
అన్నానగర్: ‘టిక్‌టాక్’ యాప్ వినియోగం విషయంలో భార్యని కత్తితో పొడిచి హత్య చేసిన భర్తని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన శుక్రవారం కోవైలో చోటుచేసుకుంది. కోవై సమీపం అరివొలినగర్‌కు చెంది న కనకరాజ్ (35) భవన నిర్మాణ కార్మికుడు. ఇతని భార్య నందిని (28).కోవై సమీపంలో ని ఓ ప్రైవేటు ఇంజినీరింగు కళాశాలలో పని చేస్తుంది. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుటుంబ తగాదాల కారణంగా కనకరాజ్, నందిని రెండేళ్లుగా విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో నందిని కొన్నినెలలుగా టిక్‌టాక్ బానిసైంది. అధిక సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తుంది.
గురువారం కనకరాజ్ నందినికి ఫోన్ చేసి టిక్‌టాక్ యాప్‌లో వీడియోలను అప్‌లోడ్ చెయ్యవద్దని, తనతో కాపురం చేయాలని కోరాడు. ఈ విషయంపై అతను నందినికి కాల్ చేశాడు. ఈ సమయంలో ఫోన్ బిజీ రావడంతో శుక్రవారం మధ్యాహ్నం కనకరాజ్ మద్యం సేవించి, నందిని పని చేస్తున్న కళాశాలకి వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో తన వెంట తెచ్చుకున్నకత్తిని తీసి నందినిని పొడిచాడు. ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి కనకరాజ్‌ని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment