govindaraju
-
సెలవులో తహశీల్దార్.. ఆఫీసులో నిద్రపోయిన సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు
లావేరు: లావేరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు బుధవారం విధి నిర్వహణలో నిద్రపోవడం విమర్శలకు తావిచ్చింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయానికి పనుల కోసం వచ్చారు. ఆ సమయంలో సీనియర్ అసిస్టెంట్ గోవిందరాజు కార్యాలయంలో, జూనియర్ అసిస్టెంట్ రాజేష్ కార్యాలయం బయట కుర్చీల్లో నిద్రపోతున్నారు. అటెండర్ బాబూరావు షర్టు విప్పి అర్ధనగ్నంగా కనిపించారు. సెల్‌ఫోన్ ద్వారా వీరి ఫొటోలు తీసినా లేవలేదు. మద్యం మత్తులో ఉండటం వల్లే లేవలేదని విలేకర్లకు సమాచారం అందించారు. ఈ విషయమై సీనియర్ అసిస్టెంట్ గోవిందరాజులు వివరణ కోరగా ఎండ తీవ్రత, అనారోగ్య సమస్య వల్ల విశ్రాంతి తీసుకున్నానని, మద్యం సేవించలేదని చెప్పారు. జూనియర్ అసిస్టెంట్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో రాలేదు. పరిశీలిస్తా.. ఈ విషయమై లావేరు తహశీల్దార్ దిలీప్ చక్రవర్తి వద్ద ప్రస్తావించగా.. తాను సెలవులో ఉన్నట్లు చెప్పారు. డిప్యూటీ తహసీల్దార్ వేరే పనుల కోసం బయటకు వెళ్లారని తెలిపారు. సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు విధుల సమయంలో కార్యాలయంలోనే నిద్రపోయారన్న విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
వృద్ధుడి అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే
అన్నానగర్ : అనాధ వృద్ధుడికి అంత్యక్రియలకు సాయం చేసిన ఎమ్మెల్యేపై సోషల్‌మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాగై జిల్లా వేలాంకన్ని ప్రాంతానికి చెందిన వ్యక్తి మురుగన్ (78), భార్య అంజమ్మల్ (68) బిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. మూడేళ్ల క్రితం తంజావూరు జిల్లా పేరావూరానికి వచ్చారు. అప్పటి నుంచి వారు నీలకంఠపు పిల్లయార్ ఆలయం ముందు బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఆలయం మూతపడింది. దీంతో మురుగన్ దంపతులకు సామాజిక సేవకులు ఆహారం అందజేస్తూ వచ్చారు. ఈ స్థితిలో గురువారం మరుగుదొడ్డికి వెళ్లిన మురుగన్ స్ఫహ తప్పి పడిపోయాడు. ఎంత సేపటికి రాకపోవడతో అంజమ్మాల్ అక్కడికి వెళ్లగా మురుగన్ విగతజీవిగా పడి ఉండడం చూసి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పేరావూరని ఎమ్మెల్యే గోవిందరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మురుగన్ బౌతికకాయనికి పూలమాల వేసి అంజలి ఘటించారు. మృతుడి భార్యకు ఆర్థిక సాయం అందించారు. అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేకు అభినందనలు వెల్లువెత్తాయి. అంత్యక్రియలు జరిపించిన వారిలో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్, గ్రామనిర్వాహక అధికారి శక్తివేల్ ఉన్నారు. -
తిరుమలఘాట్‌లో ప్రమాదం
♦ దంపతులు దుర్మరణం ♦ మృతులు తమిళనాడులోని తిరువళ్లూరువాసులు తిరుమల: తిరుమల నుంచి తిరుపతి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు దంపతులు దుర్మరణం చెందారు. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన గోవిందరాజు (47), ఆయన సతీమణి లక్ష్మి(42) ద్విచక్రవాహనంలో తిరుమల వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని మంగళవారం అదే వాహనంలో తిరుగుప్రయాణం అయ్యారు. ఉదయం 11.25 గంటలకు మార్గంలోని 35వ మలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో గోవిందరాజు, లక్ష్మి కింద పడి గాయపడ్డారు. దీంతోపాటు వారిపై బస్సు వేగంగా ఎక్కింది. దీంతో లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా గోవిందరాజు మృతి చెందారు. మృత దేహాలను మెడికల్ కళాశాలకు తరలించారు. ఘటన స్థలిని తిరుమల ఏఎస్పీ త్రిమూర్తులు, ఎస్ఐ తులసీరామ్ సందర్శించి కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్సులు కూడా ప్రై వేట్ వాహనాల తరహాలోనే వేగంగా వెళ్లటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.