సాక్షి, చెన్నై: పెళ్లయిన రెండు నెలలకే ఓ నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కృష్ణగిరి జిల్లా బోచంపల్లి సమీపంలోని కున్నికొట్టాయికి చెందిన సత్యమూర్తి (22). పరుపుల తయారీ కంపెనీలో కార్మికుడు. పుదుచ్చేరిలోని పెరియార్‌కు చెందిన కీర్తి (22). తల్లిదండ్రులు లేకపోవడంతో అనాథశ్రమంలో పెరిగింది. వీరిద్దరూ రెండు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఈక్రమంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. గురువారం ఉదయం కూడా వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన సత్యమూర్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి పారూరు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సత్యమూర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోచంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment