అన్నానగర్, న్యూస్‌లైన్: సహారా ఇండియా కంపెనీలు మూడుకోట్లపైచిలుకు మదుపరులు దాచుకున్న 5120 సొమ్మును సెబీ అక్రమంగా వాడుకోవడానికి కొత్త ఎత్తుగడలు పన్నిందని ఆ కంపెనీ న్యాయ సలహాదారు కేశవమోహన్ ఆరోపించారు. ఎత్తుగడల్లో భాగంగా సహారాలో పెట్టుబడులు పెట్టినవారంతా బినామీ పేర్లతో ఉన్నట్లుగా తాము కనుగొన్నామని సెబీ శుక్రవారం నాడు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కోర్టు ఈ నేపథ్యంలో సహారాలో పెట్టుబడులు పెట్టిన మదుపరుల వివరాల డాక్యుమెంట్లను గతంలోనే కోరివుందని, ఇందులో భాగంగా సహారా తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన 3.03 కోట్ల మంది ఇన్వెస్టర్ల తాలూకు వివరాలను డిజిటల్ రూపంలో కోర్టుకు 60 అందించిందన్నారు. వీటిని పరిశీలించిన కోర్టు సంతృప్తిని వ్యక్తం చేయగా సెబీ మాత్రం డిజిటల్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన వ్యక్తుల వివరాలను కనిపెట్టేందుకే సహారా 60 కోట్లపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందనడం వింతగా ఉందన్నారు.
సహారా వ్యాఖ్యలకు స్పందించిన సెబీ తాము మార్చి 2014న సహారా సమర్పించిన పత్రాల్లోని 20 వేల మంది మదుపరులకు ధ్రువీకరణ కోరుతూ లేఖలు పంపామని అయితే వీటిలో ఒక్కరూ సమాధానం పంపక పోవడంతో ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశోధించగా బినామీ ఇన్వెస్టర్లు ఎక్కువగా కన్పించారని అంటోంది. సెబీ సమాధానం విన్న సహారా, సెబీ పంపిన లేఖలన్నీ తాము ఇది వరకే సొమ్మును సెటిల్ చేసిన మదుపరులకేనని అంటోంది.
15 నెలల వ్యవధిలో సహారా తన మదుపరులకు కోటికిపైగా సెటిల్మెంట్ చేశామంది. సెబీ వద్ద నున్న 5120 కోట్లల్లో 5119 కోట్లు మిగిలివుందని ఈ సొమ్మును బినామీ మదుపరుదారులున్నారంటూస్వాహా చేసేందుకు సెబీ చూస్తోందని కేశవ్‌మోహన్ ధ్వజమెత్తారు.