![మద్యం షాపు దగ్గర కత్తితో.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/81476073342_625x300_3.jpg.webp?itok=HL4RLyiq)
మద్యం షాపు దగ్గర కత్తితో..
అన్నానగర్: వైన్ షాపులో వసూలైన రూ. ౩ లక్షల నగదునుతో ఉన్న వ్యక్తిపై గుర్తు తెలియాని దుండగులు కత్తితో దాడి చేశారు. సంచిలో ఉన్న నగదుతో పరారయ్యారు. దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నాగపట్టణం జిల్లా వేలాంగలి ఆర్చ్ సమీపంలో సముద్ర తీర ప్రాంతంలో వైన్ షాపు ఉంది. ఈ షాపులో వేదారణ్యం మరుదూర్ ప్రాంతానికి చెందిన మణివాసన్(46) సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు.
ఇదే షాపులో తిరుక్కువలై తాలుకా మారాచ్చేరికి చెందిన సెల్వం(42), నాగై సెమ్మట్టి వినాయక ఆలయ వీధికి చెందిన సుభాష్(42), అగర ఒరత్తూర్ తెన్‌కరైవేలి ప్రాంతానికి చెందిన పక్కిరిస్వామి(48) పని చేస్తున్నారు. బుధవారం రాత్రి విక్రయాలు ముగిసిన తరువాత వసూలైన నగదు తీసుకొని షాపుకు తాళం వేశారు. వేలాంగన్ని పూక్కారవీధికి చెందిన మురుగానందం(42) వారికి రోజూలాగే ఆహారం ఇవ్వటానికి అక్కడికి వచ్చాడు. అప్పుడు నగదు సంచిని మురుగానందంకు ఇచ్చారు.
ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు మురుగానందంపై కత్తితో దాడి చేసి నగదు సంచిని లాక్కొని పరారయ్యారు. వైన్ షాపు సిబ్బంది అతన్ని నాగై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. దీనిపై ఫిర్యాదు అందుకున్నవేలాంగన్ని పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.