అన్నానగర్: చెన్నై పక్కనే ఉన్న మామల్లపురంలో బుధవారం వివాహేతర ప్రియుడితో లాడ్జికి వెళ్లిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో వివాహేతర ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై చెంగల్పట్టు జిల్లా మధురాంతకం పక్కన చిత్రవాడి గ్రామానికి చెందిన జయరాజ్(28)కు భార్య, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. మేళవలంపేటలోని ఓ పురుగు మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. పౌన్‌సూరులో నివాసముంటున్న సంగీత(32)కు 17 ఏళ్ల కుమార్తె, 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కాట్టంకొళత్తూరు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సంగీత సెక్యూరిటీ గార్డుగా పని చేస్తోంది. ఉద్యోగానికి వెళుతున్న సమయంలో సంగీతకు జయరాజుతో అక్రమ సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది.
ఈ వ్యవహారం సంగీత భర్తకు తెలియడంతో ఆమెను ఖండించాడు. ఐదేళ్ల క్రితం భర్తను విడిచిపెట్టిన సంగీత గూడువాంచేరిలోని తన తల్లి ఇంట్లో ఉంటూ జయరాజ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుస్తుంది. బుధవారం సంగీత బైకులో జయరాజుతో కలిసి మామల్లపురం వెళ్లింది. వీరిద్దరూ అక్కడే ఒత్తవాడై వీధిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నారు. అప్పుడు జయరాజ్ సంగీతను ఇంత మందితో సెల్ ఫోన్‌లో ఎందుకు మాట్లాడుతున్నావని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆహారం కొనుక్కోవడానికి జయరాజ్ బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి సంగీత ఉరి వేసుకుని చనిపోయి ఉండడాన్ని చూసి షాక్‌కు గురైన జయరాజ్ ఈ విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలిపాడు.
దీనిపై మామల్లపురం డిప్యూటీ సూపరింటెండెంట్ రవి అభిరామ్, మామల్లపురం పోలీసులు అక్కడికి చేరుకుని సంగీత మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జయరాజ్‌ను పోలీసులు తీవ్ర విచారణ చేస్తున్నారు. ఈ స్థితిలో సంగీతను కొట్టి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. తనతోపాటు వచ్చిన జయరాజ్‌ను పోలీసులు విచారించగా.. పలువురితో సన్నిహితంగా ఉండడంతోనే సంగీతను గొంతు నులిమి హత్య చేశానని తెలిపాడు.
తర్వాత ఏం చేయాలో తెలియక హత్యను కప్పిపుచ్చాలని సంగీత దుపట్టా చించి ఆమె శరీరాన్ని విద్యుత్ ఫ్యాన్‌కి వేలాడదీశానని తెలిపాడు. అప్పుడు సంగీత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని డ్రామా ఆడినట్టు ఒప్పుకున్నాడు. కానీ సంగీత గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ విషయాన్ని అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన జయరాజ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment