
సాక్షి, అన్నానగర్: గుండెపోటుతో నవ వరుడు మృతిచెందిన ఘటన ఈరోడ్‌లో జరిగింది. నసియానూర్ కన్నవేలం పాళయానికి చెందిన ప్రకాష్ (36)కు ఈ నెల 23వ తేదీ వివాహం జరిగింది. శనివారం అత్తగారి ఇంటికి వెళ్లిన ప్రకాష్ మటన్ తిన్నాడు. తన భార్యతో అమ్మగారి ఇంటికి వచ్చాడు. రాత్రి మరోసారి మటన్ తిని పడుకున్నాడు.
ఆదివారం వేకువజామున 2 గంటలకు శరీరమంతా దురద పుడుతోందని చెప్పాడు. కొద్ది సేపటికే గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన పెరుందురై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాంజీకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment