ అమీనాబాద్‌కు చెందిన అన్నవరపు రమణ, రత్నం దంపతుల కుమారై వెంకటలక్ష్మి(24)ని, కాకినాడలోని ప్రతాప్‌నగర్ టీచర్స్‌కాలనీకి చెందిన పెయింటింగ్ వర్కర్ కాదులూరి శివకుమార్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. రూ.2 లక్షల కట్నం, బంగారు ఆభరణాలు, మరో రూ.40 వేలు ఆడపడుచు కట్నంగా ఇచ్చారు. కొంతకాలం వారి కాపురం బాగానే ఉంది. మరికొంత కట్నం తెమ్మని ఆడపడుచు, అత్తగారితో కలసి శివకుమార్ తన భార్యను వేధించాడు. ఈ విషయాలను వెంకటలక్ష్మి తన తల్లిదండ్రులకు చెప్పేది. ఈ క్రమంలో వారు ఇటీవల రూ.40 వేలు శివకుమార్‌కు ఇచ్చారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో శివకుమార్ ఫోన్ చేసి, వెంకటలక్ష్మి బాత్రూంలో పడిపోయి చనిపోయిందని ఒకసారి, ఉరి వేసుకుని చనిపోయిందని మరోసారి ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. వారు అక్కడకు చేరుకునే సరికి మృతదేహాన్ని ఇంటి బయట పడుకోబెట్టారు. మృతదేహంపై గాయాలు, పీక నొక్కినట్టు గుర్తులు ఉన్నాయి. సంఘటన స్థలాన్ని ఎస్సై తిరుపతి పరిశీలించారు. రమణ ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా తుని మండలం చామవరంలో సోమవారం ఉదయం కుటుంబ కలహాలతో దంపతులు ప్రాణాలు తీసింది. గ్రామానికి చెందిన మేడిశెట్టి సుబ్బారావు(40), వెంకటలక్ష్మి(35) సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. వెంకటలక్ష్మి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకోగా, సుబ్బారావు పురుగుల మందు తాగి సమీపంలోని పంట కాలువ వద్ద మృతిచెందాడు. సుబాఆబరావు తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇరుగుపొరుగువారి ఫిర్యాదు మేరకు తుని పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఇదెక్కడి న్యాయం?
వసతులు, జీతాలు అడిగితే జాబ్‌చార్ట్ పేరుతో బెదిరింపులు సమావేశాన్ని బహిష్కరించిన ఐఈఆర్టీలు అనంతపురం ఎడ్యుకేషన్ : ‘ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలను శుభ్రం చేసేవారు లేరు. జూన్ నుంచి మరుగుదొడ్లను పట్టించుకోకపోవడంతో కంపు కొడుతున్నాయి. ఈ విషయాలన్నీ అధికారులకు తెలుసు. అయినా ఇవేవి పట్టించుకోకుండా జాబ్‌చార్ట్ పేరుతో బెదిరింపులకు గురిచేయడం ఎంతవరకు న్యాయం’ అని ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్లు (ఐఈఆర్టీ) వాపోయారు. గురువా రం ఉదయం స్థానిక సైన్స్ సెంటర్లో ఐడీ కోఆర్డినేటర్ పాండురంగ ఐఈఆర్టీలతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ...‘మీరు తలవంపులు తెస్తున్నారు. ప్రతి భవిత కేంద్రంలోనూ 20 మంది ప్రత్యేక పిల్లలు ఉండాలని చెబుతున్నాం. 9 నుంచి మధ్యాహ్నం 3.30 గం టల వరకు పిల్లలందరూ కేంద్రాల్లో ఉం డాలని చెప్పాం. ఇలా ఏకేంద్రమూ నడవడం లేదు. మీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులు. అందరికీ మెమోలు ఇచ్చి ఇంటికి పంపుతామం’టూ హెచ్చరించారు. దీం తో మనస్తాపానికి గురైన ఐఈఆర్టీలు సమావేశాన్ని బహిష్కరించారు. అందరూ బయట చెట్లకింద బైఠాయించారు. పీఓ వచ్చి మాట్లాడేంతవరకు సమావేశానికి హాజరుకామని తెగేసి చెప్పారు. వారు మాట్లాడుతూ రాష్ట్రమంతా అన్ని జిల్లాల ఐఈఆర్టీలకు జీతాలు క్రమం తప్పకుండా పడుతున్నాయన్నారు. ఇక్కడ మాత్రం రెన్నెల్లుగా జీతాలు ఇవ్వలేదన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలను తీసుకురావాలంటే ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తున్నా వినకుండా చిందులేయడం ఏం న్యాయమని వాపోయారు. ఐఆర్టీలను అధికారులు తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని వాపోయారు. మహిళా ఉద్యోగులు ఎలా పని చేయాలన్నారు. సుమారు రెండు గంటల అనంతరం సమాచారం అందుకున్న పీఓ జయకుమార్ వచ్చి ఈఆర్టీలతో మాట్లాడారు. వసతుల లేమిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో ఐడీ కోఆర్డినేటర్ పాండురంగ, అసిస్టెంట్ జీసీడీఓ జయశేఖర్‌రెడ్డి. అసిస్టెంట్ ఐడీ కోర్డినేటర్ వెంకటలక్ష్మీ పాల్గొన్నారు. -
శ్రీనివాసరావుకు స్వర్ణం
ఉష, వెంకట లక్ష్మిలకు కాంస్యాలు * జాతీయ క్రీడలు త్రిసూర్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ తొలి రోజే స్వర్ణ పతకంతో మెరిసింది. ఆదివారం సోమవారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఏపీ ఆటగాళ్లు మూడు పతకాలు సాధించారు. పురుషుల 56 కేజీల విభాగంలో వల్లూరి శ్రీనివాస రావు (243 కేజీలు) స్వర్ణం సాధించగా... మహిళల 48 కేజీల విభాగంలో బంగారు ఉష (161 కేజీలు), 53 కేజీల విభాగంలో వెంకట లక్ష్మి (168 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు. ఈ ముగ్గురూ విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్‌లిఫ్టర్లు కావడం విశేషం. 2011 జార్ఖండ్ జాతీయ క్రీడల్లో ఇదే విభాగంలో పోటీ పడి స్వర్ణం దక్కించుకున్న 34 ఏళ్ల శ్రీనివాస రావు ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. మహిళల 53 కేజీల విభాగంలో పోటీపడాల్సిన ఆంధ్రప్రదేశ్ స్టార్ వెయిట్‌లిఫ్టర్ మత్స సంతోషి బరిలోకి దిగలేదు. తొలిరోజు జరిగిన పోటీల్లో హరియాణా ఆరు స్వర్ణాలు, ఓ రజతంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. -
‘సంపూర్ణ భోజనం’
అంగన్వాడీల్లో కొత్త పథకం ‘వన్ ఫుల్ మీల్’ తాండూరు: మాతా, శిశు మరణాలను తగ్గించాలనే ఆలోచనతో తెలంగాణ సర్కారు ‘వన్ ఫుల్ మీల్ (ఒక పూట సంపూర్ణ భోజనం) పథకాన్ని తీసుకురానున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇందిరమ్మ అమృత హస్తం పథకంలో పలు మార్పులు చేసి ‘వన్ ఫుల్ మీల్’ను రూపొందించారు. గతంలో ఈ పథకం పరిమితంగా అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయ గా తెలంగాణ ప్రభుత్వం విస్తృత పరు స్తూ అన్ని కేంద్రాలకు వర్తింపచేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఈ పథ కం ఈనెల 15న ప్రారంభం కానుంది. ఈ ఏడాది నవంబర్ 26న ఈ పథకానికి సంబంధించి జీఓ నం.12 జారీ చేశారు. అమృతహస్తం పథకాన్ని జిల్లాలో పరిగి, తాండూరు, వికారాబాద్, మర్పల్లి, మహేశ్వరం ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అమలు చేశారు. కొత్త పథకం కింద జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 13 ఐసీడీఎస్ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. మెనూలోనూ మార్పు లు చేశారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని 2,524 ప్రధాన అంగన్వాడీలు, 269 మినీ అంగన్వాడీల ద్వారా సుమారు 1.95లక్షల మంది ఏడు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలతోపాటు సుమారు 52వేల మంది గర్భిణులు, బాలింతలకు ఒక పూట భోజనం, ప్రతి రోజూ పాలు, గుడ్లు, ఆకుకూరలు, సాంబారు తదితరాలతో పోషకాలున్న భోజనం అందజేస్తారు. గతంలో బాలింతులు,గర్భిణునలకు నెలలో 25 రోజులు మాత్రమే 200 మిల్లీలీటర్ల పాలు, ఒక గుడ్డు అందించేవారు. తాజాగా వన్‌ఫుల్ మీల్ కింద 30 రోజులుపాలు, గుడ్డు అందిస్తారు. ఆదివారం సెలవు అయినందున ఆ రోజు ఇచ్చే పాలు, గుడ్లను సోమ, మంగళవారాల్లో ఎగ్ కర్రీ, పెరుగు రూపంలో బాలింతలు, గర్భిణులకు అందించేలా మెనూ తయారు చేశారు. గతంలో ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లలకు నెలకు ఎనిమిది గుడ్లను ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి రోజూ గుడ్డు ఇవ్వనున్నారు. పిల్లలకు పది రోజులకు పది గుడ్ల చొప్పున మూడు విడతల్లో అందజేస్తారు. ఇక మూడేళ్ల నుంచి ఆరు ఏళ్ల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి నాలుగు గుడ్లను ఇచ్చేవారు. ఇక నుంచి ప్రతి రోజూ పిల్లలకు గుడ్లు ఇస్తారు. ఆదివారం సెలవు దినం కావడం వల్ల ఆ రోజు ఇవ్వాల్సిన గుడ్డును పిల్లలకు ముందు రోజే.. అంటే శనివారం అందజేస్తారు. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు (నాలుగు నెలలకు) గుడ్లు, పాల కోసం రూ.94,82,95,872 కేటాయించారు. సోమవారం నుంచి వన్‌ఫుల్ మీల్ - సీడీపీఓ వెంకటలక్ష్మి అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం నుంచి పథకం అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పథకం అమలుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. -
ఏ బాధ మృత్యువై తరిమిందో?!
నరసన్నపేట: అప్పుల బాధలు లేవు.. కుటుంబ సమస్యలు అంతకన్నా లేవు.. మరి ఏ కారణం వారిని మృత్యు సాగరం వైపు తరిమిందో గానీ.. ఒక కుటుంబం సముద్రంలో కలిసిపోవడానికి చేసిన ప్రయత్నంలో అభం శుభం తెలియని ఇద్దరు పసిపిల్లలతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో మరణించిన వారు నరసన్నపేటకు చెందిన వారు కావడంతో పట్టణంలో విషాదం అలుముకుంది. నరసన్నపేటకు చెందిన తంగుడు శ్రీనివాసరావు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేట్ వద్ద శ్రీనివాస స్వీట్ స్టాల్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు చరణ్‌దేవ్(3), చేతన్‌కుమార్(1) ఉన్నారు. ఈయనకు ఒక సోదరుడు ఉన్నాడు. ఈ రెండు కుటుంబాలు కలిసి ఉమ్మడిగా జీవిస్తున్నాయి. గతంలో బెంగళూరులో ఉద్యోగం చేసిన శ్రీనివాసరావు యజమానితో వివాదం ఏర్పడటంతో ఉద్యోగం మానేసి నరసన్నపేట వచ్చేశాడు. అప్పటినుంచి స్వీట్ స్టాల్ ఏర్పాటు చేసుకొని జీవనం గడుపుతున్నాడు. కాగా చిన్న కుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో డాక్టర్‌కు చూపించేందుకు శ్రీకాకుళం వెళుతున్నానని చెప్పి ఆదివారం ఉదయం పది గంటల సమయంలో శ్రీనివాసరావు భార్యాబిడ్డలతోపాటు ఇంటి నుంచి బయలుదేరాడు. శ్రీకాకుళం చేరుకున్న తర్వాత ఇంటికి ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చేస్తామని తన వదినతో చెప్పాడు. భోజన సమయం గడిచిపోయినా వారు రాకపోవడంతో తాను ఫోన్ చేసి వాకబు చేయగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళుతున్నామని, తమ గురించి ఎదురుచూడవద్దని శ్రీనివాసరావు చెప్పాడని అతని వదిన వివరించారు. అయితే ఆ తర్వాత సాయంత్రం, రాత్రి ఫోనులో వారితో మాట్లాడటానికి ప్రయత్నించినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాధానం వచ్చిందని ఆమె తెలిపారు. సోమవారం ఉదయానికైనా వారు తిరిగి వస్తారనుకుంటే.. వారి మరణ సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు విలపిస్తూ చెప్పారు. సముద్రంలో దూకి శ్రీనివాసరావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని.. వారిలో వెంకటలక్ష్మిని స్థానికులు రక్షించడంతో ఆమె కొన ఊపిరితో ఆస్పత్రిలో ఉందని స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఏ పాపం తెలియని ఇద్దరు చిన్నారులు సైతం చనిపోయారని తెలుసుకుని ఆ వీధిలోనివారు సైతం కన్నీరు పెట్టారు. తమ కుటుంబానికి ఎటువంటి సమస్యలు లేవని, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని కుటుంబ సభ్యులు చెబుతుండగా.. శ్రీనివాసరావు చాలా మంచివాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కూడా కాదని మరి ఎందుకు కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారో అర్థం కావడంలేదని ఇరుగుపొరుగు వారు అంటున్నారు. కొన ఊపిరితో చికిత్స పొందుతున్న వెంకటలక్ష్మి కోలుకుంటే గానీ ఈ సంఘటనకు కారణాలు వెల్లడయ్యే అవకాశం లేదు. -
న్యాయం కోసం నిరాహార దీక్ష
{పేమించి పెళ్లి చేసుకున్నాడు తల్లిదండ్రుల ఒత్తిడితో ముఖం చాటే శాడు పరారీలో అత్తింటివారు భర్త కోసం వివాహిత పోరాటం మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: వారిద్దరూ నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అతను భార్యను పుట్టింటి దగ్గర వదిలి వెళ్లాడు. ఆ తర్వాత భర్త తనను తీసుకెళ్లేందుకు ఇంటికి రాకపోవడం, ఫోను పనిచేయకపోవడంతో ఆమె అత్తారింటికి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇరుగుపొరుగు వారిని విచారించారు. తన భర్త వేరే వివాహం చేసుకుంటున్నాడని తెలి సి పోలీసులను ఆశ్రయించారు. భర్త కోసం మదనపల్లెలోని అత్తారింటి ముం దు రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. చావనైనా చస్తాను కాని ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని బాధితురాలు స్పష్టం చేస్తున్నారు. ఆమె కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు హరిజనవాడకు చెందిన దొరస్వామి, సావిత్రమ్మ దంపతుల కుమార్తె వెంకటలక్ష్మి(25) 2009లో ఎం బీఏ పూర్తి చేశారు. బెంగళూరులో స్నేహితుల వద్ద ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా అదే సమయంలో మదనపల్లె అయోధ్యనగర్‌లో నివాసముంటున్న గుర్రప్ప, లలితమ్మ దంపతుల కుమారు డు సతీష్(30) ఎంసీఏ పూర్తి చేసుకుని బెంగళూరులో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. 2010లో వెంకటలక్ష్మి, సతీ ష్ పరిచయమయ్యారు. వారు అప్పటి నుంచే ప్రేమలో పడ్డారు. తర్వాత ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. వెంకటలక్ష్మి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. సతీష్ వీకెండ్లో హైదరాబాద్‌కు వెళ్లి వెంకటలక్ష్మితో కలసి వచ్చేవాడు. తర్వాత ఆమె తిరుపతిలో ఉద్యోగంలో చేరారు. ఇదిలా ఉండగా పెద్దల అంగీకారంతోనే పెళ్లి జరగాలని భావిం చి రెండిళ్లలో ప్రేమ విషయాన్ని చెప్పారు. ఇద్దరూ బాగా చదువుకున్నవారు కావడం, ఉద్యోగాలు చేస్తుండడంతో ఇరువైపులా పెద్దలు పెళ్లికి అంగీకరించా రు. ఈ ఏడాది మార్చి 17వ తేదీన పుత్తూరులోని సాయిబాబా ఆలయంలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వెంకటలక్ష్మి దళితవర్గానికి చెందిన వారని సతీష్ తల్లిదండ్రులకు తెలిసింది. అమ్మాయిని ఎటువంటి పరిస్థితిలో కాపురానికి తీసుకురాకూడదని, వదిలి వచ్చేయాలని సతీష్‌పై తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. దీంతో అతను వెంకట లక్ష్మిని పుట్టింటిలోనే వదిలి ఉద్యోగానికి వెళ్లిపోయాడు. త్వరలో వచ్చి తీసుకెళతానని మాయమాటలు చెప్పి నమ్మిం చా డు. పదిరోజుల నుంచి ఫోన్ కూడా పనిచేయక పోవడంతో వెంకటలక్ష్మి గురువారం మదనపల్లెలోని భర్త ఇంటి కి చేరుకున్నారు. భర్త, అత్తమామలు ఎవరూ లేరు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో షాక్‌కు గురయ్యారు. ఇరుగుపొరుగు వారిని విచారిస్తే చాలా రోజులుగా ఇక్కడ లేరని, సతీష్‌కు రెండో పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారిస్తామని చెప్పి పంపా రు. అయితే ఆమె నేరుగా భర్త ఇంటికి వెళ్లి నిరాహారదీక్షకు పూనుకున్నారు. భర్త వచ్చేవరకు ఇక్కడే ఉంటానని, చావనైనా చస్తాను కాని ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తేలేదని ప్రతినబూనారు. ఈ విషయమై ఎస్ఐ హనుమంతప్పను వివరణ కోరగా వెంకటలక్ష్మి ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయి తే ఆమె నిరాహారదీక్షకు పూనుకున్న విషయం తెలియదన్నారు. విషయాన్ని ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆమెకు తగిన భద్రత ఏర్పాటు చేసి మోసం చేసిన భర్త సతీష్, వారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలించి సమస్య ను పరిష్కరిస్తామన్నారు. -
అలా చదివింది..! జీవితంలో గెలిచింది
జీవితంలో ఎదురు దెబ్బలు తిననివాళ్లు బహుశా ఎవరూ ఉండరేమో. అయితే ఆ గాయాల్ని తలచుకుని బాధపడేవాళ్లు కొందరుంటారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తుకు అందమైన బాటలు పరచుకునేవాళ్లు కొందరుంటారు. వెంకటలక్ష్మి రెండో కోవకు చెందిన మహిళ. తన జీవితంలో జరిగిన సంఘటన నుంచి ఆమె చాలా నేర్చుకుంది. తన జీవన గమనాన్ని ఓ గమ్యం వైపు తిప్పుకుంది! లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. నమ్మకం ఎప్పుడూ ఆకాశమంతే ఉండాలి. కృషి ఎప్పుడూ నిరంతరం సాగుతుండాలి. ప్రయాణం ఎప్పుడూ ముందుకే సాగాలి. ఇవన్నీ వెంకటలక్ష్మికి బాగా తెలిసిన విషయాలు. అందుకే ఆమె ప్రయాణం ఎప్పుడూ ఆగింది లేదు. ఒడిదుడుకులు ఎదురైనా, అడుగడుగునా ముళ్లు గుచ్చుకున్నా ఆమె పాదాలు నిలబడిపోలేదు. ముందుకే నడిచాయి. ఆమెను ఉన్నత స్థాయికి చేర్చాయి. రెండేళ్ల క్రితం వరకూ వెంకటలక్ష్మి బెంగళూరు రోడ్ల మీద ఆటో నడుపుతూ కనిపించేది. కానీ ఇవాళ నల్లకోటు వేసుకుని, చేతిలో కేసు ఫైళ్లు పట్టుకుని బెంగళూరు కోర్టు మెట్లెక్కుతూ కనిపిస్తోంది. ఆటో స్టీరింగ్ పట్టుకున్న చేతులతోనే నల్లకోటు తొడుక్కునే స్థాయికి ఆమె చేరిన తీరు వింటే మనలోనూ స్ఫూర్తి ఏర్పడుతుంది. ఏదైనా సాధించాలన్న పట్టుదల కలుగుతుంది. సాహసమే ఊపిరిగా... ధైర్య సాహసాలు వెంకటలక్ష్మిని మొదట్నుంచీ వెన్నంటే ఉండేవి. హైస్కూల్లో చదివే రోజుల్లో ఆమె చేసిన ఓ సాహసం అందరినీ విస్మయపరిచింది. వేగంగా వస్తున్న ఓ బస్సు కింద పడబోతున్న విద్యార్థిని ఎంతో చాకచక్యంగా రక్షించింది వెంకటలక్ష్మి. ఆ ప్రయత్నంలో ఆమె బాగా గాయపడింది. ఆమె సాహసాన్ని మెచ్చి కర్ణాటక ప్రభుత్వం సాహస బాలిక అవార్డును కూడా ప్రకటించింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టడం వల్ల వెంకటలక్ష్మి జీవితంలోని ఎత్తుపల్లాలను దగ్గర్నుంచి చూసింది. అందుకే ఎప్పుడూ జీవితంలో స్థిర పడాలన్న పట్టుదలతోనే ఉండేది. చిన్నప్పట్నుంచీ చదివేది. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది. కళల్లో రాణించేది. సంప్రదాయిక కుటుంబం కావడంతో కట్టుబాట్లు ఎక్కువ ఉండేవి. కానీ అవి లక్ష్మిని ఎప్పుడూ ఆపలేదు. ఆమె తనకు నచ్చింది చేసే తీరేది. సంగీతం, నృత్యం... అన్నీ నేర్చుకుంది. అయితే పదో తరగతి పూర్తి కాగానే పరిస్థితుల కారణంగా పని చేయాల్సి వచ్చింది వెంకటలక్ష్మికి. అప్పుడు కూడా ఆమె తన శైలిలోనే ఆలోచించింది. ఆటో నడపాలని నిర్ణయించుకుంది. చేయడానికి ఇంకేమీ దొరకలేదా అని ఇంట్లోవాళ్లు అంటే... ‘ఇందులో ఏముంది తప్పు’ అంటూ ఆటో స్టీరింగ్ పట్టుకుంది. బెంగళూరు రోడ్ల మీద దూసుకుపోయింది. అదో పెద్ద పాఠం... ఎంత తెగువ ఉన్నా, ఎంతగా మగాళ్లతో పోటీ పడినా మహిళ ఎప్పుడూ మహిళేనని గుర్తుచేసే సంఘటన ఒకటి లక్ష్మి జీవితంలో జరిగింది. అది ఆమెకు పెద్ద పాఠమే నేర్పింది.ఇరవయ్యేళ్ల వయసులో ఓ రోజు లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉన్నట్టుండి ఓ అయిదుగురు వ్యక్తులు ఆమె ఇంట్లో జొరబడ్డారు. లక్ష్మిని బలవంతం చేయబోయారు. వెంటనే లక్ష్మిలోని సాహసి మేల్కొంది. వారిని చితకబాది తరిమి కొట్టింది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కానీ పోలీసులు అవతలివారి మాటలకు లొంగిపోయి కేసు రిజిస్టర్ చేయకుండా వదిలేశారు. దాంతో కమిషనర్ దగ్గరకు వెళ్లింది లక్ష్మి. ఆయన చొరవతో కేసు రిజిస్టర్ అయ్యింది కానీ, ఆమె జీవితం నరకప్రాయం అయిపోయింది. సదరు వ్యక్తులు ఆమెను వెంటపడి వేధించేవారు. ఆమె గురించి చెడుగా ప్రచారం చేసేవారు. దాంతో లక్ష్మిని అందరూ దూరం పెట్టేవారు. ఆమెకు ఇక పెళ్లి కాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఓ తోటి ఆటో డ్రైవర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతడికి ఇల్లాలై ఊరి చివర ఓ ఇల్లు కట్టుకుని కాపురం పెట్టింది లక్ష్మి. అయితే ల్యాండ్ మాఫియా ముఠా ఆమె ఇంటిని లాక్కోవాలని ప్రయత్నించింది. ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసింది. దాంతో మరోసారి ఆమె కోర్టు మెట్లెక్కింది. లక్ష్మి తొమ్మిదేళ్లపాటు కోర్టు చుట్టూ తిరిగింది. కేసు మలుపులు తిరుగుతోందే తప్ప ఓ కొలిక్కి రావడం లేదు. దాంతో విసిగిపోయిన లక్ష్మి ఓ రోజు న్యాయస్థానంలో నోరు విప్పింది. తన కేసు తనే వాదించుకుంటాను, అనుమతినివ్వమంది. న్యాయమూర్తి ఆమె ఆవేదనను అర్థం చేసుకుని అనుమతినిచ్చారు. దాంతో న్యాయస్థానంలో దాదాపు మూడు గంటల పాటు తన వాదనను వినిపించింది లక్ష్మి. చివరికి కేసు గెలిచింది. ఆ రోజు అర్థమైంది లక్ష్మికి... అన్యాయం జరిగినంత వేగంగా న్యాయం జరగదని. న్యాయస్థానాలు, చట్టాలు తనలాంటి వారికి అందుబాటులో లేవని. తనలా ఇంకెందరో కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ ఉంటారని. ఆ క్షణమే నిర్ణయించుకుంది... తాను లాయరై తీరాలని. కొందరికైనా న్యాయాన్ని చేకూర్చాలని. భర్త సహకారంతో లా కాలేజీలో చేరింది. ఓ పక్క ఆటో నడుపుతూ, మరోపక్క ఇంటి పనులు చేస్తూ, ఇంకో పక్క కూతురిని సాకుతూనే లా పూర్తి చేసింది. కర్ణాటక బార్ అసోసియేషన్‌లో తన పేరు నమోదు చేసుకుంది. ‘ఎదగాలన్న పట్టుదల ఉంటే ఎత్తుకే చేరతాం తప్ప పల్లానికి పడిపోం’ అని నిరూపించింది. అందరితో హ్యాట్సాఫ్ అనిపించుకుంటోంది! - సమీర నేలపూడి జీవితంలో కొన్నిసార్లు బలహీనపడిపోతాం. ఇక మన వల్ల కాదులే, వదిలేద్దాం అని రాజీ పడిపోతాం. ఒకటి రెండు సమయాల్లో నేనూ అలాగే అనుకున్నాను. కానీ ఆ ఆలోచనను మనసులో అలా ఉండనిస్తే నేను ఓడిపోయి ఉండేదాన్ని. నా పట్ల అన్యాయం జరిగింది. దాన్ని నిరూపించుకోవడానికి నేను పడిన కష్టం అంతా ఇంతా కాదు. నేను చేసిన ఆ పోరాటం నాలో పట్టుదలను పెంచింది. న్యాయం కోసం కష్టపడకూడదు అనిపించింది. ఆ ఆలోచనే నన్ను ‘లా’ చదివేలా చేసింది. -
103 మంది ‘ఎర్ర’ దొంగలకు రిమాండ్
తిరుపతి లీగల్, న్యూస్‌లైన్: తిరుమల శేషాచల అడవుల్లో ఇద్దరు అటవీ అధికారుల హత్య కేసులో తమిళనాడుకు చెందిన 103 మందికి ఈ నెల 31వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి 5వ అదనపు జూనియర్ జడ్జి నాగ వెంకటలక్ష్మి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. వారిపై ఐపీసీ 302,307,147,148,341,396,397,332,333,120(6) సెక్షన్లతో పాటు ఫారెస్ట్ చట్టం సెక్షన్ 149,20 కింద రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. శేషాచల అడవుల్లో రెండు రోజుల క్రితం తిమ్మినాయుడు పాళెం బీట్ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీధర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్ హత్యకు 103 మంది కారకులని, వీరు 300 ఎర్రచందనం దుంగలను వాహనాల్లో తరలిస్తూ పట్టుబడ్డారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హత్య చేయడంతో పాటు అధికారుల వద్ద ఉన్న బంగారు నగలు, సొమ్ము, సెల్ఫోన్లను దోచుకున్నారని తెలిపారు. పెద్దచేనుబండ, మామండూరు అటవీప్రాంతం వద్ద పోలీసులు 103 మందిని అరెస్ట్ చేసి 3 ఆర్టీసీ బస్సుల్లో కోర్టు వద్దకు తీసుకుని వచ్చారు. రిమాండ్ అనంతరం వీరందరినీ కడప జైలుకు తరలించారు. తమిళ లాయర్ల ప్రవేశం ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసుల్లో అధికంగా తమిళనాడుకు చెందిన వారే అరెస్ట్ అవుతుండడంతో వారిని బెయిల్‌పై విడుదల చేయించుకోవడానికి తమిళనాడు నుంచి న్యాయవాదులు కొంతమంది తిరుపతికి వస్తున్నారు. కొద్దిమంది మాత్రం తిరుపతిలోని న్యాయవాదుల సాయంతో బెయిల్ పొందుతున్నారు. ఇద్దరు న్యాయవాదులు తమిళనాడు నుంచి వచ్చి ఏకంగా తిరుపతిలోనే కాపురం పెట్టినట్లు తెలిసింది. కాగా తమకు పరిచయం ఉన్న న్యాయవాది దగ్గరకు మాత్రమే వెళ్లాలంటూ కొంతమంది పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది ఎర్రదొంగలకు సూచిస్తునట్లు ఆరోపణలు వస్తున్నాయి. రిమాండ్ రిపోర్టు కాపీలను కూడా సదరు పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది తమకు కావలసిన న్యాయవాదులకు ముందుగానే అందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ న్యాయవాదులు ఎర్రచందనం దొంగల చిరునామాకు వెళ్లి వారి బంధువులు లేదా యజమానులతో సంప్రదింపులు జరిపి తిరుపతి కోర్టులలో బెయిల్ పిటీషన్లను దాఖలు చేస్తున్నట్లు సమాచారం. ఈ బెయిల్ డీల్ కుదిర్చిందానికి సదరు పోలీసులకు, ఫారెస్ట్ సిబ్బందికి సొమ్ము ముడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు కస్టడీకి తీసుకోవచ్చు కదా! వందల మందిని ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసుల్లో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులకు తరలిస్తున్నారు. వారిని పోలీసు కస్టడీకి తీసుకొని విచారిస్తే నిజానిజాలు బయటకు వస్తాయని న్యాయవాదులు అంటున్నారు. ఫారెస్ట్, పోలీసు అధికారులు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దుంగలను చూసీ చూడనట్లు వదిలివేయడం వల్లనే వారు రెచ్చిపోయి ఫారెస్ట్ అధికారుల ప్రాణాలు తీస్తున్నారని న్యాయవాదులు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఫారెస్ట్ చట్టంలో కొన్ని సవరణలు తీసుకొని రావాలని న్యాయవాదులు కోరుతున్నారు.