కన్నతల్లి కర్కశత్వం..! | he killing of the children's mother for money | Sakshi
Sakshi News home page

కన్నతల్లి కర్కశత్వం..!

Published Tue, Nov 8 2016 3:18 AM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM

కన్నతల్లి   కర్కశత్వం..! - Sakshi

కన్నతల్లి కర్కశత్వం..!

డబ్బు కోసం పిల్లలను హతమార్చిన తల్లి
తల్లితో సహా ఐదుగురి అరెస్ట్

సిప్‌కాట్ : డబ్బు కోసం వికలాగులైన ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన కేసులో తల్లితోపాటు ఐదుగురిని మత్తిగిరి పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. డెంకణీకోట సమీపంలోని ఎల్‌లైయూర్ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి తన మేనమామ శ్రీనివాసన్‌తో 20 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి  వికలాంగులైన ఇద్దరు పిల్లలు పుట్టారు. కొన్ని రోజుల తర్వాత భర్తతో మనసస్పర్తల కారణంగా వెంకటలక్ష్మి అతనితో విడిపోరుు తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి చేరింది. వికలాంగులైన ఇద్దరు పిల్లలను తన తల్లితండ్రుల వద్ద వదలి బెంగళూరులోని గార్మెంట్స్ కంపెనీలో పనికి చేరింది. ఈ క్రమంలో సురేష్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదిలా ఉండగా ఇటీవల ఎల్‌లైయూర్‌లోని తన తండ్రి నాగప్ప కొంత వ్యవసాయ భూమిని అమ్మి డబ్బులు తన  మనుమడు, మనురాలి పేరులో బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఆ డబ్బులను కాజేయాలని వెంకటలక్ష్మి తన ప్రియుడు సురేష్‌తో కలసి పథకం పన్నిన వెంకటలక్ష్మి పుట్టింటికి చేరుకొని గత నెల మొదటి వారంలో కూతురు మంజు, కొడుకు ముత్తప్పను బెంగళూరులోని హాస్టల్‌లో చేర్పిస్తామని చెప్పి ఇద్దరు పిల్లలను బెంగళూరుకు తీసుకెళ్లింది.

గత నెల 7 వ తేది పిల్లలను దారుణంగా హత్య చేసి హొసూరు సమీపంలోని పెద్దమేనాగరం వద్ద మంజు శవాన్ని, ముత్తప్ప శవాన్ని తళి సమీపంలోని బల్లపల్లి వద్ద పడేసి వెళ్లారు. దీనిపై మత్తిగిరి,  తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ  విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశారుు. వికలాంగులైన పిల్లల పేరుతో బ్యాంకులో డెపాజిట్ చేసిన డబ్బును కాజేసేందుకు తన ప్రియుడు సురేష్, అతని తమ్ముడు గోపాల్, అతని భార్య శాంతి, కారు డ్రైవర్ నవీన్‌లతో కలసి పిల్లలను హత్య చేసినట్లు నిందితులు అంగీరించారు. దీంతో మత్తిగిరి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి ఆదివారం రాత్రి రిమాండుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement