anna nagar
-
మహిళా సెక్యూరిటీ గార్డును హత్య చేసిన ప్రియుడు..
అన్నానగర్: చెన్నై పక్కనే ఉన్న మామల్లపురంలో బుధవారం వివాహేతర ప్రియుడితో లాడ్జికి వెళ్లిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో వివాహేతర ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై చెంగల్పట్టు జిల్లా మధురాంతకం పక్కన చిత్రవాడి గ్రామానికి చెందిన జయరాజ్(28)కు భార్య, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. మేళవలంపేటలోని ఓ పురుగు మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. పౌన్సూరులో నివాసముంటున్న సంగీత(32)కు 17 ఏళ్ల కుమార్తె, 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కాట్టంకొళత్తూరు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సంగీత సెక్యూరిటీ గార్డుగా పని చేస్తోంది. ఉద్యోగానికి వెళుతున్న సమయంలో సంగీతకు జయరాజుతో అక్రమ సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం సంగీత భర్తకు తెలియడంతో ఆమెను ఖండించాడు. ఐదేళ్ల క్రితం భర్తను విడిచిపెట్టిన సంగీత గూడువాంచేరిలోని తన తల్లి ఇంట్లో ఉంటూ జయరాజ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుస్తుంది. బుధవారం సంగీత బైకులో జయరాజుతో కలిసి మామల్లపురం వెళ్లింది. వీరిద్దరూ అక్కడే ఒత్తవాడై వీధిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. అప్పుడు జయరాజ్ సంగీతను ఇంత మందితో సెల్ ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆహారం కొనుక్కోవడానికి జయరాజ్ బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి సంగీత ఉరి వేసుకుని చనిపోయి ఉండడాన్ని చూసి షాక్‌కు గురైన జయరాజ్ ఈ విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలిపాడు. దీనిపై మామల్లపురం డిప్యూటీ సూపరింటెండెంట్ రవి అభిరామ్, మామల్లపురం పోలీసులు అక్కడికి చేరుకుని సంగీత మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జయరాజ్‌ను పోలీసులు తీవ్ర విచారణ చేస్తున్నారు. ఈ స్థితిలో సంగీతను కొట్టి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. తనతోపాటు వచ్చిన జయరాజ్‌ను పోలీసులు విచారించగా.. పలువురితో సన్నిహితంగా ఉండడంతోనే సంగీతను గొంతు నులిమి హత్య చేశానని తెలిపాడు. తర్వాత ఏం చేయాలో తెలియక హత్యను కప్పిపుచ్చాలని సంగీత దుపట్టా చించి ఆమె శరీరాన్ని విద్యుత్ ఫ్యాన్‌కి వేలాడదీశానని తెలిపాడు. అప్పుడు సంగీత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని డ్రామా ఆడినట్టు ఒప్పుకున్నాడు. కానీ సంగీత గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ విషయాన్ని అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన జయరాజ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం
సాక్షి, అన్నానగర్: గుండెపోటుతో నవ వరుడు మృతిచెందిన ఘటన ఈరోడ్‌లో జరిగింది. నసియానూర్ కన్నవేలం పాళయానికి చెందిన ప్రకాష్ (36)కు ఈ నెల 23వ తేదీ వివాహం జరిగింది. శనివారం అత్తగారి ఇంటికి వెళ్లిన ప్రకాష్ మటన్ తిన్నాడు. తన భార్యతో అమ్మగారి ఇంటికి వచ్చాడు. రాత్రి మరోసారి మటన్ తిని పడుకున్నాడు. ఆదివారం వేకువజామున 2 గంటలకు శరీరమంతా దురద పుడుతోందని చెప్పాడు. కొద్ది సేపటికే గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన పెరుందురై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాంజీకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: లంక నావికాదళం ఓవరాక్షన్.. సీఎం స్టాలిన్ ఫైర్) -
పెళ్లైన రెండు నెలలకే నవ వరుడు ఆత్మహత్య
సాక్షి, చెన్నై: పెళ్లయిన రెండు నెలలకే ఓ నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కృష్ణగిరి జిల్లా బోచంపల్లి సమీపంలోని కున్నికొట్టాయికి చెందిన సత్యమూర్తి (22). పరుపుల తయారీ కంపెనీలో కార్మికుడు. పుదుచ్చేరిలోని పెరియార్‌కు చెందిన కీర్తి (22). తల్లిదండ్రులు లేకపోవడంతో అనాథశ్రమంలో పెరిగింది. వీరిద్దరూ రెండు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈక్రమంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. గురువారం ఉదయం కూడా వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన సత్యమూర్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి పారూరు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సత్యమూర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోచంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణానికి ఒడిగట్టిన హాస్టల్‌మేట్... ప్రియుడికి స్నేహితుల ప్రైవేటు ఫోటోలు పంపించి.
చెన్నై: పంజాబ్‌లోని చండీఘడ్ యూనివర్సిటీ ఘటన మరువక ముందే..ఇలాంటే ఘటనే మధురైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...రామ్‌నాథ్‌పురం కాముదికి చెందిన ఆషిక్, జనని ఇద్దరు స్నేహితులు. ఆశిక్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతని గర్లఫ్రెండ్ జననీ మధురైలో బీఈడీ స్టూడెంట్. ఆమె వర్కింగ్ విమన్ హాస్టల్లో ఉంటుంది. ఐతే ఆమె తన స్నేహితులకు తెలియకుండా వారు బట్టలు మార్చుకున్నప్పుడూ, స్నానం చేస్తున్నప్పుడూ సీక్రేట్‌గా ఫోటోలు తీసి తన ప్రియుడికి పంపిస్తుండేది. మొదట్లో తన ప్రైవేటు ఫోటోలు పంపించేది, తదనంతరం తన ప్రియుడి ఒత్తిడి మేరకు తన హాస్టల్మేట్స్ అందరివి పంపించడం మొదలు పెట్టింది. అనుకోకుండా ఒకరోజు ఆమె స్నేహితులకు ఆమెపై అనుమానం తలెత్తి... ఆమె ఫోన్ చెక్‌చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో వారంతా హాస్టల్ వార్డన్కి అసలు విషయం చెప్పి మధరైలోని అన్నానగర్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో.. జననీ, ఆశిక్ అనే వ్యక్తి గర్లఫ్రెండ్ అని, ఆమె తన ప్రియుడి క్లినిక్‌లోనే పనిచేస్తున్నట్లు తేలింది. అంతేగాదు ఆమె తన ప్రైవేట్ వీడియోల తోపాటు తన హాస్టల్మేట్స్ అందరీ వీడియోలు పంపినట్లు వెల్లడైంది. ఐతే సదరు వైద్యుడు ఆశిక్ ఈ ఫోటోలను ఎవరికైనా పంపించాడా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సదరు నిందితులిద్దరి అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా వారి ఫోనులను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు డేటా రికవరీ కోసం ఆ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ నిందితులిద్దరు మదురై సెంట్రల్ జైల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. (చదవండి: ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..!) -
మీరే నా దేవుళ్లు!
అన్నానగర్ : తంజావూరు జిల్లా పేరావూరని సమీపంలో తల్లిదండ్రులకు ఓ కుమారుడు ఏకంగా ఆలయాన్నే కట్టేశాడు. తంజావూరు జిల్లా పేరావూరని సమీపం కూప్పుక్కాడు గ్రామానికి చెందిన నటేషన్, రాజామణి దంపతులు. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలకు ముందు మృతి చెందారు. వీరికి పెరమైయాన్, రాజాకన్ను, మారిముత్తు, సౌందరరాజన్, కరుప్పయ్యన్ అనే ఐదుగురు కుమారులు ఉన్నారు. వీరిలో ఐదో కుమారుడైన కరుప్పయ్యన తన తల్లిదండ్రుల మీద అధిక ప్రేమ కలిగినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన తల్లిదండ్రులకు ఆలయం కట్టి రోజూ పూజ చేయాలని సిద్ధమయ్యాడు. నాలుగేళ్లకు ముందు ఆలయం కట్టి కుంభాభిషేకం చేశాడు. అందులో తన తల్లిదండ్రుల ఫొటోలను పెట్టి ప్రతిరోజూ పూజ చేస్తూ వస్తున్నాడు. ప్రతి సంవత్సరం జూన్ 29న కుంభాభిషేకం చేయగా ఆ రోజున అన్నదానం కూడా చేస్తున్నాడు. ఈ ఏడాది కరోనా కల్లోలం కారణంగా జనం గుంపులుగా ఉండకూడదన్న నిబంధనతో ప్రజలు రాలేదు. తల్లిదండ్రుల ఆలయంలో పూజచేసి పొంగల్ పెట్టి స్థానికులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. నటేశన్, రాజామణి దంపతులకు కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు అని కుటుంబ సభ్యులు 85 మంది ఉన్నారు. ఈ పూజలో అందరూ కలుసుకుంటారు. తల్లిదండ్రులు ప్రాణాలతో ఉండేటప్పు డే గమనించకుండా అనాథశ్రమాలలో చేర్పించే కుమారులు ఉన్న ఈ కాలంలో తల్లిదండ్రులకు ఆలయం కట్టి పూజ చేస్తూ వస్తున్న కరుప్పయ్యన్ చూసి ఆ ప్రాంత ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
రోడ్డున పడ్డ లగ్జరీ యువతులు
సాక్షి, చెన్నై : నెలన్నర రోజుల క్రితం వరకు ఆ యువతులు స్టార్ హోటళ్లు, మాల్స్‌లలోని స్పా, మసాజ్, బ్యూటీ సెంటర్లలలో పనిచేసిన వాళ్లు. ఇప్పుడు లాక్డౌన్ రూపంలో వారికి కన్నీళ్లు తప్పట్లేదు. సెలూన్లు, స్పాలు, బ్యూటీ పార్లర్లకు అనుమతి ఇప్పట్లో అనుమానమే కావడంతో ఎంతో మంది యువతులు రోడ్డున పడాల్సిన పరిస్థితి. ఇక్కడ ఉండి కష్టాల్ని అనుభవించడం కన్నా, స్వస్థలాలకు పయనమవడం మేలని భావించారు. ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్న వీరికి మానవీయ హృదయాలు చేయూతను ఇచ్చాయి. చెన్నైలో అన్నానగర్ లగ్జరీ ప్రాంతం. ఇక్కడి శాంతి కాలనీ పరిసరాల్లో అత్యధికంగా వాణిజ్య సముదాయాలూ ఉన్నాయి. అనేక సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇందులో స్పా, మసాజ్, బ్యూటీ సెంటర్లు కూడా ఎక్కువే. ఇక్కడున్న ఆయా సంస్థలు తమ సిబ్బంది ద్వారా స్టార్ హోటళ్లు, మాల్స్‌లలోని సెంటర్లో విధుల్ని నిర్వర్తిస్తున్నాయి. అత్యధికంగా నాగాలాండ్, అసోం వంటి రాష్ట్రాలకు చెందిన యువతులు ఈ విధుల్లో ఉన్నారు. లాక్డౌన్ కష్టాలు ప్రస్తుతం వీరిని చుట్టుముట్టి ఉన్నాయి. ఇప్పట్లో సెలూన్లు, స్పాలు, బ్యూటీ సెంటర్లకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని శనివారం ప్రభుత్వం కూడా తేల్చింది. దీంతో నెలన్నర రోజులుగా ఉన్నదానంతో సర్దుకుంటూ వచ్చిన ఈ యువతులు, ఇక, తమ బతుకు కష్టాలే అన్న విషయాన్ని గ్రహించారు. ఇక్కడే ఉండి కన్నీళ్లు పెట్టుకోవడం కన్నా, సొంత రాష్ట్రాలకు వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. (కరోనా: చైనాను కోర్టుకు లాగాల్సిందే) ఎలా వెళ్లాలో తెలియక... జీన్స్ ప్యాంట్లు, టీషర్టులు, స్కార్ప్‌లు అంటూ మెరిసే డ్రెస్‌లతో ఈ యువతులు కనిపించేవారు. సంపాదించిన డబ్బుతో ఇప్పటి వరకు ఖర్చులన్నీ పోగా, మిగిలిన మొత్తంతో తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆన్లైన్ ద్వారా ఈ పాస్‌ను దక్కించుకున్నారు. అయితే, మేడవాక్కంలో ఉన్న అసోం భవన్‌ను సంప్రదించాల్సిన పరిస్థితి. లాక్‌డౌన్‌కు ముందు ఆటోకు చార్జీగా ఐదు వందలైనా ఇచ్చేసి దూసుకెళ్లిన ఈ యువతులకు ప్రస్తుతం రవాణా కష్టాలు తప్పలేదు. ఈ పాస్ చేతిలో ఉండటంతో కొందరు డ్రైవర్లు పోలీసుల కళ్లు కప్పి, అడ్డదారుల్లో తీసుకెళ్లేందుకు ఆదివారం సిద్ధమయ్యారు. అయితే, చార్జీలు భారం కావడంతో యువతులు బేరం ఆడారు. కన్నీళ్లు పెట్టుకున్నా, డ్రైవర్లు మాత్రం కరుణించ లేదు. పోలీసులు పట్టుకుంటే, తమ పరిస్థితి అంతే అంటూ దాట వేశారు. ఈ యువతులు శాంతి కాలనీ కూడలిలో విషాదంతో కనిపించడం అటు వైపుగా వెళ్లి ఫోటో జర్నలిస్టు కుమరేషన్ కంట పడింది. ఆ యువతుల్ని సంప్రదించి విషయాన్ని రాబట్టడమే కాదు, చెన్నై ప్రెస్ క్లబ్ భారతీ తమిళన్, అసతుల్లాలకు సమాచారం ఇచ్చాడు. వీరు ఆ ప్రాంత పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించారు. తక్షణం అక్కడకు చేరుకున్న పోలీసులు 20 మందికి పైగా ఉన్న యువతుల్ని , అలాగే, నాగాలండ్‌కు చెందిన పది మంది మేరకు యువకుల్ని సైతం ఆటోల్లో ఎక్కించి, భద్రత నడుమ మేడవాక్కం క్యాంప్ రోడ్డులో ఉన్న అసోం భవన్‌కు పంపించారు. అక్కడి నుంచి అధికారులు వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇక, రోడ్డు మీద యువతుల కన్నీటి కష్టాన్ని చూసి తక్షణం చలించిన ఆ ఫోటో జర్నలిస్టుకు ప్రశంసలు ఎక్కువే. -
వృద్ధుడి అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే
అన్నానగర్ : అనాధ వృద్ధుడికి అంత్యక్రియలకు సాయం చేసిన ఎమ్మెల్యేపై సోషల్‌మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాగై జిల్లా వేలాంకన్ని ప్రాంతానికి చెందిన వ్యక్తి మురుగన్ (78), భార్య అంజమ్మల్ (68) బిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. మూడేళ్ల క్రితం తంజావూరు జిల్లా పేరావూరానికి వచ్చారు. అప్పటి నుంచి వారు నీలకంఠపు పిల్లయార్ ఆలయం ముందు బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఆలయం మూతపడింది. దీంతో మురుగన్ దంపతులకు సామాజిక సేవకులు ఆహారం అందజేస్తూ వచ్చారు. ఈ స్థితిలో గురువారం మరుగుదొడ్డికి వెళ్లిన మురుగన్ స్ఫహ తప్పి పడిపోయాడు. ఎంత సేపటికి రాకపోవడతో అంజమ్మాల్ అక్కడికి వెళ్లగా మురుగన్ విగతజీవిగా పడి ఉండడం చూసి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పేరావూరని ఎమ్మెల్యే గోవిందరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మురుగన్ బౌతికకాయనికి పూలమాల వేసి అంజలి ఘటించారు. మృతుడి భార్యకు ఆర్థిక సాయం అందించారు. అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేకు అభినందనలు వెల్లువెత్తాయి. అంత్యక్రియలు జరిపించిన వారిలో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్, గ్రామనిర్వాహక అధికారి శక్తివేల్ ఉన్నారు. -
ఫేస్ బుక్‌లో ప్రేమ.. హత్యకు కుట్ర
అన్నానగర్: వీరపాండి సమీపంలో వివాహానికి అంగీకరించని ఫేస్బుక్ ప్రేమికుడిని హతమార్చడానికి మలేషియా మహిళ పంపిన కూలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తేని జిల్లా వీరపాండి సమీపంలో ఉన్న కాట్టునాయక్కన్ పట్టికి చెందిన అశోక్ కుమార్ (28) బెంగళూర్‌లో ఉన్న ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఫేస్బుక్ ద్వారా మలేషియాకు చెందిన అముదేశ్వరి పరిచయమైంది. కాలక్రమేణా ప్రేమగా మారింది. తరువాత అభిప్రాయ బేధాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ స్థితిలో మలేషియా నుంచి కవితా అరుణాచలం అనే మహిళ, అశోక్‌కుమార్ సెల్‌ఫోన్‌కి కాల్ చేసి మాట్లాడింది. ఆమె తనను అముదేశ్వరి అక్క అని, వివాహం చేసుకోకపోవడం వల్ల అముదేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించింది. అశోక్ కుమార్ దిగ్భ్రాంతి చెందాడు. ఇంకా ఆమె పనిచేసిన సంస్థలో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అనంతరం మలేషియా నుంచి తమిళనాడు వచ్చిన కవితా అరుణాచలం... అక్టోబర్ 30న అశోక్ కుమార్‌ను కలిసింది. అప్పుడు ఆమె తనను వివాహం చేసుకోవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అశోక్‌కుమార్ దీనిపై తేని పోలీసులకి సమాచారం అందించాడు. పోలీసులు ఆ మహిళ వద్ద విచారణ చేశారు. ఇందులో 45 ఏళ్లు గల ఆ మహిళ, అముదేశ్వరి, కవితా అరుణాచలం అనే పేరుతో అశోక్‌కుమార్ వద్ద మాట్లాడినట్లు తెలిసింది. తరువాత ఆమెని పోలీసులు హెచ్చరించి పంపారు. ఆమె అసలు పేరు విఘ్నేశ్వరి అని తెలిసింది. ఈ స్థితిలో తనను వివాహం చేసుకోకుండా మోసం చేసిన అశోక్కుమార్ని చంపటానికి 9 మంది కూలీ ముఠాను పంపింది. వారు శుక్రవారం బోడి సమీపంలో ఉన్న ప్రైవేట్ లాడ్జీలో ఉండగా వారి ప్రవర్తన మీద అనుమానం చెందిన లాడ్జీ కార్మికులు బోడి టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. ఇందులో అశోక్కుమార్ని హత్య చెయ్యడానికి విఘ్నేశ్వరి పంపించిన కూలీ ముఠ అని తెలిసింది. తరువాత పోలీసులు కేసు నమోదు చేసి అన్బరసన్ (24), మునుస్వామి (21), అయ్యనార్ (39), మురుగన్ (21), జోసఫ్ (20), యోగేష్ (20), కార్తిక్ (21), దినేష్ (22), భాస్కరన్ (47)ని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా వారి నుంచి కారు, కత్తి వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు విఘ్నేశ్వరి కోసం గాలిస్తున్నారు. -
ప్రియురాలిని హత్య చేసి.. పాతిపెట్టి..
అన్నానగర్: నెల్లైలో ప్రియురాలిని చంపి పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నెల్లై పట్టణం సెబస్టియార్ ఆలయ వీధికి చెందిన మణికంఠన్ (20), రామయన్పట్టికి చెందిన ఆసీర్ సెల్వం (32)లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. సేరన్మాదేవి సమీపంలో ఉన్న శక్తికులమ్కి చెందిన శివకుమార్ (36)కు కోవైకి చెందిన ఓ మహిళకి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 2012 నుంచి నెల్లైలో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య కొన్నేళ్ల కిత్రం వివాదాలు రావడంతో శివకుమార్ ఆమెను హత్య చేశాడు. అనంతరం మణికంఠన్, అసీర్ సెల్లం సాయంతో మృతదేహాన్ని పాతిపెట్టారు. అనంతరం శివకుమార్ ముంబై వెళ్లి అక్కడ జీవిస్తున్నాడు. అయితే ఈ హత్య గురించి పోలీసులకు రహస్య సమాచారం అందడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ స్థితిలో శివ గురువారం సొంత ఊరికి వచ్చాడు. అతనిని పోలీసులు పట్టుకొని విచారణ చేశారు. ఇందులో నెల్లై ప్రాంతానికి చెందిన పుష్ప (25)ను, వివాహేతర సమస్యలో హత్య చేసినట్లు అంగీకరించాడు. రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలంలో తవ్వకాలు జరుపగా పుష్పా ఎముకలు దొరికాయి. వాటిని వైద్య బృందం సేకరించి పరిశోధనకి పంపించారు. అనంతరం శివని అరెస్టు చేశారు. అతడికి సాయపడిన త్యాగం అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పెళ్లి పత్రికలు పంచడానికెళ్తూ..
చెన్నై: తమిళనాడులోని సెంజి సమీపంలో పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తూ యువకుడు మృత్యువాత పడ్డాడు. విల్లుపురం జిల్లా సెంజి సమీపంలో ఉన్న సిరువాలై గ్రామానికి చెందిన ప్రదీప్ రాజ్ (27). ఇతనికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. 16వ తేదీన వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివాహ ఆహ్వాన పత్రికలు పంచడానికి శుక్రవారం తన స్నేహితులైన మామలైవాసన్ (25), రమేష్ (25)తో బైక్‌లో ఆలమ్‌పూండికి వెళ్లాడు. తర్వాత అక్కడ నుండి కనక్కన్‌కుప్పంలో ఉన్న బంధువులకు వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి వెళ్లారు. దేవదానమ్ పేటలో వస్తుండగా అదుపుతప్పిన బైకు 75 అడుగుల లోతు గల బావిలో పడింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ రాజ్, మామలైవాసన్ ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. రమేష్ మాత్రం బావి పక్కన ఉన్న పొదల్లో దూకడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను బయటకి తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ముండియమ్‌బాక్కమ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘టిక్‌టాక్’ చేస్తోందని భార్యని హత్యచేసిన భర్త
అన్నానగర్: ‘టిక్‌టాక్’ యాప్ వినియోగం విషయంలో భార్యని కత్తితో పొడిచి హత్య చేసిన భర్తని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన శుక్రవారం కోవైలో చోటుచేసుకుంది. కోవై సమీపం అరివొలినగర్‌కు చెంది న కనకరాజ్ (35) భవన నిర్మాణ కార్మికుడు. ఇతని భార్య నందిని (28).కోవై సమీపంలో ని ఓ ప్రైవేటు ఇంజినీరింగు కళాశాలలో పని చేస్తుంది. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుటుంబ తగాదాల కారణంగా కనకరాజ్, నందిని రెండేళ్లుగా విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో నందిని కొన్నినెలలుగా టిక్‌టాక్ బానిసైంది. అధిక సంఖ్యలో వీడియోలు అప్లోడ్ చేసినట్లు తెలుస్తుంది. గురువారం కనకరాజ్ నందినికి ఫోన్ చేసి టిక్‌టాక్ యాప్‌లో వీడియోలను అప్లోడ్ చెయ్యవద్దని, తనతో కాపురం చేయాలని కోరాడు. ఈ విషయంపై అతను నందినికి కాల్ చేశాడు. ఈ సమయంలో ఫోన్ బిజీ రావడంతో శుక్రవారం మధ్యాహ్నం కనకరాజ్ మద్యం సేవించి, నందిని పని చేస్తున్న కళాశాలకి వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో తన వెంట తెచ్చుకున్నకత్తిని తీసి నందినిని పొడిచాడు. ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి కనకరాజ్‌ని అరెస్టు చేశారు. -
విడాకులు కోరిందని..
అన్నానగర్: దిండుక్కల్ సమీపంలో గురువారం విడాకులు కోరిన భార్యని భర్త దారుణంగా కత్తితో నరికి హత్య చేశాడు. ఈ దాడిలో అతని కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. దిండుక్కల్ సమీపంలోని తాడిక్కొంబు, కోట్టూర్ ఆవారంపట్టికి చెందిన సెల్వరాజ్ (45). ఇతను వేడచందూర్‌లో ప్రభుత్వ రవాణా శాఖలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శశికళ (35). వీరి కుమార్తె పునిత(14) దిండుక్కల్‌లోని ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. కాగా కుటుంబ కలహాలతో భార్య భర్తలు తరుచూ గొడవపడేవారని తెలిసింది. అనంతరం సెల్వరాజ్, శశికళ విడిపోయారు. సెల్వరాజ్ దాడిక్కొంబు అరుణాచలం నగర్లో ఉంటున్నాడు. శశికళ దాడిక్కొంబు అగరంలో ఉన్న తల్లిదండ్రుల ఇంట్లో కుమార్తె సహా ఉంటోంది. ఈ క్రమంలో శశికళ భర్త నుంచి విడాకులు కోరుతూ దిండుక్కల్‌లోని కోర్టులో కేసు వేసింది. ఈ కేసు వచ్చే వారం విచారణకు రానుంది. భార్య విడాకులు అడగడంతో సెల్వరాజ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. గురువారం జరిగిన వారపుసంతలో శశికళ, పునిత వస్తువులు కొనుగోలు చేశారు. తిరిగి ఇంటికి నడుస్తూ వస్తున్నారు. అప్పుడు వారి వెనుక బైకుపై వచ్చిన సెల్వరాజ్ పునితా, శశికళని నరికాడు. ఇందులో శశికళ సంఘటన స్థలంలోనే మృతి చెందింది. పునిత తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సెల్వరాజ్ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పునితాని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
పెళ్లైన ఆరు రోజులకే..
అన్నానగర్: కారు అదుపుతప్పి కంటైనర్ లారీని ఢీకొన్న ప్రమాదంలో నవదంపతులు మృతి చెందారు. ఈ సంఘటన పర్కూర్ సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. వేలూర్ జిల్లా వానియంబాడి అబ్దుల్ రహ్మాన్ వీధికి చెందిన మునీర్ అహ్మద్. ఇతను ఆ ప్రాంతంలో తోలు పరిశ్రమ నడుపుతున్నాడు. ఇతని కుమారుడు అబ్దుల్ రహ్మాన్ అహ్మద్ (23)కి వానియంబాడికి చెందిన జికానామాగిన్ (21)కి ఆరు రోజుల కిందట వివాహం జరిగింది. ఈక్రమంలో నవదంపతులు ఇద్దరూ బెంగళూర్‌లోని బంధువుల ఇంటికి గురువారం కారులో వెళ్లారు. తరువాత అక్కడి నుంచి శుక్రవారం కారులో వానియంబాడికి తిరిగి వస్తున్నారు. కారు కృష్ణగిరిలోని పర్కూర్ సమీపం చిన్న పర్కూర్ పెట్రోల్ బంక్ వద్ద వస్తోంది. అప్పుడు హఠాత్తుగా అదుపుతప్పిన కారు డివైడర్ని ఢీకొని ఎదురుగా వస్తున్న కంటైనర్ లా రీని ఢీకొంది. అబ్దుల్ రహ్మాన్ అహ్మద్, జికానా మాగిన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సం ఘటన స్థలానికి చేరు కుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో 10 కిలోల బంగారం స్వాధీనం
అన్నానగర్ (చెన్నై): షార్జా, మలేసియా నుంచి ఆదివారం చెన్నై విమానాశ్రయానికి పిల్లలు ఆడుకునే పరికరాల్లో దాచి అక్రమంగా తెచ్చిన రూ.3.30 కోట్ల విలువ గల 10 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. చెన్నై మీనమ్బాక్కం ఎయిర్‌పోర్టుకు మలేసియా నుంచి ఆదివారం సాయంత్రం వచ్చిన కమర్‌అలీ (38) లగేజ్‌ను తనిఖీ చేయగా పిల్లలు ఆడుకునే 47 పరికరాల్లో బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. సుమారు రూ.కోటి 5 లక్షల విలువ గల 3 కిలోల 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి చెన్నైకి వచ్చిన విమానంలో రియాస్‌ఖాన్ (32), ఇఫ్రకీమ్‌షా (52) లగేజ్‌లను పరిశీలించగా.. పిల్లలు ఆడుకునే పరికరాల్లో దాచిన బంగారు బిస్కెట్లు దొరి కాయి. రూ.2.25 కోట్ల విలువున్న 6 కిలోల 600 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
రక్తమోడుతున్న కనికరించలేదు: వీడియో వైరల్
తూత్తుకూడి : దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్(రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బుధవారం అన్నానగర్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే వ్యక్తి బుల్లెట్ తగిలి మరణించాడు. అయితే అతని మరణానికి ప్రధాన కారణం పోలీసుల నిర్లక్ష్య వైఖరే. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని చూట్టూ పోలీసులు మూగారు. అతని పరిస్థితేంటో కూడా తెలుసుకోకుండా ఓ పోలీసు లాఠీతో బెదిరిస్తూ...‘నటించింది చాలు ఇక వెళ్లు’ అని కసురుకున్నాడు . బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావమైన అతడిని సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. గాయాలతో రక్తమోడుతున్న వ్యక్తి పట్ల కనీసం కనికరం కూడా చూపకుండా కర్కశంగా ప్రవర్తించిన పోలీసుల వైఖరిని అందరూ తప్పుపడుతున్నారు. తూత్తుకుడిలోని స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే వ్యక్తికి బుల్లెట్ తగిలింది. దాంతో బాధ భరించలేక అతను అక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి కనీసం ఆస్పత్రికి కూడా తరలించకుండా ‘నటించింది చాలు ఇక వెళ్లు’ అని అనడం అక్కడే ఉన్న ఓ రిపోర్టర్ వీడియో తీశాడు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు కలియప్పన్‌తో కలిపి 13 మంది మరణించారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రజలపై కాల్పులు జరిపినందుకు గానూ తూత్తుకుడి జిల్లా కలెక్టర్, పోలీసు అధికారిని బుధవారం బదిలీ చేశారు. కానీ పోలీసులు మాత్రం ఆందోళనకారులు తమపై రాళ్లు రువ్వడం వల్లే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాల్పులు జరుపుతున్న సమయంలో ఓ పోలీసు అధికారి బస్సు పైకి ఎక్కి ‘కనీసం ఒక్కరైనా చావాలి’ అని అంటున్న వీడియో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. -
స్టెరిలైట్ వ్యతిరేక ఉద్యమం; తూత్తుకుడిలో కాల్పులు
తూత్తుకుడి: దక్షిణ తమిళనాడులోని తీరపట్టణం తూత్తుకుడిలో మళ్లీ హింస చెలరేగింది. పట్టణంలోని అన్నానగర్ ప్రాంతంలో బుధవారం బంద్ నిర్వహిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపగా ఒకరు చనిపోయారు. మరో ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. తోటి ఆందోళనకారులు వెంటనే స్పందించి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 24 గంటల్లోపే మరోసారి కాల్పులు చోటుచేసుకోవడంతో నిరసనకారులు తీవ్రఆగ్రహంతో రగిలిపోతున్నారు. తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్(రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తోన్న స్థానికులు గడిచిన 100 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. అయితే నిరసనోద్యమం మంగళవారంనాడు ఒక్కసారిగా హింసాయుతమలుపు తిరిగింది. పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా 11 మంది ఆందోళనకారులు చనిపోయారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ అఖిలపక్షం బుధవారం తుత్తూకుడి బంద్‌కు పిలుపిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అలజడిరేపిన ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు సైతం కలుగజేసుకుంది. కాపర్ ప్లాంట్ విస్తరణను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. వ్యతిరేకత ఎందుకు? మానవాభివృద్ధి సూచిలో చెన్నైనగరం తర్వాత రెండో స్థానంలో ఉన్న తూత్తుకుడి పట్టణంలో పర్యావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాల నిల్వలకు పెనుముప్పుగా మారిన వేదాంత కాపర్ యూనిట్‌ని మూసేయాలని స్థానికులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కంపెనీ విస్తరణా ప్రణాళికలు రచించటం వారిలో ఆగ్రహాన్ని మరింత పెంచింది. తూత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీ గత 20 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాని నుంచి వస్తున్న రసాయనాల వల్ల కళ్లు మండుతున్నాయని, ఇతర అలర్జీలు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదుచేయడంతో 2013లో అప్పటి సీఎం జయలలిత ఆ కంపెనీని మూసివేయాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను జాతీయ హరిత ట్రిబ్యునల్ తిరస్కరించడంతో కంపెనీ తిరిగి తెరుచుకుంది. రాగిని కరిగించే ప్రక్రియ వల్ల ఆ ప్రాంతంలో సీసం, ఆర్సెనిక్, సెలీనియం, అల్యూమినియం, రాగితో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
మహిళ గొంతుతో మాట్లాడి మోసగించాడని..
అన్నానగర్ (తమిళనాడు): మహిళ గొంతుతో మాట్లాడి మోసం చేశాడనే కారణంతో తమిళనాడులో ఓ యువకుడిని పోలీసు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో బుధవారం జరిగింది. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్ సమీపంలోని వ.పుదుపట్టి, క్రిస్టియన్‌పేటకు చెందిన తెర్కుమలై కుమారుడు అయ్యనార్(25) ఓ ప్రైవేటు కళాశాలలో బీఎడ్ చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన కలైయరసన్ కుమారుడు కుమార్(26) చెన్నై ఎన్నూర్‌లో పోలీసుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుమార్ మొబైల్ నంబర్ తెలుసుకున్న అయ్యనార్ అతడితో మహిళ గొంతుతో మాట్లాడాడు. అయ్యనార్‌ని మహిళే అనుకుని కుమార్ కూడా మాట్లాడసాగాడు. ఈ క్రమంలో సొంతూరికి వచ్చిన కుమార్ తనతో మహిళగా మాట్లాడింది అయ్యనార్ అని తెలుసుకుని, ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు యత్నించాడు. బంధువులు గుర్తించి, ఆరాతీయగా జరిగిందంతా చెప్పాడు. దీంతో వారు అయ్యనార్‌ను హత్య చేయాలని నిర్ణయించారు. కుమార్ సోదరుడు విజయకుమార్(21), స్నేహితులు తమిళరసన్(27), జె.తమిళరసన్ (23)లు కుమార్ రమ్మన్నాడని చెప్పి అయ్యనార్‌ను బుధవారం రాత్రి పోదర్ కన్మామ్ సమీపంలోని ఓ తోటలోకి తీసుకెళ్లారు. అక్కడే కాచుకుని ఉన్న కుమార్, మిగతా ముగ్గురు అయ్యనార్‌ని కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యారు. పోలీసులు కుమార్ మినహా మిగతా ముగ్గురిని అరెస్టు చేశారు. కుమార్ కోసం గాలిస్తున్నారు. -
ముగ్గురికి రెండు యావజ్జీవ కారాగారశిక్షలు..
సాక్షి, అన్నానగర్: దంపతులతో సహా ముగ్గురి హత్య కేసులో అన్న, తమ్ముడు సహా ముగ్గురికి రెండు యావజ్జీవకారాగార శిక్షలు విధిస్తూ తొడుంబుళా కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దిండుక్కల్ జిల్లా అడియాలి నగర్ లా హాస్టల్ నడుపుతూ వచ్చిన కుంజుమహ్మద్ (65), ఇతని భార్య ఆయిషామ్మా (60), అత్త నాచ్చి (85) హత్యకు గురయ్యారు. ఆయిషామ్మా, నాచ్చిల నగలు కనపడలేదు. దీనిపై అడియాలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అప్పుడు ఆ హాస్టల్లో ఉంటున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్ర (23), రాకేష్ గౌడ (26), మంజునాథ్ (21) ముగ్గురు యువకులు నగలు, నగదుకి ఆశపడి వారిని హత్య చేసి పరారైనట్లు తెలిసింది. అనంతరం పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తొడుబుళా కోర్టులో జరుగుతూ వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి శుక్రవారం హత్య కేసులో అరెస్టు అయిన ముగ్గురికి రెండు యావజ్జీవ కారాగారశిక్షలు, తలా రూ.27 వేల 500 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
కారు స్పీకర్ ఆర్డర్ చేస్తే.. ఇటుక వచ్చింది!
సాక్షి, అన్నానగర్: ఆన్లైన్ ద్వారా కారుస్పీకర్‌ను బుకింగ్ చేయగా కొరియర్ పార్శిల్లో ఇటుక వచ్చింది. ఈ ఘటన తూత్తుక్కుడి సమీపంలోని ముల్‌లైక్కాటులో చోటుచేసుకుంది. న్యాయవాది సెవ్వకుమార్ తన కారు స్పీకర్ కోసం గత 1వ తేదీన(జనవరి01) ఆన్లైన్ బుకింగ్ చేశాడు. ఆదివారం మధ్యాహ్నం సదరు సంస్థ నుంచి వచ్చిన ఆ పార్శిల్ని ప్రైవేట్ కొరియర్ సంస్థ కార్మికుడు సెల్వకుమార్‌కు అందజేశాడు. సెల్వకుమార్ స్పీకర్ ధర రూ. 5వేలు చెల్లించి పార్శిల్‌ను తీసుకున్నాడు. ఆ పార్శిల్ తెరిచి చూడగా అందులో ఇటుక ఉంది. కొరియర్ సంస్థకు ఫోన్ చేయగా వారు సరిగ్గా సమాధానమివ్వలేదు. దీనిపై ఆయన మల్తైయాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కొరియర్ సంస్థ యజమానిని విచారణ చేశారు. సదరు కంపెనీ యజామాని సెల్వకుమార్‌కు నగదు తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
స్నేహితుల దారుణ హత్య..
సాక్షి, అన్నానగర్: ఆరల్‌వాయ్‌మొలి సమీపంలోని సీతప్పాల్ కొండ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మిత్రులు దారుణ హత్యకు గురయ్యారు. హతుల్లో ఒకరు గంజాయి వ్యాపారి ఉన్నారు. సీతప్పాల్ ఎస్ఏ వీధికి చెందిన భునేష్‌మణి (35). ఇతని భార్య సూర్య, దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఇతను గంజాయి వ్యాపారి కావడంతో ఆరల్వాయ్మొళి, భూతప్పాండి, కొట్టార్ పోలీసు స్టేషన్లలో 16 కేసులు నమోదై ఉన్నాయి. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారనే సమాచారం అందగానే సీతప్పాల్‌లోని కొండ ప్రాంతంలో తలదాచుకునేవాడు. ఇటీవల ఓ కేసులో అరెస్టై, ఆ తర్వాత బెయిల్‌పై బయటకి వచ్చిన భువనేష్‌మణి మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో తన స్నేహితుడు వడచేరి అరుగువిలైకి చెందిన షాజీ ఇంటికి వెళ్లాడు. అనంతరం ఇద్దరు బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. భువనేష్‌మణి కోసం భార్య బుధవారం పలు చోట్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. సీతప్పాల్ కొండపై ప్రాంతంలో ఉంటాడనే అనుమానంతో భునేష్‌మణి తండ్రి మణి అక్కడికి వెళ్లి చూశాడు. అక్కడ భునేష్‌మణి గొంతు కోయబడిన స్థితిలో, షాజీ కత్తి గాయాలతో మృతి చెంది ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసారి పల్లమ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, హంతకుల కోసం గాలిస్తున్నారు. -
వరుడి పేరుతో మోసం.. సెల్‌ఫోన్ పట్టించింది..!
సాక్షి, అన్నానగర్: చెన్నై సమీపం మాధవరంలో తన కూతురుకి వరుడు కావాలని ఇంటికి వచ్చి నగదు చోరీ చేసుకుని పరారైన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. పొన్నిఅమ్మన్ మేడుస్వామి నగరానికి చెందిన సుబ్రమణి(64). ఇతని భార్య కమలం. ఇంజినీర్‌గా పని చేస్తూ వస్తున్న తన కుమారుడికి సుబ్రమణి వరన్‌ను వెతికాడు. 13వ తేదీన 55 ఏళ్ల ఓ వ్యక్తి ఇతని ఇంటికి వచ్చాడు. అతను తిరువరంగడమ్కి చెందిన సంతాన గోపాలన్గా వారికి పరిచయం చేసుకున్నాడు. తరువాత సంతాన గోపాలన్ తన కుమార్తెకి వరుడిని చూస్తున్నానని వారిని నమ్మించాడు. దీంతో వారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లమని తెలిపారు. సాయంత్రం ఇంటికి వెళ్తానన్న అతనికి స్వీట్‌బాక్స్ ఇచ్చి పంపారు. కాగా మరుసటిరోజు కుమారుడి వివాహం కోసం బీరువాలో ఉంచిన రూ.1,85,000 నగదు కనిపించలేదు. సుబ్రమణికి సంతాన గోపాల్ మీద అనుమానంతో మాధవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ నెంబర్ పట్టించింది.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. సంతానగోపాలన్ మరచిపోయి సుబ్రమణికి ఇచ్చిన సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా అతని అడ్రస్ కనిపెట్టారు. మంగళవారం తిరువరంగం వలైందాన్ వీధిలోని అతని ప్రత్యేక పోలీసులు పట్టుకుని చెన్నైకి తీసుకుని వచ్చారు. విచారణలో సుబ్రమణి ఇంట్లోని నగదు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు అతని దగ్గర ఉన్న రూ.1,75,000 నగదుకు స్వాధీనం చేసుకున్నారు. -
‘ఆత్మరక్షణ కోసం కత్తి తెచ్చుకున్నా’..
సాక్షి, అన్నానగర్: తిరుచ్చి కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో వినతి అందజేసేందుకు వృద్ధురాలు కత్తితో రావడం సంచలనం కలిగించింది. తిరుచ్చి కాట్టూరు బిలోమినాల్ నగర్‌కు చెందిన పదవీ విరమణ పొందిన నర్సు మేరి(68). ఈమె సోమవారం గ్రీవెన్స్‌డేలో పాల్గొనేందుకు కలెక్టరేట్ చేరుకుంది. భద్రతా అధికారులు ఆమె వద్ద ఉన్న సంచిలో తనిఖీ చేయగా అందులో కత్తి లభించింది. ఆత్మరక్షణ కోసం తాను కత్తిని వెంట తెచ్చుకున్నట్టు వృద్ధురాలు తెలిపింది. పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మేరి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. అందులో.. తనకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రాత్రి సమయంలో కొంతమంది వచ్చి ఇంటిని కూల్చేస్తామని, హత్యా బెదిరింపులు చేస్తున్నట్టు వివరించింది. దీనిపై విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
తలనొప్పి అన్నాడు.. తీరా చూస్తే !
అన్నానగర్: ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లూవేల్ క్రీడ ప్రభావమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలివి.. జిల్లాలోని సిప్పాలకోటకు చెందిన బాలమురుగన కుమారుడు రఘువరన్(21). ఇతను కోయంబత్తూర్‌లోని ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్లో ఉండి కాలేజీకి వెళుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రఘువరన్ కళాశాల నుంచి ఇంటికి వచ్చాడు. రాత్రి తలనొప్పిగా ఉందని చెప్పి బెడ్రూంకు వెళ్లి పడుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటలైనా గది నుంచి బయటకు రాలేదు. కుటుంబసభ్యులు తలుపు పగులగొట్టి చూస్తే రఘువరన్ ఉరివేసుకుని శవంగా వేలాడుతూ కనిపించాడు. అతని ఎడమ చేతిపై గాయం ఉంది. దీంతో బ్లూవేల్ గేమ్‌లో నిమగ్నుడు కావడం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్గం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని మనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత నెల ఆంధ్రాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో రఘువరన్ బంగారు పతకాన్ని సాధించాడు. -
వేరు కాపురం పెట్టలేదనే కోపంతో..
అన్నానగర్(చెన్నై): వేరు కాపురం పెట్టడానికి భర్త అంగీకరించలేదన్న మనస్తాపంతో భార్య తన ఇద్దరు పిల్లలతో సహ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని కొయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలివి.. జిల్లాలోని ఊత్తుక్కులీ ప్రాంతానికి చెందిన రాజేశ్(28) తిరుప్పూర్‌లో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య విద్య(26). వీరికి పవన్, పవేష్ అనే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. రాజేష్ తల్లిదండ్రులు కూడా వీరితోనే ఉంటున్నారు. వేరు కాపురం పెడుదామని విద్య కోరిన భర్త అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం విద్య ఇద్దరి పిల్లలతో బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. నిద్రపోతున్నారని అత్త భావించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాజేష్ గది తలుపుతట్టాడు. అయినా తలుపు తీయకపోవడంతో పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా విద్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతోంది. మంచం మీద ఉన్న పిల్లలను చూస్తే వారిలో ఎలాంటి చలనం లేదు. ముగ్గురినీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి తల్లీబిడ్డలు మృతిచెందారని ధ్రువీకరించారు. విద్య పిల్లలను హత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. బెడ్ రూంలో దొరికిన విద్య రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని రాజేష్‌ను విచారిస్తున్నారు. -
గొడ్డలితో నరకటానికి ప్రయత్నించాను.. కానీ
అన్నానగర్: భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త ఆమెను నరికి హత్య చేశాడు. అంతటితో అగకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన ఉలగంధిని(47) పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. తిరువారూర్ జిల్లా వడపూర్ మెయిన్ రోడ్డుకి చెందిన ఉలగంధి మేస్త్రీ పని చేస్తూ జీవనం గడిపేవాడు. ఈయన మునీశ్వరి(36)ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కిరుబాదేవి(19), ప్రియదర్శిని (06) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మునీశ్వరి తల్లి ఓ బ్యాంకులో పని చేస్తుంది. ఆరోగ్యం సరిగాలేనప్పుడు ఆమె వెళ్ళి వస్తుంది. ఉలగంధి రోజు మద్యం తాగి వచ్చి మునీశ్వరి ప్రవర్తనపై అనుమానపడి తగాదా చేస్తూ వచ్చాడు. ఈ స్థితిలో గురువారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. కిరుబాదేవి తల్లికి ఫోన్ చేసింది. ఫోన్ తీయకపోవడంతో ఆమె తల్లిని వెతుక్కుంటూ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉంది. కిటికీ నుంచి లోపలికి చూస్తే తల్లి చేతులు, తల ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. తల్లి మృత దేహాన్ని చూసి దిగ్ర్భాంతి చెందిన కూతురు భోరున ఏడ్చింది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి చూసి దిగ్భ్రాంతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మన్నార్‌కుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి భర్త ఉలగంధిని అరెస్టు చేసి విచారణ చేశారు. నా భార్య మీద అనుమానం ఉంటూ వచ్చింది. గురువారం రాత్రి ఈ విషయంలో ఇద్దరి మధ్య తగాదా ఏర్పడింది. ఆవేశంలో ఇంటిలో ఉన్న కత్తితో ఆమెను నరకడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. తరువాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు చేతులను, తలను ముక్కలుగా చేశాను. పైగా నడుము భాగాన్ని గొడ్డలితో నరకటానికి ప్రయత్నించాను, కాని నా వల్ల కాలేదు. అందుకే ఇంటికి తాళం వేసి వెళ్ళానని విచారణలో తెలిపాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
స్మార్ట్ రేషన్‌కార్డులో హీరోయిన్ ఫోటో..!
అన్నానగర్: స్మార్ట్ రేషన్‌కార్డులో కుటుంబ యాజమాని ఫోటో స్థానంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫోటో వచ్చింది. ఈ సంఘటన సేలంలో మంగళవారం కలకలం రేపింది. ఎన్నికల కమిషన్ సంస్థ అచ్చువేసి ఇచ్చే రేషన్‌కార్డులో పురుషుల పేరు స్థానంలో మహిళల పేరు, ఫోటోలు మార్పులు గతంలో అక్కడక్కడ చోటుచేసుకున్నాయి. ఈ తప్పిదాలను తొలగించటానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటూ వస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమిళ ప్రభుత్వం స్థానికులకు వినియోగం చేస్తూ వచ్చే స్మార్ట్ రేషన్‌కార్డులో కుటుంబ యజమాని ఒకరి ఫోటో స్థానంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫోటో మారి వచ్చిన ఘటన సేలంలో చోటుచేసుకుంది. వివరాలివి.. సేలం జిల్లా ఓమలూరు తాలుకా ఆర్సి చెట్టిపట్టి కమలాపురం ప్రాంతానికి చెందిన సరోజ. ఈమె పేరుతో కుటుంబ యజమాని అని ముద్రించి వచ్చిన కార్డులో సరోజ ఫోటోకి బదులుగా నటి కాజల్ ఫోటో వచ్చింది. మంగళవారం ఉదయం రేషన్‌కార్డును డీలర్ సరోజకి ఇచ్చేటప్పుడే దీనిని చెప్పి సరిచేసి ఇస్తామని ఇచ్చారు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు స్మార్ట్ కార్డు జారీ చేసిన సిబ్బందుల వద్ద వారు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ స్మార్ట్ రేషన్‌కార్డు ప్రస్తుతం వాట్సాప్‌లో రావటం ప్రారంభమైంది. ఇటువంటి సంఘటనలు మరలా రాకుండా ఉండేందుకు అధికారులు తగ్గిన చర్యలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు. -
పోలీసుల ముందే ఆ యువతి అలా చేసింది..
అన్నానగర్: ఈ ప్రపంచంలో ఎప్పటికి విడిపోనిది స్నేహం ఒక్కటే.. ఏ కష్టం వచ్చిన మొదట స్నేహితులతోనే పంచుకుంటాం. అలాంటిది కడలూరు సమీపంలో స్నేహితురాలికి విషం ఇచ్చి యువతి హత్య చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆ యువతి చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లారు. కానీ ఎవరు ఊహించని సంఘటన అక్కడ చోటుచేసుకుంది. ఆ యువతి పోలీసుల కళ్ల ముందే 200 అడుగుల లోతు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కడలూరు జిల్లా పులియూర్ కాట్టుసాగై గ్రామానికి చెందిన యువతి దివ్య(19) సాత్తమామ్ పట్టు గ్రామంలో తన పిన్నిజగదీశ్వరి దగ్గర ఉంటూ డిప్లొమా నర్సింగ్ చదువుతోంది. దివ్య, కీళ్ కాంగేయన్ కుప్పమ్ గ్రామానికి చెందిన జయచిత్ర(19) ఇద్దరు స్నేహితులు.గత నెల మే 8వ తేది నుంచి దివ్య కనపడలేదు. పోలీసుల విచారణలో స్నేహితురాలు జయచిత్ర దివ్యని హత్య చేసి, కామాక్షి పేట సెడిలమ్ నది తీరంలో పాతిపెట్టినట్లు తెలిసింది. ఆణత్తూర్ కు చెందిన విజయరాజ్ ని దివ్యకి జయచిత్ర పరిచయం చేసింది. ఇద్దరు సన్నిహితంగా కలిసి మెలసి ఉండేవారు. దీంతో ఆవేశం చెందిన జయ తన స్నేహితుడిడైన మోహన్ తో కలిసి మే 8వ తేదిన దివ్యకు విషం ఇచ్చి, దుప్పటితో గొంతు నులిమి హత్య చేసినామని విచారణలో ఒప్పుకుంది. తరువాత పాతి పెట్టిన స్థలాన్ని తహశీల్దార్, డీఎస్పీ, దివ్య బంధువులు ఎదుట జయ గుర్తు చూపెట్టింది. మృతదేహాన్ని అక్కడే పోస్టుమార్టం చేశారు. అక్కడ లభించిన ఆధారాలతో దివ్య అని గుర్తుపట్టారు. తన సెల్‌ఫోన్ మొదలైన వస్తువులు, కీళ్కాంగేయన్ కుప్పంలో ఉన్న బావి సమీపంలో దాచిపెట్టానని పోలీసులతో చెప్పింది. శుక్రవారం ఉదయం ఆమె చెప్పిన ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఎవరు ఊహించని విధంగా జయ హఠాత్తుగా జయ దగ్గరలో ఉన్న 200 అడుగుల లోతు గల బావిలో దూకింది. ఏడీఎస్పీ, వేదరత్తిణమ్, డీఎస్పీలు సుందర వడివేల్, ఈశ్వరన్, కుమార్ సంఘటన స్థలానికి వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో ఆరు గంటల సేపు కష్టపడి జయచిత్ర మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
మద్యం షాపు దగ్గర కత్తితో..
అన్నానగర్: వైన్ షాపులో వసూలైన రూ. ౩ లక్షల నగదునుతో ఉన్న వ్యక్తిపై గుర్తు తెలియాని దుండగులు కత్తితో దాడి చేశారు. సంచిలో ఉన్న నగదుతో పరారయ్యారు. దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నాగపట్టణం జిల్లా వేలాంగలి ఆర్చ్ సమీపంలో సముద్ర తీర ప్రాంతంలో వైన్ షాపు ఉంది. ఈ షాపులో వేదారణ్యం మరుదూర్ ప్రాంతానికి చెందిన మణివాసన్(46) సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఇదే షాపులో తిరుక్కువలై తాలుకా మారాచ్చేరికి చెందిన సెల్వం(42), నాగై సెమ్మట్టి వినాయక ఆలయ వీధికి చెందిన సుభాష్(42), అగర ఒరత్తూర్ తెన్కరైవేలి ప్రాంతానికి చెందిన పక్కిరిస్వామి(48) పని చేస్తున్నారు. బుధవారం రాత్రి విక్రయాలు ముగిసిన తరువాత వసూలైన నగదు తీసుకొని షాపుకు తాళం వేశారు. వేలాంగన్ని పూక్కారవీధికి చెందిన మురుగానందం(42) వారికి రోజూలాగే ఆహారం ఇవ్వటానికి అక్కడికి వచ్చాడు. అప్పుడు నగదు సంచిని మురుగానందంకు ఇచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు మురుగానందంపై కత్తితో దాడి చేసి నగదు సంచిని లాక్కొని పరారయ్యారు. వైన్ షాపు సిబ్బంది అతన్ని నాగై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. దీనిపై ఫిర్యాదు అందుకున్నవేలాంగన్ని పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. -
వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధమైందని..
అన్నానగర్: తనను ప్రేమించిన అమ్మాయి మరోకరిని వివాహాం చేసుకోవటానికి సిద్ధమైందని తెలిసి సహించలేక ప్రేయసిని హత్య చేసిన సంఘటన పెన్నాగరం సమీపంలో కలకలం రేపింది. వివరాలోకి వెళ్లితే.. సెల్రంపట్టికి చెందిన తంగరాజ్ కుమార్తె తమిళా(18) ఈమె ప్లస్ 2 ముగించుకుని కళాశాలలో చేరటానికి ఆప్లికేషన్ వేసింది. బుధవారం రోజు ఓ బండ మీద తమిళా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన కుమార్తె చావుపై అనుమానం ఉందని తండ్రి పెన్నాగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అదే ప్రాంతానికి చెందిన యువకుడు మహేంద్రన్(24) ని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతలో గురువారం విచారణ చేశారు. విచారణలో మహేంద్రన్.. నేను తమిళా ఇద్దరం ప్రేమించుకుంటూ వచ్చాం. ప్రేమించిన నన్ను కాదని మరోకరికి ఇచ్చి వివాహం చేయించాలని తల్లిదండ్రులు సిద్ధం కాగానే ఆమె ఒప్పుకున్నట్లుగా తెలిసింది. దీంతో తమిళాకి ఫోన్ చేసి ఊరు బయటకి పిలిపించాను. అప్పుడే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యావా అని అడిగినప్పపుడు మా మధ్య తగదా ఏర్పడందని చెప్పాడు. ఇంతలో ఆవేశం చెందిన నేను తమిళా చేతులను కట్టివేసి హత్య చేయటానికి ప్రయత్నించాను. ఇంతలో ఆమె సృహా తప్పి కింద పడటం వల్ల గొంతు నులిమి హత్య చేశాను. తరువాత అనుమానం రాకూడని ఆమె నోటిలో విషం పోసి వెళ్లిపోయనని పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. యువతి హత్య కేసులో మహేంద్రన్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు చేసి సేలం సెంట్రల్ జైలుకు పంపించారు. -
వెంటపడి తరిమి తరిమి మరీ..!
అన్నానగర్: వెంటపడి ఓ వ్యక్తిని నరకడం మనం సినిమాలో చూస్తుంటాం. కానీ అలాంటి సంఘటనలు నేడు నిజ జీవితంలో జరుగుతున్నాయి. మదురై జైలు నుంచి జామీనుపై బయటకు వచ్చిన ఓ రౌడీని ముగ్గురు వ్యక్తులు పట్టపగలు తరిమి, తరిమి నరికి హత్య చేశారు. నింధితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుప్పాణడి ప్రాంతానికి చెందిన సెన్బగమ్ కుమారుడు ఆర్ముగమ్(24) పేరు మోసిన రౌడీ. ఇతను గతంలో ఓ హత్య కేసులో అరెస్టు అయ్యి ఇటీవల జామీనుపై బయటికి వచ్చారు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న ఆర్ముగమ్‌కు కొందరు ఫోన్ చేసి బయటకు పిలిచారు. బైక్ పై పాత రామనాధపురం వైపు వెళుతున్న అతనిని వెనుక నుంచి ముగ్గురు బైక్‌తో వెంబడించారు. వారిని గమనించిన అతను తన బైక్‌ను విడిచి పరుగెత్తాడు. వెంబడిస్తున్న వాళ్లు అతన్ని తరుముకుంటూ వెళ్లి అతి కిరాతంగా నరికి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గత ఏడాది డిసెంబర్ 28వ తేదినా అదే ప్రాంతానికి చేందిన ఇరుదయరాజా, అతని స్నేహితులు గణేశమూర్తి, కార్తీక్‌లపై ఆర్ముగమ్ తన స్నేహితులతో కలిసి ఇనుప చువ్వలతో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన గణేశమూర్తి మృతి చెందాడు. ఈ హత్య కేసులో ఆర్ముగమ్ జైలు కెళ్లి ఇటీవలే జామీనుపై బయటకు వచ్చాడు. చనిపోయిన ఇరుదయరాజా సంబంధీకులు పగ తీర్చుకోవడనికి ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో ఆర్ముగమ్ను పోలీసులు హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్ముగమ్ హత్య చేయబడ్డాడు. ఈ క్రమంలో ఇరుదయరాజా బంధువులే హత్య చేసి ఉంటారనే కోణంలో శుక్రవారం పోలీసులు విచారణ చేపట్టారు. హంతకులను పట్లుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రేమ పెళ్లి.. విషాదం
అన్నానగర్: కుమారుడు ప్రేమ వివాహం చేసుకోవటం ఇష్టంలేని ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. చెన్నైలో జరిగిన ఈ ఘటన వివరాలివీ.. నగరంలోని తేని ప్రాంతానికి చెందిన జయభారతి(55) రిటైర్డు టీచర్. ఈమె భర్త సుబ్బురాజ్ కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు మనోజ్(28) ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మనోజ్ తమ బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విషయం తెలిసిన జయభారతి అభ్యంతరం తెలిపింది. కానీ, తల్లి మాటను లెక్కచేయకుండా గత 12వ తేదీన మనోజ్ ప్రేమించిన అమ్మాయిని చెన్నైలో వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తర్వాత భార్య తీసుకుని మంగళవారం ఉదయం తేని ప్రాంతంలోని తల్లి వద్దకు వచ్చాడు. తలుపు లోపల గడియపెట్టి ఉండటంతో మనోజ్ ఎంత కొట్టినా తెరవలేదు. దీంతోపాటు ఇంటి లోపలి నుంచి దుర్వాసన వచ్చింది. పోలీసులకు మనోజ్ సమాచారం అందించటంతో వారు వచ్చి తలుపులు పగులగొట్టి లోపల చూడగా జయభారతి ఉరి వేసుకుని కనిపించింది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఆమె పది రోజుల క్రితమే మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
శ్మశానంలో ఉచిత వైఫై
కొరుక్కుపేట(చెన్నై): చెన్నై అన్నానగర్, న్యూ ఆవడి రోడ్డులోని వేలాంగాడు శ్మశాన వాటికలో శనివారం నుంచి ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు శ్మశానవాటికలో శనివారం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(ఐసీడబ్ల్యూవో), గ్రేటర్ చైన్నై కార్పొరేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ మీనంబాక్కం సంయుక్త ఆధ్వర్యంలో ఈ వైఫై సేవలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఉచిత వైఫై ద్వారా అంత్యక్రియలను విదేశాల్లోని ఆప్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కలుగుతుందని చెప్పారు. అంత్యక్రియలకు రాలేని వారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుందని వివరించారు. -
గుండె కుడివైపు.. కాలేయం ఎడమవైపు!
అన్నానగర్ (చెన్నై): సాధారణంగా అందరికీ గుండె, ప్లీహ గ్రంథి ఎడమ వైపున, కాలేయం కుడి వైపున ఉంటాయి. కానీ.. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన నాగరాజు(38) అనే వ్యక్తికి మాత్రం గుండె, ప్లీహం కుడి వైపున, కాలేయం ఎడమ వైపున ఉన్నాయి. అంతేకాక ఊపిరితిత్తులు సైతం తలకిందులుగా ఉన్నాయట. అస్తమా, దగ్గు, అలసట వంటి సమస్యలతో చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన నాగరాజుకు వివిధ పరీక్షలు చేసిన వైద్యులు అతడి శరీరంలో అవయవాలు ఇలా గందరగోళంగా ఉన్న తీరును చూసి విస్తుపోయారు. కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఇలా అవయవాల అస్తవ్యస్త అమరిక ఉంటుందని రోగిని పరిశీలించినడాక్టర్ రాజా వెంకటేష్ తెలిపారు. నాగరాజు గుండెలోని రెండు కవాటాలు పూర్తిగా దెబ్బతినడంతో అతడికి ముఖ్యమంత్రి సహాయ పథకం కింద కవాటాలను అమర్చామన్నారు. రోగి ఊపిరితిత్తులు సైతం తలకిందులుగా ఉండడం వల్ల కవాటాలను మార్చే శస్త్రచికిత్సకు వైద్యులు ఆరు గంటలకు పైగా శ్రమించినట్లు చెప్పారు. -
సహారా సొమ్ము కోసం సెబీ ఎత్తుగడ
అన్నానగర్, న్యూస్‌లైన్: సహారా ఇండియా కంపెనీలు మూడుకోట్లపైచిలుకు మదుపరులు దాచుకున్న 5120 సొమ్మును సెబీ అక్రమంగా వాడుకోవడానికి కొత్త ఎత్తుగడలు పన్నిందని ఆ కంపెనీ న్యాయ సలహాదారు కేశవమోహన్ ఆరోపించారు. ఎత్తుగడల్లో భాగంగా సహారాలో పెట్టుబడులు పెట్టినవారంతా బినామీ పేర్లతో ఉన్నట్లుగా తాము కనుగొన్నామని సెబీ శుక్రవారం నాడు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోర్టు ఈ నేపథ్యంలో సహారాలో పెట్టుబడులు పెట్టిన మదుపరుల వివరాల డాక్యుమెంట్లను గతంలోనే కోరివుందని, ఇందులో భాగంగా సహారా తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన 3.03 కోట్ల మంది ఇన్వెస్టర్ల తాలూకు వివరాలను డిజిటల్ రూపంలో కోర్టుకు 60 అందించిందన్నారు. వీటిని పరిశీలించిన కోర్టు సంతృప్తిని వ్యక్తం చేయగా సెబీ మాత్రం డిజిటల్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన వ్యక్తుల వివరాలను కనిపెట్టేందుకే సహారా 60 కోట్లపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందనడం వింతగా ఉందన్నారు. సహారా వ్యాఖ్యలకు స్పందించిన సెబీ తాము మార్చి 2014న సహారా సమర్పించిన పత్రాల్లోని 20 వేల మంది మదుపరులకు ధ్రువీకరణ కోరుతూ లేఖలు పంపామని అయితే వీటిలో ఒక్కరూ సమాధానం పంపక పోవడంతో ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశోధించగా బినామీ ఇన్వెస్టర్లు ఎక్కువగా కన్పించారని అంటోంది. సెబీ సమాధానం విన్న సహారా, సెబీ పంపిన లేఖలన్నీ తాము ఇది వరకే సొమ్మును సెటిల్ చేసిన మదుపరులకేనని అంటోంది. 15 నెలల వ్యవధిలో సహారా తన మదుపరులకు కోటికిపైగా సెటిల్మెంట్ చేశామంది. సెబీ వద్ద నున్న 5120 కోట్లల్లో 5119 కోట్లు మిగిలివుందని ఈ సొమ్మును బినామీ మదుపరుదారులున్నారంటూస్వాహా చేసేందుకు సెబీ చూస్తోందని కేశవ్మోహన్ ధ్వజమెత్తారు. -
చెన్నైలో అమెరికా యుద్ధ విన్యాస నౌక
అన్నానగర్, న్యూస్‌లైన్:అమెరికా నావికా దళానికి చెందిన యూఎస్ఎస్ మాకాంప్ బెల్- డీడీజీ85 డిస్ట్రాయర్ అనే భారీ యుద్ధ నౌక చెన్నై పోర్టుకు వచ్చింది. ఈ సందర్భంగా అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఏ. మాక్కింటైరీ సోమవారం మాకాంప్ బెల్ నౌక వివరాలను విలేకరులకు తెలియజేశారు. భారత్-అమెరికాలు యుద్ధ తంత్రాల్లోని మెళకువలను, నైపుణ్యాలను ఇచ్చి పుచ్చు కునేందుకు ఈ తరహా నౌక సందర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. మాకాంప్ బెల్ కేవలం యుద్ధ విన్యాస నౌక మాత్రమే కాదని, విపత్కర పరిస్థితుల్లో ఈ నౌక అంతర్జాతీయంగా పలు దేశాల్లో తన స్నేహ హస్తాన్ని కూడా అందించిందన్నారు. భారత్- అమెరికా అంతర్జాతీయ జలా ల్లో నవంబరు ఏడు నుంచి 11 వ తేదీ వరకూ ఈ నౌక భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలతో కలిసి పలు రకాల యుద్ధ కళా విన్యాసాలను ప్రదర్శిస్తుందన్నారు. ఈ విషయమై భారత్ విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అమెరికా ప్రభుత్వ కార్యదర్శి జాన్‌కెర్రీ తో విసృ్తతమైన చ ర్చలు జరిపిన అనంతరం ఈ నౌక చెన్నైకి చేరిందన్నారు. యూఎస్ డెస్ట్రాయర్ స్క్వాడ్రన్ 15వ ఫ్లేట్కు చెందిన ఈ నౌక కెప్టెన్ పాల్ జె. లైయాన్స్ యుద్ధనౌకలోని విశేషాలను వివరించారు. మొత్తం 320 మంది సిబ్బంది కల్గిన ఈ నౌకలో 21 శాతం మంది మహిళలు యుద్ధ విద్యలో ఆరితేరారన్నారు. 510 అడుగుల పొడ వు, 9150 టన్నుల బరువు కల్గిన ఈ నౌక గంటలకు 33 నాటికల్ మైళ్ల వేగం తో ప్రయాణిస్తుందన్నారు. అత్యవసరం అనుకుంటే ఈ నౌకలోని మినీ యుద్ధ విమానాన్ని ఉపయోగిస్తామన్నారు. రెండు హెలికాప్టర్లు కూడా ఇందులో ఉన్నాయన్నారు. కమాండర్ షరీఫ్ హెచ్.కాఫీ విలేకరులకు నౌకను చూపిం చారు. నౌకలోని నాలుగు నాణ్యమైన సాంకేతిక విభాగాలకు తీసుకొని వెళ్లి వాటి గురించి వివరించారు. నౌక నాలు గు జనరల్ ఎలక్ట్రిక్ ఎల్ఎం-2500 గ్యాస్ టర్బైన్లతో నడుస్తుందన్నారు. అత్యాధునికమైన ఆయుధ వ్యవస్థ ఈ నౌకలో ఉందన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో 34 సార్లు శత్రుయుద్ధ విమానాలను మట్టికరిపించిన అమెరికా నావి కాదళం ఏడోవ ఫ్లీట్-2ఏ విభాగానికి చెందిన కెప్టెన్ డేవిడ్ మాకాంప్ బెల్ జ్ఞాపకార్థం ఈ నౌకను ఆయన పేరు పె ట్టినట్లు తెలిపారు. పలు దేశాల్లో ఈ నౌక వందలాది యుద్ధ విన్యాసాలను నిర్వహించిందన్నారు. పోర్టుకాల్ కార్యక్ర మం ద్వారా తాము చెన్నైకు వచ్చామన్నారు. ఏడో తేదీ బయలుదేరి మల బారు తీర ప్రాంతానికి చేరతామన్నారు. -
దసరాకు ప్రత్యేక రైళ్లు
అన్నానగర్, న్యూస్‌లైన్: దసరా సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ రైల్వే సీపీఆర్వో డి.లక్ష్మణన్ తెలిపారు. ట్రైన్ నంబరు 06318 సంత్రగచి సూపర్ ఫా స్ట్ ప్రత్యేక రైలు సోమవారం ఉదయం 8.45లకు కోచువెలి నుంచి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 1.50 గంటలకు చెన్నై చేరుతుందని తెలిపారు. అలాగే చెన్నై నుంచి రెండు గంటలకు బయలుదేరి 14 ఉదయం 7.10 గంట లకు సంత్రగచికి చేరుతుందన్నా రు. ట్రైన్ నంబరు 06317 సంత్రగచి - కోచువెలి ఎక్స్‌ప్రెస్ 15న సాయంత్రం 5 గంటలకు సంత్రగచి నుంచి బయలుదేరి 16వ తేదీ రాత్రి 11.30 గంటలకు చెన్నైకి చేరుతుందని వెల్లడించారు. చెన్నై నుంచి రాత్రి 11.45 గంటలకు బయలు దేరే ఈ ప్రత్యేక రైలు 17న సాయంత్రం 4.45 గంటలకు కోచువెలికి చేరుతుందని తెలిపారు. ఈ రెండు ప్రత్యేక రైళ్లు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ కోల్‌కతాలోని కొల్లాం, కయనకుళం, మావిళికార, చెంగనూరు, తిరువిళ్ల, కొట్టాయం, ఎర్నాకుళం, అళువా, త్రిశూరు, పాలక్కాడు, కోవై, తిరుపూరు, ఈరోడ్, సేలం, జోలార్పేట్టై, కాట్పాడి, అరక్కోణం, చెన్నై సెంట్రల్, గూడురు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖ పట్నం, విజయనగరం, ఖుద్రారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ బాల్‌సోరే, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయన్నారు. టైన్ నెంబరు 06318కు అడ్వాన్సు రిజర్వేషన్లను శుక్రవారం నుంచే ప్రారంభించామని తెలిపారు. ఇదిలా ఉండగా చెన్నై-గుమ్మిడిపూండి సెక్షన్ల మధ్య విద్యుత్ కోతలు, ఇంజినీరింగ్ పనులు, మెయింటినెన్స్ వంటి పలు కారణాల వల్ల అక్టోబర్ - నవంబరు నెలల్లో మంగళ, శనివారాల్లో ఎన్నూరు - గుమ్మిడిపూండికి వెళ్లే ట్రైన్ నెంబరు 42017 ఎంఎంసీ - గుమ్మిడిపూండి ఈఎంయూ రైలు, ట్రైన్ నెంబరు 42026 గుమ్మిడిపూండి - ఎంఎంసీ ఈఎంయూ రైలును రద్దు చేస్తున్నామన్నారు. -
స్వరరాగ ఝరి సాలూరి రాజేశ్వరావు
ఐదు దశాబ్దాలకు పైగా చలన చిత్ర రంగంలో తనదైన ముద్రవేసుకున్న సంగీత దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రముఖ సంగీత దర్శకుల జంట శంకర్-జైకిషన్లు కూడా చిత్ర రంగంలో 15 ఏళ్లు మాత్రమే తమ హవా కొనసాగించారు. సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరావు ఏకబిగిన (1934-1986) 52 ఏళ్లకు పైగా తెలుగు, కన్నడ, తమిళ, హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి సంగీత ఘనాపాటిగా రికార్డు సృష్టించారు. అక్టోబర్ 11న సాలూరి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.... అన్నానగర్, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా (నేడు శ్రీకాకుళం) సాలూరు గ్రామ సమీపంలోని శివరామపురంలో 1922 అక్టోబరు 11న సాలూరి రాజేశ్వరరావు జన్మించా రు. సాలూరి తండ్రి సన్యాసిరాజు ప్రముఖ మృదంగ విద్వాంసులు. అం తేగాక గీత రచయిత కూడా. ఆయన ప్రముఖ వయోలినిస్టు ద్వారం వెంకట స్వామినాయుడు కచేరిలకు మృదంగ సహకారాన్ని అందిస్తుండేవారు. తండ్రి రక్తం సాలూరీలోనూ ప్రవహించింది. 1934లో అంటే సాలూరి రాజేశ్వరరావుకు 12 ఏళ్ల వయసప్పుడు హచిన్స్ రికార్డింగ్ కంపెనీ అధినేతలు విజయనగరానికి వచ్చారు. స్టేజిమీద అద్భుతం గా హార్మోనియం వాయిస్తూ గీతాలాపన చేస్తున్న సాలూరిని గమనించారు. ఆయనలోని సంగీత జ్ఞానిని గుర్తించా రు. 7వ ఏటనే స్టేజి ప్రదర్శనలు ఇవ్వ డం మొదలు పెట్టిన సాలూరికి కర్ణాటక సంగీతంలోని ఏ రాగాన్ని అయినా ఇట్టే గుర్తు పట్టి దాని లక్షణాలు వివరించే నేర్పు ఉండేదని తండ్రి సన్నాసిరాజు హచిన్స్ అధికారులకు చెప్పడంతో వారు వాళ్లిద్దర్నీ తమతో బెంగళూరుకు తీసుకెళ్లారు. అక్కడ గూడవల్లి రాంబ్రహ్మం, పి.వి.దాసు నిర్మాతలుగా నిర్మిస్తున్న భగవద్గీత అనే చిత్రంలో సాలూరి మొట్టమొదటసారి గా నేపథ్యగానాన్ని అందించారు. సాలూరిలోని గళ మాధుర్యానికి పరవశులైన గూడవల్లి రాంబ్రహ్మం ఆయ న్ను మద్రాసుకు తీసుకొచ్చి తాను నిర్మిస్తున్న శ్రీకృష్ణలీలలు అనే చిత్రంలో బాలకృష్ణుడి వేషం వేయించారు. 1935లో ఈ చి త్రం విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. దీంతో సాలూరి పేరు ఆంధ్రా-తమిళనాడు రాష్ట్రాల్లో మారుమోగింది. 1936లో వచ్చిన మాయాబజార్ చిత్రంలో సాలూరి అభిమన్యుడి పాత్రను పోషించారు. అనంత రం కలకత్తాలోని ఒక నిర్మాణ కంపెనీ సాలూరీకి తమ కీచకవధ చిత్రంలో పాత్రనివ్వడం ఆయనలోని సంగీత జ్ఞానానికి ఒక గొప్ప మేలుకొలుపు అయింది. ఆ సమయం లో సాలూరి ప్రముఖ గాయకులు కుందన్లాల్ సైగ ల్, పంకజ్మాలిక్తో పరిచయమై అద్భుతాలను సృష్టించే సాలూరిని తయారు చేసింది. ఏడాది పాటు సైగల్ వద్ద హిందుస్తానీ సంగీతంతో పాటు సితార, గిటారు వాయిద్యాలను నేర్చుకున్నారు. పంకజ్మాలిక్ వద్ద తబలా, మాండోలిన్, పియానో, ఎలక్ట్రిక్ గిటార్ వాయిద్యాలను నేర్చుకున్నారు. సంగీత దర్శకుడిగా: 1938లో కలకత్తా నుంచి మద్రాసు చేరిన సాలూరి రాజేశ్వరరావు జయరామయ్య నిర్మించిన విష్ణు ్డలీలలు అనే తమిళ చిత్రంలో బల రాముని పాత్ర ధరించారు. అలాగే దా నికి అవసరమైన నేపథ్య గానాన్ని తన సొంతగళం నుంచే వినిపించారు. అనంతరం జయప్రద చిత్రానికి తొలి సారిగా సంగీత దర్శకత్వం వహించా రు. ఆ తర్వాత ఆయన పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా మారిపోయారు. బాలనాగమ్మ, ఇల్లాలు ఆయనకు మం చి పేరు తెచ్చాయి. చిత్రాల్లో నేపథ్యగానం లేని రోజుల్లో సాలూరి సినిమా రంగ ప్రవేశం చేశారు. ఇల్లాలు చిత్రం నుంచి నేపథ్య సంగీతం - గానాలకు తెరతీశారు. అదే విధంగా లలిత సంగీ తాన్ని, దాన్ని శైలిని కూడా తొలిసారి సంగీతంలో ప్రయోగం చేసింది కూడా సాలూరే కావడం విశేషం. 1940-1950 మధ్య కాలంలో ఆయన జెమినీ స్టూడియోస్ నిర్మించే సినిమాలకే సం గీత దర్శకత్వం చేశారు. 1950లో బీ ఎన్ రెడ్డి తన మల్లీశ్వరి చిత్రానికి సం గీత నిర్దేశం చేయమనడంతో సాలూరి వేగానికి కళ్లెం వే సేవారు లేకపోయారు. సాలూరి ఎక్కువగా అభేరి, సింధుభైర వి, కాపీ, కల్యాణి, పహడ్, హిందోళం వంటి రాగాల్లోనే ఎక్కువ పాటలకు బాణీలు కట్టారు. విప్ర నారాయణ, మి స్సమ్మ, జీవన్ముక్తి, అపద్బంధు, చెంచులక్ష్మి, భీష్మ, పాదుకాపట్టాభిషేకం, రత్నమాల, వింధ్యారాణి, అపూర్వ సహోదరులు, తదితర 123 తెలుగు చిత్రాలకు, ఐదు కన్నడ చిత్రాలకు, 12 తమిళ చిత్రాలకు, ఐదు హిందీ చిత్రాలకు సంగీతం అందించారు. కొస మెరుపు: తెలుగు చిత్రాల్లో పా శ్చాత్య సంగీత బాణీలను తొలిసారిగా ప్రవేశపెట్టింది సాలూరే. చిట్టి చెల్లెలు చిత్రానికి ఆయన స్వర పరచిన ఈ రే యీ తీయనిదీ.. ఈ చిరుగాలి ఇంపైన ది అనే గీతాన్ని ఆయన ప్రముఖ ఫ్రెం చి కంపోజర్ పాల్మురియట్ ఆల్బం లోని లవ్ ఈజ్ బ్లూ అనే గీత స్పూర్తితో బాణీను కట్టారు. గౌరవాలు - పురస్కారాలు: 1980లో కన్యకా పరమేశ్వరి చిత్రానికి నంది అవార్డు, 1992 రఘుపతి వెంకయ్య అవార్డు, తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి అవార్డు, 1979లో ఆంధ్రావర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టుకు ఆస్థాన విద్వాంసుడుగా కొన్నేళ్లు పని చేశారు. -
సమైక్య సెగతో 900 మెగావాట్ల విద్యుత్ నష్టం
అన్నానగర్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం తమిళనాడు విద్యుత్ రంగాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. విద్యుత్ పంపకాల ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రానికి అందుతున్న 900 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చెన్నైతోపాటు ఇతర జిల్లాల్లో తిరిగి విద్యుత్ కోతలు ప్రారంభం కానున్నాయి. సోమవారం రవాణా వ్యవస్థను స్తంభింపచేసిన సమైక్య సెగ మంగళవారం విద్యుత్ రంగాన్ని కూడా తాకింది. ఆంధ్రాలోని సింహా ద్రి, రామగుండం పవర్ స్టేషన్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 900 మెగావాట్లను పంపక ఒప్పందం కింద తమిళనాడుకు తరలిస్తోంది. ఈ సరఫరా సోమవారం నుంచి నిలిచిపోవడంతో రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా స్థాయి 3 వేల మెగావాట్ల నుంచి 2100 మెగావాట్ల స్థాయికి పడిపోయింది. రాష్ట్రానికి ఒడిశా (530 మెగావాట్లు), కర్ణాటక(227 మెగావాట్లు) నుంచి అందే పంపక విద్యుత్ స్థాయిలో 730 మెగావాట్లే ఉండడంతో బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి విద్యుత్ కోతను యధావిధిగా విధించే అవకాశాలున్నాయని రాష్ట్ర విద్యుత్ బోర్డు ముందస్తు హెచ్చరికలు చేసింది. గాలిమరల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ స్థాయి కూడా అంత అశాజనకంగా లేదని అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి వ్యవసాయ పంపు సెట్లకు మాత్రమే త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తామని వివరించారు. ఈ నెలాఖరు వరకూ ఉద్యమ తీవ్రతను సమీక్షించిన అనంతరం నవంబర్ నుంచి పరిశ్రమలకు కూడా కోత విధించే ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని రామగుండం-సింహాద్రిలో ఉత్పత్తి అవుతున్న రెండు వేల మెగావాట్ల విద్యుత్‌లో 900 మెగావాట్లను ఆంధ్రా ప్రభుత్వం తమకు ఇస్తోందని, సోమవారం నుంచి ఈ విద్యుత్ అందకపోవడంతో జల విద్యుత్‌పై దృష్టి పెట్టామని వివరించారు. మద్రాసు అటామిక్ పవరు స్టేషన్ల నుంచి అందే 300 మెగావాట్ల విద్యుత్ కొంతవరకూ లోటును పూడ్చగలదన్నారు. రాష్ట్రంలో ఏసీల వాడకం, వాటి సంఖ్య పెరగడం వల్ల అదనంగా 12,118 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోందన్నారు. ఏసీల వల్లే 269 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతోందని వివరించారు. సీమాంధ్ర ఉద్యమం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ ఉత్పత్తి 6090 మెగావాట్ల నుంచి 2990 మెగావాట్లకు తగ్గిపోయిందని, ఉద్యమం ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర రైల్వేల మీద సైతం ఈ ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదని విద్యుత్ బోర్డు అంటోంది. మంత్రి అభయం రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ సంక్షోభంలో ఉందని విద్యుత్ బోర్డు అధికారులు చెబుతున్నారు. చిన్నతరహా పరిశ్రమల సదస్సులో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్ మాత్రం చిన్నతరహా పరిశ్రమలకు విద్యుత్ కోత విధించబోమని అభయం ఇచ్చారు. ఉత్పత్తి విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని పేర్కొన్నారు. -
ఇద్దరు తెలుగు విద్యార్థులకు గౌరవం
అన్నానగర్, న్యూస్‌లైన్: మద్రాసు ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ లోని ఇద్దరు తెలుగు విద్యార్థులకు, తమిళ విద్యార్థికి గూగుల్ సంస్థ అరుదైన గౌరవాన్నిం చ్చింది. గురుప్రకాష్, ఎన్.సంతోష్ కుమార్ తెలుగు వారు కాగా, కెవిన్ కార్తీక్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఇంటర్న్ ప్రాజెక్టు కింద వీరికి సంవత్సరానికి రూ.92 లక్షల జీతాన్ని గూగుల్ సంస్థ ఆఫర్ చేసింది. ప్రాజెక్టు ముగిసిన అనంతరం వీరికి తమ సంస్థలో మరింత అధిక జీతంలో ఉన్నత స్థానం కల్పిస్తామని పేర్కొంది. ఐటిలో కంప్యూటర్ విద్యను అభ్యశిస్తున్న వీరి ప్రతిభ ను గుర్తించి గూగుల్‌వీరికి ఇంత పెద్ద మొత్తంలో జీతాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. సోమవారం గూగుల్ నుంచి తమకు అపాయింట్మెంట్ లేఖలు అందాయని వారు తెలిపారు. మూడు నెలల పాటు తాము బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు. వీరిలో గురుప్రకాష్ కోవైలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు కాగా, సంతోష్‌కుమార్ స్థానిక అడయారులో ఉంటున్నారు. కార్తీక్ స్థానిక గోపాలపురం డీఏవీ స్కూలు విద్యార్థి. ప్రోగ్రామింగ్‌లో ఈ ముగ్గు రు విద్యార్థులు చూపిన ప్రతిభను గుర్తించి గూగుల్ సంస్థ వీరిని ఆహ్వానించింది. గూగుల్ సంస్థ తమకు ఇచ్చిన 10 వారాల ప్రాజెక్టును ఆరువారాల్లోనే పూర్తి చేస్తామన్నారు. -
అనువాదం కత్తి మీద సాము
అన్నానగర్, న్యూస్‌లైన్: అనువాదం చేయడమంటే కత్తి మీద సాము వంటిదేనని కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాదకుల అవార్డుల-2012 ప్రదానోత్సవం చెన్నైలోని సర్ పిట్టీ త్యాగరాయ హాలులో శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వనాథ్ ప్రసాద్ తివారీ ప్రసంగిం చారు. అనువాదాలు పాఠకులకు ఇతర భాషా రచయితలతో పరిచయూలు పెంచుతాయన్నారు. భిన్నభాషల మధ్య వారధి అనువాదమే అన్నారు. అనంతరం ప్రముఖ తమిళ రచయిత అశోక్మిత్రన్ మాట్లాడారు. అనువాదకులను ప్రోత్సహించేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవిరళ కృషి చేస్తోందన్నారు. అకాడమీకి తమిళనాడు నుంచే అత్యధిక ఆర్డర్లు అందుతున్నాయన్నారు. రచయితలు ఏ భాషలో రచన చేసినా అందులోని భావం ప్రధానమన్నారు. ఈ విషయూన్ని అనువాదం ఇతర ప్రాంతీయ భాషల పాఠకులకు విశదీకరిస్తుందన్నారు. అకాడమీ ప్రతియేటా అనువాదకుల విభాగంలో 24 మంది కొత్త అనువాదకులకు స్థానం కల్పిస్తోందన్నారు. అనువాదాల ద్వారా అకాడమీ వివిధ భాషా రచనలను-రచయితలను దేశానికి పరిచయం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఉత్తమ అనువాదాలు చేసిన 24 మందికి ప్రసాద్తివారీ, అశోక్ మిత్రన్, కె.శ్రీనివాసరావు తదితరులు అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలకు తామ్రపత్రం, రూ.50 వేల చొప్పున అందజేశారు. అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు అనువాదకులను, ఇతర ప్రముఖులను సభకు పరిచయం చేశారు. అకాడమీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ వందన సమర్పణ చేశారు. ప్రసంగాల అనంతరం నృత్యాలను ప్రదర్శిం చారు. ఈ కార్యక్రమంలో కె.శివారెడ్డి, ఎం.నరేంద్ర, ఆచార్య ఎన్.గోపి తదితరులు పాల్గొన్నారు.