ఇద్దరు తెలుగు విద్యార్థులకు గౌరవం | Two of the students in honor of Telugu | Sakshi
Sakshi News home page

ఇద్దరు తెలుగు విద్యార్థులకు గౌరవం

Published Wed, Sep 25 2013 6:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM

Two of the students in honor of Telugu

అన్నానగర్, న్యూస్‌లైన్: మద్రాసు ఇండియన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ లోని ఇద్దరు తెలుగు విద్యార్థులకు, తమిళ విద్యార్థికి గూగుల్ సంస్థ అరుదైన గౌరవాన్నిం చ్చింది. గురుప్రకాష్, ఎన్.సంతోష్ కుమార్ తెలుగు వారు కాగా, కెవిన్ కార్తీక్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఇంటర్న్ ప్రాజెక్టు కింద వీరికి సంవత్సరానికి రూ.92 లక్షల జీతాన్ని గూగుల్ సంస్థ ఆఫర్ చేసింది. ప్రాజెక్టు ముగిసిన అనంతరం వీరికి తమ సంస్థలో మరింత అధిక జీతంలో ఉన్నత స్థానం కల్పిస్తామని పేర్కొంది. 
 
 ఐటిలో కంప్యూటర్ విద్యను అభ్యశిస్తున్న వీరి ప్రతిభ ను గుర్తించి గూగుల్‌వీరికి ఇంత పెద్ద మొత్తంలో జీతాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. సోమవారం గూగుల్ నుంచి తమకు అపాయింట్‌మెంట్ లేఖలు అందాయని వారు తెలిపారు. మూడు నెలల పాటు తాము బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు. 
 
 వీరిలో గురుప్రకాష్ కోవైలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు కాగా, సంతోష్‌కుమార్ స్థానిక అడయారులో ఉంటున్నారు. కార్తీక్ స్థానిక గోపాలపురం డీఏవీ స్కూలు విద్యార్థి. ప్రోగ్రామింగ్‌లో ఈ ముగ్గు రు విద్యార్థులు చూపిన ప్రతిభను గుర్తించి గూగుల్ సంస్థ వీరిని ఆహ్వానించింది. గూగుల్ సంస్థ తమకు ఇచ్చిన 10 వారాల ప్రాజెక్టును ఆరువారాల్లోనే పూర్తి చేస్తామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement