వృద్ధుడి అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే  | MLA Govindaraju Made Last Rites Of Old Man From Anna Nagar In Tamilnadu | Sakshi
Sakshi News home page

వృద్ధుడి అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే 

Published Sat, May 2 2020 7:05 AM | Last Updated on Sat, May 2 2020 7:26 AM

MLA Govindaraju Made Last Rites Of Old Man From Anna Nagar In Tamilnadu - Sakshi

అన్నానగర్ ‌: అనాధ వృద్ధుడికి అంత్యక్రియలకు సాయం చేసిన ఎమ్మెల్యేపై సోషల్‌మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాగై జిల్లా వేలాంకన్ని ప్రాంతానికి చెందిన వ్యక్తి  మురుగన్‌ (78), భార్య అంజమ్మల్‌ (68) బిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. మూడేళ్ల క్రితం తంజావూరు జిల్లా పేరావూరానికి వచ్చారు. అప్పటి నుంచి వారు నీలకంఠపు పిల్లయార్‌ ఆలయం ముందు బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఆలయం మూతపడింది. దీంతో మురుగన్‌ దంపతులకు సామాజిక సేవకులు ఆహారం అందజేస్తూ వచ్చారు. ఈ స్థితిలో గురువారం మరుగుదొడ్డికి వెళ్లిన మురుగన్‌ స్ఫహ తప్పి పడిపోయాడు. ఎంత సేపటికి రాకపోవడతో అంజమ్మాల్‌ అక్కడికి వెళ్లగా మురుగన్‌ విగతజీవిగా పడి ఉండడం చూసి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పేరావూరని ఎమ్మెల్యే గోవిందరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మురుగన్‌ బౌతికకాయనికి పూలమాల వేసి అంజలి ఘటించారు. మృతుడి భార్యకు ఆర్థిక సాయం అందించారు. అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేకు అభినందనలు వెల్లువెత్తాయి. అంత్యక్రియలు జరిపించిన వారిలో పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అరుణ్‌ కుమార్, గ్రామనిర్వాహక అధికారి శక్తివేల్‌ ఉన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement